Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

35 లక్షల ఎర్ర చందనం పట్టివేత

$
0
0

తెనాలి, జూలై 28: గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ పరిధిలోని కొల్లూరు మండలం కిష్కిందపాలెంలో ఇంటి వెనక పెరట్లో దాచి ఉంచిన ఎర్ర చందనం దుంగలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్ సిఐ బి శ్రీనివాసరావు, కొల్లూరు ఎస్‌ఐ వెంకటేశ్వరావు కథనం ప్రకారం మండలంలోని కిష్కిందపాలెం గ్రామానికి చెందిన బిఎల్‌కె ప్రసాద్‌కు చెందిన ఇంటి వెనక భాగంలో సుమారు 5 టన్నుల ఎర్ర చందనం దుంగలు పాతిపెట్టి ఉంచారన్న సమాచారం ఆదివారం పోలీసులకు అందింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వరావు తన సిబ్బందితో తహశీల్దార్ మోహనకృష్ణ సంయుక్తంగా ప్రసాద్ ఇంటిపై దాడులు చేశారు. పెరటిలో పాతిపెట్టి ఉంచిన సుమారు 35 నుండి 40 లక్షల రూపాయల విలువగల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. దుంగలను తహశీల్దార్ ద్వారా అటవీ శాఖాధికారులకు అప్పగించి, నిందితుడు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

తెలంగాణపై కాంగ్రెస్‌ది పూటకోమాట
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు
గుంటూరు, జూలై 28: తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ పూటకోమాట చెబుతూ స్వలాభం కోసం దేనికైనా ఒడికట్టేందుకు వెనుకాడబోదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాఘవులు విలేఖర్లతో మాట్లాడారు. తెలంగాణపై పార్లమెంటులో మెజార్టీ సభ్యులు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఓటింగ్ జరపాలన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సిపిలు తెలంగాణపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాల కాలం పోయిందని, నిర్ణయాలు తీసుకోవాల్సిన కాలం వచ్చిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ నాటకాలను వీడి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రాఘవులు హితవు పలికారు.

గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ పరిధిలోని కొల్లూరు మండలం
english title: 
red sanders

ఎన్నికల విధులకు హాజరుకాని పోలింగ్ సిబ్బందిపై క్రిమినల్ కేసులు

$
0
0

గుంటూరు, జూలై 28: పంచాయతీ ఎన్నికల్లో విధులకు హాజరుకాని పోలింగ్ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ నుండి నరసరావుపేట డివిజన్‌లోని మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విధులకు హాజరుకాని సిబ్బందిపై చర్యలు తీసుకునే అధికారాన్ని జిల్లా ఎన్నికల అధికారికి ఇచ్చిందన్నారు. ఈ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన విధులకు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. తెనాలి, గుంటూరు, నరసరావుపేట డివిజన్‌లలో పంచాయతీ ఎన్నికలకు నియమించిన సిబ్బందిలో శిక్షణ తరగతులకు హాజరుకాని సిబ్బంది ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం నరసరావుపేట ఆర్‌డిఒ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. అలా హాజరుకాని సిబ్బందిపై ఎన్నికల చట్టాలను అనుసరించి తగు క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నరసరావుపేట డివిజన్‌లోని 20 మండలాల్లో ఈనెల 31వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా 29వ తేదీ సాయంత్రానికల్లా ఓటర్లందరికీ ఓటింగ్ స్లిప్‌లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు స్లిప్ లేకపోయినప్పటికీ గుర్తింపుకార్డుతో ఓటును వినియోగించుకోవచ్చని సూచించారు. పోలింగ్ సిబ్బంది ఈనెల 30వ తేదీ ఉదయానికల్లా మండల కేంద్రాల్లోని పంపిణీ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. గుంటూరు, తెనాలి డివిజన్లలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, అదేస్ఫూర్తితో నరసరావుపేట డివిజన్‌లో ఎన్నికలు ముగిసేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కోరారు.

* కలెక్టర్ సురేష్‌కుమార్
english title: 
suresh kumar

యండ్రాయిలో కాంగ్రెస్ వర్గీయులపై టిడిపి దాడి

$
0
0

అమరావతి, జూలై 28: గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం మండల పరిధిలోని యండ్రాయి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు కర్రలు, మారణాయుధాలతో కాంగ్రెస్ వర్గీయులపై దాడి చేశారు. పోలీసులు కథనం ప్రకారం... మండల పరిధిలోని యండ్రాయి గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న అభ్యర్థి వీరేంద్ర, వాసిరాజు చక్రవర్తిరాజు, అద్దంకి స్వామి, వెంకట్రావ్, సాంబశివరావును ప్రత్యర్థి వర్గానికి చెందిన తెలుగుదేశం వర్గీయులు వాసిరాజు శంకరరాజు, గోరంట్ల సర్వేశ్వరరాజు, తలమాల రాధాకృష్ణ, వలివేటి ధర్మారావు, జమ్ముల రవికుమార్, దేవబత్తిన సాంబశివరావు, మోహనరావులతో పాటు మరికొంత మంది మారణాయుధాలతో దాడి చేశారు. దాడిలో గాయపడిన కాంగ్రెస్ వర్గీయులు అమరావతి 30 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమరావతి ఎస్‌ఐ ఎ మల్లిఖార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాడికొండలో టిడిపి హవా
తాడికొండ, జూలై 28: గతంలో జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించక పోయినా సర్పంచ్ ఎన్నికల్లో తన సత్తా చాటుకుంది. మరోసారి తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయిలో చెక్కుచెదరలేదని నిరూపించుకుంది. తాడికొండ మండలంలో 15 గ్రామ పంచాయతీలకు గాను 8 పంచాయతీలను సొంతం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన పోరులో టిడిపి విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నిలిపింది. త్వరలో జరగబోయే మండల పరిషత్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని పార్టీ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ మండలంలో కాంగ్రెస్ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మంత్రి మొదటి నుంచి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ పట్ల మండల ప్రజలు వ్యతిరేకతతో ఉన్న విషయం స్థానిక ఎన్నికల ద్వారా రుజువైంది. మండలంలో మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో కేవలం 4 స్థానాలను గెలుచుకోవడంతో స్థానిక కార్యకర్తల్లో నైరాస్యాన్ని నింపింది. ఎన్నికల సమయంలో తప్ప మండలంపై పెద్దగా కేంద్రీకరించక పోవడంతోనే ఇలాంటి ఫలితాలు వెలువడ్డాయని స్థానికంగా చర్చ జరుగుతుంది. గ్యాస్, పెట్రోల్, కరెంట్ కోతలు, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచడంతోనే దాని ప్రభావం స్థానిక పోరులో స్పష్టం కనపడింది. చావు తప్పి కన్నులోట్టపోయిన చందంగా నూతనంగా ఏర్పడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టిడిపి బలపర్చిన అభ్యర్థుల్లో బండారుపల్లి సర్పంచ్‌గా పి లావణ్య (267 మెజార్టీ), కంతేరుకు తోకల శ్రీలత (119), లాంకు దాసరి సుభాషిణి (20), మోతడకకు దొడ్డా వీరయ్య (211), పొనె్నకల్లుకు జి శివలీల (12), రావెలకు బి ఆదినారాయణ (690), పాములపాడుకు శ్రీ రామాంజనేయులు (331), తాడికొండ సర్పంచ్‌కు నూతక్కి నవీన్‌కుమార్ (48 మెజార్టీ) ఎన్నికయ్యారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల్లో బేజాతపురం సర్పంచ్‌గా జెల్దికుమారి (463), ముక్కామలకు తమనంపల్లి ఏసుదాసు (106), నిడుముక్కలకు పప్పుల రవికుమారి (139), దామరపల్లికి ఎన్ సరస్వతి (125) ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్ సిపి బలపర్చిన అభ్యర్థిని బొర్రా భాగ్యలత 503 ఓటర్ల మెజార్టీతో లచ్చన్నగుడిపూడి సర్పంచ్‌గా విజయం సాధించారు. స్వతంత్య్ర అభ్యర్థి సింగ్ బాబోజమ్మ గరికపాడు సర్పంచ్‌గా 240 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మేజర్ పంచాయతీ తాడికొండలో టిడిపి అభ్యర్థికి 4188, వైఎస్‌ఆర్ సిపి బలపర్చిన అభ్యర్థికి 4152, కాంగ్రెస్‌కు 1019 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థికి 550 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ 41 ఓట్లు వచ్చాయి.

* ఐదుగురికి తీవ్రగాయాలు
english title: 
injured

అధికారుల అక్రమాలకు నిరసనగా రాస్తారోకో

$
0
0

అమరావతి, జూలై 28: అమరావతి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఓట్ల లెక్కింపులో అధికారులు, పోలీసులు అక్రమాలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తెలగతోటి ప్రసన్నకుమారి గెలిస్తే ఆమెను కాదని, కాంగ్రెస్ వర్గానికి చెందిన గుడిశె నిర్మలాదేవి 23 ఓట్ల తేడాతో గెలిచారని ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల కేంద్రమైన అమరావతిలోని బృందావన హోటల్ సెంటర్, సత్తెనపల్లి క్రాస్ రోడ్డు వద్ద తెలుగుదేశం, మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. సుమారు 5 గంటల పాటు రాస్తారోకో జరగడంతో పుణ్యక్షేత్రమైన అమరావతి దర్శనం కోసం వచ్చిన యాత్రికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఆందోళన కారులను అమరావతి తహశీల్దార్ జి సుజాత, శాంతి భద్రతలకు విఘాతం కల్గించవద్దని, రాస్తారోకో విరమించాలని కోరగా సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో మండల పరిషత్ అధికారులు, ఎన్నికల అధికారులు, అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారన్నారు. ఆందోళన విరమించి రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహశీల్దార్ సుజాత హామీ ఇచ్చారు. సత్తెనపల్లి డిఎస్‌పి జగదీశ్వర్‌రెడ్డి, అమరావతి సిఐ బి మరియదాసు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాస్తారోకో చేస్తే లాఠీఛార్జ్ చేయాల్సి వస్తుందని స్పష్టం చేయడంతో ఆందోళన కారులు విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన తెలగతోటి ప్రసన్నకుమారి, పార్టీ నాయకులు షేక్ మాబుసుభాని, కొల్నాటి కోటయ్య, న్యాయవాది కనె్నధార హనుమయ్య, కరిముల్లా, షేక్ అమాన్, హష్మి, అల్లాభక్షు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సిబ్బంది చర్యకు నిరసనగా ధర్నా
* ట్రాఫిక్‌కు అంతరాయం
సత్తెనపల్లి, జూలై 28: అచ్చంపేట మండలం, మిట్టపాలెం గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతుతెలిపిన చేకూరి సత్యవతి ఒక్క ఓటుతో గెలిచినప్పటికీ ప్రత్యర్ధి పోలు హనుమాయమ్మ గెలిచినట్లు ఎన్నికల సిబ్బంది ప్రకటించడం అన్యాయమంటూ బాధిత వర్గాలు ఆదివారం నాడు డిఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇది అన్యాయమని ప్రశ్నించినందుకే పోలీసులు దాడి చేసి కాంగ్రెస్ పార్టీ వర్గీయులను గాయపరిచారని బాధిత వర్గాలు ఆరోపించారు. అనంతరం ప్రజా సంఘాల అధ్వర్యంలో భాధితులు తాలుకా సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. దీంతో మాచర్ల-గుంటూరు వెళ్ళే ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం ప్రజా సంఘాల నాయకులతో పట్టణ పోలీసులు మాట్లాడి ధర్నాను విరమింపచేశారు.
పోలీసుల అనాలోచిత చర్యకు నిరసనగా కాలనీవాసుల ధర్నా
పోలీసుల తప్పిదంతో ఆగ్రహించిన భాధితులు మండల పరిధిలోని నందిగం అడ్డరోడ్డులో ధర్నాకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. నందిగామ గ్రామ పంచాయితీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్ధి చెంబెటి నాగమల్లేశ్వరి గెలుపొందడంతో ఆదివారం నాడు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి వర్గీయులతో ఇరువురు వ్యక్తులు వాదనకు దిగారు. అంతేకాక ఘర్షణకు దారితీయడంతో భాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి వెళ్ళిన పోలీసులు వివరాలలోకి వెళ్ళకుండా హడావిడిగా గ్రామంలోని వేరే కాలనీకి వెళ్ళి హల్‌చల్ చేశారు. లాఠీకి పనిచెప్పారు. దానితో అగ్రహించిన ఆప్రాంతవాసులు పోలీసుల తప్పిదంపై మండిపడ్డారు. అయినప్పటికి పోలీసుల వైఖరిలో మార్పు లేకపోవడంతో వారు నందిగం అడ్డరోడ్డులో ధర్నాకు దిగారు. దాంతో గంటపాటు గుంటూరు-మాచర్ల వైపు వెళ్ళే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. వాస్తవం తెలుసుకున్న డిఎస్పీ జగదీశ్వరరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని సర్దిచెప్పారు. తప్పిదాన్ని ఒప్పుకున్నారు. గ్రామపెద్దల సహకారంతో సమస్య సద్దుమణిగింది.

గ్రామసీమల అభివృద్ధికి
టిడిపి కృషి: ఎమ్మెల్యే ప్రత్తిపాటి
యడ్లపాడు, జూలై 28: గ్రామ సీమల అభివృద్ధికి, వైద్యసేవల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యతనిస్తుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం ఆయన యడ్లపాడులో తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థి సువార్తమ్మకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో ర్యాలీలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల ప్రాధాన్యతావసరాలను గుర్తించి వ్యవహరిస్తోంద ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక పంచాయతీలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుందని, తుదివిడత పోలింగ్‌లో సైతం తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.

అమరావతి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఓట్ల
english title: 
rastha roko

522.60 అడుగుల వద్ద సాగర్ నీటి మట్టం

$
0
0

విజయపురిసౌత్, జూలై 28: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆదివారం సాయంత్రం సాగర్‌కు నీటి చేరిక పెరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాగార్జునసాగర్ జలాశయానికి 21,859 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో సాగర్ నీటిమట్టం 522.60 అడుగుల వద్ద కొనసాగుతున్నట్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇది 154.06 టిఎంసిలకు సమానం. సాగర్ జలాశయం నుండి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 450 క్యూసెక్కులు నీటిని, ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుండి మొత్తం 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 866.10 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 126.60 టిఎంసిలకు సమానం. ఎగువ జలాశయలైన జూరాల, రోజాప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి 3,40,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

తల్లిపై కూతురి విజయం
మంగళగిరి, జూలై 28: మండల పరిధిలోని కాజ పంచాయితీ 10వ వార్డు మెంబరుగా సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన తాడిబోయిన బాజిమ్మ వైఎస్‌ఆర్ సీపీ, కాంగ్రెస్, టిడిపి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన తన తల్లి చావలి అన్నపూర్ణపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించింది. నామినేషన్ దాఖలైన రోజునుంచి తల్లీ కూతుళ్ల విజయంపై గ్రామంలో ఆసక్తిగా చర్చించుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు గ్రామస్థులు ఉత్కంఠగా ఎదురు చూశారు.

గ్యాస్ ధర పెంపులో రిలయన్స్‌కు తలొగ్గిన ప్రభుత్వం
గుంటూరు , జూలై 28: రిలయన్స్ కంపెనీ ఒత్తిడి, బెదిరింపులకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఉత్పత్తి ధరను యూనిట్ 4.2 డాలర్ల నుండి 8.4 డాలర్లకు పెంచిందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఆదివారం స్థానిక ఎన్‌జిఒ కాలనీలోని సప్తరుషి ఆశ్రమంలో గ్యాస్ ధరలు - రిలయన్స్ పర్యావసానాలు అనే అంశంపై ఎన్‌జిఒ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి సాంబిరెడ్డి అధ్యక్షతన స్టడీ సర్కిల్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తంగా పాల్గొన్న లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల రిలయన్స్ కంపెనీ లక్ష కోట్ల లాభం పొందనుందన్నారు. కేజీ బేసిన్‌లోని గ్యాస్ సంపదను స్వాధీనం చేసుకున్న రిలయన్స్ ఒప్పందాలను ఉల్లంఘించి గ్యాస్ ఉత్తత్తి చేయలేదని సుప్రీంకోర్టుతో పాటు ‘కాగ్’ కూడా రిలయన్స్ నిర్వాకాలను బహిర్గతం చేశాయన్నారు. పీపుల్ ఫర్ ఇండియా ఫోరం వైస్ చైర్మన్ వివిఎస్ సురేష్ మాట్లాడుతూ గ్యాస్ ధరలను పెంచడం వల్ల పెట్టుబడులు పెద్దఎత్తున వస్తాయని, ఉత్పత్తి పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థకు లాభకరమని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అవాస్తవమన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యుత్, యూరియాలకు సంబంధించి ఖర్చు పెరిగి ఆ భారం ప్రజలపై పడుతుందన్నారు. గతంలో కూడా 1.79 డాలర్ల నుండి 4.24 డాలర్లకు ధర పెంచినప్పుడు కూడా ప్రభుత్వం ఇదే రకమైన వాదన చేసిందని, రిలయన్స్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు అంతర్జాతీయ ధరలతో పోలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పి గంగయ్య చౌదరి, ఎన్‌ఎస్ భార్నబాస్, వి వెంకటేశ్వరరెడ్డి, ఎం వీరయ్య, ఈ శివారెడ్డి, కె సాంబశివరావు, ఎన్ భావన్నారాయణ, కెవిఎల్ రామకృష్ణారావు, జె వెంకట్రావ్ పాల్గొన్నారు.

పెదగొల్లపాలెం ఓట్లు మళ్లీ లెక్కించాలి
కర్లపాలెం, జూలై 28: మండలంలోని పెదగొల్లపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నిక ఓట్లను మళ్ళీ లెక్కించాలని ఓడిన సర్పంచ్ అభ్యర్థి యారం ప్రసాదరావు డిమాండ్ చేశారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్‌లో కొందరు నాయకులతో కలిసి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ ఈ నెల 23న ఎన్నికలు ముగిసిన అనంతరం ఓట్లు లెక్కింపులో 11,12వార్డుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తమ గుర్తుపై పడిన ఓట్లను మరో అభ్యర్థి గుర్తుపై పడినట్లు లెక్కించారన్నారు. అంతేగాక కౌంటింగ్ హాల్‌లో ఉన్న తమ ఏజెంట్ బుచ్చిరాజును కౌంటింగ్ గది నుండి బయటకు పంపారన్నారు. తాము ఈ విషయాన్ని ఎంపిడిఓ, తహశీల్దార్, ఎస్‌ఐకి వివరించి రీకౌంటింగ్ కోరగా తాము ఏమీ చేయలేమని చెప్పినట్లు ప్రసాద్ తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుని రీకౌంటింగ్ జరపాలని అర్జీలు పంపినట్లు వివరించారు.

పల్లెల్లో జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం
రెంటచింతల, జూలై 28: మండల పరిధిలోని పది పంచాయతీ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రంగంలోకి దిగారు. మాచర్ల ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ మద్దతుదారులను సర్పంచ్‌లుగా అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో వౌలిక సదుపాయాలు కల్పించినట్లు గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. గత వారం యరపతినేని మేజర్ పంచాయతీ అయిన రెంటచింతలలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన పాముల సంపూర్ణమ్మకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మండలంలోని పంచాయతీ ఎన్నికలకు రాజకీయ వేడి రగిలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ అసమ్మతి నేత గాదె యర్రజోజిరెడ్డితో సమాలోచనలు జరిపి, దేశం పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టడంలో కృషి చేశారు. తక్కెళ్ళపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న చల్లా మట్టారెడ్డి తరఫున అక్కడి దేశం నాయకులు ప్రచారం చేస్తున్నారు.

ఈ ఖరీఫ్‌లో సాగునీరు వచ్చేనా?
భట్టిప్రోలు, జూలై 28: ఈ ఖరీఫ్‌కు సాగునీటి విడుదల జరుగుతుందా.. లేదా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం బ్యాంకు కెనాల్ నుండి వెల్లటూరు వద్ద అరకొర నీటిని విడుదల చేయటంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పటం లేదు. ఎంతో ఆశతో నారుమళ్ళు సిద్ధం చేసుకున్న రైతులకు అధికారులు విడుదల చేసిన నీరు ఏమాత్రం సరిపోలేదు. బ్యాంక్ కెనాల్‌కు పక్కనే ఉన్న ఎటిఎస్ చానల్ పరిధిలో సుమారు 2 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉంది. ఒకపక్క సాగునీరు సక్రమంగా రాక కాలువ పూడిపోటంతో పోసిన నారుమళ్లకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వివరణ కోరగా తాము ఎన్నికల విధుల్లో ఉన్నామని ఇచ్చిన నీటితోనే సరిపెట్టుకోవాలని చేతులెత్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు రోడ్డెక్కాల్సి వస్తుందని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో సాగునీరు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

వరి నాట్లకు సిద్ధమవుతున్న రైతులు
తెనాలి , జూలై 28: కృష్ణా డెల్టా ప్రాంతంలోని తెనాలి మండల గ్రామాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మండలంలోని కొలకలూరు, హాప్‌పేట, ఖాజీపేట, గుడివాడ, కోపల్లె, అంగలకుదురు, సోమసుందరపాలెం కంచర్లపాలెం తదితర గ్రామాల్లో రైతులు ఇప్పటికే వరినారుమళ్ళు వేసుకున్నారు. ప్రస్తుతం మళ్ళకు బోర్లు, నీళ్ళ కుంటలు, చెరువుల ద్వారా నీటిని మళ్లిస్తూ నారు పెంచుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు విడుదల చేయటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు మేజర్ కాల్వల ద్వారా పంట కాల్వలకు చేరేలోగా వరినారు అదునులోకి వస్తుందని, వెంటనే నాట్లు వేసుకోవచ్చునని భావిస్తున్నారు. ఇదే తరుణంలో కొందరు రైతులు వ్యవసాయ శాఖాధికారుల సహాయ, సహకారాలతో నేరుగా వరినాటు విధానంపై దృష్టి మళ్ళించారు. సాగునీరు సకాలంలో విడుదల కావటంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే సుమరు 500 హెక్టార్లలో వరినారుమళ్ళు పెంచుతున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మరో 500 హెక్టార్ల వరకు వెద పద్ధతిలో వరినాట్లు వేసేందుకు రైతులు ముందుకు వస్తున్నట్లు ఎఓ అమలకుసమారి తెలిపారు. ఇప్పటికే మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీల్లో పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతులకు మేలు రకం వరి విత్తనాలను సబ్సిడీపై అందజేశామన్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు కొంత వరకు పనులు వాయిదా వేసుకుంటున్నారు. ఈ నెల 23నాటికి ఎన్నికలు ముగియటంతో తిరిగి వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మెరక భూములు, తక్కువ సాగునీరున్న ప్రాంతాల్లో వెద పద్ధతిలో నాట్లు వేసుకోవటం శ్రేయస్కరమని వ్యవసాయ విస్తరణాధికారులు సూచిస్తున్నారు.

సిపిఎం నేత మృతికి పలువురి సంతాపం
కొల్లిపర, జూలై 28: ప్రముఖ సిపిఎం పార్టీ నాయకులు బొంతు సాంబిరెడ్డి(70) ఆదివారం మృతి చెందారు. మండల కేంద్రమైన కొల్లిపరకు చెందిన సాంబిరెడ్డి కమ్యునిస్టు పార్టీకి ఎనలేన సేవలు చేశారు. 1974లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర శిక్షణ తరగతులను కొల్లిపరలో విజయవంతంగా నిర్వహించారు. సాంబిరెడ్డి అందుకు ఆవిరళ కృషి చేశారు. పార్టీ అగ్రనాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్యలచే అభినందనలు పొందారు. రైతాంగ సమస్యలపై జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. సాంబిరెడ్డి మృతదేహానికి పలువులు సిపిఎం నాయకులు, కార్యకర్తలు ఘన నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

ఎన్నికల అధికారులకు
శిక్షణ తరగతులు
నాదెండ్ల, జూలై 28: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు ఎన్నికల శిక్షణ తరగతులు నిర్వహించినట్లు ఎంపిడివో దాసరి అనురాధ ఆదివారం తెలిపారు. ఈ శిక్షణ తరగతులను ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించామన్నారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. 14 గ్రామాల రిటర్నింగ్ అధికారులతో శిక్షణ తరగతులను నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియంలో రిటర్నింగ్ అధికారులు ప్రధాన భూమిక పోషించనున్నట్లు ఆమె తెలిపారు. పివోలు, ఏపివోలు, ఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

పివోలు, ఎపివోలకు శిక్షణ తరగతులు
రొంపిచర్ల, జూలై 28: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పివోలు, ఏపివోలకు రెండో విడత శిక్షణ తరగతులు ఆదివారం జరిగాయి. శిక్షణలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు, ఎంపిడివో ఎస్ రాజేష్, డెప్యూటీ తహశీల్దార్ లక్ష్మీప్రసాద్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇలు జగన్మోహన్‌రెడ్డి, ఇమ్మానియేలు పాల్గొన్నారు. మండలంలోని 25 పంచాయితీలకు గానూ 600 మందికి శిక్షణ ఏర్పాటు చేయగా మొత్తం 478 మంది హాజరయ్యారు. పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఛాలెంజ్ ఓట్లు, టెండర్ ఓట్ల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులు, బ్యాలెట్ బాక్స్ నిర్వహణ, కౌంటింగ్ విషయంలో పోలైన ఓట్లతోపాటు పోస్టల్ బ్యాలెట్‌లో వచ్చిన ఓట్ల లెక్కింపు సిబ్బందికి వివరించారు.

పోలీసు బందోబస్తు
మాచవరం, జూలై 28: గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బంది రాత్రివేళల్లో కూడా గ్రామాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ మహమ్మద్ షఫీ తెలిపారు. ఆదివారం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎదురెదురుపడటంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీల నాయకులను హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల్లోపు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని ఎస్‌ఐ షఫీ అభ్యర్థులను కోరారు.

నడకతో ఆరోగ్యం
తెనాలి, జూలై 28: దినచర్యలో నడకకు ప్రాధాన్యం ఇస్తే ఆరోగ్యం బాగుంటుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎమ్‌వి.రావ్ అన్నారు. స్థానిక గాంధీనగర్‌లోని కవిరాజ పార్కులో సీనియర్ సిటిజన్స్ సమావేశం హాల్‌లో ఆదివారం వాకర్స్ క్లబ్ తెనాలి అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి అధ్యక్షతన నిర్వహించిన వాకర్స్ సమావేశంలో డాక్టర్ ఎమ్‌వి.రావ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనారోగ్య సమస్యలను అధిగమించడంలో నడక ప్రాధాన్యత వివరించారు. మధుమేహ వ్యాధి లక్షణాలు వివరించారు. ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల మధుమేహ వ్యాధి సోకుతుందన్నారు. ఊబకాయం, ఉదర భాగంలో కొవ్వు పెరగడం వల్ల మధుమేషం, గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. రోజువారీ నడక అనేక శారీర రుగ్మతలను అధిమించేందుకు దోహదపడుతుందన్నారు. మానసిక తృప్తి కోసం సామాజిక సేవలు అలవర్చుకోవాలన్నారు. తెనాలి వాకర్స్ క్లబ్ చేపడుతున్న సేవలను డిస్ట్రిక్ గవర్నర్ ఎస్.రామ్మోహనరావు ప్రశంసించారు. ఈ డి.అబ్బయ్య, బాలరాజు కృష్ణంరాజు, కె.శ్రీనివాసరావు దంపతులు మహాత్మాగాంధీ ఫెలోషిప్ స్వీకరించారు. 19 మంది క్లబ్ సభ్యులు పాట్రన్ సభ్యత్వం , కొత్తగా ఐదుగురు సాధారణ సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమానికి క్లబ్ కార్యదర్శి కె.రవిబాబు స్వాగతం పలకగా, ఉపాధ్యక్షుడు కె.రామ్మోహనరావు, అశోక్ కుమార్, రాఘవరావు, సుబ్రహ్మణ్యం, పావులూరి రాంబాబు, శ్రీనివాస్, జొన్నలగడ్డ సుబ్బారావు తదితర సభ్యులు పాల్గొన్నారు.

అ‘పూర్వ’ కలయకతో అమితానందం
నరసరావుపేట, జూలై 28: పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో 1984-85 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక అమరా ఇంజనీరింగ్ కళాశాలలో కలుసుకున్నారు. దేశ నలుమూలల్లో స్థిరపడిన ఆ బ్యాచ్ విద్యార్థులు హాజరై పాత మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. గతంలో జరిగిన సమ్మేళన కార్యక్రమంలో మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలకు బెంచీలు, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ప్రస్తుతం లక్ష రూపాయల విరాళంతో నరసరావుపేట-85 ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ డబ్బుతో హైస్కూల్‌కు కావాల్సిన వసతులు, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, వైద్య శిబిరాలతోపాటు పలు సేవా కార్యక్రమాలకు వినియోగించేందుకు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అమరా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అమరా వెంకటేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ కొత్త శివబాబు, నాగసరపు నరసింహారావు, డాక్టర్ పుచ్చ ఆనంద్, అర్వపల్లి శ్రీనివాసరావు, జుజ్జూరి రామకృష్ణ, మేకల నాగేశ్వరరావు, ఎస్‌వి భక్త్ఛినల్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆదివారం సాయంత్రం
english title: 
sagar water level

కార్పొ‘రేట్’ మోత!

$
0
0

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
ఒకప్పటి బడి..అదో అందమైన గుడి..కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు గుండెదడ పుట్టించే అర్ధంకాని పెట్టుబడి..! పిల్లల భవిష్యత్ బంగారుబాటల్లో సాగాలనే బలహీనతను ఆసరాగా నేటి ప్రైవేట్ విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. శాస్ర్తియ విద్యాప్రమాణాలకు మంగళం పాడి తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు విద్యావిధానాలు, సృజనాత్మకతను వెలికితీసే ప్రక్రియ పాటించకపోగా వివిధ రకాలుగా అధిక మొత్తంలో ఫీజులు గుంజుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ గుర్తింపును సైతం లెక్కచేయకుండా ఆర్భాటంగా మోసపూరిత ప్రకటనలతో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల పబ్లిక్ దోపిడీని నియంత్రించలేక ఇటు సర్కార్ బడులకు సరైన వసతులు..బోధనా సిబ్బందిని సమకూర్చలేక ప్రభుత్వం చతకలబడుతోంది. బోసినవ్వుల బాల్యం నుండి బండెడు పుస్తకాలు భుజాన వేసుకుని అంతస్థుల పాఠశాలలోని క్లాస్ రూంకు మెట్లెక్కి వెళ్లలేకపోతునప్పటికీ విద్యాహక్కు చట్టం అమలు చేయకుండా చోద్యం చూస్తున్నారు అధికారులు. ఏ ప్రైవేట్ పాఠశాలనైనా జిల్లా స్థాయి అధికారులు పరిశీలించిన దాఖలాలు కనిపించవు. కార్పొరేట్ సంస్థలంటేనే అన్నీ పాటిస్తారులే అనే సాధారణ అంచనాయే తప్ప విధివిధానాలు ఎలా పాటిస్తున్నారా పరిశీలించే దాఖలాలు ఎక్కడా కనిపించవు. బ్రాంచీలు పెట్టి ఒకే సంస్థకు గుర్తింపు చూపిస్తూ బురిడి కొట్టిస్తున్నా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ వెసులుబాటు మామ్మూళ్ల కోసమే అన్న విమర్శలూ లేకపోలేదు...ప్లేక్లాస్‌లు, కానె్టస్ట్, టెక్నో, ఐ.ఐ.టి ఫౌండేషన్ లాంటి హోరెత్తించే ప్రచారంలో ఫీజులు పిండేస్తున్నా అరికట్టడంలో అధికారుల అలసత్వం కనిపిస్తోంది. ఎ టు జెడ్, వన్ టు 100, నాలుగు రైమ్స్ నేర్పించడానికి 15 నుండి 20 వేలు వరకు వసూలు చేస్తుంటే వారికి తరగతులకు ఫీజుల మోత ఎలా ఉంటుందో ఇట్టే అర్ధమవుతోంది. అంతేకాదు రిజర్వ్ బ్యాంకు విధానాలకు విరుద్ధంగా ఓ కార్పొరేట్ విద్యావ్యాపార సంస్థ ఫీజులకు బదులు డిపాజిట్ల సేకరణలో పడింది. 1.75 లక్షల రూపాయలు కడితే ఏ ఫీజులు చెల్లించనక్కర్లేదని, పాఠశాలను విడిచిపెట్టేప్పుడు తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తోంది. ట్యూషన్ ఫీజు, కార్పస్ ఫండ్, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారం, స్కూల్ బస్సులాంటి వివిధ రకాల్లో సొమ్ములు వసూలు చేసి ఇష్టానుసారంగా బ్రాండెడ్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణ , మధ్యతరగతి ఆర్థిక స్థితిని కొల్లగొడుతున్నారు. చదువుల పేరుతో బురిడీ కొట్టిస్తూ అధిక ఫీజులు చెల్లిస్తున్న విషయంలో సాక్షాత్తు ఉన్నత న్యాయస్థానామే తీవ్ర వ్యాఖ్యలు చేసినా..ఎన్నోసార్లు తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన చేసినా ఫలితం లేదు.
నిబంధనలు కేశవాయ స్వాహా..
దేదీప్యంగా వెలుగుతున్న కొన్ని కార్పొరేట్ బడులు కనీస నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. డి.ఇ.ఒ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ విద్యావ్యాపార సంస్థకు పూర్తిస్థాయి గుర్తింపు లేదు. స్కూల్ విడిచి వెళ్లే విద్యార్థులకు వేరే మండలంలో ఉన్న బ్రాంచ్ నుండి టి.సి. తదితర ధృవపత్రాలు జారీ చేయిస్తూ పబ్లిక్‌గా గత మూడేళ్లుగా పబ్బం గడుపుకుంటోంది. అంతేకాదు ఈ కార్పొరేట్ విద్యార్థులకు ఆటలు.. పాటలు జాంతానై.. ప్లేగ్రౌండ్స్ కూడా ఎక్కడా కనిపించవు. గుర్తింపు ఫైల్లో చూపించే ఆటస్థలం వాస్తవంగా ఎక్కడా కనిపించదు. కనిపించినా అది ఆటస్థలానికి పనికి రాదు. ఈ నిబంధనలను దగ్గరుండి పర్యవేక్షించి అమలుచేయాల్సిన సంబంధిత అధికారులు మామ్మూళ్ల మత్తులో ఫైళ్ల వరకే సరిపెట్టుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విషయాన్ని జిల్లా స్థాయి సంబంధిత అధికారులతో ప్రస్తావించగా కనీస అవగాహన లేకపోవడం విశేషం. భూకంప ప్రమాద పరిధిలో ఉన్నా ఇక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా నాలుగు అంతస్థుల నిర్మాణం కనిపించడం శోచనీయం. పిల్లల్లో మానసిక ఉల్లాసం.. సృజనాత్మకత, విద్యాభివృద్ధికి ఊరికి ఆమడదూరంలో పాఠశాల నెలకొల్పాలి. అయితే రాబడే ప్రధానాంశంగా పుట్టుకొచ్చే ఈ విద్యాసంస్థలు ప్రధాన వ్యాపార కూడళ్లు, శబ్ధ, వాయు కాలుష్యాల మధ్య కనిపిస్తూ ప్రజానీకాన్ని గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సాయంత్రమైతే ఆయా విద్యాసంస్థలకు చెందిన బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాలు, విద్యార్థుల సైకిళ్లు ఒకేసారి రోడ్లపైకి రావడంతో తీవ్ర రద్దీని నెలకొల్పుతున్నా ట్రాఫిక్ యంత్రాంగం ఎలాంటి ఆంక్షలు విధించడంలో విఫలమైంది. మరోవైపు ఎన్నోఏళ్లుగా పాఠశాలలు నెలకొల్పి జీవనోపాధి పొందుతున్న ఎందరో నిరుద్యోగులు కార్పొరేట్ విద్యావ్యాపారాల ధాటిని ఎదుర్కొనలేక తమ సంస్థలను మూసివేసి రోడ్డునపడ్డారు. జిల్లాలో ఉన్న 569 ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే 35 పాఠశాలలు వరకు మూతపడినట్లు సమాచారం. విద్యావిధానానికి ఇంత విరుద్ధంగా ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం.
చర్యలు తీసుకుంటాం..
గుర్తింపులేని, నిబంధనలు పాటించని పాఠశాలల విషయం తమ దృష్టికి రాలేదు. ఫీజులు వసూలు చేయడం పట్ల కఠినంగా ఏ విద్యాసంస్థ వ్యవహరించినా చర్యలు తప్పవు. అయితే ఏ క్లాస్‌కు ఎంత, ఎలా వసూలు చేయాలన్న మార్గదర్శకాలు ప్రభుత్వం నుండి లేవు. త్వరలో అన్ని ప్రైవేట్ పాఠశాలలను సందర్శించి విద్యాహక్కు చట్టం, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న సంస్థలను గుర్తించి చర్యలు తీసుకుంటాం.
- ఎస్.అరుణకుమారి,
జిల్లా విద్యాశాఖాధికారిణి.

‘సీమాంధ్ర ప్రజల మనోభావాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా’
శ్రీకాకుళం (టౌన్), జూలై 29: సీమాంధ్ర ప్రజల మనోభావాలను యుపిఎ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. సోమవారం ఎపి ఎన్జీవో సంఘం, విద్యార్ధి సంఘం, బార్ అసోసియేషన్ నాయకులు కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యక్తిగతంగా తాను సమైక్యవాదిని అని, గతంలో కూడా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు ఆజాద్, దిగ్విజయ్ సింగ్‌లను కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా రాష్ట్ర విభజన జరుగక ముందే ఏదేదో జరిగిపోయిందంటూ ఊహించుకుంటూ మాట్లాడటం సబబుగా లేదన్నారు. సీమాంధ్ర నాయకురాలిగా ఇక్కడి ప్రజల మనోభావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆమె చెప్పారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ కన్వీనర్ రామ్మోహనరావు ఉన్నారు.

ముక్కలు చేస్తే సహించం!
ఎచ్చెర్ల, జూలై 29: రాష్ట్రాన్ని సహించేది లేదని అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వారంతా తరగతులు బహిష్కరించి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని కేసీఆర్ డౌన్..డౌన్.., యు.పి.ఏ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ నుంచి జాతీయ రహదారిపైకి చేరుకుని సమైక్యాంధ్ర ముద్దు..తెలంగాణ వద్దంటూ గద్గద స్వరంతో నినదించారు. రాజకీయ లబ్ది కోసం కొంతమంది స్వార్ధపూరిత నేతలు తెలంగాణ కావాలని కోరుతున్నారు తప్ప అక్కడ ప్రజలంతా సమైక్యంగా ఉండాలని భావిస్తున్నారని గుర్తుచేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికల ఆధారంగానే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర జె.ఏ.సి రాష్ట్ర నాయకులు బలగ ప్రకాష్, యూనివర్శిటీ జెఎసి ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

డయల్‌యువర్ కలెక్టర్‌కు 13 వినతులు
పాతశ్రీకాకుళం, జూలై 29: డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమానికి సోమవారం 13 వినతులు వచ్చాయి. గ్రామంలో పారిశుద్ధ్య సమస్య ఉందని పొందూరు మండలం ఎల్.వెంకటరమణ ఫిర్యాదు చేశారు. రాజీవ్ యువకిరణాలు ద్వారా శిక్షణ పొందానని, తనకు ఉపాధి కల్పించాలని మెళియాపుట్టికి చెందిన అప్పన్న కోరారు. అలాగే పావలావడ్డీ రుణాలు మంజూరు చేయాలని పలాస మండలానికి చెందిన మణి కోరారు. పాఠశాలకు విద్యుత్ కనెక్షన్లు ఇంతవరకు అందించాలని జి.సిగడాంకు చెందిన ఎన్.ప్రసాదరావు అన్నారు. నాగావళి కాలువ నీరు శివారు భూములకు చేరడం లేదని వీరఘట్టంకు చెందిన జి.రమేష్, వీరితోపాటు మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఎజెసి ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డిఎంహెచ్‌ఒ గీతాంజలి, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.

ఘాట్‌రోడ్ మీదుగా సాగిన షర్మిల పాదయాత్ర
సారవకోట, జూలై 29: మరోప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల చేపడుతున్న పాదయాత్ర సోమవారం ఉదయం మండలం దాసుపురం గ్రామం నుంచి ప్రారంభమైంది. ప్రారంభంలో వైఎస్సార్‌సీపీ ఉపనేత, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, రాష్టక్రమిటీ సభ్యురాలు వరుదు కల్యాణి, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు రాత్రి షర్మిల బస చేసిన శిబిరం వద్ద స్వాగతం పలికారు. అనంతరం దాసుపురం గ్రామస్థులతో కొద్దిసేపు ముచ్చటించిన షర్మిల మూడువేల కిలోమీటర్ల పరిధి దాటేందుకు ఉత్సాహపడుతూ ఘాట్‌రోడ్ మీదుగా తన పాదయాత్రను కొనసాగించారు.
సాధారణంగా జనసంచారం లేని ఘాట్‌రోడ్ మీద కూడా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు అక్కడక్కడా బారులుతీరి షర్మిలకు స్వాగతం పలకడం విశేషం. దాసుపురం గ్రామం దాటిన తరువాత ఘాట్‌రోడ్‌కు ప్రవేశించేముందు పార్టీ మండల కన్వీనర్ బంకి రమణ నవతల గ్రామానికి చెందిన మహిళలు ఎదురువెళ్లి షర్మిలను ఆహ్వానించారు. అక్కడ నుండి నవతల గ్రామం వద్ద షర్మిల కొద్దిసేపు ఆగారు. నవతల ప్రజల నుండి స్వాగత సత్కారాలు స్వీకరించిన అనంతరం నవతల జంక్షన్‌కు చేరుకున్నారు. నవతల జంక్షన్‌లో షర్మిల కోసం ఎదురుచూస్తున్న ప్రజానీకానికి అభివాదం తెలుపుతూ బహిరంగసభకు తరలిరావాలని కోరారు. అక్కడ నుండి భారీ ఊరేగింపుగా జిల్లా నాయకులు, మండల ప్రజలు వెంట రాగా మూడువేల కిలోమీటర్లు దాటే స్థలానికి ధనుపురం గ్రామం పొలిమేరల్లోకి చేరుకున్నారు. ఈమె వెంట జిల్లా నాయకులు అంధవరపు సూరిబాబు, పి.ఎం.జె.బాబు, ఎచ్చెర్ల సూర్యనారాయణ, మాజీ జెడ్పీటిసి చిన్నాల రామసత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఘాట్‌రోడ్‌పై యాత్ర సాగిన కారణంగా పాతపట్నం పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

పట్టణంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నం
శ్రీకాకుళం (టౌన్), జూలై 29: పట్టణంలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, వ్యక్తిగత అజెండాతో అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నాగావళి నదిపై పాతవంతెన తొలగింపులో తాము ప్రత్యామ్నాయం చూపాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా కొంత భాగం తొలగించి విడిచిపెట్టేశారని వాపోయారు. రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంటు ఇంజనీరు వ్యక్తిగత ప్రతిష్టకు పోయి వర్షాకాలం వస్తున్న సమయంలో వంతెనను కూల్చడం వలన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. తాము పదేపదే చెబుతున్నప్పటికీ పట్టించుకోలేదని, ఇంతవరకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదని అన్నారు. కేవలం చుట్టు తిరగడానికి ఆర్టీసీ బస్సును వేయించి చేతులుదులుపుకున్నారని, అయితే ఆ బస్సు సైతం నేడు సరిగా తిరగడం లేదని చెప్పారు. ఇందుకు కారణాలను క్వాలిటీ కంట్రోల్ అధికారులు, విజిలెన్సు అధికారులు విశే్లషించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, గొర్లె కృష్ణారావు, బి.గుప్త తదితరులు పాల్గొన్నారు.

కనీసవేతనం రూ. 12500 ఇవ్వాలి
శ్రీకాకుళం (టౌన్), జూలై 29: మున్సిపాల్టీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 12500 రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం ఈ దీక్షలను ప్రారంభిస్తూ మాట్లాడారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని, చనిపోయిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పిఎఫ్, ఇఎస్‌ఐ వంటి సదుపాయాలు వెంటనే కల్పించాలని కోరారు.
రెగ్యులర్ కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పని కష్టంతో కూడుకున్నదని, అటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు చేసి తమ సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. కార్యక్రమంలో డి.జగదీష్, ఆర్.రమణ, ఎన్.శంకర్రావు, డి.విజయ తదితరులు పాల్గొన్నారు.

ఒకప్పటి బడి..అదో అందమైన గుడి..కానీ
english title: 
c

ఉద్యమాలతో ఇబ్బంది లేదు

$
0
0

విశాఖపట్నం, జూలై 29: అనేక మంది సమరయోధుల కృషి ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం ముక్కలవుతున్నా, జనం మాత్రం రోడ్ల మీదకు రావడం లేదు. వారి మనోభావాలను తెలియచేయడం లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్రం ముక్కలు చేయడానికి కొంతమంది రాజకీయ నాయకులు కనుసైగ చేసినట్టు తెలుస్తోంది. ప్రజల్లో ఏమాత్రం విభజన ప్రభావం లేదని, ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలన్నీ ఉత్తుత్తివేనని కొంతమంది ప్రభుత్వాలకు నివేదించినట్టు తెలుస్తోంది. నేడో, రేపో రాష్ట్ర విభజన జరిగినా, రెండు, మూడు రోజులు ఇక్కడి ప్రజలు ఉద్యమించి, ఆ తరువాత చల్లబడిపోతారని నిఘా వర్గాలు ప్రభుత్వానికి చేరవేసిన సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తుంటే ఇదంతా నిజమనే అనిపిస్తోంది.
నగరంలో ఆరుగురు ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి, మరో ఎంపి ఉన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రాష్టమ్రంతా భగ్గుమంటున్నా, ఇక్కడి ప్రజా ప్రతినిధుల్లో కనీసం ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడ్డం లేదు. ఏ రోజైనా, రోడ్డెక్కి పోరాటానికి దిగారా? ఇందులో అధికార పార్టీ వారికి ఇబ్బంది ఉంటే ఉండచ్చు. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు ఏవిధంగా ప్రత్యేక తెలంగాణ కావాలని భీష్మించుకున్నారో, మరి సమైక్యాంధ్ర కావాలని ఈ ప్రాంత టిడిపి నాయకులు ఎందుకు అడగడం లేదు? జిల్లాలో నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎందుకు బయటకు రావడం లేదు? నగరంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలు చూసే వారెవరికైనా, దాని తీవ్రత ఏమేరకు ఉందో అర్థమవుతోంది. కొంతమంది హోటల్ గదుల్లో కూర్చుని ప్రకటనలు జారీ చేస్తున్నారు. మరికొంతమంది నలుగురు, ఐదుగురు వ్యక్తులతో బయటకు వచ్చి, విభిన్న కార్యక్రమాలు చేసి పత్రికల వారిని సంతృప్తి పరుస్తున్నారు. ఒకరిద్దరు చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు చేసి నిరసన తెలుపుతున్నారు. నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వాదన వినిపించాలంటే ఈ పోరాటం సరిపోతుందా?
నేడో, రేపో తెలంగాణ విభజనపై కేంద్రం ప్రకటన జారీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే, రాష్ట్రానికి వాటిల్లిన నష్టంలో ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు కూడా భాగస్వాములు కాకతప్పదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలను ఉద్యమ బాట పట్టించడంలో ప్రజా ప్రతినిధులు ఏమాత్రం సఫలీకృతులు కాలేకపోయారన్నది వాస్తవం. రాష్ట్రం విడిపోవాలని కోరుకునే వారు కూడా ఇక్కడ లేకపోలేదు. అదే సమయంలో రాష్ట్రం ముక్కలు కాకూడదని అభిలషించే వారు కూడా ఎక్కువమందే ఉన్నారు. వారి మనోభావాలను స్థానిక నాయకులు ఎందుకు గౌరవించడం లేదు? ఇక్కడో విచిత్రమైన విషయం ఏంటంటే, తమ రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకునేందుకు ప్రజల్లో స్పందన లేదన్న సంకేతాలను ప్రభుత్వాలకు అందచేసిన వారిలో ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు కూడా ఉన్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే రాష్ట్ర విభజన జరిగినా, శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నిఘా ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
నగరానికి మరిన్ని అదనపు బలగాలు
* పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా అదుపులో ఉంది
* నగర పోలీస్ కమిషనర్ శివధర్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 29: నగరానికి మరిన్ని అదనపు బలగాలు వస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ శివథర్‌రెడ్డి తెలియచేశారు. సోమవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఇప్పటికే నాలుగు కంపెనీల అదనపు బలగాలు నగరంలో ఉన్నాయని అన్నారు. మరికొన్ని అదనపు బలగాలను పంపించవలసిందిగా ఉన్నతాధికారులను కోరామని ఆయన తెలియచేశారు. మరో రెండు, మూడు కంపెనీల బలగాలు వచ్చే అవకాశం ఉందని తెలియచేశారు. నగరానికి చెందిన పోలీస్ ఫోర్స్ ఎలాగూ ఉందని అన్నారు. ఒకవేళ ఉద్యమం ఉధృతమై శాంతి భద్రతలకు విఘాతం కలగనంతవరకూ ఇబ్బంది లేదని, ఒకవేళ పరిస్థితి చేయి దాటితేనే అదనపు బలగాలను రంగంలోకి దించుతామని ఆయన తెలియచేశారు. ముఖ్యమైన కూడళ్ళలో పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ర్యాలీలు, సభలు, సమావేశాలపై ఎటువంటి నిషేధం విధించలేదని ఆయన చెప్పారు.
విలీనంపై ఉత్తర్వులు నేడు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 28: గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థలో అనకాపల్లి, భీమిలి, మరో పది గ్రామాలను విలీనం చేస్తూ, ఉత్తర్వులు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ ఉత్తర్వుల ఫైళ్ళపై అందరి సంతకాలు పూర్తయినా, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిఓ విడుదల చేయచ్చా? చేయకూడదా? అని మున్సిపల్ శాఖ అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. జిఓ విడుదల చేసుకోవచ్చని ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులు సోమవారమే విడుదల కావల్సి ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బిజీగా ఉండడం వలన వీటిని మంగళవారం ఉదయం జారీ చేయనున్నారని తెలిసింది.

నిఘా వర్గాల నివేదికలు
english title: 
n

నాలుగు రోజుల్లో రైతులకు రైవాడ నీరు

$
0
0

విశాఖపట్నం, జూలై 29: జిల్లాలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితు కారణంగా రైవాడ జలాశయం కింద ఉన్న ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు రైవాడ జలాశయం నుంచి నీటిని వరి పంటకు అందించేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులను సంప్రదించగా, రైవాడ కాలువలో ఉన్న పూడికను తొలగించాలని సూచించారు. రెండు రోజుల్లో ఆ పని పూర్తి చేయాల్సిందిగా జివిఎంసి కమిషనర్‌ను మంత్రి గంటా ఆదేశించారు. ఈ పని పూర్తి కాగానే, శుక్రవారం నుంచి రైతులకు రైవాడ నీరు అందుతుంది.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకం
* పార్లమెంట్‌లో చర్చిస్తే సత్తా చూపిస్తా
* రాజకీయ పార్టీల్లో స్పష్టత రావాలి
* ఎంపి సబ్బం హరి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 29: రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా విభజనకు తాను వ్యతిరేకినని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఎపి ఎన్జీఓ జిల్లా విభాగం అధ్వర్యంలో సమైక్య వాదులు, విద్యార్థులు సీతమ్మధారలోని ఎంపి హరి ఇంటిని సోమవారం ముట్టడించారు. సమైక్యాంధ్రను కోరుకుంటున్న వారిలో తాను మొట్టమొదటి వ్యక్తినని, సమైక్య ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈసందర్భంగా ఉద్యమకారులకు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విడదీయం సామన్యమైన అంశం కాదని, దీనికి శాస్ర్తియ విధానం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై ములాయంసింగ్ యాదవ్ వంటి సీనియర్ రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను నిర్ధ్వందంగా వెల్లడించారని అన్నారు. రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత అజెండాలు, ఓట్లు,సీట్ల కోసం ప్రాంతాల మధ్య వైషమ్యాలకు తెరతీస్తున్నాయని ఆరోపించారు. మేం విభజిస్తాం.. నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటూ రాజకీయ పార్టీల అధిష్టానాలు చేస్తున్న వాదనను ఆయన కొట్టి పారేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరిగితే తన వాదనను విన్పిస్తానని హామీ ఇచ్చారు.
ముందుండి నడిపిస్తారా? నాతో పాటు నడుస్తారా?
సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమస్పూర్తితో ముందుకు రావడాన్ని ఈసందర్భంగా ఆయన కొనియాడారు. మీరు చేస్తున్న ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. సమైక్యాంధ్రను సాధించేందుకు జరుగుతున్న ఉద్యమంలో మీరంతా ముందుండి నన్నునడిపిస్తారా లేనిపక్షంలో నాతోపాటు సమైక్యాంధ్ర సాధనకోసం కలసి నడుస్తారా అని ఎంపి హరి ఉద్యమ కారులను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎవరేమి చేసినా ఈరాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, దానికి సమైక్యతే మార్గమన్న వాస్తవాన్ని పాలకులకు స్పష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, విద్యార్ధి సంఘాలు ముందుకు రావడం హర్షణీయమన్నారు.
ఇదిలా ఉండగా సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని కోరుతూ సమైక్యాంధ్ర ఉద్యమకారులు, ఎన్జీఓ ప్రతినిధులు, విద్యార్థులు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడిని చేపట్టగా ఎంపి హరి మాత్రం వారికి సంఘీభావం తెలుపుతూ తన వైఖరిని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎంపి ఇంటివద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఎంపి ఇంటి వద్ద మొహరించారు. అయితే తాను కరడుగట్టిన సమైక్యవాదినని పేర్కొంటూనే ఉద్యమానికి మద్దతు ప్రకటించడంతో ఆందోళన కారులు హరి ప్రసంగం విని వెనుదిరిగారు. ముట్టడిలో ఎపి ఎన్జీఓ జిల్లా కార్యదర్శి గోపాలకృష్ణ, నగర అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు, ఇతర ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
రెండు నుంచి ఫ్లైఓవర్‌లో రాకపోకలకు అనుమతి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 29: ఆశీల్‌మెట్ట వద్ద జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధులతో జివిఎంసి చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఆగస్టు రెండు మూడు తేదీల్లో ఫ్లైవర్‌పై రాకపోకలకు అనుమతించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాణం పనులు పూర్తి చేసుకున్న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు భావించారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా జరపాలని కూడా భావించారు. వచ్చేనెలలో జరగనున్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం జిల్లాకు రానున్న నేపధ్యంలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఉంటుందని అందరూ భావించారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో సిఎం చేతుల మీదుగా ఫ్లైఓవర్ ప్రారంభించే అవకాశాలు కన్పించడం లేదు. దీంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని యంత్రాంగం నిర్ణయించింది. అధికారికంగా ప్రారంభించకపోయినప్పటికీ రాకపోకలకు అనుమతించాలని భావిస్తున్నారు. లాంఛనంగా ఫ్లైఓవర్‌పై రాకపోకలను ప్రారంభించినప్పటికీ సమయం చూసుకుని అధికారికంగా ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ సోమవారం తనను కలిసిన విలేఖరుల వద్ద వెల్లడించారు. ప్రజలకు దీన్ని అందుబాటులోకి తెచ్చే విషయంపై ప్రభుత్వం నుంచి కూడా సానుకూలత వ్యక్తం కావడంతో ఇక లాంఛనంగా దీన్ని వినియోగంలోకి తెచ్చే అంశంపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఫ్లైఓవర్‌కు నామకరణం విషయంలో ఇంకా స్పష్టత చేకూరలేదని కమిషనర్ వాఖ్యల ద్వారా వెల్లడైంది.

జిల్లాలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితు కారణంగా
english title: 
v

మహిళా సంఘాల ద్వారానే జీతాల చెల్లింపు

$
0
0

విశాఖపట్నం, జూలై 29: పారిశుద్ధ్య విభాగంలో కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించే బాధ్యతను క్రమంగా మహిళా సంఘాలకు అప్పగించే ఆలోచన ఉన్నట్టు జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం గ్రీవెన్స్ అనంతరం తన ఛాంబర్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ కార్మికుల జీతాల నుంచి కోతపెడుతున్న పిఎఫ్,ఇఎస్‌ఐ సొమ్మును వారి ఖాతాలకు జమచేయకుండా కుంభకోణానికి పాల్పడిన సంఘటనల నేపధ్యంలో జివిఎంసి ఆధీనంలోని వైశాఖి మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రస్తుతం జీతాల చెల్లింపు జరుగుతున్నట్టు వివరించారు. ఈకార్యక్రమంపై ఎటువంటి ఆరోపణలు వచ్చేందుకు అవకాశం లేదని, అంతా పారదర్శకంగానే జరుగుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక జివిఎంసి పరిధిలోని అన్ని వార్డుల్లోను ఇదే తీరును కొనసాగించేందుకు ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. ముందుగా రెండో వార్డులో మహిళా సంఘాలకు పారిశుద్ధ్య పనులను అప్పగించనున్నట్టు ఆయన తెలిపారు. దశలవారీగా అన్ని వార్డుల్లోను ఈ ప్రతిపాదన తీసుకువస్తామని, అందుకు న్యాయసంబంధ పరిశీలన జరుపుతున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే గుర్తింపు యూనియన్‌కు పారిశుద్ధ్య పనుల కాంట్రాక్టులు కట్టబెట్టడంపై వస్తున్న విమర్శలపై కూడా ఆయన ఆచితూచి స్పందించారు. దీనిపై కూడా న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకోనున్నట్టు తెలిపారు.
అన్ని జోన్లను హెల్ప్‌డెస్క్‌లు
ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేవిధంగా జివిఎంసి పరిధిలోని ఆరు జోనల్ కార్యాలయాల్లోను హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. హెల్ప్‌డెస్క్‌ల వద్ద జివిఎంసి తరపున ఒక ఉద్యోగిని నియమించి ప్రజలకు దరఖాస్తుల విషయంలో పూర్తి సమాచారాన్ని అందించడంతో పాటు అవసరమైన చెల్లింపుల నిమిత్తం అందుబాటులోనే సౌకర్యం విభాగాన్ని, పక్కనే సిటిజన్ చార్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రెండు జోన్లలో ఈవిధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. సిటిజన్ చార్టర్ ప్రకారం నిర్ణీత వ్యవధిలో దరఖాస్తును పరిష్కరించని పక్షంలో అపరాధరుసుం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరి
జివిఎంసి పరిధిలోని బహుళ అంతస్తుల భవనాల్లో ఫైర్‌సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా అమర్చుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. నగర పరిధిలో 4300 భవనాలను పరిశీలించి ఫైర్‌సేఫ్టీ పరికరాలు లేనట్టు గుర్తించడం జరిగిందని, వీటిలో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, కల్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే వీరికి నోటీసులు జారీ చేయడం జరిగిందని, నిర్ణీత కాలవ్యవధిలోగా స్పందించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 300 విద్యాసంస్థలు, 66 పెట్రోల్ బంక్‌లు, మరో 30 వాణిజ్య సంస్థలు ఉన్నాయని తెలిపారు. నగర పరిధిలో అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న 105 పురాతన భవనాలు ఉన్నట్టు గుర్తించామని, వీరికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకూ 12 భవనాలను కూల్చివేసినట్టు ఆయన తెలిపారు. ప్రమాదకర స్థాయిలో ఉన్న భవనాలను గుర్తించేందుకు అధీకృత ఇంజనీరింగ్ సంస్థలు ఒక్కో భవనానికి 13 నుంచి 20 వేల రూపాయలు ఛార్జీలుగా వసూలు చేస్తున్నాయని తెలిపారు. సకాలంలో స్పందించని పక్షంలో తామే భవనాన్ని కూల్చి ఖర్చులను యజమానుల నుంచి వసూలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. జివిఎంసి పరిధిలో ఫైళ్ల పరిష్కారం విషయంలో చోటుచేసుకుంటున్న జాప్యాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కమిటీని నియమించినట్టు కమిషనర్ తెలిపారు. ఫైళ్ల క్లియరెన్స్ విధానాన్ని సరళతరం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
జివిఎంసిలో భీమునిపట్నం, అనకాపల్లి సహా 10 పంచాయతీల విలీనానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యే అవకాశాలున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉత్తర్వులు అందగానే పరిపాలనా సంబంధమైన ప్రక్రియను చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే రెండు మున్సిపాలిటీలు, 10 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించామని, ఉత్తర్వులు జారీకాగానే రికార్డులు స్వాధీనం చేసుకోవడంతో పాటు అధికారిక కార్యకలాపాలను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా చేపట్టడం జరుగుతుందని, నిబంధనల ప్రకారం విలీన ప్రాంతాలతో కలిపి 81 వార్డులు ఏర్పాటు కానున్నాయని తెలిపారు.
పిసిపిఐఆర్‌లో పర్యావరణ అధ్యయనానికి 7 సంస్థల ఆసక్తి
* వుడా విసి యువరాజ్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 29: కాకినాడ - విశాఖపట్నం తీరప్రాంతంలో రానున్న పిసిపిఐఆర్ పరిధిలో జీవధార వనరులు, పర్యావరణం, పరిసరాల పరిరక్షణకు పెద్దపీట వేయనున్నట్టు వుడా ఉపాధ్యక్షుడు ఎన్ యువరాజ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని 10 మండలాల పరిధిలో 97 గ్రామాలను కలుపుకుని 640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న కారిడార్‌లో భూభాగంతో పాటు తీరప్రాంతం, సముద్ర జలాలు, ఆవాస ప్రాంతాల్లో ఎటువంటి పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలన్న అంశంపై విస్తృత చర్చ జరుగుతోందని ఆయన వెల్లడించారు. పారిశ్రామికాభివృద్ధికి ఎటువంటి విఘాతమేర్పడకుండా చేపట్టాల్సిన శాస్ర్తియ విధానాలపై సమగ్ర ప్రణాళిక నిమిత్తం ఏడు సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈసంస్థల ప్రతినిధులతో తన కార్యాలయంలో సోమవారం ఆయన చర్చించారు. ఇప్పటికే పర్యావరణం, కోస్తా నియంత్రణ మండలి నిబంధలపై అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. బిడ్డింగ్ ద్వారా ఎంపికైన సంస్థ పిసిపిఐఆర్ పరిధిలో మూడు సీజన్లకు సంబంధించి మెరైన్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అధ్యయనం నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రీబిడ్ అనంతరం నిపుణుల కమిటీ ఆసక్తి కనబరచిన సంస్థల అనుమానాలను నివృత్తి చేస్తుందన్నారు. టెండర్ ప్రక్రియలో పాల్గొనే సంస్థలు ఆగస్టు 12లోగా తమ బిడ్లను సమర్పించాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన సంస్థను నిపుణుల కమిటీ ఎంపిక చేస్తుందని, కమిటీ సిఫార్సుల మేరకు పిసిపిఐఆర్ బోర్డు సమావేశంలో చర్చించి సముద్ర పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనానికి సంస్థను ఎంపిక చేస్తుందని తెలిపారు. పిసిపిఐఆర్ పరిధిలోకి వచ్చే పరిశ్రమలు, ఇతర ఉత్పాదక సంస్థల ప్రభావం తీర సముద్ర జలాలు, సముద్ర జీవరాశులపై ఎటువంటి ప్రభావం చూపకుండా చేపట్టాల్సిన మార్గాలు, శాస్ర్తియ విధానాలు ఈ అధ్యయనంలో ఉంటాయని తెలిపారు.

* అన్ని జోనల్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు * ఫైర్ నిబంధనలు పాటించకపోతే చర్యలు * జివిఎంసి కమిషనర్
english title: 
m

వుడా ప్లాట్ల వేలానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

$
0
0

విశాఖపట్నం, జూలై 29: వుడా సొంతంగాను, ప్రైవేటు భాగస్వామ్యంలోను అభివృద్ధి పరిచిన లేఅవుట్‌లలో ప్లాట్లను వేలం ద్వారా కేటాయించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు విసి యువరాజ్ తెలిపారు. మొత్తం 15 లేఅవుట్‌లలో 152 ప్లాట్‌లను విక్రయించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈనెల 14,15 తేదీల్లో వేలం ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.
కాలుష్యాన్ని నియంత్రించాలి
* ఆందోళనకు తెదేపా సిద్ధం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 29: విశాఖ పోర్టు నుంచి బొగ్గు ఇతర ఖనిజాలను తరలించేందుకు రోడ్డు రవాణా విధానాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విరమించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే వేగన్ల ద్వారా రవాణ చేయడం వల్ల కాలుష్య ప్రభావం తగ్గడంతో పాటు ప్రమాదాలు నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. కొంతమంది ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల వత్తిడికి తలొగ్గిన అధికారులు రోడ్డు మార్గం గుండా బొగ్గును తరలించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల పర్యావరణ పరంగా ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో పోర్టు చైర్మన్‌గా అజయ్‌కల్లాం ఉన్న కాలంలో దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు పాత పద్ధతిలో లారీ ఆపరేటర్లకు అవకాశం కల్పించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నగర పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ చైనా వంటి ఇతర దేశాల్లో ఇప్పటికీ పర్యావరణానికి, ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండానే రవాణా జరుగుతోందని వివరించారు. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ తరపున ఆందోళనకు తాము సిద్ధమని హెచ్చరించారు.
అక్టోబర్ 12న విశాఖలో రెహ్మాన్ సంగీత విభావరి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 29: భారత సంగీత దిగ్గజం ఎఆర్ రెహ్మాన్ సంగీత విభావరి అక్టోబర్ 12న విశాఖలో నిర్వహించనున్నారు. భారతదేశంలో రెహ్మాన్ సంగీత ప్రదర్శనల్లో భాగంగా కోల్‌కత్తా, జైపూర్, అహ్మదాబాద్ పట్టణాలతో పాటు విశాఖలో సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. దక్షిణ భారతదేశం ప్రదర్శనకు విశాఖ నగరాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే ఈసంగీత కార్యక్రమానికి సంబంధించి టెకెట్ట విక్రయాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నారు. సంగీత దర్శకుడు రెహ్మాన్ తన ప్రమోటర్లు టెక్నోఫ్రంట్, రాపోర్ట్ గ్లోబల్ ఈవెంట్స్‌తో కలిసి ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఏప్రిల్ మీడియా ప్రతినిధి కోమల ఆర్ గౌడ ఒక ప్రకటనలో తెలిపారు.

వుడా సొంతంగాను, ప్రైవేటు భాగస్వామ్యంలోను
english title: 
v

సమైక్యాంధ్రపై స్పష్టమైన హామీనివ్వాలి: యువజన జేఏసి

$
0
0

విశాఖపట్నం, జూలై 29: రాష్ట్ర సమైక్యతకు కట్టుబడి ఉండాలని, ఇప్పటికైనా సమైక్యాంధ్రపై స్పష్టమైన హామీనివ్వాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ కమిటీ, ఏపీఎన్జీవో అసోసియేషన్, ఏపీ రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఎంవిపి కాలనీలోనున్న కేంద్ర సహాయమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. ఇందులో పెద్ద ఎత్తున విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘రాష్ట్ర విభజన వద్దు...సమైక్యమే ముద్దు’ అంటూ కెసిఆర్, కోదండరామయ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. సమైక్య నినాదాలతో ఈ ప్రాంతం హోరెత్తింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వీరందర్ని చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిస్థితులు కాస్త స్వల్ప ఉద్రిక్తతకు దారితీసాయి. ఢిల్లీలో ఉన్న పురంధ్రీశ్వరి పర్సనల్ సెక్రటరీ ద్వారానైనా సమాచారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అనుకూలమైన ప్రకటన చేస్తే సీమాంధ్రలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయాలని లేనిపక్షంలో రాజకీయ జీవితం లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఎటువంటి పరిస్థితుల్లోను రాయలసీమ తెలంగాణకు అంగీకరించమన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. సమైక్యాంధ్ర యువజన జేఏసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వస్తే యువకులు ఉపాధి అవకాశాలను కోల్పోతారని, కార్మికులు, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎంపీలు,కేంద్ర మంత్రులు తమ పదవుల కోసం స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. పురంధ్రీశ్వరి ఇంతవరకు సమైక్యాంధ్రపై ఎటువంటి ప్రకటన చేయలేదని, ఇప్పటికైనా స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, కోస్తాతీర ప్రాంతంనందు సుదీర్ఘకాలం నుండి అభివృద్ధి లేక నిరుద్యోగ సమస్య తీవ్రమైందన్నారు. దీర్ఘకాలికంగా అభివృద్ధి అంతా హైదరాబాద్‌నందు చేసి పెద్దపెద్ద కంపెనీలు అక్కడ ఏర్పాటై ఐటి అభివృద్ధి అంతా అక్కడక్కడే చేసి ఇపుడు దీనిని తెలంగాణాలో కలిపితే చూస్తూ ఊరుకోమన్నారు. నదీ జలాలు, విద్యుత్ సమస్యలు దీనివల్ల ఉత్పన్నమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎపీ రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్.నాగేశ్వరరెడ్డి, ఏపీఎన్జీవో అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మలాకుమారి, ఎన్‌ఐఆర్, సమతా కాలేజీలకు చెందిన విద్యార్థులు, ఎన్జీవో, రెవెన్యూ సర్వీసుల సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
* అరెస్టులు
ముట్టడి కార్యక్రమంలో పాల్గొని నిరసనలు తెలిపిన ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, సమైక్యాంధ్ర యువజన జెఏసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్, ఎన్జీవో నగర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, జవహార్‌లాల్ తదితర ప్రతినిధులను పోలీసులు వాహనాల్లోకి ఎక్కించి త్రి టౌను పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కేంద్ర వైఖరికి నిరసనగా ఉద్యమిస్తాం
* లేదంటే సమ్మెకు దిగుతాం
విశాఖపట్నం, జూలై 29: సమైక్యాంధ్రపై స్పష్టమైన హామీని ప్రకటించకపోతే సమ్మెకు దిగుతామని ఆర్టీసీ ఎన్‌ఎంయు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.శ్రీనివాసరావు హెచ్చరించారు. మద్దిలపాలెం యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లోను రాష్ట్ర విభజనను జరగనీయమని, ఇందుకోసం వివిధ రూపాల్లో ఉద్యమిస్తామన్నారు. దశలవారీ ఉద్యోమంలో భాగంగా మంగళవారం జిల్లానందు వాల్తేరు, విశాఖపట్నం, మద్దిలపాలెం, సింహాచలం, గాజువాక, స్టీల్‌సిటీ, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డిపోల్లో మధ్యాహ్నాం భోజన విరామ సమయంలో ధర్నాలు, గేటు మీటింగ్‌ల ద్వారా కార్మికులను ఉద్యమానికి సిద్ధం చేస్తామన్నారు. ఈ నెల 31వ తేదీన జిల్లానందు కార్మికులు డిమాండ్లతో కూడిన బ్యాడ్జిలు ధరించి విధులు నిర్వహించం, జిల్లా ప్రజలందరికీ సమైక్య రాష్ట్రం ఆవశ్యకతను తెలియజెప్పాలని నిర్ణయించినట్టు చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుదాం, రాష్ట్ర విభజనను వ్యతిరేకరిద్దాం, తెలుగుజాతి ఐక్యతకు నడుం బిగిద్దాం అనే నినాదాలతో ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. ప్రధానంగా ఈ నెల 31న సాయంత్రం ఐదు గంటలకు ఆర్టీసీకాంప్లెక్స్ నుండి మద్దిలపాలెం కాంప్లెక్స్ వరకు ఆర్టీసీ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం మానవహారం ఏర్పాటు ద్వారా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అప్పటికీ సమైక్యాంధ్రపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే ఆర్టీసీ నందు అవసరమైతే సమ్మె దిశగా కూడా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమైక్యాంధ్ర యువజన జెఎసి రాష్ట్ర కన్వీనర్ ఆడారి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టే ఉద్యమంలో ఆర్టీసీలో కీలకమైన ఎన్‌ఎంయు భాగస్వామ్యం కావడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించే ప్రకటనలు చేస్తే తెలంగాణాలో కంటే సీమాంధ్రలో ఉద్యమాలు తీవ్రంగా ఉంటాయన్నారు. మంత్రులు, ఎంపీలు తమ పదవుల కోసం దురుద్దేశ్యంతో సమైక్యాంధ్రపై ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల జిల్లా కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ అంతా కలిస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలమన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు అనుకూలమైన ప్రకటన చేస్తే నిరవధిక సమ్మెకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంయు జోనల్ కార్యదర్శి పివివి మోహన్, జిల్లా కార్యనిర్వాహాక అధ్యక్షుడు సిహెచ్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కె.నందగోపాల్, అర్బన్ డివిజన్ కార్యదర్శి ఏకె శివాజీ, రూరల్ డివిజన్ అధ్యక్ష.కార్యదర్శులు ఎంవిఆర్ మూర్తి, పిఎన్ రావు, జిల్లా కార్యవర్గసభ్యులు, డిపో కార్యదర్శులు, అధ్యక్షులు హాజరయ్యారు.

* రాజకీయ జీవితం లేకుండా చేస్తాం: ఏపీ ఎన్జీవో * కేంద్ర సహాయమంత్రి పురంధ్రీశ్వరి ఇళ్ళు ముట్టడి * సంఘాల ప్రతినిధులు అరెస్టు
english title: 
s

జూనియర్ డాక్టర్ల సమ్మె

$
0
0

విశాఖపట్నం, జూలై 29: జూనియర్ వైద్యులు మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించాలన్న నిబంధనలను తప్పనిసరి చేయడాన్ని నిరసిస్టూ జూడాలు నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించారు. దీనిలోభాగంగా మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి కేజిహెచ్‌తోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు, సాధారణ సేవలను బహిష్కరిస్తున్నారు. ఈ సమ్మెలో పిజిలు, ఎంబిబిఎస్, హౌస్‌సర్జన్లు కలిపి 600మందికి పైగా పాల్గొంటారు. వైద్య విబాగంలో పర్మినెంట్ పోస్టులు భర్తీ చేస్తే ‘బ్యాండెడ్ లేబర్’ అవసరం ఉండదని జూనియర్ వైద్యుల సంఘ ప్రతినిధి మహమ్మద్ సన్వాజ్ ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. వైద్యులకు స్ట్ఫైండ్‌లు ఇవ్వడంలేదని, గత ఏడాది నుంచి వైద్యులకు జీతాల్లేవని ఆందోళన వ్యక్తంచేశారు. ఎంబిబిఎస్ ఐదున్నరేళ్ళు, పిజి మరో మూడేళ్ళు మొత్తం ఎనిమిదిన్నర సంవత్సరాలపాటు ఈ వృత్తిని పూర్తి ఆ తరువాత మళ్ళీ ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించాలనే నిబంధనతో వృధా చేయడమే అవుతుందన్నారు. ఏ ప్రొఫెసనల్ కోర్సుల్లోను ఈ విధానం లేదన్నారు. వేల పోస్టులు ఖాళీ ఉండగా, వీటి భర్తీ ఏళ్ళుగడుస్తున్నా జరగడంలేదని, అటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో బలవంతపు నిబంధనలతో జూడాలను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
* సమ్మె సైరన్‌తో రోగుల్లో ఆందోళన
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒడిషా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి ఇక్కడకు చేరుకునే రోగులకు ఇక్కడి కేజిహెచ్‌లో వైద్యం అందే పరిస్థితులు కనిపించడంలేదు. సాధారణ రోజుల్లోనే అంతంత మాత్రంగా అందే వైద్య సేవలు జూడాల సమ్మెతో మంగళవారం ఉదయం నుంచి నిలిచిపోతున్న నేపధ్యంలో సాధారణ, దీర్ఘకాలిక రోగాలతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే రోగుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఆసుపత్రి వర్గాల్లో నెలకొంది.
* ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం
సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళనను దృష్టిలోపెట్టుకుని కేజిహెచ్ సాధారణ, అత్యవసర వైద్యులకు అంతరాయం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్‌బాబు తెలిపారు. రోజువారీ సేవలందించేందుకు 470 మంది వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని, వీరు కాకుండా సర్వీసు పిజిలను ప్రత్యామ్నాయ సేవలకు అందుబాటులో ఉంటారన్నారు.

పోలింగ్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
విశాఖపట్నం, జూలై 29: జిల్లాలో గత రెండుదశల్లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో అనుభవాల దృష్ట్యా మూడవ విడత నిర్వహిస్తున్న ఎన్నికలను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వి.శేషాద్రి అన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో మండల అధికారులతో ఈనెల 31న నిర్వహించబోయే పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లను వీడియో కానె్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బ్యాలెట్ పేపరులో గుర్తుల విషయమై గత రెండు దశలుగా జరిగిన ఎన్నికల్లో కొన్ని పంచాయితీల్లో సమస్యను తలెత్తాయని అలాంటివి పునరావృతం కాకుండా ఒకటికీ రెండుసార్లు బ్యాలెట్ పేపరు చెక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మేజర్ పంచాయితీలైన చోడవరం, కశింకోట, తుమ్మపాల, మాడుగుల, పూడిమడకల్లో అవసరమైతే ఎక్కువ టేబుల్స్ వేసి ఓట్లను లెక్కించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను ముందుగా లెక్కించాలన్నారు. జిల్లా లెక్కింపు సాయంత్రం ఆరులోపు పూర్తి చేయాలని, అవసరమైతే లైటింగ్ సదుపాయం జనరేటర్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ప్రత్యేక అదికారులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గత రెండు దశల ఎన్నికల్లో మధ్యాహ్నాం రెండు దాటినా ఓట్ల లెక్కింపు ప్రారంభంకాలేదని, ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోను రెండు గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభంకావాలన్నారు. 2.30 గంటలకు కంట్రోల్‌రూమ్‌కు ఓట్లు లెక్కింపు ప్రారంభమైందని అన్ని మండల కేంద్రాల నుండి సమాచారం అందాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎన్నికల సిబ్బంది ఘర్షణ వాతావరణానికి పాల్పడితే ప్రజా ప్రాతినిధ్య చట్టాల ప్రకారం, నేరంగా పరిగణించి కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ ఖచ్చితమైన ఆదేశాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో కావాల్సినన్ని టేబుల్స్ వేసి పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. మంగళవారం 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరాలన్నారు. ఏమైనా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితులుంటే వీడియో తీయించాలన్నారు.

నేటి నుంచి అత్యవసర, సాధారణ వైద్య సేవల బహిష్కరణ * కేజిహెచ్ ఓపి గేటు వద్ద నిరసన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం: సూపరింటెండెంట్
english title: 
j

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రతిబింబించాలి

$
0
0

విజయనగరం, జూలై 29: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రస్ఫుటించేలా ఉండాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. సోమవారం తన చాంబర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రస్ఫుటించేలా శకటాలు, స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. శకటాల ఏర్పాటు బాధ్యతను డిఆర్‌డిఎ పిడి, స్టాళ్ల ఏర్పాటు బాధ్యతను డ్వామా పిడి పర్యవేక్షించాలన్నారు. వేడుకలు నిర్వహించే ప్రాంతంలో ప్రథమ చికిత్స కేంద్రంతోపాటు చిన్న వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిఎంహెచ్‌ఒను ఆదేశించారు. ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసా పత్రాల ఎంపికకు ఎజెసి చైర్మన్‌గా సిపిఒ, డిఆర్వో, ఐటిడిఎ పివో డిఆర్‌డిఎ పిడిలతో కూడిన కమిటీని కలెక్టర్ నియామకం చేశార. మండల, డివిజన్ స్థాయిల్లో కాకుండా జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలందించిన వారికే ప్రశంసా పత్రాలకు ఎంపిక చేయాలన్నారు. 8లోగా జాబితాను సమర్పించాలన్నారు. వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్ఛేయనున్న మంత్రి సందేశాన్ని 7లోగా పూర్తి చేసి జిల్లా కలెక్టర్ ఆమోదంతో 8న మంత్రికి అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు ఆయా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికలను 3లోగా సిపిఒకు, ఐదో తేదీలోగా డిపిఆర్వోకు అందజేయాలన్నారు. సిపిఒ ధ్రువీకరించిన అంకెలను మాత్రమే అధికారికంగా మంత్రివర్యుల సందేశంలో పొందుపరచాలని ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు బ్యారెక్స్‌లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను డిఇఒకు, రాజీవ్ విద్యా మిషన్ పిఒ, బీసీ సంక్షేమాధికారి, సాంఘీక సంక్షేమ శాఖ డిడి సహకారం అందించాలన్నారు. అదే విధంగా సాయంత్రం ఆనందగజపతి ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా డిపిఆర్వోను ఆదేశించారు. పోలీసు, కోరుకొండ మార్చ్ఫాస్ట్ నిర్వహించాలన్నారు. కవాతు మైదానంతోపాటు ఆనందగజపతి ఆడిటోరియటంలో పరిసరాలను శుభ్రపరచి మంచినీటి సౌకర్యం కల్పించాల్సిందిగా మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎజెసి యుసిజి నాగేశ్వరరావు, డిఆర్వో వెంకటరావు, ఆర్డీవో రాజకుమారి, డిఆర్‌డిఎ పిడి జ్యోతి, డ్వామా పిడి శ్రీరాములనాయుడు, ఐసిడిఎస్ పిడి శ్రీనివాస్, డిఇఒ కృష్ణారావు, ఆర్వీఎం పిఒ వెంకటరమణలు పాల్గొన్నారు.
‘అటవీ భూముల అభివృద్ధికి
ప్రణాళికలు’
పాచిపెంట, జూలై 29: అటవీ భూముల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అటవీశాఖ చీఫ్ కన్సల్వేటర్ ఎ భరత్‌కుమార్ (విశాఖ) చెప్పారు. పెద్దగెడ్డ జలాశయ పరిసర ప్రాంతాల్లోని అటవీ భూములను సోమవారం ఆయన పరిశీలించారు. జలాశయ సమీపాన మడివలస, ఎగువ కుమ్మరివలస వద్ద గల 38 హెక్టార్ల అటవీ భూములను పరిశీలించారు. పెద్దగెడ్డ జలాశయం నిర్మాణంతో ఈ ప్రాంత అటవీ భూములు ఎంతమేరకు ముంపునకు గురయ్యాయి? భవిష్యత్‌లో ఏమైన అటవీ భూములకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయా? అని పెద్దగెడ్డ డిఇ రాజారావును సిసిఎఫ్ అధికారి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గల అటవీ భూముల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ముఖ్యంగా నర్సరీల పెంపకంలో ఈ ప్రాంత భూములకు అనుకూలమైన మొక్కలు పెంచే ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈయనతోపాటు డిఎఫ్‌ఒ ఐకెవి రాజు, సామాజిక అటవీ శాఖ డిఎఫ్‌ఒ సిహెచ్ సూర్యనారాయణ, సాలూరు రేంజర్ గాంధీ పాల్గొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రస్ఫుటించేలా ఉండాలని జిల్లా కలెక్టర్
english title: 
s

తిప్పలవలసలో ఉద్రిక్తత: పోలీస్ పికెట్ ఏర్పాటు

$
0
0

డెంకాడ, జూలై 29 : పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని తిప్పలవలసలో కాంగ్రెస్ మద్దతుదారు వాకపల్లి దానయ్యమ్మ సర్పంచ్‌గా గెలుపొందడంతో గ్రామంలో విభేదాలు చెలరేగాయి. ఓటమి పాలైన వర్గానికి చెందిన గ్రామస్తులు తిట్లపురాణం అందుకోవడంతో ఒకరికొకరు కోట్ల్లాటకు దిగారు. ఈ ఘర్షణలో 25 మందికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పికెట్ ఏర్పాటు చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, ఎస్సీ కార్తికేయ, ఎఎస్పీ టి.మోహనరావు, ప్రాంతాన్ని సందర్శించారు. గ్రామంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడే వరకు పికెట్ కొనసాగిస్తామని తెలిపారు. డిఎస్పీ కృష్ణప్రసన్న, సిఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై రామారావు, ఆర్డీవో రాజకుమారి, తహశీల్దార్ పద్మావతి గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఎంపి ఇంటి ముందు ఎన్జీవోల నిరసన
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 29: సమైక్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సోమవారం కోట జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎంపీ ఝాన్సీలక్ష్మి ఇంటి వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ సమైక్యాంధ్ర కోసం ఎంపీ రాజీనామా చేయాలని ఎన్జీవోలు నినాదాలు చేశారు. దీనికి ఎంపి ఝాన్సీలక్ష్మి స్పందిస్తూ అందరి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తానొక్కరు రాజీనామా చేయడం వల్ల ఫలితం ఉండదని అన్నారు. అందరి మాటే.. తన మాట అని బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో అధ్యక్షుడు ప్రభూజీ, విఆర్వో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, రమణమూర్తి, పింఛనర్ల సంఘం అధ్యక్షుడు పెద్దింటి అప్పారావులతోపాటు పలువురు ఎన్జీవోలు, విద్యార్థులు పాల్గొన్నారు.

పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు
english title: 
t

ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు

$
0
0

విజయనగరం (్ఫర్టు), జూలై 29: విజయనగరం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహారదీక్షలను చేపట్టారు. రెండురోజులపాటు చేపట్టనున్న ఈ దీక్షలను ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి పి.్భనుమూర్తి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ డిపో పరిధిలో చీపురుపల్లి బస్ కాంప్లెక్స్ ఎటిబి ఏజెంట్ సీక్రెట్ కోడ్‌తో గుర్తు తెలియని వ్యక్తులు సైబర్ నేరానికి పాల్పడ్డాన్నారు. అయితే ఈ సంఘటన జరగడానికి కారకులైన పెద్ద ఉద్యోగులను విడిచిపెట్టి అమాయకులైన కిందస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. శాఖాపరమైన దర్యాప్తు కూడా ముగిసిందన్నారు. అయితే డిపోక్లర్క్ ఎంఎస్‌ఎన్‌రాజు, సిస్టిమ్ సూపర్‌వైజర్ లక్ష్మిని సస్పెండ్ చేశారన్నారు. ఈ వ్యహారంతో వీరికి సంబంధం లేకపోయినప్పటికీ అక్రమంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా సంబంధిత డిపో అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి పి.్భనుమూర్తి మాట్లాడుతూ అక్రమంగా సస్పెండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జోనల్ అధ్యక్షుడు పెదమజ్జి సత్యనారాయణ, డిపో నాయకులు పరమహంస, టెక్కలి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నెలివాడలో ఇరువర్గాల ఘర్షణ: 8 మందికి గాయాలు
బొండపల్లి, జూలై 29 : మండలంలోని నెలివాడ గ్రామంలో సోమవారం జరిగిన ఇరువర్గాల ఘర్షణలో ఎనిమిది మంది గాయపడగా 12 మందిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో ఒక వర్గంలో కొమ్మ శంకరరావు, మాకాల సూర్యారావు, నెట్టి రామలక్ష్మి, కల్ది కృష్ణవేణిలు గాయపడగా మరో వర్గంలో కునుగు నాగేంద్ర, శీర సత్యవతి, కునుకు అప్పలనాయుడు, కునుకు సావిత్రిలు గాయపడ్డారు. కునుకు నాగేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు కొమ్మ శంకరరావు, వనపర్తి పెంటాజీ, కల్ది రఘుబాబు, సాలాపు అప్పలబాస్కరరావు, కొండ కృష్ణ, పెంద్యాల శ్రీనివాసరావుపై కేసు నమోదు చేయగా, కల్ది కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కునుకు మారినాయుడు, పురమనేని బంగారునాయుడు, కెల్ల సూరి, కొండపల్లి సంతోష్‌కుమార్, పురంనేని పైడినాయుడులపై కేసు నమోదు చేసారు.
సీఎం ద్వారానే
సమైక్యాంధ్ర సాధ్యం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 29: రాష్ట్రం సమైక్యాంధ్రగా ఉండాలంటే అది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రుల ద్వారానే సాధ్యమవుతుందని ఎన్జీవో సంఘం రాష్టన్రాయకులు పేడాడ జనార్థనరావు అన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సీమాంధ్ర అభివృద్ధి జరగాలంటే మరో 30 ఏళ్లు సమయం పడుతుందని అన్నారు. అందువల్ల సమైక్యాంధ్ర కోసం మంత్రులు, ముఖ్యమంత్రి పాటు పడాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం ఎంపీలు కేంద్రంపై వత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎంపీలు మంత్రి పదవులతో సరిపెట్టుకున్నారే తప్ప, రాష్ట్రం కలసి ఉండటానికి గట్టి పోరాటం చేయకపోవడమే కారణమన్నారు. అందువల్ల తాము ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులపై విశ్వాసం ఉంచుతున్నామని తెలిపారు. సమైక్యాంధ్రగానే ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సమైక్యవాదులు ఏకం కావాలన్నారు.
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
గజపతినగరం, జూలై 29 : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దేవర ఈశ్వరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడుతూ మంగళవారం కూడా విధులు బహిష్కరిస్తామన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అభివృద్ది కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పాలన స్థంబించి ప్రాంతీయ విద్వేశాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పుతుందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదని ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. సమైక్యంగా ఉండటమే మేలు అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు చప్పా తిరుపతిరావు, గండి అప్పలనాయుడు, రెడ్డి శ్రీనివాసులనాయుడు, యు.రమేష్‌రాజు, కె.రామునాయుడు, గండి విద్యాసాగర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో ద్రాక్షతోట!
బొబ్బిలి, జూలై 29: కృషి ఉంటే ఎటువంటి పంటలనైన పండించవచ్చునని సాలా మురళీకృష్ణ నిరూపించారు. గాంధీ బొమ్మ సమీపంలో ఉన్న తన ఇంటి వద్ద ద్రాక్ష తోట వేసి పలువురిని అబ్బురపరుస్తున్నారు. ఏడాది క్రితం ఇంటి వద్ద ద్రాక్ష మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆ తోట కాపుకొచ్చి గుత్తుగుత్తులు కాసి చూపరులను ఆకట్టుకుంటోంది. ద్రాక్ష తోటకు అనువైన భూమి లేకపోయినా ఇంటి వద్దే ద్రాక్ష పాదులను వేసి పెంచారు. ఏడాది నుంచి ఈ తోట కాపు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటకు సేంద్రియ ఎరువు అధికంగా వినియోగించడం ద్వారా మంచి దిగుబడి వచ్చిందన్నారు. ద్రాక్ష తోటను మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయాధికారుల నుంచి మరిన్ని సూచనలు, సలహాలు తీసుకుని సస్యరక్షణ చర్యలు చేపడితే మరింత ఆదాయం లభించి ఉండేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోను ద్రాక్షను విస్తారంగా పండించవచ్చునని సాలా మురళీకృష్ణ నిరూపించారు.
బరంపురానికి కొత్త సర్వీసు
పార్వతీపురం, జూలై 29: పార్వతీపురం ఆర్టీసీ డిపో నుండి వచ్చే నెల ఒకటో తీదీ నుంచి బరంపురానికి కొత్త సర్వీసును నడుపుతామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పి అప్పన్న తెలిపారు. సోమవారం ఆయన పార్వతీపురం ఆర్టీసీ డిపోను పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ పార్వతీపురం నుండి అంతర్రాష్ట సర్వీసును నడిపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సర్వీసును వీరఘట్టాం, పాలకొండ, శ్రీకాకుళం, ఇచ్చాపురం మీదుగా నడపనున్నట్టు తెలిపారు. ఈ సర్వీసును ఈ ప్రాంత ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించడానికి ఆర్టీసీ సిబ్బంది అంకిత భావం కృషి చేయాలన్నారు. సంస్థ మనుగడకు కృషి చేసిన సిబ్బందికి సంస్థ తగిన విధంగా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఆర్టీసీ డిపోమేనేజర్ బివి ఎస్ నాయుడు, చీఫ్ ఇనస్పెక్టర్ సత్యనారాయణ, ఎంఎఫ్ డిజె సందరం పాల్గొన్నారు.

విజయనగరం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ
english title: 
rtc

సీమాంధ్ర ఎంపిలు, మంత్రులు చరిత్ర హీనులుగా మిగులుతారు

$
0
0

గుంటూరు , జూలై 30: గత నాలుగు రోజులుగా ప్రత్యేక తెలంగాణ అంశంపై ఢిల్లీలో మంతనాలు జరుపుతుంటే సీమాంధ్ర ఎంపిలు, మంత్రులు చేతగాని దద్దమ్మల వలె చోద్యం చూస్తున్నారని, వీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని తెలుగుదేశం పార్టీ విప్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారని సీమాంధ్ర ప్రజలు ఎంపిలను ఎన్నుకుంటే వారి స్వార్థ ప్రయోజనాలను కాపాడుకుంటూ, అధిష్ఠాన తొత్తులుగా మారి రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలిచ్చారన్నారు.
సమైక్యాంధ్ర కోసం ఎలాంటి ఉద్యమాలు చేపట్టకుండా ఇక్కడి ప్రాంత ప్రజలను మోసం చేశారని, ఇప్పటికైనా రాజీనామాలు చేసి కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో చిట్టాబత్తిన చిట్టిబాబు, కసుకుర్తి హనుమంతరావు, రూబెన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దారుణం
* చరిత్రలో చీకటిరోజుగా మిగిలిపోతుంది
* వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ అప్పిరెడ్డి
గుంటూరు, జూలై 30: తెలుగు ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని ఆకాంక్షించి ఆత్మబలిదానం చేసిన మహనీయుల త్యాగాలను విస్మరించి యుపిఎ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణమైన విషయమని, ఇది చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు వారి గుండెల్లో గునపాలు గుచ్చిందన్నారు. తెలుగు వారి కోసం ఆత్మ బలిదానం చేసి పొట్టి శ్రీరాములు ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య వాదాన్ని వినిపించే వారికి మంత్రి పదవులు ఇచ్చి కేంద్రం నోరు మూయిచిందని ఆరోపించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసమే తమ పార్టీ ఆవిర్భవించిందని చెప్పుకునే తెలుగదేశం నాయకులు సైతం నోరు మెదపక పోవడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. చరిత్రలో 2013 జూలై 30 చీకటి రోజుగా నిలిచిపోతుందన్నారు. ఇలాంటి నేతలను ఎన్నుకోవడం తెలుగు ప్రజల దురదృష్టమన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం పార్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నట్లు అప్పిరెడ్డి చెప్పారు. విలేఖర్ల సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, పార్టీ నాయకులు నసీర్ అహమ్మద్, సూరగాని శ్రీనివాసరావు, విజయకిషోర్, షౌకత్, గులామ్ రసూల్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

సెంట్రల్ జోన్ మహిళల క్రికెట్ విజేత కృష్ణాజట్టు
గుంటూరు , జూలై 30: స్థానిక జెకెసి కళాశాల ఆవరణలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఎసిఎ సెంట్రల్ జోన్ మహిళా క్రికెట్ పోటీలలో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలిచింది. లీగ్ పోటీల్లో 15 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో గుంటూరు జట్టుపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 12.4 ఓవర్లలో 22 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఝాన్సీలక్ష్మి 10 పరుగులు చేయగా కృష్ణాబౌలర్లు మేఘన, ధనలక్ష్మి చెరి మూడు వికెట్లు పడగొట్టగా, నాగమణి రెండు వికెట్లు తీసుకుంది. అనంతరం బ్యాటింగ్ చేసిన కృష్ణాజట్టు వికెట్ నష్టపోకుండా విజయాన్ని సాధించింది. జట్టులో స్నేహ 8, మన్వీర్‌కౌర్ 4 సాధించారు. బుధవారం జరగనున్న ప్రాపబుల్స్‌లో ఎసిఎ సెంట్రల్ జోన్ మహిళా జట్టును ఎంపిక చేయనున్నారు.
అధికారులతో సమావేశమైన ఎస్పీ
మంగళగిరి, జూలై 30: తెలంగాణాకు అనుకూలంగా దేశ రాజధాని నుంచి ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరుగకుండా తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై మంగళవారం జిల్లా అర్బన్ ఎస్పీ బివి రమణకుమార్ మంగళగిరి ప్రాంతంలోని పోలీసు అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. రూరల్ సిఐ కార్యాలయంలో ఎస్పీ రమణకుమార్ అధికారులతో సమావేశమయ్యారు. సిఐ మురళీకృష్ణ, రూరల్ ఎస్సై నాగకుమారి, పట్టణ ఎస్సై జిలాని భాషా తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ సక్రమంగా నిర్వహించండి
* ఎన్నికల పరిశీలకురాలు ఉదయలక్ష్మి
యడ్లపాడు, జూలై 30: ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌లో అధికారులు శ్రద్ధగా నిర్వహించాలని సోషల్ వెల్ఫేర్ కమిషనర్, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు బి ఉదయలక్ష్మి అన్నారు. మంగళవారం ఉద యం యడ్లపాడు ఎంపిడిఒ కార్యాలయానికి వచ్చిన ఉదయలక్ష్మి ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పది గంటలైనా పోలింగ్ సామగ్రిని సిబ్బందికి అందజేయలేదని వారు బ్యాలెట్ పత్రాలు, తదితర సామాగ్రి సర్దుకునే వ్యవధి ఉండాలి కదా ఆమె మండల పరిషత్ అధికారులను ప్రశ్నించారు. అందరికీ ఒక్కసారిగా కాకుండా వచ్చిన వారికి వచ్చినట్లుగా పోలింగ్ సామగ్రి అందజేయాలని ఆదేశించారు.
సర్వం సిద్ధం: తుది విడత పంచాయతీ ఎన్నికలకు యడ్లపాడు మండల గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపిడిఒ సువార్త తెలిపారు. పోలింగ్ సామగ్రి ప్రిసైడింగ్ అధికారులకు అందజేశామన్నారు.

ఎయిడెడ్, మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల
సమస్యలు పరిష్కరించాలి
* కలెక్టరేట్ ఎదుట పిడిఎస్‌ఒ ధర్నా
గుంటూరు , జూలై 30: ఎయిడెడ్, మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పిడిఎస్‌ఒ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి పిడిఎస్‌ఒ జిల్లా నాయకుడు కెవి రమణ మాట్లాడుతూ పాలకులు, ప్రభుత్వ అధికారులు విద్యా సంబరాల పేరిట వందల కోట్ల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చుచేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో విద్యార్థులను చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లదేననడం సరికాదన్నారు. ఎస్ హనుమంత్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, శిథిలావస్థలో ఉన్న పాఠశాల తరగతి గదులకు మరమ్మతులు చేయించాలని, విద్యార్థులకు మంచినీటి, మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించాలన్నారు. విద్యా వ్యాపారమే ధ్యేయంగా నడుస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలను వెంటనే మూయించి వేయాలన్నారు. తొలుత మార్కెట్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఎఒ ఏసురత్నంకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మణి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సమైక్యాంధ్ర కొనసాగించాలంటూ విద్యార్థుల ర్యాలీ
పొన్నూరు, జూలై 30: రాష్ట్ర విభజన చర్యకు స్వస్తిచెప్పి, సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పొన్నూరు పట్టణ కూడలిలో విద్యార్థులు ర్యాలీ, ధర్నా జరిపారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిపిన నిడుబ్రోలు పిబిఎన్ కళాశాల డిగ్రీ విద్యార్థులు సమైక్యాంధ్రప్రదేశ్ పర్యవేక్షణ కమిటీ పొన్నూరు శాఖ సభ్యులు సంయుక్తంగా పట్టణంలోని ట్రాఫిక్ ఐలాండ్ సెంటర్ నుండి ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులతో పాటు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు బొద్దులూరి రంగారావు, గురుబాలు, వెంకటస్వామి, ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వీసీని కలిసిన ఎస్పీ
నాగార్జున యూనివర్సిటీ, జూలై 30: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచార్య కె వియన్నారావును గుంటూరు అర్బన్ ఎస్పీ డివి రమణకుమార్ మంగళవారం కలిశారు. వర్సిటీలోని వీసీ ఛాంబర్‌లో భేటీ అయిన ఎస్పీ, వీసీ రాష్ట్ర విభజన, సమైక్యాంధ్ర ఉద్యమం, వర్సిటీలో శాంతి భద్రతల ఏర్పాట్లపై చర్చింనట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరుగుతుందని పెద్దయెత్తున్న ప్రచారం జరుగుతుండటంతో వర్సిటీ సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుందని, విద్యార్థులు ఆందోళ కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో వీసీని ఎస్పీ కలవటం చర్చనీయాంశమైంది. ఇదిలావుండగా మంగళవారం వర్సిటీలోని వికాసభవన్, స్పోర్ట్ హాస్టల్స్‌కు ప్రత్యేక పోలీసు బృందాలు చేరుకోవటం ఈ చర్చలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వర్సిటీ వీసీ ఎస్పీతో జరిగిన చర్చల వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని అడ్డుకుంటాం
నాగార్జున యూనివర్సిటీ, జూలై 30: రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానిని పూర్తిగా వ్యతిరేకిస్తామని సమైక్యాంధ్ర జెఎసి గౌరవాధ్యక్షుడు ఆచార్య పి నరసింహారావు అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీమాంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకస్తూబుధవారం సీమాంధ్రలోని విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చామని, ఆగస్టు 1వతేది నుండి 6వతేది వరకు దశలవారీ ఆందోళనలకు పూనుకుంటామని తెలిపారు. రాష్ట్ర విభజన దిశగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బైండర్ సుబ్బారావుకు ఘన సన్మానం
నాగార్జున యూనివర్సిటీ, జూలై 30: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని అంబేద్కర్ లైబ్రరీలో సుమారు మూడు దశాబ్దాలుగా బైండర్‌గా టి సుబ్బారావు సేవలు ఎనలేనివని వర్సిటీ వీసీ ఆచార్య కె వియన్నారావు కొనియాడారు. వర్సిటీలోని లైబ్రరీలో ఏర్పాటు చేసిన బైండర్ సుబ్బారావు పదవీ విరమణ కార్యక్రమంలో వర్సిటీ వీసీ వియన్నారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ దుశ్శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఆర్‌ఆర్‌ఎల్ కాంతం, వర్సిటీ ఒఎస్‌డి ఆచార్య జెడ్ విష్ణువర్థన్, లైబ్రేరియన్ కోడేల వెంకట్రావు, సిబ్బంది శరత్‌చంద్ర, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కొత్త సర్పంచ్‌లకు అభినందన
మంగళగిరి, జూలై 30: మండల పరిధిలోని కాజ, చినవడ్లపూడి, దుగ్గిరాల మండలం మంచికలపూడి సర్పంచ్, ఉపసర్పంచ్‌లుగా ఎన్నికైన వారిని మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పోతినేని శ్రీనివాసరావు అభినందించారు. కాజ సర్పంచ్ కట్టెపోగు వెంకయ్య, చినవడ్లపూడి సర్పంచ్ చంద్రగుండం యోగేంద్రనాధ్, ఉపసర్పంచ్ సాయిప్రసాద్, మంచికలపూడి సర్పంచ్ యార్లగడ్డ భగత్‌సింగ్‌లను ఆయన అభినందించారు. అనంతరం పోతినేని మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని కోరారు. మండల టిడిపి అధ్యక్షుడు ఆరుద్ర అంకవర ప్రసాద్, మంగళగిరి పిఎసిఎస్ అధ్యక్షుడు గాదె పిచ్చిరెడ్డి, నాయకులు నందం అబద్దయ్య, పల్లబోతుల శ్రీనివాసరావు, కుక్కమళ్ల స్వామి, దానబోయిన రామరాజు, వల్లభనేని సాయిప్రసాద్, సంకా బాలాజీగుప్తా, వెలగపాటి విలియం తదితరులు పాల్గొన్నారు.

108 ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
గుంటూరు , జూలై 30: ప్రభుత్వం మొండి వైఖరి వీడి 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ద్వారా నిరవధిక సమ్మెను విరమింపజేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లారుూస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ సంయుక్త కార్యదర్శి వివికె సురేష్ చెప్పారు. కలెక్టరేట్ ఎదుట 108 ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఇన్సూరెన్స్ ఎంప్లారుూస్ యూనియన్ నాయకులు వివికె సురేష్ మాట్లాడుతూ 108 ఉద్యోగులకు తమ యూనియన్ తరఫున సంఘీభావం తెలిపారు. జివికె యాజమాన్యం 108 ఉద్యోగుల పట్ల మొండి వైఖరి అవలంబించడం దారుణమన్నారు. జివికె యాజమాన్యం న్యాయమైన 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టాన్ని అమలుపర్చాలి
గుంటూరు, జూలై 30: వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్ఠంగా అమలు పర్చాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. స్థానిక బ్రాడీపేటలోని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని రూపొందించిన సావనీర్‌ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల ఫలితంగా వ్యవసాయ కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పాశం రామారావు, ఉపాధ్యక్షుడు బి వేదయ్య, ఎ కోటిరెడ్డి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కృష్ణమోహన్, రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను నాగేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, ప్రజానాట్య మండలి నాయకుడు నూతలపాటి కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలను ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు
గుంటూరు , జూలై 30: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యంగ్ ఇండియా ఫెడరేషన్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌ఐఒ రూఫస్‌కుమార్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ జిఒలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ కళాశాలలను కట్టడి చేయాల్సిన అధికారులే వారికి ఏజంట్లుగా మారుతున్నారని ఆరోపించారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్‌డి గౌస్, ఎం కోటేశ్వరరెడ్డి, కె ప్రవీణ్, రామబ్రహ్మం, దీపు తదితరులు పాల్గొన్నారు.

* టిడిపి విప్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్
english title: 
narendra kumar

అవనిగడ్డ టిడిపి అభ్యర్థిగా హరిప్రసాద్‌కు బి.ఫరం

$
0
0

మచిలీపట్నం (కోనేరుసెంటరు) 30: కృష్ణా జిల్లా అవనిగడ్డ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబటి హరిప్రసాద్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతకం చేసిన బి.ఫరంను మంగళవారం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ అందచేశారు. నీతి, నిజాయితీలతో జిల్లా అభివృద్ధికి కృషిచేసిన అంబటి బ్రాహ్మణయ్య తనయుడు హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక కోసం మద్దతు తెలిపిన లోక్‌సత్తా, వైఎస్‌ఆర్‌సీపిలకు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని ఈసందర్భంగా ఆయన కోరారు. 1న ఉదయం 11గంటలకు అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయంలో హరిప్రసాద్ నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ
english title: 
b - form

నామినేషన్లు నిల్

$
0
0

అవనిగడ్డ : అవనిగడ్డ ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం నామినేషన్‌లు దాఖలు కాలేదని ఎన్నికల అధికారి బి రవి తెలిపారు.

అవనిగడ్డ ఉప ఎన్నికకు సంబంధించి
english title: 
no nomination

బందరులో మోహరించిన పారామిలిటరీ దళం

$
0
0

మచిలీపట్నం 30: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో పట్టణంలో పారామిలిటరీ దళాలు మోహరించాయి. మంగళవారం పట్టణంలో ఈ దళం కవాతు నిర్వహించింది. 20 మంది సభ్యులతో కూడిన బృందం అధునాతన ఆయుధాలతో కవాతులో పాల్గొన్నారు. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు రెండు కంపెనీల పోలీస్ బలగాలను కేటాయించారు. సిఆర్‌పిఎఫ్ కంపెనీకి చెందిన పోలీస్ బలగాలు ఇప్పటికే జిల్లాకు చేరుకోగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సాయుధ దళాలు బుధవారం రానున్నాయి. ఈ రెండు కంపెనీలు జిల్లాలో ఎక్కడైనా సమైక్యాంధ్ర కోసమని ఆందోళన జరిగితే ఈ రెండు కంపెనీల దళాలు అప్రమత్తంగా వ్యవహరించనున్నాయి. ఈమేరకు జిల్లాలో పలుచోట్ల సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో పట్టణంలో
english title: 
para military forces

రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దు

$
0
0

హనుమాన్ జంక్షన్, జూలై 30: కొంతమంది రాజకీయ నాయకుల పదవుల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, తెలుగుజాతి ప్రజలను బలిపశువుల్ని చేయవద్దని అఖిలపక్ష నాయకులు, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా హనుమాన్‌జంక్షన్‌లో అఖిలపక్ష నాయకులు, విద్యార్థులు మంగళవారం జాతీయ రహదారిపై రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. స్థానిక అప్పనవీడు జిల్లా పరిషత్ హైస్కూల్, జె.ఎం.జె కళాశాల విద్యార్థినీలు ప్రదర్శన చేస్తూ జంక్షన్ కూడలికి చేరుకున్నారు. అనంతరం మానవహారం నిర్మించి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయవద్దని నినాదాలు చేశారు. కొంతమంది అవకాశవాద రాజకీయాల కారణంగా తెరపైకి వచ్చిన ప్రత్యేక వాదం వలన భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని హెచ్చరించారు. కాగా టిడిపి, విద్యార్థి సంఘాల నాయకులు కూడా జంక్షన్‌లో రాత్రి ఆందోళన నిర్వహించారు. నూజివీడు డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.

214 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
కూచిపూడి, జూలై 30: పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మొవ్వ మండల ఎన్నికల ప్రత్యేకాధికారి గౌసియా బేగం తెలిపారు. మంగళవారం మొవ్వ జెడ్‌పి హైస్కూలలో ఎన్నికల అధికారులు, సహాయ అధికారులకు ఎన్నికల సామగ్రి సరఫరా కార్యక్రమానికి వచ్చిన ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ బుధవారం ఉదయం 7నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఎన్నికల నిర్వహణకు 23 మంది ఎన్నికల అధికారులు, 420 మంది సహాయ, ఉప సహాయ అధికారులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలో 17 సర్పంచ్ పదవులకు, 214 వార్డులలో 37,284 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం 214 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మండలంలో ఎన్నికల పర్యవేక్షణకు ముగ్గురు జోనల్ అధికారులు, ఆరుగురు రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. 214 బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని అందించినట్లు తెలిపారు. 8 మంది మైక్రో అబ్జర్వర్లు, 10 మంది వీడియోగ్రాఫర్లు, మూడు బెటాలియన్ల పోలీసు సిబ్బంది, డిఎస్పీ, సిఐ, ఐదుగురు ఎస్‌ఐలు, ఇద్దరు ఎఎస్‌ఐలు, ఆరుగురు హెచ్‌సిలు, 12 మంది పిసి, 95 మంది వెస్ట్ జోన్ పోలీసులు, 80 మంది హోంగార్డులు నియమితులయ్యారన్నారు. ఎన్నికల పర్యవేక్షకులుగా తహశీల్దార్ జి భద్రు, ఎండివో వై పిచ్చిరెడ్డి, ఎంఇఓ పరసా సోమేశ్వరరావు ప్రత్యేక వాహనంలో పర్యవేక్షిస్తారన్నారు. మధ్యాహ్నం 2గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుందని వివరంచారు.

కొంతమంది రాజకీయ నాయకుల పదవుల కోసం
english title: 
division
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>