Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

తుది విడత పోలింగ్ నేడే

$
0
0

మచిలీపట్నం 30: గ్రామ పంచాయతీల ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి 2గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. తుది విడతగా మచిలీపట్నం, గుడివాడ డివిజన్‌లలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, పత్రాలు పంపిణీ చేశారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం డివిజన్ పరిధిలో 12 మండలాల్లో 233 గ్రామ పంచాయతీలు ఉండగా 41 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 192 పంచాయతీల్లో 551 మంది పోటీలో ఉన్నారు. 1682 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 1682 మంది పోలింగ్ అధికారులను, 2395 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. 100 మంది మైక్రో పర్యవేక్షకులను ఏర్పాటు చేశారు. బందరు డివిజన్‌లో 35 సమస్యాత్మక, 34 అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. 70 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా, 107 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. గుడివాడ డివిజన్‌లోని తొమ్మిది మండలాల్లో 219 గ్రామ పంచాయతీలు ఉండగా 48 ఏకగ్రీవంగా ముగిశాయి. మిగతా 171 గ్రామ పంచాయతీల్లో 486 మంది బరిలో ఉన్నారు. 1517 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎన్నికల నిర్వహణకు 1517 మంది పోలింగ్ అధికారులను, 2110 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 952 మంది మైక్రో పర్యవేక్షకులను ఏర్పాటు చేశారు. ఈ డివిజన్‌లో 65 సమస్యాత్మక గ్రామాలు, 37 అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. 414 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. ఎన్నికలు సజావుగా ముగిసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ పత్రాలతో పాటు పోలింగ్ బాక్సులను ప్రత్యేక వాహనాల్లో తరలించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,500 మంది పోలీస్ బలగాలను రంగంలోకి దించి జిల్లా ఎస్పీ జె ప్రభాకరరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కర్నాటక తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పించారు. ఎఆర్, సిఆర్‌పిఎస్, ఎపిఎస్పీ బలగాలతో పాటు జిల్లా, విజయవాడ నగర పరిధిలోని బలగాలను పోలింగ్ కేంద్రాల వద్ద మోహరింపజేశారు. ఎలాంటి కక్షలు, కార్పణ్యాలకు తావులేకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని ఎస్పీ ప్రభాకరరావు విజ్ఞప్తి చేశారు.

గుడివాడ డివిజన్‌లో సర్వం సిద్ధం
గుడివాడ, జూలై 30: గుడివాడ డివిజన్‌లో బుధవారం మూడవ దశ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికల్లో తొలిసారిగా వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ జరుగుతోందని ఆర్డీవో ఎస్ వెంకటసుబ్బయ్య చెప్పారు. ఆర్డీవో కార్యాలయంలో డివిజన్‌లో జరిగే పోలింగ్‌లో పాల్గొంటున్న ట్రిపుల్ ఐటి విద్యార్థులు, సిబ్బందిని ప్రత్యేక వాహనాల ద్వారా మంగళవారం ఆయా మండలాలకు తరలించారు. సిబ్బందికి పోలింగ్ నిర్వహణపై పలు సూచనలిచ్చారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే తనకు తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా 47 సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ జరుగుతోందని, ఆన్‌లైన్ నిర్వహణకు నూజివీడు ట్రిపుల్ ఐటికి చెందిన 50 మంది విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంతో పాటు ఎక్కడ నుండైనా అధికారులు వీక్షించవచ్చన్నారు. 130 మంది వీడియోగ్రాఫర్లతో పోలింగ్ నిర్వహణను చిత్రీకరిస్తున్నామన్నారు. డీఎల్‌పీవో వరప్రసాద్ మాట్లాడుతూ డివిజన్‌లో 176 పంచాయతీలకు 1515 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1517 మంది పీవోలు, 2,110 మంది ఏపీవోలు, 130 మంది వీడియోగ్రాఫర్లు, 125 మంది మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్‌కు 50 మంది ట్రిపుల్ ఐటి విద్యార్థులు, 41 మంది జోనల్ అధికారులు, 66 మంది రూట్ అధికారులు, 234 మంది స్టేజ్ టు అధికారులు మొత్తం 4 వేల మందికి పైగా సిబ్బందితో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమల్లో ఉందని, ఎన్నికల నిర్వహణకు విఘాతం కల్గించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డివిజన్‌లోని నూరు శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్లు గంధం డేవిడ్‌రాజు, కెజె విక్టర్‌పాల్ తదితరులు పాల్గొన్నారు.
కలిదిండి మండలంలో...
కలిదిండి : పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలిదిండి ఎస్‌ఐ బాలశౌరి మంగళవారం తెలిపారు. మండలంలో బుధవారం జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తం 112 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇన్‌చార్జ్ డిఎస్పీ ఒకరు, సిఎలు ఇద్దరు, ఎస్‌ఐలు ఆరుగురు, ఎఎస్‌ఐలు ఒకరు, హెచ్‌సిలు 10 మంది, కానిస్టేబుల్స్ 53, హోంగార్డులు 30, ఎఆర్ కానిస్టేబుల్ తొమ్మిది మంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. గ్రామంలో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లకు డబ్బు, మద్యం, ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అవనిగడ్డలో పోలీసుల కవాతు
అవనిగడ్డ, జూలై 30: స్థానిక పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని అవనిగడ్డ ప్రధాన వీధుల్లో మంగళవారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఏవిధమైన భయం లేకుండా ఓటర్లు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని, ఎవరైనా ఆ హక్కును అడ్డుకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటారంటూ కవాతు నిర్వహించారు.
ఈ కవాతులో డిఎస్పీ హరి రాజేంద్రబాబు, సిఐ జివి రమామూర్తి నాయకత్వం వహించారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ స్థానిక సబ్ డివిజన్ పరిధిలో ఐదుగురు డిఎస్పీలు, ఏడుగురు సిఐలు, 24 మంది ఎస్‌ఐలు, 99 మంది హెచ్‌సిలు, 330 మంది పిసిలు, హోంగార్డులు 202, ఆర్మ్‌డ్ రిజర్వ్ 42, కర్ణాటక పోలీసులు 40, ట్రైనింగ్ ఎస్‌ఐలు 34, ఎపిఎస్పీలు 48 మంది చొప్పున సబ్ డివిజన్ పరిధిలో బందోబస్తుకు ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ వివరించారు.
పంచాయతీ ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు
చల్లపల్లి, జూలై 30: పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను కేటాయించి వారికి ఎన్నికల సామగ్రిని అందించి పోలీస్ ఎస్కార్ట్‌తో పోలింగ్ కేంద్రాలకు చేర్చారు. చల్లపల్లిలో మండల ఎన్నికల ప్రత్యేకాధికారి చిట్టిబాబు నేతృత్వంలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రామ పంచాయతీల ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి
english title: 
gram panchayat

ఐదేళ్ల బాలికపై అత్యాచారం

$
0
0

గుడివాడ, జూలై 30: గుడివాడ రూరల్ మండలం చినవానిగూడెంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో మంగళవారం గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. సేకరించిన వివరాల ప్రకారం... బాలిక బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చింది. సమీపంలో పిల్లలు కన్పించడంతో వారితో కొద్దిసేపు ఆడుకుంది. పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత దగ్గరలోని పి మోహనరావు అనే వ్యక్తి ఇంట్లో టీవీ చూస్తోంది. ఈ సమయంలో మోహనరావు పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. ఒంటరిగా ఉన్న బాలికపై మోహనరావు కుమారుడు జాషువా(18) గత శనివారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు నిందితుడి కుటుంబానికి భయపడి ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. అయితే బాలికకు రక్తస్రావం అవుతుండడంతో తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినపుడు విషయం బయటపడింది. గుడివాడ తాలూకా ఎస్‌ఐ బెజవాడ సాంబశివరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

* ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం
english title: 
late

రాష్ట్ర విభజనపై బెజవాడ బార్ ఆగ్రహం

$
0
0

విజయవాడ , జూలై 30: రాష్ట్ర విభజనపై బెజవాడ బార్ అసోసియేషన్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరిచింది. సమైక్యాంధ్రను కోరుకుంటున్న బార్ న్యాయవాదులు తెలంగాణా ప్రకటనపై నిరసన వ్యక్తం చేశారు. ఈమేరకు బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టా జయకర్ పిలుపు మేరకు మంగళవారం విధులు బహిష్కరించారు. ఎన్నో ఏళ్ళుగా రాష్ట్ర ప్రజలు కలిసి జీవిస్తున్న క్రమంలో తెలుగుజాతిని విడదీస్తూ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడం గర్హనీయమన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విధులు బహిష్కరించడమే కాకుండా నిరసనను మరో మూడు రోజుల పాటు కొనసాగించాలని బార్ తీర్మానించింది. బార్ ఆధ్వర్యాన మంగళవారం బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు, మెజార్టీ సభ్యుల తీర్మానం మేరకు మూడు రోజుల పాటు విధులు బహిష్కరించిన నిరసన వ్యక్తం చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో బార్ అధ్యక్షుడు మట్టా జయకర్, ఉపాధ్యక్షుడు చీదెళ్ళ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి లాం ఇజ్రాయేలు, సీనియర్ న్యాయవాదులు ఏవి రమణ, నరహరశెట్టి శ్రీహరి, గోగుశెట్టి వెంకటేశ్వరరావు సీనియర్, జూనియర్, మహిళాన్యాయవాదులు పాల్గొన్నారు.

3న ఆంధ్రా జెఎసి సమావేశం
పటమట, జూలై 30: యపిఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండు రాష్టల్ర విభజనకు ఏకగ్రీవం తీర్మానం చేయడం పట్ల ఆంధ్రా జాయింట్ యాక్షన్ కమిటీ హార్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు నగరంలో మంగళవారం సాయంత్రం ఆంధ్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర జెఏసి అధ్యక్షులు సుంకర కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆగస్టు 3న ఆంధ్రా జెఎసి అధ్వర్యంలో విజయవాడలో ఆంధ్ర ప్రాంతానికి రావలిసిన వాటాలు విధి విధానాలపై ఆంధ్రా ప్రాంత మేధావులతో నీటి పారుదల నిపుణులతో, రైతాంగ నాయకులతో, టెక్నీషియన్స్,రాజకీయపార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి జాతీయ హోదా కల్పించడంపై కాంగ్రెస్ పార్టీకి, కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 48 సంవత్సరాల నుండి ఆంధ్రా ప్రాంతం నుండి పన్నుల రూపంలో హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందన్నారు. అందువలన జానాభా నిష్పత్తిలో 48 సంవత్సరాలు హైదరాబాద్ మీద వచ్చే ఆదాయం ఆంధ్రా ప్రాంతానికి పంచే విధంగా కేంద్రప్రభుత్వానికి తెలియజేయటం జరిగిందన్నారు.

* మూడు రోజుల పాటు విధుల బహిష్కరణ
english title: 
agraham

రైల్వేలకూ పన్ను పోటు

$
0
0

విజయవాడ , జూలై 30: త్వరలో దక్షిణమధ్య రైల్వే విజయవాడ డివిజన్ హెడ్‌క్వార్టర్స్ అయిన విజయవాడ పరిధిలో లక్షలాది రూపాయలను మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంది. దీనిపై గణాంకాలు సాగుతున్నాయి. అసలు విషయంలోకి వస్తే గత ఆరేడు నెలల క్రితం రైల్వేశాఖకు సుప్రీంకోర్టు కొన్ని అంశాలతో కూడిన ఆదేశాలను జారీచేసింది. ఇందులో ప్రాపర్టీ ట్యాక్స్ (ఆదాయపు పన్ను) కిందకు వచ్చే ప్రాంతాలకు చెందిన రైల్వేశాఖ ఆయా ప్రాంతంలోని మున్సిపాలిటీ ఆదాయపు పన్ను చెల్లించాలంటూ ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీచేసింది. అందులో విజయవాడ డివిజన్ కూడా ఉంది. విజయవాడ డివిజన్ పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. వీటన్నింటితో పోల్చుకుంటే విజయవాడ డివిజన్ కోట్ల రూపాయల్లో పన్ను చెల్లించవలసి ఉంది. ఒక్క విజయవాడ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూస్తే లక్షలాది రూపాయలు అక్షరాలా చెల్లించవలసి ఉంది. దీనికి చెందిన గణాంకాలను డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలోని డివిజనల్ అకౌంట్స్ విభాగానికి చెందినవారు లెక్కలు వేయడం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన అంశాల్లో ఏ తరహా పన్ను వేయాలనే దాని ప్రకారం లెక్కలు కడుతున్నారు. అయితే రైల్వే మంత్రిత్వపు శాఖ సుప్రీంకోర్టును ఆదాయపు పన్ను కింద చెల్లించాలంటూ విధించారు. తమకు చెందిన కొంత స్థలాన్ని మున్సిపాలిటీకి చెందిన వారే అక్రమంగా వినియోగించుకుంటున్నారు. అంటే ఆక్రమణదారులు నుంచి వివిధ పన్నులు మున్సిపాలిటీలో వసూలు చేసుకుంటున్నారు. ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ పేరుతో రైల్వేశాఖపై వేసిన భారాన్ని తొలగించాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. దానికి అక్కడ నుంచి రైల్వేశాఖ కోరినట్లు సరైన సమాధానం రాకపోవడంతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం లెక్కలు కట్టి మున్సిపాలిటీలకు చెల్లించేందుకు కావాల్సిన లెక్కలను తయారు చేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ను వెయ్యడానికి ప్రధాన కారణాలు రైల్వేశాఖకు చెందిన విభాగం మున్సిపాలిటీ ద్వారా విలీనం కావడం వలన అంటే రైల్వేక్వార్టర్స్ కాని, డిఆర్‌ఎం కార్యాలయాలు, వివిధ రైల్వేశాఖకు చెందిన కార్యాలయాలకు చెందిన రహదారులు మున్సిపాలిటీకి చెందిన రహదారుల్లో విలీనం కావడం రైలు, రైలు పట్టాలు పరిధి దాటి పోకుండా రైలుపట్టాలపైనే నడిచే విధంగా ఈ రహదారులు లేవు. బయట మున్సిపాలిటీకి చెందిన వాటిలో కలవడం, విద్యుత్ తీగలు వంటివి మున్సిపాలిటీకి చెందిన ప్రాంతాల మీదగా రావడం వంటి పలు అంశాల ఆధారంగా ఈ ప్రాపర్టీ ట్యాక్స్‌ని విధించారు. పన్ను చెల్లింపు విషయంలో కొంత సమయాన్ని కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం వలన మున్సిపాలిటీలు రైల్వేశాఖ మీద పడకుండా ఉన్నాయి. ఇటీవల కాలంలో బస్సులకు చెందిన చార్జీలు పెరగడంతో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య బాగా పెరగడంతో రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్ధం కావాల్సిన వనరులు సమకూర్చడంతో ఆదాయంతో కూడిన ఖర్చు గణనీయంగా పెరిగింది. దీంతో రైల్వేశాఖలోనే కొన్ని స్టేషన్లలోని అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో పాటు రైల్వేశాఖలో కూడా 18 జోన్‌లలో జోన్‌ల వారీగా విభజించి విడుదల చేసే నిధుల్లో కావాల్సిన నిధులు లేకపోవడంతో రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలోని అభివృద్ధి పనులు, కాని పరిశ్రమలకు కాని కావాల్సిన నిధులు లేక వెనుకబడిపోతున్నాయనే వార్తలు కథనాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ప్రాపర్టీ ట్యాక్స్‌ని విధించడం రైల్వేశాఖకు తలకు మించిన భారంగా తయారైందనే విమర్శలు అధికారుల నుంచి వినిపిస్తున్నాయి. రైల్వేశాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వారి వారి అవసరాల నిమిత్తం ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) లోను విషయంలో సరిపడ నిధులు లేవని చెప్పి వచ్చిన దరఖాస్తులను పక్కన పెట్టవలసి వచ్చిన సంగతిని గుట్టుచప్పుడు కాకుండా అకౌంట్స్ విభాగపు వారు రెండు మూడు రోజులు, వారం రోజులంటూ దాటేస్తున్న దుస్థితి ఇక్కడ నెలకొంది. ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కనుక వారు చేయవలసిన పనుల్లో డిఆర్‌ఎం ఆదేశానుసారం నిమగ్నమై ఉన్నారు. విజయవాడ డివిజన్‌లో కార్పొరేషన్‌లు విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, చీరాల, కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి ఉండగా మున్సిపాలిటీలు, గుడివాడ, భీమవరం, బాపట్ల, తెనాలి, మచిలీపట్నం, కావలి, తుని, అన్నవరం, అనకాపల్లి, బీమడోలు, తణుకు, నర్సాపూర్, పలు స్టేషన్లు ఉన్నాయి. పైన పేర్కొన్న ప్రాంతాలకు చెందిన లెక్కలు కూడా డివిజన్ హెడ్ క్వార్టర్స్‌లోనే అక్కడున్న పరిధికి చెందిన ప్లానింగ్ ప్రకారం లెక్కలు కట్టవలసి ఉంది. అయితే ఆయా ప్రాంతాల్లోని వివరాలను ఇంజనీరింగ్ విభాగం నుంచి తీసుకుని లెక్కలు కడుతున్నారు. అంతా పూర్తయిన తరువాత దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో పాటు అక్కడ ఉన్న ఎఫ్ అండ్ సిఏఓ (ఫైనాన్స్ అండ్ కాస్టింగ్ అకౌంట్స్) విభాగానికి లెక్కలు పంపించి అక్కడ నుంచి ఆయా ప్రాంతాలకు చెందిన మున్సిపాలిటీలకు చెల్లింపులు జరగనున్నాయి.

జిల్లా అంతటా ‘అవనిగడ్డ కోడ్’
విజయవాడ, జూలై 30: అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లా అంతటా అమల్లోకి వచ్చింది. దీన్ని పర్యవేక్షించే నిమిత్తం రెవెన్యూ డివిజన్ స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేస్తే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి ఉత్తర్వులు జారీచేసారు. జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, ఎస్‌పి జె. ప్రభాకరరావు తదితరులతో కమిటీ ఏర్పాటైంది. విజయవాడ డివిజన్‌కు సబ్ కలెక్టర్ హరిచందన చైర్మన్‌గా, డిసిపి కన్వీనర్‌గా, డివిజనల్ పంచాయతీ అధికారి సభ్యునిగా, ఉడా కార్యదర్శి అప్పారావు పరిశీలకునిగా వ్యవహరిస్తారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ కమిషనర్ చైర్మన్‌గాను, డిసిపి కన్వీనర్‌గానూ వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలుపర్చటం జరుగుతుందని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవటంతో పాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

దోపిడీ దొంగల ముఠా అరెస్టు
విజయవాడ , జూలై 30: విజయవాడ డివిజన్ ప్రభుత్వ రైల్వే పోలీస్ పరిధిలో ఉన్న రాజమండ్రి జిఆర్‌పి వారు 40 లక్షల రూపాయల నగదుతో పాటు పావుకేజీపైన బంగారాన్ని స్వాధీనపర్చుకున్నారు. సేకరించిన వివరాల ప్రకారం బీహార్ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు కలిగిన ముఠాతోపాటు వారివద్ద వున్న 40 లక్షల రూపాయలు నగదుతో పాటు పావుకేజీ బంగారాన్ని రాత్రి సమయంలో రైళ్లలో గస్తీకి వెలుతున్న టీమ్ పట్టుకుంది. వెంటనే ఈ సమాచారాన్ని విజయవాడలో ఉన్న జిఆర్‌పి ఎస్‌పి డాక్టర్ శ్యామ్ ప్రసాదరావుకు అక్కడి సిఐ సమాచారాన్ని అందించారు. ఈ గ్యాంగ్‌ని పట్టుకోవడంలో ప్రతిభ కనపర్చిన సిబ్బందితోపాటు సిఐ కలిసి అదుపులోకి తీసుకున్న ఆరుగురితోపాటు వారి వద్ద నుంచి వసూలు చేసిన ధనంతోపాటు బంగారాన్ని తీసుకుని సికింద్రాబాద్‌లో ఉన్న జిఆర్‌పి ఐజి దగ్గరకు ఆదివారం రాత్రి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయనకు చూపించి సోమవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే దురంతో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి మంగళవారం ఉదయానికి రాజమండ్రికి చేరుకున్నారు. అనంతరం వీరి వెనుక ఇంకా ఏమైనా టీమ్ ఉందాని విచారించిన అనంతరం బుధ, గురువారాల్లో విజయవాడలోని రెండో మెట్రోపాలిటన్ రెండో రైల్వే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే నగదు రూపంలో ఉన్న ధనం కాని బంగారం కాని ఇంకా ఎక్కువగానే ఈ ఆరుగురి వద్ద నుంచి స్వాధీనపర్చుకున్నట్లు సమాచారం.

‘ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి బ్లాక్ డే’
విజయవాడ, జూలై 30: రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం ప్రపంచ వ్యాప్తంగానున్న తెలుగువారికి బ్లాక్ డేగా పరిగణించాల్సి ఉందని పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగాన్ని గంగలో కలిపారని తెలుగుదేశం అర్బన్ ఉపాధ్యక్షుడు లుక్కా సాయిరాం గౌడ్ నేడొక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగాణా వాదం నీరసబడి 80 శాతం ప్రజలు సమైక్యంగా ఉందామనే ఆలోచనలో ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లు సీట్లు కోసం కుతంత్రాలతో తెలుగు జాతిని చీల్చడానికి సన్నద్ధమైందన్నారు. సీమాంధ్రుల మనోభావాలను ఖాతరు చేయకుండా సోనియాగాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఇది యని అన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మంత్రులు, కాంగ్రెస్ ఎంపిలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆంధ్ర ప్రాంత ప్రజలను మరోమారు మోసం చేసారన్నారు. ఆంధ్రలో ఒక్క సీటు కూడా రాదని గుర్తించిన బిజెపి విభజనకు మద్దతునిస్తే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణాల్లో కొద్దిపాటి సీట్లకు కక్కుర్తిపడి నిర్ణయం తీసుకుందన్నారు.

త్వరలో దక్షిణమధ్య రైల్వే విజయవాడ డివిజన్
english title: 
pannu potu

ఆనందోత్సాహాలు

$
0
0

కాంగ్రెస్ నిర్ణయంతో హైదరాబాద్ ఆనందోత్సాహాలు

.............
english title: 
a

విధ్వంసం!

$
0
0

అనంతపురం, జూలై 31: రాష్ట్ర విభజనతో అనంతలో సమైక్యవాదులు రెచ్చిపోయారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆందోళనలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. నగరంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసం సృష్టించారు. ఉద్యమకారులు విజృంభించడంతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. సమైక్య ఉద్యమంలో ప్రజలు, యువత, విద్యార్థులు స్వచ్ఛందంగా పాలు పంచుకున్నారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. జిల్లా కేంద్రంలో రోడ్లపై టైర్లకు నిప్పుపెట్టారు. సప్తగిరి సర్కిల్ నుంచి క్లాక్ టవర్ వరకూ ఉన్న రోడ్డు డివైడర్లను ధ్వంసం చేశారు. సప్తగిరి సర్కిల్‌ని రాజీవ్‌గాంధీ విగ్రహం, టవర్‌క్లాక్ సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహాలను తగులబెట్టారు. అనంతరం వాటిని ధ్వంసం చేశారు. టవర్‌క్లాక్‌పైకి రాళ్లు రువ్వడంతో గడియారులు ధ్వంసమయ్యాయి. ఆర్ట్స్ కళాశాలలోకి ప్రవేశించిన ఉద్యమకారులు, విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఒకదశలో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. రఘువీరా టవర్స్, ఎడిసిసి బ్యాంకు కేంద్ర కార్యాలయం పై రాళ్లు రువ్వారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎస్పీ ఎస్.శ్యామ్‌సుందర్ నగరానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించినా సాయంత్రం వరకూ కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడం గమనార్హం. పరిస్థితి తీవ్రతను గమనించిన ఎస్పీ మూడవ విడత పోలింగ్‌లో ఉన్న బలగాలను జిల్లా కేంద్రానికి తరలించే ప్రయత్నం చేశారు. జిల్లాలో అన్ని ఆర్టీసీ సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. సమైక్యాంధ్ర జెఎసి నాయకులను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. సమైక్యాంధ్ర జెఎసి ఇచ్చిన మూడు రోజుల బంద్ పిలుపులో మొదటి రోజు బంద్‌ను యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం గమనార్హం. కళ్యాణదుర్గంలో రెవెన్యూమంత్రి రఘువీరారెడ్డి ఇంటిని ముట్టడించిన సమైక్య ఉద్యమకారులు ఆయన ఇంటిపై రాళ్లదాడి చేశారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రిలో ఇదే రకమైన పరిస్థితి ఉంది. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఇందిర, రాజీవ్‌గాంధీ విగ్రహాలను సమైక్యాంధ్ర ఉద్యమకారులు ధ్వంసం చేశారు. ఎక్కడికక్కడ రహదారుల దిగ్బంధం, రాస్తారోకోలు, ధర్నాలు, రైలురోకోలు నిర్వహించారు.
అదనపు బలగాల మోహరింపు
జిల్లా కేంద్రంలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అదనపు బలగాలను దించాలన్న యోచనలో ఉన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో రెండు కంపెనీల సిఆర్‌పిఎఫ్, ఒక కంపెనీ ఐటిబిపి, ఒక కంపెనీ కర్ణాటక పోలీసు బలగాలు ఉన్నాయి. మొదటి రోజు నిరసనను దృష్టిలో ఉంచుకుని మరోమూడు కంపెనీల బలగాలను జిల్లాకు తరలించే యత్నంలో పోలీసు శాఖ ఉంది. ఇప్పటికే ఐదుగురు అడిషనల్ డిజిలను భద్రత పర్యవేక్షణ కోసం నియమించారు. రాయలసీమ ఐజి ప్రత్యేకంగా అనంతపురం లో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

పల్లె పోరులో సైకిల్ జోరు
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, జూలై 31 : జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన సం‘గ్రామం’లో టిడిపి జోరు కొనసాగించింది. మూడు విడతల్లోనూ తనదైన శైలిలో ఓట్లు సాధించి క్షేత్రస్థాయిలో ఎదురులేదని నిరూపించుకుంది. మూడు విడతల్లో అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఎన్ని పార్టీ లు వచ్చినా క్షేత్రస్థాయిలో తన ఓటు బ్యాంకుకు వచ్చిన ఢోకా ఏమీ లేదని మరోమారు టిడిపి నిరూపించుకుంది. జిల్లాలో మొత్తం 1003 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో రాయదుర్గం మండలం బిఎన్ హళ్లి ఎస్టీలకు రిజర్వు అయ్యింది. అయితే ఇక్కడ ఎవ్వరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. 1002 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. అందులో టిడిపి 433 స్థానాలతో మొదటి స్థానంలో నిలిచింది. 261 స్థానాలను కైవసం చేసుకుని వైకాపా రెండవస్థానంలో ఉండగా అధికార పార్టీ 251 స్థానాలతో ఆఖరు స్థానంలో నిలిచింది. సిపిఐ, సిపిఎం చెరో స్థానంలో విజయం సాధించగా వామపక్షాలతో కలిపి స్వతంత్రులు మొత్తం 61 స్థానాలను కైవసం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి తన ఓటు బ్యాంకును కాపాడుకోవడంతోపాటు మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.
మూడవ విడతలోనూ టిడిపిదే హవా
మూడవ విడత ఎన్నికల్లో టిడిపి తన హవా నిరూపించుకుంది. మొదటి, రెండవ విడతల్లోనూ సాధించిన మాదిరిగానే మూడవ విడతలోనూ అత్యధిక స్థానాలు సాధించి మొదటి స్థానంలోనిలిచింది. మూడవ విడతలో 388 గ్రామ పంచాయతీలకు గాను 43 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 345 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 88.53 శాతం పోలింగ్ నమోదైంది. టిడిపి 127 గ్రామ పంచాయతీల్లో, వైకాపా 120 స్థానాల్లో, అధికార కాంగ్రెస్ పార్టీ 115 స్థానాల్లో, వామపక్షాలు ఒకటి, స్వతంత్రులు 25 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించారు. అనంతపురం రూరల్‌లోని నారాయణపురం పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడవ విడతలో ఆత్మకూరు, కూడేరు, రాప్తాడు, విడపనకల్, అనంతపురం రూరల్‌లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరువలేదు. శింగనమల నియోజకవర్గంలో కూడా అధికార పార్టీ పరిస్థితి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా అతి తక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం గమనార్హం.
88.53 శాతం పోలింగ్
అనంతపురం సిటీ : అనంతపురం డివిజన్ పరిధిలోని 20 మండలాల్లో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 88.53 శాతం ఓట్లు ప్లోయ్యాయి. అత్యధికంగా శింగనమలలో 92.36 శాతం, అత్యల్పంగా ఉరవకొండలో 78.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుండి ఓటర్లు బారులు తీరి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మండలాల వారిగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అనంతపురం రూరల్‌లో 81, ఆత్మకూరు 90.72, బికె.సముద్రం 88, గార్లదినె్న 90.06, గుత్తి 89, గుంతకల్లు 92, కూడేరు 89.69, నార్పల 91.86, పామిడి 92, పెద్దపప్పూరు 91.25, పెద్దవడుగూరు 90, పుట్లూరు 91.5, రాప్తాడు 90.61, శింగనమల 92.36, తాడిపత్రి 85.32, ఉరవకొండ 78.15, వజ్రకరూరు 86, విడపనకల్లు 89, యాడికి 80.08, యల్లనూరులో 92.18 శాతం ఓట్లు పోలయ్యాయి. 345 సర్పంచ్‌స్థానాలు, 3,845 వార్డులకు బుధవారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ డియస్. లోకేశ్‌కుమార్ తెలిపారు. జెడ్పి సిఇఓ విజయేందిర, ట్రైనీ కలెక్టర్ నాగలక్ష్మి, ఎన్నికల పరిశీలకులు అన్ని మండలాలు విస్తృతంగా పర్యటించి ఎన్నికలను పర్యవేక్షించారు.
ఆగ్రహ జ్వాలలు
అనంతపురం టౌన్, జూలై 31: రాష్ట్ర విభజన సెగలు నగరంలో విధ్వంసానికి దారితీశాయి. యువత ఆగ్రహ జ్వాలకు నగరంలోని రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలు నేలకూలాయి. విధ్వంసానికి అడ్డుతగులుతున్న పోలీసులపైకి రాళ్ళు రువ్వారు. శ్రీకంఠం సర్కిల్‌లో ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఎతె్తైన భవనంపైకి వెళ్ళి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా సన్నిహితులు అడ్డుకుని కిందకు తీసుకువచ్చారు. నలువైపుల నుంచి యువకులు పోలీసులను చుట్టుముట్టి రాళ్ళు రువ్వటంతో వారిని తరిమేందుకు నానాపాట్లు పడ్డారు. ఒక దశలో వారిని నివారించటానికి 13 రౌండ్ల బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆందోళనకారులు రాళ్ళు రువ్వటంతో పలువురు పోలీసులు, పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు గాయపడ్డారు. ఎస్.పి శ్యామ్‌సుందర్‌పై సైతం ఆందోళనాకారులు రాళ్ళు రువ్వారు. అంతటితో ఆగక సప్తగిరి సర్కిల్ నుంచి కూల్చివేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని టవర్‌క్లాక్ వద్దనున్న ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు ఈడ్చుకుంటూ వెళ్ళి టవర్‌క్లాక్ చుట్టూ తిప్పి నిప్పుపెట్టారు. విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోవటానికి యత్నించిన పోలీస్ యంత్రాంగం యువకులు ధాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. ఒక దశలో ఆందోళనకారులను నియంత్రించటం పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారింది. దీనితో చేసేదేమి లేక రాజీవ్‌గాంధీ విగ్రహ విధ్వంసకాండను ప్రేక్షకుల్లా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని కూల్చివేయటంతో ఆగని వారు డివైడర్లను కూల్చివేసింది. అలాగే ట్రాఫిక్ ఐలాండ్లలోని మొక్కలను పీకిపారేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పగులగొట్టింది. అమరవీరుల స్థూపాన్ని సైతం కూల్చివేశారు. పాతవూరులోని మరువవంక పక్కన ఉన్న బిజెపి కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కాంగ్రెస్ భవన్ అద్దాలను పగులగొట్టారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఐదు ఆర్‌టిసి అద్దె వాహనాలను ధ్వంసం చేశారు. టవర్‌క్లాక్ వద్దనున్న లేపాక్షి ఎంపోరియమ్, సిండికేట్ బ్యాంక్ ముందు భాగంలోనున్న నిర్మాణాలను ధ్వంసం చేశారు. అలాగే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని కూరగాయల మార్కెట్, హెడ్ పోస్ట్ఫాస్, బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసులపై దాడికి పాల్పడ్డారు. తహశీల్దార్ కార్యాలయంలోకి దూసుకెళ్ళి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. కుండీలలోని మొక్కలను ధ్వంసం చేశారు. కార్యాలయంలోని ప్రైవేటు వ్యక్తుల బైకులను ధ్వంసం చేశారు. దీంతో వాహన యజమానులు బావురుమన్నారు. ఐదంతస్తుల రఘువీరా టవర్స్‌పై రాళ్ళు రువ్వి అద్దాలను పగులగొట్టారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని డిగ్రీ కాలేజీ అద్దాలను ధ్వంసం చేశారు. కొఠారీ ఫ్యాన్సీ షాపుపైకి రాళ్ళు రువ్వారు. పార్టీలతో ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా యువకులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయటంతో వారిని నియంత్రించటం ఎవరి తరం కాలేదు. ఉదయం నుంచి సమైక్యాంధ్ర బంద్ పిలుపుకు స్పందించి స్వచ్ఛందంగా షాపులు, టీకొట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేసి మద్దతు ప్రకటించారు. పూలు, పండ్ల దుకాణాలు కూడా మూతబడ్డాయి. ఆటోలు సైతం నడపకపోవటంతో నగరం రోడ్డుల బోసిపోయినట్లైంది. ఆర్‌టిసి బస్సులు, ప్రైవేటు బస్సులు సైతం డిపోల నుంచి బయటకు రాకపోవటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రయాణికులు, రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సర్వీసులైన మెడికల్‌షాపులు సైతం మూసివేయటం విశేషం. ఇరుకు సందులలో సైతం షాపులు, టీకొట్టులు మూసివేశారు. అంతకుముందు ఉదయానే్న కాంగ్రెస్ నేతలు కొందరు సమైక్యాంధ్ర బ్యానర్ పట్టుకుని నగరంలోని సుభాష్ రోడ్డు, రాజూ రోడ్డులో తిరిగారు. శ్రీకంఠం సర్కిల్‌లో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసే ప్రయత్నంలో నాగరాజుకు కాలు విరిగింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో టైర్లను కాల్చివేయటంతో నల్లటి దట్టమైన పొగలు వ్యాపించాయి. డివైడర్లను పగులగొట్టి రోడ్డుకు అడ్డంగా వేసి రాకపోకలకు అవరోధం కలిగింది. ఆందోళనకారులను తరిమికొట్టేందుకు పోలీసులు వాహనాలలో వెంటపడి తరిమారు. అయితే ఆందోళనాకారులు కమలానగర్, గుల్జార్‌పేట సందుల్లోకి పరుగెడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి పంచాయతీ ఎన్నికలు ముగించుకుని పెద్ద ఎత్తున పోలీసు బలగాలు తరలిరావటంతో ఆందోళనకారుల హడావిడి తగ్గింది. ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ విద్యార్థులు సైతం కాలేజీలోకి, బ్రిడ్జిపైకి పరుగులు తీయటంతో వారిని పోలీసులు వెంటపడి తరిమారు. నగరంలో ఆందోళనకారుల ఆగ్రహానికి గురై ప్రధాన వీధులన్నీ రాళ్ళు, రప్పలు, మొక్కలు, విరిగిన అద్దాలు, డివైడర్లు, కడ్డీలతో రణరంగాన్ని తలపింపచేశాయి.
నేడు జిల్లాలో పాఠశాలలకు సెలవు
అనంతపురం సిటీ: సమైక్యాంధ్ర ఉద్యమమంలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ డియస్.లోకేశ్‌కుమార్ సెలవు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జిల్లా విద్యాధికారి డి.మధుసూదన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు గమనించాలని తెలిపారు.
ఆర్ట్స్ కళాశాలకు వారం రోజులు సెలవులు
సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేటి నుండి ఆర్ట్స్ కళాశాలకు వారం రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రంగస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్స్ కళాశాల, హాస్టల్స్‌లో వున్న అందరు విద్యార్థులు ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాలన్నారు. కళాశాలను, హాస్టల్స్‌ను తిరిగి ఈ నెల 7వ తేదీన తెరవనున్నట్లు ఆయన తెలిపారు. గురువారంఉదయం నుండి ఆర్ట్స్ కళాశాల హాస్టల్‌ను మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణను ప్రకటించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ఆరోపించారు. బుధవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించే ముందు అన్ని ప్రాంతాలను పరిగణలోకి తీసుకోలేదని కేవలం హైదరాబాదుతో కూడిన ప్రజల ఆంకాంక్ష మేరకు తెలంగాణను ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నారాయణస్వామి, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎస్కేయూలో ఆమరణ నిరాహార దీక్షలు
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శ్రీకృష్ణదేవరాయుల విశ్వవిద్యాలయంలో ఉద్యోగ, విద్యార్థి నాయకులు ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. బుధవారం ఉదయం 6 గంటలకే జాతీయ రహదారిపై అడ్డంగా రాళ్లు వేసి ఎటువంటి వాహనాలు తిరిగకుండా బంద్ చేశారు. అంతకుముందు యూనివర్సిటీలో అన్ని విభాగాలు స్వచ్ఛందంగా బంద్ చేసి జాతీయ రహదారిపైకి వచ్చారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ప్రకటనను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో జరగబోవు ఉద్యమాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం జెఎసి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేయూ అధ్యాపక, ఉద్యోగ, విద్యార్థి జెఎసి ప్రొఫెసర్లు సదాశివరెడ్డి, రాజేశ్వరరావు, ప్రతాప్‌రెడ్డి, నాగయ్య, కేశవరెడ్డి, రామకృష్ణ, వెంకటరాముడు, సూర్యనారాయణ, రాము, విద్యార్థి నాయకులు పరుశురాంనాయ

* ఇందిర, రాజీవ్ విగ్రహాలకు నిప్పు * రెచ్చిపోయిన సమైక్యవాదులు
english title: 
v

కోనసీమలో కాంగ్రెస్ హవా

$
0
0

అమలాపురం, జూలై 31: పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. తుది విడత ఎన్నికలు జరిగిన అమలాపురం డివిజన్‌లోని 249 గ్రామ పంచాయతీలకు బుధవారం జరిగిన ఎన్నికలు స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. డివిజన్‌లో 81.91 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తొలి రెండు విడతల కంటే ఎక్కువ స్థానాలు అమలాపురం డివిజన్‌లో నమోదుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 100కి పైగా సానుభూతిపరులు విజయం సాధించారు. టిడిపి ఈసారి కూడా రెండవ స్థానానికి పరిమితమైంది. వైఎస్సార్‌సిపి పరిస్థితి మరింత దారుణంగా దిగజారింది. అమలాపురం డివిజన్‌పై గంపెడాశలు పెట్టుకున్న వైఎస్సార్‌సిపి కేవలం మూడు పదులు కూడా పొందలేక చతికిల పడింది. స్వయంగా జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి నాయకత్వం వహిస్తున్న అమలాపురం డివిజన్‌లో ఆ పార్టీకి లభించిన స్థానాలు పార్టీ పరిస్థితిని తేటతెల్లం చేసాయి. స్వతంత్రులు సాధించిన స్థానాల్ని కూడా ఆ పార్టీ సాధించలేక పోయింది. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గంలో ఆశించిన ఫలితాలు పొందలేకపోయారు. మొత్తం 60 పంచాయతీలకు గాను ఆయన వర్గీయులు 24 చోట్లే విజయం సాధించారు. మిగిలిన చోట్ల టిడిపి తన సత్తా చాటింది. ఈదరపల్లి పంచాయతీలో మంత్రి అనుచరుడు నక్కా సంపత్‌కుమార్ తీవ్రమైన పోటీలో ప్రత్యర్థుల్ని ఎదుర్కొని విజయం సాధించారు. గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి స్వగ్రామం వేగివారిపాలెంలో టిడిపి విజయం సాధించింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వగ్రామం చింతలమోరిలో టిడిపి అభ్యర్థి కారుపల్లి విజయమోహన్ ఘనవిజయం సాధించారు. టిడిపికి చెందిన వివిఎస్ గోపాలరావు శంకరగుప్తం సర్పంచ్‌గా ఎన్నిక కాగా, ఆయన కుమార్తె నాగలక్ష్మి పడమటిపాలెం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రతిష్టాత్మకమైన కాట్రేనికోన పంచాయతీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి నాగిడి నాగేశ్వరరావుపై కాంగ్రెస్ బలపరిచిన శ్రీ రాజా కాకర్లపూడి లక్ష్మీకాంతరాజు( రాంబాబు) 1300 ఓట్లతో ఘనవిజయం సాధించారు. ఇలా రికార్డుస్థాయి విజయాలు ఎన్నో నమోదయ్యాయి. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమలాపురం డిఎస్పీ కె రఘు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
పంచాయతీల వారీగా విజేతల వివరాలు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జూలై 31: తుది విడత అమలాపురం రెవెన్యూ డివిజన్‌లో మొత్తం 272 పంచాయితీలకు గాను 249 పంచాయతీల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 97 స్థానాలు దక్కించుకుని తన పట్టును నిరూపించుకుంది. తెలుగుదేశం పార్టీకి 73, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30, ఇతరులకు 43 స్థానాలు అమలాపురం మండలంలో 22 పంచాయతీలుండగా కాంగ్రెస్‌కు 11 పంచాయతీలు దక్కగా, తెలుగుదేశం పార్టీకి 10, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 1 స్థానాలు దక్కాయి. ముమ్మిడివరం మండలంలో 16 పంచాయతీల్లో కాంగ్రెస్ 6, తెలుగుదేశం 4, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 2, ఇతరులు 4పంచాయతీల్లో విజయం సాధించారు. ఐ పోలవరం మండలంలో 14 పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీకి 8, టిడిపికి 3 దక్కాయి. కాట్రేనికోన మండలంలో 16 పంచాయితీల్లో కాంగ్రెస్ 3, టిడిపికి 3, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 1, ఇతరులు 9 పంచాయతీల్లో విజయం సాధించారు. ఉప్పలగుప్తం మండలంలో 17 పంచాయతీలకు కాంగ్రెస్‌కు 5, తెలుగుదేశం 11, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. అలాగే అయినవిల్లి మండలంలో 21 పంచాయతీలకు కాంగ్రెస్ 9, తెలుగుదేశం 6, వైఎస్సార్ కాంగ్రెస్ 5, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. అల్లవరం మండలంలో 21 పంచాతీయతీలకు గాను కాంగ్రెస్‌కు 8. టిడిపికి 6, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 2, ఇతరులకు 5 పంచాయతీలు దక్కాయి. అంబాజీపేట మండలంలో కాంగ్రెస్‌కు 5, తెలుగుదేశం పార్టీకి 6, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 2, ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు. డి గన్నవరం మండలంలో 20 పంచాయతీలకు కాంగ్రెస్‌కు 10, టిడిపికి 4, ఇతరులు 4 పంచాయతీలో విజయం సాధించారు. కొత్తపేట మండలంలో 10 పంచాయతీలకు గాను కాంగ్రెస్‌కు 5. టిడిపి 1, వైఎస్సార్ కాంగ్రెస్ 2, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. రావులపాలెం మండలంలో 12 పంచాయతీలకుగాను కాంగ్రెస్‌కు 3, టిడిపికి 2, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 3, ఇతరులు ఒక పంచాయతీలో విజయం సాధించారు. ఆత్రేయపురం మండలంలో 17 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్‌కు 12, టిడిపికి 1, వైఎస్సార్ కాంగ్రెస్ 4కు 4 స్థానాలు దక్కాయి. రాజోలు మండలంలో 16 పంచాయతీలకుగాను కాంగ్రెస్‌కు 4, టిడిపికి 6, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 1, ఇతరులు 5 పంచాయతీల్లో గెలుపొందారు. మలికిపురం మండలంలో 20 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 8, టిడిపికి 7, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 3, ఇతరులు రెండు పంచాయతీల్లొ విజయం సాధించారు. సఖినేటిపల్లి మండలంలో 16 పంచాయతీలకు కాంగ్రెస్‌కు 7, టిడిపికి 4, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మామిడికుదురు మండలంలో 18 పంచాయతీలకు గాను కాంగ్రెస్‌కు 6, టిడిపికి 3, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 1, ఇతరులు 8 పంచాయతీల్లో విజయం సాధించారు.

బంద్ సంపూర్ణం
*ఉద్యోగ, విద్యార్థి వర్గాల ఆందోళన *ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్
పత్తా లేని తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జూలై 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉద్యోగ, విద్యార్థి జెఎసి పిలుపుమేరకు జిల్లాలో బుధవారం బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు రాజకీయ పార్టీల నుండి నామమాత్రపు స్పందన కానరాగా, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రథాన కూడళ్ళలో మానవ హారాలు, రాస్తారోకోలతో ఉద్యోగ, విద్యార్ధి సంఘాలు నిరసన నిర్వహించాయి. ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. అధికార కాంగ్రెస్, ప్రథాన ప్రతిపక్షం తెలుగుదేశం సహా ఇతర రాజకీయ పార్టీల నేతల పాత్ర ఈ బంద్‌లో నామమాత్రంగా కనిపించినప్పటికీ, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున (మిగతా 6వ పేజీలో)
ఆందోళన నిర్వహించాయి. జై సమైక్యాంధ్ర పేరుతో జిల్లా కేంద్రంలో సోనియాగాంధీ, కె చంద్రశేఖరరావు తదితరుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సినిమా హాళ్ళలో నాలుగు ఆటలనూ రద్దు చేసినట్టు బోర్డులు వ్రేలాడదీశారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అయితే బస్సులు మధ్యాహ్నం నుండి యధావిధిగా తిరిగాయి. కాగా బంద్ పట్ల అధికార కాంగ్రెస్ నేతలు కాస్త ఆలస్యంగానే స్పందించారు. కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పంతం నానాజీ, కాకినాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కంపర రమేష్, పిసిసి కార్యదర్శులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, విలియం హ్యారీ తదితరుల ఆధ్వర్యంలో భానుగుడి జంక్షన్‌లో ప్రదర్శన నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు బంద్ నేపథ్యంలో పత్తా లేకుండా పోయారు. గతేడాది సమైక్యాంధ్ర ఉద్యమానికై రాజకీయ పార్టీలతో ఉమ్మడివేదికపై నిలచి ఆందోళన చేపట్టిన టిడిపి నేతలు తీరా ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ప్రకటన వచ్చేసరికి మొహాలు చాటేయడం విశేషం! వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి సమైక్యాంధ్రకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఇంతకు ముందే సమైక్యాంధ్రకు మద్దతుగా తమ పార్టీ సీమాంధ్ర శాసన సభ్యులు రాజీనామాలు సమర్పించారని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం ఆందోళన నేపథ్యంలో పత్తా లేకుండా పోయారు. జిల్లాలోని ప్రజాప్రతినిధుల స్పందన కూడా బంద్ నేపథ్యంలో అంతంతమాత్రంగా కనిపించింది. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ తాళం వేసి తన నిరసన తెలియజేశారు. హస్తకళల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు పంతం నానాజీ, కాకినాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కంపర రమేష్, పిసిసి కార్యదర్శులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, విలియం హ్యారీ, మాజీ కార్పొరేటర్ బసవా చంద్రవౌళి నేతృత్వంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా నిర్వహించి, బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భారీ పోలీసు పహారా నిర్వహించారు. ప్రత్యేక సాయుధ దళాలు, కేంద్ర బలగాల గస్తీని ముమ్మరం చేశారు.
తెలంగాణ ప్రకటనతో యువకుడు ఆత్మహాత్యాయత్నం
సామర్లకోట, జూలై 31: ప్రత్యేక తెలంగాణ ప్రకటించడాన్ని తట్టుకోలేక సామర్లకోట భాస్కర్‌నగర్ కాలనీకి చెందిన యువకుడు బోయిన బాబి (23) బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సేపేని సురేష్ ఇచ్చిన సమాచారం ప్రకారం బుధవారం ఉదయం సమైక్యాంద్రాకు మద్దతుగా నిర్వహించిన తమ పార్టీ ఆందోళనలో పాల్గొన్న బాబీ మద్యాహ్నం ఇంటికి వెళ్లి పురుగులమందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు హుటాహుటిన అతడిని తొలుత పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తదుపరి మెరుగైన వైద్య చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయమై స్థానిక పోలీసులను వివరణ కోరగా, పూర్తి వివరాలు తెలియదని, అయితే తమకు ప్రాథమిక సమాచారం ఉందని చెప్పారు.
హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవికి పంతం రాజీనామా
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జూలై 31: ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత పంతం నానాజీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. సమైక్యాంధ్రగానే రాష్ట్రాన్ని కొనసాగించాలన్న డిమాండ్‌తో తన పదవికి రాజీనామా చేసినట్టు ఆయన బుధవారం రాత్రి ఆంధ్రభూమి ప్రతినిధికి ఫోన్ ద్వారా తెలియజేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసేందుకు హుటాహుటీన నానాజీ హైదరాబాద్ వెళ్ళారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించేందుకు ప్రయత్నించిన తనను సిఎం వారించినట్టు ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర కోసం తన దారిలోనే జిల్లాకు చెందిన నేతలు పయనిస్తారన్న విశ్వాసం ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో గురువారం భవిష్యత్ కార్యాచరణపై సీమాంధ్ర మంత్రుల సమావేశం జరుగనున్న నేపథ్యంలో వారు తీసుకోనున్న నిర్ణయంపైనే కార్యాచరణ ఆధారపడి ఉంటుందన్నారు. ఆ తర్వాత రాజీనామాలు చేసేవారి సంఖ్య పెరగవచ్చని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో సమైక్యవాదులు రాష్ట్రాన్ని విభజించేందుకు అంగీకరించరని పంతం అన్నారు. కాగా పంతం హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు గడవకముందే రాజీనామా చేయడం గమనార్హం! ఈనెల మొదటి వారంలో ఆయన హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే!

జిల్లా కాంగ్రెస్‌కు రాజీనామాల ఒత్తిడి

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న నాయకులు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జూలై 31: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అన్ని స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తల నుండి రాజీనామాల ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే కీలకంకావటంతో, ఆ పాపాన్ని తాము మోయలేమంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. టిటిడి పాలకవర్గ సభ్యుడు, మాజీ ఎంపి చిట్టూరి రవీంద్ర తన అనుచరులతో కలిసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, టిటిడి బోర్డు పాలకవర్గ సభ్యత్వ పదవికి రాజీనామాచేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. పైపెచ్చు రాజానగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఉన్న కాంగ్రెస్ జెండాను తానే స్వయంగా తొలగించి, రాష్ట్ర విభజన పట్ల తనకున్న తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేసారు. పార్టీలో ఉంటూ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాల్లో భాగస్వాములయ్యే కన్నా, పార్టీ నుండి బయటకొచ్చి సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు పోరాటం చేయటమే మంచిదన్న అభిప్రాయానికి వీరంతా వచ్చారు. ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ తన శాసనసభ్యత్వ పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానిక రాజీనామాచేసినట్టు ప్రకటించిన సంగతి విదితమే. రాజమండ్రిలోని హితకారిణి సమాజం చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడ్డిగ శ్రీనివాస్ రాజీనామా చేసారు. అయితే పార్టీ సభ్యుడిగా కొనసాగుతానని ఆయన ప్రకటించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కూడా తమ పార్టీ పదవులకు, నియోజకవర్గ స్థాయిలోని నామినేటెడ్ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. దాంతో జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా తయారయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు నచ్చచెప్పుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్‌లోనే ఉండి, పరిణామాలను సమీక్షించుకుంటున్నారు. జిల్లాకు వచ్చి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కొంత మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే మకాం చేసారు. జిల్లాకు చెందిన మంత్రులు తోట నరసింహం, పినిపె విశ్వరూప్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని మంత్రి తోట నరసింహం చెప్పారు. పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధైర్యంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో బహిరంగంగా పాల్గొంటుంటే, పార్టీలోనే కొనసాగుతున్న నాయకులు మాత్రం అంతర్మథనంతో లోలోపల తీవ్ర వేదనకు గురవుతున్నారు.
3దేశం2 పరిస్థితీ అంతే!
తెలుగుదేశం పార్టీలోని నాయకులు, కార్యకర్తల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. అయితే పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించి పార్టీ నుండి బయటకు రావటమా? లేక పార్టీలోనే ఉంటూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమించటమా? అనే అంశంలో స్పష్టమైన నిర్ణయానికి రాలేక 3దేశం2 నాయకులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. విలేఖర్ల సమావేశాలు ఏర్పాటుచేసి, తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తంచేసే పనిలో దేశం నాయకులు ఉన్నారు.
జెండా పీకేశారు!
*రాజానగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ
*మూకుమ్మడి రాజీనామాలు చేసిన నేతలు, కార్యకర్తలు
కోరుకొండ, జూలై 31: రాజానగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలంతా బుధవారం మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు, మాజీ ఎంపి, టిటిడి ట్రస్టు బోర్డు సభ్యుడు చిట్టూరి రవీంద్ర టిటిడి పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలోని పార్టీ జండాను రవీంద్ర స్వయంగా పీకేశారు. అంతకుముందు మండల కేంద్రమైన కోరుకొండలో, రాజానగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం రాజానగరం నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం కాంగ్రెస్ పార్టీ, టిటిడి బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాజకీయ కోణంలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణాను విడగొట్టిందని విమర్శించారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు చెప్పిన విషయాలను పక్కన పెట్టి సోనియాగాంధీ తెలంగాణా ఇచ్చారని, పార్టీలో ఉంటే అవును అనాలని, పార్టీలో లేకుంటే అది తప్పు అని చెప్పవచ్చని, అందుకే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. పార్టీలు, పదవుల కంటే రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు ముఖ్యమన్నారు. అదే విధంగా శాంతియుత పోరాటాల ద్వారా ఉద్యమాలు చేసి సోనియా దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ఆయనతో పాటు మొత్తం నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్-1 అధ్యక్షులు, కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించడంతో రాజానగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది.
విధులకు 5వరకు న్యాయవాదులు గైర్హాజరు
-- న్యాయవాదుల జెఎసి ఆవిర్భావం--
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జూలై 31: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆగస్టు 5వరకు న్యాయవాదులు విధులకు గైర్హాజరవ్వాలని జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ల అధ్యక్షులతో జరిగిన సమావేశం తీర్మానించింది. బుధవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ హాలులో జరిగిన సమావేశానికి రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిఎల్‌ఎన్ ప్రసాద్ అధ్యక్షతవహించారు. రాష్ట్ర విభజనకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ పదవులకు రాజీనామాచేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులకు సమావేశం అభినందించింది. మిగిలిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా అదే బాటలో నడవాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. సీమాంధ్రలో మొహరించిన పారా మిలటరీ దళాలను ఉపసంహరించాలని, వెంటనే వివిధ అధికారిక పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. సమావేశంలో బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, గోకుల్ కృష్ణ, కె మల్లపరాజు, పి భానుమూర్తి, జవహర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల జెఏసి ఆవిర్భావం
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించేందుకు న్యాయవాదుల జాయింట్ ఏక్షన్ కమిటీని సమావేశం ఎన్నుకుంది. జెఏసికి బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, కాకినాడకు చెందిన గోకుల్ కృష్ణ కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. సభ్యులుగా జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వ్యవహరిస్తారు.
హితకారిణి సమాజం చైర్మన్ పదవికి బుడ్డిగ రాజీనామా
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హితకారిణి సమాజం చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బుడ్డిగ శ్రీనివాస్ బుధవారం ప్రకటించారు. తాను పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనను అడ్డుకునే విషయంలో విఫలమయిన నేపథ్యంలో, కనీసం ఇప్పుడయినా అన్ని పార్టీల నాయకులు రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, ఏకతాటిపైకి రావాలని బుడ్డిగ పిలుపునిచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజనను ఎలాగూ అడ్డుకోలేమని, అయితే మెరుగైన ప్యాకేజిని సాధించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కలిసి ఉద్యమించాలన్నారు. రాష్ట్ర విభజన జరగటం వల్ల హైదరాబాద్‌లోని ఐఐటి, వరంగల్‌లోని ఎన్‌ఐటిల్లో ఆంధ్ర ప్రాంత విద్యార్ధులు స్థానికేతరులవుతారని, ఇలాంటి అనేక సమస్యలను ఆంధ్ర ప్రాంత విద్యార్ధులు ఎదుర్కొంటారని బుడ్డిగ ఆందోళన వ్యక్తంచేసారు. కేంద్రప్రభుత్వం ఒత్తిడి తీసుకురావటం ద్వారా మన విద్యార్ధులకు మెరుగైన విద్యాసౌకర్యాలను అందించాల్సిన బాధ్యత అన్ని పార్టీల నాయకులపైనా ఉందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాల పేరుతో సీమాంధ్ర ప్రాంత విద్యార్ధులను రోడ్లపైకి తీసుకురావటం, చదువులకు నష్టం కలిగించటం వంటి చర్యలకు దిగకుండా, రాజకీయపార్టీలే పూర్తి బాధ్యతను తీసుకోవాలని, రాష్ట్ర విభజన ద్వారా ఇప్పటికే నష్టపోతున్న విద్యార్ధులకు ఇక నష్టం కలుగకుండా విద్యాసంస్థలు కొనసాగనివ్వాలని సూచించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఇక పన్నులు చెల్లించకూడదని చైర్మన్ బుడ్డిగ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే చెందేలా పన్నులు చెల్లించాలన్నారు. విభజన ప్రక్రియ పూర్తికాక ముందు పన్నులు చెల్లిస్తే, ఆ పన్నులు ఉమ్మడి రాష్ట్రానికి చెందుతాయన్నారు. మన రాష్ట్రానికి అవరమైన వౌలిక సౌకర్యాలను కల్పించుకునేందుకు మనం చెల్లించే పన్నులు ఉపయోగపడాలన్నారు.
బాహాబాహీకి సిద్ధమైన నాయకులు
రాజమండ్రి: రాష్ట్ర విభజన ప్రధాన పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో చిచ్చుపెట్టింది. రాష్ట్ర విభజనకు కారణమంటూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు టిడిపి కార్యాలయం వద్ద, వైఎస్సార్‌సిపి కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక పోలీసులు, ఎపిఎస్పీ బలగాలు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. లేనిపక్షంలో ఆయా పార్టీల నాయకుల మధ్య బాహాబాహీ జరిగేది. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి గురువారం మధ్యాహ్నం విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఎన్‌ఎస్‌యుఐ నాయకుడు ఎస్‌ఏకె అర్షద్ ఆధ్వర్యంలో యువకులు మోటార్‌సైకిళ్లపై ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకుని పెద్దగా హారన్లు మోగిస్తూ టిడిపి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిడిపి నాయకులు పాలిక శ్రీను, తలారి భాస్కర్ వారిని హెచ్చరించి పంపించి వేశారు. విలేఖర్ల సమావేశానంతరం మళ్లీ వచ్చిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ హారన్లు మోగిస్తూ నినాదాలు చేయడంతో గోరంట్ల, నగర టిడిపి అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు తదితరులు వారి వద్దకు వచ్చి కాంగ్రెస్ ఎంపి, సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వాలని, ఎంపి ఇంటికి వెళ్లి ధర్నా చేయాలని ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. దీంతో కార్యకర్తలు, నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. గోరంట్ల, వాసిరెడ్డి తదితరులు ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలతో వాగ్వివాదం చేయడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఇరువర్గాలు బాహాబాహీకి సిద్ధమయ్యాయి. స్వయంగా గోరంట్ల ఆగ్రహంతో ముందుకు కదలడంతో మిగిలిన నాయకులు కూడా ఆయన వెంట యువజన కాంగ్రెస్ కార్యకర్తలతో బాహాబాహీకి సిద్ధమయ్యారు. గోరంట్ల యువజన కాంగ్రెస్ నాయకులతో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఈదశలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను విడదీసేందుకు ప్రయత్నించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. టిడిపి నాయకులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలను కొద్దిదూరం వరకు తోసుకుంటూ వెళ్లారు. కొద్దిసేపటి తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. డిఎస్పీ ఎన్ బాబ్జి, సిఐలు పరిస్థితిని చక్కదిద్దారు. ఈసమాచారం అందుకున్న పలువురు టిడిపి మాజీ కార్పొరేటర్లు, వారి అనుచరులు అక్కడికి చేరుకుని అర్షద్, కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి సిద్ధమయ్యారు. ఈవిషయం తెలుసుకున్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్ గోరంట్లకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పడంతో టిడిపి నాయకులు కొంత శాంతించారు. ఆతరువాత గోకవరం బస్టాండ్ వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మను టిడిపి నాయకులు తగులబెట్టి, ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, వైఎస్సార్‌సిపి నాయకులు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, జక్కంపూడి రాజా తదితరులు తమ ర్యాలీలో భాగంగా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయానికి చేరుకుని సోనియాగాంధీకి, ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక ఆకతాయి పక్కనే ఉన్న కాంగ్రెస్‌నాయకులతో కూడిన భారీ ఫ్లెక్సీని చింపివేశాడు. దీంతో అప్పటి వరకు కార్యాలయంలో ఉండి గమనిస్తున్న కాంగ్రెస్ నాయకులు నక్కా శ్రీనగేష్, ప్రసాదుల హరినాధ్, అల్లు బాబి కె హారిక తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హారిక ఆకతాయిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను విడదీశారు. అనంతరం వైఎస్సార్‌సిపి నాయకులు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. కొద్దిసేపటి తరువాత వారు తిరిగి వెళుతున్న సమయంలో ఒక యువకుడు ఉండవల్లిని వ్యక్తిగతంగా దూషించడంతో కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హారిక, నక్కా, ప్రసాదుల తదితరులు పరుగున వెళ్లి వైఎస్సార్‌సిపి నాయకులతో వాగ్యుద్ధానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య బాహాబాహీ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నాయకులు ఒక కార్యకర్తను కొట్టినంత పనిచేశారు. దీంతో మరోసారి పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను విడదీశారు. వైఎస్సార్‌సిపి నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు.
అమలాపురం: కాంగ్రెస్ పార్టీ తెలంగాణాకు అనుకూలంగా చేసిన ప్రకటన పట్ల సీమాంధ్రలో నిరసన జ్వాలలు రగులుతున్నాయి. తెలంగాణా ప్రకటన పట్ల నిరసనగా సీమాంధ్ర అంతటా నిరవధిక బంద్ జరుగుతుండగా బుధవారం కోనసీమలో నిరసనకారులు పలుచోట్ల నిప్పు పెట్టారు. కాంగ్రెస్ వైఖరి పట్ల తీవ్ర ఆవేదన చెందిన వారు పత్రికల్లో రాయలేని భాషలో దూషిస్తూ మోటారు సైకిళ్లపై తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. షాపులు తెరిచిన చోట్ల వ్యాపారస్తులతో తీవ్ర వాగ్వివాదాలు జరిగాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో టైర్లను గుట్టలుగా పోసి నిప్పు పెట్టారు. సిఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి కేంద్ర బలగాలతో మోహరించి టైర్లకు నిప్పు పెట్టకుండా అడ్డుకున్నప్పటికీ ఆందోళనకారులు శాంతించలేదు. జెఎసి ఛైర్మన్ విఎస్ దివాకర్, సిఐ శ్రీనివాసరెడ్డిలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదాలు జరిగాయి. హద్దుమీరితే అరెస్టులు చేస్తామని సిఐ హెచ్చరించగా, అరెస్టులేమిటి సమైకాంధ్ర కోసం మా ప్రాణాలే ఇస్తామంటూ ఆందోళనకారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ఆందోళనకారులు మోటారు సైకిళ్లపై తిరుగుతూ నానా హంగామా సృష్టించారు. కాంగ్రెస్‌ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. పట్టణంలో ఎక్కడ చూసినా టైర్లను అంటించటంతో మంటలు పెద్ద ఎత్తున రేగాయి. రావణ కాష్టాన్ని తలపించిన ఈ దృశ్యాలు చూసి మా రాష్ట్రాన్ని విడదీస్తారా అంటూ నిరసనకారులు గుండెలు బాదుకుంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పలువురు కార్యకర్తలు ఎత్తయిన భవనాలు, టవర్లు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించటంతో వారిని కిందికి దించటానికి పోలీసులు, జెఎసి నాయకులు, కార్యకర్తలు నానా తంటాలు పడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర బలగాల్ని భారీ సంఖ్యలో మోహరించి లాఠీఛార్జి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆందోళన కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు, జెఎసి ఛైర్మన్ విఎస్ దివాకర్, మాజీ ఛైర్మన్ జంగా బాబూరావు, వి రామలింగరాజు, ఎయు పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బండారు రామ్మోహనరావు, ఎం వేణుగోపాల్, ఎం గోపాలకృష్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, వర్రే శేషు, అల్లాడ శరత్‌బాబు, నల్లా చిట్టిబాబు, బెజవాడ సత్తిబాబు, నల్లా విష్ణుమూర్తి తదితరులు నాయకత్వం వహించారు.

చివరి దశ ఎన్నికల్లో వెబ్‌కాస్టింగ్ విజయవంతం
325 కెమేరాల ద్వారా పర్యవేక్షణ
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జూలై 31: అమలాపురం రెవెన్యూ డివిజన్‌లోని పంచాయతీలు, రంపచోడవరం డివిజన్ పరిధిలోని 7 గ్రామ పంచాయతీలకు బుధవారం నిర్వహించిన చివరి దశ ఎన్నికలను పర్యవేక్షించేందుకై ఏర్పాటుచేసిన వెబ్‌కాస్టింగ్ ప్రక్రియ విజయవంతమైంది. ఆయా డివిజన్ల పరిధిలో మొత్తం 325 వెబ్ కెమేరాల ద్వారా పోలింగ్ ప్రక్రియను అధికార్లు నిశితంగా గమనించారు. జిల్లాలో రాజమండ్రి, రంపచోడవరం డివిజన్లలో నిర్వహించిన తొలి దశ ఎన్నికల్లో సుమారు 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ప్రక్రియకు విఘాతం ఏర్పడిన విషయం తెలిసిందే! భారీ వర్షాలు, వరదల తాకిడికి వెబ్‌కాస్టింగ్ వ్యవస్థ దెబ్బ తినడంతో ఎన్నికల యంత్రాంగం మలి దశ ఎన్నికల్లో అప్రమత్తమైంది. తాజాగా నిర్వహించిన మూడో దశ ఎన్నికల్లో వెబ్ కెమేరాలు నూరు శాతం పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. అమలాపురం, రంపచోడవరం డివిజన్లలోని అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 నుండి పోలింగ్ ప్రారంభమైంది. 7.30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వెబ్ కెమేరాల కను సన్నల్లో పోలింగ్ జరిగింది. వెబ్ కాస్టింగ్ నిర్వహణకు బ్రాడ్‌బ్యాండ్, వైర్‌లెస్ లోకల్ లూప్, జనరేషన్ కనెక్టివిటీ విధానాల్లో కనెక్టివిటీని ఏర్పాటుచేశారు. ఉదయం 7.30 గంటలకే 215 వెబ్‌కాస్టింగ్ కెమేరాలు ఆన్‌లైన్ కాగా మిగిలినవి అర్ధగంట వ్యవధిలో ఆన్‌లైన్ కాబడి ఆయా పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ విజయతంతమైంది. జరుగుతున్న పోలింగ్ సరళి మొత్తాన్ని జిల్లా ఎన్నికల అధికార్లు కలెక్టరేట్ నుండి వీక్షించారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యాలయానికి వెబ్‌కాస్టింగ్ వ్యవస్థను అనుసంధానించారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్న తీరును హైదరాబాద్‌లో ఎన్నికల కమీషన్ అధికార్లు వీక్షించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు.

ఆకట్టుకున్న సైకత శిల్పం
కాకినాడ రూరల్, జూలై 31: కాకినాడ సాగరతీరం సైకత శిల్పాలకు కేరాఫ్ అడ్రసుగా మారింది. బుధవారం సాగర తీరంలో ఉప్పాడకు చెందిన ఉమ్మడి గోవింద్ భరతమాత విగ్రహాన్ని రూపొందించాడు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడిపోవడాన్ని ఆయన సైకత శిల్పంలో చూపించి నిరసన వ్యక్తం చేశాడు. దేశ చిత్రపటంలో భరతమాతకు ఉన్న ప్రాచుర్యాన్ని వివరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.

పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది.
english title: 
k

సమైక్యాంధ్ర బంద్ సంపూర్ణం, ప్రశాంతం

$
0
0

గుంటూరు, జూలై 31: యుపిఎ ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర కోరుతూ విద్యార్థి జెఎసి, సమైక్యాంధ్ర జెఎసి, వివిధ రాజకీయ పక్షాలు బుధవారం తలపెట్టిన బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. బంద్‌లో విద్యార్థి, సమైక్యాంధ్ర జెఎసి నాయకులతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. నగరంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు, వాణిజ్య, వ్యాపారరంగ సముదాయాలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు పూర్తి మద్దతు తెలిపి, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ముక్తకంఠంతో గర్హించారు. నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించి యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు, పాలాభిషేకాలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి సమైక్యాంధ్ర బంద్‌కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తన మద్దతుదారులతో కలిసి నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించి రాష్ట్ర విభజన పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేత క్రోసూరి వెంకట్ తదితరుల ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన నిర్వహించి, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. లక్ష్మీపురంలోని మదర్‌థెరిస్సా విగ్రహం సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్యానికి మద్దతు తెలిపారు. కాగా గురువారం కూడా సమైక్యాంధ్రను కోరుతూ బంద్‌ను కొనసాగించనున్నట్లు ఆయా పార్టీల నాయకులు ప్రకటించారు.
రాష్ట్ర విచ్ఛిన్నానికి బాబు, జగన్‌లే కారణం: ఎమ్మెల్యే మస్తాన్‌వలి
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్‌ఆర్ సిపి అధినేత జగన్‌లు అనుసరించిన ద్వంద విధానాల వల్లే రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు షేక్ మస్తాన్‌వలి ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో నిర్వహించిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ సెంటర్, కొత్తపేట, నాజ్‌సెంటర్, వెంకటేశ్వరా విజ్ఞాన మందిరం మీదుగా, హిందూ కాలేజ్ సెంటర్‌కు చేరుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి టిడిపి లేఖలు ఇవ్వడం, తెలంగాణాలో ఓట్ల కోసం జిమ్మిక్కులకు పాల్పడి రాష్ట్ర విభజనకు కారకులయ్యారన్నారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్ తెలుగు ప్రజల ఐక్యతకు కృషిచేస్తే చంద్రబాబు నాయుడు తెలుగుజాతి విచ్ఛిన్నానికి కారకుడయ్యారని దుయ్యబట్టారు. స్వార్ధపూరిత రాజకీయాలు, దమననీతి, కుట్రపూరిత ఆలోచనలతోనే ప్రతిపక్షాలు రాష్ట్ర విభజనకు కారణమయ్యాయని దుయ్యబట్టారు. ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, మాదా రాధాకృష్ణమూర్తి, బిట్రగుంట మల్లిక తదితరులు ఎమ్మెల్యే వెంట బంద్‌లో పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ సిపి ఆధ్వర్యంలో...
వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర విభజనకు నిరసనగా నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించిన అనంతరం శంకర్‌విలాస్, హిందూ కాలేజీ సెంటర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వద్ద గల గాంధీజీ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు తిరిగి హిందూ కళాశాల సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అక్కడి నుంచి లాడ్జిసెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సిపి నాయకులు షేక్ షౌకత్, నసీర్ అహమ్మద్, ఆతుకూరి ఆంజనేయులు, గులామ్ రసూల్, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ పోరులో టిడిపి హోరు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జూలై 31: దాదాపు ఏడేళ్ల అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన వైభవాన్ని చాటుకుంది. ఈనెల 23వ తేదీ నుండి జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ పోరులో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ప్రథమ స్థానంలో నిలవగా, వైఎస్‌ఆర్ కాంగ్రె స్, కాంగ్రెస్ పార్టీలు తదుపరి స్థానాల్లో నిలిచాయి. జిల్లా వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీని తట్టుకుని నిలబడలేక చతికిలపడటంతో ఆ పార్టీ తీవ్ర భంగపాటుకు గురికావాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పరాజయం పాలై నైరాశ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, పార్టీ నాయకత్వానికి పంచాయతీ ఎన్నికల్లో లభించిన ఘన విజయం పార్టీ నూతనోత్సాహానికి బాట వేసింది. ఈనెల 23న తెనాలి డివిజన్‌లోని 286 పంచాయతీలకు జరిగిన తొలివిడత ఎన్నికల్లో ఏకగ్రీవమైన పంచాయతీలతో కలిపి 115 స్థానాల్లో తెలుగు తమ్ముళ్లు పాగా వేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 72 స్థానాల్లోనూ, అధికార కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు కేవలం 33 స్థానాలకు పరిమితమయ్యారు. గుంటూరు డివిజన్ పరిధిలోని 260 పంచాయతీలకు జరిగిన రెండవ విడత ఎన్నికల్లోనూ దాదాపు 110 పంచాయతీలను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. తాజాగా బుధవారం నరసరావుపేట డివిజన్‌లో జరిగిన తుది విడత ఎన్నికల్లోనూ టిడిపి విజయభేరి మోగించింది. మొత్తం 293 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కడపటి సమాచారం అందేసరికి 151 స్థానాలను తెలుగుదేశం, 106 స్థానాలను వైఎస్‌ఆర్ సిపి, 55 స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మొత్తం మీద పంచాయతీ పవనాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వీచడంతో పార్టీకి పునర్వైభవం లభించే అవకాశాలున్నాయని కేడర్ భావిస్తోంది.

పెదరెడ్డిపాలెంలో దుండగుల బీభత్సం
నరసరావుపేట, జూలై 31: నరసరావుపేట డివిజన్‌లో బుధవారం పంచాయితీ ఎన్నికలు సజావుగా ముగుస్తున్న తరుణంలో నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెంలో ఐదు బ్యా లెట్ బాక్స్‌లను ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ కేంద్రాల నుండి తీసుకువెళ్ళి సమీపంలో ఉన్న బావిలో పడేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా గ్రామంలో తిరిగి పోలింగ్ నిర్వ హిస్తామని కలెక్టర్ సురేష్‌కుమార్ ప్రకటించారు. పెదరెడ్డిపాలెం గ్రామం లో సర్పంచ్ అభ్యర్థిగా ఎస్టీకి రిజర్వ్ కాగా, తోకల జగన్నాధం, కుంభా వెంకటేశ్వర్లు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిరువురికి గ్రామంలోని బలమైన సామాజికవర్గాలు మద్దతు ప్రకటించాయి. సుమారు 12గంటల సమయంలో కొందరు దుండగులు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి రెండో అంతస్తులో ఉన్న పోలింగ్ కేంద్రంలోని రెండుబ్యాలెట్ బాక్స్‌లను, కింద అంతస్తులో ఉన్న మరో మూడు బ్యాలెట్‌బాక్స్‌లను తీసుకువెళ్ళి బావి లో పడేశారు. అయితే పది పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 945ఓట్లు పోలవ్వాల్సి ఉండగా, సుమారు 75శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఎం శ్రీనివాసరావు, ఓఎస్‌డి సూర్యప్రకాశ్, తహశీల్దార్ పార్థసారధి, డిఎస్పీ పివి సుబ్బారెడ్డి తదితరులు సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. రెండుపార్టీలకు చెందిన ఇరువర్గాల వారు ఇరువైపుల మోహరించి ఒకరిపైనొకరు దుర్బాషలాడుకున్నారు. బ్యాలెట్ బాక్స్‌లను ఎత్తుకుపోయి బావిలోపడేసిన తీరును అధికారులు పరిశీలించారు. ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు ఆర్డీవోను కలిసి తమగోడును వెళ్ళబోసుకున్నారు. వెంటనే ఎన్నికలను నిర్వహించాలని ఒకవర్గం వారు ఎన్నికల అధికారి, ఆర్డీవోను నిలదీయగా, మరోవర్గం వారు తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. పోలింగ్‌కేంద్రం నుండి కొంతదూరం వచ్చిన తర్వాత అదేగ్రామానికి చెందిన ఒకవర్గంవారు ఆర్డీవో వాహనానికి అడ్డుకుని తమకు న్యాయం చేసి, వెంటనే పోలింగ్‌ను జరపాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న పరిణామాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళానని, ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి పరిశీలిస్తారని, అనంతరం వెంటనే నిర్ణయం తీసుకుంటారని ఆవర్గానికి నచ్చచెప్పారు. అయినప్పటికీ, వారు ఆర్డీవో చెప్పిన మాటను పెడచెవిన పెట్టి పోలీసులకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ, రోడ్డుపై బైఠాయించి, ఆర్డీవో వాహనాన్ని వెళ్ళనీవ్వకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ హుటాహుటిన పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చేరుకుని జరిగిన సంఘటనను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామానికి చెందిన ఒక వర్గం వారు రోడ్డుపై బైఠాయించి కలెక్టర్ వాహనాన్ని సైతం అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో కలెక్టర్‌కు, గ్రామానికిచెందిన వ్యక్తుల మధ్య కొద్దిపాటి వాగ్వివాదం చోటుచేసుకుంది. జరిగిన పరిస్థితులను తనకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్ స్పష్టంచేశారు. ఇదే సమయంలో పోటీలో ఉన్న ఎస్టీ సర్పంచ్ అభ్యర్థులు కలెక్టర్‌తో మాట్లాడుతూ తమకు ఏమీ తెలియదని, ఒకవర్గంపై మరోకవర్గం వారు ఆరోపణలు చేసుకున్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పోలింగ్ అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదికనుబట్టి తాను నిర్ణయం తీసుకుంటానని హామీఇచ్చి గ్రామం నుండి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా, పెద్దరెడ్డిపాలెం నుండి నరసరావుపేట వస్తున్న కలెక్టర్‌ను మార్గమధ్యలోని ములకలూరుగ్రామంవద్ద పెద్దరెడ్డిపాలెం గ్రామస్తులు మళ్ళీ అడ్డుకుని రాస్తారోకోను నిర్వహించేందుకు పూనుకున్నారు. దీంతో ఓఎస్‌డి సూర్యప్రకాశ్‌రావు రాస్తారోకోను నిర్వహించేవారిని అరెస్ట్‌చేసి, లాఠీచార్జీ చేశారు. రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు చెల్లాచెదురు కావడంతో అధికారుల వాహనాలు ఎట్టకేలకు నరసరావుపేటకు చేరుకున్నాయి. మండలంలోని ములకలూరు గ్రామంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి వార్డులోని ఆరోనంబర్ పోలింగ్‌కేంద్రంలో ఏజంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, వారిని వారించి, ఎన్నికల ప్రక్రియను కొనసాగేవిధంగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా పమిడిపాడులో ఏజంటు, ఓటరు మధ్య స్వల్ప ఘర్షణ జరగడంతో ఎన్నికల అధికారులు వారిని వారించి ఎన్నికల పోలింగ్‌ను సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ డివిజన్‌లోని 299 గ్రామాల్లో 3286 పోలింగ్‌కేంద్రాల్లో 88.3శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు. పెదరెడ్డిపాలెంలో కొందరు బయటి వ్యక్తులు బ్యాలెట్‌బాక్స్‌లను తీసుకువెళ్ళి బావిలో పడేసిన దృష్ట్యా గ్రామంలో రీపోలింగ్‌ను నిర్వహిస్తామని స్పష్టంచేశారు. పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. మహిళలు కలెక్టర్‌కు అడ్డుపడి, మమ్మల్నీ ఇళ్ళల్లో ఉండనివ్వరని, మీరు రక్షణ కల్పించాలని కోరగా, దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, మీరు ప్రశాంతంగా ఉండాలని, తప్పనిసరిగా రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ సురేష్‌కుమార్ వెంట ఆర్డీవో ఎం శ్రీనివాసరావు, ఓఎస్‌డి సూర్యప్రకాశ్‌రావు, డిఎస్పీ పివి సుబ్బారెడ్డి, తహశీల్దార్ పార్థసారధి తదితరులు ఉన్నారు.

నృసింహుని బంగారు గరుడోత్సవం
మంగళగిరి, జూలై 31: స్థానిక శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆర్జిత సేవల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారికి బంగారు గరుడోత్సవ సేవ నిర్వహించారు. దాసరి రామకృష్ణ, వెంకటలక్ష్మిరత్నం దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు. పలువురు భక్తులు పాల్గొని స్వామివారిని నేత్ర పర్వంగా దర్శించుకున్నారు. భక్తులు వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొని లక్ష్మీ నృసింహ స్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఆలయ ఇఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి కోరారు.

‘నాగార్జున’లో నిరసన జ్వాలలు
నాగార్జున యూనివర్సిటీ, జూలై 31: ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేయాలని కేంద్రంలోని యుపిఎ తీసుకున్న నిర్ణయంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆగ్రహం పెల్లుబికింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించాలని, సమైక్య రాష్ట్రానికే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వర్సిటీలో సోనియాగాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. వర్సిటీ హాస్టల్స్ నుండి ప్రదర్శనగా బయలుదేరిన విద్యార్థులు వర్సిటీ ప్రధానద్వారం వద్దకు చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వర్సిటీ ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు, విజయవాడ రహదారులను దిగ్భంధించారు. సుమారు 20 నిమిషాల సేపు విద్యార్థులు రాస్తారోకో నిర్వహించటంతో జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి పోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను చెదరగొట్టడంతో రాస్తారోకో విరమించిన విద్యార్థులు వర్సిటీ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్సిటీ సమైక్యాంధ్ర జెఎసి నాయకులు బి వెంటేశ్వర్లు మాట్లాడుతూ కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకున్న విభజన నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ వరుసగా మూడు రోజులు పాటు బంద్‌ను పాటిస్తున్నామని తెలిపారు. వర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పైడి రాజకుమార్ మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయడానికి నిర్ణయం తీసుకోవటం తెలుగు ప్రజలను తీవ్రమనస్తాపానికి గురి చేసిందన్నారు. విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించకోకపోతే సీమాంధ్ర ప్రజలు చేతిలో చావుదెబ్బ తినాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. వర్సిటీ విద్యార్థి నాయకుడు పి శ్యాంసన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వకుండా చూడాల్సిన భాద్యత విద్యార్థులపైన ఉందన్నారు. అనంతరం విద్యార్థులు, జెఎసి నేతలు వీసీ వియన్నారావును కలిసి సమైక్యాంధ్ర ఉద్యమానికి సహకరించాలని, మూడురోజులపాటు వర్సిటీలో బంద్ పాటిస్తున్న సందర్భంగా వర్సిటీలో గురువారం నుండి ఏర్పాటు చేయనున్న అకడమిక్ ఎగ్జిబిషన్‌ను వాయిదా వేయాలని కోరారు. మంగళగిరి సిఐ మురళీకృష్ణ, పెదకాకాని సిఐ శ్రీనివాసరావులు వర్సిటీలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఐఎన్‌టియుసి నాయకులు పిల్లి నాగేశ్వరరావు, కనకరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

తైక్వాండో జిల్లా స్కూల్‌గేమ్స్ జట్టు
గుంటూరు (స్పోర్ట్స్), జూలై 31: విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో బుధవారం జరిగిన అండర్-19 స్కూల్‌గేమ్స్ బాల బాలికల తైక్వాండో పోటీల్లో ఎంపికైన జిల్లా జట్టును కార్యదర్శి జి మునేశ్వరరావు ప్రకటించారు. జట్టులో బాలుర విభాగంలో టి శ్రీహరి, షేక్ అమీర్, వి సూరజ్‌కుమార్, ఎండి జిలాని (గుంటూరు), డి పృధ్వీరాజ్, పి తమీజ్‌ఖాన్ (తెనాలి), పి భార్గవ్, ఎన్ గోపిరాజు (రేపల్లె) బాలికల్లో డి రుధిర రాగరచన, జె సాహితి (గుంటూరు) ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు కర్నూలులో జరగనున్న రాష్టస్థ్రాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఎంపికలను ఆర్‌ఐఒ రూపస్‌కుమార్, వ్యాయామ అధ్యాపకులు ఉదయభాస్కర్, సంజీవరెడ్డి, టిటికె ప్రసాద్, వెంకటేశ్వరరావు, తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి జగన్మోహనరావు నిర్వహించారు.

సెంట్రల్ జోన్ మహిళా జట్టు
గుంటూరు (స్పోర్ట్స్), జూలై 31: గత కొద్ది రోజులుగా స్థానిక జెకెసి కళాశాల ఆవరణలో జరుగుతున్న ఎసిఎ సెంట్రల్ జోన్ మహిళా క్రికెట్ పోటీల్లో ప్రతిభను కనబర్చిన క్రీడాకారిణులను బుధవారం సెంట్రల్‌జోన్ జట్టుకు ఎంపిక చేశారు. జట్టుకు కృష్ణాజిల్లాకు చెందిన ఎస్ మేఘన కెప్టెన్‌గా, ఎస్ రమాదేవి (వెస్ట్ గోదావరి), పివి సుధారాణి (ప్రకాశం), ఆర్ కల్పన (కృష్ణా), ఎన్‌ఎస్‌పి రామలక్ష్మి (పశ్చిమ గోదావరి), సిహెచ్ ఝాన్సీలక్ష్మి (గుంటూరు), జి ధనలక్ష్మి, పి నాగమణి, పి వినీల, జి స్నేహ, మన్వీన్‌కౌర్ (కృష్ణా), డి దుర్గ్భావాని, ఎ ప్రియాంక (పశ్చిమ గోదావరి), డి మల్లిక, పి కల్పన (ప్రకాశం) జట్టుకు ఎంపికయ్యారు. స్టాండ్‌బైలుగా ఎ సత్యవాణి (పశ్చిమ గోదావరి), హెక్సిబా, డివై సంజన, ఆర్ సుకన్య (గుంటూరు), ఎన్ భావన (కృష్ణా), వై రమాదేవి (ప్రకాశం) ఎంపికయ్యారు.

పొన్నూరులో సమైక్యవాదుల ధర్నా, రాస్తారోకో
పొన్నూరు, జూలై 31: రాష్ట్ర విభజన యోచనను విరమించుకుని సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పొన్నూరు పట్టణంలో విద్యాసంస్థలు బుధవారం బంద్ జరిపాయి. కేంద్రప్రభుత్వ చర్యను గర్హిస్తూ రాజకీయ పక్షాల కార్యకర్తలు, సమైక్యవాదులు, విద్యార్థులు పట్టణంలో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా జరిపారు. చింతలపూడి గ్రామంలో గ్రామ సర్పంచ్ గంటా ప్రసాద్ నాయకత్వంలో టిడిపి కార్యకర్తలు గంటసేపు రాస్తారోకో జరిపారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పొన్నూరు పట్టణ కూడలి ప్రాంతంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే నరేంద్రకుమార్ నాయకత్వంలో పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తరలివచ్చిన టిడిపి కార్యకర్తలు ఎన్‌టిఆర్ విగ్రహం ఎదుట జిబిసి రోడ్డుపై రాస్తారోకో జరిపారు. ఈ సందర్భంగా నరేంద్రకుమార్ మాట్లాడుతూ రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విభజనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు యత్నిస్తున్న కాంగ్రెస్ గడ్డిబొమ్మను టిడిపి నాయకులు దగ్ధం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు కూడా తెలంగాణ వాదం గడ్డిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు బొద్దులూరి రంగారావు, గురుబాలు, పి వెంకటస్వామి, మారం వెంకటేశ్వరరావు, గేరా సంజీవ్, ఎస్‌కె షంషుద్దీన్, డి రాజారావు, దాసరి మోహనరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల సాంబశివరావు, శ్రీనివాసరావు, కుర్రా వీరయ్యచౌదరి, ఎద్దు సోంబాబు, రబ్బానీబాషా, పఠాన్ అహమ్మద్‌ఖాన్, చినగఫారీ, తమనం రవి, ఫైరజ్, పిన్నమనేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వివాదాలు, ఘర్షణలతో పలుచోట్ల ఉద్రిక్తత
నరసరావుపేట, జూలై 31: మండల కేంద్రమైన నకరికల్లులో పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడిన ఓటర్లు ఒకరిపైనొకరు ఘర్షణపడి వాగ్వివాదానికి దిగారు. ఈనేపథ్యంలో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు ఒకరిపైఒకరు రాళ్ళురువ్వుకుని భయభ్రాంతులకు గురిచేశారు. వెంటనే డిఎస్పీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో ఇరువర్గాలపై లాఠీలను ఝుళిపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మాచవరం మండలం మల్లవోలులో
మాచవరంమండలం మల్లవోలులోని ఓటర్ల జాబితాలో ఎస్సీలకు చెందిన 300ఓట్లను తొలిగించడంపై ఎస్సీలు ఒక్కసారిగా అధికారులపై తిరగబడ్డారు. దీనిపై అధికారులు బెంబేలెత్తిపోయారు. పోలింగ్ అధికారి, సిబ్బంది, తహశీల్దార్‌ను తీవ్రంగా నిరసించారు. అనంతరం తమ ఓట్లను తొలిగించినందుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అదేవిధంగా ఒక పోలింగ్ అధికారి కారు అద్దాన్ని ధ్వంసం చేశారు. అనంతరం పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తున్నారని గ్రామానికి చెందిన ఓ వర్గం వారు ఎస్సీలతో గొడవకు దిగారు. దీనిపై గ్రామానికి చెందిన ఇరువర్గాల వారు రాళ్ళు వర్షం కురిపించారు. కౌంటింగ్‌ను మల్లవోలులో నిర్వహించకుండా బ్యాలెట్‌బాక్స్‌లను మాచవరం ఎంపిడివో కార్యాలయానికి తరలించారు. అక్కడినుండి జిల్లాపరిషత్ హైస్కూల్‌కు బ్యాలెట్ బాక్స్‌లను తరలించి కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
రొంపిచర్ల మండలం తుంగపాడులో
రొంపిచర్లమండలం తుంగపాడులో రెండోవార్డు పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణ వల్ల సుమారు రెండుగంటలపాటు పోలింగ్‌ను ఎన్నికల అధికారులు నిలిపివేశారు. గ్రామంలో లేనివారి ఓట్లు వేస్తున్నారంటూ వచ్చిన అభ్యంతరాలు ఘర్షణకు దారితీశాయి. గొట్టిపాటి శ్రీనివాసరావు, ఏనుగంటి వెంకట రామారావుల మధ్య జరిగిన ఈఘర్షణలో వెంకట రామారావుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్ధారు.
నాదెండ్ల మండలం గణపవరంలో
మండలంలోని గణపవరంగ్రామ పోలింగ్‌కేంద్రం అధికారులు స్లిప్‌ల మడతను సక్రమంగా వేయడంలేదంటూ గ్రామస్తులు బుధవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. దీనిపై సమాచారం అందుకున్న కలెక్టర్ సురేష్‌కుమార్ గణపవరం గ్రామానికి చేరుకుని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. 2, 7, 10, 17 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 600ఓట్లకు సంబంధించిన స్లిప్‌లను ఎన్నికల అధికారులు సక్రమంగా మడవలేదని కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. దీనిపై కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ యాంటిక్లాక్‌వైజ్ డైరెక్షన్‌లో ఎన్నికలగుర్తు ఉంటుందని, దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కలెక్టర్ తెలిపారు. హైకోర్టు న్యాయవాది వలేటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దీనివల్ల వార్డుసభ్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారని కలెక్టర్ దృష్టికి తేగా, ఆందోళన చెందాల్సిన పనిలేదని కలెక్టర్ మరోసారి సమాధానం ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ వెంట తహశీల్దార్ చిన్నం సుధారాణి, ఆర్‌వోలు ఉన్నారు. బుధవారం సాయంత్రం ఎన్నికల అజ్వర్వర్ ఉదయలక్ష్మీ కౌంటింగ్ జరిగే స్థలాన్ని పరిశీలించారు. ఉదయలక్ష్మీ వెంట మేడికొండూరు ఎంపిడివో వై బ్రహ్మయ్య తదితరులున్నారు.

కారంపూడి మండలంలో సత్తా చాటిన టిడిపి
కారంపూడి, జూలై 31: మండలంలో తెలుగుదేశం పార్టీ తమ సత్తాను చాటుకుంది. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో గతంలోనే రెండు తెలుగుదేశం, మరో రెండు వైఎస్‌ఆర్ సిపి పార్టీలకు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 11 గ్రామ పంచాయతీలకు బుధవారం ఎన్నికలు జరగ్గా 8 పంచాయతీలను తెలుగుదేశం పార్టీ, మూడు పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కారంపూడి మండలం వైభవాన్ని చాటింది. కారంపూడి పంచాయతీకి టిడిపి తరపున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి కాల్వ రత్తయ్య 937 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. పేటసనె్నగండ్లలో మాచర్ల సాంబయ్య 550 ఓట్ల మెజార్టీతో, చింతపల్లిలో ఉన్నం రమణ 1861తో, గాదెవారిపల్లెలో దోర్నాల బ్రహ్మారెడ్డి 116తో, ఒప్పిచర్లలో పాలకీర్తి శ్రీను 1365తో, పెద్దకుదమగుండ్లలో బొల్లేపల్లి అంజమ్మ 158తో, నరమాలపాడులో ప్రత్తిపాటి సెబాష్టియన్ 11తో, ఇనుపరాజుపల్లెలో చల్లా ఈశ్వరమ్మ 35 ఓట్లతో టిడిపి తరఫున సర్పంచ్‌లుగా విజయం సాధించారు. వేపకంపల్లి, చినగార్లపాడు గ్రామాలు గతంలోనే టిడిపికి ఏకగ్రీవమయ్యాయి. చిన్నకుదమగుండ్ల గ్రామంలో గుర్రం సీతారావమ్మ 126 ఓట్ల మెజార్టీతో, బట్టువారిపల్లెలో చింతకాయల ఆదినారాయణ 33తో, కాచవరంలో సయ్యద్ కరిమున్ 300 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. లక్ష్మీపురం, మిరియాల గ్రామాలు గతంలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. కారంపూడి మేజర్ పంచాయతీలోని 16 వార్డులలో తెలుగుదేశం పార్టీకి 8 వార్డులు, వైఎస్‌ఆర్ సిపి 7 వార్డులు లభించగా, స్వతంత్య్ర అభ్యర్థి ఒకరు గతంలోనే ఏకగ్రీవమయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. గురజాల డిఎస్‌పి ఐ పూజ, సిఐ వెంకటేశ్వర్లు, స్పెషల్ ఆఫీసర్ మోహనరావు, తహశీల్దార్ దత్తాత్రేయశర్మ, ఎంపిడిఒ రాజగోపాల్ ఎన్నికలను పర్యవేక్షించారు.

మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారుల హవా
మాచర్ల, జూలై 31: మాచర్ల నియోజకవర్గ పరిధిలో బధవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు స్పష్టమైన మెజార్టీని కనబరిచారు. నియోజకవర్గ పరిధిలోని మొత్తం 71 పంచాయతీలకు గాను 11పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో వెల్దుర్తి మండల పరిధిలోని కండ్లకుంట, శిరిగిరిపాడు పంచాయతీలను శాంతిభద్రతల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు. ప్రస్తుతం 58 పంచాయతీలకు ఎన్నికలు జరిగగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు 30, వైయస్సార్‌సీపీ మద్దతుదారులు 21, కాంగ్రెస్ మద్దతుదారులు 6 పంచాయతీలను కైవశం చేసుకున్నారు. రెంటచింతల పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. మాచర్ల మండల పరిధిలోని కంభంపాడు పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరచిన అభ్యర్థి దేవరకొండ నాంచరయ్య తన సమీప వైయస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థి దేవరాయి సూరయ్యపై 425 ఓట్లతో విజయం సాధించారు. రాయవరం పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరచిన అభ్యర్థి తన సమీప వైయస్సారీ సీపీ బలపరచిన అభ్యర్థి పీ వెంకటప్పయ్యపై 500 ఓట్లతో విజయం సాధించారు. గన్నవరం పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ బలపరచిన అభ్యర్థి ముక్కా తిరుపతమ్మపై టీడీపీ బలపరచిన అభ్యర్థి వేముల అక్కమ్మపై 90 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జమ్మలమడక పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరచిన అభ్యర్థి ముక్కా కోటేశ్వరరావుపై వైయస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థిపై 197 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

శావల్యాపురంమండలంలో కాంగ్రెస్ అభ్యర్థుల హవా
శావల్యాపురం, జూలై 31: మండలంలో 11 గ్రామ పంచాయతీలకు బుధవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం ఆరుగంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు బారులుతీరారు. 11గ్రామ పంచాయతీల్లో ఆరు గ్రామ పంచాతీలను కాంగ్రెస్‌పార్టీ, నాలుగు పంచాయతీలను తెలుగుదేశం మద్దతుదారులు గెలుచుకోగా, వేల్పూరు పంచాయతీని ఇండిపెండెంట్ అభ్యర్థి బొల్లా ఆదిలక్ష్మి 2,100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన బొందిలిపాలెం పంచాయతీలో బత్తుల వెంకటేశ్వర్లు 70ఓట్ల మెజార్టీ, వయ్యకల్లు గ్రామపంచాయతీలో వి ముసలయ్య 40 ఓట్లతోనూ, గుంటిపాలెం పంచాయతీలో పచ్చా కోటేశ్వరమ్మ 70 ఓట్లు, పిచ్చుకలపాలెం గ్రామపంచాయతీలో తిరువీధుల సూర్యనారాయణ 65 ఓట్లతోనూ, శావల్యాపురం ముట్లూరు యెహేలమ్మ 332 ఓట్లతోనూ, కొత్తలూరు గ్రామపంచాయతీలో చవల కోటేశ్వరమ్మ 328 ఓట్లతో విజయం సాధించారు. తెలుగుదేశంపార్టీ బలపరిచిన ముండ్రువారిపాలెం పంచాయతీలో మర్రి వెంకటేశ్వర్లు 66 ఓట్లతోను, కారుమంచి పంచాయతీని మల్లాపరపు నాగమ్మ 183 ఓట్లతోనూ, మతుకుమల్లి పంచాయతీ నుండి కాలువ మరియబాబు 60 ఓట్లతోను, కనమర్లపూడి పంచాయతీలో బోడేపూడి అంజలి 103 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

రెండోరోజుకు చేరిన న్యాయవాదుల నిరసన
తెనాలి, జూలై 31: తెలంగాణ విభజనకు యుపిఎ పాలకులు ఆమోదం తెలపడం వారి రాజకీయ ప్రయోజనాల కోసమేనని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడిబోయిన శ్రీనివాసరావు యుపిఎ విధానాన్ని దుయ్యబట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక కోర్టుహాల్ ప్రధాన ద్వారం ఎదుట న్యాయవాదులు తమ ఆందోళనలో భాగంగా విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికైనా యుపిఎ తన విధానం వెనక్కి తీసుకుని సమైక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిరసన ప్రదర్శనలో న్యాయవాదులు దంతాల కిరణ్‌కుమార్, కనక రాంబాబు, గుమ్మడి రవిరాజ్, కంచర్ల చంద్రశేఖర్, కామినేని చిన్నా, ఆర్.సుబ్బారావు, కె.కుమార స్వామి, కె.ప్రకాష్ తదితరులున్నారు.

యుపిఎ ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని
english title: 
s

జిల్లాలో 83.86 శాతం పోలింగ్

$
0
0

ఖమ్మం, జూలై 31: గ్రామ పంచాయతీ ఎన్నికల తుది విడతలో జిల్లాలో శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని 29మండలాల పరిధిలో 381పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 19పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 2 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. రెండు గ్రామాల్లో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. మిగిలిన 358గ్రామ పంచాయతీల్లో బుధవారం ఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు డివిజన్ల పరిధిలోని 4,086 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 445 ఏకగ్రీవం కాగా, 35చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 3,606వార్డులకు ఎన్నికలు జరిగాయి. కొత్తగూడెం డివిజన్‌లో 85.44శాతం, పాల్వంచ డివిజన్‌లో 84.83శాతం, భద్రాచలం డివిజన్‌లో 79.71శాతం పోలింగ్ నమోదైంది. కామేపల్లి మండలంలో అత్యధికంగా 93.75శాతం నమోదు కాగా, కూనవరం మండలంలో అత్యల్పంగా 70.02శాతం నమోదైంది.
ఇదిలా ఉండగా పలుచోట్ల ఆయా రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనేక చోట్ల పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని ఎన్నికల అనంతరం వదిలిపెట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చర్ల మండలం పెద్ద మిడిసిలేరులో సిరా లేక పోలింగ్ కొద్ది సేపు నిలిచిపోయింది. జూలూరుపాడు మండలం గుండెపుడిలో స్కూల్‌పై కప్పు కురుస్తుండటంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో టిడిపి నాయకుడు మేడా మోహన్‌రావు ఏజెంట్‌గా ఉంటూనే ప్రచారం చేస్తుండటంతో అధికారులు ఆయనను బయటకు పంపారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మణుగూరు మండలం రామానుజవరంలో సిపిఐ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా, పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అత్యంత సమస్యాత్మక గ్రామమైన పండితాపురంలో పోలింగ్ ప్రశాంతంగా జరగటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగినప్పటికీ డబ్బు, మద్యంప్రభావం తీవ్రంగా కన్పించింది. ఎన్నిక జరిగే సమయంలో కూడా ఈ పంపకాల జరుగుతున్నా పోలీస్ అధికారులు అనేక చోట్ల పట్టించుకోలేదు. వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలోని పలు చోట్ల ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు పోలింగ్ కేంద్రం సమీపంలోనే ఆయా పార్టీల నేతలు బహుమతులను పంపిణీ చేయటం గమనార్హం. కాగా అనేక చోట్ల పోలీసులు, ఎన్నికల సిబ్బంది అధికార పార్టీ నేతలకు మద్దతు పలుకుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం, వామపక్షపార్టీ నేతలు ఈ విషయంపై అనేక చోట్ల పోలీసులతో వాగ్వివాదానికి కూడా దిగారు. అనేక గ్రామాల్లో ఓట్లు లేని వారు గ్రామంలో ఉండవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేయటంతో వాదోపవాదాలు జరిగాయి. చివరకు పోలీసులు వారిని పోలీస్ స్టేషన్లకు తరలించి వారిని విడిచిపెట్టారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

టిడిపిదే ఆధిక్యత
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జూలై 31: ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి స్పష్టమైన ఆధిక్యతను కనబర్చింది. ఈ నెల 27న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో ఆధిక్యత కనబర్చిన తెలుగుదేశం తుది విడత ఎన్నికల్లో సైతం ఆధిక్యతను కొనసాగించింది. బుధవారం కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో ఎన్నికలు జరగ్గా, మూడు డివిజన్లలోనూ తెలుగుదేశం మద్దతుదార్లు స్పష్టమైన ఆధిక్యతను కనబర్చారు. మొత్తం మూడు డివిజన్లలో కలిపి 381 స్థానాలుండగా, రెండు చోట్ల ప్రజలు ఎన్నికలను బహిష్కరించగా, మరో రెండు చోట్ల నామినేషన్లు పడలేదు. మిగిలిన 377 స్థానాలకు గాను ఏకగ్రీవమైన వాటితో కలిపి కడపటి వార్తలు అందే సరికి 367స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ 62స్థానాలను, తెలుగుదేశం 120స్థానాలను, వైఎస్‌ఆర్‌సిపి 93 స్థానాల్లోనూ, సిపిఎం 33 స్థానాలు, సిపిఐ 21 స్థానాలు, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ 24 స్థానాలు, బిజెపి 1 స్థానం, టిఆర్‌ఎస్ 1 స్థానం, ఇతరులు 12 స్థానాల్లోనూ విజయం సాధించారు. కొత్తగూడెం డివిజన్‌లో కాంగ్రెస్ 38, టిడిపి 50, వైఎస్‌ఆర్‌సిపి 25, సిపిఎం 4, సిపిఐ 5, సిపిఐ(ఎంఎల్) 19, ఇతరులు 2స్థానాల్లో విజయం సాధించారు. భద్రాచలం డివిజన్‌లో కాంగ్రెస్ 8, తెలుగుదేశం 30, వైఎస్‌ఆర్‌సిపి 29, సిపిఎం 27, సిపిఐ 11, సిపిఐ(ఎంఎల్) 1, బిజెపి 1, టిఆర్‌ఎస్ 6, ఇతరులు 6 స్థానాల్లో, పాల్వంచ డివిజన్‌లో కాంగ్రెస్ 16, టిడిపి 40, వైఎస్‌ఆర్‌సిపి 39, సిపిఎం 2, సిపిఐ 5, సిపిఐ(ఎంఎల్) 4, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

త్రిముఖపోటీలో పోటాపోటీ ఫలితాలు
* వైకాపా, టిఆర్‌ఎస్‌కు భంగపాటు
కొత్తగూడెం, జూలై 31: కొత్తగూడెం మండలంలో కడపటి వార్తలు అందేసరికి మొత్తం 21పంచాయతీల్లో 18పంచాయతీల ఫలితాలు వెల్లడికాగా కాంగ్రెస్ 7, తెలుగుదేశం 6, సిపిఐ 5, టిడిపి రెబల్ అభ్యర్థి 1, సుజాతనగర్ మేజర్ పంచాయతీని సిపిఎం కైవసం చేసుకున్నాయి. 3ఇంక్లైన్‌లో తెలుగుదేశం రెబల్ అభ్యర్థి బోడా శారద విజయం సాధించగా, మండలంలోని మేజర్ పంచాయతీల్లో ఒకటైన సుజాతనగర్‌లో సిపిఎం అభ్యర్థి కాసాని లక్ష్మి ఉత్కంఠపోరులో విజయం సాధించారు. వరుసగా ఏడవసారి ఈపంచాయతీలో సిపిఎం విజయం సాధించడం గమనార్హం. పెనుబల్లి పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి హాలావత్ రుక్మిణి, వెంకటేష్‌ఖనిలో కాంగ్రెస్ అభ్యర్థి కొర్సు సమ్మక్క, రాఘవాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి గరికె వెంకటసాంబయ్య, రేగళ్ళలో కాంగ్రెస్ అభ్యర్థి బాదావత్ రాంకోటి, రుద్రంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ బిక్నా, సర్వారంలో కాంగ్రెస్ అభ్యర్థి బాదావత్ శారదలు విజయం సాధించారు. అదేవిధంగా అనిశెట్టిపల్లిలో తెలుగుదేశం అభ్యర్థి ఈసం రామారావు, చాతకొండ టిడిపి అభ్యర్థి పడిగ వెంకటేశ్వర్లు, నర్సింహాసాగర్ టిడిపి అభ్యర్థి బానోత్ రామనాధం, పెనగడప టిడిపి అభ్యర్థి మాలోత్ కళావతి, సింగభూపాలెం టిడిపి అభ్యర్థి భూక్య జ్యోతిలు విజయం సాధించారు. బంగారుచెలక సిపిఐ అభ్యర్థి కోరం సత్తెమ్మ, గరీబ్‌పేట సిపిఐ అభ్యర్థి బోడ దమ, సీతంపేట సిపిఐ అభ్యర్థి లావూడ్య మంగమ్మ, సీతారాంపురం సిపిఐ అభ్యర్థి బోడా రాములు, మైలారం సిపిఐ అభ్యర్థి కుర్సం బొజ్జయ్యలు గెలిచారు. లక్ష్మిందేవిపల్లి కాంగ్రెస్ అభ్యర్థి భానోతు వశ్యానాయక్, కాలుకొండ రామవరం టిడిపి అభ్యర్థి భారతి గెలుపొందారు. చుంచుపల్లి పంచాయతీలో సిపిఐ అభ్యర్థి బానోతు లక్ష్మి గెలుపుబాటలో ఉన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో
అంటువ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి
* కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశం
వి.ఆర్.పురం, జూలై 31: వర్షాల కారణంగా గోదావరి వరద ప్రభావిత ప్రాంతంలో నివసించే ప్రజలకు అంటువ్యాధులు, మలేరియా ప్రబలకుండా గ్రామ స్థాయిలో పని చేసే వారిని అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని తుమ్మిలేరు గ్రామశివారు పోచవరం స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అంటువ్యాధులున్న వారి గృహాలకు వెళ్లి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రభలకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రజలను ఆదుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో పని చేసే విఆర్‌ఓ, సెక్రటరీ, ఎఎన్‌ఎం, ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలను అప్రమత్తం చేసి జ్వర పీడితులకు సకాలంలో వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత, సుదూర ప్రాంతంలో నివసించే గిరిజనులు జ్వరపీడితులు కాకుండా అవగాహనతోపాటు తరుచుగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. కాగా తుమ్మిలేరు నుంచి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు లాంచీల ద్వారా వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. 451 ఓట్లలో 11 గంటల వరకే 90 శాతం ఓట్లు పోలయ్యాయని పోలింగ్ బూత్ అధికారి జిల్లా కలెక్టర్ శ్రీనరేష్‌కు వివరించారు. అనంతరం ఆయన గ్రామంలోని కమ్యూనిటీ టీవి కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామస్థులంతా ఒక చోట చేరి టీవీ కార్యక్రమాలను వీక్షిస్తామని తెలిపారు. మొత్తం 52 కమ్యూనిటీ టీవిలను సరఫరా చేసామని పిఓ జి వీరపాండియన్ కలెక్టర్‌కు వివరించారు. సోలార్ పద్ధతిలో విద్యుత్ సరఫరా కోసం మొత్తం 20 గ్రామాలకు అందించనున్నామన్నారు. నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆర్థికంగా ఎదిగేందుకు రూ.70 లక్షలు విడుదల చేసి లాంచీలను కొండరెడ్ల యువతకు అందించామని పిఓ చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి వంటగది పరిశీలించి విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలు, అభ్యాసికలు, యూనిఫాం గురించి పిఓతో పాటు జిల్లా కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏసి లాంచీని పరిశీలించి సీటింగ్ ఏర్పాట్లు సరిగా చేయాలని సూచించారు. అక్కడి నుంచి నేరుగా వి.ఆర్.పురం ఎండీఓ కార్యాలయంలో మండలంలో ఎన్నికల ఏర్పాట్లు, ఓటింగ్ శాతం, ఓటింగ్ తీరును అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు ఏపిఓ టిపిజి మల్లీశ్వరి, ఏడిఎంఅండ్‌హెచ్‌ఓ డా.పుల్లయ్య, డిఎంఓ రాంబాబు ఉన్నారు.

ముమ్మరంగా పోలింగ్
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జూలై 31: జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ముమ్మరంగా సాగింది. 29మండలాల పరిధిలో సాగిన ఈ ఎన్నికల్లో కామేపల్లి మండలంలో అధికంగా 93.75శాతం పోలింగ్ నమోదు కాగా, కూనవరం మండలంలో అత్యల్పంగా 70.02శాతం నమోదైంది. పాల్వంచ, భద్రాచలం డివిజన్లలో రాత్రి నుంచే వర్షం కురుస్తుండటంతో ఉదయం పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది.

పాల్వంచ మండలంలో ఎన్నికలు ప్రశాంతం
* 87.88 శాతం పోలింగ్‌నమోదు
పాల్వంచ, జూలై 31: పాల్వంచ మండల పరిధిలోని 11పంచాయతీలకు గాను బుధవారం జరిగిన ఎన్నికల్లో స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ అన్ని పంచాయతీల్లో ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల నియమావళి ప్రకారం భారీ వర్షం అయినప్పటికి పోలింగ్ మండల పరిధిలోని 120పోలింగ్ స్టేషన్లలో ఉదయం 7గంటలకే ప్రారంభమైంది. వర్షం కారణంగా మొదట పోలింగ్ మందకొడిగా సాగినప్పటికి 9గంటల అనంతరం పోలింగ్ సరళి ఉపందుకుంది. బూత్‌ల వద్ద ఓటర్లు బారులుతీరి నిలబడడం కనిపించింది. 11గంటల సమయానికి పోలింగ్ కొన్ని పంచాయతీల్లో 65శాతానికి చేరుకుంది. మండలంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. నక్సల్స్ ప్రభావిత పంచాయతీలైన చంద్రాలగూడెం, ఉల్వనూరు పంచాయతీల్లోని పోలింగ్‌స్టేషన్ల వద్ద అటవీశాఖకు చెందిన అధికారులకు డ్యూటీలు వేయడంతో వారు భయాందోళనల మధ్య విధులు నిర్వహించారు. సూరారం గ్రామంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఇంటిలో టిఫిన్ చేస్తున్న టిఆర్‌ఎస్ నాయకుల పక్కన మద్యం సీసాలు ఉండడంతో అటుగా వెళ్ళిన పోలీసులకు వారు కనిపించడంతో మందు తాగుతున్నారన్న కారణంతో టిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తాము మద్యం తాగలేదని చెబుతున్నప్పటికి పోలీసులు అరెస్ట్ చేయడం తప్ప మిగతా పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా వచ్చి ఓటుహక్కునువినియోగించుకున్నారు. వర్షాలకు చిత్తడిగా మారిన బురదలో కూడా ప్రజలు ఓటుహక్కును వినియోగించుకోవడం కనిపించింది.

ఉమ్మడి రాజధానిపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి
ఖమ్మం రూరల్, జూలై 31: ఉమ్మడి రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఖమ్మం రూరల్ ఉద్యోగుల జెఏసి చైర్మన్ బాలాజీనాయక్, కన్వీనర్ శ్రీనివాస్‌కుమార్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ క్రాస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు కన్న కల నేడు సాకారం కాబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా చేపడుతున్న ఉద్యమాలకు ప్రభుత్వం తలొగ్గి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం హర్షణీయమన్నారు. జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఆపార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్న ఈనిర్ణయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నామన్నారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన హైదరాబాద్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వల్ల లక్షలాది ఎకరాల భూమి సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇనే్నళ్లు పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంత జిల్లాలన్నీ అభివృద్ధి చెందే అవకాశం కలుగుతుందన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి ఆస్తుల రక్షణకు భరోసా ఉంటుందని వారు స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో ఎవిరావు, బత్తుల పద్మాచారి, వెంపటి సురేందర్, చెరుకుపల్లి భాస్కర్, మహ్మద్ రజబ్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

వి.ఆర్.పురం మండలంలో ఎన్నికలు ప్రశాంతం
వి.ఆర్.పురం, జూలై 31: మండలంలోని 11 పంచాయతీలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. మొత్తం మండలంలో 14,897 మంది ఓటర్లు ఉండగా 88.37 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో సిపిఎం తరఫున శ్రీరామగిరి సర్పంచ్‌గా సోడె చినబూబమ్మ, పెద్దమట్టపల్లి తుర్రం బాబురావు, రామవరం కుంజా నాగిరెడ్డి, కుందులూరు తెల్లం కన్నమ్మ గెలుపొందారు. వైఎస్సార్ సిపి తరఫున పోటీ చేసిన రేఖపల్లి మడకం జోగమ్మ, జీడిగుప్ప కథల వెంకటలక్ష్మి సర్పంచ్‌గా గెలుపొందారు. ఇక కాంగ్రెస్ తరఫున రాజుపేట సర్పంచ్‌గా కుంజా రమేష్, ములకనపల్లి రవ్వా సుజాత విజయం సాధించారు. అలాగే టిడిపి తరపున తుమ్మిలేరు పంచాయతీ సర్పంచ్‌గా వాళ్ల కోటేశ్వరరావు గెలుపొందారు. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా చినమట్టపల్లికి పోటీ చేసిన కారం శివరాజు గెలుపొందారు.

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
కొత్తగూడెం, జూలై 31: మున్సిపాలిటీ పరిధిలోని 19వవార్డు మధురబస్తీ ఏరియాలో బుధవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 400మొక్కలను నాటారు. ఈసందర్భంగా మున్సిపల్ కమిషనర్ గుర్రం రవి మాట్లాడుతూ పట్టణంలోని ప్రధానకూడళ్ళు, వివిధ వార్డుల్లో రోడ్లవెంట రెండువేల మొక్కలు నాటామన్నారు. మొక్కల రక్షణ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని మాజీకౌన్సిలర్ దుంపల అనురాధ 400మొక్కలకు ట్రీగార్డ్స్ ఉచితంగా అందజేశారని తెలిపారు. ట్రీగార్డ్స్‌ను ఎవరైనా వితరణగా అందజేస్తే వారి పేర్లతో అమరుస్తామని కనుక స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు, బ్యాంకులు ముందుకు రావాలని కోరారు. అనంతరం రైటర్‌బస్తీలోని కినె్నరసాని నీటిసరఫరా జోన్ నెంబర్-3 వాటర్ ట్యాంక్‌ను పరిశీలించారు. మున్సిపల్ రాజీవ్‌పార్క్‌ను సందర్శించి పార్క్‌లో పెరుగుతున్న కలుపుమొక్కలు, పిచ్చిమొక్కలను వెంటనే తొలగించాలని ఎఇ ఎ సుధాకర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కెవి లక్ష్మణ్‌రావు, కె ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

కినె్నరసాని గేట్లు మూడు ఎత్తివేత
పాల్వంచ, జూలై 31: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండల పరిధిలోని కినె్నరసాని రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో 408అడుగుల సామర్థ్యం గల కినె్నరసాని రిజర్వాయర్ నీటిమట్టం బుధవారం 403అడుగులకు చేరుకుంది. ఈకారణంగా కెటిపిఎస్ అధికారులు రిజర్వాయర్‌కు ఉన్న 12క్లస్టర్ గేట్లలో మూడుగేట్లను నాలుగు అడుగుల మేరకు ఎత్తి 12వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గేట్ల ఎత్తివేత కార్యక్రమాన్ని కెటిపిఎస్ అధికారులు రవీంద్రకుమార్, కోటేశ్వరరావు, రామకృష్ణలు పర్యవేక్షిస్తున్నారు. గేట్లు ఎత్తివేతకు ముందు కినె్నరసాని పరీవాహక ప్రాంతాల ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు జారీచేశారు.

కొత్తగూడెం మండలంలో పోలింగ్ ప్రశాంతం
కొత్తగూడెం, జూలై 31: కొత్తగూడెం మండలంలోని 21పంచాయతీల్లో బుధవారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మండలం మొత్తం 77.89పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 69వేల 270ఓట్లకు గాను 53వేల 952ఓట్లు పోలయ్యాయి. దీనిలో 26వేల 911మంది పురుష ఓటర్లు, 27వేల 41మహిళా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఉపఎన్నికల అధికారి అమయ్‌కుమార్, తహశీల్దార్ కెపి నర్సింహులు, కొత్తగూడెం ఎఎస్పీ భాస్కర్‌భూషణ్ పోలింగ్‌ను పర్యవేక్షించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చుంచుపల్లి పంచాయతీలో, మాజీమంత్రి కోనేరు నాగేశ్వరరావు లక్ష్మిదేవిపల్లి పంచాయతీలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. వర్షాన్ని లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులను ఎత్తుకునివచ్చి మరీ ఓట్లు వేయించారు.

చర్లలో అనూహ్య ఫలితాలు
చర్ల, జూలై 31: చర్ల మండలంలో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికలు అనూహ్య ఫలితాలిచ్చాయి. మండలంలో 14 పంచాయతీలు ఉండగా పూసుగుప్ప పంచాయతీ టిఆర్‌ఎస్ పార్టీకి ఏకగ్రీవం కాగా మిగిలిన 13 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో టిడిపికి 2, కాంగ్రెస్ 2, సిపిఐ 3, సిపిఎం 2, వైఎస్సార్ సిపి 3 సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నాయి. పలుచోట్ల చెదురుమొదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓ వైపున జోరున వర్షం కురుస్తున్నా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీలుతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో మొత్తం 26,322 మంది ఓటర్లు ఉండగా 19,293 మంది ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున సుబ్బంపేట పంచాయతీ సర్పంచ్‌గా కాక నర్సిరత్నం, కుదునూరు సర్పంచ్‌గా కుంజా నాగమణిలు విజయం సాధించారు. ఇక టిడిపి తరపున తేగడ పంచాయతీ సర్పంచ్‌గా కుప్ప సావిత్రి, గొమ్ముగూడెం సర్పంచ్‌గా కొడెం మురళీలు గెలుపొందారు. సిపిఐ పార్టీ తరపున పెద్దమిడిసిలేరు పాల్వంచ రామారావు, పెద్దిపల్లి పంచాయతీ మల్లా నాగేశ్వరరావు, కుర్నపల్లి పంచాయతీ సర్పంచ్‌గా ఇర్పా సుశీలలు విజయం దుదుంభి మోగించారు. అటు సిపిఎం తరపున మొగళ్లపల్లి పంచాయతీలో ఎల్లబోయిన రాజేశ్వరి, సత్యనారాయణపురం సర్పంచ్‌గా పర్సిక ఏడుకొండలు గెలుపొందారు. అలాగే వైఎస్సార్ సిపి తరపున ఆర్.కొత్తగూడెంలో తుర్రం రవి, దేవరపల్లిలో తెల్లం జ్యోతి, ఉప్పరిగూడెం పంచాయతీలో ఎలకం నరేంద్రలు గెలుపొందారు. ఇదిలా ఉండగా పెద్దమిడిసిలేరు పోలింగ్ కేంద్రంలో ఇంక్ అయిపోవడంతో గంటపాటు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో సుదూర ప్రాంత గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనంతరం ఎన్నికల అధికారికి ఫోను సమాచారం అందించడంతో ఇంక్ (సిర)ను ఏర్పాటు చేయడంతో ఓటింగ్‌ను కొనసాగించారు.
డ్రాతో విజయం సాధించిన వార్డుమెంబర్
కాగా చర్ల పంచాయతీలో 6వ వార్డులో మడకం కృష్ణార్జునరావు, కోరం నాగేంద్ర (టిడిపి)లకు చేరోక 107 ఓట్లు పోలయ్యాయి. అనంతరం డ్రా తీయడంతో కోరం నాగేంద్రను విజయం వరించింది. చర్ల పంచాయతీలో 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, మిగతా వార్డులను మిగతా పార్టీలు దక్కించుకున్నాయి.

చండ్రుగొండలో సత్తాచాటిన టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్
చండ్రుగొండ, జూలై 31: మండలంలో 16పంచాయతీలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు పోటాపోటీగా గెలుపొందారు. 16పంచాయతీల్లో ఆరుస్థానాల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులు అబ్బుగూడెం, జంపులరంగ, మద్దుకూరు కాకలక్ష్మి, సీతాయిగూడెం పాయింట్ల అంజన్‌రావు, పెంట్లం బుగ్గ సీతామహాలక్ష్మి, బుర్రాయిగూడెం కుంజా సావిత్రి, ఎర్రగుంట పద్దం సరోజిని విజయం సాధించారు. అదేవిధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు తిప్పనపల్లి దారావత్ పార్వతి, రాజాపురం మారుతి జానకి, పోకలగూడెం గుగులోత్ రాములు, అన్నపురెడ్డిపల్లి బానోత్ కృష్ణకుమారి, చండ్రుగొండ ఇస్లావత్ రుక్మిణి, గానుగపాడు వాసం శ్రీనుతో సహా ఆరుగురు అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. అదేవిధంగా రావికంపాడు, గుంపెన గ్రామాల సర్పంచ్‌లుగా కాంగ్రెస్ బలపర్చిన మాలోత్ హనుమ, దారాబోయిన లక్ష్మి విజయం సాధించారు. తుంగారం గ్రామసర్పంచ్‌గా సిపిఎం బలపర్చిన బానోత్ పార్వతి విజయం సాధించగా మర్రిగూడెం సర్పంచ్‌గా న్యూడెమోక్రసీ పార్టీ బలపర్చిన పద్దం శ్రీనులు ఎన్నికయ్యారు.
సీనియర్ నాయకులకు ఎదురుదెబ్బ
మండలంలో ప్రతిష్ఠాత్మకంగ్యా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీనియర్ నాయకులకు ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి వెంకటేశ్వరరావు స్వగ్రామమైన తిప్పనపల్లి గ్రామంలో టిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందారు. అదేవిధంగా 25సంవత్సరాలకు పైగా పోకలగూడెం పంచాయతీలో సర్పంచ్ పదవిని తన కుటుంబసభ్యుల ఆధీనంలో ఉంచుకుంటున్న మాజీ ఎంపిపి గుగులోత్ బాబు భార్య మాజీ ఎంపిపి మీన సర్పంచ్ అభ్యర్థిగా ఓటమి చెందడంతో బాబు కంగుతిన్నారు. అదేవిధంగా చండ్రుగొండ గ్రామ ప్రెసిడెంట్‌గా, మండల జెడ్పీటిసిగా పనిచేసిన సీనియర్ నాయకురాలు బానోత్ కమలమ్మ చండ్రుగొండ సర్పంచ్‌గా పోటీచేసి ఓటమి చెందారు. మద్దుకూరు గ్రామంలో కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్లమోతు రమణ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందారు. దీంతో మండలంలో గత 20సంవత్సరాలుగా గ్రామాల్లో అధిపత్యం చలాయిస్తున్న నాయకులకు ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.

* పలుచోట్ల ఉద్రిక్తత
english title: 
j

విజయవంతంగా సమైక్య బంద్

$
0
0

కర్నూలు, జూలై 31: రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ కాంగ్రెస్, యుపిఎ మిత్రపక్షాలు చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం సమైక్యవాదులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. సమైక్యవాదులు ఇచ్చిన బంద్ పిలుపుతో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులతో సహా అన్ని వ్యాపార కార్యకలాపాలు నిల్చిపోయాయి. జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వాహకులు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా, రహదారులపై రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. జిల్లా వ్యాప్తంగా 960 ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ఆర్టీసీతోపాటు పలు కార్మిక సంఘాలు, ఎపి ఎన్జీవోలు సమైక్య ఉద్యమంలో పాల్గొనడంతో బంద్ సంపూర్ణంగాముగిసింది. జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై బంద్ నిర్వాహకులు నిర్వహించిన ఆందోళన కారణంగా పెద్దఎత్తున ట్రాఫిక్ నిల్చిపోయింది. దీంతో ప్రయాణీలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. సమైక్యవాదులు కర్నూలులో తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా చేశారు. కాగా ఆత్మకూరు పట్టణంలో బంద్ సందర్భంగా సమైక్యవాదులు మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతలోనే పోలీసులు రంగప్రవేశంచేసి ఆందోళనకారులను చెదరగొట్టడంతో సమస్య సద్దుమణిగింది. కర్నూలులోని మంత్రి టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇళ్ల ముందు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట సమైక్యవాదులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన అనేక సంఘాలు, విద్యార్థి, యువజన, కుల, ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతునివ్వడంతో తెల్లవారుజాము నుంచే బంద్ వాతావరణం కనిపించింది. ఆర్టీసీ కార్మికులు, న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. కాగా సమైక్యవాదులు ఇచ్చిన బంద్‌కు రాయలసీమ ప్రత్యేకవాదులు దూరంగా ఉన్నారు. బంద్ సందర్భంగా వైకాపా నాయకుడు ఎస్వీ మోహనరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని చీల్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సోనియా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా రాష్ట్ర విభజనపై తీర్మానం చేశారని మండిపడ్డారు. రాష్టవ్రిభజనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినలేఖ కూడా కారణమని ఆయన ఆరోపించారు. అంతాకలిసి తెలుగువారిని రెండుగా చీల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేక పోయిన మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్‌లు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్, యుపిఎ తీర్మానం చేసినా తెలంగాణేతర ప్రాంతాల అభివృద్ధికి ఒక్కమాట కూడా చెప్పకుండా సోనియా తెలుగు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఎన్నికలకు ముందు రాజకీయ దురుద్ధేశ్యంతో చేసిన తీర్మానం ప్రజా సమ్మతం కాదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 1999లోనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు దివంగత వైఎస్ ఆధ్వర్యంలో తీర్మానంచేసి పంపారని ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ కూడా చెప్తున్నారని వైకాపా నేతలు వాస్తవాన్ని దాచి అబద్దాలు ప్రచారంచేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బంద్ సందర్భంగా విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి స్థానిక రాజ్‌విహార్ కూడలిలో మానవ హారం నిర్మించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్టవ్రిభజన వల్ల విద్య, ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం చేసిన రాష్ట్ర విభజన తీర్మానం తక్షణం వెనక్కితీసుకోవాలని లేనిపక్షంలో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

పంచాయితీల్లో పై‘చేయి’
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జూలై 31: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు సంపూర్తిగా వెలువడ్డాయి. తుది దశకు బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు తమ ఆధిక్యతను చాటుకున్నారు. తుది దశలో ఆదోని డివిజన్ పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 105 పంచాయితీల్లో పాగా వేసింది. వైకాపా 84, టిడిపి 71, వామపక్షాలు, ఇతరులు కలిపి 37 స్థానాల్లో విజయకేతనం ఎగుర వేశారు. ఆదోని డివిజన్‌లో సిపిఎం, సిపిఐ మద్దతుదారులు తొమ్మిది పంచాయతీలు దక్కించుకోవడం విశేషం. మూడు దశల్లో జిల్లా వ్యాప్తంగా 883 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ 365 పంచాయతీల్లో విజయం సాధించగా ఆ తరువాతి స్థానం వైకాపా 262 స్థానాలతో నిల్చింది. మూడవ స్థానంలో తెలుగుదేశం పార్టీ నిలబడి 165 స్థానాలతో సరిపెట్టుకుంది. వామపక్ష పార్టీ మద్దతుదారులు, ఇతరులు 91 స్థానాల్లో విజయం సాధించారు. డివిజన్ల వారీగా పరిశీలిస్తే కర్నూలు రెవెన్యూ డివిజన్‌లో కాంగ్రెస్ మద్దతుదారులు 132, వైకాపా 80, టిడిపి 55, ఇతరులు 32 పంచాయితీలు దక్కించుకున్నారు. నంద్యాల డివిజన్‌లో కాంగ్రెస్ మద్దతుదారులు 128, వైకాపా 98, తెలుగుదేశం 39, ఇతరులు 22 స్థానాల్లో విజయం సాధించారు. ఇక ఆదోని డివిజన్‌లో కాంగ్రెస్ 105, వైకాపా 84, టిడిపి 71, ఇతరులు 37 పంచాయతీల్లో గెలుపొందారు. కాంగ్రెస్ కర్నూలు డివిజన్‌లో ఎక్కువ పంచాయతీలు దక్కించుకోగా వైకాపా నంద్యాల డివిజన్‌లో, తెలుగుదేశం ఆదోని డివిజన్‌లో అధిక పంచాయతీలను గెలుచుకున్నాయి. వామపక్షపార్టీ అభ్యర్థులు కర్నూలు, ఆదోని డివిజన్‌లలోని పంచాయతీల్లో గెలుపొందగా నంద్యాల డివిజన్‌లో ప్రభావాన్ని చూపలేకపోయారు. మూడు దశల్లో జరిగిన ఎన్నికలు పూర్తి కావడంతో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రానున్న శాసనసభ ఎన్నికల్లో కూడా తమకే ఎక్కువ స్థానాలు ఖాయమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఫలితాలకు భిన్నంగా తామే గెలుస్తామని వైకాపా, టిడిపి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తక్కువ పంచాయతీలు దక్కించుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతుండగా తమకు వచ్చిన ఓట్లు ప్రజలు అభిమానంతో వేసినవేనని ఏ పంచాయతీలో కూడా తాము ఓటర్లను ప్రలోభ పెట్టలేదని వెల్లడిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓటర్లను భయపెట్టి, ఓటర్లను ప్రలోభ పెట్టి వైకాపాలు ఎక్కువ స్థానాలు దక్కించుకున్నాయని వారంటున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు ఆమోదించడం వల్లే గ్రామీణ ఓటర్లు తమ అభిమానాన్ని చాటుకున్నారని తాము ఓటర్లను భయపెట్టామని ప్రచారం చేయడం చేతగాని తనమని కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. అలా భయపెట్టి ఓట్లు వేయించుకొని ఉంటే ఇతరులకు అవకాశం లేకుండా చేసే వాళ్లమని పేర్కొంటున్నారు. ఇక వైకాపా నేతలు సైతం తాము పంచాయతీ ఎన్నికలను తీవ్రంగా పరిగణించలేదని ప్రజలు చూపిన అభిమానమేనని వెల్లడిస్తున్నారు. తమ మద్దతుదారుల గెలుపును జీర్ణించుకోలేక ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

తుది విడతలో 81.52శాతం పోలింగ్
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జూలై 31: జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ప్రశాతంగా ముగిసాయి. మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడంలో అధికార యంత్రాంగం విజయవంతమైంది. తుదివిడతగా బుధవారం ఆదోని రెవెన్యూ డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలు ప్రశాతంగా పూర్తిచేశారు. తుది విడత పోలింగ్ సందర్భంగా ఆదోని డివిజన్‌లోని 17 మండలాల్లో 81.52శాతం పోలింగ్ నమోదైంది. డివిజన్‌లో మొత్తం 297 గ్రామ పంచాయతీలు ఉండగా 35 స్థానాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 262 స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ స్థానాల్లో సర్పంచ్ స్థానాన్ని దక్కించుకోవడానికి 830 మంది పోటీపడ్డారు. పోలింగ్ నిర్వహణకు అధికారులు చేసిన ఏర్పాట్ల ఫలితంగా చిన్నచిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా ముగియడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆదోని డివిజన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి. ఆదోని 85.89, కౌతాళం 72.47, కోసిగి 76.83, పెద్దకడబూరు 83.41, ఎమ్మిగనూరు 82.98, నందవరం 74.16, మంత్రాలయం 80.12, ఆలూరు 76.02, చిప్పగిరి 81.09, ఆస్పరి 86.57, హోళగుంద 77.36, హాలహర్వి 85.25, పత్తికొండ 81.20, దేవనకొండ 85.14, తుగ్గలి 88.81, మద్దికెర 87.05, గోనెగండ్ల 81.49శాతం నమోదైనట్లు కలెక్టర్ సుదర్శన్ రెడ్డి కర్నూలులో ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా ముగించేందుకు సహకరించిన అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూడు విడతల్లో పోలింగ్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎస్పీ రఘురామ్ రెడ్డి సైతం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో సైతం పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించడంలో విజయవంతమైన తమ శాఖ అధికారుల, సిబ్బంది కృషిని ఆయన అభినందించారు.
2న కొత్త సర్పంచ్‌లకు బాధ్యతలు
జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన కొత్త సర్పంచ్‌లకు గ్రామ పంచాయితీ పాలకవర్గాలకు ఆగస్టు 2వ తేదీన బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి బుధవారం తెలిపారు. ఆ రోజున అన్ని మండలాల అభివృద్ధి అధికారులు సమావేశం నిర్వహించి పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించాల్సిందిగా ఆయన ఆదేశించారు. కాగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలులోకి వచ్చిన ఎన్నికల నియమావళి గురువారం నుంచి అమలులో ఉండదని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఆదోని డివిజన్‌లో 84శాతం పోలింగ్
ఆదోని, జూలై 31: ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్లాలో ఉన్న 17 మండలాల్లో ఉన్న 263గ్రామ పంచాయతీలకు 2932 వార్డు సభ్యుల ఎన్నికలు చివరి విడతగా బుధవారం జరిగిన ఎన్నికల్లో చెదురు ముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 84.71శాతం ఓటింగ్ జరిగినట్లు డివిజన్ పంచాయతీ అధికారి ఎస్‌ఎంబాషా తెలిపారు. ఆదోని డివిజన్‌లోని కోసిగి మండలంలో 76.84శాతం ఓట్లు పొలైనట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే హొళగుందలో 77.34, తుగ్గలిలో 88.88, పెద్దకడబూరులో 84.90, మద్దికేరలో 87, కౌతాళంలో 80.39, ఎమ్మిగనూరులో 86.24, హాలహర్విలో 88.20, పత్తికొండలో 81.27, ఆలూరులో 76.17, చిప్పగిరిలో 81.84, ఆస్పరిలో 86.56, దేవనకొండలో 85.51, నందవరంలో 82.80, ఆదోనిలో 85.4, గోనెగండ్లలో 81.49, మంత్రాలయంలో 80.12 శాతం ఓట్లు పొలైనట్లు ఆయన తెలిపారు. డివిజన్ ఎన్నిల అధికారి ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఆదోని డివిజన్‌లో ఎన్నికలు ప్రశాతంగా జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకే 63 శాతం ఓట్లు పోలైనట్లు ఆయన చెప్పారు. సమాస్యాత్మక గ్రామాలైన దేవనకొండ, పత్తికొండ, తుగ్గలి, మద్దికేర పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ స్వయంగా పరిశీలించారు. ఆర్డీఓ దృష్ఠికి కొంత మంది ఓటర్లు తమకు ఓటరు కార్డు ఉన్న జాబితాలో పేర్లు లేవని ఫిర్యాదు చేశారు. ఎఎస్‌పి రవిశంకర్‌రెడ్డి కోసిగి మండలంలో ఎన్నికలను పర్యవేంచారు. అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఈశ్వర్ నందవరం, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోసిగిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు పార్థసారథి గోనెగండ్ల, ఎమ్మిగనూరు, కౌతాళం మండలాల్లో పర్యవేక్షించారు. ప్రాజెక్టు ఆర్వీఎం పిడి పద్మకుమారి ఆలూరు, చిప్పగిరి మండలాల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్ ఇడి సారయ్య హొళగుంద, హాలహర్వి, ఆస్పరి, ఆదోని మండలల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. స్పెషల్ కలెక్టర్ ఓబులేశు దేవనకొండ, పత్తికొండ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. హంద్రినీవా డిప్యూటీ కలెక్టర్ తుగ్గలి, మద్దికేర మండలల్లో పోలింగ్ కేంద్రాలను, పిడి హరినాథ్‌రెడ్డి మంత్రాలయం, నందవరం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సిపిఓ ఆనంద్‌నాయక్ పెద్దతుంబళం, ఎమ్మిగనూరు పోలింగ్ కేంద్రాలను డిప్యూటీ కలెక్టర్ సత్యం గోనెగండ్ల మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ప్రత్యేక అధికారులను ప్రతి మండలానికి బాధ్యతలను అప్పగించి ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు అవకతవకలు లేకుండా ప్రశాంతంగా జరగడానికి చర్యలు తీసుకొవడం వల్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే హొళగుంద మండలంలోని వందవాగిలిలో ఓటు వేసే విషయంలో వైకాపా, కాంగ్రెస్ కార్యకర్తలకు జరిగిన ఘర్షణలో తిమ్మప్ప అనే వ్యక్తికి తలపై తీవ్ర గాయం కాగా అతనిని ఆస్పత్రికి తరలించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గార్లదినె్న గ్రామంలో జరిగిన ఘర్షణలో వైకాపా కార్యకర్తలు కట్టెలతో కానిస్టేబుల్ షేక్షావలిపైనా దాడి చేయడంతో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆయనతోపాటు పాటు ఇద్దరు వైకాపా కార్యకర్తలు రామాంజికి, మరోకరికి తీవ్ర గాయాలు తగిలాయి.
కాంగ్రెస్ విజయ భేరి
ఆదోని డివిజన్‌లో చివరి విడతగా బుధవారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో వైకాపా, మూడవ స్థానానికి టిడిపి పరిమితమైంది. ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఉన్న ఆదోని, ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ, గోనెగండ్ల, హాలహర్వి, హొళగుంద, కోసిగి, కౌతాళం, మంత్రాలయం, మద్దికేర, నందవరం, పత్తికొండ, పెద్దకడబూరు, తుగ్గలి, ఎమ్మిగనూరు మండలాల్లో ఉన్న 297 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాల్లో 35 సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవం ఎన్నికలు జరిగాయి. చివరి విడతగా బుధవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు లభించాయి. ఏకగ్రీవ సర్పంచ్ స్థానాలకు కలుపుకుసి కాంగ్రెస్ పార్టీకి 105 సర్పంచ్ స్థానాలు, టిడిపికి 71 సర్పంచ్ స్థానాలు, వైకాపాకి 84 స్థానాలు, సిపిఐ 6 స్థానాలు, సిపిఎంకి 3 స్థానాలు, స్వతంత్రులకు 28 స్థానాలు లభించాయి. దేవనకొండలో కాంగ్రెస్ 18 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే తెలుగుదేశం, వైకాపాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగానే పోటీ నిచ్చాయి. సిపిఐ, సిపిఎం తమ ఉనికినీ చాటుకున్నాయి. ఇక స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువ స్థానాల్లో గెలిచారు. డివిజన్ కేంద్రమైన ఆదోనిలో వైకాపా 13 సర్పంచ్ స్థానాలను గెలుచుకొని ముందంజలో ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఆదోని మండలంలోని 12 స్థానాలు అధికంగా గెలుచుకుంది. అయితే ఎమ్మిగనూరు మండలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలను గెలుచుకొని వైకాపా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి సవాలుగా నిలిచింది. పత్తికొండలో టిడిపి 8 స్థానాలు గెలుచుకొని ముందంజలో ఉంది. ఆలూరులో కూడా తెలుగుదేశం పార్టీ ముందంజలో నిలిచింది. హాలహర్వి మండలం కాంగ్రెస్ తమ పట్టు నిలబెట్టుకుంది. కాని డివిజన్ మొత్తం తీసుకుంటే 105 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది. డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ తమ పట్టును నిలుపుకుంది.
సమైక్య ఉద్యమ సెగలు
డోన్, జూలై 31: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుధవారం డోన్‌లో జెఎసి ఆధ్వర్యంలో తలపెట్టిన ఉద్యమాలు రగిలాయి. కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి, పిఎసి చైర్మన్ కెయి క్రిష్ణమూర్తిలు రాజీనామాలను డిమాండ్ చేస్తూ పట్టణంలోని వారి నివాసాలను ఆందోళనకారులు ముట్టడించారు. అంతేగాక ప్రైవేట్ స్కూలు యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నింటిని స్వచ్ఛందంగా మూసివేశారు. విద్యాసంస్థలన్నింటికి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి ఉద్యమంలో తమ వంతు భాగస్వామ్యులయ్యారు. యువకులు జాతీయ రహదారిపై రాస్తారోకోను నిర్వహించి నిరసన చేపట్టారు. బేతంచెర్ల క్రాస్‌రోడ్డు, చిగురమానుపేట తదితర ప్రాంతాల్లో స్వచ్చందంగా వాహన యజమానులు రోడ్లకు అడ్డంగా ట్రాక్టర్లు, ఆటోలను అడ్డంగాపెట్టి తమ నిరసనను చేపట్టారు. కొన్నిచోట్ల వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జెఎసి గౌరవాధ్యక్షులు మహేష్‌కన్నా, అధ్యక్షులు పామయ్య, కోశాదికారి ఆలా శ్రీ్ధర్, కాలేషాల ఆధ్వర్యంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను శవయాత్రచేపట్టి గాంధీ విగ్రహం ముందు కాల్చివేశారు. అదేవిధంగా యుపిఎ దిష్టిబొమ్మను పాతబస్టాండ్‌లో దగ్ధంచేశారు. అనంతరం డోన్ ఎమ్మెల్యే, కెయి క్రిష్ణమూర్తి ఇంటికి వెళ్లినిరసన చేపట్టారు. ఇంటి ఆవరణలోకి చొరబడి రాజీనామా చేయాలని జెఎసి నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే పోటీగా మరి కొంతమంది కోట్ల రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. దీంతో ఏమి జరుగుతుందోనని ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత ఆందోళన కారులు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించారు. కేంద్ర మంత్రి కోట్ల రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి టిజి, ఎంపిలు ఎస్పీవై రెడ్డి కూడ తమ పదవులను త్యజించాలని నినదించారు. అంతేగాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మవరం సుబ్బారెడి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి ఆందోళనలో భాగస్వామ్యులయ్యారు. రాష్ట్ర జెఎసి పిలుపుమేరకు సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేపడదామని, నిస్వార్థంతో ఉద్యమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు కాలేషా, చంద్ర, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు అన్వర్, వెంకటేశ్వర్లు గౌడు, ఆర్యవైశ్య సంఘ నాయకులు ఓం ప్రకాష్, కోట్రారజని, మాకం అనిల్ తోపాటు ఆర్‌ఎంపి వైద్యులు, సిద్దార్థ స్కూళ్లు, వైష్ణవి డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
కోట్ల, కెయిలు రాజీనామా చేయాలి
రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో విఫలమైన కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పిఎసి చైర్మన్, డోన్ ఎమ్మెల్యే కెయి క్రిష్ణమూర్తిలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి, మాజీ ఎంపిపి శ్రీరాములులు డిమాండ్ చేశారు. పట్టణంలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. సమైఖ్యాంద్రను కాపాడటంలో వారు విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నారని తెలిసినా కేంద్ర మంత్రి కోట్ల ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. గతంలో రాష్ట్రాన్ని విభజిస్తే పదవికి, పార్టీలకు రాజీనామా చేస్తానని చెప్పిన కోట్ల ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదన్నారు. కోట్ల, కెయిలు ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలి పోతారని, భవిష్యత్‌లో ప్రజాగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నా నేతల్లో ఎలాంటి చలనం లేకపోవడం విడ్డూరంగా వుందన్నారు. అదే విధంగా రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో పబ్బం గడుపుకుంటున్న మంత్రి టిజి వెంకటేష్ కూడ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన కోట్ల, టిజిల అసమర్థత వల్లే విభజన జరిగిపోయిందని ఆరోపించారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు మల్లెంపల్లె రామచంద్రుడు, కొత్తకోట దేవేంద్ర రెడ్డి, రఘురాం, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఇవ్వాలి
కర్నూలు ఓల్డ్‌సిసీ, జూలై 31: రాష్ట్రాన్ని ఉంచితే సమైక్యంగా ఉంచాలని లేనియేడల గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఇవ్వాలని రాయలసీమ ఐక్యవేదిక బుధవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలోని రవీంద్ర టాలెంట్ పాఠశాలలో రాయలసీమ ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐక్యవేదికక అధ్యక్షులు, సుబ్బయ్య, కార్యదర్శి విక్టర్ ఇమ్మానియేల్ పాల్గొని మాట్లాడుతూ కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను ప్రకిటించిందని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడ తన నివేదికలో తెలంగాణ కంటే సీమ ప్రాంతం చాలా వెనుకబడి ఉందని స్పష్టం చేసిందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ఇప్పటికే సీమ ప్రాంతాల్లో ఉపాధిలేక ఇతర రాష్టల్రకు కూలీలు వలసలు వెలుతున్నారని అన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి అక్కర లేదని, సమైక్యాంధ్రగా ఉంచండి లేదా గ్రేటర్ రాయలసీమగా చేసి కర్నూలును రాజధానిగా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజకీయ నాయకులు రాజీనామచేసి ఉంటే ఇలా జరిగేది ఉండేది లేదని అన్నారు. రాయచూరు, బళ్ళారి, గిద్దలూరు, కంభం, మార్కపురం కలిపి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న 108 ఉద్యోగుల సమ్మె
కర్నూలు టౌన్, జూలై 31: సమస్యల సరిష్కారం కొరకు 108 ఉద్యోగస్థులు చేట్టిన సమ్మె బుధవారం నాటికి 13 వరోజుకు చేరింది. ఈ సందర్భంగా 108 జిల్లా అద్యక్షులు కిరణ్‌కుమార్ మట్లాడుతూ న్యాయమైన డిమాండ్లకోసం 13 రోజులుగా 108 ఉద్యోగులు సమ్మెచేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం శోచనీయమైన్నారు. ఈకార్యక్రమంలో శివశంకర్ రెడ్డి, పార్థు, రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూ.కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం వాయిదా
కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 31: ఆగస్టు 1వ తేదిన జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెట్, ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న జూనియల్ కళాశాల ప్రిన్సిపాళ్ళ సమావేశం జరగాల్సిన ఉండగా సమైక్యాంధ్ర బంద్ కారణంగా వాయిదా వేసినట్లు ఇంటర్మీడియేట్ విద్యామండలి ఆర్‌ఐఓ పరమేశ్వరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి సమావేశం ఎప్పుడు జరపాలనే త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యములలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ సమావేశం వాయిదాను గమనించాలని ఆయన కోరారు.
సీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి
కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 31: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన తరుణంలో రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆదర్శ ఆటోవర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ భౌగోళికంగా సీమ చిత్ర పటంలో బళ్ళారి, ప్రకాశం ప్రాంతాలను కృష్ణదేవరాయల పాలన సాగించిన ప్రాంతాలను ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకులు నిర్లక్ష్యంవల్ల గతంలో మన కర్నూలు నుండి రాజధానిని హైదరాబాదుకు తరలించడం జరిగిందని అన్నారు. ఇప్పటికైన రాజకీయ నాయకులు మేలుకోని సీమ రాష్ట్రం సాధించుకునే వరకు పోరాటం సాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
సమైక్యాంధ్ర బంద్‌కు ఆర్యవైశ్య సంఘం మద్దతు
కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 31: అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి సంపాదించిన సమైక్యాంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేయడాన్ని నిర్ణయాన్ని నిరసశిస్తు బుధవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నగరంలో కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు టిఎస్.విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో చేస్తున్న సమైక్యాంధ్రకు బంద్‌కు కర్నూలు జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండ్రస్ట్రీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి బుధవారం వాణిజ్య వర్గాలందరు బంద్ పాటించాలనితీర్మానం చేసింది.రాష్ట్రాన్ని రెండు ముక్కలుచేసి విదేశీ బుద్దిని ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ చూపింని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక విశే్వశ్వరయ్య సర్కిల్ వద్ద సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలి
ఆదోని, జూలై 31:ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని కోరుతూ విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు ఆదోనిలో ఊరేగింపు నిర్వహించి రాస్తారోకో చేశారు. జిల్లా కోకన్వీనర్ శ్రీనివాస్ ఆచారి, పవన్, సంతోష్, జగదీష్, తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుతూ గురువారం విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. బంద్‌కు ప్రజలు, రాజకీయ నాయకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.
గార్లదినె్నలో కానిస్టేబుల్‌పై దాడి
* ఇద్దరు వైకాపా కార్యకర్తలకు గాయాలు
ఎమ్మిగనూరు, జూలై 31: పంచాయతీ ఎన్నికల్లో భా గంగా ఎమ్మిగనూరు మండలంలోని గార్లదినె్నలో పో లింగ్ పూర్తి అయిన తరువాత బ్యాలెట్ బాక్స్‌ల విషయంలో వాదోప వాదాలు జరిగి వైకాపా కార్యకర్తలు పోలీసులపై కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో రూరల్ కానిస్టేబుల్ షేక్షావలి గాయపడ్డారు. ఇదే దాడిలో వైకాపా కార్యకర్తలు రామాంజి, మాదన్నలు గాయపడడంతో వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అలాగే మల్కాపురం, కందనాతి గ్రామాల్లో చెదురు మదురు సంఘటనలు జరిగాయి.
రాష్ట్ర విభజనకు నిరసనగా రాస్తారోకో
ఎమ్మిగనూరు, జూలై 31:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అదిష్థానం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బుధవారం ఆర్టీసీ జేయేసి నాయకులు ఆచారి, నవాజ్, గోపాల్, సాహెబ్, బాషాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ డిపో రోడ్డులో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. సోనియా డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ప్రశాంతంగా పోలింగ్
గోనెగండ్ల, జూలై 31:గోనెగండ్ల మండలంలో బుధవారం జరిగిన గ్రామ పంచాయతీలు ఆయా గ్రామాల్లో ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోనెగండ్ల మండలంలో 20 గ్రామ పంచాయతీల్లో ఐదు ఏకగ్రీవం కాగా, మొత్తం 39,184 మంది ఓట్లు ఉండగా 31,934 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.49శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మండలంలో గోనెగండ్ల, లింగందినె్న, ఎర్రబాడు, హెచ్.కైరవాడి గ్రామాల్లో టిడిపి మద్దతుదారులు గెలుపొందారు. ఐరన్‌బండ, బి. అగ్రహారం, అలువాల, పెద్దమర్రివీడు, పెద్దనెలటూరు, వేముడోగు గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా, చిన్నమర్రివీడు, నెరడుప్పల గ్రామాల్లో వైకాపా అభ్యర్థులు సర్పంచ్‌గా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గంజహళ్లి, పుట్టపాశం గ్రామాలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు.
హాలహర్విలో కాంగ్రెస్‌దే హావా
హాలహర్వి, జూలై 31:హాలహర్వి మండలంలో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 15 పంచాయతీలకుగాను ఐదు ఏకగ్రీవం కాగా మిగిలిన 10 సర్పంచ్ ఎన్నికల్లో నాలుగు కాంగ్రెస్ పార్టీ, మూడు స్వతంత్ర అభ్యర్థులు, రెండు వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. వీటిలో కాంగ్రెస్ తరుపున గుళ్యూం రాజశేఖర్‌రెడ్డి, బాపురం చెనమ్మ, చింతకుంట చంద్ర, సిద్దాపురం రంగప్ప, స్వతంత్ర అభ్యర్థులు నాగరత్నమ్మ, హాలహర్వి ఎం. రంగమ్మ, నెట్రవట్టి బసప్ప, వైకాపా తరుపున కామినేహాల్ నాగరత్నమ్మ, ఎంకె. పల్లినాగమ్మ, టి.సాకిబండ సర్పంచ్‌గా విజయం సాదించారు. మండల ఎన్నికల అధికారి నాగేశ్వరరావు, తహశీల్దార్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
నందవరంలో వైకాపా హావా
నందవరం, జూలై 31:నందవరం మండలంలో వైకాపా అభ్యర్థిలు పులచింత వీనా, ఇహ్రీంపురం మద్దమ్మ, కనకవీడు రుతమ్మ, మిట్టసోమాపురం లింగన్న, పెద్దకొత్తిలి విరుపాక్షిరెడ్డి,కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ, నదికైరవాడి రత్నమ్మ, పొనకలదినె్న నాగమ్మ, నాగలదినె్న ప్రభాకర్‌లు గెలుపొందారు.

గవర్నర్ రోశయ్య పర్యటన రద్దు
నంద్యాల అర్బన్, జూలై 31:కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర ప్రకటన జరిగిన వెంటనే కోస్తాంధ్రలో ఉద్యమాలు ఊపందుకోవడంతో మంగళవారం సాయంత్రం నుంచే నిరసన జ్వాలలు మిన్నంటాయి. నంద్యాల పట్టణంలో ఆగస్టు 1న రోశయ్య పర్యటన రద్దయినట్లు అధికారులు తెలిపారు. నిరసనలు, రాస్తారోకోలు, బంద్‌లు నిర్వహిస్తుండడంతో పర్యటన రద్దుచేసినట్లు జిల్లా కేంద్రం నుంచి సమాచారం అందినట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.
జెన్‌కో ఉద్యోగి పదవీ విరమణ
శ్రీశైలం, జూలై 31: శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు బుధవారం పదవీవిరమణ చేశారు. జెన్‌కో ట్రాన్స్‌పోర్టు డివిజన్ కార్యాలయం వద్ద ఎస్‌ఇ రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది, తోటి ఉద్యోగులు ఘనంగా శాలువలతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంస్థలో పనిచేసిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎపి జెన్‌కో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సిర్రా జాన్ విక్టర్, ప్రధాన కార్యదర్శి రామయ్య, కోశాధికారి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు
మహానంది, జూలై 31: మహానంది మండలంలో వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ సమయాన్ని మార్పు చేసినట్లు మహానంది ట్రాన్స్‌కో ఎఇ ప్రభాకర్‌రెడ్డి బుధవారం తెలిపారు. గ్రూప్-ఎ ఉన్న గాజులపల్లె, కృష్ణనంది, ఎల్లావత్తుల, గోపవరం గ్రామపరిధిలో ఉన్న విద్యుత్ మోటార్లకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజామున 1గంట వరకు, గ్రూప్ -బిలో ఉన్న బుక్కాపురం, పుట్టుపల్లె, పచ్చర్ల, గాజులపల్లె గ్రామాల్లో ఉన్న మోటార్లకు తెల్లవారుజామున 3గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నాం 4గంటల నుండి 8గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. అలాగే వ్యవసాయ బోర్లకు కేపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ మార్పులు నేటి నుంచి అమలులోకి వస్తాయన్నారు.
సమైక్యాంధ్ర కోరుతూ ఆందోళన
చాగలమర్రి, జూలై 31: చాగలమర్రిలో బుధవారం సమైక్యాంద్రకు మద్దతుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. గ్రామంలో రాష్ట్రాన్ని విభజించడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేశారు. కర్నూలు-చిత్తూరు 18వ జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేశారు. ప్రధాని, సోనియాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు శివశంకర్, మండల అధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి సంజీవరెడ్డి, పిఆర్‌టియు నాయకులు ఆంజనేయరెడ్డి, వౌళాలి, నజీర్‌అహమ్మద్, జిల్లా నాయకులు రవీంద్రారెడ్డి, యుటిఎఫ్ నాయకులు బాలకృష్ణ, జాని, ఆర్యవైశ్య సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంద్ర కోరుతూ ర్యాలీ
మహానంది, జూలై 31: మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో బుధవారం సమైక్యాంద్రను కోరుతూ విద్యార్థులు ర్యాలీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరిబాబు, కరస్పాండెంట్ చక్రపాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తమ్మడపల్లెలో విగ్రహాల ధ్వంసం
మహానంది, జూలై 31: మహానంది మండలం తమ్మడపల్లె ఇంజవాణి చెరువు వద్ద నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ దేవాలయంలో కుమారస్వామి, దుర్గా అమ్మవారు, ద్వారపాలకుల విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు బుదవారం తెల్లవారుజామున ధ్వంసం చేసినట్లు గ్రామాస్థులు గుర్తించారు. ఆలయ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి కాసుల వెంకటేశ్లర్లు, మహానంది పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ కాంగ్రెస్, యుపిఎ
english title: 
s

సమైక్యాంధ్రకు మద్దతుగా వివిధ సంఘాల ఆందోళన

$
0
0

విజయనగరం, జూలై 31: సమైక్యాంధ్రాకు మద్దతుగా న్యాయవాదులు బుధవారం తమ విధులను బహిష్కరించారు. బుధవారం జిల్లా కోర్టు వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి సోనియా, యూపీఏ ప్రభుత్వం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రామ్మోహనరావు, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, రాష్ట్ర బార్ అసోసియేషన్ సభ్యుడు కెవిఎన్ తమ్మన్నశెట్టిలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తాము విధులను బహిష్కరించినట్టు పేర్కొన్నారు.
ఈ నెల 29 నుంచి 2వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సమైక్యాంద్ర వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించేందుకే తాము రోడ్లపై బైఠాయింపు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు.
‘సమైక్యాంధ్ర తీర్మానం ప్రకటించాలి ’
సమైక్యాంధ్ర తీర్మానం వెంటనే ప్రకటించాలని చేయాలని కోరుతూ ఎపి ఎన్జీవో సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయులు రాస్తరోకో నిర్వహించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ వద్ద సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు స్వచ్చందంగా విధులు బహిష్కరించి రావాలని కోరారు. దీనికి అన్ని శాఖల నుంచి ఉద్యోగులు కలసికట్టుగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా 3తెలంగాణా వద్దు.. సమైక్యాంధ్ర ముద్దు2 అంటూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ గేటు బయట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభూజీ మాట్లాడుతూ తెలంగాణా నేతల స్వార్ధం కోసం సమైక్యాంధ్ర లేకుండా నీరుగార్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు.
అందుకు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కోరారు. సిడబ్ల్యుసి కోర్ కమిటీలో తెలంగాణా ప్రకటనపై నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని ఎపి రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధి శ్రీనివాసరావు అన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ఇటువంటి ప్రకటన చేయడం వల్ల దురదృష్టకరమన్నారు. రాష్ట్రం విడిపోతే నీటి వనరులు, విద్యుత్ ఇతర సమస్యలు ఉత్పన్నమవుతాయని రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధి సత్యనారాయణ అన్నారు.
ఈ కార్యక్రమంలో బంగారునాయుడు, రమాదేవి, యూటీఎఫ్ నేత అల్లూరి శివవర్మ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ జంక్షన్ వద్ద దాదాపు 40 నిమిషాలపాటు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
జామిలో..
జామి, : మండలంలోని సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్‌ను నిర్వహించారు. ఈ బంద్‌లవో వందలాది మంది విద్యార్ధులు ఉపాధ్యాయులు వైఎస్సార్ సిపి, టిడిపి నాయకులు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తెలంగాణా వద్దు సమైక్యమే ముద్దుంటూ నినాదాలు చేస్తూ సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహణ పరిచారు. అనంతరం జామి బస్టాండు వద్దమానవహారంగా ఏర్పడి కొంత సేపు ట్రాఫిక్‌ను నిర్భందించారు.వ్యాపారులు, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్‌కు మద్దతుగా సెలవు ప్రకటించారు. వైఎస్సార్ సిపి నాయకులు బండారు పెదబాబు, దేశం పార్టీ నాయకులు చుక్క సూర్యనారాయణ మాస్టారు, బివి రమణారావు, ఆంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వాక గొవింద, తన అనుచరులు బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి రాష్ట్రం విభజన వలన కలిగిన నష్టాలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
విద్యార్ధుల
మానవహారం
డెంకాడ, : సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ రహదారిపై విద్యార్ధులు బుధవారం మానవహారం నిర్వహించారు. మండలంలోని అక్కివరం జంక్షన్‌లో అలాగే జోన్నాడ జాతీయ రహదారిపై సుమారు 500 మంది విద్యర్ధులతో భారీ మానవహారం నిర్వహించారు. అలాగే డెంకాడ, పూసపాటిరేగ, మండలాల్లో కూడా కార్మికులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ ఎత్తున 55వ నెంబర్ జాతీయ రహదారికి చేరుకుని కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసారు.
సమైక్యాంధ్రకు మద్దతగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, యుపిఎ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు నినాదాలు చేసారు. తెలుగు యువత అధ్యక్షులు కంది సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మెంటాడలో..
మెంటాడ, : మండల కేంద్రమైన మెంటాడలో బుధవారం సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో, బంద్ నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు సుమారు మూడు గంటలపాటు ట్రాఫిక్ స్థంబించింది. ఈ కార్యక్రమంలో దేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటిస్తూ పురవీధుల్లో తెలంగాణా వద్ద సమైక్యాంధ్ర ముద్దు అని నినాదాలు చేస్తున్నారు. ఆ ర్యాలీలో గ్రామానికి చెందిన యువకుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు పార్టీ నాయకులు, యువకులు, విద్యార్దులు పాల్గొన్నారు.
నిరసనల వెల్లువ
చీపురుపల్లి, : తెలంగాణా రాష్ట్ర ఏర్పటుపై సిడబ్ల్యుసి నిర్ణయాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులు విద్యార్ధులు నిరసన వ్యక్తం చేసారు. స్థానిక మూడు రోడ్ల జంక్షన్ వద్ద బుధవారం విద్యార్ధులు, పలు పార్టీల నాయకులు ధర్నా చేసి తహశీల్ధార్ వినతిపత్రం అందజేసారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో విద్యా సంస్థలు వ్యాపార వర్గాలు బంద్ పాటించాయి. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ నేతలు రౌతు కామునాయుడు, అడ్డారి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
దత్తిరాజేరులో...
సమైక్యాంధ్రకు మద్దతుగా మండలంలో 35 గ్రామ పంచాయతీల్లో ప్రాధమిక పాఠశాలతోపాటు ఉన్నత పాఠశాలలు మూసి వేసి, ఉపాధ్యాయులు, విద్యార్ధులు బంద్ చేసారు.
మండల పరిషత్ కార్యాలయం, తహశీల్ధార్ కార్యాలయం, ఐకెపి కార్యాలయంతోపాటు, ఎంఆర్‌సి భవన కార్యాలయ సిబ్బంది కూడా బంద్‌కు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్ధులు, ర్యాలీ నిర్వహించి, సమైక్యాంగా ఉండాలని పలు నినాదాలు చేసారు. సమైకాంధ్ర తోనే అభివృద్ధ సాధ్యమని నినదించారు.

రాష్ట్ర విభజనపై నిరసనల హోరు
విజయనగరం (్ఫర్టు), జూలై 31: రాష్ట్ర విభజన బాధాకరంగా ఉందని జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో పలు చోట్ల ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఈ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్‌నాయకులు, కార్యకర్తలు గంటస్తంభం, ఎన్‌సిసి ధియేటర్, రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర చోట్ల రాస్తారోకో నిర్వహించారు. తెలుగుదేశంపార్టీకి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించినందునే కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. తెలుగుదేశంపార్టీలు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగువారంతా సమైక్యంగా ఉండాల్సిన తరుణంలో రెండు రాష్ట్రాలుగా విడిపోవడం బాధాకరంగా ఉందన్నారు కాంగ్రెస్‌నేతలు జిల్లాకు బంద్‌కు పిలుపుఇవ్వడంతో పట్టణంలో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూతపడ్డాయి. అలాగే ఆర్టీసీ బస్సులు పాక్షికంగా తిరిగాయి. రాష్ట్ర విభజనకు మనస్థాపం చెందిన కాంగ్రెస్ కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను), పార్టీకాంగ్రెస్‌నాయకులు పిళ్లా విజయకుమార్, యడ్ల ఆదిరాజు పాల్గొన్నారు.
‘రాష్ట్ర విభజన దుర్మార్గపు చర్య’
విజయనగరం (కంటోనె్మంట్): రాష్ట్ర విభజన ఒక దుర్మార్గపు చర్యయని, ఇది తెలుగు జాతికి మాయని మచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు నిరశనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనపై పెనుమత్స మాట్లాడుతూ తెలుగు జాతిని విడదీసిన అపఖ్యాతి యుపిఎ చైర్మన్ సోనియాకు దక్కుతుందని విమర్శించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసమే ఒక కుటుంబలా ఉండే తెలుగు ప్రజలను విడగొట్టారని, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి కాదని అన్నారు. వైకాపా జిల్లా యువజన అధ్యక్షుడు అవనాపు విజయ్, జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ గొర్లె వెంకటరమణ తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయనగరం (్ఫర్టు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సమైక్యాంధ్ర జెఎసి జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో బుధవారం బంద్ జరిగింది. పలు చోట్ల ప్రధాన కూడళ్లల్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసి నాశనం చేయాలనుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. సీట్లు, ఓట్లు కోసం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ద్విజయ్‌సింగ్, టిఆర్‌సి నేత కెసిఆర్, ప్రొఫెసర్ కోదండరామ్ చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులైన మంత్రులు, ఎం.పి., ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా కాలయాపన చేస్తున్నవారికి గట్టిబుద్ధి చెబుతామన్నారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్‌ను సీమాంధ్రలో పూర్తిగా భూస్థాపితం చేస్తామని అప్పలనాయుడు హెచ్చరించారు. విద్యార్ధి, కార్మిక సంఘాలు, రాజకీయపార్టీల నాయకులు పాల్గొన్నారు.

కొండ్రాజుపాలెంలో అగ్ని ప్రమాదం
భోగాపురం, జూలై 31 : మండలంలోని కొండ్రాజుపాలెం గ్రామంలో బుధవారం తెల్లవారు ఝామున అగ్ని ప్రమాదం సంబభివించడంతో 148 ఇళ్లు దగ్ధమయ్యాయి. 250 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. దుస్తులు, సామగ్రి అన్ని కాలి బూడిద కావడంతో రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్ రాజేశ్వరి, ఆర్‌ఐ పిట్టా అప్పారావు అలాగే రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి ఆస్తినష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఆర్డీవో రాజకుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన పరిస్థితిలని అడగా ముందుగా అదే గ్రామానికి చెందిన వాసుపల్లి కడుపోడు ఇంటిలో మంటలు బెలరేగాయని రాత్రి సమయం కావడంతో గాలికి గ్రామం అంతా పాకి అన్ని ఇళ్లు దగ్ధమయ్యాయని బాధితులులు ఆర్డీవోకు వివరించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం నుండి సహాయం వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. అగ్నిమాపక వాహనం సంఘటన స్థలానికి ఆలస్యంగా రావడంతో ప్రమాదం మరింత ఎక్కువైందని గ్రామస్తులు అంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని ఆయన తెలిపారు.

ఇరు వర్గాల మధ్య కొట్లాట
డెంకాడ, జూలై 31 : మండలంలోని డి.తాళ్లవలస గ్రామంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కాగా ఎనిమిది మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కధనం ప్రకారం కాంగ్రెస్ వర్గానికి చెందిన అట్టాడ ముసలినాయుడు మరో వర్గానికి చెందిని అట్టాడ త్రిమూర్తులు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి అభ్యర్ధిగా పోటీ చేశారు. వారిలో ముసలి నాయుడు విజయం సాధించడంతో కొంత మంది తమకు వ్యతిరేకంగా పని చేసారని కాంగ్రెస్ వర్గం వారు నిలదీయడంతో ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకుని కర్రలతో ఘర్షణ పడ్డారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

గొట్లాంలో కాంగ్రెస్, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
బొండపల్లి, జూలై 31 : మండలం పరిధిలోని గొట్లాం గ్రామంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మద్దతుదారులు ఘర్షణకు తలపడడంతో గ్రామంలో సాయుధులైన పోలీసులను కాపలాగా నియమించారు. స్థానిక సబ్ ఇన్స్‌పెక్టర్ డిడి నాయుడు కథనం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఆటో ఎక్కుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు చేయి చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. అదే రోజు రాత్రి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ మద్దతుదారుల ఇళ్లపై దాడి జరిపారు. అంతకు ముందు రహదారిపై తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు మహంతి రమణ, తాళ్లపూడి ఆదికృష్ణ, సిగడం శ్రీనులపై కాంగ్రెస్ మద్దతుదారులు దాడి జరపడంతో గాయపడ్డారు. గాయపడిన ముగ్గురు విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు గాయపడ్డారు. సిడగం బంగారమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరపుతున్నారు.

పట్టణంలో పోలీసు బలగాల కవాతు
విజయనగరం (కంటోనె్మంట్), జూలై 31: రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ పటిష్టబందోబస్తు ఏర్పాట్లు చేసింది. బుధవారం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు బంద్‌కు పిలునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా పట్టణంలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ కార్తికేయ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద నుంచి ట్యాంక్‌బండ్ రోడ్డు, కోట, మూడు లాంతర్లు, మెయిన్ రోడ్డు, గంటస్తంభం మీదుగా తిరిగి బాలాజీ కూడలి మీదుగా ఆర్టీసి కాంప్లెక్స్ వరకు కేంద్ర ప్రత్యేక పోలీస్ బలగాలతోపాటు స్థానిక పోలీసులతో కలిసి కవాతు నిర్వహించారు. అనంతరం మయూరి కూడలికి చేరుకుని అక్కడ నుంచి నిఘా ఏర్పాట్లను ఎస్పీ పర్యవేక్షించారు. పట్టణంలో ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో డిఎస్పీ, సిఐ స్థాయి అధికారులును బందోబస్తు పర్యవేక్షకులుగా నియమించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై దాడులు నిర్వహించకుండా పోలీస్ హెచ్చరికలు జారీ చేశారు.

సమైక్యవాది ప్రాణాలు బలిగొన్ని విభజన

గంట్యాడ, జూలై 31 : తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను జీర్ణించుకో లేకపోయిన ఒ సమైక్యవాది పురుగు మందు తాగి సమైక్యాంధ్ర కోసం తన ప్రాణాలను తీసుకున్నాడు. ఆది నుంచి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటూ వచ్చిన, పోలీసు శాఖలో హోంగార్డ్‌గా ఉద్యోగం చేస్తున్న ఈ మండలం తాటిపూడి గ్రామానికి చెందిన తమటాపు శ్రీనివాసరావు (35) సమైక్యాంధ్రకు మద్దతుగా పురుగు మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఆదివారం మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి శ్రీనివాసరావు భార్య పార్వతీదేవి పోలీసులకు చేసిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. తాటిపూడి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు విజయనగరం పోలీస్ ఈగల్ మోబైల్ టీమ్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. గతంలో ఇతడు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని చురుకైన మాత్రను పోషించాడు. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణా ప్రకటనను శనివారం మధ్యాహ్నం టీవిలో సూచిన శ్రీనివాసరావు మనస్తాపం చెంది రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారంటూ తన ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు భార్య పార్వతీదేవి పేర్కొంది. తెలంగాణా తనకు ఇష్టం లేదని, పాపను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిన తన భర్త పురుగు మందు తాగి తిరిగి ఇంటికి చేరుకున్నారన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరిలించగా పరిస్థితి విషమంగా ఉంచడంతో విశాఖ కెజిహెచ్‌కు ఆసుపత్రి వర్గాలు తరలించినట్లు ఆమె తెలిపారు. ఆదివారం ఉదయం తన భర్త మృతి చెందినట్లు విలేఖర్లకు తెలిపారు. శ్రీనివాసరావు భార్య పార్వతీదేవి చేసిన ఫిర్యాదు మేరకు విజయనగరం డిఎస్పీ కృష్ణప్రసన్న, రూరల్ సిఐలు, గంట్యాడ, ఎస్సైలు తాటిపూడి వెళ్లి శ్రీనివాస్ మృతి సంఘటనపై దర్యాప్తు నిర్వహించారు. శ్రీనివాసరావు మృతి విషయమై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. శ్రీనివాసరావు ఆత్మశాంతి కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులతోపాటు, సమైక్యవాదులు పాఠశాల విద్యార్ధులు, యువకులు, యువజన సంఘాలు కోటారుబిల్లి జంక్షన్‌లో మానవహారం ఏర్పడి నివాళులర్పించారు.

నిరసన జ్వాలలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 31: సమైక్యాంధ్ర ఉద్యమకారుల నిరసన గళం మిన్నంటింది. సమైక్యాంధ్ర కోసం ఒక హోంగార్డు తన ప్రాణాలను బలిదానం తీసుకోగా, మరో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమైక్యాంధ్రను కొనసాగిస్తామని సిడబ్ల్యుసి ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ముద్దు.. తెలంగాణా వద్దు అంటూ నినాదాలు చేశారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సమైక్యాంధ్ర కోసం నిరసన ధ్వనులు విన్పించాయి. పలు చోట్ల సోనియా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వివిధ ప్రాంతాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఎమ్మెల్యే రాజన్నదొర, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభ్రదరావు తమ పదవులకు రాజీనామా చేశారు. జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గంట స్తంబం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాష్ట్రాన్ని విడగొట్టడం బాధాకరంగా ఉందన్నారు. టిడిపి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించినందునే సిడబ్ల్యుసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. తెలుగు భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని అమరజీవి పొట్టి శ్రీరాములు ఆనాడు ప్రాణత్యాగం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సమైక్యాంధ్రాకు మద్దతుగా జిల్లాలో పాఠశాలలు, వ్యాపారులు దుకాణాలు మూసి సమైక్యాంధ్రకు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావుతోపాటు కాంగ్రెస్ నాయకులు పిళ్లా విజయకుమార్, యడ్ల ఆదిరాజు తదితరులు పాల్గొన్నారు. సాలూరులోని ఎమ్మెల్యే రాజన్నదొర సమైక్యాంధ్ర కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బోగాపురంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, సీతానగరంలోని ఎమ్మెల్యే జయముణి అక్కడ సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో వైకాపా జిల్లా కన్వీనర్ పి.సాంబశివరాజు నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ విధంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మానవహారం, ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
రాజన్న రాజీనామా
సాలూరు,: రాష్ట్ర విభజనకు నిరసనగా ఎమ్మెల్యే రాజన్నదొర బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ ఎన్.మనోహార్, పి.సి.సి. అధ్యక్షులు బొత్స సత్యనారాయణకు పంపించారు. కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం తెలంగాణా ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించడం అన్యాయమన్నారు. అసెంబ్లీలో తెలంగాణా తీర్మానాన్ని ఓడిస్తామన్నారు. సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే రాజన్నదొర నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలు చేశారు. ఎమ్మెల్యే నివాసం నుంచి ప్రధాన రహదారుల గుండా నిరసన ర్యాలీ చేపట్టారు.

సమైక్యాంధ్రాకు మద్దతుగా న్యాయవాదులు బుధవారం
english title: 
s

ముగిసిన సంగ్రామం

$
0
0

శ్రీకాకుళం, జూలై 31: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. తుది విడతగా టెక్కలి డివిజన్‌లో 12 మండలాల్లో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్నిచోట్ల 11 గంటల సమయానికే ఓటర్లు పూర్తిస్థాయిలో వారి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా వృద్ధులు, వికలాంగులే పోలింగ్ కేంద్రాలకు హాజరై అధిక శాతం ఓటింగ్‌లో పాల్గొన్నారు. డివిజన్‌లో 81.60 శాతం పోలింగ్ నమోదైంది. డివిజన్‌లో మొత్తం 5.38 లక్షల ఓటర్లకు గాను 3,63,138 మంది ఓటర్లుతమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కేంద్ర సహాయమంత్రి కిల్లి కృపారాణి టెక్కలి వంశధార కాలనీలో గల పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకోగా స్థానిక ఎమ్మెల్యే కొర్ల భారతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఎన్నికల తీరుతెన్నులను పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులను అప్రమత్తం చేసి సూచనలు అందించారు. అలాగే టెక్కలి ఆర్డీవో విశే్వశ్వరరావు పలు కేంద్రాలను తనిఖీ చేశారు. 364 పంచాయతీల్లో 79 ఏకగ్రీవం కాగా, 285 సర్పంచ్ స్థానాలకు గాను 734 మంది అభ్యర్థులు, అలాగే 1362 వార్డుమెంబర్లకు గాను 2,871 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పోలింగ్ శాతం గత రెండు డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే కాస్త తగ్గిందనే చెప్పాలి. తుది సమరానికి ముందే తెలంగాణ అంశంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం స్థానిక ఎన్నికలపై పడిందనే చర్చ సాగుతోంది. జలుమూరులో అత్యధికంగా 90.63 శాతం పోలింగ్ నమోదు కాగా ఇచ్ఛాపురంలో 71.04 పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి డివిజన్‌లో మండలాల వారీగా పరిశీలిస్తే...మందస మండలంలో 78.55 శాతం, టెక్కలిలో 85.05, కవిటిలో 76.34, కోటబొమ్మాళిలో 87.04, సంతబొమ్మాళిలో 87 శాతం, కంచిలిలో 81.57 శాతం, నందిగాంలో 87, పలాసలో 81.01, వజ్రపుకొత్తూరులో 74.09, సోంపేటలో 75.83 శాతం పోలింగ్ నమోదైంది. టెక్కలి డివిజన్‌లో అత్యధికంగా సమస్యాత్మక ప్రాంతాలున్నప్పటికీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. వజ్రపుకొత్తూరు మండలం బెండి పోలింగ్ స్టేషన్ సమీపంలో సి.పి.ఎం జెండా ఉండడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని, దానిని తీసివేయాలని ఎస్సై శాంతారాం స్థానికులను ఆదేశించగా వారు తిరస్కరించారు. టెక్కలి మండలం రావివలస పోలింగ్‌కేంద్రం వద్ద ఉదయం నుంచి ఓటర్లు తక్కువగా కనిపించారు. కోటబొమ్మాళికి చెందిన గంగపున్నమ్మ(80) తన ఓటుహక్కును వినియోగించుకోవడం కనిపించింది. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి డివిజన్లకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నారు.

సిక్కోల్ ‘పంచాయతీ’లో
కాంగ్రెస్ ముందంజ
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూలై 31: ఏడేళ్ల అనంతరం జరిగిన పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ తమ హవాను చాటుకుంది. మూడు విడతలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 445 మంది విజయం సాధించగా, దేశం పార్టీ 374 పంచాయతీలు, వైకాపా 170 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో 115, రెండో విడతలో 158, మూడో విడతలో 172 సర్పంచ్ పదవులను దక్కించుకుని తమ హవా చాటుకుంది. అయితే, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా బలం పుంజుకుని, తరువాత దిగజారి రెండోస్థానానికి పరిమితం కాగా, వైకాపా మూడో స్థానానికే పరిమితం కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ మొదటి విడతలో 149 స్థానాలను, రెండో విడతలో 126 స్థానాలను, మూడో విడతలో 99 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు దక్కించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకొర ఫలితాలే అందిపుచ్చుకోవడంతో జగన్ అభిమానులు అంతర్మథనానికి గురవుతున్నారు. ఈ పార్టీ మొదటి విడతలో 57 స్థానాలు, రెండో విడతలో 71, మూడో విడతలో 42 స్థానాల్లో సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
పంచాయతీ పోరుకు ప్రధాన పార్టీలు దూరంగా ఉన్నట్టుగా వ్యవహరించినప్పటికీ, తెరవెనుక స్థానిక పట్టుకోసం ముమ్మర ప్రయత్నాలు చేసారు. మనీ, మద్యం ఈ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించగా, వలస ఓటర్లు కూడా అధికార పార్టీకి అనేక చోట్ల అండగా నిలిచారనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి స్వగ్రామమైన పోలవరంలో ఓటమి చవిచూడగా, మేజర్ పంచాయతీ టెక్కలి సర్పంచ్ కుర్చీ దేశం పార్టీ కైవసం చేసుకోవడంతో ఆమె భంగపాటు తప్పలేదు. రాష్ట్ర మంత్రి కోండ్రు మురళీమోహన్ స్వగ్రామం లావేటిపాలేంలో దేశం ఖాతాలో జమయ్యింది. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి జన్మస్థలమైన కావలి కాంగ్రెస్‌కు వశమైంది. వైఎస్సార్‌సిపీ శాసనసభ ఉపనేత ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామమైన మబగాంలో కాంగ్రెస్ మద్దతుదారునికి ఏకగ్రీవం అయ్యింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గంలో గార మేజర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. జిల్లాలో షర్మిల పాదయాత్ర ప్రభావం రెండు, మూడో విడతల్లో స్థానిక పోరుపై పడలేదు. మూడో విడత పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర విభజన ప్రభావం ఏ మాత్రం చూపకపోవడం గమనార్హం.

వౌన మునులు.. మననేతలు
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
ప్రజల మనోభావాలకు భిన్నంగా యుపిఎ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సామాన్యులు సైతం తప్పుబడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, డాక్టర్లు , న్యాయవాదులు, ప్రజాసంఘాలు సైతం రోడ్లెక్కి సమైక్యంగా రాష్ట్రాన్ని ఉంచాలని వారి, వారి స్థాయిల్లో ఆందోళనలకు నడుంబిగించారు. బుధవారం జిల్లాలో విద్యాసంస్థల బంద్ పాటించారు. అయితే జనాల్లో ఇంత ఆగ్రహం పెల్లుబికినా రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్న చందంగా రాజకీయ నాయకులు వౌనవ్రతం పాటించడం జనం జీర్ణించుకోలేకపోతున్నారు. నేతల ప్రేక్షకపాత్ర వెనుక ఆయా పార్టీల అధిష్ఠానాలు బెదిరింపులు దాగివున్నాయని పలువురు అనుమానిస్తున్నారు. అయితే ప్రజల ఆకాంక్షల కన్నా, రాజకీయాలే ముఖ్యమా అంటూ పలువురు నిలదీస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం అక్కడి నేతల కున్న తపన, సమైక్యాంధ్ర కోసం మన నేతల్లో ఇసుమంత కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికల్లో అన్ని జిల్లాల కంటే శ్రీకాకుళం జిల్లా పౌరుల తలసరి ఆదాయం అతితక్కువగా ఉందంటూ తేల్చిచెప్పడమే కాకుండా ఉత్తరాంధ్ర మరింత వెనుకబడిందని ఆ కమిటీ కేంద్రానికి నివేదించిన విషయాన్ని కూడా జిల్లాకు చెందిన నేతలు విడమరిచి అధిష్ఠానం వద్ద ఏకరవు పెట్టలేకపోవడం మరింత దౌర్భాగ్యమంటూ సామాన్యులు ఛీకొడుతున్నారు. నదీజలాల వివాదానికి పరిష్కారం చూపే దిశగా సూచన చేయకపోవడం,(మిగతా 2వ పేజీలో)
ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంలో ఇక్కడ నేతలు విఫలమయ్యారని జనం ఆడిపోసుకుంటున్నారు. సమైక్యాంధ్ర సాధించుకుంటామని మంత్రి కోండ్రు మురళీమోహన్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులు పలుమార్లు ఢిల్లీలో మంత్రాంగం నెరిపి గత రెండురోజులుగా నోరు మెదపకపోవడంపై జిల్లా అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకమాండ్ మెప్పు సంపాదించి కేంద్ర క్యాబినెట్‌లో బెర్తును సంపాదించుకున్న కిల్లి కృపారాణి నిన్నటివరకు తాను సమైక్యవాదినే అంటూ గర్జించారే తప్ప..నేడు జరుగుతున్న సమైక్యఉద్యమానికి దూరంగా ఉంటూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమంటూ తప్పించుకోవడాన్ని సమైక్యవాదులు తప్పుబడుతున్నారు. మరో మంత్రి శత్రుచర్ల జిల్లాలో ఇంత జరుగుతున్నా అతని ఆచూకీ తెలియరావడం లేదు. ఆ పార్టీకి చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమంటూ సెలవివ్వడంపై పౌరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, మరో మాజీ గుండ అప్పల సూర్యనారాయణ తప్ప మిగిలిన నేతలంతా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కిమిడి కళావెంకట్రావు, కావలి ప్రతిభాభారతి, గౌతు శ్యామ్‌సుందర్‌శివాజీ, ఎర్రన్న వారసుడు రామ్‌మనోహరనాయుడులు మిన్నకుండిపోవడం చర్చకు దారితీస్తున్నది. ఇదిలా ఉండగా సమైక్యాంధ్రయే మా ఊపిరంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాలను సంధించి నేడు నోరుమెదపకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సమైక్యాంధ్రకు కట్టుబడి రాజీనామా చేస్తానని వెల్లడించడమే తప్ప విభజనపై ప్రజలు సాగిస్తున్న ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలియజేసే దాఖలాలు లేవు. అంతేకాకుండా షర్మిల పాదయాత్ర సంబరాల్లో వై.ఎస్. అభిమానులు తీరిక లేకుండా గడుపుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. ఇలా మూడు పార్టీల నేతలు విభజనపై మిన్నకుండటం సరికాదని ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబాటు తనాన్ని పారద్రోలే విధంగా ఆయా అధిష్టానాల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుంటే రాజకీయ నేతలు చరిత్ర హీనులుగా మిగులుతారని సమైక్యవాదులంతా హెచ్చరిస్తున్నారు.

రేపు జిల్లా బంద్
శ్రీకాకుళం(కల్చరల్), జూలై 31: ప్రత్యేక తెలంగాణ తీర్మానాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం స్వచ్చంధ బంద్ పాటించాలని సమైక్యాంధ్ర ఉద్యమ వేదిక సమన్వయకర్తలు జామి భీమశంకర్, హనుమంతుసాయిరాంలు పిలుపునిచ్చారు. విద్యా, వ్యాపార, రవాణా, కార్మిక సంఘాలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ సంఘాలు ఈ బంద్‌లో స్వచ్చంధంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా
రేపు వ్యాపారుల బంద్
పాతశ్రీకాకుళం, జూలై 31 : సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం చేపడుతున్న సిక్కోలు బంద్‌ను జయప్రదం చేయాలని పట్టన వర్తక సంఘం నాయకులు కోరాడ హరగోపాల్ పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక వర్తక సంఘం ఆధ్వర్యం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించడం తగదన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్న పునసమీక్షించుకోవాలన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో వర్తక సంఘం నాయకులు సాంబమూర్తి, దేవరశెట్టి సతీష్, శ్రీను, కామయ్య, నానాజీలు పాల్గొన్నారు.
అంబేద్కర్ యూనివర్సిటీలో
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ సేవలు
* వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్
ఎచ్చెర్ల, జూలై 31: జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థతో అంబేద్కర్ విశ్వవిద్యాలయం త్వరలో ఒప్పందం కుదుర్చుకొని మరిన్ని సేవలు పొందేందుకు ఆ సంస్థ జనరల్ ఎం.వి.రావు అంగీకరించారని వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ తెలిపారు. గత రెండురోజులుగా హైదరాబాద్‌లో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ జనరల్ ఎం.వి.రావుతో పలు అంశాలు చర్చించామని ఆయన వెల్లడించారు. గ్రామీణ వ్యవసాయక ప్రభుత్వ రంగాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ సంస్థ సేవలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అలాగే విశ్వవిద్యాలయంలో ఎం.ఏ రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలోని విద్యార్థులకు పలు శిక్షణా కార్యక్రమాలు అందించి తద్వారా మరిన్ని సేవలందుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు, అప్లైడ్ పరిశోధనలు, రూరల్ టెక్నాలజీ వంటి కొత్త కోర్సులను విశ్వవిద్యాలయంలో ఆరంభించేందుకు జనరల్ రావు సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శిస్తారని ఓ ప్రకటనలో స్పష్టంచేశారు.
టెట్ ఫీజు చెల్లించేందుకు నేడు తుది గడువు
పాతశ్రీకాకుళం, జూలై 31: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) పరీక్షకు దరఖాస్తుచేసుకోదల్చిన అభ్యర్థులకు గురువారం సాయంత్రం 5 గంటల లోగా ఫీజు చెల్లించుకోవాలని డీఈఓ సింగూరి అరుణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే దరఖాస్తుదారులు అదే రోజు రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి.
english title: 
m

గ్రామపోరు ప్రశాంతం

$
0
0

మచిలీపట్నం 31: తుది విడత గ్రామపోరు స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మచిలీపట్నం, గుడివాడ రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో బుధవారం పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఉదయం 11గంటలకే భారీగా పోలింగ్ నమోదైంది. బందరు డివిజన్‌లో 89.3శాతం సరాసరి ఓట్లు పోలయ్యాయి. మోపిదేవి మండలంలో 92.38, మచిలీపట్నం మండలంలో 92.38 చొప్పున అత్యధిక శాతం ఓట్లు పోలవ్వగా అవనిగడ్డ మండలంలో 82.30 శాతం అత్యల్పంగా ఓట్లు పోలయ్యాయి. జిల్లా ఎస్పీ జె ప్రభాకరరావు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి రెండు డివిజన్‌ల పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. గుడివాడ డివిజన్‌లో పెదపారుపూడి మండలం పాములపాడు పంచాయతీ ఎన్నికను నిలిపివేశారు. ఎన్నికల గుర్తుల్లో వచ్చిన తేడా కారణంగా ఎన్నిక నిలిపివేసి ఆగస్టు 8న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి పోలింగ్ కేంద్రం వద్ద కారు అద్దాలు పగులగొట్టటంతో ఉద్రిక్తత ఏర్పడింది. పక్క గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివానందం పెదతుమ్మిడి గ్రామ పోలింగ్ కేంద్రం వద్దకు వాహనంపై మూడుసార్లు వచ్చాడు. ఈసందర్భంగా వాగ్వివాదం చెలరేగి కారు అద్దాలను పగులగొట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. మచిలీపట్నం మండలంలోని బోగిరెడ్డిపల్లి, చిన్నాపురం గ్రామాల్లో ఇరువర్గాల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వివాదం రేగటంతో పోలింగ్‌కు జాప్యం జరిగింది. సమయం ముగిసిన తరువాత క్యూలో ఉన్న ఓటర్లను అనుమతించారు. అవనిగడ్డ మండలం మోదుమూడి, తుంగలవారిపాలెం గ్రామాల్లో ఓట్లు గల్లంతయ్యాయనే కారణంతో కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. చివరికి ఎన్నికల అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించటంతో గొడవ సద్దుమణిగింది. మొవ్వ మండలం కాజ, కోసూరు, పెదముత్తేవి, పెడసనగల్లు గ్రామాల్లో ఉత్కంఠత ఏర్పడినా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు పోటీలుపడి ఓటర్లకు పోలింగ్ కేంద్రాల సమీపంలోనే అల్పాహార పాకెట్లు పంపిణీ చేశారు.

రాష్ట్ర విభజనను తట్టుకోలేక రిటైర్డ్ జవాను మృతి
హనుమాన్ జంక్షన్, జూలై 31: దేశంలోకి చొచ్చుకొచ్చిన శత్రువులను తరమికొట్టిన సమయంలో చెక్కుచెదరని ఆ గుండె తెలుగుజాతిని విడగొట్టేందుకు చేస్తున్న చర్యలను చూసి తట్టుకోలేక ఆగింది. ఇప్పటివరకు కలసి వున్న తెలుగుజాతిని వేరుచేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం, రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళన పట్ల తీవ్ర ఒత్తిడికి గురైన మాజీ జవాను మృతి చెందారు. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన అలూరి పద్మనాభరావు(70) అలియాస్ బోస్ గతంలో భారత సైనిక విభాగంలో సేవలు అందించారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన స్వగ్రామంలో నివాసం ఉంటున్నారు. గతంలో గుండె సంబంధిత వ్యాధి వున్నా గత రాత్రి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా కలత చెందారని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపారు. ఉదయం నుంచి వివిధ వార్తాపత్రికలు, ఛానళ్లలో వార్తలు చూస్తున్న బోస్ మధ్యాహ్నం గుండె ఆగి మృతి చెందారు. పలువురు నాయకులు, గ్రామస్థులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

గుడివాడ డివిజన్‌లో టిడిపి మద్దతుదార్లదే ఆధిక్యత
గుడివాడ, జూలై 31: గుడివాడ డివిజన్‌లో 170గ్రామ పంచాయతీలకు బుధవారం ఎన్నికలు నిర్వహించారు. టిడిపి మద్దతుదారులు 63గ్రామాల్లో, కాంగ్రెస్ మద్దతుదారులు 26గ్రామాల్లో, వైఎస్సార్‌సిపి మద్దతుదారులు 53గ్రామాల్లో, ఇండిపెండెంట్ అభ్యర్థులు 20గ్రామాల్లో విజయం సాధించారు. వివిధ పార్టీలు బలపర్చిన మద్దతుదారులు గెలుపొందిన గ్రామాల వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ మండలంలో టిడిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు రామనపూడి, మోటూరు, బిళ్ళపాడు, బొమ్ములూరు, వలివర్తిపాడు. కాంగ్రెస్ మద్దతుతో గెల్చిన గ్రామాలు సైదేపూడి, శేరీదింటకుర్రు. వైఎస్సార్‌సిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు శేరీవేల్పూరు, సిద్దాంతం, కల్వపూడి అగ్రహారం, చిరిచింతల, తట్టివర్రు, గుంటాకోడూరు, పర్నాస, లింగవరం. ఇండిపెండెంట్ అభ్యర్థి సీపూడిలో విజయం సాధించారు. పెదపారుపూడి మండలంలో టిడిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు ఈదులమద్దాలి, అప్పికట్ల, చినపారుపూడి, గుర్విందగుంట, జమీదింటకుర్రు, దోసపాడు, యలమర్రు. కాంగ్రెస్ మద్దతుతో గెల్చిన గ్రామం కొర్నిపాడు, వైఎస్సార్‌సిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు భూషణగుళ్ళ, మహేశ్వరపురం, నాగాపురం, పెదపారుపూడి, వింజరంపాడు, వానపాముల. నందివాడ మండలంలో టిడిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు ఒద్దులమెరక, కుదరవల్లి, తమిరిశ, తుమ్మలపల్లి, పోలుకొండ, అరిపిరాల, పెదవిరివాడ. వైఎస్సార్‌సిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు దండిగానపూడి, పెదలింగాల, రామాపురం, వెంకట రాఘవాపురం, చేదుర్తిపాడు, గండేపూడి, రుద్రపాక, పుట్టగుంట, అనమనపూడి, చినలింగాల, వెన్ననపూడి, ఇలపర్రు. గుడ్లవల్లేరు మండలంలో టిడిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు మామిడికోళ్ళ, పోలిమెట్ల, జమీదగ్గుమిల్లి, శేరీదగ్గుమిల్లి, చంద్రాల, గుడ్లవల్లేరు, వేమవరం, పెంజెండ్ర. వైఎస్సార్‌సిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు కుచ్చికాయలపూడి, పురిటిపాడు, కట్టావాని చెరువు, ఉలవలపూడి, వెణుతురుమిల్లి, శేరీకల్వపూడి, వడ్లమన్నాడు. కవుతవరం, డోకిపర్రు, కూరాడ. పామర్రు మండలంలో టిడిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు అయినంపూడి, ఉండ్రపూడి, కాపవరం, కనుమూరు, కురుమద్దాలి, జుజ్జువరం, పసుమర్రు, నిమ్మకూరు. కాంగ్రెస్ మద్దతుతో గెల్చిన గ్రామాలు యలకుర్రు, కొండిపర్రు, నిబానుపూడి, కొమరవోలు, జమీగొల్వేపల్లి. వైఎస్సార్‌సిపి మద్దతుతో గెల్చిన గ్రామం ఉరుటూరు కాగా, ఇండిపెండెంట్ అభ్యర్థి గెల్చిన గ్రామం బల్లిపర్రు. ముదినేపల్లి మండలంలో టిడిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు రావిగుంట, కోడూరు, గురజ, పెయ్యేరు, చినపాలపర్రు, సంకర్షణపురం, కాకరవాడ, దాకరం, పెనుమల్లి. కాంగ్రెస్ మద్దతుతో గెల్చిన గ్రామాలు వడాలి, ఈడేపల్లి, పేరూరు, వైవాక, కొర్రగుంటపాలెం, శ్రీహరిపురం, ఊటుకూరు, వణుతుర్రు, దేవపూడి. వైఎస్సార్‌సిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు: చిగురుకోట, వాడవల్లి, చేవూరు, ములకలపల్లి, పెదగొన్నూరు. ఇండిపెండెంట్ అభ్యర్థులు గెల్చిన గ్రామాలు: బొమ్మినంపాడు, సింగరాయపాలెం, ముదినేపల్లి. కైకలూరు మండలంలో టిడిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు గోనెపాడు, పెంచికలమర్రు, రాచపట్నం, రామవరం, శృంగవరప్పాడు, కొట్టాడ. వైఎస్సార్‌సిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు గోపవరం, ఆచవరం, పల్లెవాడ, తామరకొల్లు. కాంగ్రెస్ మద్దతుతో గెల్చిన గ్రామాలు ఆలపాడు, సీతనపల్లి, వదర్లపాడు. ఇండిపెండెంట్ అభ్యర్థి గెల్చిన గ్రామం భుజబలపట్నం. మండవల్లి మండలంలో టిడిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు పల్లినగరం, సింగనపూడి, పసలపూడి, పులపర్రు, పెనుమాకలంక, చింతలపాడు, ఉనికిలి, మణుగూరు, లోకుమూడి. కాంగ్రెస్ మద్దతుతో గెల్చిన గ్రామాలు గన్నవరం, కొర్లపాడు, తక్కెళ్ళపాడు. వైఎస్సార్‌సిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు పత్తిపాడు, మూడుతాళ్ళపాడు, బుట్లచెరువు. ఇండిపెండెంట్ అభ్యర్థులు గెల్చిన గ్రామాలు: లింగాల, దిద్దిలంపాడులంక, నందిగామలంక, ముచ్చుమిల్లి, పెరికేగూడెం, మండవల్లి, అయ్యవారి రుద్రవరం, కారకొల్లు. కలిదిండి మండలంలో టిడిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు గోపాలపురం, పోతుమర్రు, చినతాడినాడ, పెదలంక. కాంగ్రెస్ మద్దతుతో గెల్చిన గ్రామాలు ఆవకూరు, కాళ్ళపాలెం, తాడినాడ. వైఎస్సార్‌సిపి మద్దతుతో గెల్చిన గ్రామాలు మట్టగుంట, వెంకటాపురం, కలిదిండి, కోరుకొల్లు. ఇండిపెండెంట్ అభ్యర్థులు గెల్చిన గ్రామాలు: కొండూరు, ఎస్‌ఆర్‌పి అగ్రహారం, పడమటిపాలెం, గురవాయిపాలెం, సానారుద్రవరం. కాగా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ, కైకలూరు మండలం కైకలూరు, నందివాడ మండలం జనార్ధనపురం, నందివాడ, పామర్రు మండలం పామర్రు, గుడివాడ రూరల్ మండలం దొండపాడు, మల్లాయిపాలెం, చౌటపల్లి గ్రామాల్లో రాత్రి 10గంటల వరకూ కౌంటింగ్ కొనసాగింది.

డివిజన్‌లో ఎన్నికలు ప్రశాంతం
* 90.69 శాతం పోలింగ్ నమోదు
గుడివాడ, జూలై 31: గుడివాడ డివిజన్‌లోని నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా పూర్తయినట్టు ఆర్డీవో ఎస్ వెంకట సుబ్బయ్య చెప్పారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. డివిజన్‌లోని 9మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 90.69 శాతం ఓట్లు పోలైనట్టు చెప్పారు. డివిజన్‌లో అత్యధికంగా పామర్రు మండలంలో, అత్యల్పంగా కైకలూరు మండలంలో పోలింగ్ నమోదైందన్నారు. గుడివాడ మండలంలో 90.19శాతం, నందివాడ మండలంలో 91.66శాతం గుడ్లవల్లేరు మండలంలో 89.30శాతం, కైకలూరు మండలంలో 85.29శాతం, కలిదిండి మండలంలో 91.37శాతం, మండవల్లి మండలంలో 90.28శాతం, ముదినేపల్లి మండలంలో 92శాతం, పామర్రు మండలంలో 93.92శాతం, పెదపారుపూడి మండలంలో 92.26శాతం ఓట్లు పోలయ్యాయన్నారు. పెదపారుపూడి మండలంలోని పాములపాడు గ్రామ పంచాయతీ అభ్యర్ధులకు కేటాయించిన గుర్తులు తారుమారు కావడంతో ఎన్నికను వాయిదా వేశామని ఆయన వివరించారు.
గుడ్లవల్లేరులో రెండు ఓట్లు గల్లంతు
గుడ్లవల్లేరులో ఓట్ల లెక్కింపులో అపశ్రుతి చోటు చేసుకోవడంతో తాత్కాలికంగా లెక్కింపు ప్రక్రియను నిలిపివేశారు. 7వ వార్డులో సర్పంచ్ అభ్యర్థికి చెందిన రెండు ఓట్లు గల్లంతు కావడాన్ని గుర్తించారు. దీనిపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో లెక్కింపును నిలిపివేయాల్సి వచ్చింది. గుడ్లవల్లేరు మండలంలో 22గ్రామాలుండగా మూడు గ్రామాలకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 19గ్రామాలకు జరిగిన ఎన్నికల్లో 51మంది పోటీపడ్డారు. మండలంలోని 210వార్డుల్లో 69వార్డులు ఏకగ్రీవం కాగా 140వార్డులకు ఎన్నికలు జరిగాయి. వార్డు పదవుల కోసం 305మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

రాష్ట్ర విభజనను తట్టుకోలేక రిటైర్డ్ జవాను మృతి
హనుమాన్ జంక్షన్, జూలై 31: దేశంలోకి చొచ్చుకొచ్చిన శత్రువులను తరమికొట్టిన సమయంలో చెక్కుచెదరని ఆ గుండె తెలుగుజాతిని విడగొట్టేందుకు చేస్తున్న చర్యలను చూసి తట్టుకోలేక ఆగింది. ఇప్పటివరకు కలసి వున్న తెలుగుజాతిని వేరుచేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం, రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళన పట్ల తీవ్ర ఒత్తిడికి గురైన మాజీ జవాను మృతి చెందారు. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన అలూరి పద్మనాభరావు(70) అలియాస్ బోస్ గతంలో భారత సైనిక విభాగంలో సేవలు అందించారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన స్వగ్రామంలో నివాసం ఉంటున్నారు. గతంలో గుండె సంబంధిత వ్యాధి వున్నా గత రాత్రి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా కలత చెందారని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపారు. ఉదయం నుంచి వివిధ వార్తాపత్రికలు, ఛానళ్లలో వార్తలు చూస్తున్న బోస్ మధ్యాహ్నం గుండె ఆగి మృతి చెందారు. పలువురు నాయకులు, గ్రామస్థులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

సర్పంచ్‌లు వీరే..

మచిలీపట్నం టౌన్, జూలై 31: బందరు డివిజన్‌లో బుధవారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజేతల వివరాలు వెల్లడయ్యాయి. బందరు మండలంలో 14 పంచాయతీలు వైఎస్‌ఆర్‌సీపి, 10 పంచాయతీలు టిడిపి, ఐదు పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు దక్కించుకోగా ఒక స్థానం స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకున్నాడు. మూడు పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. ఏకగ్రీవమైన పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌సీపికి ఒకటి, టిడిపికి రెండు దక్కాయి. గోపువానిపాలెం పంచాయతీ సర్పంచ్‌గా వాలిశెట్టి చంద్రలేఖ, గరాలదిబ్బ తిరుమలశెట్టి శంకర్, బొర్రపోతుపాలెం మద్దె గాయత్రీదేవి, సీతారామపురం బెజవాడ లక్ష్మి, పల్లెతుమ్మలపాలెం ఒడుగు వీర్లంకయ్య, ఎస్‌ఎన్ గొల్లపాలెం మట్టా మోహనరావు, తుమ్మలచెరువు దళారి వెంకటలక్ష్మి, వాడపాలెం కొండ్రు భాస్కరరావు, రుద్రవరం అంగడాల రామకృష్ణ, ఎన్ గొల్లపాలెం జడ్డు వడ్డికాసులు, పోతిరెడ్డిపాలెం మేకా లవకుమార్, మంగినపూడి కూనపరెడ్డి వీరాస్వామి, తవిశపూడి చందన శారద, అరిశేపల్లి నరహరిశెట్టి నాగసునీత, చినకరగ్రహారం నడకుదుటి వెంకటేశ్వరరావు, కెపిటి పాలెం తిరుమలశెట్టి వెంకటేశ్వరమ్మ, గుండుపాలెం నిమ్మగడ్డ శిరీష, కరగ్రహారం శొంఠి కళ్యాణి, కోన కోమటి ఏసుపాప, గోకవరం బక్కా దావీదురెడ్డి, పోలాటితిప్ప మోకారాజు, నెలకుర్రు చిలంకుర్తి లక్ష్మీనాంచారమ్మ, సుల్తానగరం, మట్టా వెంకటరాజు, పోతేపల్లి శ్రీపతి గంగాభవాని, కానూరు గోపు వెంకటేశ్వరమ్మ, భోగిరెడ్డిపల్లి తమ్మన వెంకట ప్రభావతి, పెదపట్నం గడిబేసి సంధ్య, చిన్నాపురం తాడికొండ ధనమణి, బుద్దాలపాలెం సింహబలుడు, మేకావానిపాలెం సర్పంచ్‌గా జొన్నల పాండురంగారావు విజయం సాధించారు.
అవనిగడ్డ మండలంలో...
అవనిగడ్డ: అవనిగడ్డ మండలంలోని ఐదు పంచాయతీల్లో కాంగ్రెస్, నాలుగు పంచాయతీల్లో టిడిపి బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. అశ్వరావుపాలెంలో కొండవీటి మస్తాన్‌రావు, ఎడ్లంక సైకం బాబూరావు, మోదుమూడి బచ్చు వెంకట నాగలక్ష్మి, పులిగడ్డ మండలి లక్ష్మి, రామచంద్రాపురం జిన్నాబత్తిన అన్నమ్మ, రామకోటిపురం సైకం నాంచారమ్మ, దక్షిణచిరువోల్లంక సనకా రాంబాబు, తుంగలవారిపాలెం దోవారి శ్రీనివాసరావు, వేకనూరు కాట్రగడ్డ నాంచారమ్మ గెలుపొందారు.
కోడూరు మండలంలో...
కోడూరు మండలంలో హంసలదీవి, సాలెంపాలెం, ఉల్లిపాలెం, విశ్వనాధపల్లి పంచాయతీలు ఏకగ్రీవం కాగా కాంగ్రెస్ 1, టిడిపి 2, వైఎస్‌ఆర్‌సీపి బలపర్చిన అభ్యర్థులు 5 స్థానాలను దక్కించుకున్నారు. జయపురం పంచాయతీకి మోపిదేవి వెంకాయమ్మ, లింగారెడ్డిపాలెం గుర్రం బసవ య్య, మాచవరం జల్దు కరుణామయి, మందపాకల అద్దంకి రవిప్రసాద్, పట్టిల్లంక బడే రాణి, పోటుమీద కడవకొల్లు నాగేశ్వరరావు, రామకృష్ణాపురం అద్దంకి శారదాదేవి, వి కొత్తపాలెం యలవర్తి నాంచారయ్య విజయం సాధించారు.
నాగాయలంక మండలంలో...
నాగాయలంక మండలంలో ఏటిమొగ, కమ్మనమోలు, రేమాలవారిపాలెం, సంగమేశ్వరం పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఎనిమిది పంచాయతీల్లో కాంగ్రెస్, 5 పంచాయతీల్లో టిడిపి, మూడు పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌సీపి బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకున్నాడు. నాగాయలంక మండవ బాలవర్ధనరావు, బావదేవరపల్లి మండలి బేబీ సరోజిని, చోడవరం దాసరి కృష్ణకుమారి, ఎదురుమొండి నాయుడు బాబూరావు, ఎలిచెట్ల దిబ్బ సైకం బేబీ మల్లేశ్వరి, గణపేశ్వరం దాసి జీవరత్నం, గుల్లలమోద నాగడి ధనేశ్వరమ్మ, మర్రిపాలెం నల్లగుండ్ల చంద్రశేఖర్, నాలి విశ్వనాధపల్లి వెంకట కృష్ణారావు, నంగేగడ్డ బావిరెడ్డి నాగ వెంకట శ్రీలక్ష్మీ, నాచుగుంట, సైకం నాగేశ్వరరావు, పర్రచివర బోగాది రమాదేవి, పెదకమ్మనవారిపాలెం సబ్బినేని ప్రసాదరావు, పెదపాలెం నంద్యాల సౌజన్య, సొర్లగొంది కొప్పనాతి నాగేశ్వరమ్మ, టి కొత్తపాలెం మెండు లక్ష్మణరావు, తలగడదీవి బోగాది పద్మరాణి, వక్కపట్లవారిపాలెం అంబటి శ్యాంప్రసాద్ విజయం సాధించారు.
చల్లపల్లి మండలంలో...
చల్లిపల్లి: చల్లపల్లి మండలం ఆముదార్లంకలో ఆలూరు నాగేంద్రం, మాజేరు మాచవరపు సునీత, మంగళాపురం నీలా గౌతమి, నడకుదురు పుట్టి వీరాస్వామి, పాగోలు పైడిపాముల వెంకటేశ్వరరావు, వక్కలగడ్డ పంది మల్లేశ్వరి, వెలివోలు తలసిల విజయకుమార్, యార్లగడ్డలో యార్లగడ్డ సాయిభార్గవి గెలుపొందారు.
ఘంటసాల మండలంలో...
ఘంటసాల మండలంలో చిలకలపూడి, ఎండకుదురు, కొడాలి, తాడేపల్లి, వి రుద్రవరం, వేములపల్లి పంచాయతీలు ఏకగ్రీవం కాగా అచ్చంపాలెం పంచాయతీకి రెడ్రౌతు రాంబాబు, చిన్నకళ్ళేపల్లి కొడాలి రత్నకుమారి, చిట్టూర్పు చాట్రగడ్డ నగలక్ష్మి, మల్లాయి చిట్టూరు వై శ్రీలక్ష్మి, దాలిపర్రు గొడ్డేటి రేవతి, దేవరకోట పుట్టి సుమతి, ఘంటసాలపాలెం వేమూరి సాయి వెంకటరమణ, గోగినేనిపాలెం గుంటుపల్లి సుజాత, కొత్తపల్లి మూల్పూరి శ్రీదేవి, లంకపల్లి మాడేం నాగరాజు, మల్లంపల్లి నారగం వెంకటేశ్వర కన్నబాబూరావు, పాపవినాశనం డొక్కు లక్ష్మి, పూషడం కఠారి రంగయ్య, తెలుగురావులపాలెం పంచాయతీ సర్పంచ్‌గా ఆరంబోకు రవి విజయం సాధించారు.
బంటుమిల్లి మండలంలో...
బంటుమిల్లి: బంటుమిల్లి మండలంలో మలపరాజగూడెం, నాగన్నచెరువు, సాతులూరు పంచాయతీలు ఏకగ్రీవం కాగా 18 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ ఆరు, టిడిపి తొమ్మిది, వైఎస్‌ఆర్‌సీపి బలపర్చిన అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆముదాలపల్లి దూడల రజని, అర్తమూరు భూపతి ప్రణిత, బంటుమిల్లి ఇల్లూరి పద్మజ, బర్రిపాడు ఎద్దు ప్రసాద్, చినతుమ్మిడి వెలివెల సీతారావమ్మ, చోరంపూడి తిరుమాని భాగ్యలక్ష్మి, కంచడం గంధం సత్యనారాయణ, కొర్లపాడు బోడావుల గాంధి, మల్లంపూడి బసవాని లక్ష్మి, మల్లేశ్వరం సుజాత, మణిమేశ్వరం దింటకుర్తి మధుసూదనరావు, ముల్లపర్రు కొల్లు వెంకట ప్రసాద్, ముంజులూరు కొనపరెడ్డి సులోచన, నాగేశ్వరరావుపేట తాతా మహాలక్ష్మి, పి రావిగుంట నల్లమోతు కృష్ణదాస్, పెదతుమ్మిడి బొల్లా సంపూర్ణ, పెందుర్రు పత్తి వెంకట శ్రీనివాసరావు, రామవరపుమోడిలో గూడవల్లి ఏడుకొండలు విజయం సాధించారు.
కృత్తివెన్ను మండలంలో...
కృత్తివెన్ను: కృత్తివెన్ను మండలంలోని లక్ష్మీపురం, మునిపెడ, నీలిపూడి, పల్లెపాలెం ఏకగ్రీవం కాగా చినపాండ్రాకలో ఎన్నిక జరగలేదు. కాంగ్రెస్ నాలుగు పంచాయతీలు, టిడిపి మూడు పంచాయతీలు, వైఎస్‌ఆర్‌సీపి రెండు పంచాయతీలు, లోక్‌సత్తా బలపర్చిన అభ్యర్థి ఒక పంచాయతీ చొప్పున కైవసం చేసుకోగా ఒక పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. చెరుకుమల్లి పట్టపు సీతామహాలక్ష్మి, చినగొల్లపాలెం కొక్కిలిగడ్డ బాబ్జి, ఎండపల్లి పుప్పాల నరసింహారావు, గరిశపూడి వాటాల మంగమ్మ, ఇంతేరు పెదసింగు మోకమ్మ, కొమాళ్ళపూడి కూనసాని అరుణకుమారి, కృత్తివెన్ను తమ్ము లక్ష్మి, మాట్లం తమ్ము వెంకట లక్ష్మి, నిడమర్రు బంగార్రాజు, పడతడిక మందపాటి జోసఫ్, సీతనపల్లి కూనసాని వరలక్ష్మి విజయం సాధించారు.
మొవ్వ మండలంలో...
కూచిపూడి: మొవ్వ మండలంలో గూడపాడు, మొవ్వ, పాలంకిపాడు, యద్దనపూడి పంచాయతీలు ఏకగ్రీవం కాగా కాంగ్రెస్ ఆరు, టిడిపి ఆరు, వైఎస్‌ఆర్‌సీపి బలపర్చిన అభ్యర్థులు ఐదు స్థానాల్లో విజయం సాధించారు. అవిరిపూడి ఏనుగు మోహనరావు, అయ్యంకి రాజులపాటి అంకమ్మ, బార్లపూడి గోవాడ శ్రీనివాసరావు, భట్లపెనుమర్రు కొడాలి దయాకర్, చినముత్తేవి మునిపల్లి కోటయ్య, కాజ మందా సుధారాణి, కొండవరం ఘట్టమనేని లక్ష్మీనరసింహ ప్రసాద్, కోసూరు సిహెచ్ వీర వెంకట నాగేశ్వరరావు, కూచిపూడి కందుల జయరామ్, మంత్రిపాలెం కొడాలి శ్యామలాదేవి, మొవ్వపాలెం ఊసా సుబ్బులు, నిడుమోలు చెన్ను రత్నాబాయి, పద్దారాయుడుతోట బత్తిన శ్రీనివాసరావు, పెదముత్తేవి కాకర్ల మహాలక్ష్మి, పెదపూడి తాతా రజని, పెడసనగల్లు నన్నపనేని స్వర్ణలత, వేములమడలో మురారి శ్రీనివాసరావు విజయం సాధించారు.
గూడూరు మండలంలో...
గూడూరు: గూడూరు మండలంలో కలపటం, పినగూడూరులంక, ఆర్‌విపల్లి, రామరాజుపాలెం, తరకటూరు, తుమ్మలపాలెం పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఆకులమన్నాడు పంచాయతీకి పుప్పాల రాంబాబు, ఆకుమర్రు బొల్లా అంకబాబు, చిట్టుగూడూరు వీర్ల కృష్ణ, గండ్రం గుడివాడ మోహన కుమారి, గూడూరు పెదపూడి ఈశ్వరరావు, గురిజేపల్లి గోనేపూడి రత్నకుమారి, ఇదుగుళ్ళపల్లి యక్కటి రవికుమార్, జక్కంచర్ల సూరవరపు కస్తూరి, కంచాకోడూరు కోళ్ళ శ్రీనివాసరావు, కంకటావ గోళ్ళ శేషుకుమారి, కోకానారాయణపాలెం పుప్పాల సురేష్, రేళ్ళ గరువు పుప్పాల రామ్మోహనరావు, మద్దిపట్ల బత్తిన కృష్ణ, ముక్కొల్లు సమ్మెట ఈశ్వరరావు, నారికేడలవారిపాలెం జల్దుల కృష్ణకుమారి, పోలవరం కారుపర్తి రత్నం, పోసినవారిపాలెం పోసిన రమాదేవి, రామన్నపేట పెద్ది కిషోర్, రాయవరం తమ్మిశెట్టి వరలక్ష్మి విజయం సాధించారు.

మోపిదేవి మండలంలో...
మోపిదేవి: మండలంలో బొబ్బరలంక- కోనేరు వెంకట సుబ్బారావు, ఉత్తర చీరువోలు లంక - బొంత లెనిన్, కె కొత్తపాలెం - చెందన సుబ్బారావు, కొక్కిలిగడ్డ - కంచర్ల సరస్వతి, కోసూరివారిపాలెం - పోతురాజు, మెళ్లమట్టిలంక - కె సుదర్శనరావు, మెరకలపల్లి - ఎస్ సీతా, మోపిదేవి - కొల్లి చక్రపాణి, మోపిదేవి లంక - గురక మగమ్మ, నాగాయతిప్ప - వెమళపల్లి రవిచంద్ర, పెదప్రోలు - మాగళ్ల రమాదేవి, వెంకటాపురం - తుమ్మా వెంకటలక్ష్మి విజయం సాధించారు.
పెడన మండలంలో..
పెడన : పెడన మండలంలో బుధవారం జరిగిన గ్రామపోరులో 19 పంచాయతీలకు 55మంది పోటీచేయగా విజేతల వివరాలు వెల్లడయ్యాయి. గతంలో ఐదు పంచాయతీలు ఏకగ్రీవం కాగా పెనుమల్లి పంచాయతీకి ఆగస్టు 8న ఎన్నిక జరగనుంది. ఎస్‌విపల్లి శీరం ప్రసాద్ (కాంగ్రెస్), నందిగామ పామర్తి విజయలక్ష్మి (వైఎస్‌ఆర్ సీపి), కూడూరు కాగిత అరుణ కుమారి (టిడిపి), కొంకేపూడి చలపాటి వీరప్రసాద్ (టిడిపి), ముచ్చర్ల క్రోవి వాయునందనరావు (కాంగ్రెస్), బల్లిపర్రు దాసరి నాగజ్యోతి (వైఎస్‌ఆర్ సీపి), పుల్లపాడు గరికముక్కు జోజిబాబు (టిడిపి), నేలకొండపల్లి ఊసా అంకకుమారి (ఇండిపెండెంట్), కాకర్లమూడి మద్దంశెట్టి వాకాలరావు(కాంగ్రెస్), మడక జోగి శ్రీనివాసరావు(కాంగ్రెస్), కొంగంచర్ల పుట్టి నాగమల్లేశ్వరి (టిడిపి), కొప్పెర్ల కాగిత శివపార్వతి (ఇండిపెండెంట్), లంకలకలవలగుంట కట్టా నాగ అమల సులోచన (టిడిపి), నడుపూరు సింగంశెట్టి రుక్మిణి (కాంగ్రెస్), చెన్నూరు గుడిశేవ లక్ష్మీరాణి (వైఎస్‌ఆర్‌సీపి), ఉరిమి దొండపాటి గంగాలక్ష్మి (కాంగ్రెస్), లంకలకలవలగుంట కట్టా అంజమ్మ (వైఎస్‌ఆర్‌సీపి), చేవేండ్ర పుట్టి అంకమ్మ (కాంగ్రెస్), గురివిందగుంట తిక్కిశెట్టి ప్రసాద్ విజయం సాధించారు.

బందరు డివిజన్‌లో టిడిపి మద్దతుదార్ల విజయకేతనం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జూలై 31: బందరు డివిజన్ పరిధిలో బుధవారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. బుధవారం ఎన్నికలు జరిగిన 192 పంచాయతీల ఎన్నికలకు గాను కడపటి వార్తలు అందేసరికి 190 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 53, తెలుగుదేశం 72, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 49 స్థానాల్లో, చల్లపల్లి మండలం మంగళాపురంలో సిపిఐ అభ్యర్థి, కృత్తివెన్ను మండలం మాట్లం పంచాయతీలో లోక్‌సత్తా అభ్యర్థి, ఇతరులు 14 మంది విజయం సాధించారు. చల్లపల్లి, లక్ష్మీపురం పంచాయతీల ఫలితాలు అందాల్సి వుంది.
89.16 శాతం పోలింగ్
బందరు డివిజన్‌లో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.16 సరాసరి పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా మోపిదేవి 92.38శాతం, అత్యల్పంగా చల్లపల్లి మండలంలో 86.90 శాతంగా నమోదైంది. పెడన 88.7, బంటుమిల్లి 89.64, మొవ్వ 91.56, అవనిగడ్డ 82.03, కోడూరు 92.16, మోపిదేవి 92.38, కృత్తివెన్ను 86.74, ఘంటసాల 90.38, బందరు 92.05, గూడూరు 88.93, చల్లపల్లి 86.90, నాగాయలంక 86.26 శాతం పోలింగ్ నమోదైంది.

అవనిగడ్డ ఉప ఎన్నికల్లో
పోటీకి బిజెపి నిర్ణయం
గుడివాడ, జూలై 31: అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని బిజెపి నిర్ణయించిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకటకృష్ణ చెప్పారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పోటీలో నిలిపేందుకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను పరిశీలనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డికి పంపామన్నారు. వీరిలోనే ఒకరిని ఎంపిక చేసి బరిలోకి దింపుతామన్నారు. అవనిగడ్డ దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుటుంబంపై సానుభూతి ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక జాతీయ పార్టీగా తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రామినేని వివరించారు.

పాములపాడుకు 8న ఎన్నికలు
పెదపారుపూడి, జూలై 31: మండలంలోని పాములపాడు గ్రామ పంచాయతీకి ఆగస్టు 8న ఎన్నికలు జరుగుతాయని ఎండివో నాగమహేశ్వరరావు తెలిపారు. జూలై 31న ఎన్నికలు జరగాల్సి ఉండగా అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తప్పుగా ప్రచురించడంతో ఎన్నికలు నిలిపివేశారు.

బందరు మండలంలో సత్తాచాటిన వైఎస్‌ఆర్‌సిపి
మచిలీపట్నం టౌన్, జూలై 31: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటింది. 34 గ్రామ పంచాయతీలకు గాను 15 పంచాయతీలలో వైఎస్‌ఆర్‌సిపి బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులు 10 పంచాయతీలను, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఐదు పంచాయతీలను కైవసం చేసుకున్నారు. ఒక గ్రామ పంచాయతీలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. నెలకుర్రులో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన చిలంకుర్తి లక్ష్మి నాంచారమ్మ 13 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పోతేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీపతి గంగా భవాని 464 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి పిప్పళ్ళ ఉదయ భాస్కరిపై విజయం సాధించారు. గరాలదిబ్బ సర్పంచ్ పదవికి టిడిపికి చెందిన తిరుమలశెట్టి శంకరయ్య 29 ఓట్ల మెజార్టీతో, తవిసిపూడి సర్పంచ్‌గా 62 ఓట్ల మెజార్టీతో చందన శారద, మంగినపూడి సర్పంచ్‌గా 62 ఓట్ల మెజార్టీతో కూనపరెడ్డి వీరాస్వామి, గోకవరం సర్పంచ్‌గా వైఎస్‌ఆర్ సిపికి చెందిన బొక్కా దావీదు రెడ్డి 423 ఓట్ల మెజార్టీతో, కరగ్రహారం సర్పంచ్‌గా వైఎస్‌ఆర్ సిపికి చెందిన శొంఠి కల్యాణి 113 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చినకరగ్రహారం సర్పంచ్‌గా వైఎస్‌ఆర్ సిపికి చెంది నడకుదిటి వెంకటేశ్వరరావు 8 ఓట్ల మెజార్టీతో, మేకావానిపాలెం సర్పంచ్‌గా కాంగ్రెస్‌కు చెందిన జొన్నల పాండు రంగారావు 328 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గోపువానిపాలెం సర్పంచ్‌గా కాంగ్రెస్‌కు చెందిన వాలిశెట్టి చంద్రలేఖ 444 ఓట్ల మెజార్టీతో, బుద్దాలపాలెం సర్పంచ్‌గా టిడిపికి చెందిన బొర్రా సింహబలుడు 57 ఓట్ల మెజార్టీతో, బొర్రపోతుపాలెం సర్పంచ్‌గా వైఎస్‌ఆర్ సిపికి చెందిన నట్టే గాయత్రి దేవి 50 ఓట్ల మెజార్టీతో, అరిసేపల్లి సర్పంచ్‌గా కాంగ్రెస్‌కు చెందిన నరహరశెట్టి నాగ సునీత 446 ఓట్ల మెజార్టీతో, ఎన్.గొల్లపాలెం సర్పంచ్‌గా వైఎస్‌ఆర్ సిపికి చెందిన మట్టా మోహన నాంచారయ్య 209 ఓట్ల మెజార్టీతో, సీతారామపురంలో కాంగ్రెస్‌కు చెందిన బెజవాడ లక్ష్మి 288 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రుధ్రవరంలో వైఎస్‌ఆర్ సిపికి చెందిన అడపాల రామకృష్ణ 222 ఓట్ల మెజార్టీతో, గుండుపాలెంలో వైఎస్‌ఆర్ సిపికి చెందిన నిమ్మగడ్డ శిరీష 45 ఓట్ల మెజార్టీతో, తుమ్మలచెరువులో వైఎస్‌ఆర్ సిపికి చెందిన తలారి రామ వెంకట లక్ష్మి 84 ఓట్ల మెజార్టీతో, కోనలో టిడిపికి చెందిన కోమటి యేసుపాప 130 ఓట్ల మెజార్టీతో, పి.టి.పాలెంలో వైఎస్‌ఆర్ సిపికి చెందిన ఒడుగు వెంకటయ్య 404 ఓట్ల మెజార్టీతో, చిన్నాపురంలో టిడిపికి చెందిన తాడికొండ దనమని, కానూరు సర్పంచ్‌గా గోపు వెంకటేశ్వరమ్మ, పోతిరెడ్డిపాలెం సర్పంచ్‌గా వైఎస్‌ఆర్ సిపికి చెందిన మేకా లవ కుమార్, పెదపట్నం సర్పంచ్‌గా గడిదేసి సంధ్య, సుల్తానగరం సర్పంచ్‌గా టిడిపికి చెందిన మట్టా వెంకటదాసు, ఎన్.గొల్లపాలెంలో వైఎస్‌ఆర్ సిపికి చెందిన జడ్డు వడ్డికాసులు, వాడపాలెంలో వైఎస్‌ఆర్ సిపికి చెందిన కె భాస్కరరావు, కె.పి.టి.పాలెంలో టిడిపికి చెందిన తిరుమలశెట్టి వెంకటేశ్వరమ్మ, పోలాటితిప్పలో టిడిపికి చెందిన మోకా రాజు, భోగిరెడ్డిపల్లిలో టిడిపికి చెందిన తమ్మన వెంకట ప్రభావతి గెలుపొందారు.

నగరంలో బంద్ విజయవంతం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 31: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధవారం జిల్లాలో బంద్ జరిగింది. గుడివాడ, మచిలీపట్నం డివిజన్‌లలో పంచాయతీ ఎన్నికలు వల్ల బంద్ ప్రభావం కన్పించలేదు. అయితే విజయవాడ నగరంలో బంద్ విజయవంతమైంది. కీలక ప్రాంతాల్లో సాయుధ పోలీసు బలగాలు మోహరించి ఉండటంతో ప్రశాంతంగా జరిగింది. కాంగ్రెస్ మినహా ఇతర రాజకీయ పక్షాల నేతలు, కార్యకర్తలు బంద్‌కు దూరంగానే నిలిచారు. జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, అడపా నాగేంద్రం, వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల రాజేశ్వరరావు, ఎస్సీ సెల్ జిల్లా నగర చైర్మన్లు ఉమ్మడి ధనరాజ్, కాలే పుల్లారావు ఇతర నాయకులు, కార్యకర్తలు ఆంధ్రరత్నభవన్ నుంచి బస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే బస్సులకు ఎవరూ అవాంతరాలు కల్పించకపోవటంతో యథావిధిగా నడిచాయి. బంద్ కారణంగా అన్ని రకాల వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. న్యాయవాదులు కోర్టులు బహిష్కరించి గేట్ల వెలుపల ధర్నా చేసి మ్యూజియం రోడ్డులో మానవహారంగా నిలిచారు. ఇదే సమయంలో విద్యార్థి జెఎసి కన్వీనర్ దేవినేని అవినాష్ నాయకత్వంలో ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి చుట్టుగుంట వరకు విద్యార్థుల నిరసన ర్యాలీ జరిగింది. మాజీ మేయర్ తాడి శకుంతల, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి కొణిజేటి రమేష్ నాయకత్వంలో చల్లపల్లి బంగళా జంక్షన్‌లోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా శకుంతల మాట్లాడుతూ 1969-71 మధ్యన కనీవినీ ఎరుగని రీతిలో జై ఆంధ్ర, తెలంగాణా ఉద్యమాలు జరిగినా నాటి ప్రధాన ఏ మాత్రం చలించలేదన్నారు. తెలుగుజాతిని చీల్చడానికి ఇష్టపడలేదన్నారు. వైఎస్సార్సీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ నేతృత్వంలో ప్రకాశం బ్యారేజీ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా జరిగింది. అనంతరం విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ ఆందోళనలో ఆ పార్టీ నాయకులు పి గౌతంరెడ్డి, వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఉద్యోగ సంఘాల జెఎసి అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ నాయకత్వంలో ఠాగూర్ లైబ్రరీ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా సబ్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరిగింది. జెఎసి కన్వీనర్ ఎండి ఇక్బాల్, ఎన్‌జిఓ సంఘ నగర అధ్యక్ష, కార్యదర్శులు కోనేరు రవి, పి రమేష్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణరెడ్డి, నగర కార్యదర్శి వేమూరి ప్రసాద్, గ్రంథాలయ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కళ్లపల్లి మధుసూదనరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టా జయకర్, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, నగర అధ్యక్షుడు అడపా నాగేంద్రం, విద్యార్థి జెఎసి కన్వీనర్ దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సీమాంధ్ర నేతల సూచనలు విజ్ఞాపనలను ఖతారు చేయకపోవటం బాధాకరమన్నారు. కేంద్రం పునరాలోచన కోసం ప్రజాప్రతినిధులు తక్షణం రాజీనామా చేయాలని అప్పటి వరకు తాము పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. ఈ ర్యాలీల

తుది విడత గ్రామపోరు స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.
english title: 
g

మూడో విడతలోనూ ‘దేశం’దే హవా

$
0
0

విశాఖపట్నం, జూలై 31: పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టు ఇంకా పదిలంగానే ఉందని తెలుగుదేశం పార్టీ నిరూపించుకుంది. పంచాయతీ పోరులో భాగంగా బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో ఆపార్టీ అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుని ప్రత్యర్థులను ఖంగుతినిపించింది. రానున్న మండల,జిల్లా పరిషత్ ఎన్నికల్లో తమకు ఎదురుండదని సవాలు చేసింది. తొలివిడతంలో మూడోస్థానంతో సరిపెట్టుకున్న తెలుగుదేశం అనూహ్యంగా పుంజుకుని సాధించిన విజయాలు ఆపార్టీ కేడర్‌ను ఆనందంలో నింపింది. అనకాపల్లి డివిజన్ పరిధిలో జరిగిన ఆఖరి విడత ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతాలు కావడం విశేషం. అయితే అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల పరిధిలో తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిక్యతను చాటుకుంది. అదేవిధంగా యలమంచిలి నియోజకవర్గం పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. మూడో విడత ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్, కౌంటింగ్ మొత్తం ప్రశాంతంగానే జరిగింది. డివిజన్ పరిధిలోని ఎన్నికలు జరిగిన 12 మండలాలకు గాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థుళు 10 మండలాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మంత్రి గంటాప్రాతినిధ్యం వహిస్తున్న కశింకోట, యలమంచిలి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న మునగపాక మండలాల్లో మాత్రం ఆపార్టీ కాస్త నిరాశాజనకమైన ఫలితాలు సాధించింది. అనకాపల్లి డివిజన్ పరిధిలో సత్తా చూపుతుందనకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ డివిజన్‌లో వైకాపాకు సీనియర్ లీడర్లు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు నాయకత్వం వహిస్తున్నప్పకీ వారిద్దరి మధ్య నెలకొన్న విబేధాలు ఆపార్టీ పుట్టి ముంచాయి. గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో తెలుగుదేశం, వైకాపాలు దాదాపు సమంగా స్థానాలను గెలుచుకున్నాయి. యలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు జరిగింది. ఇక్కడ వైకాపా మూడో స్థానానికే పరిమితమైంది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో వైకాపా, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడ్డాయి. మాడుగల నియోజకవర్గంలో వైకాపా తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీనిచ్చినప్పటికీ రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. ఇక చోడవరం నియోజకవర్గంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మధ్య పోటీ జరిగినా తెలుగుదేశం పార్టీదే ఆధిక్యమైంది.

దిక్కుతోచని ఎమ్మెల్యేలు
* రాజీనామాలంటూ నమ్మించే ప్రయత్నం
* ఆచూకీలేని మంత్రులు
* ఇళ్ళకే పరిమితమైన టిడిపి నేతలు
* బయటకు రాని బిజెపి, కమ్యూనిస్ట్‌లు

ఆంధ్రభూమి బ్యూరో, విశాఖపట్నం
పాపం అధికార పార్టీ ఎమ్మెల్యేలు. రాష్ట్రం ముక్కలైందన్న బాధ వారిలో ఉందో? లేదో? తెలియదు కానీ, తమ భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళన వారిలో పెరిగిపోయింది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ అమ్మలగన్న అమ్మ సోనియా తీసుకున్న నిర్ణయం వీరి ముఖాల్లో నెత్తురుచుక్క లేకుండా చేసింది. ఇళ్ళ నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల గుండెలు గుభేలుమన్నాయి. ప్రస్తుతం వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వైకాపా ఎదుగుతోంది. ఆ పార్టీ ఎలాగూ సమైక్యవాదాన్ని భుజాన వేసుకుంది. దీంతో తమ ఉనికికి ఎక్కడ భంగం వాటిల్లుతుందోనని భయపడిన ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి తమ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పంచకర్ల రమేష్‌బాబు తన పదవికి రాజీనామా చేసినట్టు మంగళవారం అర్థరాత్రి ప్రకటించారు. రాజీనామాను స్పీకరుకు పంపించామని చెప్పారు. తనంతట తానుగానే బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. అప్పటికే వివిధ జెఎసిలు బంద్‌కు పిలుపునిచ్చినా, పంచకర్ల మరోసారి పిలుపునిచ్చి తన ఉనికి చాటుకున్నారు. బుధవారం ఆయన నేరుగా ఆంధ్రా యూనివర్శిటీకి వచ్చి, విద్యార్థులకు మద్దతు పలికారు. ఆయనను ముందు విద్యార్థులు అడ్డుకున్నారు. రాజీనామా లేఖ చూపించమంటూ డిమాండ్ చేశారు. ఎట్టకేలకు పంచకర్ల విద్యార్థులతో మాట్లాడి బయటకు రాగలిగారు. అంతకు ముందు ప్రభుత్వ విప్ ద్రోణంరాజు, ఆతరువాత మళ్ళ విజయప్రసాద్ ఎయుకు వచ్చారు. వారు కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నెలల తరబడి ఉద్యమం కొనసాగుతోంది కదా! ఒక్క రోజు కూడా రోడ్డెక్కి ఉద్యమించని ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు బయటకు రావల్సి వచ్చింది? ఇదే అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలు ఆర్నెల్ల కిందటి నుంచి బహిర్గతం చేసి ఉంటే రాష్ట్రం ముక్కలయ్యేది కాదని జనం అంటున్నారు. బుధవారం యూనివర్శిటీ వద్ద జరిగిన ఆందోళనా కార్యక్రమానికి బయట నుంచి అనేక మంది వచ్చారు. వీరంతా అధికార కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకున్నారు. ఇక జిల్లా మంత్రులైతే అడ్రస్ లేకుండాపోయారు. వారు ఇంకా సమైక్యాంధ్ర కోసం రాజధానుల మధ్యే తిరుగుతున్నారు. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వారి ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలు రోడ్డెక్కారన్న వాదన కూడా వినిపిస్తోంది. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇళ్ళకే పరిమితమైపోయారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, బిజెపి, లెఫ్ట్‌పార్టీల నాయకులు బయటకు రాలేదు. జెఎసి చేసిన ఆందోళనలకు సరైన నాయకత్వం లేకపోవడం, పోలీసులు కూడా అనేక ఆంక్షలు విధించడం వలన సమైక్య నినాదం అంతగా వినిపించలేకపోయారు. మద్దిలపాలెం వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించడంతోపాటు, అగ్నిమాపక యంత్రాన్ని, వజ్ర టియర్ బులెట్ వాహనాలను అక్కడ మోహరించడంతో సామాన్యులకు అక్కడ ఏంజరుగుతోందనన్న భయం ఏర్పడింది.

కొనసాగుతున్న జూడాల సమ్మె
విశాఖపట్నం, జూలై 31: జూనియర్ వైద్యుల సమ్మె వరుసగా రెండోరోజుకు చేరుకుంది. బుధవారం సమ్మెను కొనసాగించారు. సమ్మెలో భాగంగా జూనియర్ వైద్యులు తమ విధులను బహిష్కరించారు. కేజిహెచ్ ఔట్‌గేట్ వద్ద కొద్దిసేపు నిరసన ప్రదర్శన చేపట్టిన జూడాలు ఆ తరువాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఏ ఒక్కరూ విధులకు హాజరుకాలేదు. దీనివల్ల రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చాలీ,చాలని వైద్యులతో పూర్తిస్థాయిలో వైద్యాన్ని అందివ్వలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు వైద్య సేవలను తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ రాష్టవ్య్రాప్తంగా జూనియర్ వైద్యులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర జూనియర్ వైద్యుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ జిల్లా జూడాల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో భాగంగా జూనియర్ వైద్యుల సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో రెగ్యులర్ డాక్టర్ ఉద్యోగాలనివ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో దీనిని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
చర్చలకు సిద్ధంకండి: సర్కార్
రెండవ రోజుల సమ్మె కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించింది. మరో రెండు రోజుల్లో చర్చలకు పిలుస్తామని, దీనికి సిద్ధంగా ఉండాలంటూ ప్రభుత్వం పేర్కొంది.
వైద్య సేవలు యథాతథం
కేజిహెచ్‌లో అత్యవసర, సాధారణ వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం లేదని కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్‌బాబు తెలిపారు. తొలిరోజు సమ్మె జరిగిన మంగళవారం 1540 ఔట్ పెషేంట్లు నమోదు కాగా, ఇందులో దాదాపు వంద మంది రోగులు ఆసుపత్రిలో చేరారన్నారు. మిగిలిన వారంతా పలు రకాలైన పరీక్షలు, చికిత్సలు నిర్వహించుకుని వెళ్ళిపోయినవారేనన్నారు. అలాగే బుధవారం కూడా ఇదే స్థాయిలో ఔట్ పెషెంట్లు వచ్చారన్నారు.
జిల్లాలో సైకిల్ ఆధిక్యం
* ఆఖరి విడతలోనూ ‘దేశం’ దూకుడు
* రెండో స్థానంతో సరిపెట్టుకున్న వైఎస్సార్‌సిపి

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 31: పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తొలుత తడబడిన తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకుని ప్రత్యర్ధి పార్టీలు బలపరచిన అభ్యర్థులను ఓడించి గెలుపు బావుటా ఎగురవేయడం గమనార్హం. తొలి విడత ఎన్నికల్లో ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్న తెలుగుదేశం రెండో విడతలో అనూహ్యంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ప్రధమస్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన ఆఖరి విడతలో మరింత దూకుడును ప్రదర్శించి జిల్లాలో అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకుని అగ్రస్థానానికి దూసుకెళ్లింది. నాయకత్వం లేమి, నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల సమన్వయలోపం ఉన్నప్పటికీ రెండు,మూడు విడతల్లో బాగా పంజుకోవడంతో తెలుగుదేశం ఆధిక్యం గణనీయంగా పెరిగింది. దీంతో వైకాపాను అధిగమించి అగ్రస్థానం దక్కించుగలిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజాదరణ, కేడర్ చెక్కుచెదరలేదన్న వాస్తవం రుజువైంది.

మూడో విడత ఫలితాలు
మొత్తం -- 322
కాంగ్రెస్ -- 89
టిడిపి -- 137
వైకాపా -- 62
ఇతరులు -- 29
5 పంచాయతీల ఫలితాలు రావాల్సి ఉంది.
----------------------------------

మొత్తం పంచాయతీలు -- 902
కాంగ్రెస్ - 235
టిడిపి - 315
వైకాపా - 244
ఇతరులు - 103
5 పంచాయతీల్లో ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది.
------------------------
ఏయులో దీక్షలు
* విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యేలు
విశాఖపట్నం, జూలై 31: సమైక్యాంధ్రకు మద్ధతుగా బుధవారం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చేపట్టిన దీక్షలకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఆయా రాజకీయ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుపై కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటనకు నిరసనగా ఆంధ్రవిశ్వవిద్యాలయం గాంధీ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసి ప్రతినిధులు నిరాహారదీక్ష శిబారాన్ని నిర్వహించారు. బుధవారం ఇది కొనసాగింది. ఈ దీక్షా శిబిరాన్ని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. దీక్షలో పాల్గొన్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా మార్గం ద్వారానే ఉద్యమం చేపట్టాలన్నారు. అంతే తప్ప టిఆర్‌ఎస్ నేత కెసిఆర్ పంథాలో ప్రభుత్వాన్ని తప్పుపట్టించే విధానాలు సరైందికాదన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ మాట్లాడుతూ తాను రాజీనామా చేసినంత మాత్రాన ప్రయోజనం లేదన్నారు. సమైక్యతకు కట్టుబడి ఉంటూ జేఏసి చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తరువాత అసెంబ్లీలో సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం పెట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఆ తరువాత దీక్ష శిబిరాన్ని సందర్శించి పరామర్శించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టి మెజారిటీ కోసం పార్లమెంటుపై వత్తిడి తీసుకువస్తామన్నారు. మొట్టమొదటిసారిగా సమైక్యాంధ్రకు మద్ధతుగా తానే రాజీనామా చేసినట్టు చెప్పారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణనిస్తానంటూ బిజెపి ప్రగల్భాలు పలికిందని, అలాగే తెలుగు దేశం పార్టీ దీనికి అనుకూలంగా లేఖ రాసిందన్నారు. వీటన్నింటిపై యుపిఏ సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైందికాదన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు మాట్లాడుతూ వైఎస్సార్‌సిపి మొదటి నుంచి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని, ప్రత్యేక తెలంగాణాను వ్యతిరేకిస్తుందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ముందుగానే రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి పంపారన్నారు. కేంద్రంలో యుపిఏ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం ముక్కలుకానుందన్నారు. వైఎస్సార్‌సిపి నాయకులు దాడి వీరభద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రను తీసుకువస్తామని ప్రగల్భాలు పలికిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం చేస్తామని ప్రకటించారని, తక్షణమే తన మాటను నిలబెట్టుకోవాలన్నారు.
దిష్టిబొమ్మల దగ్ధం
సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసి ప్రతినిధులు ఏయు ప్రధాన గేటు వద్ద, అలాగే సాయంత్రం యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధ్రీశ్వరి, ఎంపీ లగడపాటి రాజగోపాల్, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఏయులో వివిధ విభాగాలను సందర్శిస్తూ భారీ ర్యాలీని చేపట్టారు. యువజన జేఏసి రాష్ట్ర కన్వీనర్ ఆడారి కిషోర్‌కుమార్, దీక్షా శిబిరంలో విద్యార్థి జేఏసి ప్రతినిధులు లగుడు గోవిందరావు, కాంతారావు, ఆరేటి మహేష్, సురేశ్‌మీనన్ తదితరులు పాల్గొని ప్రభుత్వ విధానాలను నిరసించారు. శ్రీ కృష్ణ కమిటీ సిఫారసులను సైతం విస్మరించి ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండానే ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన చేయడంపట్ల నిరసన తెలిపారు.

సమైక్య ఉద్యమం...తీవ్రతరం
* రోడ్డెక్కిన ఉద్యోగ, కార్మిక సంఘాలు
విశాఖపట్నం, జూలై 31: విశాఖ నగరంలో సమైక్యవాదం ఊపందుకుంది. సమైక్య నినాదాలతో హోరెత్తింది. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కోసం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని ప్రభుత్వ సంస్థల ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఎలక్ట్రికల్ బిసి ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇంజనీరింగ్, డిప్లమో, ఎలక్ట్రికల్ ఎస్సీ,ఎస్టీ ఎంప్లారుూస్ అసోసియషన్, ఐఎన్‌టియుసి తదితర సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్)లో ఉద్యోగులు, సిబ్బంది బుధవారం గురుద్వారా జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి సమీపంలోనున్న సంస్థ కార్పొరేట్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా బిసి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అవసరంలేదని, అయినా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం విచారకరమన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలను విభించాల్సి ఉండగా, వాటిపై దృష్టిపెట్టకుండా సమైక్యంగా ఉండే ఆంధ్ర రాష్ట్రాన్ని విభిజించాలని నిర్ణయించడాన్ని ఆయన వ్యతిరేకించారు. తమ సంస్థకు రూ.800 కోట్లకు పైగా బకాయి చెల్లించాల్సి ఉందన్నారు. బొగ్గు, విద్యుత్, జల వనరులు ఎక్కువుగా తెలంగాణాలోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

ఇక భీమిలి, అనకాపల్లి జోనల్ కార్యాలయాలు
* స్పెషల్ ఆఫీసర్ల నియామకం
* ఆయా ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 31: నిన్నటి వరకూ అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలుగా ఉండేవి. ఎప్పుడైతే అవి జివిఎంసిలో విలీనమైపోయాయో, జోనల్ కార్యాలయాలుగా రూపాంతరం చెందాయి. అనకాపల్లి జోనల్ కార్యాలయానికి పూర్ణచంద్రరావును స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. అలాగే భీమిలి జోనల్ కార్యాలయానికి డిసిఆర్ సోమన్నారాయణను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. ఒక్కొక్కరికి ఐదుగురు సిబ్బందిని మంజూరు చేశారు. వీరు ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. అలాగే జోనల్ కార్యాలయాలకు గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయాలుగా బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ జివిఎంసిలో ఆరు జోన్‌లు ఉన్నాయి. ఈ రెండూ కలుపుకొంటే ఎనిమిది జోన్‌లు అయినాయి. అలాగే జివిఎంసిలో విలీనమైన పది గ్రామ పంచాయితీలకు గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ సబ్ జోనల్ కార్యాలయాలుగా బోర్డులు తగిలించారు. కమిషనర్ సత్యనారాయణ బుధవారం అనకాపల్లి, భీమిలి జోనల్ కార్యాలయాలను సందర్శించారు. జివిఎంసిలో అమలు జరుగుతున్న అన్న పథకాలను, కార్యక్రమాలు, అలాగే అత్యాధునిక సౌకర్యాలను ఈ జోనల్‌లలో కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

తూర్పు నౌకాదళాన్ని సందర్శించిన
మయన్మార్ కమాండర్-ఇన్ చీఫ్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 31: మయన్మార్ నేవీ కమాండర్ ఇన్ చీఫ్ తురా థిట్ స్వే అతని సతీమణి వాయ్ మార్ మార్ హుతున్, మరో నలుగురు సభ్యులతో కూడిన బృందం తూర్పు నౌకాదళానికి బుధవారం చేరుకుంది. వీరు రెండు రోజులపాటు తూర్పు నౌకాదళాన్ని సందర్శిస్తారు. తూర్ప నౌకాదళ అధికారి అనిల్ చోప్రా వీరికి స్వాగతం పలికారు. తూర్పు నౌకాదళంలోని యుద్ధ నౌకలు, సబ్ మెరైన్‌ల గురించి చోప్రా ఆయనకు వివరించారు.

మంత్రి గంటా ఇలాకాలో దేశం హవా
చతికిలపడిన కాంగ్రెస్
అనకాపల్లి, జూలై 31: మండలంలోని 32 సర్పంచ్ పదవులకు రెండు ఏకగ్రీవం కాగా, బుధవారం జరిగిన 30 పంచాయతీల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. రెండవ స్థానంలో వైఎస్సార్ నిలిచింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించే అనకాపల్లి మండలంలో 11 పంచాయతీల్లో టిడిపి మద్దతుదారులు విజయ దుంధుబి మోగించారు. వైఎస్సార్ సిపి తొమ్మిది స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్లు మరో నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. మండలంలోని రెండు మేజర్ పంచాయతీల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. తుమ్మపాల మేజర్ పంచాయతీలో తెలుగుదేశం అభ్యర్థి చదరం మహాలక్ష్మినాయుడు ఆధిక్యతలో ఉండగా, కొత్తూరు మేజర్ పంచాయతీలో స్వతంత్య్ర అభ్యర్థి మేడిశెట్టి రాధ 15 ఓట్లమెజారిటీతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. గ్రామాల వారీగా ఎన్నికైన సర్పంచ్‌లు, వారి పార్టీల వివరాలిలాఉన్నాయి. వెంకుపాలెం - ఆడారి అనురాధ(వైఎస్‌ఆర్), తుమ్మపాల - చదరం మహాలక్ష్మినాయుడు(టిడిపి), తగరంపూడి - జామి రాములమ్మ (టిడిపి), సీతానగరం - గంగుపాం రామలక్ష్మి (కాంగ్రెస్), సత్యనారాయణపురం - కోరాడ నూకరత్నం (టిడిపి), పిసినికాడ - దాడి కమల(వైఎస్సార్), రేబాక - మంత్రి జ్యోతి (వైఎస్సార్), సంపతిపురం - నంబారు శ్రీను (కాంగ్రెస్), శంకరం - కరణం లక్ష్మీశ్యామల (టిడిపి), సుందరయ్యపేట - రేఖా అమ్మాజీ (టిడిపి), విజెపాలెం - పూడి చిన్నారావు( టిడిపి), ఆర్‌విపాలెం - రాజేశ్వరి (టిడిపి), పాపయ్యపాలెం - గంగిరెడ్ల గోవింద (కాంగ్రెస్), అక్కిరెడ్డిపాలెం - నారపిన్ని వెంకటలక్ష్మి (వైఎస్సార్), బట్లపూడి - నోట్ల జ్యోతి (వైఎస్సార్), బవులవాడ - మజ్జి లక్ష్మి (టిడిపి), సిహెచ్‌ఎన్ అగ్రహారం - ముమ్మిన పైడిరాజు (కాంగ్రెస్), దిబ్బపాలెం - పీలా శంకరరావు(ఇండిపెండెంట్), గొలగాం - చీకటి రాజు(స్వతంత్య్రం), గోపాలపురం - గొర్లి సూరిబాబు (వైఎస్సార్), కోడూరు - అర్జా ప్రేమకుమార్ (వైఎస్సార్), కొండుపాలెం - భవానీ (కాంగ్రెస్), కుంచంగి - పల్లెల బాబ్జీ (వైఎస్సార్), కూండ్రం - శానాపతి సరోజ (టిడిపి), మామిడిపాలెం - కరణం చిన్నారావు (టిడిపి), మార్టూరు - కరణం కృష్ణ (టిడిపి), మారేడుపూడి - ఈగల నూకరత్నం (వైఎస్సార్)లు గెలుపొందారు.
తెలంగాణపై పునరాలోచించాలి
* డిసిసి అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ
చోడవరం, జూలై 31 : రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయంపై యుపిఎ ప్రభుత్వం పునరాలోచించాలని జిల్లా కాంగ్రెస్ కమి టీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ అన్నారు. బుధవారం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంత వాతావరణంలో సంపూర్ణంగా జరిగింది. ఈ బంద్ సందర్భంగా పట్టణంలోని దుకాణాలన్నీ స్వచ్చందం గా మూసివేశారు. ఉదయం నుండి ముసురుపట్టి వర్షం కురుస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న అభిలాషతో పట్టణంలోని కొంతమంది యువకులు జై సమైక్యాంధ్ర వాల్‌పోస్టర్లను అంటించారు. చోడవరంలో పాన్‌షాపులతో సైతం పలు దుకాణాలను మూసివేసి సమైక్యాంధ్ర వాదాన్ని వ్యాపారులు బలపర్చారు. పట్టణంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద తప్ప మిగిలిన చోట్ల కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. ఆటోలు సైతం తిరగలేదు. అంతకుముందు పట్టణంలోని యువకులు సమైక్యాంధ్ర కోరుతూ స్థానిక కొత్తూరు జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారందరికీ రాష్ట్రం కోరుతూ అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి తగిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన విధంగా స్పందించి తెలంగాణ విభజనపై పునరాలోచన చేయాలని కోరారు. ప్రభుత్వం దీనిపై స్పందించని పక్షంలో ఆందోళన లను ఉద్ధృతం చేయనున్నట్లు సమైక్యవాదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర కోరుతున్న యువత కోనేటి శ్రీనివాసరావు, టి.ప్రసాద్, సన్యాశిరావు, ఈశ్వరరావు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

చీటీల పేరుతో టోకరా!
* రూ. కోటితో పరారీ
పాయకరావుపేట, జూలై 31: చీటీలు, స్కీములు, అప్పుల పేరుతో ఓ వ్యక్తి సుమారు కోటి రూపాయలతో పరారైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం బాధితులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పాయకరావుపేటలోని మంగవరం జంక్షన్ సమీపంలో విశాఖ డెయిరీ పార్లర్ నడుపుతున్న గోళ్ళ రవి అనే వ్యక్తి చీటీలు వేయడం, స్కీములు పెట్టడంతో జనాలు విపరీతంగా వచ్చి కట్టారు. చాలామంది అప్పులుగా కూడా ఇచ్చారు. వౌనిక మినీ మనీ ఫైనాన్స్ పేరుతో నెలకు 500 రూపాయల చొప్పున 21నెలలు చెల్లిస్తే అనంతరం 11వేలు చెల్లిస్తానని చెప్పడంతో సుమారు 244మంది స్కీములో చేరారు. వీరందరికి అక్టోబర్‌లో డబ్బులు చెల్లించవల్సి ఉంది. 18 నెలలు కట్టించుకున్నాడు. అలాగే 50 వేల రూపాయలు చీటీలు కట్టిన వారు సుమారు 50మంది ఉన్నారు. చా లామంది వద్ద 50వేల నుంచి ఐదు లక్షల వరకు అప్పులు తీసుకున్నాడని బాదితులు ఆవేదన వ్యక్తం చేశాడు. రవికి చెందిన డెయిరీ పార్లర్ గత కొద్దిరోజులుగా మూతపడి ఉండడంతో అసలు విషయం బయటపడింది. అవసరాలకు ఉపయోగపడతాయని డబ్బులు దాచుకుంటే రవి పరారయ్యాడని బాధితులు జగతా స్వామి, అయినవెల్లి గంగ, జగతా శ్రీను, పారేపల్లి వీరబాబు, జగతా నూకరాజు, నూకల రమణ, పురెడ్డి రమణారెడి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గోళ్ళ రవి తమ్ముడు స్వామి ఇదే విధంగా ప్రజలను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలుచేసి పరారయ్యాడని తెలిపారు. గోళ్ళ రవిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న ట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై ఎస్సై జి.ప్రేమకుమార్‌ను వివరణ కోరగా మో సపోయిన వారు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

* రెండో స్థానంతో పరువు నిలుపుకున్న కాంగ్రెస్ * వైకాపాకు ఆఖరి స్థానం
english title: 
m

ఉవ్వెత్తున విభజన మంటలు

$
0
0

ఏలూరు, జూలై 31: రాష్ట్ర విభజన ప్రకటనతో సమైక్యవాదులు భగ్గుమన్నారు. సమైక్యాంధ్ర ఐకాస ఇచ్చిన పిలుపులోభాగంగా బుధవారం జిల్లావ్యాప్తంగా ఉవ్వెత్తున ఆందోళనలు ఎగిశాయి. రాష్ట్రాన్ని ఎట్టిపరిస్దితుల్లోనూ విభజించడానికి అంగీకరించేది లేదంటూ నినాదాలు చేశారు. ఉద్యమనాయకులు యుపిఎ పైనా, సోనియాగాంధీపైనా నిప్పులు చెరిగారు. ఓట్లు, సీట్ల కోసం సోనియాగాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆందోళనకారులు విమర్శించారు. తెలుగుజాతిని విడదీసి జాతికి తీరని ద్రోహం చేశారని, రాష్ట్ర విభజన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం నుంచి మరింత ఉద్ధృతస్ధాయిలో ఆందోళన నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా విభజనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి మొదలైన ఈ ఆందోళనలు బుధవారం నాటికి తీవ్రరూపం దాల్చాయి. అయితే గురువారం నుంచి వీటిని మరింత తీవ్రతరం చేయనున్నట్లు నేతలు ప్రకటించారు. పలుచోట్ల ఉద్వేగాలు భారీగా లేవటంతో అవి ఆందోళనలపై గట్టి ప్రభావానే్న చూపుతున్నాయి. ఇంతకాలం నాన్చి ఒక్కసారిగా విభజన ప్రకటన వెలువడటంతో జిల్లా ప్రజలంతా తీవ్ర ఆవేదనను, ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈనేపధ్యంలోనే ఆందోళనలను క్రమపద్దతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీలకమైన చొరవ తీసుకోగలిగారు. దీంతో అన్నివర్గాల భాగస్వామ్యంతో సమైఖ్యాంధ్ర పరిరక్షణ సమితి ఆవిర్భవించింది. జిల్లా జెఎసి ఛైర్మన్ ఎల్ విద్యాసాగర్‌ను దీనికి కన్వీనర్‌గా నియమితులయ్యారు. సమితి వేదికగా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించాలని తీర్మానించారు. దీనిలోభాగంగానే గురువారం ఏలూరు బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇదిఇలాఉండగా సమైక్యాంధ్ర ఐకాస 72 గంటల మేర బంద్‌కు పిలుపునివ్వటంతో మొదటిరోజు బుధవారం జిల్లావ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుంచి ఉద్యమకారులు రోడ్లపైకి చేరుకుని ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. విద్యాసంస్ధలు, వాణిజ్యసంస్ధలను స్వచ్చందంగా మూసివేశారు. ప్రభుత్వకార్యాలయాలు, బ్యాంకులు, ఎటిఎం, ప్రైవేటు సంస్ధలు మూతపడ్డాయి. ఏలూరు, తాడేపల్లిగూడెంలలో పలు రైళ్లను ఆందోళనకారులు నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా అన్నిచోట్ల రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. ఈసందర్భంగానే సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పలుచోట్ల పొట్టి శ్రీరాములు విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. అలాగే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాల కళ్లకు గంతలు కట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఊరేగింపులకు, నిరసన ప్రదర్శనలకు అడ్డులేకుండా పోయింది. అటు విద్యార్ధిలోకం, ఇటు విభిన్నవర్గాలు కలిసి ఆందోళనబాట పట్టడంతో జిల్లా కేంద్రమైన ఏలూరుతోపాటు జిల్లావ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఏలూరులోని ఫైర్‌స్టేషన్ సెంటరులో అరగంటకో నిరసన మాదిరిగా పరిస్దితి మారిపోయింది. ఎక్కడికక్కడ దిష్టిబొమ్మలను దగ్ధం చేయటం, కాంగ్రెస్ పార్టీ జెండాలను దగ్ధం చేయటం వంటివి అనేకం చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సమైక్యాంధ్ర విషయంలో యుటర్న్ తీసుకున్న అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఇదే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. కేంద్రమంత్రి తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనలు జరుగుతుండగా దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కావూరి వర్గీయులు వారికి ఎదురు ఆందోళన చేయటంతో ఏలూరులో పలు సందర్భాల్లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యాంధ్ర పేరుతోనే ఈరెండు ఆందోళనలు సాగటం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవటం గమనార్హం. అయితే ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు మాత్రం చోటుచేసుకోలేదు. మొత్తంమీద సమైక్యాంధ్ర సెగ తీవ్ర స్ధాయికి చేరుకుంటోంది.

టిడిపిదే హవా
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జూలై 31: పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహన్ని నింపుతున్నాయి. ప్రధాన నాయకులు ఎవరూ ప్రధానపాత్ర పోషించకపోయినా అనూహ్యఫలితాలు రావటంపై ఆ పార్టీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, వైఎస్సార్‌సిపి పార్టీలు ప్రభావం చూపుతాయని భావించిన కొన్ని ప్రాంతాల్లో సైతం టిడిపి మద్దతుదారులు ఆశాజనకమైన ఫలితాలు సాధించటంపై రాజకీయవర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. స్ధానిక నాయకులపై అసంతృప్తితోపాటు ప్రభుత్వ వ్యతిరేకత కూడా టిడిపి బలం పెరగడానికి ఒక కారణంగా వారు పేర్కొంటున్నారు. ప్రధానంగా వస్తున్నా...మీకోసం యాత్ర సందర్భంగా కార్యకర్తల్లో పార్టీ అధినేత కొత్త ఉత్సాహన్ని నింపటంతో వారంతా పార్టీ మద్దతుదారుల గెలుపే ధ్యేయంగా పనిచేయటంతోనే పంచాయితీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధ్యమయ్యాయని భావిస్తున్నారు. మూడు విడతలుగా జరిగిన పంచాయితీ ఎన్నికలలో తొలినుంచి టిడిపి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రకటన వెలువడగానే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో ముందంజలో నడుస్తూ వచ్చారు. స్ధానిక నాయకులు ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఫలితాలు కొంత ఆశాజనకంగానే ఉంటాయని వారంతా భావించారు. అయితే తాము అనుకున్న దానికన్నా ఎక్కువగానే స్ధానాలు లభించటంతో అటు పార్టీలోను, ఇటు కార్యకర్తల్లోనూ పార్టీకి పూర్వవైభవం వస్తుందన్న ఆశ మొదలైంది. ఇప్పటివరకు వైఎస్సార్‌సిపి పార్టీని చూసి భయపడినవారంతా ఈ ఫలితాలను చూసి అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని నిరూపితమైందని సంబరపడుతున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అభివృద్ధి పనులను నమ్ముకుంటూ ముందుకుసాగింది. సంక్షేమ పధకాలు చూసి ప్రజలు ఓట్లు వేస్తారని భ్రమపడింది. ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులైతే అసలు ఎన్నికల సమయంలో నియోజకవర్గాల మొఖం చూడలేదంటే ఆతిశయోక్తి కాదు. మరికొందరు ఇక్కడే ఉన్నా పార్టీ మద్దతుదారుల తరపున ప్రచారం చేసే విషయంలో తగిన ఆసక్తి కనపర్చలేదు. దీంతో ఇప్పుడు నాయకులు తమ నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించుకున్నట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్‌సిపి జిల్లాలో మూడవ స్ధానానికి పరిమితం కావాల్సి వచ్చింది. జగన్ పట్ల సానుభూతి, షర్మిల పాదయాత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే అత్యధిక స్ధానాలు గెలుస్తామని ఆ పార్టీ నేతలు, శ్రేణులు భావించాయి. కాని ఆశించిన మేర స్ధానాలు దక్కలేదు. టిడిపిని వెనక్కి నెట్టేసి కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్ధిగా వైఎస్సార్‌సిపి నిలుస్తుందని అంతా భావించారు. కాని అలాంటి పరిస్థితి కన్పించలేదు. జిల్లాలో మూడువిడతలుగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో మొత్తంమీద టిడిపి 336 పంచాయితీలను, కాంగ్రెస్ పార్టీ 222, వైఎస్సార్‌సిపి 194, ఇండిపెండెంట్లు 122, సిపిఎం రెండు పంచాయితీలను కైవసం చేసుకున్నాయి. అయితే ఇంకా నాలుగు పంచాయతీల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తొలి రెండు విడతల్లానే తెలుగుదేశం పార్టీ బుధవారం జరిగిన మూడవ విడతలోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. చివరివిడతలో టిడిపి 58, వైఎస్సార్‌సిపి 52, కాంగ్రెస్ 43, ఇండిపెండెంట్లు 25 స్ధానాలను దక్కించుకున్నాయి.
ప్రశాంతంగా
తుది విడత పోలింగ్
*గుండెపోటుతో ఇద్దరు మృతి
*తాగివచ్చిన పిఒపై వేటుకు సిఫార్సు
ఆంధ్రభూమిబ్యూరో
ఏలూరు, జూలై 31: జిల్లాలోని నర్సాపురం డివిజన్‌లోని 12 మండలాల్లోని పంచాయతీలతోపాటు, గతంలో వాయిదా పడ్డ పోలవరం మండలంలోని అయిదు పంచాయతీలకు బుధవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 182 పంచాయితీలకు, 1335 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా కాళ్ల మండలంలో 90.95శాతం, అత్యల్పంగా పోలవరం మండలంలో 78.84 శాతం ఓట్లు పోలయ్యాయి. అక్కడక్కడ అభ్యర్ధుల అనుచరుల మధ్య వాగ్వివాదాలు మినహా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా నిర్వహించారు. దీంతో మూడు విడతల పంచాయితీ ఎన్నికల ఘట్టానికి బుధవారం నాటితో తెరపడింది. కాగా బుధవారం నాటి పోలింగ్ సందర్భంగా ఓటుహక్కు వినియోగించుకున్న ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు గుండెపోటుతో మృతిచెందటం పెనువిషాదాన్ని మిగిల్చింది. పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన కడలి మహలక్ష్మి(62) ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గుండెపోటుతో మృతిచెందింది. అదే గ్రామానికి చెందిన పేరం రామస్వామి(70) ఓటు వేసి ఇంటికి వెళ్లి భోజనం చేస్తున్న సమయంలో గుండెపోటుతో మృతిచెందారు. ఇక వీరవాసరం మండలం తోలేరులోని 19/5 పోలింగ్ బూత్‌కు ప్రిసైడింగ్ అధికారిగా నియమితులైన ఉపాధ్యాయుడు అడపా సురేష్ మద్యం తాగి విధులకు హాజరుకావటంతో అయన్ని విధులనుంచి తొలగించి అసిస్టెంటు పిఓకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇదేసమయంలో సురేష్‌పై చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టరుకు సిఫార్సు చేసినట్లు తహసిల్దార్ తెలిపారు.
నర్సాపురం డివిజన్‌లోని 12 మండలాల్లో, పోలవరం మండలంలోను ఉదయం 7గంటలకు పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఒంటిగంటకు పోలింగ్ పూర్తయ్యేసరికి డివిజన్‌లో 87.01 శాతం, పోలవరంలో 78.84 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆచంటలో 80.48 శాతం, ఆకివీడులో 87.57శాతం, భీమవరంలో 88.52 శాతం, యలమంచిలిలో 88.20శాతం, కాళ్లలో 90.95శాతం, మొగల్తూరులో 87.13శాతం, నర్సాపురంలో 89.22శాతం, పాలకొల్లులో 87.60శాతం, పాలకోడేరులో 86.49శాతం, పోడూరులో 83.66శాతం, ఉండిలో 86.94శాతం, వీరవాసరం మండలంలో 87.33శాతం, పోలవరం మండలంలో 78.84 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ఒంటిగంటకు ముగించినా కౌంటింగ్ ప్రక్రియ మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక బుధవారం ఒకప్రక్క పోలింగ్ జరుగుతుండగా చాలాచోట్ల బూత్‌ల వద్ద మందుబాబులు నానా హంగామా సృష్టించారు. రాత్రి నుంచి మందు తాగుతూనే ఉండటంతో పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకుని ఓటు వేసేందుకు వచ్చినవారిని అడ్డుకుంటూ, అసభ్యపదాలతో దూషిస్తూ రావటంతో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కొన్నిచోట్ల బుధవారం తెల్లవారుజామున కూడా డబ్బు, తాయిలాల పంపిణి కొనసాగినట్లు సమాచారం. గత రాత్రి ప్రత్యర్ధులు ఓటుకు ఎంత ఇచ్చారో తెలుసుకున్న కొంతమంది అభ్యర్ధులు తాము ఇచ్చింది తక్కువని గుర్తించి మిగిలిన మొత్తాలను తెల్లవార్లు పంచుతూ వచ్చారు. కొన్నిచోట్ల ఓటుకు అయిదువేల రూపాయల వరకు కూడా ముట్టచెప్పారని తెలుస్తోంది. ఇక మహిళలకు అయితే చీర, జాకెట్టు ముక్క, రూపులు, ముక్కుపుడకలు వంటివి పంపిణి చేసారని ప్రచారం సాగుతోంది.

సమైక్య బంద్ సంపూర్ణం

ఏలూరు, జూలై 31 : ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని, విభజిస్తే సహించేది లేదంటూ ప్రజల నిరసనలతో జిల్లా కేంద్రం ఏలూరు హోరెత్తింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్ర జె ఎసి 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం ఏలూరులో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రజలు ముఖ్యంగా యువత, విద్యార్ధులు, వ్యాపారులు, పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు యుపి ఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం నుంచే నగరంలో పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, మోటారు సైకిల్ ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు, దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రజల నినాదాలతో నగరమంతా మార్మోగింది. బంద్ కారణంగా నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపింపచేశాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ కనిపించింది. సమైక్యాంధ్ర బంద్ కారణంగా నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, సినిమాహాళ్లు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆర్‌టిసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జూట్‌మిల్లు కూడా తెరచుకోలేదు. స్థానిక మోతేవారితోటలో గల కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయం వద్ద ఎపి ఎన్‌జివో సంఘం నేతలు, వైకాపా నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి కావూరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో కత్తిరాము ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నేతలు అక్కడకు చేరుకుని కావూరికి అనుకూలంగాను, సమైక్యాంధ్రకు మద్దతుగానూ నినాదాలు ప్రారంభించారు. ఈ సమయంలో ఉద్వేగాలు చెలరేగడంతో ఈ రెండు వర్గాల మధ్య తోపులాట నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని విడదీశారు. ఇదే సమయంలో మరింత మంది యువజన కాంగ్రెస్ నేతలు అక్కడకు చేరుకున్నారు. అలాగే వైకాపా నేతలు కూడా భారీ సంఖ్యలో కావూరి క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ వచ్చారు. కొద్దిసేపటికి వైకాపా నేతలు వెనుతిరగడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఏలూరుతోపాటు నగర పరిసర ప్రాంత గ్రామాలైన వట్లూరు, పెదపాడు, చాటపర్రు, మాదేపల్లి, జాలిపూడి, చొదిమెళ్ల, శనివారపుపేట, గవరవరం, సత్రంపాడు తదితర ప్రాంతాల్లో కూడా బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. విద్యార్ధులు ఆయా గ్రామాల్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిర్వహించారు. సర్ సి ఆర్ ఆర్ కళాశాల డిగ్రీ, పిజి సిబ్బంది సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో మోటారు సైకిళ్ల ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో సర్ సి ఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ వీర్రాజు చౌదరి, అధ్యాపకులు ఎల్ వెంకటేశ్వరరావు, వి వెంకట్రావు, డాక్టర్ సి రవి, ఎన్‌వి ఎస్ ఎస్ పతంజలి, డాక్టర్ డి చంద్రశేఖరరావు, డాక్టర్ కెవి ఎస్ ఆచార్య, డాక్టర్ ఎన్‌వి ఎస్ ఎస్ ప్రసాద్, వి డేనియల్, జివి ఎస్ ఎస్ చంద్రమోహన్, వి రామబ్రహ్మం, కె శివాజీ, వినె్సంట్ పాల్, వివి రమణ, డాక్టర్ కె రామరాజు పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని విభజించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల స్ఫూర్తికి ఇది విఘాతం కలిగించే అంశమని వారు అన్నారు. ఇప్పటికైనా విభజన అంశాన్ని పునఃసమీక్షించి రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని అన్నారు.
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఏర్పాటు
సమైక్యాంధ్ర సాధించడం కోసం కార్యాచరణ ప్రణాళికలను రూపకల్పన చేసేందుకు బుధవారం సాయంత్రం ఏలూరు బార్ అసోసియేషన్‌లో ఏలూరునకు చెందిన వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, చేతివృత్తులు, ఉద్యోగ, స్వచ్ఛంద సంస్థలు తదితర సంఘాల నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణ కోసం సమైక్యాంధ్ర పరిరక్షణ సమితిని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ గురువారం కూడా నగర బంద్ నిర్వహించాలని సమితి నిర్ణయించింది. సమితి ఛైర్మన్‌గా లాము విద్యాసాగర్, వైస్ ఛైర్మన్‌గా నేరెళ్ల రాజేంద్ర, సభ్యులుగా ఎంబిఎస్ శర్మ, కోనేరు సురేష్‌బాబు, జిల్లెళ్లమూడి నరసింహరావు, కానాల రామకృష్ణ, టి ఆర్ ఆర్ మోహనరావు, కోనే రామ్మోహనరావు, ఎం ఎన్ శ్రీకాంత్, జి ఆనందరావు, వి రామకృష్ణ, డివి కృష్ణారెడ్డి, ఎం రాజేంద్ర, శ్రీనివాసబాబు, జుజ్జువరపు జయరాజులు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటించినట్లు ఆ సంఘం అధ్యక్షులు ఎంబి ఎస్ శర్మ తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయవాదులు విధులను బహిష్కరించారు. వై ఎస్ ఆర్ సిపి ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీని నిర్వహించారు.
స్థానిక పాతబస్టాండ్ వద్ద నిర్వహించిన ఆందోళనలో టిడిపి నాయకులు అంబికా కృష్ణ, బడేటి బుజ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించి సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వసంతమహల్ సెంటర్ వద్దకు చేరుకుని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. నాయకులు పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, కొల్లేపల్లి రాజు, విద్యార్ధి సంఘ నాయకులు ఈవని భాస్కర్, దొంతంశెట్టి సాయినాధ్, అడపా సంజయ్, రాపాక దుర్గాప్రసాద్, గుర్రాల సునీల్, వైకాపా నేతలు గంపల బ్రహ్మావతి, మంచెం మైబాబు, మున్నుల జాన్‌గురునాధ్, పొలిమేర హరికృష్ణ, కోలా భాస్కరరావు, గుడిదేశి శ్రీను, ఎన్‌జివో సంఘం నాయకులు ఆర్ ఎస్ హరనాధ్, టి యోగానంద్, కిష్టవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో...
జంగారెడ్డిగూడెం: ఓట్లు, సీట్ల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలోని యు.పి.ఎ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చివేసిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్‌సి పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జంగారెడ్డిగూడెం బంద్ జరిగింది. బంద్ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు స్థానిక ఆర్టీసీ బస్ డిపో నుండి బస్సులు నడపకుండా అడ్డుకున్నారు. బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేసారు. యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు. వైఎస్‌ఆర్‌సి పార్టీ పిలుపు మేరకు పట్టణంలోని వర్తక, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు మూసి వేసారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న బాలరాజు మాట్లాడుతూ సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విభజించడం దురదృష్టకరమని, అన్నదమ్ముల్లా అన్ని ప్రాంతాలు కలసి మెలసి ఉన్న రాష్ట్రాన్ని విభజించడం రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఎటువంటి విధి విధానాలు లేకుండా ఏకపక్షంగా, నిరంకుశంగా కాంగ్రెస్ ప్రభుత్వం విభజించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు పరిగణనలోకి తీసుకోకుండా ఓట్లు, సీట్ల కోసం, స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నిలువునా చీల్చి వేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు గుర్తించి విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని, రాష్ట్రం అగ్నిగుండం కాకుండా చూడాలని అన్నారు. రాష్ట్రంలో చిచ్చుపెట్టిన పాపం యుపిఎ ప్రభుత్వానిదేనని, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకే రాష్ట్ర విభజన చేసారని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సి పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని అణచివేసేందుకే రాష్ట్ర విభజన చేసారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కొమ్ము కాస్తున్నారని, రాష్ట్ర విభజనపై నోరు మెదపడం లేదని బాలరాజు విమర్శించారు. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం వల్లే రాష్ట్రం విడిపోతుందని ఆవేదన వ్యక్తం చేసారు. సమైక్యవాదులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. నదీజలాలు, సరిహద్దుల సమస్యలు తేలకుండా, ఆంధ్రప్రదేశ్ రాజధాని తేల్చకుండా, విభజన ప్రకటన చేయడం బ్రిటీష్ పాలన తలపిస్తోందని, సోనియా గాంధీ బ్రిటీష్ పాలకుల తరహాలో విభజించి పాలించు విధానంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మనోభావాలు గుర్తించి, విభజన విరమించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ ఆందోళనలో వైఎస్‌ఆర్‌సి పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనివాసరావు, పార్టీ నేతలు పోల్నాటి బాబ్జి, రావూరి కృష్ణ, బొల్లిన వెంకటేశ్వరరావు, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, కె.సురేష్‌రెడ్డి, పాశం రామకృష్ణ, పాములపర్తి శ్రీనివాసరావు, కేమిశెట్టి మల్లిబాబు, గూడపాటి రాధాకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు.
ముక్కలు చేయడం అన్యాయం:ఉషారాణి
పాలకొల్లు: రాష్ట్రాన్ని ముక్కలు చేయటం అన్యాయమని, తాను ఎప్పుడూ సమైక్యవాదినేనని ఎమ్మెల్యే బంగారు ఉషారాణి అన్నారు. స్థానిక గాంధీబొమ్మల సెంటర్లో బుధవారం సమైక్యాంధ్ర ఉద్యమకారులు నిర్వహించిన రాస్తారోకోలో ఆమె పాల్గొని, సమైక్య వాదానికి మద్దతు పలికారు. అధిష్టానం తెలంగాణాకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ, అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తాను వ్యతిరేకిస్తానన్నారు. సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని కోరగా, ఆమె స్పందిస్తూ పదవికి రాజీనామా చేయటంవల్ల ప్రయోజనం ఉండదని, పదవి ఉంటే అసెంబ్లీలో తన వాదన వినపించే అవకాశం ఉంటుందన్నారు. సమైకాంద్ర ఉద్యమ కన్వీనర్ డాక్టర్ కెఎస్‌పిఎన్ వర్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీయటానికి ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకపోవటం రాష్ట్ర ప్రజలను అవమానపరిచినట్లేనన్నారు. పాలకొల్లులో బుధవారం సమైక్య వాదుల పిలుపుమేరకు బంద్ సంపూర్ణంగా జరిగింది. పట్టణంలో ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించారు. ఎప్పుడులేని విధంగా యువత ముందుకు వచ్చి మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించటం సమైక్యవాదంపట్ల వారి వాదనను చెప్పారు. తొలుత పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి, ఛాంబర్స్ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణ, మాటూరి నారాయణమూర్తి, గండేటి వెంకటేశ్వరరావు, యు కబర్ది, బొక్కా రమాకాంత్, శిడగం పాపారావు, యడ్ల శివాజీ, చల్లా ఆదినారాయణ, దీప్తి అప్పారావు, ముచ్చర్ల శ్రీరాం, విద్యార్థులు, వర్తకులు, యూత్ ఫ్రెండ్స్ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కాగా గ్రామాల్లో ఎన్నికలకు, ప్రజలకు ఈ బంద్‌తో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

శ్రీవారి దేవస్థానం సూపరింటెండెంట్ సస్పెన్షన్
ద్వారకాతిరుమల, జూలై 31: పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్ 2 అధికారిగా నియమితుడై విధుల్లో బాధ్యతా రాహిత్యంగాను, నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు శ్రీవారి దేవస్థానం సూపరింటెండెంట్ సిఎస్ నారాయణను సస్పెండ్ చేస్తూ ఆలయ ఇఒ వేండ్ర త్రినాథరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయనను విధుల నుండి తాత్కాలికంగా తొలగించినట్లు ఇఒ పేర్కొన్నారు. వివరాల ప్రకారం పెంటపాడు మండలం పరిమెళ్ల గ్రామంలో ఈ నెల 23న మొదటి విడతగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నారాయణ స్టేజ్ 2 అధికారిగా విధుల్లో చేరారు. ఎన్నికల సంఘ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఓట్ల లెక్కింపులో బయట వారిని సెల్‌ఫోన్లతో అనుమతించడంతో పాటు చెల్లని ఓట్ల లెక్కింపునకు ఏజంట్లకు అనుమతినిచ్చి లెక్కింపు కేంద్రంలో ఆయన గందరగోళం సృష్టించినట్లు ఏలూరు ఆర్డీవో కె నాగేశ్వరరావు చేపట్టిన విచారణలో తేలింది. దీంతో ఆయన తన నివేదికను ఎలక్షన్ కమిషన్‌కు అందచేశారు. ఎన్నికల విధుల్లో ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లు తేల్చి ఎలక్షన్ కమిషన్ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్ ఆదేశాలను అమలు చేసినట్లు ఇఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.
రైతులపై కిరాయి రౌడీల దాడి: దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత
ద్వారకాతిరుమల, జూలై 31: వ్యవసాయ పనులు చేసుకుంటున్న సండ్రగుంట గ్రామ రైతులపై బుధవారం మధ్యాహ్నం కొందరు కిరాయి రౌడీలు దాడి చేశారు. దీంతో భీతిల్లిన రైతులు గ్రామస్థుల సహకారంతో వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి ద్వారకాతిరుమల పోలీసులకు అప్పగించారు. బాధిత రైతులు దాసరి నవీన్, జక్కల ఏసురాజు, దాసరి పోతురాజు, నడవంక చంద్రరావు తదితరులు విలేఖర్లకు తెలిపిన వివరాలిలావున్నాయి. మండలంలో పి కన్నాపురం పంచాయతీ సండ్రగుంటకు చెందిన కొందరు భూమిలేని 20 మంది నిరుపేద రైతులకు పంచాయతీ తీర్మానం ద్వారా ఒక్కొక్కరికి 20 సెంట్లు భూమిని ఇచ్చారు. అయితే ఈ భూమిని వారు అదే గ్రామానికి చెందిన పి మహలక్ష్ముడు అనే వ్యక్తికి గత ఏడాది కౌలుకు ఇచ్చారు. అయితే ఈ ఏడాది రైతులు తామే స్వయంగా వ్యవసాయం చేసుకుంటామని చెప్పి బుధవారం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో తాడేపల్లిగూడెం, బాదంపూడి, నెల్లమిల్లి గ్రామాలకు చెందిన 17 మంది కిరాయి రౌడీలు రైతులపై దాడి చేశారు. దీంతో రైతులు గ్రామస్థుల సహకారంతో వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి ఆటోల్లో ద్వారకాతిరుమల పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించారు. ద్వారకాతిరుమల ఎస్సై పోతరాజు కేసు విచారిస్తున్నారు.
ఓటుహక్కు వినియోగించుకున్న రంపచోడవరం మెజిస్ట్రేట్
వీరవాసరం, జూలై 31: వీరవాసరం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. వీరవాసరం గ్రామానికి చెందిన మెజిస్ట్రేట్ వీరవల్లి గోపాలకృష్ణ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈయన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ తనకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఉన్నా వచ్చి, ఓటుహక్కును వినియోగించుకుంటున్నానని చెప్పారు.

*బంద్ విజయవంతం *నేటి నుండి ఉద్యమం మరింత తీవ్రతరం
english title: 
u

నిరసనల హోరు

$
0
0

విజయనగరం, ఆగస్టు 1: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ సెగ రగులుతొంది. గురువారం ఉద్యోగ సంఘాల జెఎసి, జాక్టో ఉపాధ్యాయ సంఘాలు కలసి మంత్రి బొత్స సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు మంత్రి బొత్స సత్యనారాయణ ఇళ్లు ముట్టడికి యత్నించారు. అయితే అప్పటికే పోలీసులు వలయాకారంగా చుట్టుముట్టడంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ముందర సత్యలాడ్జి సమీపంలో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీగా మంత్రి బొత్స ఇంటి వెనుకవైపు ద్వారా వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో మెయిన్‌రోడ్డుపైకి వచ్చారు. అక్కడ కూడా పోలీసులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవడంతో చివరకు అక్కడ రోడ్డుపైనే బైఠాయించి దాదాపు రెండు గంటలపాటు నినాదాలు చేశారు. మంత్రి బొత్స రాజీనామా చేయాలి, సమైక్యాంధ్రను కొనసాగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన నేతలు మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసి నాశనం చేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర విభజనను రాష్ట్ర ప్రజల అభిప్రాయం మేరకు చేయాలే తప్ప, సీట్ల కోసం .. ఓట్ల కోసం చేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఇవ్వమని అడగడానికి కెసిఆర్, కోదండరామ్‌లు ఎవ్వరని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్, కోదండరామ్‌లు తెలుగుజాతి ద్రోహులని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. మరో నేత స్పార్క్ సొసైటీ అధ్యక్షుడు పద్మనాభం మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసం అందరు కలసికట్టుగా ముందుకు రావాలన్నారు. సమైక్యాంధ్ర విడిపోతే సీమాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల సమైక్యాంధ్ర కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు కలసికట్టుగా ముందుకు వచ్చి పోరాటంలో పాలుపంచుకోవాలని కోరారు. పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు బూడి వెంకట్రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఏ పోరాటానికైనా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.

జిల్లాలో బంద్ ప్రశాంతం
సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా రెండో రోజు జిల్లాలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. గురువారం పట్టణంలో సమైక్యాంధ్ర జెఎసి, జాక్టో, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించడానికి యత్నించారు. మంత్రి బొత్స ఇంటి చుట్టూ పోలీసులు పహారా ఏర్పాటు చేయడంతో సమైకాంధ్రవాదులు ముట్టడికి ప్రయత్నించి చివరకు అక్కడే బైఠాయించి దాదాపు రెండు గంటలపాటు నినాదాలు చేశారు. కెసిఆర్ డౌన్.. డౌన్, మంత్రి బొత్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం ఆర్టీసీ డిపో కార్మికులు సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ చేపట్టడంతో డిపో బస్సులను నిలిపివేశారు. సీతానగరంలో ఎన్‌సిఎస్ షుగర్స్ యాజమాన్యం, కార్మికులు సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ రహదారిపై బైఠాయించి తమ మద్దతు తెలిపారు. ఎస్.కోటలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఇందుకూరి రఘురాజు నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. జొన్నాడలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి మానవహారం చేపట్టారు.

‘రాష్ట్ర చరిత్రలో జూలై 30 చీకటి రోజు’
విజయనగరం , ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జూలై 30తేదీ చీకటిరోజుగా మిగిలిపోతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ అన్నారు. గురువారం ఇక్కడ అశోక్ బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుజాతిలో చిచ్చుపెట్టి కాంగ్రెస్‌పార్టీ అధిష్ఠానం తెలుగుజాతిని, రాష్టవ్రిభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. సామాజిక, ఆర్థికపరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయకోణంలో ఆలోచించి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించడం దారుణమన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిమంత్రి చేయాలనే పదవీకాంక్షతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. తెలుగుప్రజలకు యుపిఎ చైర్‌పర్సన్ ఒకశాపంగా మారారని విమర్శించారు. ఒక సిద్ధాంతపరంగా రాష్టవ్రిభజనకు చర్యలు చేపట్టలేదని, శ్రీకృష్ణ కమిటీనివేదికను ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం రాష్ట్రాన్ని విభజిస్తే, స్థానిక కాంగ్రెస్‌నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నిరసన వ్యక్తం చేయడం దేయ్యాలు, వేదాలు వల్లించినవిధంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నాయకులు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా బంద్ చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఐవిపిరాజు, కనకల మురళీమోహన్, సువ్వాడ రవిశేఖర్, సైలాడ త్రినాధరావు, ప్రసాదుల రామకృష్ణ, మద్దాల ముత్యాలరావు, కర్రోతు వెంకట నరసింగరావుతదితరులు పాల్గొన్నారు.

అగ్ని బాధితులను
పరామర్శించిన కలెక్టర్
భోగాపురం, ఆగస్టు 1 : మండలం కొండ్రాజుపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి 125 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అగ్నిబాధితులను గురువారం కలక్టర్ కాంతిలాల్ దండే, మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, పరామర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని అలాగే ఇల్లు కోల్పోయిన పక్కా గృహాలు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. కొండ్రజుపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి 125 కుటుంబాల సర్వం కోల్పోయి నిరాశ్రయలై విషయం విదితమే. అయితే వీరికి గురువారం తహశీల్దార్ యు. రాజ్యలక్ష్మి సమక్షంలో ప్రభుత్వం తరపు నుంచి 15 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందజేశారు. అలాగే అగ్ని ప్రమాదంలో కొటా కార్డులు కోల్పోయిన కుటుంబానికి సిహెచ్‌డిటి మషిలామణి ఆదేశాలు మేరకు బియ్యం, పప్పు దినుసులు, పంపిణీ చేశారు

రాష్ట్ర విభజనను నిరసిస్తూ మానవహారం
విజయనగరం , ఆగస్టు 1: ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని విభజించడం కాంగ్రెస్‌పార్టీకి తగదని సమైక్యాంధ్ర జెఎసి జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు అన్నారు. రాష్ట్ర విభజనను నిరసనగా పట్టణంలో అనేకచోట్ల నిరసన కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విద్యార్థులతో, యువకులతో పెద్దఎత్తున మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే అధికారం కాంగ్రెస్‌నాయకులు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగువారిలో చిచ్చుపెట్టడటం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుంటే, ఎం.పి.లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేయకుండా పదవుల్లో కొనసాగడం దారుణమన్నారు. రాష్ట్రాన్ని విభజన ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే సీమాంధ్రలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర జెఎసి ప్రతినిధులు అబ్దుల్వ్రూఫ్ తదితరులు పాల్గొన్నారు.

నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.. రూ. 8 లక్షలు నష్టం
విజయనగరం , ఆగస్టు 1: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా ఇక్కడి డిపోలో కార్మికులు గురువారం బంద్ పాటించారు. ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ బంద్‌కు సంఘీభావాన్ని ప్రకటించారు. రెండు యూనియన్‌లకు చెందిన కార్మికులు బంద్‌లో స్వచ్చంధంగా పాల్గొనడంతో డిపోలో బస్సులు నిలిచిపోయాయి. విజయనగరం డిపోలో 124 షెడ్యూల్స్ ఉండగా, ఉదయం ఏడున్నర గంటలలోపువరకు 24 బస్సులు తిరిగాయి. ఆతర్వాత ఆ బస్సులు కూడా తిరగలేదు. ఈ కారణంగా 8లక్షల రూపాయల మేరకు డిపో ఆదాయానికి గండి పడింది. మిగతా డిపోలకు చెందిన బస్సులు తిరగడంతో ప్రయాణికుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. ఉదయం అయిదు గంటలకు సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుని బస్సులను కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ సహాయ కార్యదర్శి శ్రీనువాసరాజు మాట్లాడుతూ రాష్టవ్రిభజన వల్ల ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడుతుందన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనను ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బస్సులను విద్యార్థులు అడ్డుకోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

వర్షాలు లేక రైతుల ఆందోళన
గజపతినగరం, ఆగస్టు 1 : మండలంలో ఖరీఫ్‌లో సాగు చేసిన వాణిజ్య పంటలు తేమ లేక చనిపోతున్నాయి. ప్రధానమైన వరి పంట సాగుకు అవసరమైన మేరకు వర్షాలు కురవనందున నెల రోజుల కిందట పోసిన వరినారు ముదిరి పోతున్నందున దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సహజంగా జూలై ప్రధమ వారంలో పోసిన వరినారును జూలై నెలాఖరున లేదా ఈనెల మొదటివారంలవో ఉభాల జరుపుతుంటారు. మే,జూన్ జూలై నెలలో సగటున ప్రారంభం నుండి ఇంత మే,జూన్, జూలై నెలలో సగుటున 360 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 190 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో చెరువులలో చుక్క నీరు చేరలేదు. సగుటున మేలో 85.4 మిల్లీ మీటర్లు కాగా 13.4 మిల్లీ మీటర్ల 1 జూన్‌లోవ 136 మిల్లీ మీటర్లకు గాను 86.4 మీటర్లు, జూలైలో సగటు వర్షపాతం 139.1 మిల్లీ మీటర్ల కాగా 90 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. రైతులు మద్యకాలిక వరిరకాలకు చెందిన పంటను సాగు చేస్తుంటారు.నీరు లేని కారణంగా వ్యవసాయ బావులు కింద రైతులు కేవలం 5 నుంచి 10 శాతం వరి ఉభాలు జరిపారు. ఇప్పటికే వరినారు పోసి 30 రోజుల గడచింది. ముదిరిన వరినారు ఉభాలు జరపడం వలన దిగుబడులు తగ్గిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఈనెలలోనైనా ఆశాజనకంగా కురవకపోతే ప్రత్యాయ పంటలు సాగుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నారు.

సమైక్యాంధ్ర కోసం
జాతీయ రహదారిపై బైఠాయింపు
బొండపల్లి, ఆగస్టు 1: మండలంలోని అంబటివలస గ్రామం వద్ద సమైక్యాంధ్ర కోసం ఐదు గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపై బైఠాయించారు. గురువారం అంబటివలస, బిల్లలవలస, నెలివాడ, గరుడుబిల్లి, రోళ్లవాక గ్రామాలకు చెందిన ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు బైఠాయించి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ సూరినాయుడు మాట్లాడుతూ రాజకీయ పార్టీల స్వలాభం కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆయా గ్రామాలకు చెందిన ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు దరించి నిరసన వ్యక్తం చేశారు. 3న ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఇంటిని ముట్టడించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సన్యాసప్పడు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

‘ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి
విజయనగరం, ఆగస్టు 1: సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టిడిపి నేత చంద్రబాబునాయుడు తమ పదవులకు రాజీనామా చేయాలని ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు పేడాడ జనార్థనరావు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముమ్మరం చేసేందుకు ముఖ్య నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ నేత శివవర్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని దుర్మారంగా రెండుగా విడదీసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్య, విద్యుత్, ఇతర వౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు.
పోలీసుల నిఘా నీడలో తిప్పలవలస
డెంకాడ, ఆగస్టు 1 : పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామంలో మూడో రోజు గురువారం కూడా పోలీసు పహారా ఉండడంతో గ్రామంలో కర్ఫ్యు వాతావరణ నెలకొంది. ఎటవంటి అలజడులు జరగకుండా 37 మందితో గ్రామంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్థానికులు ఇళ్లలకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అనుమానం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటన్నారు. పాఠశాలలకు కూడా విద్యార్ధులు ఎవ్వరూ వెళ్లకుపోవడంతో ఉపాధ్యాయులు ఖాళీ గడపాల్సి వస్తుంది. గత నాలుగు రోజుల క్రింద జరిగిన అల్లర్లలో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరలా గురువారం మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రామారావు తెలిపారు.

సమైక్యాంధ్రపై అశోక్ నోరు మెదపలేదేం?
విజయనగరం, ఆగస్టు 1: రాష్ట్ర విభజన అంశం డిల్లీ పెద్దలది, మా అభిప్రాయం తెలపకుండానే తీసుకున్న నిర్ణయమది అని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పట్టణంలో బంద్ పాటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా టిడిపి, బీజేపి, సిపిఎం, ఇతర పార్టీలు రాష్ట్ర విభజనపట్ల స్పందించలేదన్న విమర్శించారు. తన వ్యక్తిగత అభిప్రాయం మేరకు సమైక్యాంధ్రపై స్పందించినట్టు తెలిపారు. 2008లో టిడిపి నేత చంద్రబాబునాయుడు తెలంగాణా ఏర్పాటుపై తీర్మానం చేసిన ఏ విధంగా ఇపుడు రైలురోకో చేశారని ఆయన ప్రశ్నించారు. జిల్లా ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన టిడిపి నేత ఆ బాధ్యతను మరచి హైదరాబాద్ ఎలా వెళ్లిపోయారని ఆయన ప్రశ్నించారు. దీనిపై జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమని, మమ్మల్ని రాజకీయంగా అప్రతిష్టపాలు చేయరాదని హితవు పలికారు.

జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ సెగ రగులుతొంది.
english title: 
protests

సమైక్య ఉద్యమ హోరు

$
0
0

శ్రీకాకుళం, ఆగస్టు 1: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో పలు కళాశాలల విద్యార్థులు సమైక్య గళంతోఉద్యమానికి ఊపందించారు. గురువారం ఉదయం పట్టణంలోని వివిధ డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులు తరగతులకు బహిష్కరించారు. జిల్లాలో శివానీ, శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలు, ఆదిత్య, ప్రతిభ, ఎస్‌ఎస్‌ఆర్, శ్రీ చైతన్య, సన్ , ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలు, ఆర్సీఎం, సాయిక్రిష్ణ తదితర జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర విభజనకు నిరసనగా రోడ్లెక్కారు. పట్టణంలో డే అండ్‌నైట్ జంక్షన్ వద్ద మానవహారం చేసి, అక్కడే కొద్ది సేపు బైఠాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు పూర్తి సంఘీభావం ప్రకటించారు. మాజీ మంత్రులు తమ్మినేని సీతారాం, గుండ అప్పలసూర్యనారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షులు చౌదరి బాబ్జి, లోక్‌సత్తా రాష్టక్రార్యదర్శి డి.విష్ణుమూర్తి, జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు చౌదరి పురుషోత్తం నాయుడు, హనుమంతు సాయిరాం, జామి భీమశంకరంలు మాట్లాడారు. రాజకీయ లబ్ధిని పొందేందుకు ప్రత్యేక తెలంగాణను ప్రకటించారన్నారు. ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. సోనియాగాంధీ కుమారుడున్ని ప్రధానమంత్రిని చేయడం కోసమే చీకటి ఒప్పందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 20 సూత్రాల అమలు ద్వారా నాడు దేశాన్ని గందరగోళం సృష్టించిన ఇందిరాగాంధీ మొండివైఖరి నేడు మరలా పునరావృత్తం కావడానికి సోనియా కారణమయ్యారన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనలో శాస్ర్తియత గానీ, తెలుగుప్రజల మనోభావాలను సైతం పరిగణలోనికి తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ కుఠిలరాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తేదీ జూలై 30 ఆంధ్రులకు చీకటి రోజుగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పదవులకు తక్షణమే రాజీనామాలు చేసి ఉద్యమానికి ఊపందించాలని, లేనిపక్షంలోవారి ఇళ్లను ముట్టడించి స్థంభింపజేస్తామని హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సమైక్యాంధ్ర ఆవశ్యకతను, రాష్ట్ర విభజన జరిగితే వాటిల్లే నష్టాన్ని సామాన్యప్రజలకు అర్థమమ్యేలా తెలియజెప్పి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అనంతరం విద్యార్థులతో జెఎసి నాయకులు ఏడురోడ్లజంక్షన్, పొట్టి శ్రీరాముల కూడలి వరకు ర్యాలీగా వెల్లి, అక్కడ సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నాలు నిర్వహించి, ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఈ ఉద్యమ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అద్యక్షుడు శ్రీనివాసానంద స్వామి, జేసీఐ అధ్యక్షుడు కోరాడ రమేష్,మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు సుగుణాకరరావు, ఉమామహేశ్వరరావు, గౌరీశంకర్, సింహాచలం, లైన్స్ క్లబ్ అద్యక్షులు బరాటం లక్ష్మణరావు, బార్ అసోసియేషన్ అద్యక్షులు పొన్నాడ వెంకటరమణతో పాటు వేలాది సంఖ్యలోవిద్యార్ధులు పాల్గొన్నారు.

నేడు జిల్లా బంద్
శ్రీకాకుళం, ఆగస్టు1 : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న సంపూర్ణ బంద్‌ను విజయవంతం చేయాలని సమైఖ్య రాష్ట్ర పరిరక్షణ వేదిక(జేఏసీ) పిలుపునిచ్చింది. గురువారం స్థానిక ఎన్జీఓ హోంలో కార్యాచరణలో భాగంగా జేఏసి నేతలు నిర్వహించిన విలేఖరుల సమావేశంలోమాట్లాడారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు చౌదరి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కర్షక, కార్మిక, రవాణా, న్యాయవాద, స్వచ్ఛంద, ప్రజా, విద్యార్థి సంఘాలు బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రులు తమ్మినేని సీతారాం, గుండ అప్పలసూర్యనారాయణలు మాట్లాడుతూ ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రం అనే నినాదంతో ఉద్యమాన్ని విజయవంతం చేయడం ద్వారా సిక్కోలు వాణిని వినిపించాలన్నారు. పోరాటాలు జిల్లాకు కొత్తేమికాదని, రాష్ట్రాన్ని సమైక్యంగా నిలపడానికి ఎంతటి త్యాగానికైనా సిద్దం కావాలన్నారు. ఈ సందర్భంగా బంద్ ప్రణాళికలను వివరించారు. శుక్రవారం ఉదయం 5గంటల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ల వద్ద భైఠాయింపు, అలాగే ఉదయం 9 గంటల నుంచి పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వర్తక, వాణిజ్య, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, హోటల్స్, కలుపుతూ, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో జేఏసీ నాయకులు హనుమంతు సాయిరాం, జామి బీమశంకర్,శ్రీనివాసానంద స్వామి, పొన్నాడ వెంకటరమణ, సుగుణాకర్, బరాటం లక్ష్మణరావు, ఉమామహేశ్వరరావు, కోరాడ రమేష్, కోరాడ హరిగోపాల్, అంధవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

‘ప్రత్యేక’ పాలనకు తెర!
ఎచ్చెర్ల, ఆగస్టు 1: గ్రామాల్లో సుమారు రెండేళ్ల ప్రత్యేకాధికారుల పాలనకు నేటితో తెరపడనుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన పాలకవర్గాలు నేడు బాధ్యతలు స్వీకరించున్నాయి. వీరి పాలన ఐదేళ్ల పాటు కొనసాగనుంది. 2006 జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఆగస్టు 22వ తేదీన సర్పంచ్‌లుగా నాడు బాధ్యతలు స్వీకరించారు. అయితే వీరి పదవీకాలం 2011, జూలై 23వతేదీకి ముగియడంతో అప్పటినుంచి కిరణ్‌సర్కార్ ప్రత్యేక పాలనకు తెరలేపింది. సుమారు రెండేళ్లు ఈ పాలన కొనసాగడంతో పంచాయతీ ఆవాస ప్రాంతాల్లో నివాసముంటున్న పౌరులకు ప్రాథమిక అవసరాలు కూడా తీర్చలేకపోవడంతో అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాలు వంటి కనీస అవసరాలు ప్రత్యేక పాలనలో అధికార యంత్రాంగం తీర్చలేకపోయిందన్న అపవాదు ప్రభుత్వమే మోయాల్సి వచ్చింది. అదిగో ఇదిగో అంటూ రిజర్వేషన్ ప్రక్రియ షాక్‌గా చూపి రెండేళ్లపాటు ప్రత్యేక పాలనను పంచాయతీ వాసులపై ఇబ్బందులను ప్రభుత్వం రుద్దింది. చివరకు కోర్టు ఉత్తర్వుల మేరకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించింది. జిల్లాలో జూలై 23, 27, 31 తేదీల్లో 1093 పంచాయతీలకు ఎన్నికలు పూర్తిచేసింది. ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన సర్పంచ్‌లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించనుండడంతో ప్రత్యేకపాలనకు తెరపడింది. ఇప్పటివరకు పంచాయతీ ఖాతాలలో మూలుగుతున్న వివిధ పద్దులకు సంబంధించి నిధులతో అభివృద్ధి ఫలాలు పౌరులకు అందనున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణతోపాటు అనుబంధ గ్రామాలకు రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం వంటి పనులు వేగవంతం కానున్నాయని పౌరులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

నిరుద్యోగుల్లో కలవరం
శ్రీకాకుళం, ఆగస్టు 1: రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సిఫార్సు చేయడం సమైక్య ఆందోళనలు ఊపందుకున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ఊరించి ఉద్యోగ నియామకాలకు ఇటీవలి నడుంబిగించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు నిరుద్యోగులంతా పుస్తకాలతో కుస్తీపట్టడమే కాకుండా కోచింగ్ సెంటర్లలో తిష్ఠవేసి వేలాది రూపాయలు చెల్లించి శిక్షణ పొందుతున్నారు. ఇటువంటి వారి ఆశలపై రాష్ట్ర విభజన నిర్ణయం నీళ్లుచల్లింది. ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించాల్సిన టెట్‌తోపాటు జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ అధ్యాపకులు, ఎ.ఇ.లు వంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీఆ నియామకాలపై నీలినీడలు అలముకున్నాయి. అంతేకాకుండా జోనల్ స్థాయి ఉద్యోగ నియామకాలు భర్తీ అయ్యే పరిస్థితులు కానరావడం లేదు. గ్రూపు-2 నోటిఫికేషన్‌పై ఎన్నో ఆశలు పెంచుకున్న విద్యాధికులపై విభజన నిర్ణయం పిడుగుపిడినట్లయింది. ఈ నోటిఫికేషన్ మరింత జాప్యం అవుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. రెవెన్యూ, పోలీసు, హెల్త్ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీకి కిరణ్‌సర్కార్ చేసిన కసరత్తు వృథాగా మిగిలిందని నిరుద్యోగులంతా పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనల కారణంగా విద్యార్థిలోకం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇదిలావుండగా, ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరగోరు అభ్యర్థులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది ఆగస్టు ఆరవ తేదీ నుంచి కౌనె్సలింగ్ నిర్వహించినప్పటికీ ఆ పరిస్థితులు నేడు కానరాకపోవడం తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిన్నటివరకు పంచాయతీ ఎన్నికల కోడ్ ఎంసెట్ కౌనె్సలింగ్‌కు అడ్డంకిగా నిలవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎడ్‌సెట్, లాసెట్ సీట్ల భర్తీకి కౌనె్సలింగ్ కూడా నిర్వహించని పరిస్థితి నెలకొనడటంతో ఆ పరీక్షలకు అర్హత పొందిన విద్యార్థులను విద్యాసంవత్సరం ఎక్కడ చేజారుతుందోనన్న భయం వెంటాడుతోంది. బి.టెక్ మొదటిసంవత్సరం విద్యార్థులకు నిర్వహిస్తున్న సెమిస్టరీ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దుచేయడంతో వారంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మెడికో విద్యార్థులకు అడ్మిషన్లు పూరె్తైనా, తరగతులు ప్రారంభమయ్యేందుకు ప్రతికూల అంశాలు వెంటాడటంతో ఒకింత అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. యు.జి., పి.జి. కోర్సుల్లో చేరే విద్యార్థులంతా సమైక్యాంధ్ర అంటూ చదువులకు స్వస్తిపలికి ఉద్యమబాట పట్టారు. ఇలా విద్యార్థులతో విభజన నిర్ణయం ఆటలాడుకోవడంపై వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.
ఇక జూడాలు, 108 సిబ్బంది, కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మెబాట పట్టి వారాలు గడుస్తున్నా సమస్య అపరిష్కృతంగా మిగిలిపోవడం ఇంతలోనే విభజన నిర్ణయంపై ఆందోళనలు ఊపందుకోవడంతో వీరు సంకట పరిస్థితిని చవిచూడాల్సి వచ్చింది. ఇలా విద్యార్థిలోకాన్ని, నిరుద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్ధకంగా యుపిఏ తీసుకున్న అనాలోచిత విభజన నిర్ణయం ముంచేసిందన్న ఆగ్రహం అంతటా వ్యక్తమవుతోంది.

మన్యసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలి
* రాష్ట్ర కోకన్వీనర్ సింహాచలం డిమాండ్
సారవకోట, ఆగస్టు 1: రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో గిరిజనుల అభివృద్ధి కోసం మన్యసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర సాధనసమితి కోకన్వీనర్ మాలువ సింహాచలం డిమాండ్ చేశారు. గురువారం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇదివరకే మన్యసీమ రాష్ట్రం ఏర్పాటు కోసం పలు పోరాటాలు చేశామని, రాష్ట్ర నాయకులతో పాటు రాష్టప్రతి వరకు వివిధ స్థాయిల్లోని అధికార ప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందించామన్నారు. తమ విజ్ఞప్తులను, డిమాండ్లను పక్కనపెట్టి రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో గిరిజనుల శ్రేయస్సును, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇదే సమయంలో గిరిజనుల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి
* జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్
పాతశ్రీకాకుళం, ఆగస్టు 1: సీమాంధ్రప్రజల ఆవేదనను అర్ధంచేసుకొని రాష్ట్ర విభజన ప్రక్రియను పునసమీక్షించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నర్తు నరేంద్రయాదవ్, రత్నాల నర్సింహమూర్తిలు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఇందిరావిజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. హైదరాబాద్ ప్రతీ తెలుగువాడి ఊపిరన్నారు. హైదరాబాద్ లేని రాష్ట్రాన్ని ఊహించుకోలేమన్నారు. తెలుగుదేశం, వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు కాళ్ల సిద్దాంతాన్ని అవలంభిస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన కోరుతూ కేంద్రానికి లేఖలు కూడా రాసాయన్నారు. ఈ అంశంపై పునసమీక్షించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెలతామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో డీసీసీ నేతలు ముస్తాక్ మహ్మద్, డీఎస్‌కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పోస్ట్ఫాసుల ద్వారా పింఛను బట్వాడా
సారవకోట, ఆగస్టు 1: ఇప్పటివరకు బ్రెడ్స్ స్వచ్చంధ సంస్థ నిర్మించిన బి.ఎస్.పి.ల ద్వారా గ్రామాల్లో వివిధ పింఛను లబ్ధిదారులకు పైకం అందించేవారు. అయితే నేటి నుండి సి.ఎస్.పి.ల వ్యవస్థను రద్దుచేయడంతో పింఛన్ల పైకాన్ని రెండు సంస్థలు ద్వారా బట్వాడా చేయనున్నారు. పోస్ట్ఫాస్‌లో ఉన్న గ్రామ పంచాయతీల పరిధిలో సంబంధిత పోస్టుమాస్టర్ ద్వారా పింఛన్లను నెలవారీ అందిస్తారు. ఆ పంచాయతీ పరిధిలోని పింఛనుదారులందరూ ప్రతీనెలా విధిగా పోస్ట్ఫాస్‌కు వెళ్లి పైకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన పంచాయతీలో ఐకెపి ద్వారా స్వయంశక్తి సంఘాల మహిళలను ఎంపిక చేసి బట్వాడా చేశారు. దీంతో బిఎస్‌పి వ్యవస్థ పూర్తిగా రద్దైంది. ధర్మలక్ష్మీపురం, చిన్నకిట్టాలపాడు, గొర్రెబంద, సాపవకోట, అలుదు, అంగూరు, పెద్దలంబ, కె.ఎస్.పల్లి, అన్నుపురం, జమచక్రం, తొగిరి, బుడితి, బద్రి పంచాయతీల్లో 2,600 మంది పింఛనుదారులకు ఆయా పోస్ట్ఫాస్‌ల ద్వారా పింఛను పైకం బట్వాడా చేయనున్నట్లు బ్రెడ్స్ కోఆర్డినేటర్ బి.రామచంద్రరావు స్పష్టంచేశారు. పింఛన్ల పంపిణీ విధానం అకస్మాత్తుగా మార్పుచేయడంతో పలు గ్రామాల్లో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.
కనీస వేతనాలు అమలు చేయాల్సిందే
* కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఆగస్టు 1: ప్రభుత్వం ప్రతిపాదించిన కనీస వేతనాలను ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఖచ్చితంగా అమలుచేయాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కనీస వేతనాలు అమలుపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2013-14 సంవత్సరానికి మస్తర్ రోల్‌లో లేని కూలీలకు 9.06 శాతం పెరుగుదలతో వేతనాల పెరుగుదలకు విజయనగరం కేంద్ర వినియోగదారుల సూచి సంఖ్యల కేంద్రం సూచించగా ఆ వేతనాలను కేటగిరీల వారీగా కనీసం 6.99 శాతం నుండి 58 శాతం వరకు హెచ్చిస్తూ కలెక్టర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కనీస వేతనాలను ఖచ్చితంగా అమలుచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలోను కనీస వేతనాలు అమలుజరగాలన్నారు. కనీస వేతనాల పట్టికను గనులశాఖ సహాయ సంచాలకులు, వాణిజ్య పన్నుల శాఖ తదితర సంబంధిత శాఖలకు పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళికాధికారి ఎం.శివరామనాయకర్, పంచాయతీ రాజ్ ఎస్.ఇ బివిఎస్ చిరంజీవి, కార్మిక శాఖ ఉపకమీషనర్ ఎం.రామారావు, నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

కదం తొక్కిన విద్యార్థులు
ఎచ్చెర్ల, ఆగస్టు 1: యు.పి.ఏ సర్కార్ రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థులంతా గురువారం కూడా కదంతొక్కారు. వీరంతా తరగతులు బహిష్కరించి క్యాంపస్ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహం నుంచి యు.పి.ఏ ప్రభుత్వానికి శవయాత్ర నిర్వహించి వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. అక్కడ నుంచి ర్యాలీగా సోనియా డౌన్..డౌన్.., యు.పి.ఏ డౌన్..డౌన్, సి.ఎం.డౌన్..డౌన్.,..ఒకే భాష-ఒకే రాష్ట్రం అంటూ జాతీయ రహదారి దద్దరిల్లేలా నినదించారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విభజనపై పునరాలోచించకుంటే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తామని హెచ్చరించారు. ప్రాణాలైనా అర్పిస్తాం..సమైక్యాంధ్ర సాధిస్తామంటూ నినాదాలు మిన్నంటాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటిగంట వరకు ఎంతో పోరాట పటిమతో సమైక్యాంధ్రకు జై అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించారు. హైవేపై రాస్తారోకో కొనసాగించడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. రాస్తారోకోను విరమించాలని పోలీసులు ఎన్నిమార్లు హెచ్చరికలు జారీ చేసినా వాటిని బేఖాతరు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జె.ఆర్.పురం సి.ఐ వేణుగోపాలనాయుడు, ఎస్సై పి.వి.ఎస్.ఉదయ్‌కుమార్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక బలగాలు పహారా కాసాయి.
పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన
రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయం తీసుకోవడం సబబుగా లేదని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు నిరసనకు దిగారు. వీరంతా తరగతులు బహిష్కరించి కళాశాల నుంచి కుశాలపురం బైపాస్ వరకు ఆర్.అండ్.బి రహదారిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బైపాస్‌వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఆచార్యుల సంఘీభావం
రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆచార్యులు స్పష్టంచేశారు. అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగఫలితాన్ని తెలుగువారంతా సమిష్టిగా ఉండి కాపాడుకోవాలని హితవుపలికారు. సంఘీభావ దీక్షల్లో ఆచార్యులు జి.తులసీరావు, ఎం.చంద్రయ్య, టి.కామరాజు, బి.అడ్డయ్య, టీచింగ్ అసోసియేట్స్, నాన్‌టీచింగ్ సిబ్బంది సమైక్యాంధ్రకు జైజైలు పలికారు.

సాదాసీదాగా షర్మిల పాదయాత్ర
పలాస, ఆగస్టు 1: దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమారై వై ఎస్ షర్మిల పాదయాత్ర సాదాసీదాగా గురువారం జరిగింది. మండలంలోని వీరభద్రాపురం నుండి బయలుదేరిన ఆమె వెంకటాపురం, బెండిగేటు, సరియాపల్లి, గరుడఖండి, చినబాడాం, కాశీబుగ్గల మీదుగా రంగోయిలకు చేరుకుంది. కాశీబుగ్గలోని రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, షర్మిలను చూసేందుకు అభిమానులు పోటీపడడంతో ఆమె సెక్యూరిటీ సిబ్బంది అభిమానులపై అడపాదడపా పిడిగుద్దులు దాడి చేస్తుండడంతో అభిమానులు వారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పలాస వైకాపా సమన్వయకర్తలు కణితి విశ్వనాధం, వజ్జ బాబురావులు ఆమె వెంట నడుస్తూ కనబడ్డారు. నేతలకు సంబంధించి ముఖ్య అనుచరులను ఆమె వెంట నడిచేందుకు ప్రెవేట్ సైన్యం అవకాశం ఇవ్వకపోవడంతో వైకాపా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షర్మిలను చూసేందుకు మహిళలు పోటీ పడ్డారు. దారి పొడవునా పలు చోట్ల ఆమెకు బొట్టుపెట్టి హారతి ఇచ్చేందుకు మహిళలు ప్రయత్నించినప్పటికి ఆమె సున్నితంగా నిరాకరిస్తూ మహిళలను అభివాదం చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. ఈమె వెంట నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, వైకాపా నాయకులు ధర్మాన పద్మప్రియ, వరుదు కల్యాణి, బొడ్డేపల్లి పద్మజ, నర్తు ప్రేమ్‌కుమార్, డబ్బీరు నాగు, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ శ్రీ్ధర్, డాక్టర్ జీవితేశ్వరరావు, పాలవలస వైకుంఠరావు, తాళాసు ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ఆదిత్యుని కల్యాణం
శ్రీకాకుళం, ఆగస్టు 1: ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నేతృత్వంలో అర్చకులు ఉషాపద్మిని ఛాయాసహిత అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషాలంకరణతో అనివెట్టి మండపం వద్ద నెలకొల్పారు. ముందుగా 500 రూపాయలు చెల్లించి కల్యాణవేదికలో పాల్గొన్న భక్తులకు కంకణాధరణ చేశారు. స్వామి, అమ్మవార్ల గోత్రనామాలు, మేళతాళాలు మధ్య వేదమంత్రాలు పఠించి శాస్త్రోక్తంగా పరిణయ తంతు పూర్తిచేశారు. అనంతరం భక్తులకు కంకణాలు తొలగించారు. ఆశీర్వచనాలు పలికి తీర్ధప్రసాదాలు, వ్రస్తాలు అందించారు.

తల్లి పాల ఆవశ్యకతను చాటిచెప్పాలి
పాతశ్రీకాకుళం, ఆగస్టు1 : తల్లి పాల ఆవశ్యకతను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. 21వ ప్రపంచ తల్లి పాలవారోత్సవాల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్ నుంచి రిమ్స్ ఆస్పత్రి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం స్థానిక ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బిడ్డకు కావల్సిన పోషకపదార్ధాలు, వ్యాధినిరోధక శక్తి తల్లి పాల ద్వారా లభిస్తాయన్నారు. ప్రాణాంతకమైన వ్యాధులను నుంచి పిల్లలకు రక్షణ ఉంటుందన్నారు. పుట్టిన గంటలోపే ముర్రుపాలు బిడ్డకు అందించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి గీతాంజలి మాట్లాడుతూ ఈనెల ఒకటి నుంచి 7 వ తేదీ వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా వారికి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను వివరిస్తున్నామన్నారు. డైరక్టర్ తెనె్నటి జయరాజ్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదపడతాయన్నారు. మాతా,శిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీటవేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండ్ ఆర్.అరవింద్, ఐసీడీఎస్ పీడీ చక్రధరరావు,సీడీపీఓ శోభారాణి,స్వచ్చంద సంస్థల ప్రతినిధి రమణ, తదితరులు పాల్గొన్నారు. ముందుగా తల్లి పాల వారోత్సవాల బ్రోచర్‌ను ఏజేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలోపౌష్టికాహారం- తల్లిపిల్లల ఆరోగ్యంపై పొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేసారు. పిన్నింటిపేటకు వాసి చింతాడ భాగ్యలక్ష్మికి పౌష్టికాహార కిట్స్‌ను ఏజేసీ అందించారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో
english title: 
s

చల్లారని విభజన మంటలు!

$
0
0

అనంతపురం, ఆగస్టు 1: జిల్లాలో విభజన సెగలు సద్దుమణగలేదు. రెండవ రోజు గురువారం జిల్లా వ్యాప్తంగా రోడ్లపై టైర్లు కాల్చారు. రాజీవ్, ఇందిరా విగ్రహాలను ధ్వంసం చేశారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వారు. నగరంలో పలు చోట్ల రాజీవ్ చిత్రపటాలను దగ్ధం చేశారు. సమైక్యాంధ్ర జెఎసి, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా గురువారం బంద్ విజయవంతమైంది. సమైక్యాంధ్ర ఉద్యమకారులకు ప్రజలు సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సోనియాగాంధీ దిష్టిబొమ్మలకు శవయాత్ర, కర్మకాండలు, దహనాలను నిర్వహించారు. గుత్తి, గుంతకల్లు, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర, పెనుకొండ, ఉరవకొండ, గోరంట్ల, తాడిపత్రిలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలపై రాళ్లు రువ్వారు. విగ్రహాలపై టైర్లు వేసి కాల్చే ప్రయత్నం చేశారు. పలు చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. కదిరిలో రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచె వేసి టైర్లు కాల్చి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఇంటి ముందు ఉద్యమకారులు బైఠాయించి మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటిపై ఉద్యమకారులు రాళ్లు రువ్వారు. పోతుకుంటు గేటు సమీపంలోనిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఎస్‌కె యూనివర్శిటీలో విద్యార్థులు రోడ్డు పై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసులు భారీగా మోహరించారు. బందోబస్తు కోసం ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటల నుంచే పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి చేరుకుని ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, రాస్తోరోకో నిర్వహించారు. బంద్ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, పెట్రోలు పంపులు, సినిమా థియేటర్లు మూసివేశారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు బస్సులు తిరగనీయలేదు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.

రాజకీయ నాయకుల స్వార్థానికి
బలి కావద్దు

* ఎస్‌కెయూలో కడపకు చెందిన ఫ్యాక్షన్ క్రిమినల్
* విద్యార్థులకు ఎస్పీ విజ్ఞప్తి
అనంతపురం, ఆగస్టు 1 : జిల్లాలోని సమైక్యాంధ్ర ఉద్యమంలోపాలు పంచుకుంటున్న విద్యార్థులు కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థానికి బలి కావద్దని ఎస్పీ ఎస్.శ్యామ్‌సుందర్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. అలాగే కొంతమంది ప్రొఫెసర్లు, లెక్చరర్లు వీరిని సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ గైడ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గురువారం పోలీసు సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. అందుకే విద్యార్థుల తల్లితండ్రులు వారిని ఆయా ఉద్యమాల్లో పాల్గొనకుండా చూడాలన్నారు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల స్వార్థానికి విద్యార్థులు వారి జీవితాలను బలి చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. కొంతమంది ప్రొఫెసర్లు కూడా వారిని దీంట్లో పావులుగా వాడుకుంటున్నారన్నారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కునే విద్యార్థులకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయన్నారు. ఎస్‌కెయూలో నాన్ బోర్డర్‌లు ఉండకుండా చూడాలని ఆయన కోరారు. ఇప్పటికే అక్కడ కడపకు చెందిన ఒక ఫ్యాక్షన్ క్రిమినల్ ఉన్నట్లు గుర్తించామని అతనిపై కేసు కూడా నమోదు చేశామన్నారు. అక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై విచారణ చేస్తున్నామన్నారు. ఇలాంటి వారిని గుర్తించి వారిని ఎస్‌కెయూ హాస్టళ్ళ నుంచి బయటకు పంపించివేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 30 పోలీసు యాక్టు అమలులో ఉన్న కారణంగా ఐదుగురు ఒక దగ్గర ఉండకూడదన్నారు. సమైక్యాంధ్ర పేరుతో ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగించే వారిపై పిడిపిపి యాక్టు, రైటింగ్ యాక్టులను ప్రయోగిస్తామని హెచ్చరించారు. జిల్లాలో13000 మంది ఫోర్స్ ఉందని ఎలాంటి ఇబ్బందుల నైనా తాము ఎదుర్కొంటామని తెలిపారు. ఇలాంటి ఉద్యమాల్లో విద్యార్థులు పాల్గొనడం వల్ల వారు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. అందుకు గానూ వారి తల్లితండ్రులు విద్యార్థుల భవిష్యత్తు పట్ల అప్రమత్తంగా ఉండి వారు ఇలాంటి వాటిలోపాల్గొనకుండా నిరోధించాలని తెలిపారు. ఈ సమావేశంలోఅడిషనల్ ఎస్పీ నవదీప్‌సింగ్ పాల్గొన్నారు.
ఎస్‌కెయూ విద్యార్థులపై లాఠీచారిజ
ఎస్‌కెయూ క్యాంపస్‌లో గురువారం సాయంత్రం ఎస్పీ ఎస్.శ్యామ్‌సుందర్ వ్యవహార శైలితో విద్యార్థులు రెచ్చిపోయారు. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. పలువురు విద్యార్థులతో పాటు వార్తా సేకరణకు వెళ్లిన ఓ పాత్రికేయుడికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం ఎస్‌కెయూ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లిన ఎస్పీ ఆందోళన విరమించాలని సూచించారు. ధర్నా చేస్తే మీపై కేసులు పెడతామని, ధర్నాలో పాల్గొంటున్న వారందరినీ వీడియోలో చిత్రీకరిస్తున్నామని, కేసు నమోదైతే ఉద్యోగాలు, పాసుపోర్టు లాంటివి రావని బెదిరించారు. అయినా విద్యార్థులు కదలకపోవడంతో వీడియో తీయండంటూ ఎస్పీ పురమాయించారు. దీంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మరింత రెచ్చిపోయిన పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. ఫలితంగా క్యాంపస్‌లో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతియుతంగా ధర్నా, రాస్తారోకో చేస్తున్న తమ పట్ల ఎస్పీ దురుసుగా ప్రవర్తించడం వల్లే పరిస్థితి అదుపుతప్పిందని విద్యార్థులు ఆరోపించారు. కాగా ప్రజలకు ఇబ్బంది కలిగిలా విద్యార్థులు ప్రవర్తించినందునే లాఠీచార్జి చేయాల్సి వచ్చిందని ఎస్పీ పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాజీనామా
అనంతపురం, ఆగస్టు 1: సమైక్యాంధ్ర కోరుకుంటున్న పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జెసి దివాకర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సుధాకర్, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తమ పదవులకు రాజీనామా చేశారు. అదే విధంగా టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు పార్థసారథి, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, కందికుంట వెంకటప్రసాద్, అబ్దుల్ ఘనీ, ఎమ్మెల్సీలు శమంతకమణి, మెట్టు గోవిందరెడ్డి రాజీనామా చేశారు. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఇప్పటికే పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

గడేకల్లు స్కూల్‌లో
బ్యాలెట్ పేపర్లు లభ్యం
* అన్యాయం జరిగిందని అభ్యర్థితో పాటు టిడిపి నాయకుల రాస్తారోకో
ఉరవకొండ, ఆగస్టు 1: ఉరవకొండ నియోజక వర్గం, విడపనకల్లు మండలంలోని గడేకల్లులో గురువారం బ్యాలెట్ పేపర్లు లభ్యమయ్యాయి. పొలింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమకు అన్యాయం జరిగిదంటూ అభ్యర్థి శారదతో పాటు టిడిపి నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. గురువారం ఉదయం పాఠశాలకు విచ్చేసిన విద్యార్థులు బ్యాలెట్ పేపర్లు ఆవరణంలో పడి వున్న సంఘటన సంచలనం రేపింది. దీంతో సమాచారం అందుకున్న నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. బుధవారం గడేకల్లు గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారుడు, బుట్ట గుర్తు అభ్యర్థి దీపకు 1872 ఓట్లు లభించాయని, అదే విధంగా టిడిపి మద్దతు దారురాలు శారద, ఎన్నికల గుర్తు ఉంగరం గుర్తుకు 1409 ఓట్లు లభించాయి. దీంతో పాటు చెల్లని ఓట్లు 193 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అత్యధిక ఓట్లు సాధించిన దీపను పంచాయతీ సర్పంచ్‌గా అధికారులు ధ్రువీకరించారు. అయితే గురువారం ఉదయం స్కూల్ ఆవరణంలో బ్యాలెట్‌లు విద్యార్థులు లభ్యమైన సమాచారం అందుకున్న ప్రధాన ఉపాధ్యాయుడు గుండురావు సేకరించి భద్రపరిచాడు. దాదాపు 13 కట్టలు గల 395 ఓట్లు గల ఉంగరం గుర్తు బ్యాలెట్ పేపర్లు లభ్యం కావడంతో పోలింగ్‌లో అవతవకలు జరిగాయని, అభ్యర్థి శారదతో పాటు టిడిపి నాయకులు శ్రీనివాసులు, రాములతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఎన్నికల రీ కౌంటింగ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ఎంపిడిఓకు సమాచారం అందించి సంఘటన స్థలానికి రావాలని నాయకులు కోరారు. సాయంకాలం ఆందోళన కారుల వద్దకు లభ్యమైన బ్యాలెట్ పేపర్‌లను సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని ఎంపిడిఓ నాగరాజు హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.
రాజీనామాలతో సాధించే దేమిటి?
* సమైక్యవాదానికై ఆమరణ దీక్షకైనా సిద్ధం
* డిసిసి అధ్యక్షుడు మధుసూదన్‌గుప్తా
అనంతపురం టౌన్, ఆగస్టు 1: రాజీనామాలతో సాధించేదేమి ఉండదని, అమరజీవి పొట్టి శ్రీరాములు తరహాలో గాంధేయ పద్ధతుల్లో సమైక్యవాదానికై ఆమరణ నిరాహార దీక్షను చేపట్టటానికైనా తాను సిద్ధమని డిసిసి అధ్యక్షుడు మధుసూదన్‌గుప్తా అన్నారు. గురువారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యవాద పోరాట ముసుగులో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను కూల్చివేయటం సిగ్గుచేటని అన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సమైక్యవాదానికి ఇందిరాగాంధీ ప్రతిరూపమైతే, సామరస్యవాదానికి, అభ్యుదయానికి రాజీవ్‌గాంధీ ప్రతిరూపమన్నారు. వైఎస్ నిర్వాకంతోనే తెలంగాణా పోరాటానికి అంకురార్పణ జరిగిందన్నది వాస్తవం కాదాయని ఆయన వైఎస్‌ఆర్‌సిపిని ప్రశ్నించారు. తెలంగాణ ప్రకటనపై యుపిఎ ప్రభుత్వం పునఃసమీక్షించుకునేలా వత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే తెలుగుదేశం, వెకాపా, సిపిఐ, బిజెపిలు సమైక్యవాదానికి మద్దతుగా లేఖలిస్తే యుపిఎపై వత్తిడి తెచ్చేందుకు సిద్ధమన్నారు. రాజీనామాలు, విధ్వంసాల వలన సమైక్యాంధ్ర రాదన్నారు. రాజీనామాలపై తనకు నమ్మకం లేదన్నారు. డిసిసి అధ్యక్షుడిగా పార్టీని నడిపించాల్సిన గురుతర బాధ్యత ఉందన్నారు. అసెంబ్లీలో తెలంగాణానికి కోరం ఉందన్నారు. తాము రాజీనామా చేయటం వలన వారికి ప్రయోజనం చేకూర్చినట్లవుతుందన్నారు. తాను ప్రజా నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత డిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులతో కలిసి విగ్రహాలు ధ్వంసం చేసిన ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నా యకులు దాదాగాంధీ, రషీద్ అహమ్మద్, సాయిరాం, శం కర్, రవిశంకర్‌రెడ్డి, వేణుగోపాల్, నాగరాజు, ఖలీఖుల్లాఖా న్, విజయభాస్కరరెడ్డి, వేణు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
లోకాయుక్త వలలో బుడా గుమస్తా
బళ్ళారి, ఆగస్టు 1: ఒక కేసుకు సంబందించి బళ్ళారి డెవలప్‌మెంట్ అథారిటి బుడాలో గుమస్తాగా పనిచేస్తున్న నాగరాజు ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుంటు లోకాయుక్త అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే స్థానిక మోతిసర్కిల్ సమీపంలోనున్న బుడా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న గుమస్తా నాగరాజు అనంతపురం రోడ్డులోనున్న రాఘవేంద్ర కాలనీ రెండవ స్టేజి 20-30 సైజ్‌కు సంబంధించి సైట్ యజమాని రాయచూరుకు చెందిన వెంకటేశ్ ఖాతా మార్పుకు సంబంధించి రూ.50వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. తన తల్లి పేరుమీదున్న భూమిని తన పేరుకు చేసుకోవాడానికి ముందుగానే రూ.10వేలు ఇచ్చినట్లు, తదుపరి మొత్తాన్ని మరల ఇవ్యాలంటూ నాగరాజు డిమాండ్ చేశారని, దీనితో వెంకటేశ్ రాయచూరు లోకాయుక్తా అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న లోకాయుక్తా అధికారులు బళ్ళారి జిల్లా లోకాయుక్తా అధికారులకు విషయం అందించారు. ఈనేపథ్యంలో గురవారం ఉదయం రాయచూరు నుంచి బళ్ళారి లోకాయుక్త పోలీస్ అధికారులకు వెంకటేశ్ ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఇన్‌స్పెక్టర్ రమేశ్ తన సిబ్బందితో బుడా కార్యాలయంపై దాడి చేశారు. ఇదే సమయంలో గుమస్తా వెంకటేశ్ నుండి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండ్‌గా పట్టుపడ్డాడు. నిందితుని తమ ఆధీనంలో తీసుకొని విచారణ చేపట్టారు.
ఎస్కేయూలో బలగాల మోహరింపు

*చుట్టుపక్కల గ్రామాల ప్రజల నిరసన
* రెండో రోజుకు చేరిన ఆమరణ దీక్ష
అనంతపురం సిటీ, ఆగస్టు 1: శ్రీకృష్ణదేవరాయుల విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న ఉద్యమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా రెండవ రోజు కూడా జెఎసి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి శాంతియుతంగా బంద్ నిర్వహించారు. రెండవ రోజు ఎస్కేయూ మెయిన్ గేట్ వద్ద బంద్ చేయడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు భారీగా మద్దతును తెలిపి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎస్కేయూ మెయిన్ గేట్‌కు ఇరువైపులా రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఉదయం పది గంటలు ఉరితీసిన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆకుతోటపల్లిలో ఉన్న వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ఎస్కేయూ మెయిన్‌గేట్ వరకు ర్యాలీ నిర్వహించి మద్దతును తెలియజేసారు. ఎస్కేయూ ప్రొఫెసర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం కూడా ఎస్కేయూ బంద్ పాటించనున్నట్లు జెఎసి నాయకులు తెలిపారు.
భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం ....
సీమాంధ్రకు చెందిన మంత్రులు తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్కేయూలో విద్యార్థులు రెండంతస్తుల భవనంపైకి ఎక్కి నినాదాలు చేశారు. విద్యార్థులు నరసింహారెడ్డి, ప్రతాప్, అమర్‌నాథ్, ఓబిలేసు, నాగరాజు, రమేష్, మాదన్నలు భవనంపై ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయారు. మంత్రులు రాజీనామాలు చేశారని జెఎసి నాయకులు సదాశివారెడ్డి వారికి తెలపడంతో కిందకు దిగి వచ్చారు.
నగరంలో ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నగరంలోని శ్రీ సత్యసాయి బాలవికాస్ స్కూల్‌లోని విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సమైక్యాంధ్ర ముద్దు తెలంగాణ వద్దు అనే నినాదాలలు చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత కృష్ణవేణి, డైరెక్టర్ రవిచంద్రారెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు చేసిన ప్రకటనలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్‌ఎంలు రమాదేవి, కేశవయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జి చేయడం అమానుషం
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గురువారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై జిల్లా ఎస్పీ శ్యాంసుందర్, స్పెషల్ పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషమని మన విద్యార్థి సత్తా జిల్లా అధ్యక్షుడు అమర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అమర్ యాదవ్ మాట్లాడుతూ శాంతియుతంగా సమైక్య ఉద్యమాలు చేస్తున్న విద్యార్థి నాయకులను, విద్యార్థులను అడ్డుకోవడం చాలా దారుణమన్నారు. విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం చూస్తే ఎస్పీ తెలంగాణవాదులకు కొమ్ముకాస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు. కావున ఎస్పీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మల్లికార్జున, సాగర్, హరీష్, సంతోష్, రమేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి
యుపిఎ ప్రభుత్వం సిడబ్ల్యూసి సమావేశంలో రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ప్రతినిధుల ఇళ్లను ఉపాధ్యాయ జెఎసి నాయకులు ముట్టడించారు. గురువారం స్థానిక ఎన్‌జిఓ హోమ్ నుండి ఉపాధ్యాయులు ర్యాలీగా బయలుదేరి సప్తగిరి సర్కిల్, విద్యుత్ నగర్ సర్కిల్ మీదుగా ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్, అనంతపురం ఎంపి అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే కేశవ్, పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి ఇళ్లను ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులకు, జెఎసి నాయకుల మధ్య కొంత సమయం వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ జెఎసి నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం లోపు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు సమైక్య ఉద్యమంలో పాల్గొనాలన్నారు. రాష్ట్ర విభజనను ఉపాధ్యాయులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ జెఎసి నాయకులు నరసింహులు, రామచంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, కె.హరికృష్ణ, రామాంజనేయులు, చలపతి, రామన్న, అంజయ్య, నారాయణస్వామి, రాజశేఖర్, రత్నం, కె.వెంకటరెడ్డి, పిఇటి నాగరాజు ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో విభజన సెగలు సద్దుమణగలేదు
english title: 
v

ఉద్ధృతమైన ఉద్యమం

$
0
0

కడప, ఆగస్టు 1 : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో మొదలయిన సమైక్యాంధ్ర ఉద్యమం పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో ఉధృతమవుతోంది. ఓ పక్క సమైక్యాంధ్ర, విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ఆందళనలు సాగుతుండగా మరోపక్క వైకాపా, టిడిపి నేతలు కూడా రోడ్డెక్కడంతో ఉద్యమం వేడెక్కుతోంది. అది క్రమంగా విధ్వంసాలకు దారితీస్తోంది. గురువారం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎస్‌ఎండి అహ్మదుల్లా, సి.రామచంద్రయ్యలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమండ్ చేస్తూ ఆందోళనకారులు వారి ఇళ్లను ముట్టడించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు సోనియా గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనంతరం శవయాత్ర నిర్వహించారు. కడప సమీపంలోని మామిళ్లపల్లిలో ఇందిరాగాంధీ విగ్రహానికి నిప్పుపెట్టారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి చెప్పుల దండ వేసి పాక్షికంగా ధ్వంసం చేశారు. బద్వేల్‌లో ఆందోళనకారులు గడ్డి ట్రాక్టర్‌ను తగులబెట్టారు. హోరున వర్షం కురుస్తున్నా ఆందోళన ఆగలేదు. ఎర్రగుంట్లలో ఆర్టీపీపీ ఉద్యోగులు రెండవ రోజు కూడా ఆందోళన సాగించారు. ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి సంచలనం రేపాడు. సమైక్యాంధ్ర జెఏసీ కస్వీనర్ ఎస్ రామచంద్రారెడ్డి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన అమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు, విద్యార్థులు, కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు, న్యాయవాదులు రామచంద్రారెడ్డికి సంఘీభావం తెలుపుతూ ఉద్యమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైకాపా నాయకులు, కార్యకర్తలు మోటార్‌బైక్ ర్యాలీ చేశారు. మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత పసుపులేటి బ్రహ్మయ్య జెఎసి నాయకులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రవేటు వాణిజ్య సంస్థలను మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పలు ప్రాంతాల్లో బ్యాంకులు, పోస్ట్ఫాసులు, ప్రభుత్వ, ప్రవేటు రంగ సంస్థల ఉద్యోగులంతా మూకుమ్మడిగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో ఎక్కడ బస్సులను అక్కడ నిలిపివేశారు. ఆర్టీసీ అద్దె బస్సులు, ప్రవేటు వాహనాలను ఎక్కడ తిరగనీయలేదు. 18వ కర్నూల్ - చిత్తూరు, ముంబై - చెన్నై జాతీయ రహదారులపై సమైక్యాంధ్ర ఉద్యమకారులు మోహరించడంతో వందలాది వాహనాలు రోడ్లపై బారులు తీరాయి. సమైక్యాంధ్ర ఉద్యమకారులు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని శివారు ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా పెద్దరాళ్లను పడేశారు. కడపలో బుధవారం రెండు ఏటిఎంలు ధ్వంసం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎటిఎంలు పని చేయకపోవడంతో ఆర్థిక వ్యవహరాలు స్తంభించిపోయాయి. జిల్లాకు చెందిన ఉద్యమకారులతో జిల్లా ఎస్పీ, కలెక్టర్ సంప్రదింపులు చేశారు. ఆందోళనకారులు బంద్‌ను పాటించే సమయంలో కేంద్రానికి చెందిన 7 కంపెనీల బలగాలు, సివిల్ పోలీసులు ఆందోళనకారులను అనుసరిస్తూ పెద్దఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిల ఇళ్ల వద్ద ప్రవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ఎదుట కేంద్ర, స్థానిక పోలీస్ బలగాలను భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ ఉద్యమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సమైక్యాంధ్ర జెఏసీతో కలసి పనిచేస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో మానవహారాలు ఏర్పాటు చేసి, కెసిఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. జెఏసీ గౌరవాధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, జెఏసీ నేతలు రమణయ్య, నాగిరెడ్డి, టిడిపి నేత పుత్తా నరసింహారెడ్డి, కో-కన్వీనర్ ఎస్.గోవర్ధన్‌రెడ్డి, మంత్రి అహ్మదుల్లా తనయుడు హల్త్ఫా, అమీర్‌బాషా, బాలక్రిష్ణాయాదవ్, వైకాపా తరపున కడప ఇన్‌ఛార్జి అంజాద్‌బాషా, నిత్యానందరెడ్డి, అఫ్జల్‌ఖాన్, కాంగ్రెస్ నేలు నీలి శ్రీనివాసులు, అఫ్జల్, రాజా వెంగళరెడ్డి, అవ్వారు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం
* చిత్తశుద్ధి ఉంటే ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్
కడప, ఆగస్టు 1 : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గురువారం జరిగిన బంద్ సందర్భంగా ఆందోళనకారులు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీల తదితర నేతలపై విరుచుకు పడ్డారు. ఒకవైపు సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి శవయాత్ర చేస్తూ, మరో ప్రక్క జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన నేతల ఇళ్లను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజాప్రతినిథుల అసమర్థత వల్లే రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిందని ధ్వృజమెత్తారు. వారికి రాజకీయంగా పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఓ పక్క విభజన జరిగిపోతోందని సంకేతాలు వెలువడుతునప్పటికీ అధికార పార్టీ నేతలు చేతులకు గాజులు వేసుకుకుని కూర్చున్నారన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా స్పందించిన నేతలు ఇప్పటికీ గట్టి నిర్ణయం తీసుకుని పోరుబాటలోకి రావడం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఉధృతంగా ఆందోళన జరిగిన సమయంలో అధికార పార్టీ నేతలు నోరు మెదపక పోగా అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమంటూ కొంప ముంచారని ఆరోపించారు. ఇప్పట్లోనే ఉద్యమాన్ని ఉధృతంగా సాగిస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు రాజీనామాలు చేయని పక్షంలో వారి ఇళ్లను ముట్టడించి, సామాజికగం బహిష్కరిస్తామని హెచ్చరించారు.

అనూహ్య ఫలితాలపై అంతర్మథనం
* పల్లెపోరులో తగ్గిన హవాపై వైకాపా మల్లగుల్లాలు
* డీలా పడ్డ కాంగ్రెస్, టిడిపి నేతలు
కడప, ఆగస్టు 1 : జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిపై ప్రధాన పార్టీల నేతలు పోస్టుమార్టం ప్రారంభించారు. తమ తమ పార్టీల మద్దతుదారుల గెలుపు, ఓటములు, దక్కి న ఓట్లను బేరీజు వేస్తున్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్వంత జిల్లాలో వైకాపా మద్దతుదారులు అధికంగా గెలిచినప్పటికీ నేతలు ఊహించిన స్థాయిలో ఫలితాలు దక్కక పోవడంతో పార్టీ అధిష్ఠానం మదన పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో మ్యాచ్ ఫిక్సింగయ్యారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో మాత్రం ఎవరికి వారుగానే బరిలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు తమకు కీలకమైన గ్రామ పంచాయతీల్లో గెలుపొందడంతో వైకాపా నేతలు సమాలోచనలో పడ్డారు. మూడు విడతల ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులకు 405 పంచాయితీలు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు 145, కాంగ్రెస్ మద్దతుదారులకు 176 గ్రామ పంచాయతీలు దక్కాయి. తొలి, మలివిడతలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అంతంత మాత్రమే పోటీ చేసి 75 గ్రామ పంచాయితీలను మాత్రమే చేజిక్కుంచుకున్నారు. మలి విడతలో జమ్మలమడుగు నియోజకవర్గంలో అధిక స్థానాలు చేజిక్కించు కోవడంతో తెలుగుదేశం పార్టీ బలం మూడో విడతలో మరింత పెరిగింది. ఈ ఊపులో మరో 73 గ్రామ పంచాయితీలను దక్కించుకుంది. జమ్మలమడుగులో దేవగుడి సోదరులు ఒకరు వైకాపా, మరొకరు కాంగ్రెస్ మద్దతుదారులతో ఉమ్మడి పోరు సాగించారు. మొత్తం మీద ఇద్దరూ టిడిపి మద్దతుదారులతో పోటీ పడ్డారు. అయినా అక్కడ అక్కడ టిడిపి మాజీ మంత్రి పి రామసుబ్బారెడ్డి వర్గీయులకే అధిక స్థానాలు దక్కాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా దిగిన వైకాపా రెబల్స్ 56 గ్రామ పంచాయతీలను చేజిక్కించుకున్నారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గానికి చెందిన వేంపల్లెలో వైకాపా మద్దతుదారునిపై తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు స్వయంగా ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి సోదరుడు విష్ణువర్ధన్‌రెడ్డి గెలుపొందడంతో వైకాపాకు గట్టి దెబ్బ తగిలింది. మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు ఊహించిన స్థాయిలో గ్రామ పంచాయతీలు దక్కక పోవడం ఆ పార్టీ నేతలను ఆలోచనలో పడేసింది.

ఇక మునిసిపల్ పోరు
* రిజర్వేషన్లకు నోటిఫికేషన్ జారీ
* అందరి కళ్ళూ అందలంపైనే
కడప, ఆగస్టు 1 : రాష్టవ్య్రాప్తంగా నగర, పురపాలక సంఘాల్లో వార్డుల రిజర్వేషన్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో పట్టణాల్లో రాజకీయ వేడి రగులుకుంది. జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల ప్రమేయం లేకుండా గుర్తులతోనే ఎన్నికలు జరగడంతో ఎవరి దారిలో వారు నానా తంటాలు పడి అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇందుకు భిన్నంగా మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో పోటీ చేయాల్సి రావడంతో నేతల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్‌తో వైకాపా అభ్యర్థులను పలు చోట్ల ఓటమి పాలు చేశారు. పురపాలక ఎన్నికల్లో పార్టీ గుర్తులతో పోటీ చేయాల్సి రావడంతో మ్యాచ్‌ఫిక్సింగ్‌లను పక్కన పెట్టి నేతలు గెలుపుగుర్రాల అనే్వషణలో వెతుకులాట ప్రారంభించారు. జిల్లాలో కడప కార్పొరేషన్, రాయచోటి, రాజంపేట, బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, యర్రగుంట్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో వార్డుల రిజర్వేషన్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యింది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో జమ్మలమడుగు, పులివెందుల అసెంబ్లీ సెగ్మంట్స్‌లో మినహా అన్ని నియోజకవర్గాల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరిగాయి. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుల కేటాయింపు వల్ల అధిక ఓట్లు ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల కోసం నేతలు అనే్వషిస్తున్నారు. గ్రామ పంచాయితీల ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎత్తులు, పైఎత్తులతో తమదైన శైలిలో అభ్యర్థుల వేటలో దిగారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులది గెలుపుకాదని, బలుపని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు తుదివిడత ఎన్నికల అనంతరం ప్రచారం చేస్తున్నారు. మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలపై వైకాపా నేతలు ఆశలు పెట్టుకున్నారు. త్వరలో చైర్మన్ పదవులకు కూడా రిజర్వేషన్లు ప్రకటించేలోపు కార్పోరేషన్‌లో డివిజన్‌లకు, మున్సిపాలిటీల్లో వార్డులకు అభ్యర్ధులను ఖరారు చేయాలని అన్ని పార్టీల నేతలు హైరానా పడుతున్నారు.

ఊపందుకున్న సమైక్యాంధ్ర ఉద్యమం
* రాజంపేట ఎంపి అచూకీపై స్టేషన్‌లో ఫిర్యాదు
రాజంపేట రూరల్, ఆగస్టు 1 : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరు తూ చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం రెండవ రోజు తీవ్రస్థాయి లో జరిగింది. ఒక్కసారిగా వివిధ స్వచ్చంధ సంస్థలు, వ్యాపార, ప్రభు త్వ, ప్రవేటు ఉద్యోగ సంఘాలు ఈ ఉద్యమంలో స్వచ్చంధంగా పాల్గొనడంతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉదృతరూపం దాల్చింది. ముందుగా స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేశారు. జెఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక, కర్షక, విద్యా ర్థి సంఘాల నాయకులు పాల్గొని ఆం దోళన చేపట్టారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి ర్యాలీగా వస్తూ రాజంపేట ఎంపి గత రెండు రోజులుగా కన్పించలేదని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జెఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, ఖజానా కార్యాలయాల్లోని ఉద్యోగులు స్వచ్చంధంగా ఈ బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని జెఏసీ పిలుపుతో వారు విధులను బహిష్కరించి బంద్‌లో పాల్గొన్నారు. కెసిఆర్, సోనియాగాంధీల దిష్టిబొమ్మలతో పురవీధుల్లో ర్యాలీ చేశారు. ఇందుకు మాజీ మంత్రి, దేశం ఇన్‌ఛార్జి పసుపులేటి బ్రహ్మయ్య మద్దతు తెలిపి ఉద్యమంలో పాల్గొన్నారు. స్థానిక సబ్ కలెక్టరేట్‌కు చేరుకుని రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సబ్ కలెక్టర్ ప్రీతిమీనాను కోరారు. అనంతరం వ్యాపార సంఘాలు, స్వర్ణకారులు కలసి పాతబస్టాండ్ కూడలిలో మానవహారంగా ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి, సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ నాయకులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసి, ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం విడిపోతున్నదన్న సమాచారం కాంగ్రెస్ మంత్రులు, ఎంపిలకు తెలిసినప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర సమైక్యత కోసం పాటుపడక పోవడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. నేతలను గ్రామాల్లో తిరగనివ్వకుండా తరమి తరమి కొట్టాలని వారు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం విడివిడిగా ఉద్యమాలు చేపట్టకుండా అందరూ కలసికట్టుగా ఒకే తాటిపై నడిచి ఉద్యమాలు నిర్వహించాలని కార్మిక సంఘాల నాయకులు సూచించారు. సమైక్యాంధ్ర కోసం కర్నూల్ జిల్లాలో ఇద్దరు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరంగా ఉందని విద్యార్థి సంఘం నాయకులు పరశురాం, ప్రభాకర్, బాలాజీ, రెడ్డయ్య, బ్రహ్మయ్యలు అవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని ప్రాణ త్యాగాలైన చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వెనుకాడబోమని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి సంఘ నేతలు పాల్గొన్నారు.
ఉద్యమం మరింత ఉద్ధృతం
కడప (టౌన్), ఆగస్టు 1 : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నగరంలో నిర్వహిస్తున్న ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని సమైక్యాంధ్ర జెఎసి నిర్ణయించింది. జెఎసి నాయకుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గురువారం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలో ఉద్యమ కార్యాచరణను రాయలసీమ పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్షుడు రమణయ్య ప్రకటించారు. ఇందులో భాగంగా నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే బస్సులు, పాఠశాలలు, కళాశాలలకు వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. రాస్తారోకోలు, నాయకులు ఇళ్ల ముట్టడి కార్యక్రమం ఉంటుందన్నారు. అయితే శాంతియుతంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, టిడిపి నేతలు ఎస్ గోవర్దన్‌రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైకాపా నాయకుడు నిత్యానందరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం ప్రతి ఒక్క తెలుగువాడి కష్ట్ఫలితంగానే అభివృద్ధి చెంది మహానగరంగా ఆవిర్భావించిందన్నారు. దీన్ని పొగొట్టుకోవాలంటే శరీరంలో తలలేని మొండెంలా కాశ్మీర్ లేని భారతదేశంలా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తెలంగాణను ప్రకటించేటప్పుడు మూడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా తెలంగాణకు హైదరాబాద్‌ను, కొస్తాకు పోలవరం ఇచ్చారని, రాయలసీమకు మాత్రం రాళ్లు మిగిలాయన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల యాజమాన్యం, ఉద్యోగ సంఘాలు, ప్రజలు పాల్గొన్నారు.
ఉద్యమం ముసుగులో విధ్వంసాలు
* కాంగ్రెస్ అధికార ప్రతినిధి మురళి
కడప,(కల్చరల్) ఆగస్టు 1 : సమైక్యాంధ్ర ఉద్యమం ముసుగులో విధ్వంసాలకు పాల్పడుతున్న అరాచక శక్తులను పోలీసులు అరెస్టు చేయాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళి, నాయకులు గౌస్‌పీర్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కేవలం కాంగ్రెస్‌ను దోషులుగా చూపడం రాజకీయ లబ్ధిపొందేందుకే అన్నారు. వైకాపా, టిడిపిలు విధ్వంసాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటించిందన్నారు. అంతమాత్రాన ఒక్క కాంగ్రెస్ పార్టీనే దోషిని చేస్తూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలు ధ్వంసం చేయడం సరికాదన్నారు. పోలీసులు దాడులు జరిపిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు బాలసుబ్రమణ్యం, నిజాం, శ్రీరాము లు, ఖలందర్, విఠల్ ప్రసాద్, నారాయణ, హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

జమ్మలమడుగు వద్ద పెన్నానదిలో
నాటు బాంబులు లభ్యం
జమ్మలమడుగు, ఆగస్టు 1 : జమ్మలమడుగు పెన్నానది పరీవాహక ప్రాంతంలో గురువారం సాయంత్రం 50 నాటుబాంబులను పోలీసులు కనుగొన్నారు. దీంతో జమ్మమడుగు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఈ విషయమై డియస్పీ జాన్‌మనోహర్ మాట్లాడుతూ పోలీసులకు అందిన సమాచారం మేరకు పెన్నానది పరీవాహక ప్రాంతానికి వెళ్లి పరిశీలించామన్నారు. ఆ ప్రాంతంలో మూడు బకెట్లతోపాటు 50 నాటు బాంబులున్న మరో బకెట్ లభ్యమైందన్నారు. ఈ సంఘటనపై విచారణ చేస్తామన్నారు. డిఎస్పీ వెంట అర్బన్ సిఐ రవిబాబు, పోలీసు సిబ్బంది వున్నారు.
ఉలిక్కిపడ్డ జమ్మలమడుగు
పెన్నానది పరీవాహక ప్రాంతంలో ఒకే సారి 50 నాటు బాంబులు పోలీసులకు లభ్యమవడంతో ప్రశాంతంగా వున్న జమ్మలమడుగు ప్రజలు ఉలిక్కిపడ్డారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు జమ్మలమడుగు ప్రాంతంలో జరిగాయి. ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు ముశాయని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బాంబులు బయటపడడం అందరినీ కలవరపెడుతోంది. ఇప్పటికే జమ్మలమడుగు ఫ్యాక్షన్‌గడ్డగా పేరుంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన మరుసటి రోజే పెద్ద ఎత్తున బాంబులు బయటపడడం జమ్మలమడుగు ప్రాంతంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తడాకా చూపిస్తామన్న ప్రతినిధులు ఎక్కడ?
* సిపిఎం జిల్లా కార్యదర్శి నారాయణ
కడప,(కల్చరల్) ఆగస్టు 1 : ‘రాష్ట్రాన్ని విడదీస్తే మా సత్తా.. తడాకా చూపిస్తాం’ అంటూ ప్రగల్బాలు పలికిన సీమాంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.నారాయణ ప్రశ్నించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రపై భూర్జువా పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటన చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలో ఒక మాట, సీమాంధ్రలో మరోమాట మాట్లాడుతున్న ఒకే పార్టీకి చెందిన నాయకుల ధ్వంధ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలను మోసం చేయడానికి భూర్జువా రాజకీయ పార్టీలు నాటకం ఆడుతున్నాయన్నారు. వీటిని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాయకులు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లయితే పార్లమెంట్, అసెంబ్లీలో తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ విధమైన ఒత్తిడిని ప్రజలు నాయకులపై తీసుకోవాలన్నారు. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు అని కాదు, జాతి, మాట్లాడే భాష, జీవన విధానం ఆధారంగా ఏర్పాటైన రాష్ట్రాలు మనవని గుర్తుచేశారు. రాష్ట్రం సమైక్యాంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ విషయం శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదనీ, ఇల్లు అలకగానే పండుగ కాదన్నారు. సిడబ్లుసి ప్రకటన చేసినంత మాత్రాన తెలంగాణ వచ్చినట్లు కాదని స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీలో తీర్మానం చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందన్నారు. భూర్జువా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపిలు అసెంబ్లీ , పార్లమెంట్‌లో సమైక్యాంధ్ర మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పెట్రోల్ రూ 100
రాయచోటి, ఆగస్టు 1 : రెండు రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో రాయచోటిలో లీటర్ పెట్రోల్ 100 రూపాయలు పలికింది. రెండు రోజులుగా ఎక్కడా కూడా పెట్రోల్ బంకులు తెరవలేదు. దీంతో పెట్రోల్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. బంద్ ప్రభావంతో బస్సులు, ఇతర వాహనాలు ఏవీ తిరగడం లేదు. ఈ నేపథ్యంలో ఏ పని చేయాలన్నా ద్విచక్రవాహనాలు తప్పనిసరి అయ్యాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మతబడ్డ బంకుల్లో పెట్రోల్ తీసుకొచ్చి బయట అధిక రేటుకు విక్రయిస్తున్నారు. చేసేది లేక వారు చెప్పిన రేటుకు కొనాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధం
వేంపల్లె, ఆగస్టు 1 : సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాని ఎమ్మెల్సీ సతీష్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం స్వగృహంలో తనను కలిసిన సమైక్యాంధ్ర జెఎసి నేతలతో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం పదవితో పాటు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. తర్వాత సమైక్యవాదులు స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

* సమైక్య నినాదాలతో మార్మోగిన జిల్లా * ఇందిర, రాజీవ్ విగ్రహాల ధ్వంసం, దహనం * సోనియా, కెసిఆర్ దిష్టిబొమ్మల శవయాత్ర, దగ్ధం * రెండవ రోజుకు చేరిన జెఎసి నేత ఆమరణ దీక్ష * సెల్‌టవర్ ఎక్కిన యువకులు
english title: 
u

భక్తులు లేక తిరుమల వెలవెల

$
0
0

తిరుపతి, ఆగస్టు 1: రాష్ట్ర విభజన నేపధ్యంలో సీమాంధ్రలో ఉవ్వెత్తున లేచిన సమైక్య ఉద్యమంతో కలియుగ ప్రత్యక్షదైవం అయిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా గురువారం కేవలం 40 వేల మంది మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ కేవలం 19 వేల మంది మాత్రమే స్వామివారిని దర్శించుకోవడం గమనార్హం. గతంలో కొన్ని సందర్బాల్లో తిరుమలలో రద్దీ తగ్గినప్పటికి ఈ స్థాయిలో రద్దీ తగ్గిన దాఖలాలు లేవు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు అర్ధగంట, 50 రూపాయలు క్యూలలో వెళ్లే భక్తులకు ఒకటిన్నర గంట, సర్వదర్శనం క్యూలో వెళ్లే భక్తులకు రెండుగంటల సమయం పడుతోంది. సాయంత్రం 6 గంటల వరకూ మూడు కంపార్ట్‌మెంట్లలో ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు, ఐదు కంపార్టుమెంట్లలో కాలిబాట భక్తులు, 15 కంపార్టుమెంట్లలో సర్వదర్శనం భక్తులు వేచి వున్నారు. ఇతర ప్రాంతాలనుంచి బస్సులు తిరుపతికి రాకపోవడంతో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు తిరుమలలోనే బస చేసి పలుమార్లు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అయితే రద్దీతగ్గినా స్వామి ఆదాయం తగ్గలేదని టిటిడి అధికారులు తెలిపారు.

ప్రజలను మభ్యపెట్టే రాజీనామాలు చేయను
* కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామా చేయాలి
* సమైక్యాంధ్ర వచ్చేంత వరకు దీక్షలు ఆగవు
* సీమాంధ్రులను అరెస్టుచేస్తే
ఉంచేందుకు జైళ్లు చాలవు
* చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబు స్పష్టం
చిత్తూరు, ఆగస్టు 1: ప్రజలను మభ్యపెట్టి, ఫొటోలకు ఫోజులిచ్చే రాజీనామాలు తాను చేయడంలేదని, స్పీకర్ ఆమోదించేటట్లయితే సత్వరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చిత్తూరు శాసన సభ్యులు సికె బాబు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన చిత్తూరు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద దీక్షా శిబిరంలో విలేఖర్లతో మాట్లాడుతూ పలువురు ఇప్పుడు ఫొటోలకు ఫోజులిచ్చి ఉత్తుత్తి రాజీనామాలు చేస్తున్నారని విమర్శించారు. రాజీనామాలను స్పీకర్ ఆమోదించేటట్లయితే సత్వరం తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తనకు సమైక్యాంధ్రా కావాలని ఆయన అన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రులు వారి పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర కోసం సిఎంపై వత్తిడి తేవాలని ఎమ్మెల్యే అన్నారు. కేంద్రమంత్రులు, ఎంపిల రాజీనామాతోనే సమస్యకు ఒక పరిష్కార మార్గం లభిస్తుందన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాల ధ్వంసం దురదృష్టకరమని ఎమ్మెల్యే అన్నారు. సీమాంధ్రలో పోలీసు కేసులకు భయపడేవారు ఎవ్వరూ లేరన్నారు. అలా పోలీసులు అరెస్టుచేస్తే తామందరినీ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఉండే జైళ్ళు సరిపోవని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలు గట్టిగా ఊపిరి పీల్చి వదిలితే ఆ గాలికి కెసిఆర్ కొట్టుకుపోతారని, తమగురించి మాట్లాడే అర్హత అతనికి లేదని సికె తేల్చి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉన్నా ప్రత్యేక తెలంగాణా ఇస్తే పరిస్థితి ఇలాగే ఉండేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని, దాన్ని ముక్కలు చేస్తే ఊర్కోనే పరిస్థితుల్లో ఇక్కడ ఎవ్వరూ లేరన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రకటించేవరకు ఈ ఉద్యమాలు ఆగవని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. సమైక్యవాదులారా అందరూ కలసి రండి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుదామంటూ చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబు విలేఖర్ల సమావేశంలో పిలుపునిచ్చారు.

సమైక్యాంధ్ర కోసం
మదనపల్లె ఎమ్మెల్యే రాజీనామా
* ఎమ్మెల్యే షాజహాన్‌బాషా రిలే దీక్ష
మదనపల్లె, ఆగస్టు 1: యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటించడం అర్ధరహితం అని, సీమాంధ్రుల మనోభావాలు తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని తెలంగాణా ప్రకటించడం సరికాదని అసెంబ్లీ సమావేశాలకు ముందే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు మదనపల్లె ఎమ్మెల్యే ఎం షాజహాన్‌బాషా పేర్కొన్నారు. గురువారం ఉదయం నుంచి వివిధ సంఘాల, ప్రజలు, విద్యార్థులు ఐక్యంగా సమైక్యాంధ్రకై ఎమ్మెల్యే కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆందోళన చేయడం, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధ్యాహ్నం ప్రాంతంలో మదనపల్లెకు చేరుకుని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ బెంగళూరుబస్టాండు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుటే రిలేదీక్ష చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యకార్యచరణ కమిటీతో కలిసి సమైక్యత కోసం ఉద్యమాలు చేపడతానని ఎమ్మెల్యే షాజహాన్ ప్రకటించారు. రాత్రి 8గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే దీక్షను నిమ్మరసంతో విరమింపజేసి సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగప్ప, లక్ష్మీనారాయణ, చినబాబు, బషీర్, ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు, యుపిఎఫ్ నాయకులు రవిప్రకాష్ తదితరులు ఉన్నారు.

పిసిసి సంయుక్త కార్యదర్శి పదవికి నవీన్‌కుమార్‌రెడ్డి రాజీనామా
తిరుపతి, ఆగస్టు 1: జిల్లాలో ముఖ్యమంత్రికి అత్యంత ముఖ్య సన్నిహితుడుగా ఉన్న నవీన్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజనకు మనస్థాపం చెంది తన పిసిసి సంయుక్త పదవికి రాజీనామా చేస్తూ గురువారం పిసిసి ఆధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫాక్స్ ద్వారా రాజీనామా పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ముక్కలు కావడాన్ని జీర్ణించుకోలేక తాను తన పిసిసి సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తరతరాల తెలుగువారిని విడదీయడాన్ని ఎవ్వరు జీర్ణించుకోలేరన్నారు. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లోనే పార్టీల జెండాలు, అజెండాలు పక్కన పెట్టి సమైక్యాంధ్ర నినాదంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు రోడ్లపైకి రావాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. అన్ని పార్టీలు ఒకె అజెండాతో ఉద్యమిస్తే అనుకున్నది సాధించుకోవచ్చునన్నారు. సిడబ్ల్యుసి నిర్ణయం శాసనం కాదని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును అన్ని పార్టీలు ఏకమై వ్యతిరేకిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చునన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విగ్రహాలను, పదవులు త్యాగం చేసిన త్యాగమూర్తుల విగ్రహాలను ధ్వంసం చేయడం అనాగరికమన్నారు. శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడిపి అనుకున్నది సాధించుకోవచ్చునన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు. ఇందుకు మహాత్మాగాంధీ సిద్ధాంతమే నిదర్శనమన్నారు.

నెహ్రూ విగ్రహం ధ్వంసం
పలమనేరు, ఆగస్టు 1: పలమనేరు పట్టణంలోని స్వాతంత్య్ర ఉద్యమనాయకుడు, భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ విగ్రహాన్ని రాయలసీమ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు గురువారం ధ్వంసం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న నిరసన దీక్షల్లో సోనియాకు వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ రాయలసీమ ఐక్యవేదిక కార్యకర్తలు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈకార్యక్రమంలో రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షులు నగరం బాలాజీ, సైదుల్లా తదితరులు ఉన్నారు. పట్టణంలో ఎంతో చారిత్రాత్మకమైన ఈ విగ్రహాన్ని ధ్వంసంచేయడం అమానుషమని స్వతంత్య్ర సమరయోధులు వాపోతున్నారు.

చంద్రగిరిలో రైల్వే స్టేషన్‌కు నిప్పు
* నడిరోడ్డుపైన చెవిరెడ్డి స్నానాలు, వంటా వార్పు
చంద్రగిరి, ఆగస్టు 1: రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ గత రెండురోజులుగా జరుగుతున్న సీమాంధ్ర బంద్ గురువారం చంద్రగిరిలో కూడా సంపూర్ణంగా జరిగింది. వైఎస్‌ఆర్‌సిపి నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. నడిరోడ్డుపైనే స్నానాల కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రగిరి కోటపైకి ఎక్కి ఆందోళన చేసేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో ఉద్యోగులు నాగాలమ్మ మలుపు వద్ద జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి, మదుసూదన్‌రావు, సురేష్, సురేంద్రనాద్‌రెడ్డి, చంద్రమోహన్, జయలక్ష్మి, లలతకుమారి, కొండయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌పార్టీ కార్యదర్శి షఫీ ఆధ్వర్యంలో ఐతేపల్లిలో గ్రామస్ధులు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. రంగంపేటలో రాకేష్ ఆధ్వర్యంలో గ్రామస్ధులు గంటపాటు రాస్తారోకో చేశారు. వంటావార్పు, స్నానాల కార్యక్రమంలోచెవిరెడ్డితో పాటు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీరాములు, యుగంధర్, కేశవులు, నాగరాజు తదితరులు వంటావార్పులో పాల్గొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు చంద్రగిరి రైల్వే స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఇది ఆందోళనకారులు చేసిన పని కాదని, స్విచ్‌బోర్డులో విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా మంటలు ఏర్పడ్డాయని రైల్వే అధికారులు అంటున్నారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఇందిరమ్మ విగ్రహం ధ్వంసం
మదనపల్లె, ఆగస్టు 1: సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఆందోళనలో భాగంగా బుధవారం రాత్రి ఇందిరమ్మ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. అయితే గురువారం రాత్రి ఆ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఒక పక్క ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, కొంతమంది సమైక్యవాదులు ధ్వంసమైన విగ్రహానే్న పూర్తిగా పడగొట్టేశారు. సమీపంలోనే పెద్దమసీదు ఉండటంతో ఆప్రాంతంలో స్పెషల్ పోలీస్ ఫోర్స్ బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్తలు నిమిత్తం పట్టణంలోని ప్రధాన కూడళ్ళవద్ద పికెట్ ఏర్పాటుచేస్తున్నట్లు సిఐ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. బెంగళూరు బస్టాండులోని విగ్రహం ధ్వంసంపై డిఎస్‌పి రాఘవరెడ్డి పరిశీలించారు. అంతేకాకుండ పట్టణంలోని రహదారులు, జాతీయరహదారులలో సమైక్యవాదులు చేసిన విధ్వసకర సంఘటనలను పరిశీలించారు.

వేడెక్కిన సమైక్యాంధ్ర ఉద్యమం
* చిత్తూరులో హోరెత్తిన నిరసనలు
* ఎమ్మెల్యే సికె బాబు దీక్షకు మంచి స్పందన
* మరో శిబిరంలో టిడిపి దీక్షలు
* వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో శవయాత్ర
చిత్తూరు, ఆగస్టు 1: జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమం వేడెక్కింది. బుధవారం సాయంత్రం నుంచి చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబు సమైక్యాంధ్ర కోసం 48గంటల దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో అప్పటి నుండే వేలాది మంది పట్టణ నడిబొడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని సికె బాబు దీక్షకు మద్దతు పలికారు. గురువారం ఉదయం ప్రభుత్వ డాక్టర్లు ఎమ్మెల్యే సికె బాబు దీక్షా శిబిరం వద్దకు వచ్చిన ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేశారు. మరోవైపు చిత్తూరు పట్టణంలోని పలు అసోసియేషన్, బంగారు దుకాణదారులు, వ్యాపారులు, వస్తవ్య్రాపారులు, మండీ యజమాన్యం, పూల వ్యాపారులు తమ తమ మద్దతు తెలిపారు. మరోవైపు పట్టణంలోని సుమారు 10 కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి సికె బాబు తలపెట్టిన సమైక్యాంధ్ర దీక్షకు మద్దతు పలికారు. అలాగే ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జెఎసి నాయకులు, జిల్లా ఎన్‌జివో సంఘం అధ్యక్షులు క్రిష్ణమనాయుడు, ప్రధాన కార్యదర్శి దేవప్రసాద్, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ నాయకులు గంటామోహన్, రెడ్డిశేఖర్‌రెడ్డి, ప్రైవేటు లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పరెడ్డి, చిత్తూరు మండల విద్యాశాఖ, మున్సిపల్ వర్కర్స్, ఆర్టీసీ ఎంప్లారుూస్, జిల్లాపరిషత్ ఉద్యోగులు తదితరులు వేలాదిగా తరలివచ్చి సికె బాబు దీక్షకు మద్దతు పలికారు. ఒకపక్క బంద్ లేదు, కేవలం రిలే దీక్షలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించినా చిత్తూరు పట్టణంలో బంద్ వాతవరణం నెలకొంది. బస్సుల రాకపోకలు అంతంతమాత్రంగా కొససాగాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో సీమాంధ్రలో ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలని నాయకులు ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే సీమాంధ్రలోని మంత్రులు, ఎం.పిలు వారి వారి పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చరిత్రహీనులవుతారని పలువురు హెచ్చరించారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాన్ని విభజించడం ఏమిటని వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా, చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబు, ఆయన సతీమణి సికె లావణ్యబాబు సమైక్యాంధ్ర కావాలంటూ నిరాహార దీక్షకు కూర్చోవడంతో విషయం తెలుసుకున్న అభిమానులు చిత్తూరు నియోజకవర్గ పరిసర మండలాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. రిలే దీక్షలకు ఎక్కువ మంది ప్రజలు హాజరవుతారని ముందుగానే గ్రహించిన పోలీసులు కూడా తగిన బందోబస్తు ఏర్పాటుచేశారు.
జనతాబజార్ కాంప్లెక్స్ వద్ద టిడిపి దీక్షలు
కాగా, తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణంలోని గాంధీ విగ్రహానికి కొంతదూరంలో ఉన్న జనతా బజార్ కాంప్లెక్స్ వద్ద షామియానా వేసి రిలే దీక్షలు చేపట్టారు. ఈ శిబిరంలో మాజీ ఎంపి ఎన్‌పి దుర్గారామకృష్ణ, మహిళా నాయకురాలు వైవి రాజేశ్వరి, బిసి సంఘం నాయకులు విల్వనాధన్, సిఎం విజయాతోపాటు మరికొందరు పాల్గొన్నారు. వారు కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ నినాదాలు చేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేసింది.
వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో శవయాత్ర
చిత్తూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సిపి ఇన్‌చార్జి ఎఎస్ మనోహర్ గిరింపేటలోని తన స్వగృహం నుండి సోనియాగాంధీ శవయాత్ర నిర్వహించారు. గిరింపేట నుండి పలకలు కొడుతూ టపాకాయలు కాల్చుతూ తెలుగువారి మధ్య చిచ్చుపెట్టిన సోనియా అంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గిరింపేట నుండి బిఎస్ కణ్ణన్ జూనియర్ కళాశాల, అంబేద్కర్ విగ్రహం మీదుగా శవయాత్ర సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం సత్వరం తెలంగాణా ప్రకటనను వెనక్కు తీసుకోని పక్షంలో రాష్ట్రంలో ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతాయని హెచ్చరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి ఎంఎస్‌ఆర్ సర్కిల్ మీదుగా గాంధీవిగ్రహం వద్దకు శవయాత్ర చేరుకొంది. అక్కడ సోనియాగాంధీ శవదిష్టిబొమ్మను పలువురు చెప్పులతో, కర్రలతో కొట్టారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మపై కిరోసిన్‌పోసి ఎఎస్ మనోహర్ నిప్పుపెట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు కత్తినరసింహారెడ్డి, కుట్టిరాయల్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో...
సమైక్యాంధ్రకు మద్దతుగా పలు సంఘాలు గాంధీ విగ్రహం వద్ద సోనియాగాంధీ, యుపిఎ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మొదటగా శంకరయ్యగుంట మహిళలు ర్యాలీగా వచ్చి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధంచేశారు. అనంతరం అక్కడే నిరసన దీక్షలు చేస్తున్న సికె బాబుకు మద్దతు తెలిపారు. ఇంకోవైపు పాపుదేశి వెంకటక్రిష్ణమనాయుడు ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సోనియాగాంధీ, కెసిఆర్‌కు వ్యతిరేంగా నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద సోనియాగాంధీ, కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. రిలేదీక్షల్లో ఉన్న సికె బాబుకు మద్దతు తెలిపారు. అలాగే ఎబివిపి, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు రూపేష్‌రెడ్డి, కార్తీక్‌తోపాటు పలువురు విద్యార్థులు గాంధీ విగ్రహం వద్ద అర్థనగ్న ప్రదర్శన చేస్తూ సమైక్యాంధ్రకోసం నినాదాలు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జెఎసి నాయకులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు గాంధీ విగ్రహం వద్ద నిరసనలు, రిలేదీక్షలు చేపట్టారు.

పశ్చిమాన బంద్ విజయవంతం
* మదనపల్లెలో ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసం, కాల్చివేత
* ఎమ్మెల్యే ఇంటెదుట నిరసనలు
మదనపల్లె, ఆగస్టు 1: రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గురువారం నిర్వహించిన రెండోరోజు బంద్ విజయవంతమైంది. కాగా, బుధవారం అర్ధరాత్రి సమయంలో మదనపల్లె పట్టణం బెంగళూరు బస్టాండు సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహాన్ని సమైక్యవాదులు ధ్వంసం చేసి ఆపై కాల్చివేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సిఐ నారాయణస్వామిరెడ్డి పోలీస్ స్పెషల్ ఫోర్సుతో బెంగళూరు బస్టాండు సర్కిల్‌లో మోహరింపజేశారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటివద్ద ఆందోళన అనంతరం ఇందిరాగాంధీ విగ్రహానికి 20 అడుగుల దూరంలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విద్యార్థులు బైఠాయించి నినాదాలు చేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జ్ఞానాంబిక కళాశాల, సాయిచైతన్య జూనియర్ కళాశాల, వివేకానంద డిగ్రీకళాశాల, శ్రీనివాస డిగ్రీ కళాశాల విద్యార్థినులు వేలసంఖ్యలో ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్టాండు అంబేద్కర్ సర్కిల్‌లో బైఠాయించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను పాదరక్షలతో దేహశుద్ధి అనంతరం దగ్ధం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, విద్యార్థులు వేలసంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అదేవిధంగా మదనపల్లె మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ప్రైవేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, శాప్స్ నాయకులు మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించి సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ర్యాలీగా చిత్తూరు బస్టాండు వాల్మీకిసర్కిల్, టౌన్‌బ్యాంకు సర్కిల్, అవెన్యూరోడ్డు, బెంగళూరు బస్టాండ్, మల్లికార్జున సర్కిల్, అనీబెసెంట్ సర్కిల్, పటేల్‌రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, నీరుగట్టువారిపల్లె వరకు ర్యాలీ నిర్వహించారు. నీరుగట్టుపల్లెకు చెందిన చేనేత కార్మికులు సోనియాగాంధీకి శవయాత్ర నిర్వహించారు. శవాన్ని మోసుకుంటూ ముందు బ్యాండుమేళం వాయిస్తూ మదనపల్లె పుర వీధులలో ఊరేగించారు. కాగా, మదనపల్లె, తంబళ్ళపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో బంద్ విజయవంతమైంది. ములకలచెరువు, బురకాయలకోట, కాండ్లమడుగు క్రాస్, అంగళ్ళు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు మీదుగా వెళ్ళే ముంబై-చెన్నై జాతీయ రహదారి పొడవునా టైర్లు కాల్చుతూ వాహనాలను నిలిపేశారు. వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి ఆందోళనలో పాల్గొన్నారు. మదనపల్లె, పీలేరు, పలమనేరు ఆర్టీసీ డిపోలలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సైతం సమైక్యవాదానికి మద్దతు పలుకుతూ విధులను బహిష్కరించారు. పశ్చిమ ప్రాంతాలలో ఎక్కడ చూసినా సమైక్య నినాదంతో హోరెత్తింది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు మూతబడ్డాయి. కొన్నిచోట్ల రోడ్లుపై వంటవార్పు చేపట్టారు. బంద్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ బలగాలు మోహరించాయి.

జిల్లాలో ఆందోళనలు ఉధృతం
* జిల్లాలో రెండవ రోజు బంద్ సంపూర్ణం
* బంద్ ఎఫెక్ట్ - శ్రీవారి దర్శనానికి గంటే
* జెఎసిల ఆధ్వర్యంలో ఎంపిలు, మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి
* చిత్తూరు, మదనపల్లె, తిరుపతిలో ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు
* తిరుపతిలో మరో కారుకు నిప్పు
* రాజీవ్‌గాంధీ విగ్రహంపై చెప్పులు, కోడిగుడ్లు విసిరిన సమైక్యవాదులు
* చిత్తూరులో ఎమ్మెల్యే సికె బాబు దీక్షకు మంచి స్పందన
* మదనపల్లెలో ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసం, కాల్చివేత
* పలమనేరులో నెహ్రూ విగ్రహం ధ్వంసం
* చంద్రగిరిలో రైల్వే స్టేషన్‌కు నిప్పు
తిరుపతి, ఆగస్టు 1: రాష్ట్ర విభజన అంశంపై గురువారం కూడా చిత్తూరు, తిరుపతి, మదనపల్లి ప్రాంతాల్లో సమైక్యవాదుల ఆందోళనలు అట్టుడికాయి. జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. బంద్ నేపధ్యంలో ఆందోళనకారులు బస్సులను అడ్డుకోవడంతో తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ చాలా తగ్గింది. ఈ నేపధ్యంలో గంటలోగా స్వామివారిని దర్శించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలిబాట భక్తులతోనే భక్తులు అంతంత మాత్రంగా తిరుమలలో రద్దీ ఉంది. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు తీసుకున్నారు. మదనపల్లిలో ఇందిరమ్మ సిమెంటు విగ్రహాన్ని, పలమనేరులో నెహ్రూ సిమెంట్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తిరుపతి నగరంలో రాజీవ్‌గాంధీ, ఇందిరమ్మ విగ్రహాలను ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. నగరంలోని హీరోహోండా షోరూమ్ సమీపంలో ఆందోళనకారులు ఒక కారుకు నిప్పు పెట్టారు. న్యాయవాదులు, విద్యార్థులు, కార్మికులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, యువజన సంఘాలు, టిటిడి ఉద్యోగులు ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. ఇక ఉదయం 6 గంటల నుండే సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి అన్ని ప్రధాన జంక్షన్లలో రోడ్లపై టైర్లు కాల్చివేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతికి ప్రధాన మార్గాలైన మంగళం రోడ్డులో టిడిపి, కాంగ్రెస్, వైసిపి నేతలు రాస్తారోకో చేయడంతో కడప మార్గం నుండి వచ్చే వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. ఇక చెన్నై మార్గం నుండి వచ్చే వాహనాలను దామినేడు ప్రాంతంలో, రేణిగుంట రోడ్డు ఆటోనగర్ ప్రాంతంలో ఆందోళనకారులు రాస్తారోకో చేశారు. ఎస్వీయూ అధ్యాపక జెఎసి నేత శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్వీయూ విద్యార్థి జెఎసి నేతలు ఓబుల్‌రెడ్డి, కృష్ణయాదవ్, హరికృష్ణయాదవ్, ఉద్యోగ జెఎసి నేత కోటగారం మురళి, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నిర్మల, ఎన్‌జిఓ అసోసియేషన్ నేత కుసుమ తదితరులు 2వేల మందికిపైగా చిత్తూరు ఎంపి ఎన్ శివప్రసాద్, తిరుపతి ఎంపి చింతామోహన్, కరకంబాడిలోని మంత్రి గల్లా అరుణకుమారి ఇళ్లను ముట్టడించారు. మంత్రి కారును అడ్డగించారు. జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ కాంగ్రెస్ విధానాలపై దుమ్మెత్తిపోశారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహంపై కోడిగుడ్లు వేశారు. చెప్పులతో కొట్టారు. ఆగ్రహించిన సమైక్యవాదులు బంద్ సంపూర్ణం చేశారు. తెల్లవారుజాము 6 గంటల నుండి రాత్రి 6 గంటల వరకూ బంద్ సంపూర్ణంగా కొనసాగింది. సిపిఐ మినహా కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. విద్యార్థుల ఆగ్రహానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రశ్నించిన పోలీసులపై సైతం విద్యార్థులు తిరగబడ్డారు. విద్యార్థుల ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, పిసిసి కార్యదర్శి వూకా విజయ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆర్‌టిసి బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ఇచ్చారు. నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగే తిరుపతి నగరం జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. దుకాణాల మూతతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా తయారయ్యాయి. ప్రజాప్రతినిధులైన తిరుపతి ఎంపి చింతామోహన్, చిత్తూరు ఎంపి ఎన్ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, జిడి నెల్లూరు గుమ్మడి కుతూహలమ్మ నివాసం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే రవి, మాజీ ఎమ్మెల్యేలు చదలవాడ కృష్ణమూర్తి, వెంకటరమణ నివాసాల ఎదుట రక్షణగా బలగాలను ఏర్పాటు చేశారు. నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేకంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. తిరుపతి బార్ అసోసియేషన్ నేతలు రమణ, సామంచి శ్రీనివాస్, దినకర్, వజ్రాల చంద్రశేఖర్‌ల నేతృత్వంలో తిరుపతి టౌన్‌క్లబ్, కృష్ణాపురంఠాణా, నాలుగుకాళ్ల మండపం, ఆర్‌టిసి బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం, లీలామహల్ సర్కిల్, అన్నారావు సర్కిల్, మున్సిపల్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో స్కూటర్ ర్యాలీలు నిర్వహించారు. విభజనకు కారణమైన సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్‌తో పాటు టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ దిష్టిబొమ్మలను శ్రీవెంకటేశ్వర వెటర్నరీ వర్శిటీ ఎదుట విద్యార్థులు, అధ్యాపకులు దగ్ధం చేశారు. తెలుగుజాతిని విడదీసేందుకు ఉత్తరాది అగ్ర కాంగ్రెస్ నేతలు, పక్క రాష్ట్రానికి చెందిన చిదంబరంలు కుట్రపన్నారన్నారు. తెలుగువారు ఒక్కటిగా ఉంటే ఢిల్లీ పీఠంపై కనే్నస్తారనే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికి రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సోనియా కుట్రపన్నారన్నారు. తమ స్వార్థం కోసం సోనియాగాంధీ దేశాన్ని విదేశాలకు అయినా తాకట్టుపెడుతున్నారన్నారు. అధికారం ఇచ్చిన తెలుగువారిని చీల్చి చెండాతున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్వీయూ ప్రొఫెసర్లు కృష్ణారెడ్డి, శాప్స్ నేతలు ఎన్ రాజారెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరిరావు, ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి, దంపూరి భాస్కర్, ఎస్వీ ప్రసాద్, విశ్వనాధరెడ్డి, విద్యార్థి జెఎసి నేతలు కృష్ణమూర్తి, సప్తగిరి ప్రసాద్, రాజశేఖర్‌రెడ్డి, నగేష్, ఓబుల్‌రెడ్డి, తేజ్‌ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

* గంటలోపే స్వామివారి దర్శనం
english title: 
t
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>