Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

అనంతపురంలో దిష్టిబొమ్మ దగ్ధం

$
0
0

వరంగల్, జూలై 26: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడో.. అప్పుడో తెలంగాణ వస్తుందనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఏర్పడుతున్న పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయడం తెలంగాణలో పార్టీ పరిస్థితి దిగజారేందుకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై, తెలంగాణ అంశంపై పార్టీ అధినేత్రి వైఎస్.విజయమ్మ రెండు రోజుల్లో వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ తొలి ప్లీనరీ సమావేశంలో, పరకాల ఉపఎన్నిక సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని విజయమ్మ ప్రకటించారని గుర్తుచేశారు. వైఎస్ కుటుంబం కోసం తన మంత్రి పదవిని, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని, వైఎస్సార్‌సిపిలో ఉన్నందుకు తన భర్త ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నామని చెప్పారు. ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాన్ని, బహిరంగ సభల్లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు చేసిన ప్రకటనలను సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు. సీమాంధ్ర వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు వ్యక్తిగతమని ప్రకటిస్తే వేరే విషయమని, కానీ రాజీనామాల విషయంలో అధిష్ఠానం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తెలంగాణలోని వైఎస్సార్‌సిపి శ్రేణుల్లో, ప్రజల్లో అయోమయం, అనుమానం నెలకొందని చెప్పారు. రాజీనామాలు చేసిన వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేలు తమ ప్రాంత ప్రజల మనోభావాలను గమనించడం లేదని అంటున్నారని, కానీ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను మరిచారా? అని ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల కోసం తాము దేనికైనా సిద్ధపడక తప్పదని అన్నారు. వైఎస్సార్‌సిపి సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలతో పార్టీ సీమాంధ్రకు అనుకూలమనే సంకేతాలు ప్రజల్లో వెళ్లాయని, దీనివల్ల పార్టీ సంక్షోభంలో పడే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. సీమాంధ్ర వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేల రాజీనామాలపై అధిష్ఠానం నుంచి స్పందన రాకుంటే భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటామని సమా ధానం ఇచ్చారు.

ప్రశ్నార్థకంగా మారిన
ఖరీఫ్ సాగు

సాగర్ నుంచి చుక్కనీరు లేదు

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 26: వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కల్గిన కృష్ణాడెల్టాలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ వరిసాగు జరుగుతుండటం ఆనవాయితీగా వస్తుంటే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కే సాగునీరందని దుస్థితి నెలకొంది. తెలుగుదేశం తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి కొరత వలన వరసగా నాలుగేళ్లపాటు, డెల్టా ఆధునికీకరణ పేరిట గత మూడేళ్లుగా రబీలో వరిసాగు లేకుండా పోయింది. తెలంగాణవాదుల హెచ్చరికలు, అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాల కారణంగా గత ఖరీఫ్‌లో వరుణుడి సహకారంతో ఏదో రీతిలో వరిసాగు గట్టెక్కింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 864 అడుగులు కాగా 834 అడుగులు మించాలని, సాగర్ జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా 510.5 అడుగులకు మించాలని అప్పుడే దిగువకు నీటిని వదలాలంటూ తీర్పులు వెలువడటంతో ప్రకాశం బ్యారేజీకి నీటి విడుదల గగనమైంది. గత ఖరీఫ్‌లో కృష్ణా డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు 72.51 టిఎంసిల నీటి వినియోగం జరిగితే ఆ 90 రోజుల సీజన్‌లో నాగార్జునసాగర్ జలాశయం నుంచి కేవలం వారం పదిరోజులపాటు అదీ కేవలం 29.14 టిఎంసిల నీరు విడుదలైంది. ఆ సీజన్‌లో వర్షాల వల్ల రికార్డుస్థాయిలో 90 టిఎంసిలకు పైనే వరదనీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకోగా పలు దఫాలు గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని వదలాల్సి వచ్చింది. మొత్తంపై పూర్తిస్థాయి విస్తీర్ణంతో వరిసాగు జరిగింది. ఇక ప్రస్తుత సీజన్‌లో ఈ నెల 10న డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసారు. అదీ రైతాంగం ఆందోళన చేసిన మీదట తొలిరోజుల్లో నామమాత్రంగా 200 క్యూసెక్కుల నీటి సరఫరా జరిగింది. క్రమేణా పెంచుతూ వారం రోజుల క్రితం ఏడు వేల 500 క్యూసెక్కుల వరకు నీరు సరఫరా చేసారు. ఇదే సమయంలో విస్తారంగా వర్షాలు కురవడంతో సమృద్ధిగా నారుమళ్లు పూర్తయి క్రమేణా వరినాట్లు ప్రారంభించారు. ఇదే సమయంలో వర్షాలు లేక ప్రకాశం బ్యారేజీకి వరదనీటి ప్రవాహం తగ్గింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నిలువనున్న నీటిని కొద్ది కొద్దిగా కాలువలకు సరఫరా చేయాల్సి వస్తున్నది. ఏడాది పొడవునా ప్రకాశం బ్యారేజి వద్ద కనీస నీటిమట్టం 12 అడుగులు ఉండాల్సి రాగా ఓ దశలో 11.4 అడుగులకు తగ్గిపోయింది. దీంతో కాలువలకు నీటి సరఫరాను తగ్గిస్తూ వచ్చి నీటి మట్టాన్ని క్రమేణా పెంచుతూ వస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 11.8 అడుగులకు చేరగా కాలువలకు 5వేల 163 క్యూసెక్కుల నీటి సరఫరా మాత్రమే జరుగుతున్నది. ప్రస్తుతం పెద్దఎత్తున వరినాట్లు జరుగుతుండగా నీటి అవసరం బాగా కన్పిస్తోంది. ముఖ్యంగా ఆయకట్టు చివరి భూములకు కాలువల నుంచి చుక్కనీరు అందని పరిస్థితి నెలకొంది. మరోవైపు సాగర్ జలాశయం నుంచి ఇప్పట్లో నీరు విడుదలయ్యే సూచనలు కన్పించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు ప్రశ్నార్థకమే.

రాజీనామాలపై మీరేమంటారు? ౄవిజయమ్మను ప్రశ్నించిన కొండా సురేఖ
english title: 
a

ఎంత అమానుషం!

$
0
0

పామూరు, జూలై 26: విధి నిర్వహణలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో తెలిపేదే ఈ ఘటన. కడప జిల్లాలో గురువారం జరిగిన రోడ్ ప్రమాదంలో మృతదేహాలను వారి స్వగ్రామమైన భద్రాచలం తరలించకుండా పామూరులో రోడ్డు పక్కన పడేసి చేతులు దులుపుకున్నారు. పామూరుకు చెందిన వేముల సురేష్ కూలీ పనుల నిమిత్తం భద్రాచలానికి చెందిన కూలీలను ఒక ఏజెన్సీ ద్వారా మాట్లాడుకుని మినీలారీలో బెంగళూరుకు తీసుకువెళ్తుండగా లారీ కడప జిల్లా గవ్వలచెరువు సమీపంలో బోల్తాపడి ఆరుగురు మృతి చెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి ఏజెంట్‌కు అప్పగించారు. ఆ ఏజెంట్ ఆ మృతదేహాలను వారి స్వగ్రామమైన భద్రాచలం తరలించకుండా వాహనంలో పామూరుకు తీసుకొచ్చి కనిగిరి రోడ్డులో శ్మశానం పక్కన పడేసి చేతులు దులుపుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన స్థానికులు ఏజెంట్‌ను నిలదీసినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు మృతదేహాలు రోడ్డుపక్కనే పడి ఉన్నాయ. ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో వేరొక వాహనంలో మృతదేహాలను భద్రాచలం పంపడానికి ఏర్పాట్లు చేశారు.
కొనసాగుతున్న ద్రోణి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 26: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జార్ఖండ్ వైపు వెళ్లిపోయింది. అయితే, ఒడిశా నుంచి కోస్తా ఆంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ వ్యాపించిన అల్పపీడన ద్రోణి యథావిధిగా కొనసాగుతోంది. దీని ప్రభావం వలన రాష్ట్రంలో అక్కడక్కడ చెదురు మదురు వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం శుక్రవారం రాత్రి వెల్లడించింది. పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయ.

- మృతదేహాలను రోడ్డుపై పడేసిన వైనం -
english title: 
y

జూరాలకు జలకళ

$
0
0

గద్వాల, జూలై 26: గత వారం రోజులుగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదనీటి ఉధృతి శుక్రవారం మరింత పెరిగింది. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి 2లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని విడుదల చేస్తుండడంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. వరద నీటి చేరికతో జూరాల ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. శుక్రవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 317.70 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 2,21,680 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై దిగువ ప్రాంతానికి ప్రాజెక్టు 26 గేట్లను రెండు మీటర్ల ఎత్తుకు, నాలుగు గేట్లను ఒక మీటర్ ఎత్తుకు మొత్తం 30 గేట్లు తెరచి శ్రీశైలం జలాశయం వైపు 2,72,276 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ ఇన్‌చార్జి అధికారి కృష్ణయ్య తెలిపారు. అదే విధంగా ఆల్మట్టి జలాశయంలో 517.15 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంచుకొని, ఎగువ ప్రాంతం నుంచి 1,94,816 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 26 గేట్లను తెరచి దిగువకు 2,48,961 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలో 490.048 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 2,40,960 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 24 గేట్లను తెరచి దిగువకు 2,27,025 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని జూరాల జలవిద్యుత్ కేంద్రం ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. శుక్రవారం జూరాల ప్రాజెక్టు నుంచి 36వేల క్యూసెక్కుల వరద నీటిని వినియోగించుకొని ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరిపినట్లు అధికారులు తెలిపారు. సుమారు 185 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిపినట్లు వారు తెలిపారు.
.............
జూరాల 30 గేట్ల ద్వారా విడుదలవుతున్న వరద

30గేట్లు ఎత్తివేత * కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
english title: 
j

చారిత్రక కొండ.. క్రైస్తవ కబ్జా!

$
0
0

ఆదోని, జూలై 26: ప్రభుత్వం అనుమతి లేకుండా ఏకంగా కొండనే ఆక్రమించుకుని ఓ వర్గం వారు ప్రార్థనా మందిరం నిర్మించారు. అంతటితో ఊరుకోకుండా కొం డపై షెడ్లు వేసి దానికి కల్వరికొండగా నామకరణం చేసిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వివాదానికి కారణమవుతోంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆదోని శివారులో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోతిగట్టు కొండను ఆక్రమించుకుని ప్రార్థనామందిరం నిర్మించడంతో పాటు అక్కడక్కడ శిలువలు పాతడంపై హిందు ధర్మరక్షణ సమితి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోతిగట్టు కొండపై పురాతనమైన బుద్ద విగ్రహాలు, శిలాశాసనాలు, అతిపురాతనమైన ఆదిమానవుల గుహలు ఉన్నాయి. క్రైస్తవులు కల్వరికొండగా, మిగిలిన ప్రజలంతా కోతిగట్టుగా పిలుచుకునే ఈ కొండ అక్రమణ వ్యహారం 2011 నుంచి వివాదాస్పందగా మారింది. 2011లో కల్వరికొండపై క్రైస్తవులు ప్రార్థనల కోసం ఏర్పాటుచేసిన శిలువను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో కోతిగట్టు కొండ అక్రమణ వ్యహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రెవెన్యూ, పోలీసు అధికారులు రంగంలో దిగారు. ఈ సంఘటన హిందు ధర్మరక్షణ సమితి సభ్యుల పనే అంటే కొంతమంది క్రైస్తవులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం సద్దుమణిగింది. అయితే తాజాగా గురువారం భజరంగ్‌దళ్ కార్యకర్తలు విజయకృష్ణ, నాగరాజుగౌడ్, రామాంజి, రవి, సాయి, అరుణ్, అంజి, విజయకృష్ణ తదితరులు కొతిగట్టుపై ఉన్న బుద్ద విగ్రహానికి పూజలు చేయడానికి వెళ్లగా అక్కడే ఉన్న క్రైస్తవులు అడ్డుకున్నారు. దీంతో భజరంగ్‌దళ్ కార్యకర్తలు కొండ అక్రమణ వ్యవహారాన్ని స్థానిక అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. క్రైస్తవులు కొండను అక్రమించుకోవడమే గాకుండా అక్కడ ఉన్న బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, హిందూమతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని, హిందు దేవుళ్లను దూషిస్తున్నారని ఆరోపించారు. కొండను అక్రమించుకుని ప్రార్థనా మందిరం నిర్మించి అక్కడక్కడ శిలువలు ఏర్పాటుచేశారని ఫిర్యాదు చేశారు. స్థానికులు ఈ కొండను కోతిగట్టుగా చాలాకాలం నుంచి పిలుస్తున్నారు. అయితే 2011లో క్రైస్తవులు కొండపై ప్రార్థనా మందిరిం పేర రేకుల షెడ్డు నిర్మించారు. మతపరమైన అంశం కావడంతో అప్పట్లో రెవెన్యూ, పోలీసు అధికారులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఈకొండకు కల్వరికొండ అన్న బోర్డు కూడా ఏర్పాటుచేశారు. స్తంభాలు ఏర్పాటుచేసి కొండపైకి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కొండ చుట్టూ శిలువ గుర్తులు ఏర్పాటుచేశారు. దీనిపై కల్వరికొండ చర్చి పాస్టర్ ఆనంద్‌రాజు మాట్లాడుతూ తాము చాలాకాలం నుంచి కొండపై ప్రార్థనలు చేస్తున్నామన్నారు. అయితే ఎవరి అనుమతి తీసుకోలేదన్నారు. ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశామన్నారు. అయితే అందుకు ఆయన నిరాకరించారన్నారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి స్థానిక అధికారులు సహకరించకపోవడంతో డిప్యూటీ సీఎం రాజనరసింహను కలిశామన్నారు. ఆయన సహకారంతో విద్యుత్ స్తంభాలు నాటించి కనెక్షన్ తీసుకున్నామన్నారు. ఇదిలా ఉండగా క్రైస్తవులు కొండను ఆక్రమించుకోవడమే గాక కొండ కిందఉన్న తమను బెదిరించి పొలం అక్రమించుకోవాలని చూస్తున్నారని పొలం యజమాని శ్రీనివాసులు ఆరోపించారు. చర్చికి చెందిన కొందరు వ్యక్తులు తమను బెదిరిస్తున్నారని శ్రీనివాసులు పేర్కొన్నారు.
హిందూ ధర్మ రక్షణ సమితి ఉద్యమం
ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ఉన్న కోతిగట్టును క్రైస్తవులు అనుమతి లేకుండా అక్రమించుకున్నారని, చర్చి నిర్మించి ప్రార్థనలు చేస్తున్నారని హిందు ధర్మరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు ఆరోపించారు. 150 ఎకరాల విస్తీర్ణంలోని కొండను అక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారన్నారు. అంతేగాక కొండచుట్టూ శిలువలు పాతారన్నారు. కోతిగట్టుపై పురాతన బుద్ద విగ్రహాలు నేటికీ ఉన్నాయన్నారు. కొండపై ఉన్న అక్రమణలను తొలగించి పురాతన చరిత్రను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. 2011లోనే అధికారుల దృష్ఠికి ఈ వివాదం వచ్చినా పరిష్కరించలేదన్నారు. అక్రమణలను తొలగించకపోతే భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామన్నారు.

క్రీస్తు కల్వరి కొండ పేర ఏర్పాటుచేసిన బోర్డు. కోతిగట్టు కొండపై ఉన్న బుద్ధుడి విగ్రహాలు

వివాదాస్పదంగా మారిన ఆక్రమణ * హిందూ ధర్మరక్షణ సమితి ఆందోళన బాట
english title: 
c

విభజిస్తే దింపేస్తాం!

$
0
0

ఏలూరు, జూలై 26: కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రాన్ని విభజించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయని, దీన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా సమైక్యంగా ముందుకు రావాలని జిల్లా ఎన్‌జిఓల సంఘం అధ్యక్షులు ఎల్ విద్యాసాగర్ డిమాండ్ చేశారు. అలాకాకుండా నిశ్శబ్దంగా ఊరుకుంటే చూస్తు ఊరుకునేది లేదని వారిని పదవుల నుంచి దింపే సత్తా తమకు ఉందని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి ఆదర్శంగా నిలిచారని, అదే బాటలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా నడవాలని కోరారు. లేని పక్షంలో ఈనెల 29న సీమాంధ్ర ఎంపిల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తొందరపాటే అవుతుందన్నారు.ఉద్యోగులందరూ సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారన్నారు.
నేడు భీమవరం బంద్
భీమవరం:రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అఖిల పక్ష నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన అంశంపై దేశ రాజధానిలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా శనివారం భీమవరం బంద్ నిర్వహించనున్నారు. ఈసందర్భంగా భీమవరం పట్టణ ప్రముఖులు శుక్రవారం పట్టణంలో జెఎసిగా ఏర్పడి సమావేశమయ్యారు.

ఎపి ఎన్‌జిఓల హెచ్చరిక
english title: 
v

చికెన్, ఉల్లిపొరక కూర

$
0
0

కావలసినవి
బోన్‌లెస్ చికెన్ - 100 గ్రా.
ఉల్లిపొరక తరుగు
- 2 కప్పులు
ఉల్లిపాయ - 1
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
ధనియాల పొడి - 1 టీ.స్పూ.
గరం మసాలా పొడి
- 1/4 టీ.స్పూ.
అల్లం-వెల్లుల్లి ముద్ద
- 1 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.

ఇలా వండాలి
ముందుగా ఒక గినె్నలో నాలుగు కప్పుల నీళ్లుపోసి చికెన్ ముక్కలు ఉడికించాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించి పసుపు, అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి ఉడికించిన చికెన్ ముక్కలు వేసి కలపాలి. ఇందులో కారం పొడి ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. ముందే ఉడకబెట్టాం కాబట్టి తొందరగానే వేగిపోతుంది. ఇందులో కడిగి సన్నగా తరిగిన ఉల్లిపొరక వేసి కలిపి మూత పెట్టాలి. ఉల్లిపొరక ఆకు ఉడికి నీరంతా ఇగిరిపోయాక గరం మసాలా పొడి చల్లి దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలకు బావుంటుంది.

ముందుగా ఒక గినె్నలో నాలుగు కప్పుల నీళ్లుపోసి చికెన్
english title: 
chicken

దహీ పాప్‌డీ

$
0
0

కావలసినవి
మైదా - 1 కప్పు
డాల్డా లేదా వెన్న - 1/4 కప్పు
ఉప్పు - చిటికెడు
నూనె - వేయించడానికి
పెరుగు - 3 కప్పులు
పంచదార - 3 టీ.స్పూ.
స్వీట్ చట్నీ - 5 టీ.స్పూ.
జీలకర్ర పొడి - 2 టీ.స్పూ.
సన్న సేవ్ - 5 టీ.స్పూ.
కొత్తిమీర - 3 టీ.స్పూ.

ఇలా చేద్దాం
పెరుగులో పంచదార, తగినన్ని నీళ్లు కలిపి మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా చిలికి ఫ్రిజ్‌లో పెట్టాలి. మైదాలో చిటికెడు ఉప్పు కలిపి రెండుసార్లు జల్లించి డాల్డా లేదా వెన్న కరిగించి కలపాలి. ముందుగా వెన్నని పిండిలో కలిపి తర్వాత తగినన్ని నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా తడిపి మూత పెట్టి ఉంచాలి. అరగంట తర్వాత ఆ పిండిని బాగా పిసికి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలను చిన్న పూరీల్లా వత్తుకుని రెండుసార్లు మడత పెట్టి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా కాకున్నా చిన్నగా కాస్త మందంగా బిస్కెట్ సైజులో పూరీల్లా వత్తుకుని కాల్చుకోవచ్చు. సర్వ్ చేసేముందు ఒక బౌల్‌లో ఈ పూరీలను చిదిమి పెట్టి దానిపైన చిలికిన పెరుగు వేసి దానిమీద ఖర్జూరం, బెల్లం, చింతపండు పులుసు, జీలకర్ర పొడి వేసి ఉడికించి తయారుచేసుకున్న స్వీట్ చట్నీ వేయాలి. దానిమీద జీలకర్ర పొడి, సన్న సేవ్, కొత్తిమీర వేసి వెంటనే సర్వ్ చేయాలి.

పెరుగులో పంచదార, తగినన్ని నీళ్లు కలిపి
english title: 
dahi

గుమ్మడికాయ కుర్మా

$
0
0

కావలసినవి
గుమ్మడికాయ ముక్కలు
- 250 గ్రా.
ఉల్లిపాయ - 1
టమాటా - 2
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 2 రెమ్మలు
ధనియాల పొడి - 2 టీ.స్పూ.
గరం మసాలా పొడి
- 1/4 టీ.స్పూ.
కొబ్బరిపొడి - 3 టీ.స్పూ.
జీడిపప్పు - 8
పెరుగు - 1/4 కప్పు
అల్లం-వెల్లుల్లి ముద్ద
- 1/2 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.

తయారుచేసేదిలా

గుమ్మడికాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను దోరగా వేయించాలి. ఇం దులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి రెండు నిమిషాలు వేపాక, గుమ్మడికాయ ముక్కలు, కారం పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు కాస్త వేగి, మగ్గిన తర్వాత ధనియాల పొడి, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. కొబ్బరి పొడి, జీడిపప్పు, టమాటా ముక్కలు, పెరుగు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత ఈ మసాలా, గరం మసాలా పొడి వేసి కలిపి ఉడికించాలి. ముక్కలు ఉడికి, చిక్కబడి నూనె తేలుతున్నపుడు కొత్తిమీర చల్లి దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలు, పరాఠాలకు బావుంటుంది.

గుమ్మడికాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా
english title: 
gummadi

టమాటా, ఉల్లిపచ్చడి

$
0
0

కావలసినవి
పచ్చి టమాటాలు - 3
ఉల్లిపాయ - 2
జీలకర్ర - 1 టీ.స్పూ.
పచ్చిమిర్చి - 4
నువ్వులు - 3 టీ.స్పూ.
ధనియాలు - 2 టీ.స్పూ.
చింతపండు
- చిన్న నిమ్మకాయంత
వెల్లుల్లి - 4 రెబ్బలు
ఉప్పు - తగినంత
ఆవాలు, జీలకర్ర - 1/3 టీ.స్పూ.
మినప్పప్పు - 1 టీ.స్పూ.
కరివేపాకు - 2 రెబ్బలు
నూనె - 4 టీ.స్పూ.

ఇలావండాలి
ఈ పచ్చడికి పండినవి కాకుండా పచ్చి టమాటాలనే తీసుకోవాలి. పాన్ వేడి చేసి జీలకర్ర, నువ్వులు, ధనియాలు దోరగా వేయించాలి. అదే పాన్‌లో రెండు చెంచాల నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మగ్గనిచ్చి చల్లారనివ్వాలి. వేయించుకున్న జీలకర్ర, నువ్వులు మొదలైనవి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇందులో వేయించిన టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, తగినంత ఉప్పు వేసి బరకగా రుబ్బుకోవాలి. మరో చిన్న పాన్ లేదా గినె్నలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక మినప్పప్పు వేసి రంగు మారుతున్నపుడు దింపి రుబ్బుకున్న పచ్చడిలో కలపాలి.

ఈ పచ్చడికి పండినవి కాకుండా పచ్చి టమాటాలనే
english title: 
pachadi
author: 
- జ్యోతి వలబోజు

రుచి

$
0
0

నవతరం పాఠకుల్లో మారుతున్న అభిరుచులకు అనుగుణంగా, ప్రతి ఆదివారం ఒక పూర్తి పేజీ విభిన్నమైన వంటలకు కేటాయంచాలన్న సూచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న పేజీ ‘రుచి’. ఇది మీ పేజీ. మహిళలైనా..నలభీములైనా ఎవరైనా కావొచ్చు.. కొత్త తరహా వంటలను రూపొందించి పంపితే ఈ పేజీ స్వాగతిస్తుంది. ఎటొచ్చీ వంటకం ఫొటో కూడా జతపర్చడం మర్చిపోవద్దు.
మా చిరునామా
రుచి పేజీ, ఆంధ్రభూమి దినపత్రిక , 36, సరోజిని దేవీరోడ్,
సికిందరాబాద్ - 500 003.

నవతరం పాఠకుల్లో మారుతున్న అభిరుచులకు
english title: 
ruchi

‘సూపర్ ఫినిషర్’ ధోనీ

$
0
0

సంక్లిష్టమైన సమయాల్లో జట్టుకు అండగా నిలిచి, మ్యాచ్‌ల్లో విజయాలను అందించిన ఆటగాళ్ల జాబితాలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అత్యుత్తమ ‘మ్యాచ్ ఫినిషర్’ ఎవరన్న ప్రశ్నకు వెస్టిండీస్‌లో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్‌లో సమాధానం లభించింది. శ్రీలంకను ఢీకొన్న భారత్‌కు చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమయ్యాయి. షామిండా ఎరాంగ వేసిన ఆ ఓవర్ మొదటి నాలుగు బంతుల్లోనే 16 పరుగులు సాధించిన ధోనీ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని సాధించిపెట్టాడు. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టును లక్ష్యానికి చేర్చాడు. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మైఖేల్ బెవాన్ కూడా గొప్ప ‘మ్యాచ్ ఫినిషర్’ గుర్తింపు పొందాడు. అయితే, జట్టును గెలిపించే క్రమంలో అతను సగటున 66.42 పరుగులు చేశాడు. ధోనీ విషయానికి వస్తే ఈ సగటు 89.63 పరుగులు. సూపర్ ధోనీకి తిరుగులేదని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఓటమి అంచున నిలిచిన జట్టును తిరుగులేని ఆటతో ఎలా గెలిపించాలి? ఇన్నింగ్స్‌కు ఎలాంటి ముగింపు ఇవ్వాలి? అన్న ప్రశ్నలకు ధోనీ ఆటే చక్కటి సమాధానం.

సంక్లిష్టమైన సమయాల్లో జట్టుకు అండగా నిలిచి
english title: 
dhoni

స్ప్రింగ్ మనిషి..

$
0
0

స్ప్రింగ్ మనిషి..
అత్యుత్తమ అథ్లెట్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆరోన్ ఇవాన్స్‌కు ఓ అద్భుతమైన నైపుణ్యం ఉంది. మిగతా అథ్లెట్స్ కంటే అతను ఎక్కువ ఎత్తు గాల్లోకి ఎగరగలడు. ఈ లక్షణమే అతనికి స్ప్రింగ్ మనిషిగా పేరుతెచ్చింది. ఐదేళ్ల వయసులోనే తాను అవలీలగా గాల్లో జంప్ చేయగలనని తెలుసుకున్న ఇవాన్స్ అప్పటి నుంచి సాధన ప్రారంభించాడు. బ్రూస్ లీ సినిమాలు తెగ చూసి, మార్షల్ ఆర్ట్స్‌లో మాదిరి పరిగెత్తడం, పల్టీలు కొట్టడం, గాల్లోకి ఎగరడం ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు వేగంగా వెళుతున్న కార్ల పైనుంచి దూకుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. వరుసగా మూడు కార్ల పైనుంచి దూకి గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించాడు. మిల్వాకీ ప్రాంతానికి చెందిన ఈ చిచ్చర పిడుగు మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడానికి ఏక దీక్షతో, విశేషంగా శ్రమిస్తున్నాడు.

ఆలౌట్ 13..
ఇంగ్లీష్ కౌంటీల్లో అత్యల్ప స్కోరు కేవలం 13 పరుగులు. 1877-78 సీజన్‌లో సెంటర్‌బరీని ఢీకొన్న ఆక్లాండ్ అతి తక్కువ స్కోరుకే కుప్పకూలింది. 13 పరుగుల్లో ఎనిమిది ఎక్‌స్ట్రాల రూపంలో లభించాయి. ఒక బ్యాట్స్‌మన్ అత్యధికంగా రెండు పరుగులు చేశాడు. ఆక్లాండ్ రికార్డును ఇప్పటి వరకూ కౌంటీల్లో ఎవరూ బద్దలు చేయలేకపోయారు. ఈ ఏడాది మే మాసంలో లాంకషైర్‌ను ఢీ కొన్న ఎసెక్స్ జట్టు 20 పరుగులకే ఆలౌటైంది. అందులో జైక్ మిక్లెన్‌బర్గ్ వాటా 10 పరుగులు. 1901లో యార్క్‌షైర్‌ను ఎదుర్కొన్న ఎసెక్స్ 30 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అత్యల్ప స్కోరుగా నమోదైన ఆ రికార్డును అదే జట్టు తుడిచేసింది. 1878లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఎంసిసి 19 పరుగులకే చాపచుట్టేసింది. విల్‌ఫ్రెడ్ ఫ్లవర్స్ అత్యధికంగా 11 పరుగులు చేశాడు. 1922లో యార్క్‌షైర్‌ను ఢీకొన్న ససెక్స్ 20 పరుగులకే ఆలౌట్‌కాగా, అందులో వికెట్‌కీపర్ జార్జి స్ట్రీట్ ఒక్కడే పది పరుగులు సాధించాడు. ఇలాంటి చెత్త రికార్డుల కోసం ఏ జట్టూ ప్రయత్నించదేమో!

టెన్నిస్‌లో క్రికెటర్ ప్రతిభ!
కెన్యా ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆసిఫ్ కరీం 1999 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే, మనసు మార్చుకొని 2003లో మరోసారి రంగంలోకి దిగాడు. ఆ పోటీల్లో కెన్యా సెమీస్ వరకూ చేరింది. అప్పటికి 39 సంవత్సరాల వయసున్న కరీం ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించి, 8.2 ఓవర్లలో కేవలం ఏడు పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో అతను ఆరు మెయిడెన్లు వేయడం విశేషం. ఇవన్నీ పక్కకు ఉంచితే, క్రికెటర్‌గా మైదానంలోకి దిగడానికి ముందు కరీం కెన్యా తరఫున డేవిస్ కప్ టెన్నిస్ పోటీల్లో పాల్గొన్నాడు. 1988లో ఈజిప్టుపై ఆడిన మూడు మ్యాచ్‌లను ఓడినప్పటికీ, క్రికెట్‌లో టెస్టులు, టెన్నిస్‌లో డేవిస్ కప్ మ్యాచ్‌లు ఆడిన అరుదైన ఘనతను సంపాదించుకున్న కోటర్ రామస్వామి (్భరత్/ఇంగ్లాండ్), రాల్ఫ్ లెగాల్ (వెస్టిండీస్) సరసన స్థానం సంపాదించాడు. ఎస్‌ఎం హాదీ 1936లో రామస్వామితో కలిసి ఇంగ్లాండ్ టూర్‌లో డేవిస్ కప్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, అతను టెస్టు మ్యాచ్ ఆడలేకపోయాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి పేరు సంపాదించినప్పటికీ అతనికి టెస్టుల్లో అవకాశం లభించకపోవడంతో, ఈ జాబితాలో స్థానం దక్కలేదు.

అత్యుత్తమ అథ్లెట్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలను
english title: 
pop corn
author: 
- మైత్రేయి

అమ్మకానికి రూనీ!

$
0
0

ఇంగ్లాండ్ స్టార్ స్ట్రయికర్ వేన్ రూనీ ‘అమ్మకం’ ఓ ప్రహసనంగా మారింది. అతనిని కొంటున్నట్టు చెల్సియా ప్రకటనలు గుప్పిస్తుంటే, అలాంటిదేమీ లేదని మాంచెస్టర్ యునైటెడ్ సాకర్ క్లబ్ స్పష్టం చేస్తున్నది. ‘ట్రాన్స్‌ఫర్’ పేరుతో ఫుట్‌బాల్ క్లబ్స్ తమ ఆటగాళ్లను అమ్మడం కొత్తకాదు. కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. రోజురోజుకూ ట్రాన్స్‌ఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు రూనీని 60 మిలియన్ పౌండ్లకు చెల్సియా కొంటున్నట్టు ప్రచారం జరిగింది. అంతేగాక, రూనీకి బదులు జువాన్ మతా లేదా డేవిడ్ లూయిజ్‌ను ఇవ్వడానికి కూడా చెల్సియా సిద్ధపడినట్టు వార్తలు వచ్చాయి. రూనీ అంటే తనకు ఎంతో ఇష్టమని, అతను తమ జట్టులో ఉండాలని కోరుకుంటున్నానని చెల్సియా అధినేత జోన్ వౌరిన్హో పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే, మాంచెస్టర్ యునైటెడ్ ఈ వార్తలను ఖండించింది. ‘రూనీ అమ్మకానికి లేడు’ అంటూ వ్యాఖ్యానించింది. చెల్సియాకు రూనీ బదిలీ కేవలం ఊహాగానమేనంటూ కొట్టిపారేసింది. ఇలావుంటే, మాంచెస్టర్ యునైటెడ్‌కు చీఫ్‌గా వ్యవహరించిన అలెక్స్ ఫెర్గూసన్ తన బాధ్యతల నుంచి వైదొగడంతో రూనీ తీవ్ర మనస్తాపానికి గురైనట్టు సమాచారం. అతను లేని మాంచెస్టర్ యునైటెడ్ జట్టులో తాను కొనసాగలేనని అతను స్పష్టం చేసినట్టు స్కై స్పోర్ట్స్ న్యూస్ టెలివిజన్ పేర్కొంది. రూనీ ‘అమ్మకం’ ఊహాగానాలు చెలరేగడానికి స్కై స్పోర్ట్స్ ప్రసారం చేసిన వార్త కూడా ఒక కారణం. ఈ వార్తలో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి.

ఇంగ్లాండ్ స్టార్ స్ట్రయికర్ వేన్ రూనీ ‘అమ్మకం’ ఓ ప్రహసనంగా మారింది
english title: 
runi

నీరజ్ ‘స్పాట్’ వేట

$
0
0

ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్... నిన్న మొన్నటి వరకూ ఢిల్లీ వరకే పరిమితమైన పేరిది. కానీ, ఇప్పుడు దేశ వ్యాప్తంగా అతని పేరు మారుమోగుతోంది. ఆరో ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాన్ని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులే వెలుగులోకి తెచ్చారు. లోతుగా వెళుతున్న కొద్దీ ఎంతోమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ సిఇవోగా వ్యవహరించిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ కటకటాల వెనక్కి వెళ్లాడు. బ్రిటన్ దేశస్థుడైన రాజ్ కుంద్రాను క్రికెట్ వ్యవహారాల నుంచి బోర్డు సస్పెండ్ చేసింది. గురునాథ్ పేరు తెరపైకి రావడంతో, శ్రీనివాసన్ తన బాధ్యతల నుంచి తప్పుకొని, విచారణ పూర్తయ్యే వరకూ వర్కింగ్ కమిటీ చీఫ్ బాధ్యతలను జగ్మోహన్ దాల్మియాకు అప్పగించాల్సి వచ్చింది. బోర్డు కార్యదర్శి సంజయ్ జగ్దాలే, కోశాధికారి అజయ్ షిర్కే, ఐపిఎల్ చీఫ్ రాజీవ్ శుక్లా రాజీనామాలకు కారణమైన ఈ కేసును పరిశోధిస్తున్న నీరజ్ కుమార్ భారీ కసరత్తే చేస్తున్నాడు. క్రికెట్ గురించి తెలుసుకోవడం మొదలుకొని, క్రికెట్ చరిత్రలో ఫిక్సింగ్ లేదా అలాంటి సంఘటనల వివరాల వరకూ ప్రతి విషయాన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 59 ఏళ్ల నీరజ్‌కు పోలీస్ శాఖలో మూడు దశాబ్దాలకుపైగా పని చేసిన అనుభవం ఉంది. ఎన్నో కేసులను అతను అత్యంత సమర్థంగా పరిష్కరించాడు. ఇప్పుడు స్పాట్ ఫిక్సింగ్ కేసులో ‘అవినీతి కొండ’ను తవ్వుతున్నాడు. కోట్లాది మంది అభిమానుల నమ్మకాన్ని నిలువుపాతర వేసిన ఈ మహమ్మారితో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడు. డబ్బు, పలుకుబడి, అధికార బలం ఉన్న ఎంతోమంది నుంచి వస్తున్న ఒత్తిడులను అధిగమించి, ఆటగాళ్లను ప్రలోభ పెట్టే సంప్రదాయం పునాదులను వెతుకుతున్నాడు. ఈ కేసును చేపట్టక ముందు క్రికెట్ పట్ల అతనికి ఉన్న అవగాహన అంతంత మాత్రమే. కానీ, విచారణ చేపట్టిన తర్వాత అమీతుమీ తేల్చుకునే పనిలో పడ్డాడు. క్రికెట్ చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాడు. 1932లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను, ప్రత్యేకించి సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను భారీ స్కోరు చేయకుండా నిలువరించేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ డగ్లస్ జార్డీన్ అనుసరించిన ‘బాడీలైన్’ వివరాలు తెలుసుకున్నాడు. బ్రాడ్‌మన్ శరీరానికి బలంగా తగిలే విధంగా బంతులు వేయాల్సిందిగా ఫాస్ట్ బౌలర్లు హరొల్డ్ లార్‌వుడ్, బిల్ వోస్‌లను జార్డీన్ ఆదేశించాడు. ఆ సంఘటనను ప్రస్తావిస్తూ, ఆటగాళ్లను నయానాభయాన తమ మాట వినేట్టు చేసుకోవడం ఆ రోజుల నుంచే ఉందని నీరజ్ అంటున్నాడు. ఆటగాళ్ల చెడు ప్రవర్తన అభిమానులను వంచించడమేనని అతని అభిప్రాయం. స్పాట్ ఫిక్సింగ్ దోషులకు కఠిన శిక్ష పడితేగానీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు తెరపడవని స్పష్టం చేస్తున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కొండను తవ్వుతున్న నీరజ్ ఇంకెన్ని సంచలనాలను వెల్లడిస్తాడో, తెరచాటున ఉండి నాటకమాడుతున్న ఎంత మంది బడాబాబుల పేర్లు బయటపెడతాడో చూడాలి.

ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్...
english title: 
spot

‘క్యారీడ్ బ్యాట్’

$
0
0

* ఒక ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన బ్యాట్స్‌మన్ చివరి వరకూ నాటౌట్‌గా నిలిస్తే ‘క్యారీడ్ బ్యాట్’ అంటారు. టెస్టు క్రికెట్‌లో ఈ విధంగా ఇన్నింగ్స్ ముగిసే వరకూ నాటౌట్‌గా కొనసాగిన బ్యాట్స్‌మెన్ చాలా మందే ఉన్నారు. అయితే, మొదటి బంతికే ఓపెనర్ అవుటైతే, ఆ వెంటనే బ్యాటింగ్‌కు వచ్చి చివరి వరకూ నాటౌట్‌గా నిలిచిన వాళ్లు టెస్టు క్రికెట్‌లో లేరు. కానీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఈరికార్డు గ్రాహం హెన్రీ పేరుమీద ఉంది. 1968లో క్రైస్ట్‌చర్చి మైదానంలో ప్లంకెట్ షీల్డ్ టోర్నమెంట్‌లో భాగంగా సెంటెన్‌బరీతో జరిగిన మ్యాచ్‌లో ఒటాంగో ఓపెనర్ డి మోజ్ మొదటి బంతికే అవుటయ్యాడు. దీనితో కెప్టెన్ నియోల్ మెక్‌గ్రెగర్ బరిలోకి దిగాడు. చివరి వరకూ నాటౌట్‌గా నిలిచి 113 పరుగులు సాధించాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో అదే రీతిలో జట్టును ఆదుకోలేకపోయాడు. ఫలితంగా ఒటాంగో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది.
* ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ వార్విక్‌షైర్ సొంత మైదానం ఎడ్జిబాస్టన్. కానీ, టెస్టుల్లో ఇప్పటి వరకూ స్థానిక ఆటగాళ్లలో ఎవరూ ఆ మైదానంలో సెంచరీ సాధించలేకపోయారు. ఇదే మైదానంలో మొత్తం 71 సెంచరీలు నమోదైతే, వాటిలో 43 సెంచరీలు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌వే. కానీ వార్విక్‌షైర్ ఆటగాళ్లలో ఎవరూ ఈ జాబితాలో లేరు. ఇయాన్ బెల్ చేసిన 76 పరుగులే లోకల్ బ్యాట్స్‌మన్ అత్యధిక స్కోరు. టెస్టుల్లో నిరాశే ఎదురైనా, వనే్డల్లో మాత్రం రికార్డు కొంత మెరుగ్గానే ఉంది. ఈ మైదానంలో 1996 ఆగస్టులో పాకిస్తాన్‌తో జరిగిన వనే్డలో నిక్ నైట్ 113 పరుగులు చేశాడు. 2010లో బంగ్లాదేశ్‌పై జొనథాన్ ట్రాట్ 110 పరుగులతో రాణించాడు. లోకల్ బ్యాట్స్‌మెన్ టెస్టు సెంచరీలు చేయలేకపోయారన్న స్థానిక అభిమానులకు ఇది కొంత ఊరటనిచ్చే అంశం.
* మామూలు కార్లను నడిపితే మజా ఏముంటుందని అనుకున్నాడో ఏమోగానీ ఇండియానాపొలిస్‌కు చెందిన 44 ఏళ్ల పాల్ స్టెండర్ ఏకంగా మిసైల్ కార్‌తో రోడ్లపై దూసుకెళుతున్నాడు. 1967 మోడల్ చవర్లెట్ కారుకు పైన క్షిపణిని ఉంచి, దానిని ఇంజన్‌తో అనుసంధానం చేశాడు. అత్యంత వేగవంతమైన కార్ల తయారీలో ఎంతో నైపుణ్యం సంపాదించిన ఇండీ బాయిస్ సాయంతో స్టెండర్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోలేని అతని చవర్లెట్ ఇప్పుడు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో పరుగులు తీస్తున్నది. దీనికి ‘జెట్-ఇంపాలా 67’ అని పేరు కూడా పెట్టాడు స్టెండర్.
* భారత్‌లో రెజ్లింగ్‌కు ప్రాచుర్యం కల్పించడం కోసం ఇండియన్ రెజ్లింగ్ లీగ్‌ను ప్రారంభించాలని భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యుఎఫ్‌ఐ) నిర్ణయించింది. లీజర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సహకారంతో వచ్చే జనవరి-్ఫబ్రవరిలో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. ఆరు ఫ్రాంచైజీలతో లీగ్‌ను ప్రారంభిస్తారు. ఒక్కో ఫ్రాంచైజీలో పురుషులు, మహిళలు ఏడుగురు చొప్పున ఉంటారు. వీరిలో విదేశీ రెజ్లర్లు ఇద్దరు ఉండవచ్చు. బౌట్‌లకు ప్రజలను ఆకర్షించేందుకు రెజ్లింగ్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తారు. సోనేపట్, పుణే, న్యూఢిల్లీ, వారణాసితో పాటు మరో రెండు పట్టణాల్లో పోటీలు జరిగే అవకాశం ఉంది. కాగా, ప్రతీ ఫ్రాంచైజీలో ఒక ప్రముఖ రెజ్లర్ ఉండేలా రెజ్లింగ్ ఫెడరేషన్ చూస్తోంది. రెజ్లింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి యువత ఆసక్తి కనబరిచేలా ఈ లీగ్ ఉండాలని భావిస్తోంది. ఈ సంవత్సరమే లీగ్‌ను ప్రారంభించాలనుకున్నా, ఒలింపిక్స్ ఉండటంతో వీలుపడలేదని రెజ్లింగ్ లీగ్ పాలక మండలి చైర్మన్ జి ఎస్ మనీందర్ తెలిపాడు. ఈ లీగ్‌లో దేశంలో రెజ్లింగ్ స్థాయి పెరుగుతుందని చెప్పాడు. వచ్చే ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో ఎనిమిది పతకాలైనా గెలవగలమని మనీందర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
* క్రీస్తుపూర్వం 600 సంవత్సరంలో గ్రీక్ అథ్లెట్ ప్రొటిసెలాస్ నిల్చున్న చోటి నుంచి కదలకుండా డిస్కస్‌ను 152 అడుగుల దూరానికి విసిరాడు. సుమారు 2,500 సంవత్సరాలు ఆ రికార్డు చెక్కుచెదరలేదు. 1928 ఒలింపిక్స్‌లో క్లారెన్స్ హౌసర్ 155 మీటర్ల దూరానికి డిస్కస్‌ను విసిరి ప్రొటిసెలాస్ రికార్డును అధిగమించాడు. అయితే, ప్రొటిసెలాస్ మాదిరి కాళ్లు కదపకుండా ఒకే చోట నిలబడి డిస్కస్‌ను ఎవరూ విసరలేదు.
* ఫార్ములా వన్ రేస్ కారులో సుమారు 80,000 విడిభాగాలను వాడతారు. 99.9 శాతం ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫార్ములా వన్ కారును రూపొందిస్తారు. సగటున 80 విడి పరికరాలు తప్పుగా అసంబుల్ చేసే అవకాశం ఉంది.
* మారథాన్‌లో పాల్గొనడంపై ప్రజలు రోజురోజుకీ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య ప్రతి ఏడాదీ పెరగుతూనే ఉంది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన మెరైన్ కార్ప్స్ మారథాన్‌లో 30 వేల మంది కంటే ఎక్కువే పాల్గొనడం విశేషం. ఈ ఏడాది మారథాన్‌ను రెండు గంటల 20 నిమిషాల్లో పూర్తి చేసిన ఆగస్టస్ మేయో విజేతగా నిలవగా, రెండు గంటల 42 నిమిషాల్లో రేసును పూర్తి చేసిన హిరుత్ గ్వాన్‌కల్ మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది 50 వేల మంది ఈ మారథాన్‌లో పా ల్గొంటారని అంచనా.

ఒక ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన బ్యాట్స్‌మన్
english title: 
carried bat

పంచాయతీ ప్రచారానికి నేటితో తెర

$
0
0

మచిలీపట్నం, జూలై 28: మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. ఈ నెల 31న బందరు, గుడివాడ డివిజన్‌ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. బందరు డివిజన్ పరిధిలో 12 మండలాల్లో 233 గ్రామ పంచాయతీలు ఉండగా 41 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 192 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు 551 మంది పోటీ పడుతున్నారు. గుడివాడ డివిజన్‌లో 9 మండలాల్లో 219 గ్రామ పంచాయతీలకు గాను 48 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 171 గ్రామ పంచాయతీల్లో 486 మంది సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్నారు. సోమవారం సాయం త్రం 5గంటలకు ప్రచారానికి బ్రేక్ పడనుంది. ఈ రెండు డివిజన్‌లలో అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఈ నెల 17న నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటి నుండి రంగంలో ఉన్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి, మలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో తుది విడత ఎన్నికలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా, విజయవాడ నగర పరిధిలోని పోలీసు సిబ్బందితోపాటు అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఎలాంటి అలజడులు రేగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఓటర్లకు ప్రలోభాలు తుది విడతలో కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రచార వ్యవధి ఎక్కువ ఉండటంతో బందరు, గుడివాడ డివిజన్‌లలో ఎన్నికల ఖర్చు తడిసిమోపెడైంది. ఓటుకు భారీ మొత్తంలో సొమ్ము చెల్లించేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇప్పటికే డబ్బు పంపిణీలో నిమగ్నం కాగా ఈ రెండు రోజుల్లో మరింత విస్తృతంగా డబ్బు, మద్యం, ఇతరత్రా పంపిణీలకు కొందరు అభ్యర్థులు సిద్ధమయ్యారు. హోరాహోరీ పోరాటంలో ఎవరికి వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా కృషి చేస్తున్నారు. మొత్తం మీద తుది విడత పోరుకు వివిధ రాజకీయ పార్టీలు కూడా కాలు దువ్వుతున్నాయి. తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. తొలి, మలి విడతల్లో జరిగిన గ్రామ పోరులో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. తుది విడత ఫలితాలు కూడా తమకు అనుకూలంగా మలచుకునేందుకు తెలుగుతమ్ముళ్ళు వ్యూహం రూపొందిస్తుండగా కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా గెలుపు కోసం ఎత్తుగడలు వేస్తున్నాయి.

సర్పంచ్ గద్దె ప్రసాద్‌కు ఎంపి లగడపాటి అభినందన
కంచికచర్ల, జూలై 28: కంచికచర్ల గ్రామ సర్పంచ్‌గా అత్యధిక మెజార్టీతో ఎన్నికైన గద్దె ప్రసాద్‌ను ఆదివారం ఉదయం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అభినందించారు. కంచికచర్ల సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో గద్దె ప్రసాద్ పోటీ చేశారు. ఆదివారం ఉదయం విజయవాడ నుండి హైదరాబాదు వెళుతున్న ఎంపి లగడపాటికి స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా గద్దె తన అనుచరులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ను లగడపాటి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ప్రజలు అభిమానం, నమ్మకంతో అత్యధిక మెజార్టీ ఇచ్చినందున ప్రజాభిమానం చూరగొనేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు తనవంతు సహకారం ఉంటుందన్నారు. ఈసందర్భంగా లగడపాటిని గద్దె దుశ్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నన్నపనేని నర్శింహారావు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కీసరలో సర్పంచ్‌గా ఎన్నికైన నందిగామ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పరిటాల రామకోటేశ్వరరావు సతీమణి దివ్యను కూడా లగడపాటి దుశ్శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో
english title: 
campaign

డెల్టాకు సాగునీరివ్వడంలో ప్రభుత్వం విఫలం

$
0
0

మచిలీపట్నం, జూలై 28: డెల్టా సాగుకు నీరు విడుదల చేయకపోతే ఆగస్టు 1న ఇరిగేషన్ ఎస్‌ఇ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొనకళ్ళ నారాయణరావు హెచ్చరించారు. ఆదివారం ఇక్కడ జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ జలాశయాలు నీటితో కళకళలాడుతున్నా ప్రభుత్వం డెల్టాకు సాగునీరు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నాట్లు ఆలస్యమవ్వటం వల్ల దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తపర్చారు. తుఫాన్‌ల బారిన పడకుండా పంటను రక్షించుకునేందుకు ప్రభుత్వం కనీస చర్యలు కూడా చేపట్టలేదని విమర్శించారు. కాలువలకు నీరు విడుదల చేయకపోవడం వల్ల నాట్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న పాలకులు వ్యవసాయ రంగాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రానికి నాగార్జున సాగర్ నుండి నీరు విడుదల చేయకపోతే ఆగస్టు 1న ఇరిగేషన్ ఎస్‌ఇ కార్యాలయం ఎదుట నిరవధిక ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు 870 అడుగులు నీరు చేరినా డెల్టా రైతులకు నీరు అందడం లేదన్నారు. రైతుల కోసం నిరవధిక పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తొలి, మలి విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ చావు దెబ్బతిన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనపై నమ్మకం ఉంచిన ప్రజలు తెలుగుదేశం పార్టీ బలపర్చిన మెజార్టీ అభ్యర్థులను గెలిపించారన్నారు. ఈ ఫలితాలను చూసైనా పాలకులు కళ్ళు తెరవాలన్నారు. ప్రజలు టిడిపికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. అవనిగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నికలో దివంగత శాసనసభ్యులు అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరిప్రసాద్ ఆగస్టు 1న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మిగతా పార్టీలు కూడా ఏకగ్రీవానికి సహకరించాలని ఉమ, నారాయణరావు కోరారు. ఇప్పటికే కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు లేఖలు రాశామని వారు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బచ్చుల అర్జునుడు, కొల్లు రవీంద్ర, లంకిశెట్టి బాలాజీ, బత్తిన దాస్, తదితరులు పాల్గొన్నారు.

డెల్టా సాగుకు నీరు విడుదల చేయకపోతే ఆగస్టు 1న
english title: 
irrigation

‘విభజన’పై సాచివేత ధోరణి వద్దు

$
0
0

విజయవాడ, జూలై 28: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం త్వరగా ఏదో ఒకటి తేల్చాలని ఒకవేళ తమవల్ల సాధ్యం కానిపక్షంలో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెడితే అన్ని రాజకీయ పక్షాలు వాటంతటవే తమ అభిప్రాయాలను వెల్లడిస్తాయని సిపిఎ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ఆదివారం నగరానికి విచ్చేసిన రాఘవులు తనను కలసిన విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చి చెప్పలేక గత మూడున్నర సంవత్సరాలుగా అనిశ్చితి స్థితిని కొనసాగిస్తోందన్నారు. స్వార్థ రాజకీయాలు మినహా దేశ ప్రయోజనాలు ఏ ఒక్కరికీ పట్టడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఇదిగో తెలంగాణ వచ్చేస్తున్నదంటే, మరికొందరు రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గతంలో ఒకమారు కోర్ కమిటీ, సిడబ్ల్యుసి అన్నారు... మళ్లీ అదేపాట పాడుతున్నారని రాఘవులు ఎద్దేవా చేసారు. పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి వారు తమదే ఆధిక్యత అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు పార్టీ గుర్తులపై త్వరలో జరిగే మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అసలు రంగు బైటపడుతుందన్నారు.

* సిపిఎం నేత రాఘవులు
english title: 
sachivetha

అదరగొడుతున్న అరటిపండ్ల ధర

$
0
0

పాతబస్తీ, జూలై 28: పేదవాని మధుర ఫలం, చిన్నారుల, వృద్ధుల అమృతఫలం నేడు మింగుడుపడని వెలక్కాయలా తయారైంది. నిత్యావసరాలు నింగికి, కూరగాయలు అదే దారి, చివరకు అరటి పండు నేడు అటకెక్కి కూర్చుంది. క్షుద్బాధ తీర్చుకోడానికి పేదలను ఆదుకునే అరటి పండు ధర నేడు ధనికులకు సైతం దడ పుట్టించేంత పెరిగాయి. రెండు నెలల క్రితం డజను అరటిపండ్లు కేవలం రూ.20 నుండి 25లకే లభించగా నేడు వాటి ధరలు డజను రూ.40కి చేరింది. కర్పూర అరటి పండు ధర పెరిగినా అవి మరీ చిన్నవిగా ఉంటున్నాయని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. కృష్ణా ఆయకట్టు ప్రాంతంలోని పంట దిగుబడి ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది. గత ఏడాది సుమారు 25 వేల ఎకరాల్లో అరటి సాగు ఉండగా గిట్టుబాటు ధరలు ఉండడం లేదని రైతులు ప్రత్యామ్నాయంగా స్వీట్ కార్న్ సాగు వైపు మొగ్గు చూపడంతో ఈ ఏడాది కేవలం 15 వేల ఎకరాల్లోనే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అరటి సాగు ఉంది. దాంతో డిమాండుకు తగిన పంట అందుబాటులో లేకుండా పోయింది. అరటి వ్యాపారులు తమిళనాడు, తిరుచనాపల్లి, నంద్యాల, రావులపాలెం తదితర దూర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఛార్జీలు తరుగు, తదితరాల భారాన్ని వినియోగదారులపై మోపడంతో వాటి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కర్పూర అరటి స్థానిక పంట దండిగా చేతికందాలంటే ఇంకా రెండు నెలలు ఆగాల్సిందేనని రైతులు చెబుతున్నారు. నాందేడ్ రకం అరటి పంట నేడు పూర్తిగా కార్పొరేట్ రంగాల చేతుల్లోకి వెళ్ళింది. దీంతో వాటిని హోల్‌సేల్‌లో కిలో రూ.14 ధర పలుకుతుండగా రిటైల్ వ్యాపారులు డజనుల్లో అమ్ముతున్నారు. గతంలో డజను నాందేడ్ అరటిపండ్లు రూ.25 నుండి 30కి అమ్మగా నేడు వాటి ధర రూ.30 నుండి 40కి చేరాయి. అమృతపాణి మాత్రం చిన్నకాయలే లభిస్తున్నాగాని అవి కూడా డజను రూ.30 పలుకుతున్నాయి. ఇక రోగులకు వైద్యులు సిఫార్సు చేసే చక్కెరకేళి రూ.60 నుండి 70కి అమ్ముతున్నారు. అవనిగడ్డ, గుంటూరు జిల్లా పెదపులివర్రు ప్రాంతాలు, రావులపాలెం పరిసరాల్లో చక్కెరకేళి సాగు ఉన్నాగాని వాటి ధరలు మాత్రం రాను రాను నింగిని అంటుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా అధిక ధరలు భరించలేని పేద, బడుగు వర్గాల ప్రజలు ఏ పండో, ఫలమో తిని కడుపు నింపకుందామన్నాగాని వాటి ధరలు భారం కావడంతో దిక్కుతోచని దయనీయ స్థితికి చేరుకుంటున్నారు.

పాలకులకు పట్టని టీచర్ల సమస్యలు
అజిత్‌సింగ్‌నగర్, జూలై 28: విజయవాడ నగర పాలక సంస్థ ఉపాధ్యాయులు తమ జీతాల కోసం చేస్తున్న ఉద్యమం పాలకులకు పట్టకపోవడం శోచనీయమని ఆల్ మైరార్టీ ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్ నగర లీగల్ ఎడ్వైజర్ షేక్ అల్లాభక్షు పేర్కొన్నారు. 010 జీవో ద్వారా జీతాలివ్వాలని కోరుతూ విజయవాడ నగర పాలక సంస్థ పాఠశాలల ఉపాధ్యాయులు నగరంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా ఉపాధ్యాయుల దీక్షకు మద్దతు పలికిన ఆల్ మైనార్టీ ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సంఘీభావంగా రిలేదీక్షలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం అన్ని రకాలు అభ్యున్నతి చెందాలంటే విద్యాభివృద్ధి జరగాలని, ఇందుకు అహర్నిశలు శ్రమించి విద్యావ్యాప్తికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర పాలకులు వివక్ష వహిస్తున్న తీరు గర్హినీయమన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ 010 జీవో ద్వారా జీతాలిస్తుండగా కేవలం విజయవాడ, విశాఖపట్నం ఉపాధ్యాయులకు మాత్రమే 010 ద్వారా జీతాలివ్వకపోవడంతో సకాలంలో జీతాలందక అనేక ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్న వైనం శోచనీయమన్నారు. గత 13 రోజులుగా ఉపాధ్యాయులు ఉద్యమం చేపట్టినా పాలకులు వారి ఉద్యమానికి స్పందించకపోవడం వారి పనితీరుకు నిదర్శనంగా ఉందన్నారు. కార్యక్రమంలో మైనార్టీ ఎంప్లారుూస్ అసోసియేషన్ నాయకులు షేక్ సిరాజ్ భాషా, రాష్ట్ర కోశాధికారి సిటీ కమిటీ అధ్యక్షుడు షేక్ అబ్ధుల్ రజాఖ్, నగర ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆలీ, రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ ఇమాంభాషా, సయ్యద్ అహ్మద్, ఎండి హుస్సేన్ పాల్గొన్నారు.

సినీ నటుడు మురళీమోహన్‌కు జంధ్యాల స్మారక పురస్కారం
విజయవాడ , జూలై 28: ప్రఖ్యాత చలనచిత్ర నటుడు మాగంటి మురళీమోహన్‌కు హాస్యబ్రహ్మ జంధ్యాల స్మారక పురస్కారాన్ని ఆదివారం సాయంత్రం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సుమధుర కళానికేతన్ అందించింది. మూడురోజులపాటు సంస్థ నిర్వహించిన రాష్టస్థ్రాయి 18వ హాస్య నాటికల పోటీల్లో మూడవరోజున బహుమతి ప్రదానోత్సవ వేదికపై సంస్థ 40వ వార్షికోత్సంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వేదికపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కోనేరు రాజేంద్రప్రసాద్, కోగంటి సత్యనారాయణ, సివిడి సుబ్బారావు, సుమధుర కమిటీ అధ్యక్షులు సామంతపూడి నరసరాజు, పరిషత్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్. మురళీకృష్ణ, డాక్టర్ ఎంసి దాస్, సంస్థ కార్యదర్శి పసుమర్తి వెంకట భాస్కరశర్మ తదితరులు పాల్గొని సుమధుర సంస్థ అందిస్తున్న 12వ స్మారక పురస్కారాన్ని ఈ ఏడాది హాస్య రసోత్సవ వేదికపై మురళీమోహన్‌కు ఆహూతుల కరతాళ ధ్వనుల మధ్య అందించారు.
ముగిసిన హాస్య నాటికల పోటీలు
మూడు రోజులపాటు జరిగిన ఈ హాస్య నాటికల పోటీల్లో ప్రేక్షకులు హాస్యరస జగత్తులో విహరించారు. ప్రతి నాటిక మంచి చెడుల విశే్లషణతో సందేశాత్మకంగా ప్రతి సన్నివేశంలోను హాస్యాన్ని జోడిస్తూ ప్రదర్శించిన తీరు ప్రేక్షకులకు హాస్య రసౌషధాన్ని అందించింది. మూడవరోజు ఆదివారం నాటి ప్రదర్శనల్లో ప్రథమంగా మల్లాది క్రియేషన్స్ (హైదరాబాద్) వారి సమర్పణలో బివి రామారావు రచించగా మల్లాది భాస్కర్ దర్శకత్వం వహించిన సీకట్లో సంద్రుడు నాటిక ప్రదర్శితమైంది. నటీనటులుగా కె. రామస్వామి, మల్లాది భాస్కర్, టి. మురళీధర్, విఆర్ కుమార్, ఎంఎస్ హాసన్, కె. శ్రీహరి, పుండరీకాక్షశర్మ, కె. అప్పలస్వామిలు వారి వారి పాత్రలను చక్కగా పోషించారు. ఓ ప్రజాప్రతినిధి మద్యం సేవించి తన భార్యతో గొడవపడటం చూడలేని ఓ ముష్టివాడు వాళ్ల యింటి ఎదురుగా వీధిలైటును పగులగొట్టి సంసారం సంస్కారంతో సాగాలని చెప్పే ఇతి వృత్తంతో ప్రదర్శన సాగింది.
2వ ప్రదర్శనగా లిఖితసాయిశ్రీ క్రియేషన్స్ (గోవాడ) వారి సమర్పణలో భాగవతుల ఉదయ్ రచించగా దర్శకత్వం వహించగా సంగీతం రాజు, సాంబశివరావులు సమకూర్చగా ఎఎస్‌ఎన్ మూర్తి రంగాలంకరణ, జయంతి సుబ్రహ్మణ్య సతీష్ ఆహార్యం, నిర్వహణ జోగారావు చేసిన కక్కుర్తి నాటిక ప్రదర్శితమైంది. నటీనటులుగా జోగారావు, ఉదయ్, మాధవి, విఆర్‌కె రావు, లక్ష్మణ్, శ్రీనివాస్, జయంతి సుబ్రహ్మణ్య దీక్షిత్‌లు వారి వారి పాత్రలను పోషించారు. మనిషి స్థాయికి మించి సంపాదన వస్తోంటే అందులో ఏదో పాపం దాగి వుందని అలా వచ్చే సొమ్ము అశాంతికి గురిచేస్తుందని కక్కుర్తిపడితే ఇక్కట్ల పాలవుతామని ఈ నాటిక కథాంశం. మొత్తం 37 నాటికలు రాగా 10 నాటికలు ఎంపికై ప్రదర్శితమయ్యాయి. న్యాయనిర్ణేతలుగా సినీ నటులు రావి కొండలరావు, కోట శంకరరావు, జిఆర్‌కె మూర్తిలు వ్యవహరించారు.

పేదవాని మధుర ఫలం, చిన్నారుల, వృద్ధుల అమృతఫలం నేడు
english title: 
bananas

నేటితో తుదివిడత ఎన్నికల ప్రచారానికి తెర

$
0
0

గుంటూరు, జూలై 28: జిల్లా వ్యాప్తంగా మూడు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరువయ్యాయి. తొలివిడత తెనాలి డివిజన్‌లో, మలివిడత గుంటూరు డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలు జరగగా ఈనెల 31వ తేదీన నరసరావుపేట డివిజన్‌లో జరగనున్నాయి. గత పది రోజులుగా నరసరావుపేట డివిజన్‌లో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించగా సోమవారం సాయంత్రంతో ప్రచార ఘట్టానికి తెరపడనుంది. తొలి, మలి విడతల్లో జరిగిన ఎన్నికలు దాదాపు ప్రశాంతంగా ముగియగా అత్యంత సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత గ్రామాలు అత్యధికంగా ఉన్న నరసరావుపేట డివిజన్‌లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది. డివిజన్ పరిధిలో 103 సమస్యాత్మక, 91 అత్యంత సమస్యాత్మక, 20 మావోయిస్టు ప్రభావిత గ్రామాలుండగా కేవలం 49 మాత్రమే సాధారణ గ్రామాలు కావడంతో పోలీసు, పోలింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. నరసరావుపేట డివిజన్‌లో 355 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 56 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 299 పంచాయతీలకు ఈనెల 31వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు గాను 813 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 2687 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను ఆయా పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాగైనా గెలిచేందుకు వక్రమార్గాలను అనే్వషించే పనిలో పడ్డారు. ఇప్పటికే తొలి, మలి విడతల్లో ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచి జోష్ మీద ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం నెలకొంది. నరసరావుపేట డివిజన్‌లో సైతం తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రధానంగా డబ్బు, మద్యం పంపిణీపై అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు ప్రధానంగా దృష్టి పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో డబ్బు పంపణీ కీలకంగా మారింది. అభ్యర్థులు డబ్బును మంచినీటిలా ఖర్చుచేస్తూ ఓటుకు రేటు కట్టి మరీ నోట్లను పంచుతున్నారు. దీంతో అభ్యర్థుల గెలుపోటములపై డబ్బు పంపిణీ తీవ్ర ప్రభావం చూపనుంది. డివిజన్‌లోని పలు మేజర్ పంచాయతీల్లో ఒక్కో ఓటుకు 2 వేల నుండి 5 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఒక్కో అభ్యర్థి కనీసం 30 నుండి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు వెనుకాడని పరిస్థితి నెలకొంది. పలు గ్రామాల్లో కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మధ్య ఒప్పందాలు జరగ్గా మరికొన్ని గ్రామాల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా అభ్యర్థులను నిలిపి గెలిపించే వరకు పొత్తులు కుదిరినట్లు సమాచారం.

* 299 పంచాయతీలు, 2687 వార్డులకు ఎన్నికలు * సమస్యాత్మక గ్రామాలపై నిరంతర నిఘా
english title: 
final round
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>