Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఆగ్రహ జ్వాలలు

$
0
0

కర్నూలు, ఆగస్టు 1 : సమైక్య రాష్ట్రం కోసం ప్రజలు గురువారం పెద్దఎత్తున ఉద్యమించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చగా కర్నూలు నగరంలో మరింత వేడెక్కింది. నగరంలోని సి.క్యాంపు కూడలిలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. సమైక్య రాష్ట్రాన్ని చీల్చడానికి సోనియా గాంధీ కుట్ర పన్నిందంటూ సమైక్య వాదులు ర్యాలీగా వచ్చి మొదట విగ్రహానికి చెప్పుల దండ వేశారు. అనంతరం సైకిల్, మోటార్ సైకిల్ టైర్లను విగ్రహానికి తగిలించి కిరోసిన్ పోసి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టి ఫైరింజన్ సహాయంతో మంటలను ఆర్పారు. ఆందోళనకారులు అక్కడి నుంచి కలెక్టరేట్ చేరుకుని లోపలికి దూసుకుపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని వారించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో లాఠీచార్జి చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. సమైక్యవాదుల ఆందోళన హింసాత్మకంగా మారుతోందన్న విషయం తెలుసుకున్న ఎస్పీ రఘురామ్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి లాఠీ చేతబట్టి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇదే సమయంలో వైకాపా నేత ఎస్వీ మోహన్‌రెడ్డి అక్కడికి చేరుకోగా వెళ్లిపోవాలని సూచించినా ఎస్పీ ఆయన పట్టించుకోకుండా ఆందోళనకారులకు మద్దతుగా నినాదాలు చేస్తుండటంతో ఎస్వీని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులు, విద్యార్థి, కుల, ప్రజా సంఘాలతో పాటు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రం కావాలంటూ న్యాయ వాదులు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. న్యాయ వాదుల దీక్షకు మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ మద్దతు తెలిపారు. నగరంలో ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉద్యమ వేడి మరింత రాజుకుంది. డోన్ పట్టణంలోని మంత్రి ఏరాసు ఇంటిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. జాతీయ రహదారిపై పాత టైర్లు వేసి నిప్పంటించి రాకపోకలను అడ్డుకున్నారు. నంద్యాలలో సమైక్య వాదులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. సమైక్య వాదుల ఆందోళన ఫలితంగా జిల్లా వ్యాప్తంగా అప్రకటిక బంద్ వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసి వేశారు. యజమానుల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో పని చేస్తున్న బోధనా, బోధనేతర సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దాంతో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలను మూసి వేశారు. సమైక్య సెగలతో జిల్లా వేడెక్కడంతో వారికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మద్దతుగా నిల్చారు. ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా మోహన రెడ్డి, కాటసాని రామిరెడ్డి, లబ్బి వెంకట స్వామి తమ పదవులకు రాజీనామా చేసి ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని ప్రకటించారు. సమైక్య వాదానికి మద్దతు తెలిపిన నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి కూడా తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇక హైదరాబాద్‌లో ఉన్న మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి కూడా తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. జిల్లాలో సమైక్య వాదాన్ని కాంగ్రెస్, టిడిపి, వైకాపాలు పోటాపోటీగా వినిపించాయి. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ర్యాలీ, ధర్నా, రాస్తారోకో వంటి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని సమైక్యవాదులకు మద్దతు తెలిపారు. ఉద్యోగులు మూకుమ్మడిగా కార్యాలయాల్లో విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటున్నారు. కాగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఆందోళనలో భాగం పంచుకుంటే ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని పోలీసు శాఖ నిఘా వర్గాలు ప్రభుత్వానికి సందేశం పంపాయి.
మంత్రులు కోట్ల, టిజి ఇళ్లకు భారీ భద్రత
కర్నూలు : ఢిల్లీ పెద్దలు తెలంగాణ ఇచ్చినట్లు ప్రకటించడంతో సమైక్య వాదులు కర్నూలు నగరంలోని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర చిన్ననీటిపారుదలశాఖ మంత్రి టిజి వెంకటేష్ ఇళ్ల దగ్గర భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామ చేయాలనే డిమాండ్‌తో ఉద్యమకారులు మంత్రుల ఇళ్ల ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. అలాగే మంత్రి టిజివి హోటల్, ఫ్యాక్టరీ, కార్యాలయం వద్ద కూడా భద్రత ఏర్పాటు చేశారు. గురువారం కర్నూలు నగరంలో సమైక్య ఉద్యమకారులు రేచ్చిపోయి హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పుపెట్టి ఇనుప భారీ కేడ్లను తొలగించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో రాళ్లు విసరడంతో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. ఉద్యమకారులు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ వాణిజ్య సంస్థలను ముయించి వేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ఎస్పీ డా. కె.రఘురామ్‌రెడ్డి స్వయంగా రోడ్డుపైకి వచ్చి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆందోళనులు శాంతియుతంగా చేపడితే పోలీసులు కూడా సహకరిస్తారని ఎస్పీ తెలిపారు. హింసాత్మక సంఘటనలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమైక్యాంధ్ర కోసం
యువకుల బలిదానం
ఆదోని/ఆస్పరి, ఆగస్టు 1 : రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేక నగరూరు కు చెందిన ఇద్దరు యువకులు ఆత్మహ త్యకు పాల్పడ్డారు. వివరాలు.. ఆదోని డివిజన్‌లోని ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన బాలరాజు (18), గొల్ల విష్ణు (16) టివిలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటన వార్తలు, సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలను చూసి కలత చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 10వ తరగతి వరకూ చదువుకున్న బాలరాజు, 8వ తరగతి వరకూ చదువుకున్న విష్ణు మధ్య లోనే చదవు మానేసి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా కూలి పనుల కు వెళ్లేవారు. జూలై 30వ తేదీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటన నేపథ్యం లో అర్ధరాత్రి వరకు టివి చూస్తుండగా బాలరాజు తండ్రి నాగరాజు ఇక నిద్ర పోండని చెప్పగా నిద్రపోయారు. అయితే వారిద్దరు ఉదయం బహిర్భూమికి అని ఇంట్లో చెప్పి వెంట పురుగుల మందు తీసుకెళ్లి ఉరి చివరిలో ఉన్న పొలంలో నీళ్లలో పురుగుల మందు కలుపుకుని తాగి అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. వీరిని గమనించిన ప్రజలు విషయాన్ని బాలరాజు తల్లిదండ్రులు నాగరాజు, హనుమంతమ్మ, విష్ణు తల్లిదండ్రులు ఎర్రిస్వామి, శకుంతలమ్మకు తెలుపగా వారు వెళ్లి చూసే సరికి అప్పటికే బాలరాజు మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న విష్ణును ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ విష్ణు మృతి చెందాడు. ఈ సంఘటనపై ఆస్పరి పోలీసు స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ జఫూరుల్లాఖాన్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసమే తమ పిల్లలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరి మరణంతో బంధువుల రోధనలతో గ్రామంలో నగరూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాష్ట్ర విభజన ప్రకటనే బలి తీసుకుంది
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటనే తన బిడ్డను బలితీసుకుందని బాలరాజు తండ్రి నాగరాజు పేర్కొన్నాడు. అర్ధరాత్రి వరకూ టివి చూస్తుంటే మందలించగా వారిద్దరూ నిద్రపోయారని, ఉదయం లేచి చూసే సరికి సమైక్య రాష్ట్రం పురుగుల మందు తాగి బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రంతా టివిలో వార్తలు చూశారని, సమైక్యాంధ్ర కోసం చివరికి ప్రాణాలు కూడా వదిలారని విష్ణు తల్లి శకుంతలమ్మ బోరున విలపించింది.

ఎంపి, ఎమ్మెల్యేల రాజీనామా
* సమైక్య ఉద్యమంలో పాల్గొంటామన్న నేతలు
కర్నూలు, ఆగస్టు 1: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాకు చెందిన ఎంపి ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామి, మురళీకృష్ణ, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు తమ పదవులకు గురువారం రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సభాపతి నిర్ణయించిన పద్ధతిలోనే సమర్పిస్తున్నట్లు వారు హైదరాబాద్‌లో తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన చేసి రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఆ ప్రాంతీయులకు, పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రకటించి కోస్తాంధ్ర వాసులకు వరాలు ప్రకటించి రాయలసీమకు మొండి చేయి చూపడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర విభజనలో న్యాయం, శాస్ర్తియత కనిపించకపోవడం వల రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మనస్తాపాన్ని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని చీల్చవద్దని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించ లేదని ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేనపుడు పదవిలో ఉండటం భావ్యం కాదని రాజీనామా చేస్తున్నామని ఇక ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనలో భాగస్వామిని కాలేనని పేర్కొంటూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి స్పష్టం చేశారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీని వీడేందుకు కూడా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.

డోన్‌లో రగిలిన సమైక్య ఉద్యమం
* మంత్రి ఏరాసు ఇల్లు ముట్టడి, కిటికీలు ధ్వంసం
* రాజీవ్ గాంధీ విగ్రహం ధ్వంసం, కాల్చివేత
* గూడ్స్‌రైలును నిలిపివేసిన ఆందోళనకారులు
డోన్, ఆగస్టు 1 : రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తట్టుకోలేక ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలతో గురువారం డోన్ పట్టణం దద్దరిల్లిపోయింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహన్ని ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. సోనియా డౌన్ డౌన్ , సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ మోహనరెడ్డి పాత బస్టాండ్‌కు చేరుకుని జెఎసి నాయకులపై మండిపడ్డారు. దీంతో సమైక్యవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో మిన్నకుండిపోయారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు వలసల రామకృష్ణ, విక్రమసేనారెడ్డి, సిద్దార్థ కృష్ణారెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, శేషశయనగుప్త ఆధ్వర్యంలో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి స్వగృహానికి చేరుకున్న ఆందోళనకారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంటిలోకి చొరబడి ఫర్నిచర్‌ను కిందపడ వేయడంతో పాటు కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మంత్రి ఏరాసు దృష్టికి తీసుకెళ్లగా సమైక్యాంద్ర కోసం తాను రాజీనామా చేస్తానని, ఉద్యమంలో కూడా పాల్గొంటానని ఫోన్ ద్వారా తెలపడంతో వారు ఆందోళన విరమించారు. రైల్వే స్టేషన్‌లో డోన్ నుంచి నంద్యాల వైపు వెళ్తున్న గూడ్స్‌రైలును అడ్డుకున్నారు. వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రైలుకు అడ్డంగా నిలబడి నినాదాలు చేశారు. సోనియా డౌన్ డౌన్, కోట్ల రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో రైల్వే స్టేషన్ ప్రాంతం హోరెత్తిపోయిం ది. ఓ చికెన్ వ్యాపారి రైలు కిందకి దూరడంతో పాటు రైలెక్కి హల్‌చల్ చేస్తూ కాసేపు పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. చివరకు సిఐ డేగల ప్రభాకర్ రంగంలోకి దిగి ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమించారు. పట్టణంలోని ఇందిరాగాంధీ, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి విగ్రహాలకు ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని శాంతియుతంగా చేపట్టాలని జెఎసి నాయకులు మహేష్‌కన్నా, అధ్యక్షుడు పామయ్య, కోశాధికారి ఆలా శ్రీ్ధర్, కాలేషా తెలిపారు. అలా గే ఈనెల 2వ తేదీ తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమాల్లో నాగభూషణంరెడ్డి, ఓంప్రకాష్, కమాల్, పాల్గొన్నారు.
ప్రత్యేక రాయలసీమ ఇవ్వాల్సిందే!
* కెవి సుబ్బారెడ్డి ఆమరణ దీక్ష
* మద్దతు తెలిపిన బైరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఆగస్టు 1: జిల్లావ్యాప్తంగా సమైక్య ఉద్యమం సెగలు కక్కుతుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం మరో వైపు ఆందోళన ప్రారంభమైంది. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ విద్యాసంస్థల అధినేత, డాక్టర్ కెవి సుబ్బారెడ్డి గురువారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. మొదట ఆయన శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద నివాళులు అర్పించి తన దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరుగుతుందని ముందే సంకేతాలు ఉన్నా అప్పుడు ఎవరూ మాట్లాడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను తాము వినిపించామని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో రాయలసీమ ఏ విధంగా నష్టపోయింది అన్ని ఆధారాలతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పించామని వెల్లడించారు. దేశంలోనే వెనకబడిన ప్రాంతాల్లో రాయలసీమ మొదటి మూడు స్థానాల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఏ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కృషి చేసిన దాఖలాలు లేవన్నారు. అలాంటప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉండి సాధించేదేమీ లేదని, రాయలసీమ రాష్ట్రంగా ప్రకటిస్తే ఈ ప్రాంత సహజ వనరులు, మేథాశక్తితో అభివృద్ధి చెందుతామని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమకు చెందిన మేథావులు, విజ్ఞులు ఆలోచించి రాయలసీమ రాష్ట్ర ఆవశ్యకతను గుర్తించాలని కోరారు. సమైక్య వాదంతో ఆందోళనలు చేస్తున్న వారు తమ ఆలోనను పునఃపరిశీలించుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే దీక్ష చేస్తున్న సుబ్బారెడ్డిని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఖాయమని తాను గత ఆరు నెలలుగా చెప్తూ వస్తున్నానని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనలో భాగంగా ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడాలని పిలుపునిస్తూ తాను చేసిన ఆందోళనకు ఎవరూ స్పందించకపోవడం వల్లనే ఇప్పుడు నష్టపోతున్నామని మండిపడ్డారు. రాయలసీమ విషయమే చర్చించకుండా రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్, రాయలసీమ అభివృద్ధి కోసం ఏం చేస్తామో చెప్పకపోవడం అహంకారానికి నిదర్శనమన్నారు. రాయలసీమలోని రాజకీయ పార్టీ నాయకుల చేతగాని తనం వల్ల ప్రజలు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమైక్యవాదులు ఆ నినాదాన్ని పక్కన పెట్టి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సుబ్బారెడ్డికి దీక్షా శిబిరంలో పలు సంఘాల నాయకులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు.
ఎస్‌ఆర్‌ఎంసికి గండ్లు
* వృథా అవుతున్న నీరు
పాములపాడు, ఆగస్టు 1: పోతిరెడ్డిపాడుకు ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల ము ప్పు ఏర్పడింది. శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు ప్రధాన కాలువకు 0.5 నుంచి 5వ కి.మీ వరకు గత రెండు రోజులుగా గండ్లు పడుతున్నాయి. ఇప్పటి వరకూ 5 చోట్ల భారీ స్థాయిలో గండ్లు పడగా మిగతా చోట్ల చిన్న చిన్న గండ్లు పడ్డా యి. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రస్తుతం 4.12 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతుండడంతో పోతిరెడ్డిపాడుకు వరద నీరు అధికమవుతుంది. ఈ బ్యాక్‌వాటర్ పోతిరెడ్డిపాడు లోతట్టు ప్రాంతం నుంచి ఎస్‌ఆర్‌ఎంసి కట్టలపై నుంచి ప్రవహిస్తూ గండ్లకు కారణమవుతుంది. 2009 వరదల సమయంలో ఈ ఎస్‌ఆర్‌ఎంసి కట్టలు తెగిపోయాయి. అయితే ప్రభుత్వం కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎస్‌ఆర్‌ఎంసి కుడివైపు ఉన్న కాలువ కట్టలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. 15 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఎస్‌ఆర్‌ఎంసికి కట్ట వెంట రోజు రోజుకూ గండ్లు అధికమవుతున్నాయి. ఎడమ గట్టు స్టాండెట్ బ్యాంకు నిర్మాణంలో నాణ్యత లోపించడం, 2009 వరదల అనంతరం పోతిరెడ్డిపాడు జలాశయం దిగువ ప్రాంతంలో ఉన్న నల్లమట్టి చేత అప్పట్లో గండ్లను తాత్కాలికంగా పూడ్చి వేశారు. అయితే ఆ మట్టి కొట్టుకుపోయి గండ్లు పడ్డాయి. దీంతో ఒక్కో గండి నుంచి రోజుకు దాదాపు 500 క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంది. ఐదు రోజుల క్రితం పోతిరెడ్డిపాడు వద్ద ఉన్న ఎన్‌సిపిల్ మినీ పవర్ ప్లాంట్ నుంచి ఎస్‌ఆర్‌ఎంసికి నీరు విడుదల చేయగ 24 గంటల్లోనే సరఫరా నిలిచిపోయింది. తిరిగి గురువారం స్వల్పంగా ఎస్‌ఆర్‌ఎంసికి నీరు విడుదల చేస్తున్నారు. మున్ముందు ఆల్మట్టి నుంచి భారీ వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ఇదే నీటి ప్రవాహం పెరిగితే ఎస్‌ఆర్‌ఎంసికి పడ్డ గండ్లు మరింత అధికమయ్యే ప్రమాదం ఉంది. ఈ నీరు అధికమై పంట పొలాలను ముంచెత్తకముందే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని పాములపాడు ప్రాంత రైతులు అధికారులను మొరపెట్టుకుంటున్నారు.
ఎమ్మెల్యే పదవికి
కాటసాని రామిరెడ్డి రాజీనామా
బనగానపల్లె, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఎ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో మనస్తాపం చెంది ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేస్తూ ఆ పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు పంపినట్లు కాటసాని రామిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన బనగానపల్లెలో స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ టిడిపి, వైకాపా, బిజెపి తెలంగాణకు మద్దతు పలకడం తో యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ విభజనకు సానుకూలంగా స్పం దించారని తెలిపారు. ఈ ప్రకటనతో ముఖ్యంగా రాయలసీమ వాసులు ఎక్కువ నష్టపోయారన్నారు. తొలుత రాజధానిగా కర్నూలును వదలుకుని, ఇప్పుడు విభజనతో రెండు సార్లు నష్టపోయారన్నారు. రాయలసీమ ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా యు పిఎ ప్రభుత్వం విభజనను ప్రకటించ డం విచారకరమన్నారు. సీమాంధ్ర మంత్రులు హైదరాబాద్‌లో సమావేశమై మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనా మా చేసి యుపిఎ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు నిర్ణయించారని ఈ మేరకు తాము రాజీనామా చేసినట్లు తెలిపారు. అయితే భవిష్యత్తు కార్యచరణ ప్రణాళిక ప్రకారం నడుచుకుంటామని, సమైక్య ఉద్యమానికి అం డగా నిలుస్తామని ప్రకటించారు. విభజనను అడ్డుకునేందుకు సకల జనుల సమ్మె చేయాలని కాటసాని పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజనను అడ్డుకుంటాం:్భమా
కర్నూలు, ఆగస్టు 1: దేశంలో ఏ రాష్ట్రాన్నైనా విభజించే ముందు ఆ రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించి వాటికి పరిష్కార మార్గం చూపి ఆ తరువాతే విభజన నిర్ణయం తీసుకుంటారని, అయితే మన రాష్ట్ర విభజన అందుకు వ్యతిరేకంగా జరగుడాన్ని తాము అడ్డుకుంటున్నామని వైకాపా కేంద్ర పాలకమండలి సభ్యుడు, మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. కర్నూలులో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి నాటకాల కారణంగానే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించే సాహసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన ముందు అందరితో సంప్రదించాలని తమ పార్టీ రాసిన లేఖను సైతం పట్టించుకోకుండా ఏకపక్షంగా విభజన చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించారే కానీ రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలకు ఎలాంటి న్యాయం చేస్తున్నారో చెప్పకపోవడం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని చీలుస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించినా టిడిపి వౌనం వహించడాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాల్సిన చంద్రబాబు కాంగ్రెస్ నిర్ణయం వెలువడ్డాక ఆ పార్టీకి సలహాలు ఇచ్చినట్లుగా మాట్లాడారే కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగిన తీరును ప్రశ్నించలేకపోయారని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు నియోజకవర్గ నేత ఎస్వీ మోహనరెడ్డి పాల్గొన్నారు.
మోటార్‌బైక్‌లు ఢీ: ఇద్దరి మృతి
గొనెగండ్ల, ఆగస్టు 1: ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి గొనెగండ్లలో జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రాళ్లదొడ్డికి చెందిన నాగరాజు(30), మాబాష మోటార్‌సైకిల్‌పై కర్నూలు నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. నెరడుపల్లికి చెందిన తిక్కన్న(25) గొనెగండ్ల నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. గొనెగండ్ల శివారులో రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్నాయి. దీంతో నాగరాజు, తిక్కన్న అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మాబాషను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ వెంకటరామిరెడ్డి సంఘటనాస్థలాన్ని సందర్శించారు.
భవిష్యత్తులో కాంగ్రెస్
ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదు:ఎంపి
వెలుగోడు, ఆగస్టు 1: భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టే ప్రసక్తే లేదని ఎంపి ఎస్పీవై రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వన్నార్ తూము గేట్లు ఎత్తి దిగువకు సాగునీరు విడుదల చేశారు. అనంతరం నంద్యాల వెళ్తుండగా మార్గమధ్యలో విద్యార్థి సంఘాలు ఎంపి వాహనాన్ని అడ్డుకుని ఎంపి పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని డిమాండ్ చేశాయి. దీంతో ఎంపి వెలుగోడు అయ్యపురెడ్డి కాలనీ నుంచి విద్యార్థులతో కలిసి ర్యాలీగా పొట్టిశ్రీరాములు సెంటర్ చేరుకున్నారు. అక్కడ ఎంపి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ సమస్య ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదని పార్లమెంటులో తెలంగాణా బిల్లును సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో కలిసి అడ్డుకుంటామన్నారు. అనంతరం స్వయంగా ఆయన సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

* కర్నూలు, డోన్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహాలకు నిప్పు * డోన్‌లో మంత్రి ఏరాసు ఇంటిపై రాళ్లు, ఫర్నిచర్ ధ్వంసం * ధర్నాలు, రాస్తారోకోలు * సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దగ్ధం
english title: 
knl

పదవులకు ఆనం సోదరుల రాజీనామా

$
0
0

నెల్లూరు, ఆగస్టు 1: సమైక్యాంధ్రా పరిరక్షం కోరుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి తమ పదవులకు రాజీనామా చేసారు. రామనారాయణ రెడ్డి మంత్రి పదవితోపాటు శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు. గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈసంఘటనతో నెల్లూరు జిల్లాలో సమైక్యాంధ్రా ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకుంది. ఆనం కుటుంబీకులు ఆది నుండి సమైక్యవాదులేనన్న సంగతిని నిరూపించుకుంటూ జిల్లాలోని ఎమ్మెల్యే సోదరులిద్దరు రాజీనామాలు సమర్పించటం విశేషం. తొలుత అన్న, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. కొద్ది గంటల వ్యవధిలోనే అన్నబాటులోనే తమ్ముడు ఆర్థిక మంత్రి రామనారాయణరెడ్డి కూడా రాజీనామా చేయటం గమనార్హం. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం తన పదవిని త్యాగం చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి ప్రకటించారు. గురువారం సాయంత్రం ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పంపినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు, వైకాపాకు చెందిన మరో ఇద్దరు ఇప్పటి వరకు రాజీనామాలు సమర్పించారు. దీంతో ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించగా, తెలుగుదేశంకు చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల నిర్ణయం మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్గదర్శకం ప్రకారమే ఉంటుందని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.
సైన్స్‌లో పరిశోధనకు అవకాశాలు అపారం
నెల్లూరుసిటీ, ఆగస్టు 1: సైన్స్‌లో పరిశోధనకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అందిపుచ్చుకోవడానికి విద్యార్థులకు అంకిత భావం పట్టుదల ఉన్నట్లయితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని డాక్టర్ ఎస్‌జెఎస్ ఫ్లోరా స్పష్టం చేశారు. గురువారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 2013 ఇన్‌స్పైర్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ చదవాలని విద్యార్థులు ఒక్కసారి నిర్ణయించుకుంటే పరిశోధనపై ఆసక్తి ఉన్నట్లయితే ఎన్నో అవకాశాలు వారి ముందు ఉన్నాయని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న వివిధ వ్యాధులలో ఎన్నో వ్యాధులు విష పదార్థాలకు మానవ జీవ కణజాలం లోను కావడం మూలంగా జరుగుతున్నవేనని ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తూర్పున ఉన్న ప్రాంతాలలో ఆర్సెనిక్ అను విష పదార్ధం వల్ల 70 మిలియన్ల మంది వివిధ రకాల జబ్బున బారిన పడుతున్నారని తెలిపారు. తాను చేస్తున్న పరిశోధన ద్వారా ఆ వ్యాధి నివారణకు ఆయన చేస్తున్న కృషిని వివరించారు. ఉపకులపతి జి రాజారామిరెడ్డి మాట్లాడుతూ నాడీ వ్యవస్థపై ఆర్సెనిక్ ప్రభావం యొక్క విష పదార్థనికి సరైన నివారణపై వారు చేస్తున్న పరిశోధన అని తెలిపారు. రిజిస్ట్రార్ నాగేంద్ర మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో పలు జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల సందడితో ఒక పండుగ వాతావరణం నెలకొన్నదని తెలిపారు. ఇన్‌స్పైర్ కార్యక్రమానికి వివిధ కళాశాలల నుంచి 150మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని దేశంలో అత్యున్నత శాస్తవ్రేత్తలను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులురెడ్డి, పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్యశాలలోనే
కాన్పులు చేయించుకోవాలి
సంగం, ఆగస్టు 1 : గ్రామీణ ప్రాంతాలలోని గర్భవతులందరూ ప్రభుత్వ వైద్యశాలలోనే కాన్పులు చేయించుకోవాలని డిఎంహెచ్‌ఒ సుధాకర్ తెలిపారు. గురవారం సంఘం ప్రభుత్వ వైద్యశాలలో అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్యఅతిథులుగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పోరేట్ వైద్యశాలలకు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలలు కొనసాగుతున్నాయని, గర్భవతులందరూ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి కాన్పులు చేయించుకునేందుకు సిబ్బంది సహకరించాలని అన్నారు. ప్రభుత్వ పరంగా గర్భవతులకు ఇచ్చే రాయితీలను తప్పనిసరిగా అప్పుడే అందిస్తామని ఆయన తెలిపారు. గ్రామాలలో ఉన్నటువంటి ఆశా, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు ఆయా ప్రాంతాల గర్భవతుల నమోదు కార్యక్రమాలను చేసే సమయంలోప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి వౌలిక సదుపాయాలను వివరించాలని ఆయన అన్నారు. గతంలో ప్రభుత్వ వైద్యశాలలో వౌళిక సదుపాయాలు లేకుండా ఉండడంతో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం మంది ప్రైవేట్ వైద్యశాలల వైపు వెళ్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలలో కూడా మెరుగైన సేవలు అందించేందుకు వైద్య అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం తహశీల్దారు కేధర్‌నాధ్ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా గర్భవతులకు, బాలింతలకు అనేక రాయితీ నిధులు మంజూరవుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఈ నిధులను ఉపయోగించుకునేందుకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ పరంగా సర్ట్ఫికేట్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆరోగ్యపరంగా అంగన్‌వాడీ కేంద్రాలలో పౌష్టికాహారాలు తీసుకోవడం వలన గర్భవతులకు, బాలింతలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, ఆత్మకూరు డివిజన్ ఆర్డీఓ కమలకుమారి, ఎస్‌పిహెచ్‌ఓ సుధాకర్‌రెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్యాధికారి స్వర్ణముఖి పాల్గొన్నారు.

ఎంపిడివో కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామస్థులు
సైదాపురం, ఆగస్టు 1: స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని తురిమెర్ల గ్రామస్థులు గురువారం ముట్టడించారు. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తప్పు జరిగిందని ఒక వర్గం పట్టుపట్టగా మళ్లీ ఓట్లలెక్కింపు చేశారు. అయితే ఈదఫా రెండువర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీద్వారా ఒకరిని ఎన్నికైనట్టు ప్రకించారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థి వర్గం తనకు న్యాయం చేయాలంటూ తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు, బుధవారం జరిగిని ఎన్నికల్లో తురిమెర్ల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా పొట్టేళ్ల సుజాతమ్మ, సన్నిబోయిన యశోదమ్మ పోటీ చేశారు. సుజాతమ్మకన్నా యశోదమ్మకు 3 ఓట్లు అదనంగా రావడంతో రీ కౌంటింగ్ నిర్వహించారు. రీ కౌంటింగ్‌లో యశోదమ్మకు పడిన ఓట్లలో 3 ఓట్లు చెల్లని ఓట్లుగా జోనల్ అధికారి జయచంద్రారెడ్డి గుర్తించి వాటిని పక్కన పెట్టడంతో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా వచ్చాయి. లాటరీ విధానంతో అభ్యర్థిని నిర్ణయించేందుకు అభ్యర్థుల సమ్మతితో జోనల్ అధికారి లాటరీ తీయగా అందులో పొట్టేళ్ల సుజాతమ్మ గెలుపొందారు. దీంతో బుధవారం సాయంత్రం కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తిరిగి గురువారం ఉదయం స్థానిక ఎండివో కార్యాలయం ఎదురుగా పెద్ద సంఖ్యలో ఓడిన వర్గానికి చెందిన వారు బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలుచేశారు. విధుల్లో ఉన్న సిబ్బందిని బయటకు పంపారు. తమకు న్యాయం జరిగేంత వరకు కదలబోమని భీష్మించుకొన్నారు. దీంతో పోలింగ్ అధికారి ఎన్నికల కేంద్రంలో జరిగిన విషయాన్ని రాత పూర్వకంగా గ్రామస్థులకు తెలియజేశారు. ఎస్సై ఖాదర్ బాష తన సిబ్బందితో శాంతి భధ్రతలు పరిరక్షించారు.
ప్రతిష్ఠాత్మకంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలి
నెల్లూరుసిటీ, ఆగస్టు 1: జిల్లాలో ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అధికారులను సంయుక్త కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. గురువారం స్థానిక గోల్డెన్‌జూబ్లీ హాలులో ఆగస్టు 15న పోలీసు పెరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించునున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖ ద్వారా పెరేడ్‌గ్రౌండ్ వద్ద జాతీయపతావిష్కరణ, కవాతు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ శాఖ అధికారులకు సూచించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వేడుకకు విచ్చేసే అతిధులు, ప్రేక్షకులు, అధికారులు, బడి పిల్లలను దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా షామియానాలు, సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, న్యాయశాఖ అధికారులు, ఇతర ముఖ్యలకు ఆహ్వానాలు పంపాలన్నారు. విద్యాశాఖ పర్యవేక్షణలో వివిధ పాఠశాలల పిల్లలలను తీసుకుని వచ్చి క్రమశిక్షణతో పిల్లలు కూర్చొని వేడుకలు తిలకించే విధంగా ఏర్పాట్లు చూడాలన్నారు. పాఠశాల పిల్లలను పోలీసు గ్రౌండ్‌కు చేర్చేందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో 15వ తేదీ సాయంత్రం కస్తూర్భా కళాక్షేత్రంలో వివిద సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయుటలో నిర్ణీత సయమం కేటాయించి క్రమపద్దతిలో నిర్వహించేలా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్‌ఫర్మేషన్ ఇంజనీరింగ్ శాఖ వారు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు, వివిధ పాఠశాలలకు సంబంధించిన పిల్లల ప్రదర్శించే కార్యక్రమాల సిడిలను విడి విడిగా తీసకుని స్పష్టత ఉండేలా చూడాలన్నారు. నగరపాలక సంస్థ ద్వారా పెరేడ్ గ్రౌండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీటీ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర వైద్య సేవలందించేందుకు అవసరమైన వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేయాలని జిల్లా పౌరసరాఫరాలశాఖ అధికారికి ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలను ఆయా శాఖల పరిధిలో చూపరులను ఆకట్టుకునే విధంగా శకటాలను తయారు చేసి పెరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రదర్శించేలా చూడాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్నిశాఖల అధికారులతో పాటు సిబ్బంది తప్పని సరిగా హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బి రామిరెడ్డి, నెల్లూరు ఆర్‌డిఓ మాధవీలత, డ్వామా పిడి గౌతమి, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

వైఎస్ మరణంతో ఆగిన సంక్షేమం
కోట, ఆగస్టు 1: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంతో రాష్ట్రంలో సంక్షేమం పూర్తిగా ఆగిపోయిందని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. గూడూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సిపి అధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో గురువారం కోటలో విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం వైఎస్ ఎన్నో పథకాలను ప్రవేశపెడితే అధికారంలో వున్న కాంగ్రెస్ నేతలు వాటిని తుంగలో తొక్కారన్నారు. వైఎస్ మృతిచెందడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమన్నారు. వైఎస్ బతికివుంటే రాష్ట్రం రెండు ముక్కలు అయ్యేది కాదన్నారు. వైఎస్ పథకాలను అమలుపరిచే సత్తా జగన్‌కే ఉందన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో తమ పార్టీ మద్దతుదారులు 36 స్థానాలను కైవసం చేసుకొని వైఎస్‌ఆర్‌సిపి జెండాను ఎగురవేశారన్నారు. కోట పంచాయతీలో నల్లపరెడ్ల కోటను కాపాడిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోట పంచాయతీ సర్పంచ్ రాఘవయ్య గెలుపుతో పంచాయతీ అభివృద్ధికి తొలిమెట్టు వేశామన్నారు. అనంతరం కోట, వాకాడు చిట్టమూరు మండలాల్లో వైఎస్‌ఆర్‌సిపి మద్దతుతో సర్పంచ్‌లుగా గెలుపొందిన వారిని ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా నాయకులు మానికల పవన్‌కుమార్, పాశం సునీల్‌కుమార్, పార్టీ నాయకులు నల్లపరెడ్డి హర్‌నాధ్‌రెడ్డి, నల్లపరెడ్డి రాజేంద్రకుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి జగధీష్‌కుమార్‌రెడ్డి, వంకా రమణయ్య, కోట మండల పార్టీ కన్వీనర్ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, వైకాపా మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నల్లపరెడ్డి అభిమానులు, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్ర విభజనపై విద్యార్థి జెఏసి
ఆగ్రహం
ఆగ్రహం
నెల్లూరు, ఆగస్టు 1: రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థి జెఏసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం ఉదయం నగరంలోని స్థానిక చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. దీంతో విజయవాడ నుండి వచ్చే వాహనాలు, అటు చెన్నై వైపు నుండి వచ్చే వాహనాలు రెండు కిలోమీటర్ల వరకు భారీగా నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యాసంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమలనాయుడు, వైఎస్‌ఆర్‌సి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జయవర్థన్‌లు మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించకపోతే ప్రాణత్యాగానికైనా సిద్దమని హెచ్చరించారు. జిల్లాలో విద్యార్థి జెఏసిగా ఉద్యమం చేస్తుంటే కనీసం ఏ రాజకీయ పార్టీ నాయకులైన మద్దతు తెలపకపోవడం దారుణమన్నారు. ఈ నాయకులు తెలుగుజాతికి ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రప్రభుత్వం పునరాలోచించి సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన చేయకపోతే అమరజీవి పొట్టిశ్రీరాములను ఆదర్శంగా తీసుకొని విద్యార్థి జెఏసి ఆధ్వర్యంలో ఆమరణ దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. బంద్‌లో భాగంగా డిసిసి ఇన్‌చార్జ్ చాట్ల నరసింహారావు స్కూల్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఆందోళనకారులు స్కూల్ వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించకుండా స్కూల్ నిర్వహించడం దారుణమని స్కూల్ ఎదుట బైఠాయించారు. చాట్ల నరసింహారావు బయటకు రాకపోవడంతో ధర్నా నిర్వహించారు. అరగంట తర్వాత చాట్ల బయటకు వచ్చి విద్యార్థి జెఏసి నాయకులకు మద్దతు ప్రకటించి జై సమైక్యాంధ్ర అని నినాదం చేయడంతో నేతలు వెనుతిరిగారు. అలాగే నగరంలోని పలు విద్యాసంస్థలు బంద్ పాటించకుండా నిర్వహిస్తుండటంతో విద్యార్థి జెఏసి నేతలు సంబంధిత స్కూళ్ల వద్దకు చేరుకొని మూసివేయించి విజయవంతం చేశారు. అనంతరం నగరంలో భారీ మోటార్‌సైకిళ్ల నిర్వహించారు. జనజీవనం స్తంభించింది. జాతీయ రహదారి, నగరంలో రోడ్లన్నీ నిర్మూనుష్యంగా మారి కర్ప్యూను తలిపించాయి. బాలాజీనగర్ సిఐ మంగారావు, ఐదవ నగర సిఐ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డిలు బలగాలను వెంట పెట్టుకొని చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు జాతీయరహదారి వద్దకు చేరుకొని ఆందోళనకారులకు నచ్చచెప్పి పంపివేశారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించి వాహనాలను అక్కడ నుండి పంపివేయడంతో యధావిధిగా వాహనాలు నడిచాయి. ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం 7 గంటల నుండి బంద్ ప్రాంరంభం కావడంతో జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద విద్యార్థి సంఘ నేతలు ఇంజనీరింగ్ కళాశాలల బస్సులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద కేంద్ర బలగాలతో కూడిన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జెఏసి నాయకులు శ్రావణ్, హర్షచౌదరి, అఖిల్, సాయిశివ, అశోక్, మురళికృష్ణ, జగన్, మోను తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్‌కు సోనియాగాంధీకి వివాహం
*సమైక్య నాయకులు వినూత్న నిరసన
ఆత్మకూరురూరల్, ఆగస్టు 1 : రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర నాయకులంతా రెండవ రోజైన గురువారం కెసిఆర్, సోనియాగాంధీల దిష్టిబొమ్మలకు వివాహ కార్యక్రమాల మహోత్సవాలను తప్పెట్లు, తాళాల నడుమ వేద పండితుల మంత్రాల సాక్షిగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సమైక్యాంధ్రవాదులకు ఆత్మకూరు సోమశిల సెంటర్‌లోని నడిరోడ్డుపై వంట చేసి విందు ఏర్పాటుచేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రాన్ని రెండు విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ అధినేతలు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న పద్ధతిలో సోనియాగాంధీ, కెసిఆర్ బొమ్మలను ఊరేగిస్తూ చెప్పులతో కొడుతూ సమైక్య నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు సోమశిల రోడ్డు సెంటర్ వద్ద కెసిఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలకు స్థానిక శివాలయం సహకారంతో శాస్త్రోక్తంగా వివాహం చేశారు. అనంతరం ఆ బొమ్మలను దగ్ధం చేశారు. వచ్చిన సమైక్యాంధ్ర వాదులకు భోజనం ఏర్పాటు చేశారు. రెండవ రోజు జెఏసి నాయకులు ఆత్మకూరు పట్టణ పరిధిలోని దుకాణాలను, వాహనాలను అడ్డుకోవడం జరిగింది. ముందుగానే పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. బస్టాండ్ సెంటర్ నుండి ఆర్టీసీ డిపో వరకు సమైక్య వాదులు కేసిఆర్, సోనియాగాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డిపోలోని బస్సులు రెండవ రోజు కూడా నిలిపి వేయడం జరిగింది.

సమైక్యాంధ్రా పరిరక్షం కోరుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం
english title: 
anam

నిరసనల హోరు

$
0
0

ఒంగోలు, ఆగస్టు 1: జిల్లాలో రెండవ రోజైన గురువారం సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. విద్యార్థి జెఎసి నేతలు, ఎపి ఎన్‌జివో సంఘ నేతలతోపాటు, పాఠశాల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి ఇంటిని కారంచేడులో సమైక్యవాదులు ముట్టడించారు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలపాలని సమైక్యవాదులు నినాదాలు చేశారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని మంగమూరు రోడ్డు జంక్షన్ జాతీయ రహదారిని సమైక్యవాదులు దిగ్బంధించారు. ఈసందర్భంగా రోడ్డుకు ఇరువైపుల పెద్దఎత్తున వాహనాలను నిలిచిపోయాయి. పనికిరాని టైర్లను జాతీయ రహదారిపై తగులబెట్టి నిరసన తెలిపారు. సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోవటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాగా ఒంగోలులోని చర్చిసెంటరు వద్ద సమైక్యాంధ్ర ఉద్యోగ జెఎసి నేతల ఆధ్వర్యంలో మానవహారం జరిగింది. తొలుత ర్యాలీ నిర్వహించి నేతలు తలకిందులుగా నిలబడి వినూత్న ప్రదర్శన చేశారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సమైక్యవాదులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జిల్లాలోని కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేయకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాగా గిద్దలూరు, మార్కాపురం డిపోల నుండి కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు వెళ్ళాల్సిన బస్సులను నిలిపివేశారు. దీంతో ఆర్‌టిసికి నష్టం వాటిల్లింది. ఈ సమైకాంధ్ర ఉద్యమ కార్యక్రమంలో విద్యార్థి జెఎసి నేతలు రాయపాటి జగదీష్, చెన్నుబోయిన అశోక్, జగన్నాధం మహేష్, గోరంట్ల రవికుమార్, పి వెంకటేశ్వర్లు, ఉద్యోగ జెఎసి నేతలు షేక్ బషీర్, రాజ్యలక్ష్మి, బండి శ్రీనివాసరావు, గ్రంధి శ్రీను, కెఎల్ నరసింహరావు, న్యాయవాదుల జెఎసి నేతలు శిరిగిరి రంగారావు తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

పంచాయతీ ఎన్నికల్లో
టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి పోటాపోటీ
చతికిలపడ్డ కాంగ్రెస్
ఒంగోలు, ఆగస్టు 1: జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల హవా సాగింది. పోటాపోటీగా పంచాయతీల్లో నువ్వానేనా అన్నరీతిలో ఫలితాలు సాధించుకున్నాయి. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవటంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. జిల్లావ్యాప్తంగా 1020 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఐదు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. జిల్లాలో 1015 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా తెలుగుదేశం పార్టీకి 359 పంచాయతీలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 350, కాంగ్రెస్ పార్టీకి 206 పంచాయతీలు లభించాయి. మొదటి, రెండవ విడతల్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగగా, తుదివిడత జరిగిన మార్కాపురం డివిజన్‌లో మాత్రం వైఎస్‌ఆర్‌సిపి అత్యధిక స్థానాలను కైవశం చేసుకుంది. దీంతో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిల మధ్యే పోటీ నెలకొనగా కాంగ్రెస్ పార్టీ డీలాపడింది. కాగా ఎవరికివారే తమకే ఎక్కువ పంచాయతీలు వచ్చాయంటూ ప్రకటనలు గుప్పించటం పరిపాటిగా మారింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు, మద్యం ఏరులైపారింది. పంచాయతీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తితోపాటు ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సమష్టిగా కృషి చేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. దీంతో టిడిపి మద్దతుదారులు జిల్లాలో అత్యధిక పంచాయతీలను కైవశం చేసుకున్నారు. జిల్లాలో అత్యధిక పంచాయతీలను కైవశం చేసుకోవటం పట్ల పార్టీశ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. ఇదిలాఉండగా వైఎస్‌ఆర్‌సిపికి కూడా మెరుగైన ఫలితాలు రాకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీతో తలపడింది. మూడవ విడత జరిగిన ఎన్నికలే వైఎస్‌ఆర్‌సిపికి ప్రాణం పోశాయి. లేనిపక్షంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉండేదని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో మాత్రం ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి. ఈ ఫలితాల ప్రభావం త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలపై చూపే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎక్కువమంది శ్రేణులు వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు పలుకుతుండటంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా ఒంగోలు, పర్చూరు, సంతనూతలపాడు, దర్శి, కందుకూరు, కొండెపి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అధిక స్థానాలు రాగా వైఎస్‌ఆర్‌సిపికి మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో అధిక స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ కనిగిరి, చీరాల నియోజకవర్గాల్లో మాత్రం గుడ్డిలోమెల్లగా అధిక స్థానాలను గెలుచుకుని పరువు నిలుపుకుంది. మొత్తంమీద తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

అద్దంకిలో ఏర్పాటుచేసిన వివాదాస్పదమైన ఫ్లెక్సీ
ఫ్లెక్సీ తొలగించాలంటూ రాస్తారోకో చేస్తున్న టిడిపి కార్యకర్తలు
అద్దంకిలో భగ్గుమన్న సమైక్యాంధ్ర ఉద్యమం
అద్దంకి, ఆగస్టు 1: కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రకటించడంతో అద్దంకిలో రెండవ రోజు కూడా సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు ఎగిసిపడ్డాయి. గురువారం సమైక్యాంధ్ర జెఎసి, వైఎస్‌ఆర్‌సిపి, న్యాయవాదుల ఆధ్వర్యంలో పట్టణంలోని అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఆర్‌టిసి బస్సులు నిలిపివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. పట్టణంలో రాస్తారోకో సందర్భంగా ఇరువైపుల వాహనాలు బారులు తీరాయి. పాత బస్టాండ్ సెంటరులోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలకోసం తెలుగుజాతిని విడగొట్టేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రులంతా ఒక్కటై ఉండగా, కొందరు స్వార్ధం కోసం ఉద్యమం చేస్తే, దానిని ఆసరాగా తీసుకొని రాష్ట్రాన్ని విడగొట్టడం దారుణమన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రాంతంలో కాంగ్రెస్‌పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కోస్తాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతుంటే సోనియాగాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలుగువారి మనోభావాలు తెలుసుకోకుండా, అధికారం ఉందిగదాని రాష్ట్రాన్ని విడగొడితే దాని ప్రభావం రాబోయే ఎన్నికల్లో చూపిస్తామన్నారు. పార్లమెంటులో తెలంగాణా బిల్లును సమైక్యవాదులంతా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు నర్రా నాగేశ్వరరావు, కరి పరమేష్, కాకాని రాధాకృష్ణమూర్తి, చుండూరి మురళీసుధాకర్, నటరాజు, జెఎసి నాయకులు ప్రవీణ్, జగదీష్, రమణయ్య, హరీష్, నాని, సుధీర్, న్యాయవాదులు వజ్రాల అంజిరెడ్డి, కరి రామకృష్ణ, హనుమంతరావు, వడ్లవల్లి వీరనారాయణ, కుసుమకుమారి, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా మోటారుబైక్ ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు
కందుకూరు, ఆగస్టు 1: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం పట్టణంలో మోటారుబైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా స్థానిక కోర్ట్భువన సముదాయం సమీపం నుండి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికోటేశ్వరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ ప్రారంభించి పట్టణంలోని ప్రధాన రహదారులలో నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా విభజన వద్దు సమైక్యాంధ్ర ముద్దు అనే నినాదాలతో న్యాయవాదులు హోరెత్తించారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు మల్లికార్జున్, డివి కృష్ణారావు, రాజేంద్రప్రసాద్, శ్రీ్ధర్‌నాయుడు, మస్తాన్‌వలి, మహేష్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి ఇల్లు ముట్టడి
కారంచేడు, ఆగస్టు 1: సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, పర్చూరు శాసనసభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంటిని గురువారం సమైక్యవాదులు ముట్టడించారు. ఆందోళనకారులు ఇంటి లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించటంతో పోలీసులు ప్రధాన ద్వారం వద్దనే వారిని నిలిపివేశారు. పోలీసులను నెట్టుకొని ఇంటిలోకి ప్రవేశించిన సమైక్యవాదులు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. దగ్గుబాటి దంపతులు సమైక్యాంధ్రకు కట్టుబడి వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఓటు వేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి షేక్ సుభానికి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని బ్యాంకులను, ప్రభుత్వ పాఠశాలలను మూసివేయించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సిఐ మహమ్మద్ ఫిరోజ్, చీరాల టౌన్ సిఐ భీమానాయక్ బందోబస్తు నిర్వహించారు.
కొడవలివారిపాలెంలో దిష్టిబొమ్మ దగ్ధం
తెలంగాణాను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా మండలంలోని కొడవలివారిపాలెంలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, టిఆర్‌ఎస్ అధ్యక్షులు కెసిఆర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. గురువారం గ్రామ సర్పంచ్ కొసరాజు దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించి బస్టాండ్ సెంటర్‌లో వాటిని దగ్ధం చేశారు. గ్రామంలోని పాఠశాలలను మూసివేయించి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కొసరాజు సురేంద్ర, కొడాలి రమేష్, కొసరాజు శ్రీనివాసరావు, ఆదినారాయణ, ఐనంపూడి గోపి తదితరులు పాల్గొన్నారు.

భార్యను హత్యచేసిన భర్త
కనిగిరి, ఆగస్టు 1: భార్యను భర్త హత్యచేసిన సంఘటన గురువారం నగర పంచాయతీలోని శివనగర్ కాలనీలో జరిగింది. ఈసంఘటన కనిగిరిలో సంచలనం రేపింది. వివరాలలోకి వెళితే భర్త రాచూరి రవి డ్రైవర్‌గా పనిచేస్తుండగా భార్య రాచూరి సుగుణ (25) కాలనీలో ఇస్ర్తి బంకు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వ్యసనాలకు బానిసైన రవి భార్యను అతి కిరాతకంగా ఇంట్లోనే మొద్దుకత్తితో నరికాడు. చేతి బొటనవేలు అక్కడే పడి ఉంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భార్యను ఇంటిముందు నడిరోడ్డుపై ఈడ్చుకుపోయి మొద్దుపై తలనుపెట్టి మెడ తేగేలా అతి దారుణంగా నరికి చంపాడు. ఆతరువాత కత్తితో సహా బజారులో నడిచివెళుతూ అడ్డుపడిన వారిని విపరీతంగా దుర్భాషలాడుతూ ఉండగా వెంకటేశ్వర మహల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలికి ఏడేళ్ల కూతురు అనూష, ఐదేళ్ల కుమారుడు కార్తీక్ ఉన్నారు. తల్లి మృతిచెందగా, తండ్రి జైలుపాలవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈసంఘటన తెలుసుకున్న పట్టణ ప్రజలు తండోపతండాలుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అమాయక చూపులతో చూస్తున్న చిన్నారులను చూసి అక్కడికి చేరిన జనం కంటతడిపెట్టారు. సంఘటనా స్థలాన్ని సిఐ పి కరుణాకర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసిన మంత్రి మహీధర్‌రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి
కందుకూరు, ఆగస్టు 1: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా కందుకూరు శాసన సభ్యులు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలు గురువారం సాయంత్రం శాసనసభ సభ్యత్వానికి రాజీనామాలను చేసి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. ఈప్రాంతంలోని ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారిరువురు రాజీనామాలు సమర్పించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ప్రజలు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు తాము సమాదానం ఏవిధంగా చెప్పాలని అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి మహీధర్‌రెడ్డి సీమాంధ్ర మంత్రులతో కలిసి రాష్ట్ర విభజనకు ముందు ఢిల్లీ చేరుకుని విభజనను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే సీమాంధ్ర మత్రులు, నాయకులు, ఎంపిలు అధిష్ఠానాన్ని ఒప్పించడంలో విఫలం చెందగా, విభజన ప్రకటన రావడం జరిగింది. విభజన ప్రకటన వెలువడిన అనంతరం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ప్రజలు ఆందోళనబాట పట్టగా ప్రజల మనోభావాలకు విలువనిచ్చి తమ రాజీనామాలను అందజేసినట్లు తెలుస్తోంది.
సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో
కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం
ఒంగోలు, ఆగస్టు 1: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులో కొవ్వొత్తులతో గురువారం ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక సివిఎన్ రీడింగ్ రూము వద్ద అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద మానవహారాన్ని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. తొలుత పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ డౌన్ డౌన్, యుపిఏ ప్రభుత్వం డౌన్ డౌన్, ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తరువాతనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్‌సిపి వారు రాజీవ్‌గాంధీ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయండి మాకు పదవులు ముఖ్యం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. విజయవాడ ఎంపి లగడపాటి రాజ్‌గోపాల్ తన పదవికి రాజీనామా చేయకుండా సమైక్యాంధ్రపై మాట్లాడడం సరైంది కాదన్నారు. పదవికి రాజీనామా చేస్తే ఏం ఉపయోగం ఉంటుందని రాజ్‌గోపాల్ అనడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రాజకీయాలకు అతీతంగా బయటకువచ్చి సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాటం అరుణమ్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సిపి ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టడం అన్యాయమని, సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌సిపి జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి సూర్య మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని, సమైక్యాంధ్రను సాధించేంత వరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు రొండా అంజిరెడ్డి, నరాల రమణారెడ్డి, వెల్నాటి మాధవరావు, కెవి ప్రసాద్, ముదివర్తి బాబూరావు, దుంపా చెంచురెడ్డి, భీమేష్, చింతపల్లి గోపి, కెకె రాజు, తోటపల్లి సోమశేఖర్, రమేష్, మహిళా నాయకురాళ్ళు గంగాడ సుజాత, కావూరి సుశీల, బడుగు ఇందిర, బి రాజేశ్వరి తదితర నాయకులు కార్యకర్తలు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

జిల్లాలో ఊపందుకున్న సమైక్యాంధ్ర ఉద్యమం కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులు జాతీయ రహదారి దిగ్బంధనం ఒంగోలులో మానవహారం
english title: 
protests

విభజనపై మిన్నంటిన నిరసనలు

$
0
0

గుంటూరు, ఆగస్టు 1: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, సమైక్యాంధ్రను కొనసాగించాలని కోరుతూ వివిధ సంఘాలు, రాజకీయ పక్షాలు, విద్యార్థి, ఉద్యోగ లోకం ముక్తకంఠంతో నినదించింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ 72 గంటల బంద్‌లో భాగంగా రెండవ రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, బైఠాయింపులు, ధర్నా, మానవహారాలు నిర్వహిస్తూ తమ నిరసనను తెలియజేశారు. రెండవ రోజు కూడా విద్య, వాణిజ్య, వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా మూతపడగా ఎపి ఎన్‌జివో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గృహాన్ని ఎపి ఎన్‌జివో అసోసియేషన్, సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో ముట్టడించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను నిలిపివేయగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించి, హిందూ కళాశాల సెంటర్‌లో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాయపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాజ్‌సెంటర్‌లో రాష్ట్ర విభజనకు నిరసనగా వౌనదీక్షను చేపట్టారు. కన్న స్కూలు విద్యార్థులు కొత్తపేటలోని శనక్కాయల ఫ్యాకర్టీ సెంటర్‌లో అధిక సంఖ్యలో మానవహారం నిర్వహించి, సమైక్యాంధ్రను కోరుతూ నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ జెఎసి నాయకులు టిడిపి ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని వినతిపత్రం అందజేశారు. ఇలా ఉండగా జిల్లాలోని 12 డిపోల పరిధిలో బుధ, గురువారాల్లో బస్సులను ఆందోళన కారులు అడ్డుకోవడంతో 90 లక్షల రూపాయల ఆదాయానికి గండిపడింది. నవోదయం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమైక్యాంధ్రను కోరుతూ జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలియజేశారు.

రాజీనామా చేసి ఉద్యమంలోకి రండి
* ప్రజాప్రతినిధులకు సమైక్యాంధ్ర రాజకీయ జెఎసి పిలుపు
గుంటూరు (పట్నంబజారు), ఆగస్టు 1: ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని సమైక్యాంధ్ర రాజకీయ జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జిన్నాటవర్ సెంటర్‌లోని గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జెఎసి నాయకులు మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు చేయడాన్ని సాగతిస్తున్నామన్నారు. అధిష్ఠానం తాయిలా లు, బుజ్జగింపులకు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు లొంగితే ప్రజలు క్షమించరన్నారు. నాయకులను ద్రోహులుగా పరిగణించి వారి ఫొటోలను అన్ని గ్రామాల్లో ప్రదర్శిస్తామని జెఎసి నాయకులు హెచ్చరించారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఈనెల 2వ తేదీ జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామన్నారు. 3వ తేదీ జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం, 4వ తేదీ జాతీయ రహదారుల దిగ్బంధనం, 5వ తేదీ జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థులచే ర్యాలీలు, కలెక్టరేట్ ముట్టడి, 6వ తేదీ కేంద్రప్రభుత్వ కార్యాలయాల బంద్, 7వ తేదీ రైల్‌రోకో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సమైక్యాంధ్ర రాజకీయ జెఎసి అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, గౌరవాధ్యక్షుడు మోదుగుల పాపిరెడ్డి, నాయకులు ఎస్ శ్రీ్ధర్, క్రోసూరి వెంకట్, మండూరి వెంకట రమణ, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, ప్రొఫెసర్ ఎన్ శామ్యూల్, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బాలశౌరి గుడ్‌బై

గుంటూరు, ఆగస్టు 1: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా పార్లమెంటు మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వల్లభనేని బాలశౌరి గురువారం పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన బాలశౌరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి బాలశౌరి ఆంధ్రభూమితో మాట్లాడుతూ సీమాంధ్రకు సంబంధించి ఎటువంటి విధి విధానాలు రూపొందించకుండా నీటి వనరుల పంపిణీ తదితర అంశాలను చర్చించకుండా గుడ్డిగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ తదితరులు తెలంగాణ విషయంలో దీర్ఘంగా చర్చించిన తర్వాతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిర్ణయించారని, అటువంటిది ప్రస్తుతం తమ పూర్వీకుల మనోభీష్టాలను తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయం తీసుకుందని బాలశౌరి మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల పక్షాన నిలబడి తాను ఉద్యమంలో పాల్గొంటానని, రాజకీయాలకు అతీతంగా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతునిస్తున్నట్లు బాలశౌరి పేర్కొన్నారు.

‘సమైక్య’ జేఏసీ ఆధ్వర్యంలో తెనాలి బంద్ ప్రశాంతం
* యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం * పాసింజర్ రైలును అడ్డుకున్న ఆందోళనకారులు
తెనాలి, ఆగస్టు 1: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రెండవ రోజైన గురువారం కూడా ఉద్యమ జెఎసి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఉదయం 9గంటలకు శివాజీచౌక్‌కు చేరుకున్న ఉద్యమ జెఎసి నాయకులు వైఎస్‌ఆర్ సిపి ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అన్నాబత్తుని సదాశివరావు ఆధ్వర్యంలో యువత పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలో పాల్గొని పట్టణంలో బంద్‌కు పిలుపుఇచ్చారు. దీంతో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ఆందోళనకారులకు సహకరించి షాపులు మూసి వేశారు. సినిమా థియేటర్లు రెండు పగటి ఆటలు నిలిపివేశారు. బ్యాంకులు కూడా మూతపడటంతో బ్యాంక్ లావాదేవీలలోప్రధానంగా పెన్షన్‌దారులు కొంత అసౌకర్యానికి లోనయ్యారు. ఎటిఎంలు కూడా మూతపడటంతో వినియోగ దారులకు అసౌకర్యానికి లోనయ్యారు. ఉద్యమకారులు భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనలను వినియోగించడం వల్ల బంద్ లక్ష్యం నెరవేరింది. జై సమైక్యాంధ్ర, కేసిఆర్ డౌన్ డౌన్,సోనియా డౌన్ డౌన్ అంటు యువత నినాదాలు చేశారు. గాంధీచౌక్‌లో, చెంచుపేట సెంటర్‌లో ఉద్యమ కారులు సోనియ దిష్టిబొమ్మను, యుపిఎ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓ దశలో రైల్వేస్టేషన్ సెంటర్‌కు చేరుకున్న ఆందోళనకారులు ముఖ్యంగా యువత ఒక్కసారిగా తమ ద్విచక్రవాహనాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి వెళ్ళి, వాహనాలుప్రధాన ద్వారం వద్ద నిలిపి వేసి స్టేషన్‌లోకి పరుగులు తీశారు. అప్పుడే వచ్చిన గుంటూరు పాసింజర్ సేషన్‌లో నిలువగానే, ఆందోళనకారులు రైలు ఇంజన్ ముందుభాగంలో బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆందోళనకారులను హుకుం జారీ చేయడంతో ఆందోళన కారులు సమైక్యవాద నినాదాలు చేస్తూ పట్టాల మీద నుండి పక్కకు వచ్చారు. ప్రజల నిత్యావసరాలైన పాలు, కూరగాయలు, మెడికల్ షాపులకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఉద్యమ జెఎసి ముఖ్యులు ఆందోళనలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి
గుంటూరు , ఆగస్టు 1: సకల సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో రాష్ట్రం కలిసి ఉంటే ఉపయోగమా, విడిపోతే ఉపయోగమా అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్‌జిఒల సంఘం మాజీ అధ్యక్షుడు బి సాంబిరెడ్డి మాట్లాడుతూ విభజన, సమైక్యత ఏదైనా వాస్తవిక రాజ్యాంగ ప్రాతిపదికపై ఉండాలన్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి రాజ్యాంగం ఇస్తున్న అధికారాన్ని ఉపయోగించాలని కేంద్రంలో పాలకులు నిర్ణయించినప్పుడు భావోద్వేగాలకే పరిమితమైతే ఫలితం ఉండదన్నారు. కోట్ల మందికి సంబంధించిన ఈ సమస్యను అన్ని పార్టీలతో ముడిపడిన వ్యవహారాన్ని స్వంతపార్టీ ప్రయోజనాల పాకులాటగా మార్చింది కాంగ్రెస్ నాయకత్వమేనన్నారు. అధ్యాపకులు ఇ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్న, పాలించాలనుకుంటున్న పార్టీలన్నీ వారు చేయగూడనిపని చేశారని ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య తంపులు పెట్టారన్నారు. ఇకనైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలన్నారు. కిసాన్ ఫౌండేషన్ డైరెక్టర్ కె మురళీధరరావు మాట్లాడుతూ పైకి ఏం చెప్పినా తమ తమ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి ఎక్కడ ఏమి చేయాలన్నది పార్టీలు, నాయకులు కూడా ఆలోచిస్తున్నారన్నారు. గోష్ఠికి అధ్యక్షత వహించిన అవగాహన సంస్థ కార్యదర్శి కొండ శివరామిరెడ్డి మాట్లాడుతూ విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామంటున్న తెలంగాణ వాసులకి హైదరాబాద్‌ని శాశ్వతంగా ఉమ్మడి రాజధానిగా కోనసాగిస్తే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ గోష్ఠిలో సంస్థ సీనియర్ సభ్యుడు భీమినేని దయాసాగర్, రిటైర్డ్ అధికారి బి సూరయ్యచౌదరి, పిఎస్ మూర్తి, ఎల్ మురళీకృష్ణ తదితరులు ప్రసంగించారు.
వర్సిటీలో పిజిఇసెట్ కౌనె్సలింగ్‌ను అడ్డుకున్న జెఎసి నాయకులు
నాగార్జున యూనివర్సిటీ, ఆగస్టు 1: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర నిరసనలు నాగార్జున వర్సిటీలో రెండవరోజు కూడా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అన్ని విద్యార్థి సంఘాలు, సమైక్యాంధ్ర జెఎసి నేతలు వర్సిటీలో ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనలో భాగంగా రెండవరోజైన గురువారం కూడా వర్సిటీలో విద్యార్థులు బంద్ పాటించి తెరిచి ఉంచిన పరీక్షాభవన్, పలు విభాగాలను మూయించి వేశారు. వర్సిటీ హెల్ప్‌లైన్ సెంటర్‌లో జరుగుతున్న పిజిఇసెట్ కౌన్సిలింగ్‌ను జెఎసి నేతలు అడ్డుకున్నారు. ఈ సంధర్భంగా పిజిఇసెట్ కౌన్సిలింగ్ అధికార్లు, విద్యార్థులకు స్వల్ప వాగ్వివాదం జరిగింది. రాష్ట్రంలోని ప్రతిఒక్కరి ప్రయోజనాలను ఆశించి తాము సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నామని, తమకు సహకరించి కౌన్సిలింగ్‌ను వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థులు కౌన్సిలింగ్ సెంటర్ వద్ద ధర్నా చేశారు. ఇదే సమయంలో పోలీసులు పెద్దయెత్తున్న ఆ సెంటర్‌కు చేరుకోవటంతో విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దత్తుగా నినాదాలు చేశారు. దీంతో అధికారులు గురువారం, శుక్రవారం జరగాల్సిన పిజిఇసెట్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేసినట్లు ప్రకటించారు. దీనికి సంతృప్తి చెందిన విద్యార్థులు ఆందోళన విరమించి ప్రదర్శనను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ సమైక్యాంధ్ర జెఎసి నాయకులు బి ఆశీరత్నం, పి శ్యాంసన్, కె కిషోర్, వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

‘తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు’
గుంటూరు , ఆగస్టు 1: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, సీమాంధ్ర ప్రజల మనోభావాలకు దెబ్బతగిలే విధంగా యుపిఎ ప్రభు త్వం వ్యవహరించిందని, తగిన విధం గా బుద్ధిచెప్పేందుకు తాము ఏ నిముషంలోనైనా రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఎం, పార్లమెంటు సభ్యులు, మంత్రు లు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధిన తాకట్టుపెట్టారని, విభజనకు ముందు సోనియాగాంధీ ఇచ్చిన ముసాయిదాను తీసుకోకుండా వెనుదిరిగి వచ్చి, ఇప్పుడు రాజీనామాలు చేస్తామని మరో మోసపూరితమైన తెర లేవనెత్తారన్నారు. విభజనకు ముందే రాజీనామాలు చేసి ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదన్నారు. తెలుగుజాతిని ఒక ప్రయోగశాలగా మార్చుకుని కేంద్రం ఈ నిర్ణయాని కొచ్చిందన్నారు.ప్రత్యేక రాష్ట్రం నిర్ణయంలో మార్పులేక పోతే సీమాంధ్ర ప్రాంతంలో 5 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించి రాష్ట్ర విభజన పెట్టే బిల్లులో దీనికి గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ దొంగే దొంగ అని పిలిచినట్లుగా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారన్నారు. శాసనసభ్యులు స్పీకర్‌కు, మంత్రులు గవర్నర్‌కు రాజీనామాలు ఇస్తే ఆమోదం లభిస్తుందే తప్ప అర్హత లేని వారికి రాజీనామాలు ఇస్తే ఎలా ఆమోదం పొందుతాయని ప్రశ్నించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి రాజామాస్టారు, దామచర్ల శ్రీనివాసరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు, నల్లపనేని విజయలక్ష్మి, పానకాల వెంకట మహాలక్ష్మి, రావిపాటి సాయి, పప్పుల దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్న సమైక్యాంధ్ర ఉద్యమ జెఎసి నేతలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులకు వినతిపత్రాన్ని అందజేశారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమైక్యతకు తూట్లు పొడిచారని, రాష్టవ్రిభజనకు సానుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. సమైక్యాంధ్ర కోసం తెలుగదేశం పార్టీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించారు. వినతిపత్రం అందజేసిన వారిలో చంద్రగిరి ఏడుకొండలు వైవి సురేష్, రాంబాబు, వెంకటరమణ, లంకా మాధవి తదితరులున్నారు.
మల్లవోలులో లాఠీచార్జి
మాచవరం, ఆగస్టు 1: మండలంలోని మల్లవోలులో తమ ఓట్లను తొలిగించారనే కారణంతో గురువారం తెల్లవారుఝాన ఒక వర్గానికి చెందిన మహిళలపై మరొకవర్గం వారు దాడిచేశారు. ఈదాడిలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోడంతో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పిడుగురాళ్ళ రూరల్ సిఐ బిలాలుద్ధీన్, ఎస్‌ఐ షఫీ గ్రామానికి చేరుకుని ఇరువర్గాలవారికి నచ్చచెప్పగా, వినకపోవడంతో ఇరువర్గాలపై లాఠీచార్జి చేశారు. లాఠీచార్జిలో ఇద్దరు గాయాలపాలయ్యారు. గ్రామంలో పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటుచేశారు.

దేహం ముక్కలైనా రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం
* ఎమ్మెల్యే ప్రత్తిపాటి రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళన

చిలకలూరిపేట, ఆగస్టు 1: దేహం ముక్కలైనా రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమంటూ నినదిస్తూ చిలకలూరిపేట విద్యార్థి సంఘాలు సమైక్యాంధ్ర కోరుతూ గురువారం పట్టణంలో ర్యాలీ, నిరసన, బంద్‌లు నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు మద్దతుగా వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి. సుగాలి కాలనీ యూత్ ఆధ్వర్యంలో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో పాఠశాలలను మూయించివేశారు. ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని జాతీయ రహదారిపై ఎఎంజి విద్యార్థులు, పలు విద్యార్థి సంఘాలు మానవహారంగా ఏర్పడి జాతీయ రహదారిపై దిగ్బంధించారు. ఈ నిరసనకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతున్న సమయంలో విద్యార్థులు ఆయన రాజీనామా చేయాలంటూ ఆందోళన చేశారు. స్పందించిన పుల్లారావు ప్రజాభిప్రాయం మేరకు తాము ఏ త్యాగానికైనా సిద్ధమని, ఎమ్మెల్యే పదవి తృణప్రాయమన్నారు. అదేవిధంగా స్థానిక వైఎస్‌ఆర్ సిపి నాయకులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో అనేక చోట్ల కెసిఆర్, సోనియాగాంధీల గడ్డిబొమ్మలను విద్యార్థి సంఘ నాయకులు దగ్ధం చేశారు.

ఆర్టీసీ ఆదాయానికి
90 లక్షలు గండి
గుంటూరు , ఆగస్టు 1: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర జెఎసి నాయకులు తలపెట్టిన బంద్ కారణంగా గత రెండు రోజులుగా రీజియన్ పరిధిలోని 12 డిపోల్లో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి 90 లక్షల రూపాయల ఆదాయానికి గండి పడినట్లు ఆర్‌ఎం పివి రామారావు పేర్కొన్నారు. సమైక్యాంధ్ర జెఎసి నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్ వద్ద బుధ, గురువారాలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని పలు డిపోల వద్ద ఆందోళన కారులు బస్సులను అడ్డుకోవడంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం తెనాలి, చిలకలూరిపేట డిపోల నుండి బస్సులను బయటకు రానివ్వకుండా సాయంత్రం 3 గంటల వరకు ఆందోళన కారులు అడ్డుకోగా గుంటూరు ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లో ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆందోళన కారులు బస్సులు నిలుపుదల చేశారు. జిల్లాలో ఇతర డిపోల్లో కూడా మధ్యాహ్నం వరకు బస్సులు కదలకపోవడంతో రీజియన్ పరిధిలోని 12 డిపోల్లో రెండు రోజులకు గాను 90 లక్షల రూపాయల ఆదాయానికి గండిపడినట్లు రామారావు తెలిపారు.
సమైక్యాంధ్ర కోరుతూ విద్యార్థుల భారీ ర్యాలీ
మంగళగిరి, ఆగస్టు 1: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రగానే రాష్ట్రాన్ని ఉంచాలని డిమాండ్ చేస్తూ గురువారం మంగళగిరి పట్టణంలో పట్టణ పరిసర గ్రామాలకు చెందిన పలువురు ప్రైవేట్ సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాలిగోపురం ఎదుట గల గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా తాలూకా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరింది, అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారంగా ఏర్పడి తెలంగాణా వద్దని, సమైక్యాంధ్రే కావాలని నినాదాలు చేశారు. విజె డిగ్రీ కళాశాల, నిర్మలా జూనియర్ కాలేజీ, వాణీ మోడల్ హైస్కూల్, ఎస్‌ఎల్‌ఎం చైతన్య హైస్కూల్, నాగార్జున, విజేత, ఎస్‌ఎస్ టాలెంట్, న్యూ కెనడీ, అరవింద హైస్కూల్‌కు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

పునరావాస పనులు
నెలాఖరులోగా పూర్తి చేయాలి
* కలెక్టర్ సురేష్‌కుమార్
గుంటూరు, ఆగస్టు 1: పులిచింతల ప్రాజెక్టు ముంపు బాధితులకు కల్పిస్తున్న పునరావాస సహాయ కార్యక్రమాలను నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం డిఆర్‌సి సమావేశ మందిరంలో ప్రాజెక్టు అధికారులు, నిర్వాసితులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించే అవకాశమున్నందున బాధితులకు సహాయ చర్యలను వేగవంతం చేయాలన్నారు. అమ్మహస్తం పథకం కింద నిత్యావసర సరుకుల పంపిణీని ఈనెల నుండి కొత్త కాలనీలోని కుటుంబాలకు అందించడం జరుగుతుందన్నారు. చౌకధరల దుకాణాలు, కమ్యూనిటీ భవనాలు దేవాలయాలు, తదితర సౌకర్యాలను త్వరితగతిన ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెసి డి మురళీధర్‌రెడ్డి, ప్రాజెక్టు ఇన్‌చార్జి ప్రత్యేక కలెక్టర్ కె నాగబాబు, డ్వామా, డిఆర్‌డిఎ పిడిలు ఎస్ ఢిల్లీరావు, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో 87 శాతం పోలింగ్
* 8న 13 పంచాయతీలకు రీపోలింగ్ * నేడు పంచాయతీల్లో తొలి సమావేశాలు: కలెక్టర్ సురేష్‌కుమార్
గుంటూరు, ఆగస్టు 1: జిల్లా వ్యాప్తంగా గత నెలలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 87 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1010 గ్రామ పంచాయతీలకు గాను 838 గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌లు ఎన్నికయ్యారని తెలిపారు. 2 గ్రామ పంచాయతీల్లో ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదని, 142 పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. వివిధ కారణాల వల్ల ఎన్నిక వాయిదా పడిన 13 గ్రామ పంచాయతీల్లో ఈనెల 8వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రీపోలింగ్ జరగనున్న పంచాయతీల్లో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని పేర్కొన్నారు. 10654 వార్డులకు గాను 3,484 వార్డులు ఏకగ్రీవం కాగా 40 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదన్నారు. 6991 వార్డుల్లో ఎన్నికలు జరిగాయని, 139 వార్డులకు ఈనెల 8వ తేదీన రీపోలింగ్ జరగనుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంలో సహకరించిన వారికి ఈ సందర్భంగా కలెక్టర్ అభినందనలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఈనెల 2వ తేదీన తొలి సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. ఈసమావేశంలో రిటర్నింగ్ అధికారులు ధృవపత్రాలు అందజేయడమే కాకుండా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. ఉప సర్పంచ్ ఎన్నిక జరగని గ్రామ పంచాయతీలకు ఈనెల 6న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఉప సర్పంచ్‌ను ఎన్నుకోవాల్సి ఉందన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించిన 107 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి 342 కేసులు నమోదు చేయగా 236 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గుంటూరు నగరపాలక సంస్థ మినహా మిగిలిన 12 మున్సిపాలిటీలలో గురువారం నుంచి పోలింగ్ స్టేషన్ల ఖరారు ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పారు. 2వ తేదీన ముసాయిదా జాబితా విడుదల చేస్తామని అభ్యంతరాలేవైనా ఉంటే ఈనెల 3 నుండి 5 వరకు ఆయా మున్సిపల్ కమిషనర్లు స్వీకరిస్తారన్నారు. 12వ తేదీన అన్ని మున్సిపాలిటీలలో పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 667 పోలింగ్ కేంద్రాలు అవసరమవుతాయని అంచానా వేసినట్లు చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో 10,85,651 మంది ఓటర్లు ఉండగా గుంటూరు మినహా 6,05,072 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. రచ్చబండలో స్వీకరించిన పించన్ల దరఖాస్తులలో కొత్తగా 34,945 పించన్లు మంజూరయ్యాయని కలెక్టర్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు.
హైవేపై గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడేపల్లి, ఆగస్టు 1: తాడేపల్లి మండల పరిథిలోని కుంచనపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న హైవేపై గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతునికి సుమారు 35-40 సంవత్సరాల వయస్సు వుండవచ్చని భావిస్తున్నారు. మృతదేహం సమీపంలో ఒక పక్కగా విడిచిన లెదర్ షూ మోడల్‌లో ఉన్న చెప్పుల జత వుంది. మృతుడి ఒంటిపై బ్లూ రంగు చారల చొక్కా, ఆకుపచ్చ రంగు ప్యాంటు, మెడలో ఎర్రదారంతో కూడిన రుద్రాక్ష ధరించి వున్నాడు. హైవే పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందించడంతో తాడేపల్లి ఎస్‌ఐ రవిబాబు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో ప్రమాదవశాత్తు సదరు వ్యక్తి మృతిచెంది వుంటాడని గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు
మంగళగిరి, ఆగస్టు 1: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను గురువారం మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసరావు, తహశీల్దార్ పి శివరామకృష్ణ పరిశీలించారు. పట్టణంలో 32 వార్డుల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో భాగంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించామని కమిషనర్ తెలిపారు.
పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయం
అమరావతి, ఆగస్టు 1: పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని లేమల్లె సర్పంచ్ మేకల చిన్నచెంచు అన్నారు. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిన వివిధ పెన్షన్ల సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగ పర్చుకోవాలని కోరారు. లేమల్లె గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కంతేటి కృష్ణకె సునీల్, పి శంకర్, బందంరావూరి శ్రీనివాసరావు, షేక్ ఖాశిం, శ్రీనివాసరావు, మేకల నాగులు తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర కోసం ధర్నా
యడ్లపాడు, ఆగస్టు 1: యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై డైట్ కళాశాల విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దాదాపు గంటసేపు ధర్నా నిర్వహించి ఆందోళన విరమించారు.
పొన్నూరులో వైఎస్‌ఆర్ సిపి ఆధ్వర్యంలో బంద్
పొన్నూరు, ఆగస్టు 1: రాష్ట్ర విభజనకు పూనుకున్న కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చర్యలను గర్హిస్తూ వైఎస్‌ఆర్ సిపి పిలుపుమేరకు గురువారం పొన్నూరు పట్టణ బంద్ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సిపి కార్యకర్తలతో పాటు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు పట్టణ కూడలిలో రాస్తారోకో జరిపారు. విభజన యోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సమైక్యవాదులు, విద్యార్థులు కూడా ర్యాలీ జరిపారు. సోనియాగాంధీ గడ్డిబొమ్మను పట్టణ కూడలిలో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి నేతలు బి రంగారావు, గురుబాలు, వెంకటస్వామి, పరశురామయ్యతో పాటు నియోజకవర్గ వైఎస్‌ఆర్ సిపి ఇన్‌చార్జి రావి అనుచర బృందం పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో దారిదోపిడీ దొంగలు
అచ్చంపేట, ఆగస్టు 1: పశువుల సంత నుండి నగదుతో వస్తున్న యువకుని వద్ద నుండి డబ్బులు బలవంతంగా కాజేయాలని చూసిన దారిదోపిడి దొంగల ముఠాను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన అంకర్ల వీరయ్య క్రోసూరులో జరుపుతున్న పశువుల సంతలో 11 వేలకు గేదెను అమ్ముకుని తిరుగు ప్రయాణమయ్యాడు. అప్పటికే విషయాన్ని గ్రహించిన దొంగల ముఠా ఆటోతో వచ్చి అచ్చంపేట వైపు వెళ్తున్నామని ఆటోలో ఎక్కించుకున్నారు. గ్రంథసిరి గ్రామ అడ్డరోడ్డు వద్దకు చేరుకోగానే మూడు ముక్కలాట పేరుతో అతని వద్ద నుంచి నగదు కాజేయాలని ప్రయత్నించారు. దీంతో ఎదురు తిరిగిన అతడిని ఆటో నుండి పడవేయాలని ప్రయత్నిస్తుండగా అటువైపుగా వస్తున్న పోలీసులు గమనించి ముఠా సభ్యులైన సత్తెనపల్లికి చెందిన కాపుశెట్టి రామారావు, వంకాయలపాటి శివప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. వీరయ్య ఫిర్యాదు మేరకు అచ్చంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* మంత్రి కన్నా ఇంటిని ముట్టడించిన ఎపి ఎన్‌జివోలు * రెండో రోజూ కొనసాగిన సమైక్య బంద్
english title: 
ngos

ఊపందుకున్న సమైక్యాంధ్ర ఉద్యమం

$
0
0

మచిలీపట్నం ఆగస్టు 1: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఊపందుకుంది. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు, ర్యాలీలు, బంద్‌లతో జిల్లా గురువారం హోరెత్తింది. ఉద్యోగ, విద్యార్థి, కార్మిక సంఘాలు, న్యాయవాదులతో కూడిన జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం తారస్థాయికి చేరింది. జిల్లా కేంద్రం మచిలీపట్నం సహా గుడివాడ, నూజివీడు, తిరువూరు, కైకలూరు, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, మైలవరం, చిల్లకల్లు, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి, పామర్రు ఇలా అన్ని మండలాల్లోనూ సమైక్యాంధ్ర ఉద్యమం వేడెక్కింది. మచిలీపట్నంలో కలెక్టరేట్ సహా మిగతా ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులు మూయించేశారు. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఎక్కడికక్కడ ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో పట్టణం అట్టుడికింది. బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసి నాలుగు రోడ్లను దిగ్బంధించారు. లక్ష్మీ టాకీస్ సెంటర్, రామానాయుడుపేట, కోనేరు సెంటరు తదితర ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలతో అభిషేకం చేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతామని హెచ్చరించారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రాన్ని యుపిఎ స్వార్థం కోసం ముక్కలు చేసిందని విరుచుకుపడ్డారు. ఆద్యంతం ప్రభుత్వ విధానంపై నిప్పులు చెరిగారు. ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. జెఎసి ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సమాలోచన చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాలతో పాటు కానె్వంట్స్ అసోసియేషన్, విద్యార్థి సంఘాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆర్యవైశ్య సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంఘం, లాయర్లు పాల్గొన్నారు. గుడివాడలో సంపూర్ణ బంద్ పాటించి మోటారు బైక్ ర్యాలీ పెద్దఎత్తున నిర్వహించారు. కొద్దిసేపు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. నూజివీడులో ఆందోళన చేస్తున్న 100 మందిని అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. రోజురోజుకూ సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రజల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది.
దివిసీమలో ఉద్ధృతమైన సమైక్యాంధ్ర ఉద్యమం
అవనిగడ్డ, ఆగస్టు 1: సమైక్యాంధ్రనే కొనసాగించాలని కోరుతూ అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలకు చెందిన విద్యార్థులు, వాణిజ్య, వ్యాపారవేత్తలు, ఎన్జీవోలు, న్యాయవాదుల సంఘం సభ్యులు, ఆర్టీసీ డిపో ఎంప్లారుూస్ యూనియన్ కార్మికులు ఆందోళన ఉద్ధృతం చేశారు. ఆయా సంఘాలకు చెందిన ప్రతినిధులు, సభ్యులు ప్రధాన వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రాన్ని విడదీస్తే కాంగ్రెస్ సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంపై అవగాహన లేని సోనియా, మన్మోహన్ తదితర నాయకులు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వారు తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ నాయకులు ధర్నా చేశారు. విద్యార్థులు రాస్తారోకో జరిపారు. న్యాయవాదులు విధులను బహిష్కరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సింహాద్రి రమేష్‌బాబు, కడవకొల్లు నరసింహారావు, యాసం చిట్టిబాబు, గాజుల మురళి, దాసి దేవదర్శనం తదితరులు ఆందోళనకారులకు మద్దతు తెలిపారు.
అదనపు జిల్లా జడ్జి రంగారావుకు ఘనంగా వీడ్కోలు
మచిలీపట్నం లీగల్ ఆగస్టు 1: ఆరవ అదనపు జిల్లా జడ్జిగా వ్యవహరించి రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టుకు ఇటీవల బదిలీ అయిన కె రంగారావుకు పట్టణ న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈసందర్భంగా న్యాయవాదుల సంఘ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంగారావు మాట్లాడుతూ న్యాయవాదుల సహకారం వల్ల తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించ గలిగానన్నారు. న్యాయ వ్యవస్థ పరంగా ఘన చరిత్ర కలిగిన మచిలీపట్నంలో అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జిల్లా జడ్జి జి చక్రధరరావు మాట్లాడుతూ రంగారావు న్యాయమూర్తిగా విధులను సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. న్యాయమూర్తి రంగారావును న్యాయవాదులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి పట్టణ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఆరెపు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.

రామకృష్ణ మృతి, సిఐ కాల్పుల ఘటనలపై సబ్ కలెక్టర్ విచారణ
జి.కొండూరు, ఆగస్టు 1: మండల పరిధిలోని కోడూరు గ్రామానికి చెందిన యువకుడు పలగాని రామకృష్ణ అనుమానాస్పద మృతి, అప్పటి మైలవరం సిఐ బంగార్రాజు కాల్పులు జరిపిన సంఘటనలపై విజయవాడ సబ్ కలెక్టర్ దాసరి హరిచందన గురువారం మెజిస్టీరియల్ విచారణ నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7.30 గంటల వరకూ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా 50 మందికిపైగా సబ్ కలెక్టర్ ఎదుట హాజరై వారి వాంగ్మూలాలను ఇచ్చారు. మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో రామకృష్ణ భౌతికకాయానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన డాక్టర్ భారతి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బి శ్రీనివాసరావుతో పాటు అప్పటి జి.కొండూరు ఎస్‌ఐ అబ్దుల్ హక్, సిఐ యు బంగార్రాజు, మృతుడు రామకృష్ణ తల్లిదండ్రులు సాంబశివరావు, వాణి, బంధువులు పేరమ్మ, తాళం వెంకట రాంబాబు, మాజీ సర్పంచ్‌లు వీరంకి వెంకట నరసింహారావు, గరికపాటి జయపాల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేశం సుధాకరరెడ్డి, ఆహార సలహా సంఘం సభ్యుడు గార్లపాటి వెంకట్రావు, కొందరు విలేఖరులు సబ్ కలెక్టర్ ఎదుట హాజరై వాంగ్మూలాలను ఇచ్చారు.

రామకృష్ణది ముమ్మాటికీ హత్యే: తల్లి వాణి
తన కుమారుడు పలగాని రామకృష్ణను పోలీసుల సహకారంతోనే, బెజవాడ రాజేశ్వరికి చెందిన వారు పొట్టనబెట్టుకున్నారని తల్లి వాణి సబ్ కలెక్టర్‌కు విచారణలో తేల్చి చెప్పింది. రాజేశ్వరితో పాటు, తన కుమారుడు కలసి ఉన్నట్లు ఫోటోలు ఉన్నాయని చెప్పింది. తమిళనాడులోని సేలం వద్ద సర్వమంగళం పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరినీ స్వాధీనం చేసుకుని, చెన్నై నుంచి వచ్చే క్రమంలో తాడేపల్లి మండలం ఇప్పటం వద్ద తన కుమారుడిని రైలు నుంచి దింపి పథకం ప్రకారం హత్య చేశారని తెలిపింది. దీనిపై తనకు న్యాయం అడుగుదామని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తమ పట్ల ఎస్‌ఐ అబ్దుల్ హక్ దురుసుగా వ్యవహరించడంతో పరిస్థితి అదుపు తప్పిందని తెలిపింది. అంతలోనే సిఐ బంగారురాజు అక్కడికి చేరుకుని హఠాత్తుగా కాల్పులు జరిపారని వివరించింది. తనకు న్యాయం చేయమని సబ్ కలెక్టర్ ఎదుట కన్నీటి పర్యంతమైంది.

సర్వమంగళం నుంచి రాజేశ్వరిని మాత్రమే తీసుకువచ్చాం: హక్
తమిళనాడులోని సేలం వద్ద సర్వమంగళం పోలీస్ స్టేషన్ నుంచి బెజవాడ రాజేశ్వరిని మాత్రమే స్థానిక కానిస్టేబుల్ సాంబశివరావు తీసుకువచ్చాడని అప్పటి ఎస్‌ఐ అబ్దుల్ హక్ సబ్ కలెక్టరుకు వెల్లడించారు. రాజేశ్వరి కుటుంబ సభ్యులు కూడా కానిస్టేబుల్‌తో పాటు సర్వమంగళం వెళ్ళారన్నారు. సర్వమంగళం పోలీసులు రాజేశ్వరి, రామకృష్ణ కలసి ఉన్న ఫోటోలను తీశారని, ఆ ఫోటోలను స్థానిక కానిస్టేబుల్ తన సెల్‌ఫోన్‌లోకి లోడ్ చేశారన్నారు. అవే ఫోటోలను చూసిన ఇక్కడి బాధితులు ఇద్దరినీ తాము స్వాధీనం చేసుకుని, ఆ ఫోటోలు తామే తీసినట్లు భ్రమిస్తున్నారన్నారు. వాస్తవానికి రాజేశ్వరిని సర్వమంగళం పోలీసులు మహిళా హోమ్‌కు తరలించారన్నారు. రాజేశ్వరిని హోమ్ నుంచి తీసుకువచ్చి తమ కానిస్టేబుల్‌కు సర్వమంగళం పోలీసులు అప్పగించారన్నారు. దీనిపై తనకు ఎప్పటికప్పుడు కానిస్టేబుల్ సమాచారం అందిస్తుండగా, తాను పర్యవేక్షిస్తూ కానిస్టేబుల్‌కు మార్గదర్శకాలు ఇచ్చానన్నారు. రామకృష్ణను తమిళనాడు పోలీసులు తమకు అప్పగించలేదని వివరించారు. ఇదిలా ఉండగా జూలై 7న సాయంత్రం కోడూరు గ్రామస్థులు సుమారు 200 మందికి పైగా ఒక్కసారిగా వచ్చి తనపై, పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారన్నారు.

ఆత్మరక్షణ కోసమే కాల్పులు : సిఐ బంగార్రాజు
జి.కొండూరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తున్నారనే సమాచారం మేరకు తాను అక్కడికి చేరుకున్నానని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపానని సబ్ కలెక్టర్‌కు కాల్పులు జరిపిన సిఐ యు బంగారురాజు తెలిపారు. పలగాని రామకృష్ణ మృతి గురించి కానీ, తమకు అన్యాయం జరిగిందని కానీ కోడూరు గ్రామ బాధితులు తన దృష్టికి తీసుకురాలేదన్నారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వెంటనే తనపై దుడ్డుకర్రలతో దాడికి దిగారని, రాళ్లు రువ్వి గాయపర్చారని, అప్పటికీ రెండుసార్లు గాలిలోకి, మరోసారి జీపుపై కాల్పులు జరిపి హెచ్చరించానని వివరించారు. తనపై దాడికి దిగిన తర్వాత కాల్పులు జరిపినట్లు బంగారురాజు సబ్ కలెక్టరుకు తెలిపారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం: సబ్ కలెక్టర్ హరిచందన
రామకృష్ణ మృతి చెందిన వ్యవహారంపై ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకమని విజయవాడ సబ్ కలెక్టర్, మెజిస్టీరియల్ అధికారిణి దాసరి హరిచందన వెల్లడించారు. జి.కొండూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆమె గురువారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడుతూ ప్రాథమిక పోస్ట్‌మార్టమ్ నివేదికలో రామకృష్ణ శరీరంపై గాయాలు లేవని తేలిందన్నారు. రామకృష్ణ ఎప్పుడు మృతిచెందాడనే విషయంపై కూడా డాక్టర్లు కచ్చితంగా తేల్చి చెప్పలేకపోయారన్నారు. జి.కొండూరు, మైలవరం పోలీసులను ఇంకా విచారించాల్సి ఉందన్నారు. పోలీసులు బందోబస్తులో ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోయారన్నారు. బహిరంగ విచారణలో ఎవ్వరైనా నిర్భయంగా వారి వాంగ్మూలాలను ఇవ్వవచ్చన్నారు. కోడూరులో విచారణ నిమిత్తం ముందుగానే టాంటాం ద్వారా గ్రామస్థులకు తెలిపామన్నారు. మరో రోజు ఇక్కడే విచారణ చేస్తామన్నారు. విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం..
* నేడు విద్యార్థుల ర్యాలీ, రాస్తారోకో
* రేపు బందరు బంద్
మచిలీపట్నం, ఆగస్టు 1: రాష్ట్ర విభజన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనుకకు తీసుకోవాలని ఏపిఎన్‌జివో తూర్పు కృష్ణా శాఖ ప్రధాన కార్యదర్శి ఉల్లి కృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్‌జివో హోంలో గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపార, కార్మిక, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కృష్ణ మాట్లాడుతూ సమైక్యాంధ్రను ప్రకటించేంత వరకు దశలవారీగా ఉద్యమం నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం విద్యార్థులతో ర్యాలీ, రాస్తారోకో, శనివారం బందరు బంద్ నిర్వహిస్తామన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జాతి ప్రయోజనాలు విస్మరించి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. చిదంబరం ప్రకటనకు ముందు ఈ పరిస్థితి లేదన్నారు. 505 రోజులు పోర్టు ఉద్యమాన్ని నిర్వహించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమం, 1973 జై ఆంధ్ర ఉద్యమాల్లో అనేక మంది ప్రాణత్యాగం చేశారన్నారు. అయినప్పటికీ రాష్ట్ర విభజనకు అనుమతించని ప్రభుత్వం నేటి కెసిఆర్ బెదిరింపుల కారణంగా, రాజకీయాల కారణంగా విభజన ప్రకటన చేశారని విమర్శించారు. ఉద్యమ నిర్వహణకు అన్ని వర్గాల సహకారం, చిత్తశుద్ధి అవసరమన్నారు. ప్రజల విలువైన ఆస్తులు, పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. మచిలీపట్నం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ బొర్రా విఠల్ మాట్లాడుతూ కింది స్థాయి నుండి ఉద్యమాలు నిర్వహించాలన్నారు. వైఎస్‌ఆర్‌సీపి నాయకుడు మాదివాడ రాము మాట్లాడుతూ ఉద్యమానికి పురిటిగడ్డ మచిలీపట్నం అన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ షేక్ సలార్ దాదా మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. చైతన్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్ మాట్లాడుతూ ఉద్యమ నిర్వాహకులకు నిశ్చితమైన అభిప్రాయాలు, కచ్చితమైన ప్రణాళిక ఉండాలన్నారు. ఏపి ప్రైవేట్ కానె్వంట్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు వి సుందరాం, జిల్లా శాఖ అధ్యక్షుడు కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా, విద్యార్థి కేంద్రీకృతంగా ఉద్యమాలు నిర్వహించాలని సూచించారు. మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు బాధ్యులేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జివో పట్టణ శాఖ నాయకుడు తస్లిం బేగ్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ బలగం విజయశేఖర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దారపు శ్రీనివాసరావు, ఆకూరి శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరెపు వెంకటేశ్వరరావు, ఐఎంఎ అధ్యక్షుడు డా. బి కేశవ కృష్ణ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి సత్యనారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం పట్టణంలోని అన్ని కళాశాలల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు.
జిల్లావాసులు సంయమనం పాటించాలి
* ఎస్పీ ప్రభాకరరావు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం ఆగస్టు 1: రాష్ట్ర విభజనపై జరుగుతున్న కసరత్తు నేపథ్యంలో జిల్లా ప్రజలు సంయమనం పాటించాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనలు తెలియజేయవచ్చన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినప్పటికీ అవనిగడ్డ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీస్ చట్టం సెక్షన్ 30 అమల్లో ఉందన్నారు. ఎవరైనా సభలు, సమావేశాలు నిర్వహించడానికి సంబంధిత డిఎస్పీ నుండి విధిగా అనుమతి పొందాలన్నారు. హింసాయుతంగా నిరసనలు తెలియజేసేవారు తక్షణ చర్యలకు బాధ్యులవుతారని, పాల్గొనేవారితో పాటు జెఎసి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎవరి మనోభావాలను గాయపర్చకుండా శాంతియుత మార్గంలో నిరసనలు తెలుపవచ్చన్నారు. అదుపుతప్పి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జాతీయ నాయకుల విగ్రహాలను కూల్చడం, తగలపెట్టడం, రూపుమార్చడం వంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారని, జాతీయ నాయకులను గౌరవించడం మన బాధ్యత అని ఎస్పీ హితవు పలికారు.

రెండో రోజూ స్కూళ్లకు సెలవే!
* నేడూ బంద్‌కు పిలుపు
పాయకాపురం, ఆగస్టు 1: రెండవ రోజు కూడా విద్యా సంస్థలు పాటించిన బంద్ విజయవంతం అయింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా నగర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పిలుపు మేరకు బుధవారం నాటి బంద్ విజయవంతం కాగా, గురువారం నాడు స్వచ్ఛందంగానే విద్యా సంస్థలు పాఠశాలల్ని, కళాశాలల్ని మూసివేశాయి. ఈక్రమంలో బుధవారం సాయంత్రమే గురువారం కూడా విద్యా సంస్థ మూసివేస్తున్నట్లుగా విద్యా సంస్థలు విద్యార్ధుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. ఒకవైపు బస్సుల రాకపోకల్ని నాయకులు నిలిపేయడం, దుకాణాల్ని, కళాశాలల్ని, పాఠశాలల్ని మూసివేయించడంతో బుధవారం నాడు విద్యా సంస్థల్ని కొనసాగించేందుకు యజమాన్యాలు సాహసించలేదు. రోడ్ల పై బస్సుల్ని నిలుపుదల చేయడంతో విద్యార్ధులు కూడా పాఠశాలలు, కళాశాలలకు చేరుకోవడం కష్టమని భావించడంతో బంద్‌కు మద్దతుగా విద్యా సంస్థలు మూసి వేస్తున్నట్లుగా విద్యార్ధుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చాయి. గురువారం కూడా పాఠశాలల్ని తెరిచేందుకు వారు సాహసించలేదు. కాగా, శుక్రవారం నాడు కూడా బంద్‌ను కొనసాగించేందుకు విద్యా సంస్థలు నడుం బిగించాయి. ఈక్రమంలో బంద్ కొనసాగింపు గురించిన సమాచారాన్ని విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు గురువారం సాయంత్రమే ఫోన్ల ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా విద్యా సంస్థల యాజమాన్యాలు అందించాయి. దీంతో మూడవ రోజు బంద్ నిర్వహిస్తున్నట్లుగా విద్యా సంస్థలు సమాచారమిచ్చారు. విద్యా సంస్థల బంద్‌కు పలు విద్యా సంస్థల అసోసియేషన్లు సైతం మద్దతు తెలియజేశాయి. బయట అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో తమ పిల్లల్ని పాఠశాలలకు, కళాశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు సైతం విముఖత ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు ఆర్టీసి బస్సులు నడవకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్ధులు సైతం కళాశాలలకు వెళ్లే ఆలోచనను విరమించుకుంటున్నారు. విద్యార్ధులకు సైతం ఇబ్బందికలిగించకుండా విద్యా సంస్థలే బంద్‌కు సహకరిస్తూ ముందస్తు జాగ్రత్తగా విద్యా సంస్థల్ని మూసివేస్తున్నాయి.

ఐదుగురు టిడిపి, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు
విజయవాడ, ఆగస్టు 1: రాష్ట్ర విభజనపై ప్రజలు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసేందుకు ఇటు తెలుగుదేశం, అటు కాంగ్రెస్ శాసన సభ్యులు పోటీపడుతున్నారు. మొదటిగా కాంగ్రెస్ సభ్యులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు హైదరాబాద్‌లో స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేసి ఆ పత్రాల్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అందజేశారు. అదే సమయంలో కృష్ణాజిల్లాకు చెందిన ఏకైక మంత్రి పార్ధసారధి ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖను అందజేశారు. నగరానికి చెందిన మూడవ శాసన సభ్యుడు యలమంచిలి రవి కూడా అదే బాటలో పయనిస్తానని, రేపోమాపో రాజీనామా లేఖను పంపుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఎత్తుకు పైఎత్తులో అందెవేసిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు క్షణాలపై జిల్లాకు చెందిన తోటి శాసన సభ్యులను రప్పించుకుని వ్యూహరచన చేశారు. గత శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున ఎనిమిది మంది గెలుపొందగా వారిలో గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని, నూజివీడు శాసన సభ్యుడు రామకోటయ్య ఆ పార్టీ నుండి వైదొలిగారు. ఇక అవనిగడ్డ శాసనసభ్యుడు బ్రాహ్మణయ్య అకాల మరణానికి గురయ్యారు. ఇక మిగిలిన ఐదుగురు కూడా రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం), శ్రీరాంతాతయ్య (జగ్గయ్యపేట), తంగిరాల ప్రభాకరరావు (నందిగామ), దాసరి బాలవర్ధనరావు (గన్నవరం), జయమంగళ వెంకటరమణ (కైకలూరు) నేరుగా స్పీకర్‌కే అది స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా పత్రాల్ని పంపుతున్నట్లు ఉమ తెలిపారు.

ఎంపి లగడపాటి ఇల్లు ముట్టడి
* పోలీసుల విస్తృత బందోబస్తు
అజిత్‌సింగ్‌నగర్, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించకుండా సమైక్యంగానే ఉంచాలని కోరుతూ నగర వ్యాప్తంగా నిరసన ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సమైక్యాంధ్రపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు నగరంలోని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇల్లు మరియు కార్యాలయం వేదికగా మారింది. రాజగోపాల్ ఇంటివద్ద జరుగుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని నగర పోలీసు అధికారులు పోలీసు బలగాల నిరంతర పర్యవేక్షణలో ఉంచారు. గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమిటీ తోపాటు బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎంపి లగడపాటి ఇంటి ముట్టడించేందుకు విఫలయత్నం చేసారు. తొలుత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఇన్‌చార్జ్ పి గౌతంరెడ్డి నాయకత్వంలో వైకాపా నేతలు, కార్యకర్తలు చేసిన ఆందోళన హోరెత్తింది. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగానే
ఉండేందుకు కృషి చేస్తానని తెలుగు ప్రజలకు హామీ ఇచ్చిన ఎంపి లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ అధిష్టానం వద్ద సమైక్యవాదాన్ని వినిపించడంలో ఘోరంగా విఫలమైనారని, రాష్ట్ర విభజన చర్యలకు పూనుకొంటున్న యుపిఎ చర్యలను అడ్డుకోకుండా నిమ్మకు నీరెత్తి ఉండటంతోనే ప్రస్తుత విపత్కర పరిస్థితులు దాపురించాయని, ఇందుకు బాధ్యత వహిస్తూ ఎంపి తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. వేర్పాటు వాదాన్ని కాంగ్రెస్ పార్టీయే పెంచి పోషించిందని, రాష్ట్ర విభజన జరగడంలో కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత వహించాలన్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు రాష్ట్రం విడిపోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే పూర్తి కారణమన్నారు. వేర్పాటు వాదాన్ని వినిపించిన కాంగ్రెస్ నాయకుల స్థాయిలో సమైక్య వాదాన్ని విమిపించలేకపోయిన సీమాంధ్ర నాయకులు వైఫల్య పాపం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలదేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, ఎంపి లగడపాటి రాజగోపాల్ కు వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు నినాదాలు చేయడంతో రాజగోపాల్ నివాస గృహం వద్ద వున్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోబోవడంతో కొద్ది సేపు ఇరు వర్గీయులకు వాగ్వాదం జరిగింది. పరిస్థితి విషమిస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆందోళన చేస్తున్న వైకానేతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసారు. ఈ దశలో పోలీసులకు, వైకాపా నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో పెనుగులాట జరిగింది. పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించి మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ కార్పొరేటర్ యాదల శ్రీనివాసరావు, కె రత్నకుమార్, వి చైతన్య, ముప్పూరి రాజా, దడిగ సుబ్రమణ్యం, వీరంకి నాగు, కిషోర్, వి నాగేశ్వరరావు, వేము దుర్గారావు, ఆర్ రాజు, తదితరులతో సహా మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచికత్తుపై వదిలిపెట్టారు.

ప్రకాశం బ్యారేజీ వద్దగణనీయంగా పడిపోయన నీటిమట్టం
విజయవాడ, ఆగస్టు 1: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం గణనీయంగా పడిపోతున్నది. గురువారం రాత్రి సమయానికి ఆందోళనకర రీతిలో 9.9 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ జలాశయం నుంచి మంగళవారం రాత్రి విడుదల చేసిన ఏడువేల 640 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరడానికి కనీసం మరో రెండు రోజుల వ్యవధి పట్టనుంది. సుదీర్ఘకాలం తర్వాత నీటిని విడుదల చేస్తుండటంతో మార్గమధ్యంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నిండుకోవాల్సి వస్తున్నది. దీనివలన జాప్యం జరుగుతున్నది. ప్రస్తుతం డెల్టా కాలువలన్నింటికి కలిపి 1949 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది.

పది వేలతో ఎసిబికి చిక్కిన విద్యాశాఖ ఉద్యోగులు
విజయవాడ క్రైం, ఆగస్టు 1: అవినీతి నిరోధక శాఖ విసిరిన వలలో జిల్లా విద్యాశాఖలో పని చేస్తున్న ఓ అధికారితోపాటు మరో ఉద్యోగి చిక్కారు. కృష్ణలంకలోని ఓ ప్రైవేటు స్కూలు నిర్వాహకుల నుంచి లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయారు. ఎసిబి డిఎస్‌పి ఎం నరసింహారావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కృష్ణలంక ద్వారకానగర్‌లోని స్టార్ పబ్లిక్ స్కూల్‌ని యాజమాన్యం ఏడాదిన్నరగా నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు షేక్ నాగుర్ బి, ఆమె భర్త మెహబూబ్‌లు కరస్పాండెంట్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా గత నెల జూలై 19న విధి నిర్వహణలో భాగంగా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ డి శ్రీనివాసరావు, ఆఫీస్ అసిస్టెంట్ హరిరామ్ నాయక్ తదితర సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సదరు అధికారులు కరస్పాండెంట్‌ను ప్రశ్నిస్తూ పాఠశాల హక్కులు రామచంద్రరావు అనే పేరుతో ఉండి కదా అనే అడగడమే కాకుండా కరస్పాండెంట్ నాగుర్ బి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో పాఠశాల పై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు గాను రూ. 25వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో కరస్పాండెంట్ రూ. 10వేలు ముట్టచెప్పగలనని బేరం కుదుర్చుకున్న మీదట సదరు అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి అధికారులు వ్యూహం ప్రకారం అరండల్ పేటలోని కార్యాలయంలో గురువారం సాయంత్రం ఫిర్యాది నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ శ్రీనివాసరావుతో పాటు కార్యాలయ గుమస్తా హరిరామ్ నాయక్‌ను ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఎసిబి డిఎస్‌పి నరసింహారావుతోపాటు సిఐలు రవి, నాగరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించటంతో జైలుకు తరలించారు.

వెలంపల్లి రాజీనామాకు మద్దతుగా మానవహారం
ఇంద్రకీలాద్రి, ఆగస్టు 1: విజయవాడ పశ్చిమ నియోజకర్గ శాసన సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు సమైక్యాంధ్ర మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఆయనకు మద్దతుగా కృష్ణా జిల్లా ఎన్‌ఎస్‌యుఐ జిల్లా మాజీ అధ్యక్షుడు పిళ్లా శ్రీనివాసరావు నాయకత్వంలో గురువారం రాత్రి చిట్టినగర్ సెంటర్‌లో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిళ్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా వెలంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేసిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సమైక్యాంగా వుండాలని మరింత పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

* జెఎసి ఆధ్వర్యంలో ర్యాలీలు, రాస్తారోకోలు * బందరులో మూతబడిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు * నూజివీడులో 100 మంది అరెస్టు * గుడివాడలో బంద్ సంపూర్ణం
english title: 
s

హైదరాబాద్ కెసిఆర్ జాగీరా?

$
0
0

కమలాపురం, ఆగస్టు 2 : హైదరాబాద్ తెరాసా అధ్యక్షుడు కెసిఆర్ జాగీరా అని ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ఫోన్ ద్వారా రాజధాని నుంచి విలేకర్లతో మాట్లాడుతూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమైనవని మండిపడ్డారు. ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని మరింతగా ఆయన వ్యాఖ్యలతో రెచ్చగోడుతున్నట్లు ఉందన్నారు. ఆయన సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ విడిచి వెళ్లాలని చెప్పడం పట్ల ఈ ప్రాంత ఉద్యోగులకు ఆగ్రహం వచ్చేలా ఉందన్నారు. తెలంగాణా,హైదరాబాద్ అభివృద్ధికి ఈ ప్రాంత ఉద్యొగులు ఎంతగానో కృషిచేసిన విషయం ఆయన గుర్తుంచుకోవాలన్నారు. ఏమైనప్పటి కెసిఆర్ నిజస్వభావం బయట పడిందన్నారు. కేంద్ర అధిష్ఠానం తెలంగాణా ప్రక్రియపై పునఃపరిశీలన చేయకపోతే సీమాంధ్రలో ప్రజాప్రతినిధుల రాజీనామాతో పాటు ఉద్యమం మరింతగా మరింత ఉధృతమవుతుందన్నారు. దీని పరిణామాలు తీ్రంవగా ఉంటాయన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలనాటికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేయాలి
* ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా
కడప, ఆగస్టు 2 : ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా గత మూడు రోజులుగా జిల్లాలో శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జిల్లా వాసులు సాగించిన సమైక్య ఉద్యమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు లేకుండా జరగడం అభినందనీయమని ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో మీడియా పాత్ర కూడా అభినందనీయమన్నారు. ఇకపోతే జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చెదురుమొదరు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేసిన ప్రజలు, అధికారులు, పోలీసులు చేసిన కృషి అమోఘమన్నారు. నగర సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న ఇందిరమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో పదిమంది ఉద్యమకారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు ఉందని అయితే నిబంధనలకు అతిక్రమించినప్పుడు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యమాల సమయంలో రాజకీయ నాయకులు, ప్రజలు సమన్వయంతో వ్యవహరించి శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి, రూరల్ సిఐ నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్ధృతమైన సమైక్య ఉద్యమం
రాజంపేట, ఆగస్టు 2 : సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న బంద్ శుక్రవారం మూడోరోజు కూడా రాజంపేటలో విజయవంతమైంది. స్వచ్ఛంధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా రంగంలోకి దిగి బంద్ నిర్వహించడం జరిగింది. పట్టణంలో నాలుగైదు బ్యాచ్‌లుగా విద్యార్థులు విడిపోయి కలియతిరుగుతూ జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. దీంతో పట్టణంలో సంపూర్ణంగా బంద్ విజయవంతమైంది. సినిమాహాల్స్, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, సినిమా థియేటర్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఆర్టీసి బస్సులు డిపో వదలి బయటకు రాలేదు. సమైక్యాంధ్ర కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని ముఖ్యంగా విద్యార్థులు తెగేసి చెపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలను కాదని విద్యార్థులు స్వచ్ఛంధంగా వచ్చి ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం విశేషం. ఒక ప్రక్క పట్టణంలో జెఎసి ఆధ్వర్యంలో బంద్ జరుగుతుండగా, వివిధ గ్రామాలతో పాటు పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రదర్శన నిర్వహిస్తూ బంద్ పాటించమని వ్యాపారస్తులను కోరుతూ వెళ్ళడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే పట్టణ జెఎసితో పనిలేకుండా విద్యార్థులే బంద్ నిర్వహించడం వల్లే సంపూర్ణంగా విజయవంతమైంది. జెఎసి ఒకటే బంద్ పాటించి ఉన్నా ఇంత స్థాయిలో బంద్ విజయవంతమై ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. దుకాణాల షెట్టర్స్ మాత్రమే వేసి బీగాలు వేయని దుకాణాలను కూడా గుర్తిస్తూ విద్యార్థులు కట్టెలు పట్టుకొని నినాదాలతో హోరెత్తించడంతో అక్కడక్కడ తెరిచి ఉన్న వ్యాపార సంస్థలను కూడా మూసివేశారు. విద్యార్థులు రంగంలోకి నాలుగైదు బ్యాచ్‌లుగా రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమైంది. పోలీసులు కూడా ఆందోళనకారుల వద్ద లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపించాయి. మొత్తానికి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బంద్ విజయవంతమైందని చెప్పవచ్చు.
రైల్వేకోడూరులో...
రైల్వేకోడూరు : కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైల్వేకోడూరు పట్టణంలో మూడో రోజు కూడా బంద్ విజయవంతంగా సాగింది. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దగ్ధంతో శుక్రవారం పట్టణం అట్టుడుకి పోయింది. వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా పూర్తిగా స్థంభించి పోయింది. సమైక్యాంధ్ర జెఏసీ ఛేర్మన్ చెన్నంశెట్టి రమేష్, డిసిసి అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డిసిసిబి మాజీ ఛేర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సిఐ రమాకాంత్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బంద్ నిర్వహించారు. లారీ ఓనర్లు, ఆటోడ్రైవర్లు, వస్త్ర, షరాబు వ్యాపారులు, విద్యార్థి సంఘాలు, సమైక్యాంధ్ర జెఏసీ కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు ఇలా పార్టీలకు అతీతంగా వేలాది మంది పట్టణంలోని ప్రధాన రహదారిపై ఒక్కసారిగా రావడంతో రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, యుపీఏ ఛేరపర్సన్ సోనియాగాంధీ, ద్విగిజయ్‌సింగ్, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను ఈ సందర్భంగా దగ్ధం చేశారు. ఎమ్మెల్యే కొరముట్ల, డిసిసి అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర, జేఏసీ ఛేర్మన్ రమేష్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడం సరియైంది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలన్న పొట్టిశ్రీరాముల కల కేంద్రం నిర్ణయంతో ఛిన్నాభిన్నమైందని అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టకుండా సమైక్యంగానే ఉంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమాల్లో పాల్గొనాలని, లేనిపక్షంలో వారి ఇళ్లను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్లమెంటులో పార్టీలకు అతీతంగా ఎంపీలంతా కలసి అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆనాదిగా రాయలసీమ ప్రాంతం యేళ్ల తరబడి నష్టపోతుందని, ఇపుడు విడిపోతే సీమలో మరింత ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతాయన్నారు. సమైక్యంగానే రాష్ట్రాన్ని ఉంచుతామని కేంద్రం ప్రకటన చేసేంతవరకు ఉద్యమం ఆగదన్నారు. పలువురు ఉద్యమకారులను ఈ సందర్భంగా పోలీసులు అరెస్టు చేసి, పూచీకత్తుపై వదిలేశారు. పట్టణంలో ప్రధాన రహదారిపై ఈ కార్యక్రమాలు జరగడంతో రాకపోకలు స్థంభించి, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వేస్టేషన్‌లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జెఏసీ నాయకులు మందల నాగేంద్ర, నందా బాలసుబ్రమణ్యం, పంజం సుకుమార్‌రెడ్డి, ఎన్జీఓ సంఘ అధ్యక్షులు పొలిచెర్ల ఓబులేశు, వ్యాపార సంఘాల నాయకులు మేడా వెంకటసుబ్బయ్య, బివి కృష్ణ, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు నారాయణరెడ్డి, మణి, అన్వర్‌బాషా, సుబ్రమణ్యం తదితరులు పాల్గొని, ప్రసంగించారు.
ఎర్రగుంట్లలో...
ఎర్రగుంట్ల : రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు పోరాడుదామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రమైన ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. అక్కడే వంటావార్పు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సకలజనుల సమ్మె తరహాలో మనందరం కలసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా కార్మిక, కర్షక, మహిళలు, విద్యార్థులు ఉద్యమించాలని కోరారు. అప్పుడే సమైక్య రాష్ట్రాన్ని సాధించుకోవచ్చన్నారు. అయితే ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించాలన్నారు. సమైక్యాంధ్ర కోసం ముందుగానే రాజీనామా చేసి మార్గదర్శకుని అయ్యాయని, తాను రాజీనామా చేసినంత మాత్రాన గొప్పవాడిని కాదని మీరందరూ కలసి వస్తే సమైక్య రాష్ట్రం సాధించవచ్చన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే ముందు మనమందరం సమైక్యంగా ఉండాలన్నారు. అందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఇక జాతీయ నాయకుల విగ్రహాల జోలికి వెళ్లవద్దని సూచించారు. ప్రజాస్వామ్య రీతిలో శాంతియుతంగా మన డిమాండ్‌ను సాధించుకోవాలని, అందుకు పోలీసులతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అంతకు ముందు నాలుగు రోడ్ల కూడలిలో వందలాది మంది సమైక్యాంధ్రవాదులు నడిరోడ్డుపై వంటావార్పు చేపట్టి రాస్తారోకో కారణంగా నిలిచిన వాహనదారులకు అన్నదానం చేశారు. అలాగే ఆర్టీపీపీలో ఉద్యోగ,కార్మిక సంఘాల నాయకులు ఒక రోజు నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాలకు చెందిన యూనియన్ నాయకులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

టిడిపి మద్దతుదారుడిదే టంగుటూరు
* ఆర్డీఓ సమక్షంలో రీ కౌంటింగ్
రాజుపాళెం, ఆగస్టు 2: టంగుటూరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం మండల కేంద్రమైన రాజుపాళెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రీ కౌంటింగ్ నిర్వహించారు. ఈ ఓట్ల లెక్కింపు ఆర్డీ ఓ రఘునాథరెడ్డి సమక్షంలో లెక్కించారు. ఈ లెక్కింపులో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు బండి హరోన్ 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి బాలబ్బి ఎన్నికల దృవీకరణ పత్రాన్ని అందజేశారు. గత బుదవారం ఈ గ్రామ పంచాయతీ జరిగిన ఓట్ల లెక్కింపులో వై ఎస్ ఆర్‌సిపి మద్దతుదారుడు తిమ్మా చిన్నబాబు సర్పంచ్ అభ్యర్థిగా 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అదేరోజు రాత్రి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దరోడ్డుపై బైఠాయించి పోలింగ్ అధికారులను కదలనివ్వకుండా రీ పోలింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. పోలైన ఓటుబాక్స్‌లను రాజుపాళెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎంపిడి ఓ, తహశీల్దార్, ఆర్డీ ఓతో చర్చించిన తరువాత శుక్రవారం ఈ పంచాయతీకి సంబంధించి రీ కౌంటింగ్ నిర్వహించారు. సర్పంచ్ ఓట్లనే లెక్కించారు. ఈపంచాయతీకి 2602 ఓట్లు పోలు కాగా 2412 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 195 ఓట్లు చెల్లలేదు. పోస్టల్ బ్యాలెట్‌కు ఐదు ఓట్లు రాగా అందులో రెండు ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఈ రీ కౌంటింగ్‌లో వై ఎస్ ఆర్‌సిపి మద్దతుదారుడు తిమ్మా చిన్నబాబుకు 16 ఓట్లు చెల్లుబాటు కావడంతో ఆయనకు 1118 ఓట్లు లభించాయి. టిడిపి మద్దతుదారుడు బండి హరోన్‌కు 1127 ఓట్లు లభించాయి. తిమ్మా లుకయ్యకు 167 ఓట్లు వచ్చాయి. ఉత్కంఠ భరితంగా మారిన రీ కౌటింగ్‌లో టిడిపి మద్దతుదారులు సర్పంచ్‌గా ఎన్నికవడంతో వై ఎస్ ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు రీ కౌంటింగ్ వద్ద రోడ్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సి ఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ ఐ సుబ్బారావు, ఆద్వర్యంలో పోలీసులు బందోబస్తును నిర్వహించారు. టంగుటూరు గ్రామంలో పోలీసు ఫికటింగ్ ఏర్పాటు చేశారు.

కెసి కాలువలకు నీరు విడుదల
* వరి సాగుకు రైతుల సన్నాహాలు
చెన్నూరు, ఆగస్టు 2 : శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటం వల్ల పొత్తిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి కడప, కర్నూలు కాలువలకు నీరు విడుదల చేయడంతో చెన్నూరు, బుడ్డాయపల్లె, రామనపల్లె, ముళ్లపల్లె, రాచినాయినపల్లె, కెసి ఉప కాలువలు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు వరినారు కయ్యల కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 50 క్యూసెక్కుల నుంచి 75 క్యూసెక్కుల వరకు ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట నుంచి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీరు చెన్నూరు వద్ద పెన్నానదిలో శుక్రవారం ఉదయం 800 క్యూసెక్కుల నీరు దిగువన ఉన్న సోమశీల ప్రాజెక్టులోకి వెళ్తోంది. పెన్నానదిలో నీరు ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగిపోవడంతోపాటు సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు తీరిపోయాయి. గత సంవత్సరం కేసీ కెనాల్ ఆయకట్ట కింద వరి సాగుచేయకపోవడంతో ఈ సారైనా తమ కష్టాలు తీరుతాయన్న ఆశతో రైతులు వరిసాగుపై దృష్టి పెట్టారు.

కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం
గాలివీడు, ఆగస్టు 2 : గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచ్‌లు అంకితాభావంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం వెలిగల్లు సర్పంచ్ చంద్రారెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆయన అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ప్రథమ పౌరులైన సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం తూముకుంట గ్రామ పంచాయతీ సర్పంచుగా అనితమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయుల నాయక్, మాజీ సర్పంచ్ వీరభద్రప్పనాయుడు, మాజీ ఎంపిటిసి పాపాసాబ్, స్థానిక నాయకులు కదిరినాయుడు, గూడూసాబ్, రాంమోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
లక్కిరెడ్డిపల్లెలో...
లక్కిరెడ్డిపల్లె : కొత్తగా ఎన్నికైన ఆయా పంచాయతీల సర్పంచులు శుక్రవారం ఆయా పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కాలాడి ప్రభాకర్‌రెడ్డి, మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సంబేపల్లెలో...
సంబేపల్లె : మండల పరిధిలోని గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయా గ్రామాల సర్పంచ్‌లు తెలిపారు. శుక్రవారం మండల వ్యాప్తంగా ఉన్న 14 గ్రామ పంచాయతీల్లో ఇఓపిఆర్‌డి తారకేశ్వర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు హాజరయ్యారు.
సుండుపల్లెలో...
సుండుపల్లె : గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని సుండుపల్లె మండల పంచాయతీల సర్పంచ్‌లు పేర్కొన్నారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచ్‌లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీ కార్యదర్శులు సురేష్, ఆంజనేయులు, రాజా, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
వీరబల్లెలో...
వీరబల్లె : మండల పరిధిలోని ఆయా పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
వేంపల్లెలో...
వేంపల్లె : ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని వేంపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ సింగారెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని 20 వార్డు మెంబర్ల సభ్యులతో కలిసి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఇఓ షాకీర్‌అలీఖాన్, తేదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

* ఎమ్మెల్యే వీరశివారెడ్డి
english title: 
kcr's jagir

గోపాలరెడ్డిపాళెంలో సర్పంచ్ ఎన్నికల్లో అధికారుల తీరు ఏకపక్షం

$
0
0

సూళ్లూరుపేట, ఆగస్టు 2: మండల పరిధిలోని గోపాలరెడ్డిపాళెంలో జూలై 31న జరిగిన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎన్నికల అధికారుల ఏకపక్షంగా వ్యవహరించారని తమకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీమండల అధ్యక్షుడు చిలకా యుగంధర్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పంచాయతీ సర్పంచ్ బరిలో మొత్తం ముగ్గరు అభ్యర్థులు ఉండగా మొత్తం 978 ఓట్లు పోలింగ్ అయ్యినట్లు తెలిపారు. పోలయిన ఓట్లల్లో ఇద్దరికి 320 ఓట్లు సమానంగా రాగా ఒక అభ్యర్థికి 312 ఓట్లు వచ్చాయన్నారు. ఇరువురికి సమానంగా ఓట్లు రావడంతో చెల్లని ఓట్లు కలిపి వైకాపా అభ్యర్థి బూదూరు పోతయ్యను విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీకౌంటింగ్‌కు ఆదేశించిన అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి కౌంటింగ్ ఏజెంట్లు సంతకాలు పూర్తికాకుండానే విజయంగా ప్రకటించారని ఆరోపించారు. అందరి సమక్షంలో బ్యాలెట్లు ఓట్లు పత్రాలను లెక్కించాలని డిమాండ్ చేశారు. అధికారులు అలా చేయకపోతే కోర్టుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అలవల సురేష్,నాయకులు జెట్టి వేణుయాదవ్, భైరి పార్థసారధిరెడ్డి,గంపల హరికృష్ణ తదితరులు ఉన్నారు.

దొంగను పట్టుకోబోయిన ఎస్‌ఐకి గాయాలు
వెంకటాచలం, ఆగస్టు 2: దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఎస్‌ఐ చేయి విరిగిన సంఘటన వెంకటాచలంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో దొంగలు సంచరిస్తున్న సమాచారం అందటంతో వెంకటాచలం ఎస్‌ఐ వై సోమయ్య సిబ్బందితో ఆప్రాంతానికి వెళ్ళారు. పోలీసుల రాకను గమనించిన దొంగలు రైల్వే క్వార్టర్స్ ప్రహరీగోడను దూకి పారిపోవటాన్ని గమనించి ఎస్‌ఐ గోడ దూకే ప్రయత్నం చేయగా, గోడ కూలిపోయింది. దీంతో ఎస్‌ఐ ఎడమచేయి మణికట్టు భాగం విరిగిపోయింది. ఆయన ప్రస్తుతం నెల్లూరులోని బొల్లినేనిలో చికిత్స పొందుతున్నారు.

మండల పరిధిలోని గోపాలరెడ్డిపాళెంలో జూలై
english title: 
partiality

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల రాజీనామా

$
0
0

నెల్లూరు, ఆగస్టు 2: రాష్ట్ర విభజనను నిరసిస్తూ శుక్రవారం నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను ఫ్యాక్స్ ద్వారా అసెంబ్లీ స్పీకర్‌కు పంపించారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు . కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందన్నారు. సిడబ్ల్యుసిలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని పునసమీక్షించుకోకుంటే టిడిపి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విభజన నిర్ణయాన్ని ఉపహరించుకుని రాష్ట్రం సమైక్యంగా ఉండే విధంగా చూడాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం అందరూ ఉద్యమం బాట పట్టాలని పిలుపునిచ్చారు. విలేఖర్ల సమావేశంలో గూడూరు, సూళ్లూరుపేట, కావలి, వెంకటగిరి ఎమ్మెల్యేలు బల్లి దుర్గాప్రసాద్, పరసా వెంకటరత్నం, బీద మస్తాన్‌రావు, కురుగొండ్ల రామకృష్ణలు పాల్గొని వారి రాజీనామాల లేఖలను స్పీకర్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించారు.

అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి
బిట్రగుంట, ఆగస్టు 2: పంచాయతీ ఎన్నికలలోప్రజలు ఇచ్చిన విజయాన్ని పంచాయతీ అభివృద్ధి కోసం వినియోగించి, పార్టీకి మంచి పేరు తేవాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అన్నారు. శుక్రవారం విశ్వనాథరావుపేట పంచాయతీ సర్పంచి సాతుపాటి శ్రీదేవి పదవీ బాధ్యత స్వీకార కార్యక్రమానికి విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలోప్రజల సమస్యలు గుర్తించి పని చేయాలని సూచించారు. మండలంలో టిడిపికి ప్రజలు మద్దుతు ఇచ్చారని వారి నమ్మకాన్ని వమ్ముచేయకూడదన్నారు. అప్పుడే పదవిని అలంకరించిన సర్పంచులకు, వార్డు సభ్యులు పేరొస్తుందన్నారు. బోగోలు మండలంలోని పలు పంచాయతీలో సర్పంచులు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి పాసం రవీంద్రబాబు, మండల కన్వీనర్ పిన్నిబోయిన సుధాకర్, బోగోలు సర్పంచి దొడ్ల రమణమ్మ, ఉప సర్పంచి దొడ్ల అంజయ్య యాదవ్ మాజీ మండల అధ్యక్షులు పాయసం శ్రీనివాసులు, యువత అధ్యక్షుడు సాతుపాటి ఉదయ్‌కుమార్, మండల కార్యదర్శి సమీల్లా పాల్గొన్నారు.

రాష్ట్ర విభజనను నిరసిస్తూ శుక్రవారం నలుగురు
english title: 
tdp mla's resign

కొలువుదీరిన కొత్త సర్పంచ్‌లు

$
0
0

కోట,ఆగస్టు 2: కోట మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. మండలంలోని చెందోడు పంచాయతీలో బండి విజయమ్మ సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆమెను పంచాయతీ మాజీ సర్పంచ్ వేణుంబాక సాయికోటారెడ్డి , వైకాపా అభిమానులు ఘనంగా సత్కరించారు. కోట పంచాయతీ సర్పంచ్‌గా కోట రాఘవయ్య, జరుగుమల్లి సర్పంచ్‌గా శేషాద్రిరెడ్డి, వెంకన్నపాళెం సర్పంచ్‌గా పనబాక విజయలక్ష్మీ, మద్దాలి సర్పంచ్‌గా కోటేశ్వరనాయుడు, ఉత్తమనెల్లూరు సర్పంచ్‌గా మస్తానమ్మ, రుద్రవరం సర్పంచ్‌గా బుజ్జమ్మ, కర్లపూడి సర్పంచ్‌గా చెంచురాఘవరెడ్డి, అల్లంపాడు సర్పంచ్‌గా, సిద్దవరం సర్పంచ్‌గా సునందమ్మ, తినె్నలపూడి సర్పంచ్‌గా శ్రీనివాసులు, పుచ్చలపల్లి సర్పంచ్‌గా కందల ఇంద్రసేనయ్య, వంజివాక సర్పంచ్‌గా కె దీప, నెల్లూరుపల్లికొత్తపాళెం సర్పంచ్‌గా రమాదేవి, తిమ్మనాయుడుపాళెం సర్పంచ్‌గా నాగభూషణం, కొత్తపట్నం సర్పంచ్‌గా పెంచిలమ్మ, కేశవరం కృష్ణస్వాతి, చిట్టేడు సర్పంచ్‌గా సిహెచ్ రాము, గూడలి సర్పంచ్‌గా గౌరాబత్తెన శారదలు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు సర్పంచ్‌ల ముందు పలుసమస్యలు పెట్టారు. కోటలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో సర్పంచ్‌తో పాటు వైకాపా మండల కన్వీనర్ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, మండల మాజీ అధ్యక్షులు మానికల పవన్‌కుమార్, ఉపసర్పంచ్ గాది విజయభాస్కర్ పాల్గొన్నారు.
వాకాడులో..
వాకాడు: వాకాడు పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని సర్పంచ్ భార్గవ్‌రాం అన్నారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయాలంలో పంచాయతీ పాలక వర్గ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల ప్రజలకు తాగునీటి సరఫరా, డ్రైనేజి, వీధి లైట్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. వార్డు మెంబర్లు తమ ప్రాంతంలోని సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో కార్యదర్శి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ఓజిలిలో..
ఓజిలి: మండల కేంద్రమైన ఓజిలిలో శుక్రవారం నూతనంగా సర్పంచ్ పదవి చేపట్టిన ఓజిలి అల్లెమ్మ(కాంగ్రెస్)ను వార్డు మెంబర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముమ్మడి సుబ్బారావు మాట్లాడుతూ ఎం సుమ జడ్పీటిసిగా కొనసాగిన ఐదేళ్లలో కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఓజిలి పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. ఓజిలిలో ఉన్న తాగునీటి ఎద్దడి శాశ్వత నివారణకు కృషి చేస్తానన్నారు. ఎన్‌ఎస్‌ఆర్, మహబూబ్ నగర్ కాలనీలకు 3వ విద్యుత్ లైను సౌకర్యాన్ని కల్పించేలా పంచాయతీ తీర్మానం చేసింది. 35 సంవత్సరాలు ఓజిలి పంచాయతీని టిడిపి పాలించిందని, అభివృద్ధి మాత్రం శూన్యమని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధి పనుల వలనే గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు.
డక్కిలిలో..
డక్కిలి: రాజకీయాలకు అతీతంగా దగ్గవోలు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని గ్రామ సర్పంచ్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన యద్దల ఉదయకుమార్ అన్నారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలసి పంచాయతీ కార్యదర్శి తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తాను రాజకీయాలకు కొత్త అయినా గ్రామ పెద్దల సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు మాజీ సర్పంచ్‌లు సద్దికూటి రమణయ్య, దందోలు వెంకటయ్య, కాచిన రామస్వామి, హరిబాబు, ఉమామహేశ్వర్, దయాకర్, నారిబోయిన రంగయ్య, సురేంద్రరెడ్డి, తిరుపాల్ రాజు, కాచిన మస్తాన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ని, వార్డు మెంబర్లును పలువురు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఉప సర్పంచ్ అభ్యర్థులుగా ప్రమాణ స్వీకారం
పెళ్లకూరు: పెళ్లకూరు మండల పరిధిలో ఎన్నికలు జరిగిన 15 పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ల అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. మండల పరిధిలోని రోసనూరులో చెందోటి మాధవి, తాళ్వాయిపాడులో బత్తల లక్ష్మీదేవమ్మ, కానూరులో చీమల అనిత, పెనే్నపల్లి గోగుతట్టు ఆనంద్, శిరసనంబేడులో మల్లి శ్రీనివాసులు, బంగారమ్మపేటలో అక్కుర్తి కృష్ణమ్మ, చెంబేడులో మారాబత్తిన గురవయ్య, అర్ధమాల మణికిరి బత్తెమ్మ, పునబాక పి లలితమ్మ, రావులపాడు అంజూరు పరమేశ్వరి, చింతపూడి వేణుంబాక మునిరామానాయుడు, కుల్లూరు మారాబత్తిల లక్ష్మమ్మ, పాలచ్చూరు పెళ్లూరు వెంకటరమణారెడ్డి, నందిమాల మూరతొట్టి ఈశ్వరయ్యలు ఏకగ్రీవంగా ఉప సర్పంచ్‌లుగా ఎంపికయ్యారు. అనకవోలు పంచాయతీలో టిడిపికి 4, కాంగ్రెస్‌కు 4 వార్డులు రావడంతో అక్కడ ఎంపిక కార్యక్రమం వాయిదా పడింది. ఎంపికైన అభ్యర్థుల చేత పోలింగ్ కేంద్రాల రిటర్నింగ్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.

మనుబోలులో..
మనుబోలు:మండలంలోని 19 పంచాయతీ ఎన్నికలలో కొత్తగా గెలుపొందిన సర్పంచ్, వార్డుమెంబర్లు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఆయా గ్రామాల పంచాయతీ కార్యాలయాలలో పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన సర్పంచ్, వార్డుమెంబర్లతో కలిసి మొదటి సాధారణ సమావేశం నిర్వహించారు. మనుబోలు, గురివిందపూడి గ్రామాలలో స్థానిక తహశీల్దారు వెంకటనారాయణమ్మ మాట్లాడుతూ నిధులు సక్రమంగా వినియోగించి గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్లకు సూచించారు. స్థానిక మనుబోలు పంచాయతి సర్పంచ్ కంచి పద్మ మాట్లాడుతూ తనను గెలిపించిన ఓటర్లకు తాను రుణపడివుంటానన్నారు. గురివిందపూడి సర్పంచ్ మనె్నమాల వసుధ మాట్లాడుతూ తమ గ్రామంలో ముఖ్యంగా పారిశుద్ధ్యం,మంచినీటి కొరత తీర్చడానికి కృషి చేస్తానన్నారు. చెర్లోపల్లి గ్రామ సర్పంచ్ చెడిమాల శ్రీలత మాట్లాడుతూ గ్రామంలో వౌలికసదుపాయాలుకు మొదటి ప్రాధాన్యత నిస్తానని చెప్పారు. ప్రతి పంచాయతీ కార్యాలయంలలో ఆర్భాటంగా మొదటి సమావేశాన్ని నిర్వహించారు.

‘ ముర్రుపాలు బిడ్డకు శ్రేయస్కరం’
మనుబోలు, ఆగస్టు 2:ముర్రుపాలు బిడ్డకు శ్రేయస్కరం అని వెంకటాచలం సిడిపిఓ శారదాంబ చెప్పారు. స్థానిక కోదండరామపురంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం జరిగిన తల్లిపాల వారోత్సవాలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంలో ఆమె మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ముర్రి పాలు తాగించడం వలన బిడ్డలో వ్యాది నిరోదక శక్తి పెరుగుతుందని చెప్పారు. గర్భవతులు,బాలింతలు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. చిన్న పిల్లలకు వ్యాది నిరోదక టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రత్నమ్మ, కార్యకర్తలు సుగుణమ్మ, మునెమ్మ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
బాలాయపల్లి, ఆగస్టు 2: మండలంలోని గొల్లగుంట గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి భవనాజీ హరిబాబు(20) దుర్మరణం చెందాడు. సంగవరం గ్రామానికి చెందిన హరిబాబు మోటార్‌సైకిల్‌పై వెళుతూ గొల్లగుంట గ్రామం వద్ద టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొన్నాడు. దీంతో హరి బాబు సంఘటన స్థలంలోమృతి చెందాడు. కాగా హరిబాబు మృత దేహాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఎస్సై పి మాలకొండయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

‘తల్లి పాలు బిడ్డకు ప్రాణ వాయువు’
నాయుడుపేట, ఆగస్టు 2: తల్లి పాలు బిడ్డకు ప్రాణ వాయువుతో సమానమని ఐసిడిఎస్ సిడిపివో విజయలక్ష్మి తెలిపారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ముస్లిం వీధిలో బిడ్డ తల్లులకు, బాలింతలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం వలన ఆడవారికి వచ్చే అవకాశం ఉండే బ్రెస్టు క్యాన్సర్ వంటి పలు రోగాలు దరిచేరవని తెలిపారు. మార్కెట్‌లో లభించే వివిధ రకాల బిస్కెట్ల వల్ల పిల్లల్లో అజీర్తి రోగాలు దరిచేరే అవకాశం ఉందన్నారు. అంగన్‌వాడి కేంద్రాలలో లభించే పిండి పదార్ధాలు అన్ని రకాల పౌష్టిక పదార్థాల మేళవింపన్నారు. వీటిని ఇవ్వడం వలన పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ హెలన్ డోరతి, అంగన్‌వాడి సూపర్‌వైజర్ శారద, ఎఎన్‌ఎమ్‌లు శిరిషా, మల్లీశ్వరి, అంగన్‌వాడీలు రత్నమ్మ, రుషీంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

కోట మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ
english title: 
new sarpanches

ఇందిరాగాంధీ విగ్రహానికి పోలీసు రక్షణ

$
0
0

మనుబోలు, ఆగస్టు2:మండల పరిధిలోని జట్లకొండూరు సత్రం జాతీయరహదారి పక్కన ఉన్న ఇందిరమ్మ విగ్రహానికి శుక్రవారం నుండి పోలీసు రక్షణ కల్పించారు. రాష్ట్రంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీవ్ గాంధీ, ఇందిరమ్మ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో విద్యార్థులు, సమైక్యాంధ్ర మద్దతుదారులు విగ్రహానికి హాని చేపట్టకుండా ముందు జాగ్రత్తగా విగ్రహానికి రక్షణ ఏర్పాట్లు చేసినట్లు స్థానిక ఎస్.ఐ మారుతీకృష్ణ చెప్పారు.

వార్డుల వారి పోలింగ్ స్టేషన్ జాబితా విడుదల
నెల్లూరుసిటీ, ఆగస్టు 2: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ వార్డుల వారి పోలింగ్ స్టేషన్‌ల జాబితాను సంబంధిత వార్డు రిటర్నింగ్ ఆఫీసర్‌లచే సంబంధిత వార్డు ఆఫీసులలో శుక్రవారం అందుబాటులో ఉంచుతున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ డి జాన్ శ్యాంసన్ తెలిపారు. నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లను తనిఖీ చేశారు. వార్డుల వారి పోలింగ్ స్టేషన్‌ల జాబితా రిటర్నింగ్ అధికారులు వార్డు కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం, రెవిన్యూ డివిజన్ అధికారి కార్యాలయం, తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, జిల్లా కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు, జిల్లా గ్రంథాలయం, తపాల కార్యాలయం, బ్యాంకులలో కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాబితాలో అభ్యంతరాలు ఉన్న వారు శనివారం నుండి సోమవారం లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌కు రాత పూర్వకంగా తెలిపాలని కోరారు.

వైభవంగా కృష్ణ్ధర్మరాజుల బ్రహ్మోత్సవాలు
నెల్లూరు కల్చరల్, ఆగస్టు 2: స్థానిక మూలపేటలోని శ్రీకృష్ణ్ధర్మరాజస్వామి దేవస్థానంలో శ్రీకృష్ణ ధర్మరాజ, ద్రౌపదీ అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అత్తిపాటి బ్రహ్మయ్య ఉభయకర్తలుగా చప్పర ఉత్సవం చేశారు. మూలవర్లకు విశేష అభిషేకాలు, పూజలు, అలంకారాలు జరిగాయి. ఉదయం ప్రముఖ కవి, పండితులు ఆలూరి శిరోమణిశర్మ భాగవత పఠనం చేశారు. సాయంత్రం ఎన్ వసంతకుమారిచే మహాభారత పురాణ కాలక్షేపం జరిగింది. రాత్రి ద్రౌపదీమాన సంరక్షణ అలంకారం నిర్వహించారు. పంచాగ్నుల గౌరీశంకరప్రసాద్, వరలక్ష్మి ఉభయకర్తగా వ్యవహరించారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మిమిక్రీ కళాకారుడు పరమేశ్వర్ ప్రదర్శించిన మాట్లాడే బొమ్మ, ధ్వన్యనుకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను దేవస్థానం కార్యనిర్వాహణాధికారి మల్లికార్జునరెడ్డి, వేణుగోపాల్, ఇన్స్‌పెక్టర్ శైలేంద్ర, మాజీ పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు. వందలాదిగా భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉత్సవాల్లో అతి ముఖ్యమైన తపస్సుమాను ఉత్సవం జరుగుతుంది.

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు
కోవూరు, ఆగస్టు 2: భూ సమస్యల పరిష్కారానికే గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు కోవూరు తహశీల్దార్ సాంబశివరావు అన్నారు. శుక్రవారం మండలంలోని లేగుంటపాడు, చెర్లోపల్లి గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాలలో పేరుకుపోయిన భూ సమస్యలను ఈసదస్సుల ద్వారా పరిష్కరించినట్టు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

జివికెకు పిండప్రదానం
* 108 సిబ్బంది నిరసన
నెల్లూరు, ఆగస్టు 2: జివికె యాజమాన్యానికి 108 సిబ్బంది పిండ ప్రదానం చేసి తమ నిరసన వ్యక్తపరిచారు. శుక్రవారం ఉదయం నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద 108 సిబ్బంది తమ నిరసన కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. తమ సమస్యలు న్యాయబద్ధమేనని ఓ వైపున అంగీకరిస్తూ కూడా పరిష్కరించేందుకు విముఖత చూపడం తగదంటూ జివికె యాజమాన్యాన్ని ఉద్దేశించి దుయ్యబట్టారు. నిరసనలో ఉన్న తమను ఉద్యోగాల నుంచి తొలగించే కుట్ర దారుణమని వాపోయారు.

మండల పరిధిలోని జట్లకొండూరు సత్రం జాతీయరహదారి
english title: 
police protection

విభజన సెగతో రగుతున్న నెల్లూరు

$
0
0

నెల్లూరు, ఆగస్టు 2: రాష్ట్ర విభజనను నిరసిస్తూ మూడవరోజు కూడా నెల్లూరులో నిరసనలతోపాటు యుపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ శవయాత్ర నిర్వహించారు. రాజీనామాలను వెంటనే ఆమోదించేందుకు స్పీకర్‌పై ఒత్తిడి తేవాలని విద్యార్థి జేఏసి నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నామంటూ కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం విద్యార్థి జేఏసి ఆధ్వర్యంలో స్థానిక విఆర్‌సి కూడలి వద్ద సోనియా శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమలనాయుడు, జెఏసి జిల్లా కన్వీనర్ జయవర్దన్, ఆదిత్యసాయిలు మాట్లాడుతూ సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంతంలోని మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పటికీ ఆ రాజీనామాలు ఒక రాజకీయ ఎత్తుగడే అని, నిజంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా రాజీనామాలను ఆమోదించే విధంగా శాసనసభ స్పీకర్‌పై ఒత్తిడి తీసుకోరావాలని డిమాండ్ చేశారు. కాగా విఆర్‌సి కూడలి వద్ద నిర్వహిస్తున్న సోనియా శవయాత్రను ఒకటవ నగర సిఐ మద్ది శ్రీనివాసరావు అతని సిబ్బందితో వచ్చి అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి జేఏసి నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సోనియా దిష్టిబొమ్మను పోలీసులు తీసుకెళ్లడంతో ఆగ్రహించిన విద్యార్థులు, నాయకులు అక్కడే రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థుల ఉద్యమాలను పోలీసుల చేత అణచివేయాలని చూస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హర్షచౌదరి, శ్రావణ్, అఖిల్, సాయిశివ, మోమిత్‌షా, ప్రమోద్, వంశీ, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా విభజనను నిరసిస్తూ హరనాధపురం సెంటర్‌లో విద్యార్థులు భారీగా చేరుకొని టైర్లను దగ్ధం చేశారు. దీంతో ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొంతమంది విద్యార్థులను నాల్గో నగర సిఐ రామారావు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గొలగమూడి క్రాస్‌రోడ్డు జాతీయ రహదారిని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు దిగ్భందం చేశారు. కిలో మీటర్ మేర రెండువైపులా వాహనాలను ఆగిపోయాయి. గంట సేపు ఆ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. సమాచారం అందుకున్న ఐదవ నగర సిఐ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చచెప్పి అక్కడ నుండి పంపివేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా వాహనాలను యధావిధిగా పంపించారు. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.
టిడిపి కార్యాలయాన్ని ముట్టడించిన సమైక్యాంధ్ర నేతలు
విభజనకు నిరసనగా అందరూ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే టిడిపి నేతల్లో స్పందన లేదని, దీంతో శుక్రవారం సమైక్యాంధ్ర నేతలు జిల్లా టిడిపి కార్యాలయాన్ని ముట్టడించారు. నిరసనలు తెలియజేస్తుండగా కేంద్ర బలగాలలు అక్కడకి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాల
నెల్లూరు, ఆగస్టు 2: పంచాయతీ పాలకవర్గాలు ఎట్టకేలకు కొలువుదీరాయి. సరిగ్గారెండేళ్ల క్రితమే పాత పంచాయతీ పాలకవర్గాలకు పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఆర్నెల్లపాటు ప్రత్యేక అధికార్ల పరిపాలనను పొడిగిస్తూ వచ్చి రెండేళ్ల తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శుభ ఘడియలు చూసుకుని జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగించుకున్న అన్ని పంచాయతీలకు పాలకవర్గాల పదవీ బాధ్యతల స్వీకరణ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు దగ్గరుండి సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించే తంతు చేపట్టారు. దాదాపుఅన్ని పంచాయతీల్లోనూ ఖాళీ ఖజనాలతోనే కొత్తపాలవర్గాల బాధ్యతల స్వీకరణ మహోత్సవాలు జరిగాయి. అయితే గ్రామాల్లో కనీస వౌలిక సదుపాయాలు ఒనగూరాలంటే తగినంత ఆర్థిక వనరుల సమీకరణ అనేది సవాల్‌గా పరిణమించే అంశం. ప్రధానంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు లోపించాయి. వర్షాల సీజన్ వచ్చినందున ఈ దుస్థితి మరింత వర్ణనాతీతం. ఇంతేగాక రాత్రి వేళల్లో వీధిలైట్లు కూడా వెలగక గ్రామాలన్నీ అంధకారంలోనే మగ్గుతున్నాయి. ఆర్థిక వనరుల సమీకరణలో గ్రామాల్లో ఇంటి, కుళాయి పన్నుల వసూలు ప్రక్రియ అనేది చాలా కష్టతరమైన వ్యవహారం. పన్నుల వసూలు సంగతి అటుంచితే ఇక గ్రామ పంచాయతీలకు ఎస్‌ఎఫ్‌సి, 13వ ఆర్థిక సంఘ నిధులే దిక్కు. గ్రామాల్లో ఉండే జనాభా సంఖ్య ఆధారంగా మాత్రమే ఈ నిధులు సమకూరుతాయి. గ్రామాల్లో ఉండే భూముల రిజిస్ట్రేషన్ సందర్భంలో స్టాంప్ డ్యూటీ మొత్తాలు కూడా పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు. ఈ మొత్తాలను రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పంచాయతీలకు బదలాయింపుజరిగేలా కసరత్తు కీలకం.

‘గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి’
కోవూరు, ఆగస్టు 2: నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఆయా గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ఇఓపిఆర్‌డి బాలాజీ కోరారు. శుక్రవారం పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎంపికైన సర్పంచ్ కె ఉమ, ఉపసర్పంచ్ ఐ మల్లారెడ్డి, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు కొనసాగాయని, ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌లు ఎన్నిక కావటంతో గ్రామాల అభివృద్ధి బాధ్యత సర్పంచ్‌లపై పడిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవసరమైన పారిశుద్ధ్యం, నీటి వసతి తదితర సౌకర్యాల కోసం పాటుపడాలన్నారు. మండలంలోని ఆరు పంచాయతీలకు ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఆయా పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో కోవూరు పంచాయతీ కార్యదర్శి వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర విభజనను నిరసిస్తూ మూడవరోజు కూడా నెల్లూరులో నిరసనలతోపాటు
english title: 
nellore

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు

$
0
0

ఒంగోలు, ఆగస్టు 2: జిల్లాలో సమైకాంధ్ర ఉద్యమసెగలు నేతలకు తాకాయి. దీంతో వారు తమ పదవులకు రాజీనామా సమర్పించి సమైకాంధ్రకు మద్దతు పలికారు. జిల్లాలోని నేతల రాజీనామాలు ఒకపక్క మరోకపక్క ఉద్యమాల సెగతో సమైకాంధ్ర ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతొంది.రాజీనామాలు సమర్పించినవారిలో రాష్టప్రురపాలకశాఖమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంటుసభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, చీరాల,కనిగిరి, పర్చూరు శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఉన్నారు. చీరాల శాసనసభ్యుడు ఆమంచి శాసనసభసభ్యత్వానితోపాటు జిల్లాకాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రజలమనోభావాలకు అనుగుణంగానే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంత్రి మహీధర్‌రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ తన ఎంపి పదవీకి రాజీనామా చేస్తున్నట్లు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి శుక్రవారం ఫ్యాక్స్‌ద్వారా లేఖ పంపించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో రాష్ట్రప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు, ఒబిసిల అభివృద్దికి రాష్ట్రప్రభుత్వం ఎంతో కృషిచేసిందని ఆయన తెలిపారు. రాష్ట్రం విడిపోతే తాను సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ నుండి పోటీచేస్తానని చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించారు. అలాగే నెల్లూరు, కడప, ప్రకాశంజిల్లా పరిధిలో రైతుల ఆశాజ్యోతి అయిన వెలుగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపుపై విభజన సమయంలో చర్చించనందుకు నిరసనగా మార్కాపురం టిడిపి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈపాటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా సమర్పించారు. ఒంగోలులోని మంగమూరురోడ్డు జాతీయరహదారి జంక్షన్ వద్ద బాలినేని రాస్తారాకోనిర్వహించారు. ఈసందర్భంగా వాహనరాకపోకలు రెండుగంటలకుపైగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాస్తారాకో సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో బాలినేనితోపాటు మరికొంతమందిని పోలీసులు బలవంతంగా అరెస్టుచేసి ఒంగోలు తాలుకా పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా బాలినేని మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం కేవలం రాజకీయలబ్ధి కోసమే రాష్ట్రాన్ని విభజించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఓట్లతో సీట్లు సంపాదించవచ్చునని సోనియాగాంధీ భావిస్తున్నారని ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోలేదని ఆయన ఆరోపించారు. అందరికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాన్ని యుపిఏ ప్రభుత్వం తీసుకోలేదని ఆయన విమర్శించారు.అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి అందరి అభిప్రాయాలను తీసుకుని నిర్ణయిస్తే బాగుండేదని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని విభజించటం వలన హైదరాబాదులాంటి అభివృద్ది చెందిన ప్రాంతం తెలంగాణాప్రాంతంలోకి పోవటం వలన విద్యార్ధులు,ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. రాష్టవ్రిభజనను వెనక్కితీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణాపై చంద్రబాబు నోరుమెదపటం లేదని ఆయన ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర ఉద్యమం గ్రామగ్రామాన ఉప్పెనలా ఊపందుకుంది. రాష్ట్రం సమైక్యాంగానే ఉండాలంటూ విద్యార్ధి, ఉద్యోగ జెఎసి నేతలు డిమాండ్‌చేస్తున్నారు. ఆర్‌టిసి బస్టాండు వద్ద విద్యార్థి జెఎసి నేతలు టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. అదే విధంగా రైస్, సంఘమిత్ర హాస్పిటల్ వద్ద విద్యార్థి,ఉద్యోగ జెఎసి నేతలు రాస్తారాకో, మానవహారాన్ని చేపట్టారు.
అదేవిధంగా మంగమూరు రోడ్డు వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మను విద్యార్థులు తగలబెట్టి నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో విద్యార్థి జెఎసి నాయకులు రాయపాటి జగదీష్, ఎన్‌జివో సంఘ నేతలు షేక్ బషీర్,రాజ్యలక్ష్మి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో సమైకాంధ్ర ఉద్యమసెగలు నేతలకు తాకాయి
english title: 
resignatons

నేడు జిల్లా బంద్

$
0
0

ఒంగోలు, ఆగస్టు 2: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలో జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని వైఎస్‌ఆర్‌సిపి చీఫ్‌విప్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు జిల్లాలోని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పోరాటం చేయాలని ఆయన కోరారు. యుపిఏ చైర్మన్ సోనియా గాంధీ రాజకీయ లబ్థి కోసం రాష్ట్రాన్ని విభజించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించడం వలన సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్ట పోతారన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను ప్రత్యేక తెలంగాణాలో కలపడం వలన సీమాంధ్రకు చెందిన విద్యార్థులు, యువకులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించడం వలన సీమాంధ్ర అభివృద్ధిలో మరో 20 సంవత్సరాలు వెనక్కి పోయినట్లు ఆవుతుందని తెలిపారు. రాష్ట్రం ముక్కలు అవుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నోరు మెదపకపోవడం చూస్తుంటే రాష్ట్రం సమైక్యంగా ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుగా ఉందని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టిందే తెలుగు జాతి మొత్తం ఒక్కటిగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే అని, అయితే చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రాన్ని విడగొట్టేందుకు సముఖత వ్యక్తం చేయడం సిగ్గు చేటైన విషయమన్నారు. కావూరి సాంబశివరావు తాను సమైక్యవాదినని పేర్కొన్నారని అయితే ఆయనకు కేంద్ర మంత్రి పదవి రాగానే అధిష్టానం ఇష్టమే తన ఇష్టమని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు అఖిలపక్షం సమావేశం అందరి అభిప్రాయాలు తీసుకొని అందరికి ఆమోదయోగ్యమయ్యే విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుండేదని, అలాకాకుండా అధికారం ఉంది కదా అని ఏకపక్షం నిర్ణయం తీసుకోవడం వలన సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా సాగు నీటికి సంబంధించి శ్రీకాకుళం నుండి కర్నూల్ వరకు సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యను ఎవరు పరిష్కరిస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఐదు లక్షల కోట్లు కేంద్రం ఇస్తే సీమాంధ్రను అభివృద్ది చేసుకుంటామన్నట్లు మాట్లాడుతున్నారని, ఎన్ని లక్షల కోట్లు ఇస్తే హైదరాబాద్ లాంటి నగరం ఇక్కడ ఎర్పడుతుందని ఆయన ప్రశ్నించారు. అంతే కాకుండా కొంత మంది రాజకీయ పార్టీల ఎమ్మెల్యే తాము సమైక్యాంధ్ర కోసం తొలుత రాజీనామాలు చేసిన తరువాత వారు కూడా రాజీనామాలు చేసి డ్రామా ఆడుతున్నారని వారిలో చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసిన ప్రతి ఎమ్మెల్యే స్పీకర్ వద్ద ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకున్నప్పడే వారు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసిన వారు అవుతారని పేర్కొన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో వై యస్ ఆర్ సిపి జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి సూర్య, ఒంగోలు నగర వైయస్ ఆర్ సిపి కన్వీనర్ కుప్పం ప్రసాద్, కటారి రామచంద్రరావు, కటారి శంకర్, ముదివర్తి బాబూరావు, కాటం అరుణమ్మ, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు నరాల రమణారెడ్డి, టి సోమశేఖర్, రొండా అంజిరెడ్డి, మహిళా నాయకురాళ్ళు గంగాడ సుజాత, పోకల అనురాధ, బడుగు ఇందిర, కావూరి సుశీల, తదితరులు పాల్గొన్నారు.

* ఎమ్మెల్యే బాలినేని
english title: 
dist bandh

రాష్ట్ర విభజన దుర్మార్గపు చర్య

$
0
0

మార్కాపురం, ఆగస్టు 2: రాష్ట్రాన్ని విభజించి రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం దుర్మార్గపుచర్య అని విద్యార్థి సంఘనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక సాధన కళాశాలకు చెందిన విద్యార్థులు విశే్వశ్వర థియేటర్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థి నేతలు మాట్లాడుతూ కెసిఆర్ పదవి రాలేదనే కాంక్షతో టిడిపిని వదిలి టిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనకు కారకుడయ్యాడని ఆరోపించారు. తెలంగాణ విభజనకు ముందు సమైక్యాంధ్ర నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి ముడుపులు అందచేస్తున్నారని ఆరోపించిన కెసిఆర్ నేడు విభజన చేసేందుకు దిగ్విజయ్‌సింగ్‌కు ఎంత ముట్టచెప్పాడో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్‌పార్టీ చేస్తే సరిపోదని, ఆంధ్రప్రాంత ఉద్యోగుల, విద్యార్థుల, రైతుల సమస్యలపై చర్చించి పరిష్కరించి అనంతరం రాష్టవ్రిభజన చేపట్టి ఉంటే బాగుండేదని వారు అన్నారు.

* విద్యార్థి నేతల ఆగ్రహం
english title: 
second phase

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు

$
0
0

చీరాల, ఆగస్టు 2: ఆంధ్రరాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాల కోసం రెండు ముక్కలు చేసి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తాకట్టుపెట్టాయని డిసిసి అధ్యక్షులు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దుయ్యబట్టారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం మండల పరిధిలోని దేశాయిపేటనుంచి భారీ ర్యాలీతో చీరాల వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం ముక్కోణపు పార్కు సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. అమరజీవి సాక్షిగా వేలాదిమంది ప్రజలముందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, చీరాల శాసనసభ్యత్వానికి తమ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేసి సాధించిన రాష్ట్రాన్ని రెండుగా విభజించి తెలుగుజాతికి ఉనికిలేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిగా మద్రాసు, అక్కడినుంచి కర్నూలు, తదనంతరం హైదరాబాద్‌కు, ఇప్పుడు మరొకచోటికి మారుస్తూ తెలుగుజాతిని సంచారజాతులుగా మార్చిన ఘనత మన రాజకీయ పార్టీలకే దక్కుతుందన్నారు. అయిదు దశాబ్ధాలపాటు రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ను రక్తం ధారపోసి అద్భుతంగా నిర్మించుకుంటే అతి కొద్దిమంది స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించటం ఎంతవరకు సమంజసమన్నారు. సీమాంధ్రలోని పార్టీలు ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయటం కన్నా ఘోరం మరొటి లేదన్నారు. దక్షిణ భారతదేశంలో ఎంతో గొప్పచరిత్ర కలిగిన ఆంధ్రరాష్ట్రం నేడు సంచారజాతిగా మారి తమ ఉనికిని కాపాడుకోలేక రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర నుంచి ఉన్నత పదవులలో ఉన్న సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రులు జెడి శీలం, పురంధ్రీశ్వరి, పనబాక, చిరంజీవి, కావూరి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబునాయుడు రాష్ట్రం విడిపోవటానికి కారకులని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటి తరపున తాను పోటీ చేస్తానని లేని పక్షంలో తాను పోటీ చేయనని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ బి జైసన్‌బాబు, మార్పు గ్రెగోరీ, మాదిగాని గురునాధం, సలగల దేవదానం, కంకణాల స్వతంత్రరావు, పులిపాటి బాబూరావు, శీలం శ్యామ్, గవిని వేణు, డేవిడ్, ఆమంచి స్వాములు తదితరులు పాల్గొన్నారు.
వెలుగొండ ప్రాజెక్టు నీటి సమస్యపై పరిష్కారం చెప్పరా..?
* సమస్యలపై చర్చించనందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
* మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం, ఆగస్టు 2: నెల్లూరు, కడప, ప్రకాశంజిల్లా పరిధిలో రైతుల ఆశాజ్యోతి అయిన వెలుగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపుపై విభజన సమయంలో చర్చించనందుకు నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మిగులుజలాలు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందని, ప్రస్తుతం విభజన జరిగి మిగులు జలాలను తెలంగాణకు తరలిస్తే ఈ ప్రాంతభూములు ఎడారులుగా మారి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారని, విభజన సమయంలో ఈప్రాజెక్టుకు కూడా జాతీయహోదా కల్పించి ఉంటే బాగుండేదని, ప్రకటించనందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల, ఉద్యోగుల, విద్యుత్ పంపిణీలో కూడా ఎలాంటి చర్చ చేయకుండా ఓట్లు, సీట్ల కోసం ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని ఆయన అన్నారు. తన రాజీనామాను శాసనసభ స్పీకర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు.

‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’
మార్కాపురం, ఆగస్టు 2: గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు అందచేయనున్నట్లు విలేఖరికి తెలిపారు. ప్రజాభిష్టం మేరకు రాష్ట్ర విభజనను నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నానని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన కోరారు. రైతుల, విద్యార్థుల, ఉద్యోగుల సమస్యలతోపాటు రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయని, ఈ సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర విభజన చేయడంతో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.
సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిన అద్దంకి
అద్దంకి, ఆగస్టు 2: ప్రత్యేక తెలంగాణా ప్రకటించి కాంగ్రెస్ చారిత్రాత్మిక తప్పిదం చేసిందని అద్దంకి మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శుక్రవారం అద్దంకి పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థినీ, విద్యార్థులు వేలాదిగా సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ అద్దంకి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం మొదలుకుని గాంధీబొమ్మ సెంటరు, భవానీసెంటరు మీదగా ఆర్‌టిసి బస్టాండ్ వరకు ర్యాలీ ప్రదర్శన చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. వేలాదిమంది విద్యార్థినీ, విద్యార్థులు అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ తెలుగుజాతిని విడదీయడం ద్వారా చారిత్రాత్మక తప్పుచేసిందన్నారు. సమైక్యాంధ్రకు పాటుపడిన పొట్టి శ్రీరాములు, నందమూరి తారకరామారావు ఆత్మ క్షోభిస్తాయన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి సమైక్యాంధ్రకు మద్దతు పలకడం ద్వారా తెలుగువారందరికీ ఆత్మీయుడయ్యాడన్నారు. రాష్ట్రంలో నీటి వాటాలు, భూపంపిణీ, ఆర్ధిక లావాదేవీలు ఏమి చెప్పకుండా, తెలుగువారి అభిప్రాయాలు సేకరించకుండా ఏకపక్షంగా తెలంగాణా నిర్ణయం ప్రకటించడం వారి దౌష్టికానికి నిదర్శనమన్నారు. రాత్రికిరాత్రే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన యుపిఎ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ కనుమరుగవుతుందన్నారు. సమైక్యాంధ్రను నిలబెట్టుకునేందుకు ఆంధ్రులంతా ఐక్యంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణా నిర్ణయాన్ని విరమించుకొని, సమైక్యాంధ్రను కొనసాగించేంత వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పలు విద్యాసంస్థల నిర్వాహకులు సాంబశివరావు, హనుమంతరావు, లక్ష్మీనారాయణ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
చీరాలలో...
చీరాలరూరల్ : సమైక్యాంధ్రకు మద్దతుగా చీరాల పట్టణం ర్యాలీలు, మానవహారాలు, దిష్టిబొమ్మ దగ్ధం, శవయాత్రలతో శుక్రవారం హోరెత్తింది.
తూర్పురెడ్డి సంఘం ఆధ్వర్యంలో
స్థానిక విఠల్‌నగర్ నుంచి తూర్పురెడ్డి కాపు సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా తప్పెట్లతో పట్టణంలో ర్యాలీ చేశారు. అనంతరం గడియారస్తంభం సెంటర్, ఆర్‌టిసి బస్టాండ్ వద్ద మానవహారం చేశారు. తదనంతరం గడియారస్తంభం సెంటర్ వద్ద సోనియాగాంధీ, కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో పి రాము, లక్ష్మణ్, భోగిరెడ్డి, కామయ్య తదితరులు పాల్గొన్నారు.
బైక్ ర్యాలీ
మేడికొండ మనోహర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముక్కోణపు పార్కు సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఆర్‌వోబి మీదుగా పేరాల వెళ్ళి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
సమైక్యాంధ్ర కోసం న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ప్రాంగణం నుంచి గడియారస్తంభం సెంటర్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం మానవహారంగా ఏర్పడి సోనియా, యుపిఎ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు సమర్పించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా నారుూబ్రాహ్మణ సేవాసమితి
పట్టణంలోని నారుూబ్రాహ్మణ సేవా సమితి సభ్యులు తమ దుకాణాలను మూసివేసి సమైక్యతకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం గడియారస్ధంభం సెంటర్, బస్టాండ్ వద్ద మానవహారాలు చేశారు. కార్యక్రమంలో చీరాల, ఈపూరుపాలెం, కొత్తపేట, జాండ్రపేట, పేరాల ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారు.
శ్రీ వాణి, భారతి విద్యాసంస్థలు ర్యాలీ
స్ధానిక శ్రీ వాణి, భారతి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు వందలాదిమంది సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. సోనియా డౌన్ డౌన్, కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో పట్టణం మారుమోగింది. ఈ సందర్భంగా పురవీధులలో ర్యాలీ నిర్వహించి గడియారస్తంభం సెంటర్ వద్ద మానవహారంగావించారు.
సమైక్యాంధ్ర కావాలి
- యువత డిమాండ్ -
మద్దిపాడు, ఆగస్టు 2 : ఆంధ్ర రాష్ట్ర విజభనను వ్యతిరేకిస్తూ మద్దిపాడులోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, యువకులు హైవేపై అరగంట పాటు రాకపోకలను నిలుపుదల చేసి రాస్తారోకో నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణా ప్రకటనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణాను ప్రకటించడం వలన ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములును అవమానపరిచినట్లుగా వారు విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రా ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హైవే మీద విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, మెహర్ ప్రసాద్, పవన్, నాగేశ్వరరావు, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రరాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాల కోసం
english title: 
self respect

తొలి సైకో కిల్లర్ - నమ్మండి! ఇదినిజం!!

$
0
0

అరుదుగా ఆంధ్రప్రదేశ్‌లో సైకో కిల్లర్స్ గురించిన వార్తలని వింటున్నాం. సైకో కిల్లర్ అంటే అకారణంగా ఎలాంటి సంబంధం లేని వాళ్లని చంపేవాడు. ప్రపంచంలోని అలాంటి తొలి సైకో కిల్లర్ లండన్‌లో 1888లో జీవించాడు. అతని పేరు? ఈనాటికీ ఎవరికీ తెలీదు. అంటే ఆనాటి పోలీసులు అతన్ని కనిపెట్టలేక పోయారు. దాంతో అతనికి ‘జాక్ ది రిప్పర్’ అనే ముద్దు పేరుని పత్రికల వాళ్లు పెట్టారు.
జాక్ ది రిప్పర్ ప్రత్యేకత ఏమిటంటే అతను కేవలం ఆడవారినే చంపేవాడు! అదీ వేశ్యలనే! ఇక వివరాల్లోకి వెళ్తే- లండన్‌లోని ఈస్ట్ ఎండ్ ప్రాంతంలో మొదటి హత్య ఆగస్టు 31, 1888న జరిగింది. మేరిపన్ నికోలస్ వైట్ ఛాపెల్ ప్రాంతంలోని బక్స్‌రోలో నివసించేది. ఆమె పొట్టలో పొడిచి తర్వాత గొంతు కోసి చంపబడింది. ఆ తర్వాత చంపబడ్డ వారి కడుపుల్లోంచి ఆర్గాన్స్‌ని హంతకుడు బయటకి తీయడంతో అతను వైద్యవృత్తిలో ఉన్నవాడని పోలీసులు భావించారు. ఈ హత్య పరిశోధన కొనసాగుతూండగానే మళ్లీ ఎనిమిది రోజుల తర్వాత సెప్టెంబర్ 8న అన్నీ చాప్‌మేన్ అనే ఇంకో వేశ్యని మేరిపన్‌ని చంపిన విధంగా ఎవరో చంపారు. ఈ రెంటి హంతకుడు ఒకరే అని పోలీసులు హత్యా విధానాన్నిబట్టి గ్రహించారు. ఆ తర్వాత కూడా వైట్‌ఛాపెల్ ప్రాంతంలో మరి కొందరు వేశ్యలు చంపబడటంతో వాటన్నింటినీ ‘వైట్ ఛాపెల్ మర్డర్స్’ అనీ, హంతకుడికి ‘వైట్ ఛాపెల్ హంతకుడు’ అని పిలవసాగారు.
మళ్లీ సెప్టెంబర్ 30, 1888న ఆ హంతకుడు ఇద్దరు వేశ్యలని చంపాడు. లిజ్‌స్టైడ్, కేట్ ఎడ్డొలెస్‌లని అదే పద్ధతిలో హత్య చేశాడా అజ్ఞాత హంతకుడు. వేశ్యలకి డబ్బు ఇచ్చి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి హంతకుడు వారిని చంపుతున్నాడని పోలీసులు గ్రహించారు. ఆరు అంగుళాల కత్తిని అందుకు ఉపయోగించేవాడు. రక్తం ధారాళంగా కారడంతో వారు త్వరగా మరణించేవారు.
తామే ఆ హత్య చేశామని డజన్ల కొద్దీ అనామక ఉత్తరాలు పోలీసులకు అందసాగాయి. వారిలో ఒకతను అడ్రస్ ఇవ్వకుండా ‘జాక్’ అని సంతకం చేయడంతో జాక్ ది రిప్పర్ అనే పేరు ఆ హంతకుడికి స్థిరపడింది. రిప్పింగ్ అంటే కోయడం అని అర్థం. రిప్పర్ అంటే కోసేవాడు. దాంతో వైట్ ఛాపెల్ మర్డరర్ అనే పేరు మరుగున పడిపోయి ఇప్పుడు ఆ హంతకుడిని జాక్ ది రిప్పర్‌గా పిలుస్తున్నారు. వరస హత్యలు చేసిన ఆ సీరియల్ కిల్లర్ అక్టోబర్ నెలంతా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతను తిరిగి నవంబర్ 9, 1888న మేరీ జేన్ కెల్లి అనే ఐదో వేశ్యని హత్య చేశాడు. వారి సమాధులని కూడా లండన్‌కి వెళ్లే ఆసక్తిగల పర్యాటకులు చూస్తారు.
ఈ ఐదు హత్యలే కాక జాక్ ది రిప్పర్ చేశాడని భావించే మరో పదమూడు హత్యలు ఏప్రిల్ 1891 దాకా జరిగాయి. డిసెంబర్ 26, 1887న ఫెయిర్ ఫే అనే ఆమెతో మొదలై 24 ఏప్రిల్ 1891న కేరిబ్రూన్ అనే ఆమె హత్యతో అవి ముగిసాయి. కాని పోలీసులు వారి హంతకుడు నిశ్చయంగా జాక్ ది రిప్పర్ అని గట్టిగా నిర్ణయించలేక పోయారు. 1891 తర్వాత ఆ హత్యలు పూర్తిగా ఆగిపోయాయి.
ఆ సమయంలో లండన్‌లోని ఈస్ట్‌ఎండ్‌లో వెయ్యి మంది దాకా వేశ్యలు ఉండేవారు. జార్ చక్రవర్తి పాలించే రష్యా నించి, ఐర్లండ్ నించి అనేక మంది కాందిశీకులు ఇంగ్లండ్‌కి వలస వచ్చి లండన్‌లోని ఈస్ట్‌ఎండ్‌లో నివసించేవారు. అదంతా స్లమ్ ఏరియాగా ఉండేది. అక్కడ జీవించేవారంతా బీదవారే.
మొదటి ఐదు మంది హతురాళ్ల శరీరాలని కత్తితో పొడిచిన విధానం వల్ల హంతకుడికి వేశ్యలంటే కసి ఉండేదని ఆనాటి సైకియాట్రిస్ట్‌లు ఊహించారు. ఒకరి జననాంగంలోకి కత్తిని పొడిస్తే, మరో వేశ్యని 39 సార్లు పొడిచాడు. ప్రతీ సందర్భంలోని సాక్షులు ఇచ్చిన హంతకుడి వర్ణన ఒకేలా లేకపోవడం గమనార్హం. ఆ హత్యలు పగలు, రాత్రి కూడా కొన్ని వేశ్యలు నివసించే సింగిల్ రూంలలో, కొన్ని నిర్మానుష్యమైన రోడ్ల మీద జరిగాయి. ఆనాటి లండన్ అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ (పోలీస్ కమీషనర్) సర్ మెల్‌మేక్ నగైన్ ఆ హత్యలన్నీ ఒకరు చేసినవేనని నిర్ధారించాడు.
హంతకుడు లండన్ వదిలి వెళ్లిపోవడమో, మరణించడమో, ఇంకేదో నేరంలో జైలుపాలవడమో లేదా పిచ్చాసుపత్రిలో చేర్పించడమో జరగడంతో ఆ హత్యలు ఆగి ఉంటాయని ఆయన ఆ రోజుల్లో జాక్ ది రిప్పర్ గురించి రాసిన పుస్తకంలో తెలియజేశాడు. ఆ రోజుల్లో దినపత్రికలు జాక్ ది రిప్పర్‌ని పట్టుకోలేని పోలీసుల అసమర్థతని ఏకిపారేశాయి.
థామస్ బాండ్ అనే పోలీస్ సైకియాట్రిస్ట్ హంతకుడి సైకలాజికల్ ప్రొఫైల్‌ని తయారుచేశాడు. అతను చిన్నప్పుడు తల్లిచేత నిరాదరింపబడటమో లేదా తన తల్లి లేదా అక్కచెల్లెళ్లు వేశ్యావృత్తిని అతనికి ఇష్టం లేకుండా చేయడమో జరగడంతో అతనికి వేశ్యా వృత్తి మీదగల ద్వేషాన్ని లేదా ఆనాటి తన కుటుంబ సభ్యుల మీద గల ద్వేషాన్ని ఈ సత్యల ద్వారా తీర్చుకున్నాడని, అతనికి ఏరోటిక్ మేనియా అనే మానసిక వ్యాధి కమ్ముకోగానే చంపితే కాని మానసిక ఉపశమనం కలగదని పేర్కొన్నాడు. రెలిజయస్ మేనియా గలవారు పరాయి మతస్థులని లేదా తమ మతాన్ని విమర్శించిన వారిని ఎలా చంపుతారో ఇదీ అంతే అని వివరించాడు. ఆ వేశ్యలతో అతను రతిలో పాల్గొనకపోవడానికి కారణం ఆ వృత్తి మీద ద్వేషం, తనకి వరస కాని వారు ఆ వృత్తి చేయడంగా అతను భావించాడు.
ప్రపంచవ్యాప్తంగా జాక్ ది రిప్పర్ వార్తలని దినపత్రికలు ప్రచురించాయి. ఈ హత్యల వల్ల ఈస్ట్‌ఎండ్‌లోని దారుణ జీవన పరిస్థితుల గురించి మీడియా రాయడంతో లండన్ నగర పాలక అధికారులు మేలుకొని శానిటరీని అభివృద్ధి చేసి అక్కడి అధిక జనాభాని వివిధ ప్రాంతాలకు తరలించి తగ్గించారు.
జాక్ ది రిప్పర్ మీద వచ్చినన్ని పుస్తకాలు మరే నేరస్థుడి మీదా రాలేదు. ఇంగ్లండ్‌లో, హాలీవుడ్‌లలో కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఇంక కథలయితే చెప్పనవసరం లేదు. వేల కొద్దీ కథలు జాక్ ది రిప్పర్ సైకాలజీ ప్రొఫైల్‌తో వచ్చాయి. లండన్‌లోని మేడమ్ టస్సాడ్స్‌వేక్స్ మ్యూజియంలో జాక్ ది రిప్పర్ మైనపు బొమ్మని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ని తోసిపుచ్చారు. అతనెవరో తెలీదు కాబట్టి ఆ విగ్రహాన్ని ఉంచబోమన్నారు.

నమ్మండి! ఇదినిజం!!
english title: 
nammandi idinijam
author: 
-పద్మజ

కుంచెం తేడాగా!

$
0
0

కుంచెం తేడాగా!

కుంచెం తేడాగా!
english title: 
kunchem tedaagaa!
author: 
-వెంకటేష్

పానీ పూరీ

$
0
0

నానో కాలమ్
ఓ స్కూలు లంచ్ టైమ్‌లో పిల్లలు అంతా క్యూలో కదులుతున్నారు. అక్కడ టేబుల్ పై బోలెడు ఆపిల్ పళ్లు కుప్పగా పోసారు. అక్కడ ఓ బోర్డు కూడా వుంచారు..‘ఒక్కొక్కరు ఒక్కటే తీసుకోండి..మీరు ఎన్ని తీసుకుంటున్నదీ దేవుడు చూస్తున్నాడు’ అని దానిపై రాసి వుంది. ఆ తరువాత పక్కనే టేబుల్ పై చాక్లెట్లు ఉంచారు. అక్కడే బోర్డు లేదు. ఓ ఆకతాయి కుర్రాడు, కాగితం తీసుకుని ఇలా రాసి పెట్టాడు.. ‘ఎన్నికావాల్సినా తీసుకోండి.. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఆపిల్ పళ్లనే చూస్తున్నాడు’

1970ల్లో
ఇక్కడ ఇంజనీర్ గారి ఇల్లెక్కడ..
అలా వెళ్లి కుడిపక్కకు తిరిగి, తిన్నగా సాగితే, మూడో ఇల్లే.
2013
ఇక్కడ ఇంజనీర్ గారి ఇల్లెక్కడ
అరె.. ఏ ఇంజనీర్.. ఇక్కడ ఇంటికి ఒకరున్నారు.

ఓ అమెరికన్ చనిపోయి నరకానికి వెళ్లాడు. అక్కడ దేశానికో నరకం వంతున వుంది. అయితే ఎవరికి ఏ దేశం కావాలంటే దాన్ని ఎంచుకోవచ్చు. సరే, దేశాభిమానంతో అమెరికా నరకం దగ్గరకు వెళ్లి శిక్షల గురించి వాకబు చేసాడు.
‘ఆ ఏముందీ, ముందు కరెంటు కుర్చీలో కూర్చోబెట్టి షాకులిస్తారు. ఆ తరువాత మేకులు గుచ్చిన పరుపుపై పడుకోపెడతారు. అదయిన తరువాత, యమభటులు వచ్చి, నానా హింస పెడతారు’ అని వివరించారెవరో.
సరే అని మిగిలిన నరకాల దగ్గర కూడా అడిగాడు. ఇంచుమించు అవే శిక్షలు చెప్పారు. మరికొంచెం ముందుకు వెళ్తే, ఇండియన్ నరకం కనిపించింది. పైగా బారెడు క్యూ కూడా వుంది. ఏమిటి సంగతి, తేలికైన శిక్షలు వేస్తున్నారా అని విచారిస్తే, అక్కడా అవే శిక్షలని తెలిసింది. మరెందుకు ఇంత క్యూ అని క్యూరియాసిటీతో అడిగిస్తే, అక్కడున్న వాడొకడు చెప్పాడిలా..
ఇక్కడ ఎలక్ట్రికల్ చైర్ మరమ్మతులో వుంది.
పరుపులో గుచ్చిన మేకులు ఎవరో దొంగిలించారు.
ఇక పనిచేసే భటులు, వచ్చి, రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోతారు. లేదంటే పడుకుంటారు.
అప్పుడర్థమైంది క్యూ ఎందుకు అంత వుందో.
***

నానో కాలమ్
english title: 
paani poori
author: 
- మాధురి

వాస్తు పురుషుడు

$
0
0

భారతీయ తత్వశాస్త్ర దార్శనిక మహర్షులు, సృష్టి తత్వాన్ని, ఒక అలౌకిక పద్ధతిలో సాంకేతిక భాషలో ప్రవచించారు. కారణం ఏమిటంటే అనర్హులకు, స్వార్థ సంకుచిత స్వభావులకు శాస్త్ర రహస్యాలు తెలియకూడదన్న ఉద్దేశంతో అలా చెప్పారు. శస్త్రానికి, శాస్త్రానికి అర్హత, అధికారం తప్పనిసరి. మామూలు భాషలో చెప్పాలంటే లైసెన్స్ తప్పనిసరి. రాక్షస స్వభావం గలవారు వరాలు పొంది లోకకంటకులుగా మారి ప్రజలను పీడించిన కథలు మనకు తెలియనివి కావు.
ఆ సాంకేతిక పద్ధతిలోనే వాస్తు పురుషుని గురించి కథారూపంలో చెప్పారు- ‘రుద్రుడు’ అంధకాసురునితో యుద్ధం చేస్తూ ఉండగా స్వేదబిందువు జారి అదే వాస్తు పురుషునిగా ఉద్భవించాడని కథ. రుద్రుడు అగ్నితత్వానికి ప్రతీక. అంతేకాదు జలకారకాత్వమునకు ప్రతీక. ‘ద్రావయతీతి రుద్రః’ అని వ్యుత్పత్తి. అగ్ని నుండే నీరు జనించినదని, నీటి నుండి పృథ్వి జనించినదని ఉపనిషత్తులు సృష్టి రహస్యాన్ని విప్పి చెప్పాయి.
‘ఆకాశాద్వాయుః నామోరగ్నిః
అగ్నేరాపః ఆద్భ్యః పృథివీ- పృథివ్యా
ఓషధయః - ఓషధీభ్యో అన్నః
అన్నాద్భూతాని జాయంతే’ ఉపనిషత్తు వాక్యాలు.
అంధకాసురుడు అంటే సృష్టికి పూర్వం ఉన్న కాళరాత్రి - యుద్ధం అంటే ఘర్షణ రాపిడి - చీకటికి, రుద్మాత్మయైన అగ్ని తేజస్తత్వానికి రాపిడి జరిగి తద్వారా జలము - ఆ జలము నుండి భూమి. ఆ భూమి నుండి వస్తుజాలము - అదే వాస్తు పురుషుడు ఉద్భవించాడని. ఆ కథలోని శాస్త్ర రహస్యం- అందుకే భూమికి, ‘వసుంధారయతీ వసుంధరా’ అని పేరు. ఇవి అన్ని కూడా అష్టదిక్పాలకులు - అష్టవిధ వస్తువులకూ ఆధారమైన ‘ఇంద్ర, అగ్ని, యమ (నియమ) నిర్రుతి - వరుణ- వాయు, కుబేర, ఈశానులు అధిదేవతలుగా నిర్వచించారు.
వారే వాస్తుకు అధిపతులు.
జ్యోతిష శాస్త్రానికి నక్షత్రాలూ, నవగ్రహాలు, ద్వాదశ రాశులూ ఎలా ప్రధానమో, వాస్తుకు అష్టదిక్పతులూ అధిదేవతలు. అందుకే - ఆగ్నేయంలో అగ్ని (వంటిల్లు), తూర్పు వైపు ముఖము - దక్షిణమున శయన మందిరము - పఠనాలయం. నైరుతి - ఆయుధ మందిరము (క్షత్రియోచిత వృత్తుల వారికి) సామాన్యులకు ఉపకరణాలు రోలు, రోకలి - తదితర సాధనాలు ఆరుబయట కాలకృత్య గృహాలు - ఉండాలన్నారు.
నైరుతి దిశ గురించి మంత్రశాస్త్రంలోనైతే గృహాంతర్భాగ నైరుతిలో (బంధాలు కాదు) నైరుతి దిశగా దిశోన్ముఖుడై జపతపాదులు చేస్తే ఇష్టదేవతా సాక్షాత్కారంగా చెప్పారు. అంతేకాదు గృహాంతర్భాగంలో నైరుతి దిశ ఆధిపత్య స్థానం కనుక గృహ యజమాని శయ్యామందిరం ఉండాలని చెప్పారు. ఇక పూర్తి పశ్చిమం వరుణ దిశ - జలభాండాలు ఉండవచ్చు. భోజనశాల ఉండవచ్చునన్నారు. వాయవ్యం - అంతర్భాగంలోనైతే ధాన్యాగారం - ఆరుబయట ఐతే పశువులు పెంపుడు జంతువులకూ నిర్దేశించారు. ఉత్తరం కుబేర స్థానం ధనాగారం. ఈశాన్యం - గృహాంతర్భాగంలోనైతే దేవపూజా మందిరం - ఆరుబయటనైతే నూతులు - జలాధార వసతులు నిర్దేశించారు. ఇదే స్థూలంగా వాస్తు శాస్త్ర శాస్ర్తియత ఏ పనినైనా శాస్ర్తియంగా చేస్తే శ్రేయస్సు కలుగుతుందని ‘తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ’ అని గీతావాక్యము. ‘లోకులకు అక్షి శాస్తమ్రు’ అని పండితసూక్తి. అంటే లోకులకు శాస్తమ్రు కన్ను వంటిది అని చెప్పారు. వస్తు నిర్మాణంలో వాస్తు శాస్త్రం ప్రధానం. వస్తువు అంటే - ఇల్లు, భవనం, నగరం, ప్రతిమ, శిల్పం మొదలైనవి.
*

సందేహాలు - సమాధానాలు

అజయ్‌కుమార్ గౌడ్ (రామంతాపూర్)
ప్రశ్న: నేను ఇల్లు కట్టుకోవాలంటే లేదా కొనాలంటే ఏ ముఖంగా తీసుకోమంటారు?
జ: సహజంగానైతే నీ పేరు అవర్గముగా తూర్పు దిశ అర్వణము అంటే కుదురుతుంది. కాని వ్యక్తి పేరు కంటే ఇంటి పేరున అర్వణం చూసుకుని దానికి అనుకూలంగా ఇంటికి కూడా ఒక పేరు పెట్టినట్టయితే కుటుంబంలో అందరికీ శుభమవుతుంది.
జి.తిరుపతిరెడ్డి (కంచన్‌బాగ్)
ప్రశ్న: ఇల్లు కట్టుకోవాలంటే ఏ నెలలో ప్రారంభించాలి. దసరా ముహూర్తం బాగుంటుందంటున్నారు. చేయమంటారా?
జ: పూర్తి నూతనంగా కట్టుకునే ఇల్లయితే, ఫాల్గుణ, వైశాఖ, శ్రావణ మాసాల్లో ప్రారంభించటం శ్రేష్ఠం. అశ్వీయుజం, గృహారంభానికి మంచిది కాదు - విజయదశమి క్షత్రియోచితమైన పండుగ.
పి.వీణాకుమారి (న్యూజెర్సీ)
ప్రశ్న: మేము అమెరికాలో ఇల్లు కొనాలనుకుంటున్నాం. వాస్తు నియమాలు వర్తిస్తాయా? వాస్తు ప్రకారంగా ప్లాటు తీసుకుంటే ఏం చేయాలి? ఇల్లు తీసుకుంటే ఏం చేయాలి?
జ: భూప్రపంచంలో ఎక్కడైనా వాస్తు నియమాలు వర్తిస్తాయి. అమెరికాలో కూడా వాస్తు పండితులు లేకపోలేదు. వారిని తీసుకువెళ్లి చూపించండి. లేదంటే దిక్చూచితో దిక్కులు (డిగ్రీలతో సహా) స్పష్టంగా సూచిస్తూ మాప్ పంపించండి.
భాగ్యలక్ష్మి (ఇందూర్)
ప్రశ్న: మేము కొత్తగా ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశాం. అందరూ బాగానే ఉన్నారు. నాకు మాత్రం ఎందుకో మనశ్శాంతి లేదు. ఇంట్లో లోపం ఉందంటారా? అందరూ నీ వెర్రి అంటున్నారు.
జ: వాస్తు దోషాలలో కొన్ని గృహ యజమానురాలి మీద ప్రభావం చేసేవి ఉంటాయి. చూపుకోవటానికీ, చెప్పుకోవటానికీ ఏ సమస్యా లేకపోయినా మీకు మనశ్శాంతి కరువౌతోంది. అందునా కొత్త ఇంట్లో అంటే గృహ యజమానురాలి మీద ప్రభావం చేసే దోషం ప్రధానంగా ఆగ్నేయంలో ఉండి ఉంటుంది. మంచి వాస్తు పండితునికి చూపించండి.
సిహెచ్.శశి (సికిందరాబాద్)
ప్రశ్న: మాకు ఈశాన్యంలో వంటిల్లు వచ్చింది. ఏం చేయాలి?
జ: వంట ఇంటికి తప్పకుండా ఒక అర అడుగు మందం కడప (గడప) ఏర్పాటు చేయాలి. పొయ్యి పై భాగాన గోడకు ఆగ్నేయ దిశా యంత్రం ప్రతిష్ఠించి ప్రతిరోజూ మొట్టమొదటగా వండిన పదార్థం కొంచెం నివేదన చేసి పొయ్యిలోనే వెయ్యాలి. అలాగే వండిన పదార్థాలు కొంచెం కొంచెం అన్నీ కలిపి ఉదయమే పాలు వేడి చేసినపుడు పాలు - ఆగ్నేయ యంత్రానికి నివేదన చేసి పొయ్యిలో వేయాలి. *

వాస్తువాచకం
english title: 
vaasthu
author: 
ఉమాపతి బి.శర్మ -9246171342

ఈ దేశమేందిరో.. గీ పాలనేందిరో

$
0
0

దేశాన్ని పరిపాలించటం అంటే ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. పరిపాలించేవాళ్లు - 24 గంటలూ టెన్షన్ పడుతూండేవారు. పరిపాలనలో ఎక్కడే లోపం జరుగుతే ప్రజలకేం బాధ కలుగుతుందో ఏమో అని!
కానీ ఇప్పుడు స్కూటర్ నడపడమంత ఈజీ అయిపోయింది దేశాన్ని నడపడం -
స్కూటర్‌కి అదివరకు లాగా కిక్ కొట్టాల్సిన అవసరం లేదు. బటన్ స్టార్ట్! అలాగే గేర్స్ వేయాల్సిన అవసరం లేదు - అంతా ఆటోమేటిక్ - దేశాన్ని పరిపాలించడం కూడా అంతే!
అదివరకు లాగా ప్రజాసేవ చేస్తేనే ప్రజలు ఓట్లేస్తారనే సిస్టమ్ పోయింది.
ఓటర్లందరకూ మందూ, మనీ సప్లయ్ చేసి గెలవ్వచ్చు - మళ్లీ అదే మనీతో మిగతా ఎమ్మెల్యేలను కొని సీయం అయిపోవచ్చు. లేదా ఎంపీలను కొని ప్రధానమంత్రి అయిపోవచ్చు.
ఆ తర్వాత దేశాన్ని పరిపాలించటం అంటే - సమిష్టిగా ఆలోచించి దేశానికీ, ప్రజలకూ ఏ పాలసీ మేలు చేస్తుందో డిసైడ్ చేసే సిస్టమ్ కూడా మారిపోయింది.
టెలికామ్ మంత్రికి ఫోనొస్తుంది.
‘సార్ - నేను టెలికామ్ - టుజీ - త్రీజీ- ఫోర్‌జీ - కంపెనీ తరఫున మాట్లాడుతున్నా’
‘మాట్లాడు’
‘మా ఫైల్ మీద సంతకాలు చేయాలి సార్ మీరు’
‘కాష్ ఎంతిస్తావ్?’
‘వెయ్యి కోట్లు సార్’
‘చిల్లర వేషాలేయకు - లక్ష కోట్లు ఇస్తే సంతకం చేస్తా’
‘లక్ష కోట్లు మరీ టూమచ్ సార్’
‘నోర్మూసుకో - ఇదంతా నేనే తింటానా? ప్రధానమంత్రికి వాటా - ఫైనాన్స్ మినిస్టర్‌కి వాటా - మా పార్టీ ఫండ్ కోసం వాటా- అసలు నేను ఈ మంత్రి పదవి కోసం ఎంత ఖర్చు చేశానో తెలుసా నీకు? పది వేల కోట్లు - నీ తాతిస్తాడా ఆ డబ్బు’
‘పోనీ ఇంకో మాట మీరే చెప్పండి సార్’
‘సరే - తొంభై వేల కోట్లు’
‘ఓకే సార్’
ఇక రైల్వే మంత్రి-
‘సార్ - నేనే సార్ - ఒకప్పుడు మీ పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్లిన రిక్షావాడిని’
‘ఓ రిక్షావాలా! ఎలా వున్నావోయ్’
‘మీ దయ వల్ల బాగానే ఉన్నా సార్ -మీరు నాకో సాయం చేయాల్సార్’
‘ఏంటది?’
‘మా బామ్మర్ది ఒకడీ మధ్య రైల్వేలో జాయినయ్యాడు సార్. వాడిని రైల్వే బోర్డు చైర్మన్‌గా చేయాలి సార్’
‘నీకేం పిచ్చా? ఆ పోస్ట్ కావాలంటే పదివేల కోట్లు లంచం ఇవ్వాల్సి ఉంటుంది’
‘ఆ! అంత డబ్బా?’
‘ఆ మనీ అంతా నేను తింటానిక్కాదురా! ప్రధానమంత్రి కివ్వాలి - పార్టీ ఫండ్ కివ్వాలి - అయినా అంత డబ్బు తేవడం నీ వల్ల ఎక్కడవుతుందిరా’
‘ఎందుక్కాదు సార్ - మీరెంత అడిగినా ఇవ్వడానికి ఎలక్ట్రికల్ కంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ కంట్రాక్టర్లు, కేటరింగ్ కంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు సార్’
‘అలాగా! అయితే వెంటనే తెచ్చివ్వు - చేసేద్దాం’
‘ఓకే సార్’
ఇంకో కేంద్ర మంత్రి-
‘హలో - కేంద్ర మంత్రి సక్సేనా మాట్లాడుతున్నా’
‘నమస్తే సార్ - మీరు కోరినట్లు మా ప్రైవేటు హెలికాప్టర్స్ - కేదారనాథ్‌కి వెళ్లి అక్కడ చిక్కుబడిపోయిన యాత్రికులను రక్షించడానికి ఒప్పుకుంటున్నాం సార్’
‘గుడ్ మనీ ఎంతిస్తున్నావ్?’
‘అయిదు కోట్లు’
‘పది కోట్లు ఇవ్వాలి’
‘అంత డబ్బిస్తే నేను నా కంపెనీ మూసేయాల్సి వస్తుంది సార్’
‘నీ యిష్టం ఆలోచించి చెప్పు! అయినా ఆ డబ్బెక్కడికీ పోదు బాబూ’
‘నువ్ యాత్రీకుల దగ్గర మనిషికి లక్ష తీసుకో - టికెట్ ఛార్జీ కింద. నీకు లక్ష ట్రిప్పుల గారంటీ ఇస్తా’
‘కానీ ఇది మీ గవర్నమెంట్ కంట్రాక్ట్ తీసుకుంది కద్సార్. మేమెలా ఛార్జ్ ఎలా వసూలు చేస్తాం?’
‘ఎవడి ప్రాణాలు వాడు దక్కించుకోడానికి వాళ్లే ఆఫర్ చేస్తారయ్యా. ఆ డబ్బు నొక్కేశెయ్’
‘ఓకే సార్’ *

హలో ... మైక్ టెస్టింగ్
english title: 
hello mike testing
author: 
యర్రంశెట్టి శాయి
Viewing all 69482 articles
Browse latest View live