Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

హైపర్‌లూప్....

$
0
0

వామ్మో! గంటకు 457 కిలోమీటర్లా..? అని గుడ్లు తేలేస్తున్నారా? ఆగండాగండీ.. గంటకు 1,123 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అత్యాధునిక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వర్జిన్ హైపర్‌లూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న అత్యంత వేగవంతమైన మెట్రో రైలు రవాణా వ్యవస్థను పోలిన ‘హైపర్‌లూప్’కు సంబంధించి ఇప్పటికే ఒక రికార్డు నమోదైంది.
హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడే ప్రయత్నాలను ప్రోత్సహించేందుకు స్పేస్ ఎక్స్ ఏరోస్పేస్ సంస్థ ఒక పోటీని నిర్వహించింది. ఇందులో జర్మనీ విద్యార్థుల బృందం విజయం సాధించింది. ‘వార్ హైపర్‌లూప్’ అనే ఈ బృందం రూపొందించిన హైపర్‌లూప్ పాడ్‌ను 1.2 కిలోమీటర్ల పొడవైన ప్రయోగ ట్రాక్‌పై నడిపి చూడగా, ఇది గంటకు 457 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ‘టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ మ్యూనిక్’కు చెందిన ఈ బృందానికి ఇది మూడో విజయం. అయస్కాంతాల సాయంతో పట్టాలపై రైలును పైకెత్తి నిలపడం వల్ల రాపిడి తగ్గి వేగం పెరిగే మాగ్లెవ్ (మాగ్నెటిక్ లేవిటేషన్) రైళ్లు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నడుస్తున్నాయి. వీటిలో ఒకటి చైనాలోని షాంఘై నుంచి అక్కడి విమానాశ్రయానికి ప్రయాణికులను గంటకు 430 కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్తోంది. ఈ మాగ్లెవ్‌ను వాక్యూమ్ ట్యూబ్ (శూన్య గొట్టంలో) నడపడం ఇంకా అత్యాధునికమైన ప్రక్రియ. ఇదే హైపర్‌లూప్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రత్యేక సొరంగం ఒక భాగం. వాహనం ప్రయాణించేటప్పుడు గాలి కారణంగా ఎదురయ్యే నిరోధాన్ని, రాపిడిని తగ్గించేందుకు ఈ సొరంగంలో గాలి లేకుండా చేస్తారు.
జర్మనీ బృందంతో పోటీపడిన నెదర్లాండ్స్‌లోని డెల్ట్స్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ బృందం గంటలకు 141.6 కిలోమీటర్ల వేగాన్ని, స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ఈపీఎఫ్‌లూప్’ 88.5 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలిగాయి. ఈ పోటీని స్పేస్ ఎ క్స్ వ్యవస్థాపకుడు,

టెస్లా సంస్థ సహ వ్యవస్థాపకుడు అయిన ఎలాన్ మస్క్ తిలకించారు. ఆ హైపర్‌లూప్ పాడ్‌ల ప్రయాణాలను కూడా ఎలాన్ పరిశీలించాడు.
భారతదేశంలో..
మనదేశంలో ముంబై బెంగళూరు చెన్నై నగరాల మధ్య 1,102 కిలోమీటర్ల హైపర్‌లూప్ మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ప్రకారం ముంబై నుంచి చెన్నైకి 63 నిముషాల్లో చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి 334 కిలోమీటర్ల దూరంలోని చెన్నైకి 23 నిముషాల్లో చేరుకోవచ్చు. ముంబై పుణె మధ్య కూడా ఈ వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనలో ఉన్న వర్జిన్ హైపర్‌లూప్ వన్ సంస్థ పుణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోనూ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం, హైపర్‌లూప్ అమెరికాకు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్ (హెచ్‌టీటీ) మధ్య గత సంవత్సరం సెప్టెంబర్‌లో అవగాహన ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే.
*


‘గానసభ’కు ప్రణామం

$
0
0

**శ్రీ త్యాగరాయ గానసభలో ఎన్నో అత్యాధునిక హంగులతో కూడిన వేదికలు, అత్యంత రమణీయంగా కనిపించే చిత్రపటాలు, నిరంతర సన్మానాలు, సత్కారాలు, గానామృతాలు, సప్తాహాలు, మహానుభావుల జయంతులు, వర్థంతులు, గ్రంథావిష్కరణలు, దీపాలంకారాలు.. నిత్యం ఉత్సవమే ఇక్కడ. వీటన్నిటికీ తోడు తలపై మణిమయ కిరీటంలా ‘్భరతరత్న’ల తైలవర్ణ చిత్రాలు.
త్యాగరాయ గానసభలో ఐదు వేదికలు, ఒక ప్రధాన వేదికతోపాటు నాలుగు ఉచిత వేదికలున్నాయి. సంవత్సరంలో దాదాపు 1,500 కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేశంలోనే ఏకైక సంస్థ ఇది.
=================================

గొప్ప కళా ప్రదర్శనలు:
ఈ సభలో ఎందరో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, మంగళంపల్లి బాలమురళి, హేమమాలిని, నూకల చినసత్యం, ద్వారం వెంకటస్వామి నాయుడు, ఎం.ఎస్.రామారావు వంటి ఎంతోమంది ప్రాతఃస్మరణీయ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలిచ్చారు. ఈ వేదికపై గత ఐదు దశాబ్దాలుగా మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు, ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు, న్యాయమూర్తులు, సినీ నటులు, ఎంతోమంది రాజకీయవేత్తలు వచ్చి దీని దర్శనంతో పునీతులయ్యారు.

ఆలయం:
ఇక్కడ అడుగు పెట్టగానే 32 అడుగుల ఆంజనేయ స్వామి అభయమిస్తాడు. అక్కడే దేవాలయంలో సీతారాములు, లక్ష్మణస్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి.

దశాబ్దాల కళాసేవ:
గత 52 ఏళ్లుగా త్యాగరాయ గానసభ కళాసేవకే అంకితమైనది. 52 ఏళ్లుగా ప్రభుత్వం నగదు, అవార్డు ఏమీ ఇవ్వలేదు త్యాగరాయ గానసభకు. ఏ ప్రోత్సాహం, ఆలంబన ఇవ్వలేదు. అయినా అలుపెరుగని కార్యకర్తలా, అలసిపోని గడియారం ముల్లులా ఎండలో వానలో కళాసేవ చేస్తూనే ఉంది. కేవలం మెయిన్ హాలుకు మాత్రం వీరు ఫీజు తీసుకుంటున్నారు. మిగిలిన నాలుగు వేదికలు కూడా సంవత్సరం పొడుగునా ఉచితంగా కళాకారులకు, కళాసేవకూ అంకితమైనాయి. 1967లో కళాసుబ్బారావుగారు, గుండవరపు హనుమంతరావుగారు, చెరువు పార్థసారథిగారు, దయానందరావుగారు తదితర పెద్దలు దీనిని నిర్మించ తలపెట్టారు.

ఉత్సవాలు:
త్యాగరాయ గానసభ స్వర్ణోత్సవాల సందర్భంగా మన భాష, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన భారతరత్నలు, వాగ్గేయకారుల చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉగాది ఉత్సవాలు, వసంత నవరాత్రి, దసరా ఉత్సవాలు, సాహితీ సభలు, గ్రంథావిష్కరణలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి.

కళకే అంకితం:
శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా వి.ఎస్.జనార్దనమూర్తిగారు. ఇంతకు ముందు వీరి తండ్రి కళాసుబ్బారావుగారు, అన్న కళాదీక్షితులు కూడా అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సభకు సెక్రటరీ కళాదీక్షితులు గారి సతీమణి శ్రీమతి కళా శారద. వీరందరికీ కళాకారులు ఎంతో రుణపడి ఉన్నారు.
*

పునరుజ్జీవన ప్రస్థానంలో నేను..

$
0
0

వాసిలి వాకిలి
=========

నేను..
విశ్వ ప్రతీకను.
చారిత్రక పరిణామ ప్రతిమను.
అస్తిత్వ ఆరాట పటిమను.
వెరసి... వైయక్తిక సంస్కృతీ పరిణామ ప్రతిబింబాన్ని.
అయినా.. అన్ని వ్యవస్థలలోను ఇండిపెనె్డన్ట్.
ఈనాటి పరిభాషలో-
నేను - Man - is the measure of all things అన్నిటికీ కొలమానాన్ని.
నేను - The humanbody - is the most perfect instrument for the self expression of consciousness చైతన్య స్వవ్యక్తీకరణకు సరియైన సాధనాన్ని.
ఇంకాస్త ఆధునిక స్వరంలో చెప్పుకోవాలంటే-
నేను -Renaissance Man పునరుజ్జీవన మానవ అస్తిత్వాన్ని.
మొత్తానికి, ఈ ‘పునరుజ్జీవన నేను’కు నేపథ్యంగా సాంస్కృతిక పురోగతి, పాంచభౌతిక పరిణతి, విశ్వమైత్రి వేళ్లూనుకుని ఉన్నాయి. కొన్ని వేల, లక్షల, కోట్ల బంధాల అనుబంధం పెనవేసుకుని ఉంది.
‘నేను’ చుట్టూ విభిన్న వ్యవస్థలు.. విపరీత ధోరణులు.. ‘సంక్లిష్టత’ల నడుమ ‘సంసార’ తాపత్రయాలు.. అవాంతరాలు.. అవరోధాలు. అయినా నిలదొక్కుకోవాలనే అస్తిత్వ ఆరాటం. సామాజిక వ్యవస్థలో ఈ అయోమయ ‘అవస్థీకరణ’లో ‘నేను’కు ఎప్పటికప్పుడు తప్పిపోతున్నాననే అభద్రతా భావం.. చివరికి కొనఊపిరిలో సైతం సంక్షోభాల నుండి బయటపడటం.. ఆశ చిగురించటం.. అవకాశం పల్లవించటం.. పట్టుదొరికిందన్న ఆలోచన పొటమరించటం.. ఆ‘లోచన’ మహావృక్షంలా వేళ్లూనుకోవడం.. జీవితం కొత్తగా కొమ్మలు రెమ్మల నీడన వొదగటం. ఓహ్.. ఈ ప్రస్థానమంతా ‘నేను’కు పునరుజ్జీవనమే!
అవును, ‘నేను’కున్న తెలివితేటల విస్తృతి పరివ్యాప్తమవుతూ ‘మేధాసంపన్నత’గా పదుగురిని ఆకర్షించటమూ.. ప్రభావితం చేయటమూ ఒక మా‘నవ’ పరిణామమే! ఫలితం - మానవత్వంలో పునరుజ్జీవన వికాసం.
* * *
‘నేను’
సదా అభ్యసనశీలి.
అస్తిత్వ అంశతో నేర్చుకునే ప్రక్రియలో ముందుండటం ‘నేను’కు ప్రకృతి ప్రసాదించిన వరం.
కాబట్టి, ‘నేను’ వరకు మానవత్వం ఒక తత్త్వంలా అనిపిస్తున్నా నిజానికి అది మానవ నైజం. స్వభావం. ఆ నేర్చుకోవటం అనే ప్రక్రియనే ‘నేను’ను కాలరేఖపైన నిలుపుతుంది. వర్తమానంలోనే కాక భవిష్యత్తులో సైతం నిలదొక్కుకునేలా చేస్తుంది. అందుకే ‘నేను’కు జీవితం ఎల్లప్పుడూ ఒక పాఠశాలనే. నేర్చుకుంటూ నేర్చుకుంటూ ‘నేను’ ఎప్పటికీ మేధావినే! సమర్థ‘శీలినే’!
ఎంతలా చదవగలిగితే అంతలా చదువుకుంటూ పోవటం లెర్నింగ్! ఈ క్రమంలో సమీప భవిష్య జీవనానికి ఆలంబన దేహం. బుద్ధి అంటే దేహ దారుఢ్యత, మనోకుశలత. మొత్తానికి మానవ పునరుజ్జీవన వ్యవస్థలో బౌద్ధిక క్షేత్రాన్ని ప్రత్యేకంగా మలచటం అనేది ప్రధాన ఘట్టం. అయితే, ఇది భౌతిక జీవనం వరకే.. అధిభౌతిక వ్యవస్థలో మాత్రం ‘నేను’ విశ్వ ప్రతీక కావలసిందే.. మనోకౌశలమంతా ‘విశ్వ’శక్తిగా పరిణమించాల్సిందే. వైయక్తిక ప్రతిభ అంతా విశ్వ ‘ప్రజ్ఞానం’గా భాసురం కావలసిందే.
అందుకే ‘నేను’ అంటే ఈ ‘దృశ్య నేను’ మాత్రమే కాదు.. దృశ్య నేనుకు ‘ఆఫ్టర్ లైఫ్’ అనిపించినా ‘అదృశ్య నేను’ మాత్రం తపించేది. ‘ఆఫ్టర్ డెత్’ క్షేత్రజ్ఞత కోసమే.
* * *
‘నేను’
బుద్ధిజీవి.. అంటే ‘నేను’ది బౌద్ధిక ప్రస్థానం. బౌద్ధిక ప్రస్థానం ఆలోచనా చైతన్య స్రవంతిగా సాగుతుంటుంది. ‘నేను’ మానసికం. మన జీవన శైలిలో ‘మనసు పడటం’ అంటే మానసికమనే. ఈ మనసు పడటమే ‘కోరిక’. తీవ్రతను బట్టి అదే కోరిక వ్యామోహం అనీ అనిపించుకుంటుంది. ఫలితంగా, ‘కోరిక’ నుండి రకరకాల భావాలు, భావోద్వేగాలు, అనుభూతులు, ఆలోచనలు, అభిప్రాయాలు, దృక్పథాలు పుట్టుకొస్తుంటాయి. ఇవన్నీ ‘నేను’ను నిర్వచిస్తుంటాయి.. ‘నేను’కున్న ప్రాపంచిక వర్తనాన్ని స్పష్టంగా చూపిస్తుంటాయి. ఆలోచించటం, నిర్ణయానికి రావటం, ఆచరణలో పెట్టటం, గుర్తించటం, విశే్లషించటం, విమర్శించటం - ఇవన్నీ మానసిక చర్యలే! మానసిక ప్రక్రియల ఫలితాలే ఫీలింగ్స్, ఎమోషన్స్..
తమాషా ఏమిటంటే మన వర్తనానికి మూలం మనస్సే అయినప్పటికీ మానసికాల ఆచరణ దేహావయవాల ద్వారా వ్యక్తమవుతుంటుంది కాబట్టి మానసికాలు సైతం దైహికాలుగా ముద్ర పడుతుంటాయి. ఈ బాడీ-మైండ్ లింక్ వల్లనే మనస్సును ‘్ఫజికల్ బ్రెయిన్’ అనీ అంటుంటాం. అందుకే మైండ్ - బాడీ లింక్‌గా నాడీ వ్యవస్థ అన్నది బలమైన వాహిక అవుతోంది. ఇలా, ఆరోగ్యకర దైహిక జీవనానికి నాడీకణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది.
‘నేను’లో న్యూనతాభావాన్ని, ఆధిక్యతా భావాన్ని కలిగించేది మనస్సే! ఒక సమస్యను పరిష్కరించుకో గలిగినపుడు మనం గాలిలో తేలిపోతుంటాం. ఇటువంటి సందర్భాల్లో మనస్సు ఆత్మ విశ్వాస ప్రతీక అవుతుంటుంది. ఆత్మ ఆధిక్యతా భావాన్ని తేజరిల్ల చేస్తుంది. సమస్య పరిష్కారం కానప్పుడు, ఎంత చిన్న సమస్య అయినా పెనుభూతంలా భయపెడుతుంది. న్యూనతాభావాన్ని నెలకొల్పుతుంది. అందుకే రెండు కళ్లతో చూస్తున్నా నిర్ధారణకు వచ్చేది ‘మనోనేత్రం’లోనే!
ఇంతకీ ఈ ఫిజికల్ బ్రెయిన్ ఉండేది తలలో.. 8,600 కోట్ల కణ వ్యవస్థగా.. ప్రతీ కణానికి మరో పదివేల కణాలతో అనుబంధం. అందుకే ఇంతటి భారీ వ్యవస్థను ఈనాటి సైన్స్ అంతే భారీగా పరిశోధిస్తోంది. అయినా శాస్ర్తియతకు అందకుండా మైండ్ పరిక్రమిస్తోనే ఉంది. సైన్స్‌కు అందని ఆ పరిక్రమణ తావును స్పిరిట్యుయల్ శోధనకు, సాధనకు అందుతున్నాయి. అదే సూప్రా మైండ్.. దానిది హయ్యర్ ఇంటెలిజెన్స్.
మొత్తానికి మానవ మానసిక పరిణామంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్న బ్రెయిన్ సైజ్ ఒక యాభై సంవత్సరాల క్రితానికి మూడింతలుగా పెరగటం జ్ఞానం ఇబ్బడిముబ్బడి అయిందనటానికి సంకేతమే. ఈ మూడింతల ప్రస్థానంలో ఆలోచన వేగం పెరిగింది. ఆలోచన సాంద్రత పెరిగింది. ఆలోచన తీక్షత పెరిగింది. విచక్షణా పెరిగింది. విశే్లషణా పెరిగింది. భావ ఉద్విగ్నతా పెరిగింది. ఈ ఎమోషన్స్ కారణంగా దేహంలో ఆరోగ్యమూ, అనారోగ్యమూ భాగస్వాములయ్యాయి. ఒకవైపు జీవితకాలం పెరుగుతున్నా మరోవైపు ఆరోగ్య వ్యవస్థ తరుగుతోంది. రకరకాల జబ్బులు మానవ పరిణామంలో ఆధునికతను సంతరించుకుంటూ ‘సూప్రా స్పెషాలిటీ’గా పరిణమిస్తున్నాయి.
మొత్తానికి, మనో విశే్లషణ ఎంతలా వికసిస్తున్నప్పటికీ మనసు దేహంలో ఎప్పుడు క్రియాశీలంగా ఉంటుందో, ఎప్పుడు నిస్తేజంగా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. ఆధ్యాత్మికంగా ‘ఆత్మ’ దేహంలో ఎప్పుడు, ఎలా, ఎందుకు ప్రవేశిస్తుందో చెప్పలేనట్లుగానే శాస్ర్తియంగా ‘మనసు’ దేహాన్ని ఎప్పుడు, ఎందుకు, ఎలా చేరుతుందో, ఎందుకు విడనాడుతుందో చెప్పలేకపోతున్నాం. ఇలా చూసినపుడు అటు ఆత్మ ఇటు మనసు - రెండూ నిరాధారిత వ్యవస్థలే అవుతున్నాయి.
అన్నట్టు, ఈ దేహం మృత్యువులోకి వొదిగినపుడు ‘ఆత్మ’ దేహం నుండి తప్పుకున్నట్లే ‘మనస్సు’ కూడా దేహం నుండి తప్పుకుంటుంది. ఆత్మ చేరినట్లే మనస్సు కూడా ఆవలి తీరాన్ని చేరుకుంటుంది. అంటే, మృత్యువు తర్వాతి క్షేత్రత్వాన్ని చేరుకుంటుంది. ఆ చేరికతో ఆవిష్కృతమయ్యే చైతన్యమే ‘హయ్యర్ ఇంటెలిజెన్స్’ ఆవలి తీర క్షేత్రమే ‘సూప్రామైండ్’. అది మనస్సుకు దక్కిన శాశ్వతత్వం. అది ఇమ్మోర్టల్ మైండ్. దానిది ఇమ్మోర్టల్ ఇంటెలిజెన్స్.
మృత్యువుతో ఆగిపోకుండా మృత్యువు తర్వాతి క్షేత్రంలో మానసిక చైతన్య స్రవంతి తన అస్తిత్వాన్ని కలిగి ఉంటుందన్నది విచారణ కాదు.. అది గిక సాధనావిష్కరణ. ‘నేన’కే సాధ్యమైన ఈ అతీంద్రియ చైతన్యం వర్తమానంలో నెలకొని ఉన్న అన్ని చైతన్య ఆవిష్కరణల కంటే భిన్నమైంది, ప్రత్యేకమైంది. అందుకే, మానవ గిక సాధనతో నిలదొక్కుకుంటన్న చైతన్యం మార్మిక జగత్తులకి పరివ్యాప్తవౌతోంది.
ఇలా విశే్లషించుకుంటున్నప్పుడు - మృత్యువుకు ఆవల అస్తిత్వాన్ని కలిగి ఉండే సూప్రామైండ్ క్షేత్రజ్ఞతను అవలోకించటం, ఆ క్షేత్రజ్ఞతలోకి ప్రస్థానించటం అంతశ్శోధనగా సాగే గిక సాధన ద్వారా సాధ్యవౌతంటే దేహాన్ని కేంద్రంగా చేసుకుని బాడీమైండ్‌ను అవలోకించటం శాస్ర్తియ పరిశోధనగా పరిఢవిల్లుతోంది. ఇలా - పరిశోధనకు భూమిక జ్ఞాన విజ్ఞాన వికాసం అయితే శోధనకు మూలం ప్రజ్ఞాన ప్రస్థానం.

రొమాంటిక్ పోస్టుబాక్సు

$
0
0

ప్రపంచంలో ఎక్కడైనా వ్యక్తుల పేరుతోనో, సంస్థల పేరుతోనో ఉత్తరాలు రాస్తారు. కానీ ఉత్తర జర్మనీలో యూటిన్ నగరానికి సమీపంలోని డొడావెర్ అడవిలో 500 సంవత్సరాల నాటి ‘ఓక్’ చెట్టుకు దేశవిదేశాల నుంచి ఎందరో పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉత్తరాలు రాస్తుంటారు. ప్రపంచంలోనే పోస్టల్ చిరునామా కలిగిన ఏకైక చెట్టు ఇదే! దీనికోసం ప్రత్యేకంగా ఓ పోస్టల్ కోడ్, పోస్టుబాక్సు (చెట్టుతొర్ర)తో పాటు, దీనికో పోస్టుమ్యాన్ కూడా ఉన్నాడు. చెట్టుకు మూడు మీటర్ల ఎత్తులో ఉన్న ఆ పోస్టుబాక్సు (తొర్ర) దగ్గరకు సులువుగా వెళ్లేందుకు ఓ నిచ్చెన కూడా ఉంటుంది.
చెట్టుకు ఉన్న తొర్రనే పోస్టుబాక్సుగా పిలవబడుతుంది ఇక్కడ. అయితే ఇదే ప్రపంచంలోని అత్యంత రొమాంటిక్ పోస్టుబాక్సుగా పేరు పొందింది. ఈ ఓక్ చెట్టుకు ఉత్తరం రాస్తే తొందరగా పెళ్లవుతుందని చాలామంది నమ్మకం. తమకు నచ్చిన లక్షణాలు, అర్హతలు ఉన్న భాగస్వామి కావాలని వివరిస్తూ.. ఈ చెట్టుకు ఉత్తరం రాసి పంపుతారు. వీటన్నింటినీ ఓ పోస్ట్‌మ్యాన్ తీసుకెళ్లి ఆ చెట్టు తొర్రలో ఉంచుతాడు. ఎవరైనా వచ్చి వాటిని తీసుకుని చదివి, ఆ లక్షణాలు వారిలో ఉన్నట్లయితే.. ఆ ఉత్తరం రాసినవారికి ప్రత్యుత్తరం పంపొచ్చు. అలా ఇద్దరి మధ్య ఏర్పడే పరిచయం వివాహానికి దారితీస్తుంది. ఇలా ఈ చెట్టు ఇప్పటి వరకు వంద జంటలకు పైగా కలిపిందట. ఈ చెట్టు చిరునామాకు దేశవిదేశాల నుంచి ఏటా దాదాపు వెయ్యికి పైగా ఉత్తరాలు వస్తాయని జర్మనీ తపాలా సేవల సంస్థ ‘డచ్ పోస్ట్’ అధికార ప్రతినిధి మార్టిన్ గ్రండ్లర్ చెప్పారు. ముఖ్యంగా వేసవిలో ఈ చెట్టుకు ఎక్కువ ఉత్తరాలు వస్తాయిట.
128 సంవత్సరాల క్రితం ఓ జంట ప్రేమకథే ఈ నమ్మకం ఏర్పడటానికి కారణమని చెబుతాడు మార్టిన్. 1890లో మిన్నా అనే స్థానిక యువతి అదే ఊరికి చెందిన విల్‌హెల్మ్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే అతన్ని కలవకూడదని, చూడొద్దని అతని తండ్రి హెచ్చరించాడు. దాంతో ఆ ప్రేమికులిద్దరూ రహస్యంగా లేఖల ద్వారా సంభాషించుకునేవారు. వీరిద్దరూ నేరుగా కలుసుకోకుండా ఆ చెట్టు తొర్ర ద్వారా సమాచారాన్ని చేరవేసుకునేవారు. అలా ఓ సంవత్సరం గడిచాక ఆ యువతి తండ్రి వారి పెళ్లికి అంగీకరించాడు. ఆ ప్రేమకథ జర్మనీ అంతా తెలియడంతో.. ఆ చెట్టుకి ప్రేమలేఖలు రావడం మొదలైంది. రోజురోజుకీ ఉత్తరాల సంఖ్య పెరగడంతో డచ్ పోస్ట్ సంస్థ ఆ చెట్టుకు ప్రత్యేకంగా పోస్టల్ కోడ్, పోస్టుమ్యాన్‌ను ఏర్పాటుచేసింది.
*

వారం వారం గోచారం -- (12-8-2018 నుంచి 18-8-2018 వరకు)

$
0
0

12-8-2018 నుంచి 18-8-2018 వరకు:
=========================

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం వృత్తి ఉద్యోగాదులకు సంబంధించిన ఆలోచనలు అధికం. కొంత నిరాశ ఉంటుంది. సామాజిక గౌరవంపై దృష్టి సారిస్తారు. సోమవారం వ్యతిరేకతలు అధికవౌతాయి. పోటీలు, ఒత్తిడులు అధికవౌతాయి. గుర్తింపు కోసం ప్రయత్నం. రుణ రోగాదులపై దృష్టి. మంగళవారం ఆహార విహారాల్లో అనుకూలత లోపిస్తుంది. శ్రమతో కార్యక్రమాలుంటాయి. గృహ వాహనాదుల్లో సమస్యలుంటాయి. బుధవారం అన్ని రంగాల్లో వ్యతిరేకతలు తప్పవు. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గురువారం సామాజిక కార్యక్రమాల వల్ల గౌరవం పెంచుకునే ప్రయత్నం. భాగస్వామ్యానుబంధాల్లో తొందరపాటు కూడదు. శుక్రవారం సౌకర్యాల విషయంలో ఒత్తిడులు తప్పకపోవచ్చు. సౌఖ్యలోపం. ప్రయాణాదుల్లో జాగ్రత్త.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆదివారం ఆధ్యాత్మిక యాత్రలలో కొంత అపశ్రుతులు. సౌకర్యాలు ఇబ్బంది పెట్టే సూచనలు. ఆహార విహారాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. సోమవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. గృహ వాహనాదుల్లో అనుకూలత. విహార యాత్రలకు అవకాశం. సంతోషం. మంగళవారం అధికారుల సహకారం లభిస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. దగ్గర ప్రయాణాదులుంటాయి. బుధవారం ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. సృజనాత్మకత. ప్రణాళికలుంటాయి. గురువారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తి ప్రతిష్ఠల ద్వారా సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. అసంతృప్తి. శుక్రవారం ప్రయాణాదుల్లో జాగ్రత్తగా మెలగాలి. సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి. ఇతరులకు సహకారం అందించాలి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆదివారం సంప్రదింపుల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలు. సోదర వర్గంతో ఒత్తిడులు. కొంత నిరాశ. అనుకోని నష్టాలుంటాయి. శ్రమతో కార్యసాధన. సోమవారం సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. ప్రయాణాలలో అనుకూలత. సహకారం. మంగళవారం కుటుంబ, ఆర్థికాంశాల్లో ఒత్తిడులుంటాయి. తొందరపాటు మాటల వల్ల సౌఖ్యలోపాలుంటాయి. బుధవారం ఆహార విహారాలపై దృష్టి. శ్రమతో కార్యక్రమాలు. గృహ వాహనాది వ్యవహారాలలో సాఫల్యం. గురువారం ఆలోచనల్లో ఒత్తిడులు. అనుకోని సమస్యల వల్ల మనస్సు తొందరపడుతుంది. ప్రమాదాలు జరుగకుండా చూసుకోవాలి. శుక్రవారం కుటుంబ ఆర్థికాంశాల్లో నిర్ణయ లోపాలు. మాటల్లో జాగ్రత్త వహించాలి. అపోహలకు అవకాశం ఉంటుంది. జాగ్రత్త.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆదివారం భాగస్వామ్యాల వల్ల కుటుంబంలో కలతలు. ఆర్థిక నిర్ణయాలు కలవరపెడతాయి. పరిచయాలలో మాటతీరు ఇబ్బంది పెట్టే అవకాశం. సోమవారం సంప్రదింపుల వల్ల శ్రేయస్సు కలుగుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం. మాట విలువ పెరుగుతుంది. మంగళవారం నిర్ణయాదుల్లో ఒత్తిడులుంటాయి. తొందరపాటు కూడదు. సహకార లోపాలకు అవకాశం. శారీరక శ్రమ, బుధవారం సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదరవర్గ అనుకూలత. గురువారం భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. అనవసర పరిచయాల వల్ల సౌఖ్య లోపాలకు అవకాశం. శుక్రవారం నిర్ణయాదుల్లో లోపాల. కాలం ధనం శ్రమ వృథా అయ్యే అవకాశం. అన్ని పనుల్లోనూ అత్యాశ కలుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆదివారం వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు ఒత్తిడుల వల్ల నిర్ణయాదుల్లో ఇబ్బందులు. ఆత్మవిశ్వాసం స్థానంలో మొండితనం పెరిగే అవకాశం. అప్రమత్తంగా మెలగాలి. సోమవారం కుటుంబ సంబంధాల వల్ల సంతోషం. సంతృప్తి. ఆర్థిక నిర్వహణ సంతోషాన్నిస్తుంది. అనేక బాధ్యతలుంటాయి. మంగళవారం టాక్స్‌ల పేమెంట్‌లకు అవకాశం. అధికారిక వ్యవహారాల కోసం ఖర్చులు. ఆర్థిక సమస్యలు. బుధవారం మాటల్లో అనుకూలత. కుటుంబ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొత్తదనం ఉంటుంది. గురువారం పోటీలు, ఒత్తిడులు చికాకులుంటాయి. గెలుపు సాధించినా సంతృప్తి ఉండదు. సంప్రదింపులుంటాయి. శుక్రవారం ధనం, కాలం వ్యర్థమయ్యే సూచనలు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆదివారం మానసికమైన ఒత్తిడులు అధికం. ఖర్చులు పెట్టుబడుల్లో లోపాలకు అవకాశం. సంతానవర్గ వ్యవహారాలు చర్చిస్తారు. ప్రయాణాదుల్లో జాగ్రత్త వహించాలి. సోమవారం సంతోషంగా గడుపుతారు. అనేక నిర్ణయాదులుంటాయి. విందులు, వినోదాలు, విలాసాల కోసం ఖర్చులు. మంగళవారం లాభాలపై దృష్టి. అధికారులు, ప్రభుత్వ సంబంధాంశాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. బాధ్యతలధికం. బుధవారం అనేక బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని నిర్ణయాలకు అనుకూలం. గురువారం ఆలోచనల్లో తొందరపాటు కూడదు. మాటల వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం. అనవసర వాగ్దానాలు. శుక్రవారం శ్రమ రహిత ప్రయోజనాలపై దృష్టి. అన్ని పనుల్లో లాభాపేక్ష ఉంటుంది.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆదివారం సౌకర్య లోపాలకు అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. లాభాలున్నా ఉపయోగం ఉండకపోవచ్చు. ప్రయోజనాలు ఇబ్బంది పెట్టే సూచన. నిరాశ. సోమవారం విందులు వినోదాల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. కొన్ని మంచి సంతోషకర ప్రయోజనాలుంటాయి. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల కోసం కాలం వ్యర్థం అవుతుంది. గౌరవం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. బుధవారం ప్రయాణాలుంటాయి. పెట్టుబడులు అధికం. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడుపుతారు. గురువారం సౌకర్యాలు శ్రమకు గురిచేసే అవకాశం. ప్రయాణాదుల్లో జాగ్రత్త. శారీరక ఒత్తిడులు పెరిగే సూచనలు. శుక్రవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. అనేక బాధ్యతలు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదివారం సంప్రదింపులలో లోపాల వల్ల వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలు. అధికారులతో జాగ్రత్త. సామాజిక గౌరవం తగ్గే సూచనలు లేదా శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. సోమవారం లాభాలు సంతృప్తినిస్తాయి. అన్ని పనుల్లో అనుకూలత. బాధ్యతలు నిర్వహిస్తారు. గౌరవం పెరుగుతుంది. మంగళవారం లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలున్నా అసంతృప్తి. లాభాలున్నా కావలసినంత ఆనందం ఉండదు. బుధవారం అన్ని పనుల్లో ప్రయోజన దృష్టి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. గురువారం సోదర వర్గ సంప్రదింపుల్లో జాగ్రత్త వహించాలి. ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. తొందరపాటు వద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదివారం కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులుంటాయి. దూర ప్రయాణాదులున్నా జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో అనుకూలత. నైరాశ్య ధోరణి. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఉన్నా గుర్తింపు, గౌరవాదులు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు విస్తరించే అవకాశం. మంగళవారం అన్ని పనుల్లో జాగ్రత్త. అధికారిక వ్యవహారాల్లో లోపాలుంటాయి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సామాజిక హోదా పెంచుకుంటారు. తండ్రి వైపు వర్గం వారి అనుకూలత. గురువారం కుటుంబ ఆర్థికాంశాల్లో తొందరపాటు కూడదు. మాటల్లో తొందర వల్ల లాభాలు కోల్పోవచ్చు. శుక్రవారం అనుకోని ఖర్చులు, ఆటంకాలుంటాయి. కాలం ధనం వృథా అయ్యే సూచనలు. నిర్ణయాదుల్లో జాగ్రత్త.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆదివారం నిర్ణయాదుల్లో ఇబ్బందులు. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ అప్రమత్తం. నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. సోమవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కొన్ని అనుకోని ప్రయోజనాలుంటాయి. అప్రమత్తంగా మెలగాలి. మంగళవారం అధికారుల పరిచయాలుంటాయి. భాగస్వామ్యాల్లో ఒత్తిడులున్నా నూతన కార్యక్రమాల నిర్వహణ. బుధవారం లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత విద్య, ఉద్యోగ వ్యవహారాలకు అనుకూలం. కీర్తి ప్రతిష్టలు విస్తరించే అవకాశం. గురువారం తొందరపాటు నిర్ణయాదులు కూడదు. అధికారిక వ్యవహారాల్లో ప్రవర్తనలో జాగ్రత్త అవసరం. శుక్రవారం భాగస్వామ్య వ్యవహారాల్లో లోపాలకు అవకాశం.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆదివారం వ్యర్థమైన ఖర్చులుంటాయి. భాగస్వామ్యాల్లో తలనొప్పులు తప్పకపోవచ్చు. పరిచయాల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం. ప్రయాణాల్లో జాగ్రత్త. సోమవారం అన్ని పనుల్లో కొంత జాగ్రత్త అవసరం. సంతోషంగా ఉంటూనే ఏదో ఇబ్బంది. భాగస్వామితో అప్రమత్తం. మంగళవారం వ్యతిరేక ప్రభావాలు ఇబ్బంది పెడతాయి. ఊహించని ప్రయోజనాలపై దృష్టి. అనుకోని సంఘటనలు. బుధవారం నిర్ణయాదులు వాయిదా వేసుకోవడం మంచిది. సమస్యలను అధిగమించాలి. వ్యాపార నష్టాలుంటాయి. గురువారం ప్రయాణాదులకు అవకాశం. విశ్రాంతి లోపాలుంటాయి. ఆధ్యాత్మిక వాతావరణమున్నా అశాంతి. శుక్రవారం పోటీలు ఒత్తిడులు చికాకులను అధిగమించాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గుర్తింపు లభించినా జాగ్రత్త.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదివారం లాభాలున్నా ఆశించిన సంతృప్తి ఉండదు. పోటీలకు దూరంగా మెలగాలి. వ్యాపార వ్యవహారాల్లో నష్టాలకు అవకాశం. వ్యతిరేకతలను శ్రమతో అధిగమించాలి. సోమవారం భాగస్వామ్యాల్లో ఆకర్షణల వల్ల సమస్యలు. పరిచయాలు శ్రమకు గురి చేస్తాయి. అప్రమత్తంగా మెలగాలి. మంగళవారం నిర్ణయాదులకు రూపకల్పన. మానసిక వత్తిడులు తప్పకపోవచ్చు. సంతానవర్గ వ్యవహారాల్లో ఇబ్బందులు. బుధవారం పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సంతృప్తి. గురువారం లాభాలపై దృష్టి సారించడం వల్ల అనుకోని ఇబ్బందులు. అన్ని పనుల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. శుక్రవారం ఆలోచనల్లో ఇబ్బందులుంటాయి. నిర్ణయాదులను సమీక్షించుకోవాలి. దురాశ కూడదు. శ్రమాధిక్యం.
*

రామాయణం--92

$
0
0

మీకో ప్రశ్న:
========
సీత తల్లి పేరేమిటి?

మంత్రితో కలిసి భరతుడు ఆ మాటలన్నీ శ్రద్ధగా విని వృక్షం దగ్గరికి వెళ్లి రాముడి పడకని చూసి తల్లులందరితో చెప్పాడు.
‘మహాత్ముడైన రాముడు ఆ రాత్రి ఇక్కడ నేల మీద పడుకున్నాడు. అతను పడుకోగా నలిగిన పక్క ఇది. గొప్ప భాగ్యమైన కులంలో పుట్టినవాడు, గొప్ప భాగ్యం కలవాడు, దశరథుడి కొడుకైన, బుద్ధిమంతుడు రాముడు నేల మీద పడుకోడానికి తగడు. మృగచర్మాలు, మంచి దుప్పట్లు కప్పిన పక్క మీద పడుకోడానికి అలవాటు పడ్డ పురుష శ్రేష్ఠుడైన రాముడు నేల మీద ఎలా పడుకున్నాడో? శత్రు భయంకరుడైన రాముడు ఎల్లప్పుడూ విమానాల్లో, ఇళ్ల పైభాగాల్లో, అతి శ్రేష్ఠమైన ప్రాసాదాల్లో నివసించేవాడు. అవి అక్కడక్కడా ఉంచిన వివిధ రంగుల పువ్వులు, చందనం, అగరు సుగంధాలతో నిండి ఉండేవి. బంగారు గోడలతో కట్టబడి, మేరు పర్వతంలా ఉన్న ఆ ప్రాసాదాల్లో నివసించేప్పుడు రాముడ్ని గీతాలు, వాద్యాలతోను, ధ్వనులతోను, మధురమైన మృదంగ శబ్దాలతోను మంచిగా అలంకరించుకున్న పరిచారికలు మేలుకొలుపు పాడేవారు. చాలామంది వందిమాగధులు కథలు పాడుతూ స్తోత్రం చేస్తూ ఆయా కాలాల్లో వచ్చి రాముడికి నమస్కరించేవారు. లోకంలో ఇది నమ్మేలా లేదు! ఇది నిజమని నాకు అనిపించడంలేదు. నా మనసు మోహం చెందుతూ, ఇదంతా కలా అనిపిస్తోంది. ఇది నిజం. చూసే వారికి ఆనందాన్ని కలిగించేది, జనకుడి కూతురు, దశరథుడి ఇష్టమైన కోడలైన సీత కూడా నేల మీద పడుకుంది కదా! ఇది నా అన్నగారి పడక. ఆయన పొర్లిన చోటిది. కఠినమైన నేల మీద పరిచిన ఈ గడ్డంతా అవయవాల రాపిడితో నలిగిపోయింది. ఇక్కడ తగులుకుని ఉన్న పట్టుదారాలు మెరుస్తున్నాయి. అందువల్ల అప్పుడు సీత ఉత్తరీయం ఈ ప్రదేశంలో తగులుకుందని తెలుస్తోంది. చిన్నది, దీనురాలు, సుకుమారి, పతివ్రతైన సీత ఇలాంటి పరిస్థితుల్లో కూడా దుఃఖంగా లేదు. అంటే, ఆమెకి భర్త ఉన్న పడకే సుఖమైందని అనుకుంటున్నాను. అయ్యో! ఎంత కష్టం వచ్చింది. నేను చాలా క్రూరుడ్ని ఎందుకంటే నా మూలంగా భార్యతో కలిసి రాముడు అనాథలా ఇలాంటి పక్క మీద పడుకోవాల్సి వచ్చింది.
‘చక్రవర్తి వంశంలో పుట్టి ప్రజలందరితో ఆదరించబడేవాడు. వారికి ఇష్టుడు. సుఖాలకి తగినవాడు, చూసేవారికి ఆనందాన్ని కలిగించేవాడు, దుఃఖాలకి తగనివాడైన రాముడు రాజ్యాన్ని, అత్యుత్తమమైన సుఖాన్ని కూడా విడిచి నేల మీద ఎలా పడుకున్నాడో? మహా భాగ్యవంతుడు, ఉత్తమ లక్షణాలు కలవాడైన లక్ష్మణుడు చాలా ధన్యుడు. ఎందుకంటే ఇలాంటి కష్ట సమయంలో సోదరుడైన రాముడి వెంట వెళ్లాడు. భర్త వెంట అడవికి వెళ్లిన సీత కృతార్థురాలు. మహాత్ముడైన రాముడికి దూరమైన హీనులైన మనందరం అసహాయ స్థితిలో ఉన్నాం. దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. రాముడు అడవికి వెళ్లిపోయాడు. అందువల్ల ఈ రాజ్యం నాకు చుక్కాని పట్టుకునే వాడు లేని ఓడలా కనిపిస్తోంది. రాముడు అరణ్యంలో ఉన్నా అతని పరాక్రమం ఈ భూమిని రక్షిస్తూనే ఉంటుంది. అందువల్ల దీన్ని ఆక్రమించాలని ఎవరూ మనసులో కూడా అనుకోలేరు. ఇప్పుడు మన అయోధ్యలో ప్రాకారాలకి రక్షణ లేదు. గుర్రాలు, ఏనుగులు యుద్ధ సన్నద్ధంగా లేవు. పట్టణ ద్వారాలన్నీ తెరచి రక్షణ లేకుండా ఉన్నాయి. సైనికులంతా విచారంగా ఉన్నారు. కష్టాల్లోని ఈ నగరం శూన్యమై, బయట కూడా రక్షణ లేకుండా ఉన్నా శత్రువులు విషంతో చేసిన పిండి వంటల గురించి ఎలా తలచుకోరో అలాగే ఈ నగరాన్ని గురించి మనసులో కూడా తలచుకోరు. నేను ఈ రోజు నించి జటలని, నార చీరలని ధరించి, పళ్లు, దుంపలు తింటూ, నేల మీద లేదా గడ్డి మీద పడుకుంటాను. రాముడు చేసిన వనవాస ప్రతిజ్ఞని ఆ రాముడికి బదులు నేను చేస్తూ మిగిలిన కాలం అడవిలో సుఖంగా నివసిస్తాను. అందువల్ల రాముడి ప్రతిజ్ఞ కూడా అసత్యం కాదు. సోదరుడైన రాముడికి బదులు అరణ్యాల్లో నివసించబోయే నాతో కలిసి శతృఘు్నడు ఉంటాడు. పూజ్యుడైన రాముడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యని పాలిస్తాడు. బ్రాహ్మణులు అయోధ్యలో రాముడికి రాజ్యాభిషేకం చేస్తారు. నా ఈ కోరికని దేవతలు సఫలం చేస్తారా? నేను స్వయంగా తల వంచి నమస్కరిస్తూ అనేక విధాల బతిమాలినా రాముడు ఒప్పుకోకపోతే నేను కూడా అడవుల్లో తిరిగే రాముడితో కలిసి అక్కడే నివసిస్తాను. రాముడు నన్ను కాదనలేడు.’
సీత పడుకున్న పక్క మీది ఆమె చెవి నించి రాలిన ఓ దిద్దుని భరతుడు చూశాడు. (అయోధ్య కాండ 88వ సర్గ)
భరతుడు ఆ రాత్రి ఆ గంగా తీరంలోనే విడిది చేశాడు. మర్నాడు ఉదయమే లేచి సుమంత్రుడు శతృఘు్నడితో చెప్పాడు.
‘శతృఘూ్న! లే. ఎందుకు ఇంకా పడుకునే ఉన్నావు? లే. నీకు క్షేమమగు గాక! బోయరాజైన గుహుడ్ని త్వరగా తీసుకుని రా. అతను సేనని నది దాటిస్తాడు.’
‘పూజ్యుడైన రాముడ్ని గురించి ఆలోచిస్తూ నేను మెలకువగానే ఉన్నాను. నిద్ర పోవడం లేదు’ శతృఘు్నడు బదులు చెప్పాడు.
భరత శతృఘు్నలు ఇలా ఒకరితో మరొకరు మాట్లాడుకుంటూండగా గుహుడు వచ్చి భరతుడ్ని అడిగాడు.
‘్భరతా! నదీ తీరంలో రాత్రి నీ నివాసం సుఖంగా ఉంది కదా? సైన్యంతో కలిసి నీకు ఎలాంటి బాధలూ కలగలేదు కదా?’
రాముడి ఆధీనంలో ఉన్న భరతుడు, గుహుడి స్నేహపూర్వక మాటలు విని చెప్పాడు.
‘రాజా! రాత్రి మాకు సుఖంగా గడిచింది. నువ్వు మాకు అనేక విధాలుగా సేవ చేసావు. ఇప్పుడు ఓడల మీద మమ్మల్ని గంగానదిని దాటించమని నీ సేవకులని ఆజ్ఞాపించు’
బాగా తొందరపడే భరతుడి ఆజ్ఞని విని గుహుడు నగరాని తిరిగి వెళ్లి తన బంధుజనంతో చెప్పాడు.
‘మేలుకోండి. లేవండి. మీ అందరికీ క్షేమమగు గాక! ఓడల్ని లాక్కుని రండి. సైన్యాన్ని గంగ దాటిద్దాం’
గుహుడి మాటలు విన్న వాళ్లు వెంటనే నాలుగు మూలల నించి ఐదు వందల ఓడలని తెచ్చారు. స్వస్తికాలు అనే పేరుగల మరి కొన్ని ఓడలని కూడా తెచ్చారు. వాటికి పెద్ద పెద్ద గంటలు కట్టి ఉన్నాయి. గాలికి అనుకూలంగా నడిచే ఆ ఓడలు చిన్న జెండాలతో మెరుస్తున్నాయి. వాటి తాళ్లు దృఢంగా ఉన్నాయి. గుహుడు స్వయంగా తెల్లటి కంబళ్లు కప్పిన మంగళకరమైన శబ్దం చేసే స్వస్తికం అనే ఓడని తెచ్చాడు. ముందుగా వశిష్ఠుడు, పూజ్యులైన బ్రాహ్మణులు ఆ ఓడని ఎక్కారు. భరత శతృఘు్నలు, కౌసల్య, సుమిత్ర, ఇతర రాజస్ర్తిలు ఓడని ఎక్కిన తర్వాత రాజభార్యలు, బళ్లు, అంగళ్లు ఎక్కాయి. కొందరు తాము విడిది చేసిన స్థానాలని కాల్చేస్తూంటే, కొందరు రేవులో దిగుతున్నారు. కొందరు ఓడలో చేర్చడానికి వస్తువులని తెస్తున్నారు. వీరంతా చేసే శబ్దాలు స్వర్గం దాకా వ్యాపించాయి. జెండాలతో అలంకరించిన ఆ నావలని పల్లెవారు స్వయంగా నడుపుతున్నారు. అవి జనాన్ని మోసుకుని అతి వేగంగా ప్రయాణించాయి. వాటిలో కొన్ని గుర్రాలకే ప్రత్యేకించబడ్డాయి. కొన్నిటి మీద రథం మొదలైన వాహనాలు, బళ్లని లాగే ఎడ్లు, చాలా ధనం ఎక్కించారు. ఆ ఓడలు అవతలి ఒడ్డుకి చేరి జనాలని దింపి తిరిగి వచ్చాయి. కొందరు పల్లెవారు నీటి మీద ఆ నావలతో రకరకాల చిత్రాలని చిత్రించారు. మావటి వారు ప్రేరేపించగా జెండాలు కట్టబడి, ఈదుతూ నది దాటే ఏనుగులు జెండాలున్న పర్వతాల్లా కనిపించాయి. కొందరు నావల మీద, కొందరు తెప్పల మీద ఎక్కారు. పల్లె వారు స్వయంగా దాటించగా ఆ సేన పవిత్రమైన గంగానదిని దాటి మైత్రముహూర్తంలో శ్రేష్ఠమైన ప్రయాగవనాన్ని చేరింది. పూజ్యుడైన భరతుడు మంచి మాటలతో సేనకి విశ్రాంతినిచ్చి, అది సుఖంగా ఉండేలా చూసి, ఋషుల్లో శ్రేష్ఠుడైన భరద్వాజుడ్ని చూడటానికి ఋత్విక్కులని వెంట తీసుకుని వెళ్లాడు.
దేవ పురోహితుడు, మహాత్ముడైన ఆ భరద్వాజాశ్రమాన్ని సమీపించిన భరతుడు అందమైన పర్ణశాలలు, వృక్ష సముదాయాలు గల ఆ బ్రాహ్మణోత్తముడి సుందరమైన వనాన్ని చూశాడు.
(అయోధ్యకాండ 89వ సర్గ)
ఆనాటి హరికథ చెప్పాక హరిదాసు ఓ సారి రామాయణంలోని తను చెప్పిన కాండలని తిరగేసి చెప్పాడు.
‘అరె! నేను ఇందాక చెప్పిన దాంట్లో 7 తప్పులు చెప్పాను. క్షంతవ్యుణ్ణి అవి చెప్తాను. వినండి.’
మీరా తప్పులని కనుక్కోగలరా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
----------------------------------------
ఇంగుదీ వృక్షాన్ని తెలుగులో ఏమంటారు? గార చెట్టు

1.హరిదాసు 86, 87 సర్గలు చెప్పాడు. కాని తప్పుగా తను 85, 86 సర్గలు చెప్తున్నానని చెప్పాడు.
2.గుహుడు భరతుడికి చెప్పిన వాటిలో ముఖ్యమైన దీన్ని హరిదాసు చెప్పలేదు. ‘మర్నాడు సూర్యోదయం తర్వాత వాళ్లిద్దరూ ఈ గంగానదీ తీరంలో జటలు కట్టించుకున్నారు.’
3.‘ఓ స్నేహితుడా! మేము సదా ఇతరులకి ఇవ్వాలి కాని, ఇతరుల నించి తీసుకోకూడదు’ అని రాముడు ప్రేమపూర్వకంగా గుహుడితో అన్న మాటలని హరిదాసు చెప్పలేదు.
4.రాముడు పడుకున్నది ఇంగుదీ వృక్షం కింద. హరిదాసు దాని పేరు చెప్పలేదు.

మాత్రలకు లొంగనిధి మలబద్ధకం

$
0
0

ప్రశ్న: మలబద్ధతతో బాధపడ్తున్నాను. నా వయసు 70 ఏళ్లు. ప్రతిరోజూ విరేచనానికి వేసుకోవాల్సి వస్తోంది. విరేచనం అయితేనే ప్రాణానికి సుఖంగా ఉంటుంది. నా సమస్యకు పరిష్కారం ఉన్నదా?
-లక్ష్మణయ్య కావూరు (గన్నవరం)

జ: అయ్యవారికి ఈ రోజు పెద్ద విరేచనం అయింది అనగానే ఊరంతా సంబరం చేసుకుంటారు. జంధ్యాలగారి సినిమాలో ఒక హాస్య సన్నివేశం ఇది. ఇంట్లో వయో వృద్ధులున్నప్పుడు ఇది తరచూ ఎదురయ్యే సన్నివేశమే!
వయోధర్మం వలన పేగులు బలహీనపడినప్పుడు వాటి కదలిక మందగిస్తుంది. దాంతో కాల విరేచనం అవదు. ఉదయానే్న విరేచనం కాకపోతే మనసు అతలాకుతలం అవుతుంది. అది అయ్యేదాకా అదే ధ్యాసగా ఉంటారు. కనిపించిన వారందరితోనూ తన విరేచనం కాని తనం గురించి చెప్పుకుంటూ బాధపడ్తుంటారు. వయసులో ఉన్నవారిక్కూడా ఈ పరిస్థితి రావచ్చు.
మలం సాఫీగా కాకుండా బంధించబడటం వలన దీన్ని మలబద్ధత అంటారు. జన వ్యవహారంలో మలబద్ధకం అయ్యింది.
సాఫీగా అవ్వాలంటే మలం మృదువుగా అవ్వాలి. మృదువిరేచనం సుఖాన్నిస్తుంది. నీళ్లుగా విరేచనాలయితే నీరసమే తప్ప విరేచనం అయిన సుఖం కలగదు. అందుకని సుఖ విరేచనం కావాలని వయో వృద్ధులు కోరుకుంటారు.
విరేచనం అయ్యేలా చేసే గుణం ఉన్నవి, విరేచనం మృదువుగా అయ్యేలా చేసేవీ (డఆ్య్య ఒ్యచిఆళశళూఒ), పలుచగా అయ్యేలా చేసేవి (్ఘన్ఘఆజ్పళఒ), తీక్షణంగా విరేచనాలు అయ్యేలా చేసేవి (ఔఖూఘఆజ్పళఒ) ఇలా వివిధ స్థాయిల్లో ఉంటాయి.
వ్యక్తుల శరీర తత్త్వాలను బట్టి తీక్షణ విరేచనకారులు కూడా కొందరికి మృదు విరేచనాన్ని మాత్రమే కలిగించగలుగుతాయి. అందుకని పేగుల తత్వాన్నిబట్టి మనుషుల్ని మృదుకోష్టం, మధ్యమ కోష్టం, క్రూరకోష్టం కలిగిన వాళ్లు అని మూడు రకాలుగా విభజించారు. క్రూర కోష్టం కలిగిన వాళ్లకు సామాన్య విరేచన ద్రవ్యాలు సరిపోకపోవచ్చు. డబ్బాడు మందు మింగినా కడుపు కదల్లేదనే మాట వినిపిస్తుంటుంది వీరి దగ్గర నుండి.
ఒక విరేచనం మాత్ర మనుషులందరి మీదా ఒకేలా పనిచేయదు. వారివారి పేగుల తత్వాన్నిబట్టి, కోష్ఠం తీరునిబట్టి విరేచనం అవుతుంది. ఒక విరేచనం మాత్ర ఒకరికి మృదు విరేచనం కలిగిస్తే ఇంకొకరికి ఎక్కువ విరేచనం అయ్యేలా చేయవచ్చు. అందుకనే మలబద్ధతకు విరేచనం మాత్రలు వాడటం ఎంత మాత్రమూ పరిష్కారం కాదని దీన్నిబట్టి గమనించాలి.
విరేచనం మాత్ర మొదటిసారి వేసుకోబోయే ముందే ఆలోచించాలి. రోజూ విరేచనానికి వేసుకుంటేనే విరేచనం అయ్యే పరిస్థితిని తెచ్చుకోకూడదు. ఎప్పటికప్పుడు ఇంతకన్నా పెద్ద మందు వ్రాసిమ్మని డాక్టర్లను అడిగే పరిస్థితి తెచ్చుకోకూడదు.
విరేచనాల మందుల మీద ఆధారపడితే పేగులు స్వతహాగా పనిచేసే స్థితిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకని విరేచనాల మాత్రలకు అలవాటు పడటాన్ని తప్పించుకో గలగటం అవసరం.
విరేచనం మృదువుగా అవ్వాలి. దానికదే సాఫీగా అయిపోవాలి. ముక్కవలసి రావటం, గట్టిగా ప్రయత్నం మీద విరేచనం అవటం ఇవి వృద్ధాప్యంలో హాని కలిగించే అంశాలౌతాయి.
వ్యక్తి శరీర తత్వాన్నిబట్టి, రోగి పరిస్థితిని బట్టి విరేచనాల మాత్రలు రాసిస్తారు డాక్టర్లు. ఆపరేషన్లు అయినప్పుడు, హెర్నియా లాంటి పరిస్థితుల్ని సరిచేసినప్పుడు, మొలలు, లూఠీలూ బాధ పెడ్తున్నప్పుడూ, గుండె జబ్బులూ, ఊపిరితిత్తుల్లో జబ్బులు ఇలాంటివి ఉన్నప్పుడు మృదు విరేచనకారులైన ఔషధాలను వాడవలసి వస్తుంది. అది కూడా తాత్కాలికంగా ఆ పరిస్థితులు నెమ్మదించేవరకే!
నిత్య వ్యవహారంగా కాల విరేచనం కావటానికి విరేచనాల మందులను వాడుకోవాలని ప్రయత్నించటం తమకు తాము చేసుకునే అపకారం అవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? విరేచనాన్ని మృదువుపరిచే స్వభావం ఉన్న ఆహార పదార్థాలను తెలుసుకుని వాటిని వాడటం, విరేచనాన్ని బంధించే స్వభావం ఉన్న వాటిని మానేయటం అనేవి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాలు.
ఏ ఆహారం విరేచనం ఫ్రీగా అవటానికి సహకరించదో అది చెత్తతిండి అని భావించటం మొదటి విషయం. విరేచనం కావటం అనేది జీర్ణకోశ వ్యవస్థ బలసంపన్నత మీద ఆధారపడి ఉంటుంది. మలబద్ధత ఏర్పడిన వారిలో జీర్ణశక్తి మందగించటం, తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవటం, గ్యాసు, ఎసిడిటీ, కీళ్లనొప్పులు, ఇతర వాత వ్యాధులు ఇవన్నీ అనుబంధంగా ఉండటాన్ని గమనించవచ్చు. ఇవి మలబద్ధత వలన కలుగుతున్నాయనుకుంటాం. జీర్ణకోశం బలహీనపడటమే వీటన్నింటికీ కారణం.
తేలికగా అరిగే ఆహార పదార్థాలను తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాసు ఎసిడిటీ తగ్గుతాయి. విరేచనం సాఫీగా అవుతుంది. గ్యాసుని తెచ్చేవన్నీ మలబద్ధతనీ కలిగిస్తాయి. అందుకని ఆహార ప్రణాళికను మార్పు చేసుకోవటం అవసరం.
ఎక్కువ కూర - తక్కువ అన్నం తినేవారికి జీర్ణాశయ వ్యవస్థ బలంగా ఉంటుంది. కూరల్లో కలిపి వండే చింతపండు, వెల్లుల్లి, మసాలాలు, శనగపిండి వగైరా ద్రవ్యాలు విరేచనాన్ని బంధిస్తాయి. వీటిని పస్రిమితం చేస్తే కూరని ఎక్కువగా అన్నం తక్కువగా తినటం సాధ్యమవుతుంది. ఇప్పుడు మీ వాటా కింద మీరు తింటున్న కూరని కనీసం రెండు రెట్లకు పెంచి, అన్నాన్ని సగానికి తగ్గించి తినండి. విరేచనం సాఫీగా అవుతుంది.

ఆ నలుగురు -- డా. చెళ్లపిళ్ల సూర్యలక్ష్మి

$
0
0

* సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ....

నల్లత్రాచులాంటి పొడవాటి వాలుజడ వేసుకుని, నగిషీ చెక్కిన టేకు నిలువుటద్దంలోకి ఒకటికి రెండుసార్లు చూసుకుంది శోభ. లేత మట్టిరంగు బెంగాలీ తాంత్ కాటన్ చీర సరిగ్గానే కట్టుకున్నా, మరోసారి ఒళ్ళు, నడుము కనపడలేదు కదా అని మళ్ళీ చూసుకుంది. జీవితంలో మొట్టమొదటి ఉద్యోగంలో మొదటి రోజంటే అంతే కదా! తను పట్టించుకోపోయినా, అద్దం ఎప్పుడూ నిజమే చెబుతుంది. పసిమి ఛాయ, తీర్చిదిద్దిన రూపురేఖలు ఆమె సొంతం. ఆడవాళ్ళు ఆమెను చూసినా, ఆమె అందం చూసి మైమరచిపోవాల్సిందే!
కారు తీయకుండా ఆటోలో ప్రభుత్వాఫీసుకి వెళ్ళింది. ‘‘రండి.. రండి శోభగారూ.. ఆల్ ది బెస్ట్ టు యూ’’ అని పలకరించాడు ప్రసాద్.
అతను తన ఆఫీసులో సూపర్నెంట్. ఆ పలకరింపుకి ఆశ్చర్యపోయింది శోభ. తన మనోభావాలని బయటపడనీయకుండా థాంక్స్ చెప్పి, తన సీట్ వద్దకు వెళ్ళి కూర్చుంది. టైపు చెయ్యాల్సిన ఉత్తరాలేవో అక్కడ పెట్టి ఉన్నాయి. వాటిని తీసుకుని టైపు చేసి, ప్రింటు తీసి, సరిచూసుకుని ప్రసాద్‌కి పంపించింది. కొంతసేపటికి ప్రసాద్ వచ్చి ‘‘అరే! మీరు ఒక్క తప్పు కూడా లేకుండా టైపు చేసేశారే! కంగ్రాట్స్..’’ అంటూ కరచాలనం కోసం చేయి చాచాడు. శోభ చూసిన తీక్షణమైన చూపుకి ఇది పురాణ కాలమైతే అతను బూడిదైపోయుండేవాడు. కానీ ఇది కలికాలం. అందుకే చేయి వెనక్కు తీసినా చూపులు వెకిలిగా ఉన్నాయి. ఇంతలో ప్యూనువచ్చి ‘‘అమ్మా! మిమ్మల్ని ఆఫీసర్‌గారు రమ్మంటున్నారు’’ అనడంతో ఊపిరి పీల్చుకుని వెంటనే లేచి అటు వెళ్ళింది. తలుపుతట్టి లోపలికి వెళ్ళడంతోనే కార్తీక్ లేచి నిలుచున్నాడు. ఇది ఆమెకు మరొక షాక్. చేతులు జోడించి ‘‘నమస్తే మేడమ్.. రండి కూర్చోండి’’ అని ఆమె కూర్చున్నాక తను కూర్చున్నాడు. ఆమెకు కొబ్బరినీళ్ళు, తనకి కాఫీ చెప్పి ‘‘నా మొదటి పోస్టింగ్ వసంత్ సార్ కింద అయ్యింది మేడమ్. మీకు తెలియనది కాదు. నేను బాచిలర్‌గా ఉన్నప్పుడు ఇంటి తిండికి దూరవౌతానని, రోజూ రుచికరమైన భోజనం పెట్టిన అన్నపూర్ణ మీరు. నాకు పెళ్ళయ్యి ఊరు వచ్చినప్పుడు తిన్నగా మీ ఇంటికే వచ్చాం. మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు’’ అని వౌనం వహించాడు. ఆమె కూడా వౌనం పాటించింది. కొద్దిసేపట్లో ఆవిరి వస్తున్న కాఫీ కప్పు, తియ్యటి కొబ్బరి నీళ్లున్న గ్లాసు టేబుల్ మీదకు వచ్చాయి. అవి సేవిస్తుండగా ‘‘మీరు హాయిగా ఉద్యోగం చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేనున్నానని మరిచిపోకండి’’ అని ముగించాడు. ‘‘్థంక్ యూ సార్’’ అని చేతులు జోడించి లేచింది శోభ. ‘‘నో.. మేడమ్. ఐయామ్ కార్తీక్. వసంత్ సార్ జూనియర్’’ అని అతనూ లేచి చేతులు జోడించాడు. సీట్‌కి వచ్చి, ఆమె మనసుని కుదుటపరుచుకోవడానికి ప్రయత్నించింది. అప్రయత్నంగా ఆ ఆలోచనలు ఆమెను గతంలోకి తీసుకెళ్ళాయి.
***
శోభ ఇంటర్ చదువుతూండగా స్నేహితురాలు జలజ పెళ్ళిలో చలాకీగా పనులు చేస్తూ కనిపించిన ఆమెను పెళ్ళికొడుకు స్నేహితులు వసంత్ చూసి ఇష్టపడి మనసు పారేసుకున్నాడు. వాళ్ళ పెద్దవాళ్ళతో శోభ తల్లిదండ్రులతో మాట్లాడించాడు కూడా. అతను ప్రభుత్వంలో కట్టడాల ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మంచి పేరున్న కుటుంబానికి చెందినవాడు. కోరి వచ్చిన సంబంధాన్ని కాలదన్నకూడదని శోభని ఒప్పించి ఆర్భాటంగా పెళ్ళి చేశారు ఆమె పెద్దలు. మగపెళ్ళి వాళ్ళు ఇచ్చిన రిసెప్షన్‌లో వసంత్ ఆఫీసులో పనిచేసే ప్రసాద్ మొదలైనవాళ్ళు వచ్చిన పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరికీ సరిగ్గా మర్యాదలు జరిగేటట్టు చూసుకున్నారు. అప్పుడప్పుడు ఏవో ఆఫీసు పనుల నిమిత్తం ఇంటికి వస్తే తనని తలెతె్తైనా చూడకుండా ‘నమస్కారం.. మేడమ్’ అనో, ‘నమస్కారం అమ్మగారూ’ అనో పిలిచేవారు. ఎండను పడి వచ్చిన వారికి మజ్జిగిస్తే ఆమెను అన్నపూర్ణాదేవితో పోల్చేవారు. శోభ తండ్రి మోతుబరి రైతు. అయినా బాగా చదువుకున్నవాడు. మంచివాడు. తన గుమ్మంలోకి పేదవాళ్ళొచ్చినా, గొప్పవాళ్ళొచ్చినా ఆకలి, దాహం తీర్చడం లాంటి కనీసపు మర్యాదలు చేయడమనేది వాళ్ళింట్లో ఆనవాయితీగా పెట్టాడు. అదే ఆమె కొనసాగించింది. ప్రసాద్ వంటి వాళ్ళు తనను పొగిడితే, ఆఫీసు రాజకీయాల గురించి అవగాహన లేని ఆమె పాపం ఇంతకు ముందున్న ఆఫీసర్ల భార్యలు కనీసపు మర్యాదలేని వాళ్ళు కాబోలుననుకునేది.
చదువుకి దూరమైనందుకు ఆమె బాధపడకుండా, వసంత్ ఆమె చేత ప్రైవేటుగా బీఏ కట్టించాడు. తనకి చాలా ఇష్టమైన కంప్యూటర్ కొని, ఆమెకు దాని వాడకం గురించి చెప్పి అమెరికాలో ఉన్న తన అక్కతో యాహూ మెసెంజర్‌లో ఛాట్ చేయడం నేర్పించాడు. త్వరలోనే వదినా మరదళ్ళు ఖాళీ ఉన్నప్పుడల్లా ఛాట్ చేసుకునేవారు. కంప్యూటర్ ఒక వ్యసనం లాంటిది. యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసి తన వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటి అప్లికేషన్లు వాడడం నేర్చుకుంది. ఇంట్లో జమ ఖర్చులు ఎక్సెల్‌లో వ్రాయడం మొదలుపెట్టింది.
కొన్నాళ్ళకి ప్రభుత్వం వారు రెండు కొండలు కలిపేందుకు ఒక వంతెన తలపెట్టారు. నిజాయితీపరుడని వసంత్‌ని నిర్మాణ స్థలానికి బదిలీ చేశారు. కొత్తగా నియమింపబడ్డ కుర్ర ఇంజనీర్ కార్తీక్‌ని వసంత్ కింద తర్ఫీదు పొందడానికి అక్కడికి ప్రభుత్వం వారు పంపారు. అది మారుమూల ప్రదేశం అవడం వల్ల స్థానికులు ఆఫీసర్లతో దూరం పాటించడం వల్ల కార్తీక్ అప్పటికి బ్రహ్మచారి అవడం వల్ల ఖాళీ సమయం వాళ్ళిద్దరితోనే గడిపేవాడు. పెద్ద మనసుండే దంపతులు గనుక వాళ్ళు అతన్ని చేయి కాల్చుకోవద్దని సలహా ఇచ్చి, వాళ్ళతో పాటే భోజనాదులు చేయమన్నారు.
త్వరలో దంపతులకి పదోన్నతి వచ్చింది. వాళ్ళబ్బాయికి శశాంక్ అని పేరు పెట్టే సంబరాన్ని ఘనంగా జరుపుకున్నారు. అప్పుడు కార్తీక్, ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
తను శశాంక్‌తో తిరిగివచ్చే సమయానికి కార్తీక్‌కి అపురూపతో పెళ్ళయ్యింది. నలుగురూ కలిసిమెలిసి పనులు చేసుకునేవారు.
సంతోషంగా సాగిపోయే వాళ్ళ జీవితాల మీద ఎవరి దుష్ట దృష్టి పడిందో ఏమో వసంత్ అర్ధాంతరంగా మరణించాడు. కార్తీక్‌తో కలిసి వంతెన పనిని తనిఖీ చేస్తూండగా, సిమెంట్ సరిగ్గా సెట్ అవని ఒకచోట కాలుమోపి, ఆ సిమెంట్ విరిగిపోతే అతను కాలుజారి లోయలో పడిపోయాడు. ఇదంతా కార్తీక్ కళ్ళ ముందరే రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. తనని ఓదార్చే శక్తి ఎవరికీ లేకపోయింది. మొదట పుట్టింటికి వెళ్ళింది. పెద్దవాళ్ళు పెళ్ళి ప్రసక్తి తెచ్చేసరికి అలిగి శశాంక్‌తో సహా అత్తింటికి వెళ్ళిపోయింది తను. ఈ కష్టకాలంలో కార్తీక్, అపురూప తనతో రోజూ మాట్లాడుతూ ఉండేవారు.
ఓ ఏడాదికి కార్తీక్‌కి వాళ్ళుండే ఊరు బదిలీ అయ్యింది. ఆమె ఎప్పుడూ వసంత్ ఆలోచనల్లోనే ఉండడం వల్ల మానసికంగా కృంగిపోవచ్చనే భయంతో అతను ఆమెకు ఒక సలహా ఇచ్చాడు. వాళ్ళ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఖాళీగా ఉందని, కారుణ్య నియామకం ద్వారా తను దానికి దరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పాడు. తను ఒప్పుకోలేదు. ఇదివరలో ఇది వసంత్ పనిచేసిన ఆఫీసనీ, సహోద్యోగులందరూ తనకి తెలిసినవారని, పైగా ఆ ఆఫీసు తన అధీనంలోనే ఉంటుంది గనుక భయపడాల్సింది లేదని చెప్పి అతనే అత్తమామల్ని ఒప్పించాడు. వాళ్ళు కోడలు మేలుకోరే వాళ్ళు గనుక వాళ్ళు ఆమెను ఒప్పించారు. శశాంక్ ఇప్పుడు ప్లే స్కూల్‌కి వెళ్తున్నాడు గనుక వాడికి తాతయ్య, నాన్నమ్మల దగ్గర చేరిక ఉంది గనుక వాడి పెంపకానికి లోటేమీ రాబోదని ఆమెతో వాళ్ళు చెప్పారు. ఇంటికి వచ్చిన తరువాత తను అంత సమయాన్నీ పిల్లాడితో గడపొచ్చని చెప్పి ఉద్యోగం చేయమని ప్రోత్సహించారు.
ఒక్కసారి కూడా ఆఫీసుకి వెళ్ళనక్కర లేకుండా కార్తీక్ ఇంటికి వచ్చి తీసుకోవలసిన సంతకాలు తీసుకునేవాడు, చేయవలసిన ధృవీకరణలు సంబంధిత అధికారులని ఇంటికి తెచ్చి చేయించాడు. ఒకరోజు మరో ఆఫీసులో కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష జరిగింది. తనకి ఉండే పరిజ్ఞానానికి సరిపడే స్థాయి పరీక్ష కానేకాదు. చాలా సుళువుగా ఉత్తీర్ణురాలయ్యి, తన భర్త ఒకప్పడు అధికారిగా పనిచేసిన ఆఫీసులో చిన్న ఉద్యోగంలో చేరింది.
***
‘‘అమ్మగారూ.. రెండు రోజుల్లో హెడ్ ఆఫీసు నుండి పెద్ద దొరగారు వస్తున్నారంట. అందుకని బుక్‌లెట్ తయారుచేయాలంట. సూపర్నెంటుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు’’ అని ప్యూన్ మహేష్ అన్న మాటలకి వర్తమానంలోకి వచ్చింది శోభ. ‘‘సరే’’ అని నోట్‌బుక్ తీసుకుని బయలుదేరబోతుండగా ‘‘అమ్మగారూ.. ఒక్క సిన్న ఇసయం. అయ్యగారు ఈ ఆఫీసులో ఉన్న కాలంలో మా నాన్న ఇక్కడ ఇదే ఉద్యోగంలో ఉండేవాడు. హఠాత్తుగా గుండెపోటొచ్చి సచ్చిపోతే ఒక పైసా లంచం లేకుండా దగ్గరుండి నాకీ ఉద్యోగం ఇప్పించారు. మా కుటుంబమంతా రెండు పూటలా బోంసేత్తన్నామంటే అది అయ్యగారి సలవే. ఆ మేలు మేమీ జన్మలో మరసిపోలేం అమ్మగారూ’’ అని ముగించాడు మహేష్. ‘‘అయ్యగారు ఆయన డ్యూటీ చేశారంతే’’ అని ప్రసాద్ సీట్ దగ్గరికి వెళ్ళింది.
‘‘శోభగారూ.. ఇదిగో ఈ ఫార్మాట్‌లో బుక్లెట్ తయారుచేయాలి. దానికి సంబంధించిన డేటా ఈ కాగితాల్లో ఉంది’’ అని పని పురమాయించాడు ప్రసాద్. శోభ కాగితాలు తీసుకుని వెళ్ళబోతుంటే ‘‘ ఈ రోజు సాయంత్రంలోగా రెడీ కావాలని ఇంజనీర్‌గారు చెప్పారు’’ అన్నాడు. ఆమె జవాబివ్వకుండా తన సీటు దగ్గరకి వచ్చింది.
ప్రసాద్ ప్రవర్తన ఆమెకు పొద్దుటినుండి వింతగానే ఉంది. ఇదివరలో అంత అణిగి మణిగి అతి మర్యాద చూపించినవాడు తనని పేరు పెట్టి పిలుస్తున్నాడు! పూలమ్మిన చోట కట్టెలమ్మాల్సిన పరిస్థితి వస్తే మనుషుల తీరులో మార్పుంటుందని సరిపెట్టుకోవచ్చు. పైగా ఇప్పుడు అతను తనకి బాస్. తన కింది వాళ్ళని పేరు పెట్టి పిలిస్తే తప్పు లేదనుకోవచ్చు. కానీ అతను తనతో చేయి కలపబోయాడు! దానికి ఏ పేరు పెట్టాలి? ఏం చెప్పి సరిపెట్టుకోవాలి?
ఇలాంటి ఆలోచనలతో సమయం వృథా చేయడం ఎందుకని ముందు పని చూసుకుంది. ఆ ఫార్మాట్‌ని ఇంకా మెరుగుపరిచి, ఐదున్నరకి పని పూర్తిచేసింది. తనిచ్చిన ఫార్మాట్ మార్చినందుకు తప్పులెన్నబోయిన ప్రసాద్, ఆమె చేసిన మార్పుల్లోని సౌలభ్యాన్ని అర్థం చేసుకుని ఏమీ అనలేదు.
హెడ్ ఆఫీసు నుండి వచ్చిన ఆఫీసర్ ఫార్మాట్‌లోని మార్పులను గమనించి, అందరి ఎదురుగుండా ప్రసాద్‌ని మెచ్చుకుని, వెయ్యి రూపాయల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. అన్ని ఆఫీసులలోనూ ఇదే ఫార్మాట్ అమలు చేయిస్తారని కూడా సూచించారు. అంటే శోభ చేసిన మార్పులు తను చేసినట్టుగా గొప్ప కొట్టుకున్నాడన్నమాట! పుండు మీద కారం జల్లినట్లు, మిగతా సహోద్యోగులు ‘‘ ఎంతైనా పోటీ పరీక్షలో ఎంపికైన ఉద్యోగుల స్థాయే వేరు. వీళ్ళ వల్లే మన విధానాలు మెరుగుపడేది’’ అని మెచ్చుకుంటూంటే ఆమె స్పందించలేదు. తన భర్తే లేనప్పుడు ఈ పొగడ్తలు తనకి అవసరం లేదనుకుంది.
***
ఒకరోజు ప్రసాద్ ఆఫీసు సమయం గడవడానికి పావు గంట ఉందనగా గంటసేపు పట్టే టైపింగ్ పని అప్పచెప్పాడు. ‘‘రేపు పొద్దున్న త్వరగా వచ్చి పూర్తిచేస్తానండీ’’ అని ఆమె అంటే, ‘‘ ఇది అర్జెంటు. ఇప్పుడే కావాలి’’ అని పట్టుబట్టాడు. మిగతా సహోద్యోగులు అంతా ఇంటికి వెళ్ళిపోతుంటే, తను మాత్రం ఆ సమాచారాన్ని హెడ్ ఆఫీసుకి అందించడానికి ఉండిపోయాడు. ప్రసాద్ టీ పట్టుకు రమ్మంటే ‘‘ ఆఫీసు తరువాత పనిచేసినందుకు నాకు ఓవర్ టైం ఇవ్వరు కదయ్యా! అందుకని టీ కావలిస్తే మీరే వెళ్ళి తాగి రండి. మీరెప్పుడెళ్తే అప్పుడు ఆఫీసుకి తాళం పెట్టుకుని ఇంటికి పోతా’’ అని జవాబిచ్చాడు మహేష్. ‘‘ఇదివరకు తాళం చెవులు మాకిచ్చి ఇంటికి పోయేవాడు ఇప్పుడు రూల్సు మాట్లాడుతున్నాడు’’ అని గొణుక్కున్నాడు ప్రసాద్. ఆమెకు గండం గడిచింది.
ఆమె గమనించినదేమంటే.. కార్తీక్ బ్యాంకుకి వెళ్ళినప్పుడే ప్రసాద్‌కి ఈ అర్జెంటు పనులు పడుతున్నాయి. కానీ మహేష్ పుణ్యమా అని ఎలాగో నెగ్గుకు వస్తోంది. పోనీ ఉద్యోగం మానేస్తేనో? నో.. తనంత పిరికిది కాదు. లేకపోతే ఈ విషయం కార్తీక్‌తో చెప్పేస్తేనో? తను ధైర్యంగా ఎదుర్కోగలిగినంత వరకూ ఎందుకు అతణ్ణి శ్రమ పెట్టడం, అనుకుంది.
***
కొన్నాళ్ళకి ఆఫీసులో మరో కారుణ్య నియామకం జరిగింది. ఓ ఇరవయ్యేళ్ళ యువకుడు గుమస్తాగా చేరాడు. అతని పేరు గోవింద్. వాళ్ళ నాన్నగారు పోయి ఏడేళ్ళయ్యిందట పాపం! కారుణ్య నియామకానికి వయస్సు వచ్చాక మూడు లక్షల రూపాయలు ఖర్చు పెడితేగాని ఉద్యోగం దొరకలేదట! వాళ్ళమ్మగారి కుటుంబ పింఛనుకి కూడా లంచం ఇవ్వాల్సి వచ్చిందట!
శోభ మళ్ళీ ఆలోచనలో పడింది. తను కుటుంబ పింఛను కోసం గాని, కారుణ్య నియామకం కోసం గాని కష్టపడలేదు. దానిక్కారణం తనకు ఒక ఉన్నతోద్యోగి మద్దతుండడమే! అందరికీ ఇలాగే జరుగుతుందని ఎంత భ్రమ పడింది!
***
ఒకరోజు యుక్త వయసులో ఉన్న ఒక అమ్మాయి ప్రసాద్ కోసం వచ్చినట్టు శోభ గమనించింది. ఆమె వాలకం చూస్తే పేద పిల్ల అని తెలుస్తోంది. ఆ రోజున అతను సెలవు పెట్టాడు. ప్రసాద్ తనకన్నా తక్కువ స్థాయిలో ఉండే ఆడవాళ్ళని చూసే విధానం తెలుసు గనుక ఆ అమ్మాయిని తన సీటు దగ్గరకు తీసుకెళ్ళి విషయం కనుక్కుంది. వచ్చిన అమ్మాయి పేరు నిర్మల. మర్యాదగా పలకరించిన శోభతో తన గోడు చెప్పుకుంది. విధవరాలైన ఆమె తల్లి ఆ ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసి, మూడేళ్ళ క్రితం పోయిందట. నియామకపు పరీక్ష కూడా పాస్ అయ్యిందట. అయినా దానికి కావలసిన ఆమ్యామ్యా ఇవ్వలేకపోవడం వల్ల ఆమె నియామకపు ఫైలు కదల్లేదట. పోనీ.. వేరే ఆధారం లేని కూతురిగా కుటుంబ పింఛనిమ్మని కోరిత కారుణ్య నియామకం ఎలాగూ జరుగుతుంది కదా అని ప్రసాద్ మాట దాటేశాడట. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఈ మధ్యనే అతను ఆమెకు ఒక ప్రత్యామ్నాయం సూచించాడట. గోవాకి తనతో మూడు రోజులు వెళ్తే తన నియామకం జరిగేటట్టు చూస్తానన్నాడట. ‘‘అమ్మా! మా అమ్మకి ఒంట్లో బాగా లేనప్పుడు చేసిన అప్పులు తీర్చడానికి ఆవిడ డబ్బులు సరిపోయాయి. మా అమ్మ తోటి పనిచేసినా, ననే్నదే చదివించి గొప్పదాన్ని చేద్దామనుకుంది. ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదవడం కూడా మాబోటోళ్ళకి స్తోమతుకి మించిన పనే కదమ్మా! నా చదువు కోసం చేసిన అప్పులు అలాగే ఉన్నాయి. నేను చదువు ఆపేసినా వాటిని తీర్చలేను. అందరికీ చులకనైపోయాను. దాని బదులు ఈయనకి తలొగ్గి ఉద్యోగం సంపాయించుకుంటే అప్పులైనా తీరుతాయి గదా! నేను మళ్ళీ రేపు వస్తానమ్మా!’’ అని కళ్ళు తుడుచుకుంటూ లేవబోయింది. ఈ నియామకాలలో జాప్యాన్ని సమీక్షించిన హెడ్ ఆఫీసు వాళ్ళు కారణాలడిగారన్న విషయం శోభకి తెలుసు. బలవంతులు నిస్సహాయులని ఇలా కూడా దోపిడీ చేయజూస్తారా అని షాక్ అయ్యిందామె. ఇటువంటివి సినిమాల్లో చూపిస్తే ఎక్కడో జరుగుతాయనుకుంది. తన కళ్ళెదురుగా జరుగుతుంటే ఊరికే ఉండలేకపోయింది.
తనకి సాయం చేసిన కార్తీక్, మహేష్‌లు తన భర్తకి ఋణపడి ఉన్నారన్న భావనతో చేశారు. బహుశః ఆ ఋణమే లేకపోతే తను ఈ కారుణ్య నియామకానికి దరఖాస్తు పెట్టేదా? తన తల్లిదండ్రులు, అత్తమామలు గొప్పింటివారు కాకపోతే తనకి ఈ నియామకమే జీవనాధారమయ్యేది కదా! అప్పుడు పెద్ద మనుషుల సహాయం లేనప్పుడు ప్రభుత్వపు సదుద్దేశాలను దుర్వినియోగపరచే ప్రసాద్ లాంటి దుర్మార్గుల పాలపడవలసిందే కదా! లేదు, ఇలా జరగడానికి వీల్లేదు! న్యాయం కోసం తను ఇప్పుడైనా పోరాడకపోతే తను దుర్మార్గులను పరోక్షంగా సమర్థించినట్టవుతుంది కదా!
వెళ్ళబోతున్న నిర్మలని ఆపి, కార్తీక్ దగ్గరకి తీసుకువెళ్ళి విషయం బయట పెట్టించింది. స్వతహాగా మంచివాడైన కార్తీక్ వెంటనే నిర్మల నియామకం కావించి, ప్రసాద్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాడు. ప్రాథమిక దర్యాప్తులో అతను శోభతో ప్రవర్తించిన తీరు బయటపడింది. ఆ విషయం విశాఖ మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆంతరంగిక ఫిర్యాదుల కమిటీ పరిశీలించింది. అభ్యుదయ భావాలున్న శోభ అత్తమామలు ఆమె నిర్ణయాన్ని సమర్థించారు. మహేష్, నిర్మలల సాక్ష్యాల వల్ల ప్రసాద్‌ని ఉద్యోగం నుండి తొలగించాలని కమిటీ సిఫారసు చేసింది.
ప్రసాద్‌పై రెండో అభియోగం లంచగొండితనం. నిర్మల సాక్ష్యం ఒక్కటే దీన్ని నిరూపించగలదా, అన్న అనుమానం వ్యక్తమైన తరుణంలో గోవింద్ ముందుకొచ్చాడు. లంచం పుచ్చుకోవడం ఎంత పెద్ద నేరమో, ఇవ్వడం కూడా అంతే! ఇప్పుడు ప్రభుత్వోద్యోగి కనుక అతను క్రమశిక్షణా చర్యలకి అర్హుడవుతాడు. ఎంతో కష్టపడి ఇన్నాళ్ళకి సంపాదించుకున్న ఉద్యోగం పుటుక్కుమని ఊడిపోతుంది. అందువలన శోభ అతణ్ణి వారించబోయింది. అప్పుడతను ‘‘మేడమ్! నాలాంటి వాళ్ళని ఎందరినో దుర్మార్గుల బారి నుండి రక్షించడానికి కంకణం కట్టుకున్నారు మీరు. నా స్వార్థం కోసం ఈ మహత్తర కార్యానికి దూరంగా ఉండలేను’’ అని జవాబిచ్చాడు. ఇంక చెప్పేదేముంది? రెండో అభియోగం కూడా నిరూపించబడింది.
ప్రసాద్ ఉద్యోగం ఊడింది. గోవింద్ ప్రసాద్ పీడింపుకి గురై, గత్యంతరం లేక లంచమిచ్చాడని, అతనిప్పుడు అవినీతిని బయటపెట్టడంలో సహకరించాడు కనుక అతణ్ణి క్షమించడమైందని పై అధికారులు నిర్ణయించారు.
ఆ ఆఫీసులో ఏళ్ళ తరబడి వేళ్ళు విస్తరించిన అవినీతిని ఆ నలుగురు కారుణ్య నియామక ఉద్యోగస్థులు ఆపగలిగారు!


‘స్వరాజ్య’మే సర్వస్వం

$
0
0

స్వాతంత్య్ర పోరాటం రోజుల్లో దేశభక్తి పతాక స్థాయిలో ప్రబలిపోతున్న తరుణంలో జాతీయోద్యమ నేతలు అనేక మంది తమ ఉద్యమానికి పత్రికలను ఆయుధాలుగా చేసుకున్నారు. ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమం వైపు నడిపించడానికి, వారిని చైతన్యవంతులను చేయడానికి ఈ పత్రికల మద్దతును ధారాళంగా ఉపయోగించుకున్నారు. మహాత్మాగాంధీ ‘ఇండియన్ ఒపీనియన్ ఇన్ సౌత్ ఆఫ్రికా’, సి.ఆర్.దాస్, మోతీలాల్ నెహ్రూ, బిపిన్ చంద్రపాల్ లాంటి జాతీయ నాయకులు హేమాహేమీలందరూ పత్రికలను నడిపారు. అయితే ఎవరి పంథా వారిది. అదే విధంగా 1920లలో మద్రాస్‌లో ‘ది హిందూ’ ‘మద్రాస్ మెయిల్’, అనిబిసెంట్ ‘న్యూ ఇండియా’ మరియు ‘జస్టిస్’ ఇలా ప్రధాన పేపర్లు ప్రచారంలో ఉండేవి. అయితే ఏ ఒక్క పత్రికా, ప్రభుత్వ అరాచకాలను కావలసిన స్థాయిలో ప్రచురించకపోయేవి. విప్లవ, విమర్శ అంశాలను ప్రజలకు చేరవేయడంలోనూ, స్వాతంత్య్ర పోరాటంలోని ముఖ్యమైన సంఘటనలను, ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఉన్నదున్నట్లు ప్రచురించే సాహసం చేసేవి కావని ప్రకాశంగారి కచ్చితాభిప్రాయం. ప్రకాశంగారికి రాజమండ్రి చైర్మన్‌గా ఉండగానే, తన మున్సిపాలిటీలో సుపరిపాలన చేస్తున్నప్పుడే కొన్ని ముఖ్య లక్ష్యాలు తనలో ఉద్భవించాయని చెప్పవచ్చు. అవి - నిరక్షరాస్యత, మూఢ నమ్మకాల నిర్మూలన. ఈ లక్ష్య సాధన కోసమే ఆంధ్రకేసరి ఆజన్మాంతం తన సర్వస్వాన్ని దేశ ప్రగతి కోసం ధారపోశాడు. మద్రాస్‌లో, రెవిన్యూ మంత్రిగా (ప్రీమియర్), ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల అభ్యుదయానికి నిరంతరం కృషి చేస్తూ వచ్చారు. అలాగే నిర్లక్ష్యం, అవినీతి, అశ్రద్ధ ఎవరిలోనైనా, ఎంతటి వారిలోనైనా కనపడ్తే సహించేవారు కాదు. బారిస్టర్‌గా మద్రాస్‌లో అపరిమితంగా సంపాదిస్తున్న రోజులలో ప్రకాశం గారు ‘మద్రాస్ లా టైమ్స్’ జర్నల్ ఒకదానిని కొని తనే ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. ఈ జర్నల్ ద్వారా దేశరక్షణ చట్టాలను, నిబంధనలను తీవ్ర స్థాయిలో విమర్శించేవారు. ప్రధానంగా ఇది న్యాయవాద వృత్తికి సంబంధించినదైనప్పటికి, న్యాయవాద హక్కుల సంరక్షణకూ, న్యాయమూర్తుల అశ్రద్ధ, అక్రమ వైఖరులను సరిదిద్దడానికి ఎంతగానో సహాయపడ్డది. ప్రకాశంగారి ‘లా’ టైమ్స్ (1912-21) న్యాయమూర్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. వారికి సింహస్వప్నంగా నిలిచింది. ముఖ్యంగా ప్రకాశంగారి కేసుల్లో న్యాయమూర్తులు, తమతమ వైఖరిని మార్చుకున్న సందర్భాలు ఎనె్నన్నో ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది అరుదైనది ఒక సంఘటన ఉంది.
ఒకసారి ప్రకాశంగారు ఒకే స్వభావంగల 50 కేసులు వాదించాల్సి వచ్చింది. అప్పుడు జస్టిస్ శివస్వామి అయ్యర్. ఆయన కేసును సరిగా వినకుండానే మొదటిరోజే వ్యతిరేక తీర్పును ఇచ్చారు. సరే ప్రకాశంగారు రెండో కేసు ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టారు. ‘ఒకే స్వభావం కదా మళ్లీ అదే ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నారు’ అని కోపంగా అన్నారు అయ్యర్‌గారు. దానికి ప్రకాశంగారు ‘మిలార్డ్ నేను యాభై మంది దగ్గర ఫీజు తీసుకున్నాను. యాభైసార్లు వాదించవలసిన బాధ్యత నాకు ఉంది’ అన్నారు. అవును మరి ప్రకాశం అంటే ప్రకాశం. ఒకసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినడు. 15 రోజుల తరువాత జడ్జిగారే స్వయంగా ప్రకాశంగారిని పిలిపించుకొని ఆర్గ్యుమెంట్ తిరిగి చెప్పవలసిందిగా కోరి శ్రద్ధగా విని 50 కేసుల్లోనూ అనుకూల తీర్పును ఇచ్చి ‘హమ్మయ్య’ అనుకోవడం జరిగింది. ఈ సంఘటన హైకోర్టు చరిత్రలోనే ఇది వరకెన్నడూ జరగలేదని గొట్టిపాటి బ్రహ్మయ్యగారు ప్రకాశం గురించి రాశారు. అంటే ‘లా టైమ్స్’లో కూడా ప్రకాశంగారి సంపాదకీయం అంత నిర్భీతితో, నిర్మాణాత్మక విమర్శలతో కూడినదనడానికి నిదర్శనం.
గాంధీగారి పిలుపు మేరకు స్వాతంత్య్ర పోరాటంలో దూకడానికిగాను లక్షలు సంపాదించి పెడ్తున్న న్యాయవాద వృత్తి తృణప్రాయంగా విసర్జించిన సంఘటన ఆ రోజులలో చాలా గొప్పదైనదీ, ప్రాధాన్యతతో కూడినదీ కూడాను. ఎందుకంటే ప్రకాశంగారు అతి భీకరంగా, న్యాయవాద వృత్తిలో వీరవిహారం చేస్తూ ఉండడం. పైగా తొలి తెలుగు సింహం కావడం విశేషం. ఈ నిర్ణయాన్ని ప్రకాశంగారు జనవరి 1921లో బీచ్‌లో ఓ పెద్ద బహిరంగసభలో తెలియజేశాడు. ఈ విషయం ప్రకాశానికి సంబంధించినంతవరకూ హాట్ టాపిక్‌గా చెప్పుకున్నారు. హైకోర్టుల్లోనూ బయట కూడాను. కాని ఈ సంచలనాత్మకమైన వార్తను ఏదో ఒక పత్రికలో ఓ మూల చిన్నగా ప్రచురించబడింది. ప్రకాశంగారు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన పత్రికలు కూడా పక్షపాత వైఖరిని, ప్రభుత్వ అనుకూల సాధనంగా, భయభ్రాంతులతో పనిచేయడాన్ని సహించలేక తనే ఒక పత్రికను స్థాపించాలనుకున్నాడు. అంతే వెనువెంటనే అడుగులు పడ్డాయి. ప్రకాశంగారు మిత్రులతో ఈ నిర్ణయాన్ని చెప్పడమేమిటి దేశ విదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్థులు, రాజకీయ దిగ్గజాలు, న్యాయకోవిదులు హర్షించారు. షేర్‌లు కొన్నారు. విరాళాలు ఇచ్చారు. తొలి తరం పాత్రికేయులందరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకాశం స్థాపించిన ‘స్వరాజ్య’ పత్రికలో శిక్షణ పొందినవారే. ఒకరు కలం పడితే ఒకరు ప్రింటింగ్ మిషన్ పట్టారు, పెట్టారు. మరొకరు నిర్వహణలో పాలుపంచుకున్నారు. చిరకాలం నుండి ఆంధ్రుల ఆశయం మద్రాస్‌లో ఒక ఆంగ్ల దినపత్రిక నడపాలని ఉండింది. దానికిగాను మన ప్రకాశం నడుం బిగించారనుకున్నారు మన తెలుగు జాతి. రాజాజీగారు స్వయంగా ‘స్వరాజ్య’ పేరును ప్రతిపాదించారు. అంతేకాకుండా అరవంలో కూడా పత్రిక రావాలని కోరారు. ప్రకాశంగారు తన సొంత డబ్బుతో ఇంగ్లీష్‌లో, తెలుగులో, అరవంలో కూడా నెలకొల్పాడు.
మోతీలాల్ నెహ్రూగారు స్వరాజ్య పత్రిక పనితీరును మెచ్చుకొని ఆజన్మాంతం షేర్లు కూడా కొన్నారు. తరువాత కాలంలో పత్రికా జర్నలిజంలో అఖండ పేరు ప్రఖ్యాతులు గడించిన వారిలో ముఖ్యులు ఖాసా సుబ్బారావు, కృపానిధి, రామకోటేశ్వరరావు, ఆక్స్‌ఫర్డ్ ప్రసిద్ధ సంపాదకులు కె.ఎం.్ఫణికర్ లాంటి వారు సంపాదకీయ డెస్క్‌ను అలంకరించారు. స్వరాజ్య పత్రిక మొదటి నెలలో 5వేల కాపీలు, 2వ నెలలో 8 నుండి 9 వేల కాపీలు అమ్ముడుపోయాయి. ఆ రోజులలో అది ఒక సంచలన మార్కెటింగ్‌గా చెప్పుకున్నారు.
ప్రకాశం ‘స్వరాజ్య’ నడిపిన రోజులలో జర్నలిజంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారు. స్వరాజ్య మన భారతావనిలో పత్రికా నిర్వహణలోనూ, వార్తల ప్రచురణలోనూ ఒక చరిత్ర సృష్టించింది. ఆ రోజులలో ఏ పత్రికైనా నిర్భయంగా వార్తా ప్రచురణ చేసింది అని చెప్తే ఆ మాట అబద్ధమైనా అయి ఉండాలి లేక ఆ పత్రిక కచ్చితంగా ‘స్వరాజ్య’ అయినా అయి ఉండాలి అనే స్థాయికి ఎదిగింది. ‘స్వరాజ్య’లో పనిచేసే సిబ్బంది పట్ల, ఆంధ్రకేసరి ప్రవర్తించే తీరు, వారి అవసరాలను తీర్చేందుకు పడే తపన, చేసే ప్రయత్నం చూసి సిబ్బందిలో ప్రతి ఒక్కరూ ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉండేవారు. ప్రకాశంగారితో కలిసి పని చేయడం ఒక మరపురాని దివ్యానుభూతి అని రాసుకున్నారు రామకోటేశ్వరరావు. ఆయన సహాయ సంపాదకుడుగా పనిచేశారు. రచయితలకు పరిపూర్ణ స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఇచ్చేవారు. ఒకరోజు ఒక పెద్ద మనిషి తనపై వచ్చిన విమర్శలకు కోపగించుకొని ఆ విలేకరిపై కఠిన చర్య తీసుకోమని ప్రకాశంగారిని కోరగా, ప్రకాశంగారు బహిరంగ ప్రకటన చేస్తూ ‘నేను తప్పు దారిన నడిచినప్పుడు నా ‘స్వరాజ్య’ నన్ను కూడా తీవ్రంగా విమర్శించడం జరిగింది’ అన్నారు. ఖాసా గారు ప్రకాశంగారి గురిచి సంతాప సభలో ప్రసంగిస్తూ అంటారు ‘ఇతరులు తమ తప్పులను చూపిస్తూ ఒప్పించడానికి సాహసిస్తే, తనకు నిజం అనిపిస్తే మార్పు చేసుకోవడానికి ప్రకాశంగారు ఆక్షేపించేవారు కాదు’. అర్జునుడికి పాశుపతాస్త్రం ఎలాంటిదో ప్రకాశానికి ‘స్వరాజ్య’ అలాంటిది.
ప్రకాశం గారు ‘స్వరాజ్య’ పత్రిక నిర్వహణ కోసం తను సంపాదించిన యావదాస్తి, స్థిరచరాస్తులు కర్పూర హారతిగా ఖర్చు చేశారు. గాంధీగారిని ప్రకాశంగారిని సన్నిహితులుగా చేసింది స్వరాజ్యనే. వారిద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు తెచ్చిందీ ‘స్వ రాజ్య’నే. గాంధీగారు స్వరాజ్యను మూసివేయమని 1921, 24లోనూ సలహా ఇచ్చారు. కాని ప్రకాశంగారి నిజాయితీ చూడండి. ఆయన ఏమని రాసుకున్నారో తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యమేస్తుంది. ‘నేను చేయగలిగిన యధోచిత సేవ చేస్తూ ఉండేవాడిని.. కాంగ్రెస్ అభివృద్ధికి, దేశ క్షేమానికి పాటుపడేవాణ్ణి. అంతేకాదు మోతీలాల్ నెహ్రూ లాంటి నాయకుణ్ణి కూడా తప్పుదారిన పడ్డారని తోచినప్పుడు చాలా తీవ్రంగా విమర్శించేవాణ్ణి.. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పాలసీకి కట్టుబడి కాంగ్రెస్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ ఉన్న పత్రిక అది ఒక్కటే. గాంధీగారి కార్యక్రమ విజయానికి కూడా ఎంతగానో సేవ చేసింది. ఇటువంటి పత్రికను ఆపివేయాలని అనడానికి కారణం బహుశా ఎవరో స్వార్థపరులు నాపై నా పత్రికపై నిందలు మోపి ఉంటారని విశ్వసించాను.. మూసివేయడం నా ఒక్కడికి చెందిన స్వంత వ్యవహారమైతే నిమిషాల మీద ఆజ్ఞను పాటించేవాడినని వ్యక్తం చేశాను. ఈ పత్రిక ప్రజలచే స్థాపించబడిందని, నేను ప్రజల పట్ల విశ్వాసంతో నడుపుతున్నానని చెప్పాను.’ ఈ మాట స్వరాజ్య అష్టకష్టాలు పడుతున్న రోజులలోనిది. అందుకే ప్రకాశాన్ని ప్రజల మనిషి అన్నారు. తన సర్వస్వాన్ని వదులుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ ప్రజలకు అన్యాయం చేయడానికి కాదు.
తరువాత స్వరాజ్య మూత పడిన తరువాత ప్రకాశంగారు అంటారు. గాంధీగారి సలహా అన్నదమ్ముల ఆత్మీయ సలహా లాంటిది. నా సొంత పూచీపైన బ్యాంకులలో అప్పు తెచ్చి పేపర్‌లో పెట్టవలసిన అవసరం ఉండేది కాదు. సుమారు అయిదారు లక్షలు ఉన్న బ్యాంక్ నిల్వలు, రాజమండ్రి నుంచి నీలగిరుల వరకూ ఉన్న స్థిరాస్తులూ చెక్కుచెదరకుండా ఉండేవి. 1922 తరువాత నేనూ నా కుటుంబీకులు ఇక్కట్ల పాలయ్యేవారమే కాదు. ఇంకా ఇలా రాసుకున్నారు తన స్వీయ చరిత్రలో ‘పెద్ద దేశం యొక్క స్వాతంత్య్రం కోసం జరిగిన శాంతియుత సమరంలో ప్రజల వద్ద నుంచి సంపాదించిన లక్షలు, ఆ ప్రజల స్వాతంత్య్రం కోసం ఆనందంగా ఖర్చు పెట్టగలిగాననే భావన నా మట్టుకు నాకు ఆనందదాయకంగానే ఉంది.’
ఇంతటి కష్టనష్టాలకు ఓర్చి స్వరాజ్య ద్వారా ప్రజలలో చైతన్యాన్ని వెలికితీశారు. దేశభక్తిని నెలకొల్పారు. దేశ సేవాదురంధరులైన అనేక సంపాదకులను దేశానికి అర్పించారు. ‘గ్రామ రిపబ్లిక్’ ‘గ్రామ స్వరాజ్’ ప్రజా పత్రికలను తరువాతి కాలంలో స్థాపించి అప్పటి కాంగ్రెస్ వాదుల దుష్పరిపాలనను, అవినీతిని తూర్పారబట్టారు. ఈ రీతిలో ప్రకాశంగారు సంపాదకీయం అత్యుత్తమ ప్రమాణాలతో సాగింది. అందుకే ‘ప్రజా పత్రిక’ మొదటి రోజునే 10వేల కాపీలు అమ్ముడుపోయాయి. ‘స్వరాజ్య’ మూతపడటానికి ప్రధాన కారణాలు ప్రకాశంగారికి స్వార్థం లేకపోవడం, నిర్వహణలో ఉన్న వారి కుతంత్రాలు, అప్పుల వాళ్ల మోసాలు.
మొత్తం మీద దేశంలోనే ‘స్వరాజ్య’ పత్రిక ఉన్నత ప్రమాణాలు గల పత్రికనీ, లక్ష్యసిద్ధికి ఆదర్శప్రాయంగా కృషి చేసిందని పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. పత్రికా రంగంలో ఇంతటి ప్రతిభ, ప్రమాణాలతో ఏ పత్రికైనా ఉన్నదా? స్థాపింపబడుతుందా అన్న ప్రశ్న అందరి మదిలో రేకెత్తించింది అనడంలో అతిశయోక్తి లేదు.

విశ్వరూపమే లేదు!

$
0
0

బాగోలేదు* విశ్వరూపం-2
*
తారాగణం:
కమల్‌హాసన్, పూజాకుమార్
ఆండ్రియా, శేఖర్ కపూర్
నాజర్ తదితరులు
సంగీతం: జిబ్రాన్
కెమెరా: సాను వర్గీస్
నిర్మాణం: రాజ్ కమల్ ఫిలిమ్స్
నిర్మాతలు: చంద్రహాసన్,
కమల్‌హాసన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
కమల్‌హాసన్
*
జాతీయ నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కమల్‌హాసన్ దాదాపు ఐదేళ్ల గ్యాప్ తరువాత విశ్వరూపం సీక్వెల్‌తో వచ్చాడు. ఆయన తీసిన మొదటి భాగం మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ దాని కంటే కూడా ఎక్కువ సంచలనాలు రేగాయి. ఈ సినిమా విషయంలో పలు వివాదాలు రేగడంతో ఆయన దేశం విడిచి వెళతాననేవరకు వచ్చింది పరిస్థితి. ఆ తరువాత అంతా సద్దుమణిగిందనుకోండి, అది వేరే విషయం. నటుడిగా ఆయన ఏ రేంజ్ ఆర్టిస్ట్ అన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి నటనలో ఐకానిక్‌గా నిలిచిపోయారు. ఆయన తీసిన ఈ చిత్రం టెర్రరిజం నేపథ్యంలో ‘విశ్వరూపం-2’గా రూపొందింది. మరి ఈ రెండో విశ్వరూపంలో కమల్ తన విశ్వరూపాన్ని ఎలా చూపించాడు అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
విశ్వరూపం మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో ఈ కథ అక్కడే మొదలుపెట్టారు. విశ్వనాధ్ అలియాస్ మేజర్ వసీం అహ్మద్ కాశ్మీరీ అనే ఆర్మీ అధికారి (కమల్‌హాసన్) టెర్రరిస్టుల అటాక్ నుండి అమెరికాను రక్షిస్తాడు. ఆయనతోపాటు ఆయన టీమ్ చాకచక్యంగా వ్యవహరించి టెర్రరిస్టులను అంతమొందిస్తుంది. ఆ తరువాత ఇండియా వచ్చిన విశ్వనాథన్ అలియాస్ వసీంని పెళ్లిచేసుకున్నా కూడా సంసార సుఖానికి పనికిరాడని అనుకుంటుంది నిరుపమా (పూజాకుమార్). కానీ ఆమెకు అసలు విషయం తెలియడంతో భర్తను అర్థం చేసుకుని అతనితోపాటు ఇండియా వచ్చేస్తుంది. వీరితోపాటు లేడీ కమాండర్ అష్మిత సుబ్రహ్మణ్యం (ఆండ్రియా) కల్నల్ జగన్నాథ్ (శేఖర్ కపూర్) కూడా వస్తారు. ఈలోగా అమెరికా కంటే ఇండియాలోనే పెద్ద బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నారని.. దాంతో దేశం మొత్తం నాశనం అవుతుందని తెలుసుకున్న వసీం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్లాన్ అంతటికి లీడర్ అయిన ఒమర్ ఖురేషీ (రాహుల్ బోస్)ని అడ్డుకుంటాడు. అయితే రాహుల్ బోస్ ఎవరో కాదు, చిన్నప్పటినుండి తనతోపాటే పెరిగిన వ్యక్తి.. కానీ జిహాదీ మత్తులో వున్న ఆయన అధికారం కోసం ఇదంతా చేస్తుంటాడు. ఒమర్ ఇండియాలోని అధికారులను కూడా లోబరచుకుని ఈ బ్లాస్ట్‌లకు ప్లాన్ చేస్తాడు. దాంతో వసీం వారిని అంతమొందించే ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరి వసీం ఒక్కడే ఈ బాంబ్ బ్లాస్ట్‌ని ఆపగలిగాడా.. అతని ఫ్యామిలీ (తల్లి వహీదా రెహమాన్)ను ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగతా కథ..
ఈ సినిమా మొత్తం వన్‌మాన్ షో అని చెప్పాలి. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ మొత్తం కమల్‌హాసనే. నటుడిగానే కాదు నిర్మాత, దర్శకుడు కావడంతో సినిమాని మొత్తం తన భుజాలపై నడిపించాడు. కమల్‌హాసన్ నటన గురించి ఈ రోజు కొత్తగా మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే ఆయన నటనలో పిహెచ్‌డి చేసిన వ్యక్తి.. ఇక దర్శకుడిగా కాస్త తక్కువ మార్కులే వేయాల్సి వస్తుంది ఈ సినిమా విషయంలో.. నిజానికి ఈ సినిమా ఐదేళ్ల క్రితం తీసింది. మొదటి భాగానికి, ఈ సీక్వెల్ విషయంలో సరైన కథను కథనాన్ని నడిపించలేకపోయారు. ఆయన ఈ వయసులో కూడా ఇంత ఎనర్జిటిక్‌గా ఉండటం ప్రతి ఒక్కరికీ షాక్ అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో కమల్ తన నటనతో మెప్పించాడు. ఇక పూజ కుమార్ భార్యగా బాగానే నటించింది. అయితే కమల్ సినిమాలో ఊహించే రొమాన్స్.. గ్లామర్ ఈ సినిమాలో బాగా తగ్గింది. పూజాకుమార్‌ను గ్లామర్ విషయంలో ఎక్కడా వాడుకోలేదు. భార్యాభర్తల మధ్య ఒక రొమాంటిక్ సీన్ అండ్ సాంగ్ కాస్త రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇక ఆండ్రియా సోల్జర్‌గా తన పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించింది. శేఖర్‌కపూర్ సెటిల్డ్ నటన కనబరిచాడు. రాహుల్ బోస్ చక్కటి విలనిజాన్ని పండించి మార్కులు కొట్టేశాడు. మిగతా నటీనటులు వారి వారి పాత్రల్లో బాగానే చేశారు.
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టెక్నికల్ అంశాల గురించి చెప్పాలంటే.. దర్శకుడిగా కమల్ రాసుకున్న కథ.. మొదటి భాగానికే చక్కగా కుదిరింది. రెండో భాగంలో అసలు విషయం మిస్ అయింది. అనవసరమైన ఫ్లాష్ బ్యాక్‌లు.. కథ మధ్య మధ్యలో ఏవేవో సన్నివేశాలు రావడం.. కథ డిస్ట్రబ్ అవ్వడం ప్రేక్షకుడిని కాస్త కన్‌ఫ్యూజ్‌కి గురిచేస్తాయి. ఇలాంటి కథ సాగాలంటే పర్‌ఫెక్ట్ స్క్రీన్‌ప్లే అవసరం. అది ఇందులో లేదు. అనవసర సన్నివేశాలు టెన్షన్ పెడతాయి. కమల్ దర్శకుడిగా విఫలం అయ్యాడని చెప్పాలి. ఇక జిబ్రాన్ అందించిన సంగీతం, రీరికార్డింగ్ ఫర్వాలేదు. ‘ఆధారంగా.. అనురాగం’ పాట బాగుంది. పైగా ఆ పాటన కమల్ చేత పాడించడం బాగా కుదిరింది. ఇక కెమెరా పనితనం గురించి చెప్పాలంటే టెక్నికల్ సినిమా కాబట్టి ఈ స్థాయిలో మంచి ఫొటోగ్రఫీ కుదిరింది. కొన్ని సన్నివేశాల్లో మ్యాజిక్ కనపడింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. అనవసరమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. కమల్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా..కమల్‌హాసన్ సినిమా అనగానే ఏదో ఊహించి సినిమాకు వెళ్ళే అభిమానులు ఉంటారు.. కానీ ఈ సినిమాలో అలాంటి గొప్ప సన్నివేశాలు, గొప్ప నటన ఏమీ లేదు. ఈ కథ విషయంలో క్లారిటీ మిస్ అయింది. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్నీ సరిగ్గా చెప్పలేకపోయాడు. ఇక స్క్రీన్‌ప్లేనే ఇలాంటి చిత్రాలకు కీ అలాంటిది. ఈ సినిమాకు అదే మిస్ అయింది. హాలీవుడ్ స్థాయిలో తీయాలని ప్లాన్ చేసినప్పటికీ ఆ పర్‌ఫెక్షన్ మిస్ అవ్వడం, అసలు కథ ఎక్కడినుండి ఎక్కడికి వెళుతుందో, అసలు ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. మొదటి విశ్వరూపంలో ఈ సినిమా కొంతైనా బాగుంటే దాని స్థాయి మరోలా ఉండేది.
*

కళ్యాణం..కమనీయం!

$
0
0

బాగుంది*** శ్రీనివాస కళ్యాణం
***
తారాగణం:
నితిన్, రాశీఖన్నా
నందితా శే్వత, పూనమ్‌కౌర్
ప్రకాష్‌రాజ్, సితార, జయసుధ
రాజేంద్రప్రసాద్, ఆమని
సీనియర్ నరేష్, సత్యం రాజేష్
ప్రవీణ్, రచ్చరవి తదితరులు.

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
సంగీతం: మిక్కీ జె. మేయర్
ఎడిటర్: మధు
నిర్మాణం: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
సమర్పణ: శ్రీమతి అనిత
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్-లక్ష్మణ్
రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
సతీష్ వేగేశ్న
***
ఆచారాలు, కట్టుబాట్లు, పెళ్లి తంతు మనం ఇదివరకే చాలా సినిమాల్లో తనివితీరా చూశాం. పెళ్లి అనేది జీవితంలో వచ్చే ఓ మధురమైన జ్ఞాపకం. అందుకే అలాంటి కథలతో వచ్చే చిత్రాలను తిలకించి మనసారా ఆస్వాదించాం, ఆశీర్వదించాం. కుటుంబ నేపథ్యాన్ని ఎంచుకుని ప్రేక్షకుల్ని కదిలించే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ వుంటుందనేది నాడు, నేడూ వెండితెర సాక్షిగా రుజువవుతూనే వుంది. కథల ఎంపికలో నిర్మాత ‘దిల్’ రాజుకు ఓ ప్రత్యేక ముద్ర వుంది. కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తాగల నిర్మాతగా ఆయనకు పేరుంది. ఈ విషయంలో ఆయన శైలియే వేరు. గత సంవత్సరం దర్శకుడు సతీష్ వేగేశ్నతో కలిసి ‘శతమానంభవతి’ అంటూ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టి భారీ విజయంతో పాటు, కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్నాడు. తాజాగా అదే దర్శకుడితో మరోసారి కనువిందైన ప్రయాణం చేసి ప్రేక్షకులకు ఓ అందమైన జ్ఞాపకాన్ని నెమరేసుకునేలా చేశాడు. ఆ జ్ఞాపకమే ‘శ్రీనివాస కళ్యాణం’. గత చిత్రం ‘శతమానంభవతి’లో కుటుంబ బంధాలు, ప్రేమల విలువలు చాటి చెప్పిన దర్శకుడు ఈసారి తెలుగింట సాంప్రదాయాలు, పెళ్లి విలువలు నేటి తరానికి కళ్లకు కట్టేలా పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. పెళ్లి అనేది ఓ ఈవెంట్‌లా మారిపోతున్న ఈ రోజుల్లో, పెళ్లి బంధు మిత్రులతో కలిసి జరుపుకునే ఓ గొప్ప పండుగ.. ఓ చెదిరిపోని అందమైన జ్ఞాపకంగా తీర్చిదిద్దే ప్రయత్నమే ఇది. గత చిత్రంలో పండుగ విశిష్టతను తెలియజేసిన దర్శకుడు, ఈసారి పెళ్లి ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. దానికి కుటుంబ నేపథ్యాన్ని మిళతం చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా అడుగులు వేశాడు. మన సాంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పచ్చటి పందిళ్ళు, నుదుట బాసికాలు, కళ్యాణతిలకాలు, పిండివంటలు, సన్నాయిమేళాలు, అరుంధతి దర్శనం.. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. ఇవన్నీ దర్శకుడు ఈ చిత్రంలో కళకు కట్టే విధంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక పరిశ్రమలోకి హీరోగా అడుగుపెడుతూనే వరుస మాస్ కథలతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశాడు యువ హీరో నితిన్. ‘ఇష్క్’తో తన పంథాను మార్చుకున్నాడు. గత చిత్రం ‘చల్ మోహన్‌రంగా’ ఊహించినంత సంతృప్తిని ఇవ్వలేకపోయినా హీరోగా హ్యాపినే మిగిల్చింది. ఎలాగైనా నితిన్ అంటే ఏమిటో నిరూపించుకునే కసితోనే అడుగులు వేశాడు. ఈ అడుగులకు దర్శకుడు, నిర్మాత తోడయ్యాడు. మరి అతడి లక్ష్యం నెరవేరిందా? వరుసగా విజయాలను అందుకుంటున్న దిల్‌రాజుకు, అంతే ఊపుమీదున్న సతీష్ వేగేశ్నకు ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ ఎలాంటి అనుభూతిని మిగిల్చింది? ఈ ఇద్దరు చేసిన శ్రీనివాసుడి కళ్యాణం కమనీయంగా జరిగిందా? కళ్యాణానికి వచ్చిన అతిథులకు ఎలాంటి విందు భోజనం లభించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
శ్రీనివాస్ (నితిన్) సాంప్రదాయాలు, విలువలు, కట్టుబాట్లకు పెద్దపీట వేసే కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. పెళ్లి సాంప్రదాయాలంటే అతడికి ఎంతో ఇష్టం, గౌరవం. నాయనమ్మ (జయసుధ)కు ఇష్టమొచ్చే రీతిలో నడుచుకోవాలన్న లక్ష్యంతో ఉంటాడు. తన పెళ్లిని నానమ్మకు నచ్చే విధంగా ఒక వేడుకలా జరుపుకోవాలనుకుంటాడు. నాయనమ్మ కూడా తన మనవడి పెళ్లిని గొప్ప ఉత్సవంలా చూడాలనుకుంటుంది. ఉమ్మడి కుటుబంలో పెరగడంవల్ల శ్రీనివాస్‌కు బంధాలు.. అనుబంధాలు.. తెలుగు సాంప్రదాయాలు, పెళ్లి విలువ నానమ్మ ద్వారా తెలుసుకుంటాడు. చిన్నప్పటినుంచి నానమ్మ చెప్పిన మాటలు విని పెరుగుతాడు. చండీఘర్‌లో ఆర్కిటెక్ట్‌గా కాలం గడిపే శ్రీనివాస్‌కు అక్కడి కాఫీ డేలో పనిచేస్తున్న శ్రీ (రాశీఖన్నా) పరిచయమవుతుంది. ఆమె ఆర్‌కె గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన ఆర్కే (ప్రకాష్‌రాజ్) కూతురు. ప్రతి నిమిషాన్నీ డబ్బుతో కొలిచే వ్యక్తి ఆర్కే. వ్యాపారమే పరమావధిగా భావిస్తాడు. సాంప్రదాయాలకన్నా బిజినెస్‌కే ఎక్కువ విలువ ఇస్తాడు. అలాంటి వ్యక్తి కూతురి ప్రేమలో పడతాడు శ్రీనివాస్. అంత గొప్ప బిజినెస్ కూతురు అని అతడికి తెలియదు. సాంప్రదాయాలకు విలువనిచ్చే శ్రీనివాస్ కుటుంబం.. బిజినెస్‌కే ప్రాముఖ్యం ఇచ్చే శ్రీ తండ్రి.. ఇలా వీరిద్దరి మధ్య కూతురి ప్రేమకు విలువ ఇచ్చాడా? కళ్యాణం కమనీయంగా జరిగిందా? ఈ తంతు జరగడానికి ఎలాంటి షరతులు విధించాడు? ప్రేమా.. పెళ్లి లాంటి విషయాలను కూడా బిజినెస్‌లా డీల్ చేసే ఆర్కే, శ్రీనివాస్-శ్రీల పెళ్లికి అంగీకరించాడా? శ్రీను తన నానమ్మ కోరుకున్నట్లుగా వారం రోజులపాటు పెళ్లి వేడుకకు అందర్నీ ఒప్పించగలిగాడా? ఇంతకు ఇది జరగడానికి ఆర్కే, శ్రీనివాస్‌తో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి? చివరకు అది ఎలాంటి దారిని చూపించింది అన్నదే కథ.
ఈ కళ్యాణం సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే జరిగింది. దర్శకుడు మనల్ని ఒక్కసారిగా ఎక్కడికో.. ఎన్నో ఏళ్ల వెనక్కి తీసుకెళ్లాడు. ‘శతమానంభవతి’తో ఇంటిల్లిపాదినీ థియేటర్‌లో కూర్చోబెట్టిన ఆయన, ఈ చిత్రంలో పండగ విశిష్టతను తెలియజేస్తూ ఆకట్టుకున్నాడు. ఆర్కే, శ్రీనివాస్ క్యారెక్టర్లను సమాంతరంగా నడిపిస్తూ వాళ్ల అభిరుచులకు, అభిప్రాయాలకు, పెళ్లికి వాళ్లు ఇచ్చే విలువలకు కథను నడిపిన విధానం భేష్. ఈ విధానంలో దర్శకుడు కొత్తదనం చూపించాడు. ప్రథమార్థంలో హీరో క్యారెక్టర్‌ను చూపిస్తూ సరదా సన్నివేశాలతో హీరోయిన్ ప్రేమను ముడిపెట్టాడు. ద్వితీయార్థం పూర్తిగా పల్లెటూరి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. పెళ్లి ఇంట జరిగే తంతును కళ్లారా వీక్షించేట్టు చేశాడు. ఈ ప్రయాణంలో ఎమోషన్స్‌కు పెద్దపీట వేశాడు. అయితే ఫస్ట్ఫాలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా అనిపించినా సెకెండాఫ్‌లో పెళ్లి పనులు మొదలైన తర్వాత కథనం నెమ్మదించింది. కాస్త బోర్ కొట్టిస్తుంది. పెళ్లింట్లో కామెడీ, ఎమోషన్స్ మరింతగా పండించే వీలున్నా దర్శకుడు దాన్ని సరైన విధంగా ఉపయోగించుకోలేదనిపించింది. అయితే దర్శకుడు రచయితగా మంచి మార్కులే కొట్టేశాడు. పెళ్లి మంత్రాల్లోని అంతరార్థం చెప్పే డైలాగ్స్‌తో పాటు ‘వద్దనుకుంటూ వెళ్లిపోతే అనుబంధాలు.. వదులుకుంటూ వెళ్లిపోతే సాంప్రదాయాలు మిగలవ్’ లాంటి డైలాగ్స్ అలరిస్తాయి. సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ వుంటుంది. దర్శకుడు పెళ్లి నేపథ్యంలో రాసుకున్న కథ ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లిని, ఆ వాతావరణాన్ని ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా చూపిస్తూ, బాంధవ్యాలను, బంధువులమధ్య అనుబంధాలను తెలియజేశాడు. శ్రీనివాస్‌గా నితిన్ తన పెర్‌ఫార్మెన్స్‌తో విశేషంగా ఆకట్టుకున్నాడు. అతడికి ఇలాంటి క్యారెక్టర్ లభించడం అదృష్టమే. హీరోలా కనిపించకుండా క్యారెక్టర్‌లానే ఒదిగిపోయాడు. కుటుంబ బంధాలు సాంప్రదాయాల విలువలు తెలిసిన కుర్రాడిగా బరువైన పాత్రలో మెప్పించాడు. లవర్‌బాయ్ ఇమేజ్ చెడిపోకుండా ఎమోషన్స్‌లోనూ ఇరగదీశాడు. లుక్స్ పరంగా తన గత చిత్రాల్లోకంటే ఇందులో మెరుగుగా ఉన్నాడు. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఎంతో మెచ్యూరిటీ కనిపించింది. శ్రీ పాత్రలో కనిపించిన రాశీఖన్నా లుక్స్‌పరంగా చూడటానికి చక్కగా వుంది. అందం, అభినయంతో ఆకట్టుకుని క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. ఇక శ్రీనివాస్ మరదలు పద్మావతి (నందితా శే్వత)కు చక్కటి క్యారెక్టర్ లభించింది. చిత్రంలో ప్రాధాన్యమున్న పాత్ర ఇది. అల్లరి అమ్మాయిగా ప్రథమార్థంలో అలరించిన నందిత ద్వితీయార్థంలో ఎమోషనల్ సీన్స్‌లో చక్కటి అభినయాన్ని ప్రదర్శించి మంచి మార్కుల్ని కొట్టేసింది. గొప్ప పేరున్న బిజినెస్‌మాన్ ఆర్కేగా ప్రకాష్‌రాజ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఆ పాత్ర ప్రవర్తించే తీరు వినోదాన్ని పంచితే, అందులో పరివర్తన ఈ కథకు ఎమోషన్‌ను జోడించింది. మిలియనీర్‌గా ఈ పాత్రను సునాయాసంగా చేశాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండే. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నితిన్-ప్రకాష్‌రాజ్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో కొంచెం లెంగ్త్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. జయసుధ, రాజేంద్రప్రసాద్, ఆమని, సితార, సీనియర్ నరేష్, సత్యం రాజేష్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, హరితేజ, విద్యుల్లేఖ రామన్, రచ్చరవి.. ఇలా వీళ్లందరివీ సహాయ పాత్రలే అయినప్పటికీ ఎప్పటిలాగానే తమ నటనతో మెప్పించారు. సాంకేతిక విషయానికొస్తే.. మిక్కీ జే మేయర్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. పాటలు వింటుంటే పాత ట్యూనే్ల గుర్తొస్తాయి. ‘కళ్యాణం.. వైభోగం..’ పాట మాత్రం ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఎడిటింగ్, నిర్మాణ విలువలు ఉన్నాయి. సమీర్‌రెడ్డి కెమెరా కొత్త లుక్‌ని కళ్లముందు ఆవిష్కరించి ప్రెష్‌నెస్‌ని తీసుకొచ్చింది. మధు ఎడిటింగ్ ఓకె.
మొత్తంమీద సతీష్ వేగేశ్న రచయితగా, దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు. అయితే ద్వితీయార్థంలో ప్రారంభమయ్యే పెళ్లి పనులు అలాగే చివరి వరకూ సాగి ప్రేక్షకుడికి కాస్త బోర్ ఫీలయ్యేలా చేస్తాయి. అయినప్పటికీ బంధాలు, బంధుత్వాలమధ్య దూరాన్ని చెరిపేస్తూ శ్రీనివాసుడి కళ్యాణాన్ని కమనీయంగానే మలిచాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. మొత్తం మీద ఇది అందరూ చూడతగ్గ కళ్యాణమే!

ఉత్తమ వాగ్గేయకారులు.. ఉర్రూతలూపిన కీర్తనలు

$
0
0

వినీలాకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల సమూహాన్ని ఒక్కోసారి తేరిపార తదేక దృష్టితో చూడాలనిపిస్తుంది. ఆ పక్షికున్న స్వేచ్ఛ నిజంగా మనిషికి లేదనిపిస్తుంది.
మనసుకు ఎక్కడ వాలాలనిపించాలో హాయిగా ఎంతసేపైనా కోయిల కూర్చోగలదు. పాడుకోగలదు. ఆకలేస్తే నాలుగు గింజలెక్కడో ఏరేసుకుంటుంది. మళ్లీ తిరుగుతుంది. ఎగురుతూనే ఉంటుంది. స్వేచ్ఛగా పాడే గానం అలా వుండాలి. సకల చరాచర సృష్టికీ కారణమైన పరమేశ్వరుడి లీలా విశేషాలను పొగుడుతూ మైమరచి పాడేదే పాట. గానం పుట్టిందే దీని కోసం.
ఈ విశాల విశ్వంలోని సోయగాలను తిలకించి పులకించగలవాడు ఒక్క మనిషే! ఏ ప్రాణికైనా భూమి మీద తిరిగే విహంగంలో విహరించే ఏ పక్షైనా పొగడగలుగుతుందా? ఆనందించినట్లు తెలుస్తుందా? ఒక సూర్యోదయమున్నట్లు, మరో సూర్యోదయం ఉండదు. ఒక మొక్క వున్నట్టు మరోటి వుండదు. ఒక చెట్టున్నట్టు మరో వృక్షం కనపడదు. ఒక పక్షి వున్నట్లు కూసినట్లు, మరో పక్షి కూయదు.
ఒక గాయకుడు పాడినట్లు మరో గాయకుడు పాడడు.
పక్షి కాళ్లకు దారం కట్టి మనకు కావలసిన చోట తిరిగే ఏర్పాటు చేయాలనిపిస్తే ఎలా ఉంటుంది? ఓ చిలుకను పంజరంలో పెట్టి చూడండి. దానికది పెద్ద శిక్ష. గుడ్డుదశ, లార్వా, ప్యూపా దశలు దాటితేనే గాని, సీతాకోక చిలుక సప్తవర్ణాలతో దర్శనమివ్వదు.
పాపం ‘పసిగుడ్డు’ కదా’ జాలిపడి అన్ని దశలూ దాటకుండా దాని కాళ్లకు దారం కట్టేసి ఎగరమంటే దానివల్ల అయ్యే పనేనా?
కడుపుతో ఉన్న తల్లి కనక మానుతుందా? లోకంలో ప్రతిదానికీ ఒక ప్రణాళికను దైవం సిద్ధం చేసే ఉంచాడు. ఆయన అనుకున్న ప్రకారమే అన్నీ జరుగుతాయి. మనల్ని సలహా అడిగే అవసరం ఆయనకెప్పుడూ ఉండదు.
అందుకే భగవంతుడికే ఆత్మసమర్పణ చేసుకోగలం.
మరెవ్వరికీ ఆ అర్హత ఉండదు. నటుడు గానో, నాయకుడిగానో, గాయకుడిగానో, శిల్పిగానో తయారవ్వాలన్నా నిర్ణయం ఆయనదే. మనం అనుకున్నా వీలుపడదు.
గురువును చూపించేదీ ఆయనే - సద్గురువుతో సంబంధాన్ని పటిష్టం చేసి పైకి లాగి కీర్తి లభించేలా చేసేదీ పైవాడే. ఆయన సంకల్పించాలి.
మనం చేయగలిగింది మనం చేసేస్తే మిగిలినది భగవంతుడు పూర్తి చేస్తాడనటానికి ఉదాహరణలు కోకొల్లలు. ఏ విద్య లొంగాలన్నా ఉబలాటం, ఉత్సాహం ఒక్కటే సరిపోదు. అర్హతలున్నాయో లేదో ఎవరికి వారు తెలుసుకోవాలి. ‘మాయ’ బాగా కప్పేస్తే మాత్రం తెలియదు. అంతా తెలుసుననుకోవటమే పెద్ద మాయ.
నిర్మొహమాటంగా అటు గురువైనా చెప్పాలి. శిష్యుడైనా అడగాలి. సద్గురువైన వాడు మాయ మాటలు చెప్పడు. చెప్పకూడదు. పట్టుదలతో నేర్చుకోవాలన్న నిజాయితీ శిష్యుడికి విధిగా వుండాలి. గురువును నమ్మిన శిష్యుడిలో దోషాలు సవరించుకొనే నిజాయితీ ఉండాలి. అందుకే గురువును చిల్లగింజ, పరుసవేది భ్రమరాలతో పోల్చాడు త్యాగరాజు. దేవాలయాల్లో అర్చకుడు శటారికి తలవంచి నమస్కరించినట్లుగా శిష్యుడుంటే ఏ విద్య అయినా లొంగి తీరుతుంది.
కొంత తెలియటం, మిగతాదంతా మెరుగులు దిద్దటం సంగీతంలో వుండదు. వీరివల్ల లోకానికి మేలు జరగాలనే ప్రణాళిక దైవానికి ముందు ఏర్పడితే, సద్గురువులకు తగిన శిష్యులు విధిగా లభిస్తారనటానికి మహాపురుషులు ఇంకెందరో యోగులు సంగీత విద్వాంసులే ఉదాహరణ. మాటామంతీ లేక వౌన స్వామిగా పిలువబడే భగవాన్ రమణ మహర్షి చేత మాట్లాడించి వౌన వ్రతం మానిపించిన తపశ్శాలి ‘కావ్యకంఠ గణపతి ముని’.
‘నాయనా’ అని ఆప్యాయంగా భగవాన్ చేత పిలిపించుకున్న వాడాయన. ఒక్కసారి చూడగానే యోగ్యతా లక్షణాలను గుర్తించగలిగిన గురువులుంటారు.
నిజాయితీ గల సద్గురువులైతే అయోగ్యులైన శిష్యుల్ని సాధ్యమైనంత దూరంలోనే ఉంచుతారు. మాయ గురువులు పుట్టి ముంచుతారు.
పుణ్యభూమిగా పిలువబడే మన దేశం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం ఈ సచ్చీలురైన సద్గురువులు, వారికి తగ్గ శిష్యులే.
శుద్ధమైన సంగీత సంప్రదాయం విశ్వవ్యాప్తమవటానికి కారణం కూడా ఈ పటిష్టమైన గురుశిష్య సంబంధ బాంధవ్యాలే - ఏ మాటకా మాటే. కవిత్వమైనా, సంగీతమైనా కడవల కొద్దీ తాగేసేది కాదు. నిలకడగా, నిశ్చలంగా నిర్మలమైన మనస్సుతో వొంటపట్టించుకోవలసినదే.
త్యాగరాజ శిష్య వర్గంలో ఆకుమళ్ల వెంకట సుబ్బయ్యర్ చాలామంది శిష్యుల్ని తయారుచేశాడు. ఆ రోజుల్లో మహావైద్యనాథ అయ్యర్‌తో సమానమైన స్థాయి కలిగినవాడు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్ పట్నం శిష్యుడే. ఇద్దరూ ఇద్దరే.
త్యాగరాజు కీర్తనలు ఎలా వుండేవో తెలియాలంటే ఆ రోజుల్లో ఆధారం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ పాటే ప్రామాణికం అనుకునేవారుట. మనకు స్వతంత్రం రాని రోజుల్లో ప్రభువుల సంస్థానాల్లో వుండే వాద్యబృందాల పాశ్చాత్య సంగీత వరుసల ప్రభావం ఈ విద్వాంసులపై బాగా వుండేదనటానికి ఈ కీర్తన వినే ఉంటారు.
రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ/ రామరాజు రాజేశ్వర॥
అఘ మేఘ మారుత శ్రీకర/ అసురేభ మృగేంద్ర వర జగన్నాథ॥
జమదగ్నిజ గర్వ ఖండన/ జయ రుద్రాది విస్మిత భండన
కమలాప్తాన్వయ మండన/ గణితాద్భుత శౌర్య శ్రీ వేంకటేశ॥
-సంగీత ప్రియులు ఈ కీర్తన వినే వుంటారు. పాశ్చాత్య సంగీత బాణీని పోలి వుండే కీర్తన ‘పట్నం’దే.
త్యాగరాజాది మహనీయులు తర్వాత మూర్తిత్రయం వారి అడుగు జాడల్లో నడిచిన చాలామంది వాగ్గేయకారులు తెలుగు భాషలో బాగా పాండిత్యం సంపాదించి తెలుగులోనే కీర్తనలు రాశారు.
వీరిలో అగ్రగణ్యుడు పట్నం సుబ్రహ్మణ్యం. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలలో పాశ్చాత్య బృందం వినిపించేవన్నీ మూర్తిత్రయం వారి కీర్తనలే.
రెండు క్లారినెట్‌లు, ట్రంపెట్‌లు ఇతర పాశ్చాత్య లయ వాద్యాలతో, ఈ కీర్తనలు మహాపసందుగా వుండేవి. నిజానికి రహదారి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, మైకులు కూడా లేని ఆ రోజుల్లో పెట్రోమాక్సుల వెలుతురులో ఎంతో శోభాయమానంగా జరిగే ఊరేగింపుల్లో కనిపించే వాద్య బృంద సంగీతం కోసం తండోపతండాలుగా జనం పోగై వెళ్లి వినేవారుట. మరోవైపు ‘నువ్వా, నేనా’ అనేలా కొమ్ములు తిరిగిన నాదస్వర మేళం ఒకరితో మరొకరు పోటీ పడుతూ కీర్తనలు వినిపిస్తోంటే, రాత్రి తెల్లవార్లూ జనం విని, ఇళ్లకు వెళ్లేవారు. మీరెవరినైనా అడగండి. మన కంటే దక్షిణాదిలో సంగీతం బాగా వింటారండీ. మనకా సీను లేదు’ అని చిరునవ్వులు ఒలకబోస్తూ గర్వంగా చెప్తూంటారు - మన తెలుగు కీర్తనలు, తెలుగు భాష తెలియకపోయినా వాళ్లు వింటున్నారని తెలిసినా, ఏ ప్రతిస్పందన లేని స్వభావం మనది.
సందర్భం వచ్చిందని మనవి చేసాతను. తమిళనాడులో ఒకప్పుడు ‘తమిళ ఇసై’ ఉద్యమం లేవదీశారు. ఎవరో కాదు ‘్భరతరత్న’ ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఆమె భర్త సదాశివం. అప్పట్లో బాగా జన బాహుళ్యంలో ప్రసిద్ధమైన పత్రికలు. కల్కి కృష్ణమూర్తి రాసే వ్యాసాలు, తమిళ కీర్తనలు, సాహిత్యం బాగా ప్రచారం కావాలనీ, తెలుగులో వున్న త్యాగరాజ కీర్తనల ప్రచారం జోరు తగ్గాలని కూడా వాంఛించారు. అలాగే జరిగింది. మహా విద్వాంసులు చాలామంది ఈ ఉద్యమాన్ని సమర్థించారు కూడా. అందులో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి కూడా ఉంది. సంగీత కచేరీలలో తమిళ కీర్తనలే పాడాలి -అనేది వారి నినాదం.
ఉద్యమం ఊపందుకుంది. పాపనాశం శివన్, ఊత్తుక్కాడు సుబ్బయ్యర్, గోపాలకృష్ణ భారతి, వగైరా వగైరా తమిళ రచనలన్నీ వినిపించటం మొదలైంది. 4 ఏళ్లపాటు మద్రాసు మ్యూజిక్ ఎకాడెమీ సుబ్బులక్ష్మిని పిలవలేదు కూడా. ఆమె కూడా తమిళ కీర్తనలే కచేరీల్లో పాడేది మరి. ఇంత జరిగినా, ఉద్యమాలు చేసినా శరభోజి (2) అనే మహారాష్ట్ర ప్రభువు ఏలుబడిలో వుంటూ, రాజాశ్రయం కోరకుండా, చుట్టూ తమిళం, మరాఠా భాషలు మాట్లాడే ప్రజల మధ్యలో వుండి ‘తెలుగు మాతృభాష’ వదలకుండా వేలాది కీర్తనలు రాసి ‘నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా’ అని నిర్భయంగా ‘దేహి’యనకుండా బతికి, హాయిగా రామాంకితంగా పాడుకున్న త్యాగరాజ కీర్తనల మీద పిచ్చి అభిమానం అక్కడి తమిళ సోదరులకు ఒక్క వీసమెతె్తైనా ఈ రోజుకీ తగ్గలేదు తగ్గదు కూడా.
భాషాభివృద్ధి అంటే తెలుగులో మాట్లాడటం, తెలుగులోనే పోట్లాడుకోవటం, వీధుల్లో కనిపించే బోర్డులన్నీ తెలుగులోనే రాయటం ఒకటేనా? కాదు. ప్రపంచంలో ఏ 10 మంది కవులనైనా తీసుకోండి - వాళ్ల ప్రక్క నిలబడగల తెలుగు కవులున్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే మన కళలు, సంగీతం, మన సాహిత్యం, నృత్యం మరుగున పడిపోకుండా ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటిని మరచిపోయే పరిస్థితి దాపురించకుండా జాగ్రత్త పడటం. నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ వంటి ప్రాచీన కవులు, పోతన భాగవత పద్యాలు, రామాయణ శ్లోకాలు, ఇలా మన తెలుగు ప్రాచీన కవులూ, వారి రచనలూ బీరువాల్లోనే మగ్గిపోకుండా, మన ఎదురుగా మన చెవికి వినిపించేలా చేయటం, అవసరం కాదా? మన పూర్వీకులు మనకందించిన జానపద కళారూపాలు, మరుగున పడిపోకుండా కాపాడుకోవటం కూడా మన భాషా సంస్కృతుల అభివృద్ధిలో ఒక భాగమే.
మనిషికి మాయ కబుర్లు తలకెక్కినంత సుళువుగా మంచి మాటలు ప్రవేశించవు.
ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వారిని ఊళ్లో నుంచి తరిమేయాలనిపిస్తుంది. కాని నిజాన్ని దాయటం అనుకున్నంత తేలిక మాత్రం కాదు. భారత, భాగవత రామాయణాది మహాకావ్యాలే ఇంతకాలం మనల్ని నడిపిస్తూ వచ్చాయన్న సంగతి మనకు తెలిసినట్లుగా, మన భావితరాలకు తెలియద్దా?
మనం అలవాటు చేసుకున్నదే మన సంప్రదాయమైంది. అందుకే ఎనే్నళ్లైనా ఈనాటికీ రామాయణ భారత భాగవతాది పురాణాలు ప్రవచనాలుగా వినిపిస్తోంటే తండోపతండాలుగా జనం కూర్చుని వింటున్నారు. త్యాగరాజ, భద్రాచల రామదాసు కీర్తనలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు, ఉపన్యాసాలతో జోడిస్తే ఆసక్తిగా వింటున్నారు. ఆ కీర్తనలలోని పరమార్థాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈ వాతావరణం ఇంకా పెరగాలి.
పవిత్రమైన కీర్తనలన్నీ అయస్కాంతాల్లాంటివి. అయస్కాంతం ఇనుప ముక్కను ఏం చేస్తుంది? మరో అయస్కాంతంగా చేసి తీరుతుంది. అలాగే ఈ పవిత్ర భూమీద పుట్టిన యోగులు, ఋషులు వాగ్గేయకారుల రచనలు కూడా ఆ ప్రభావాన్ని కలిగే ఉంటాయి.

‘అమ్మా అమ్మా అని పిలిచావు...’ (నాకు నచ్చిన పాట)

$
0
0

‘విచిత్ర బంధం’ సినిమాలో ‘అమ్మా అమ్మా అని పిలిచావు...’ అనే ఈ పాట వాణిశ్రీ మీద చిత్రీకరించారు. కథాపరంగా అక్కినేని ద్వారా బిడ్డను కన్న వాణిశ్రీ విధివంచితురాలై ఆ బిడ్డకు దూరంగా ఉంటుంది. అక్కినేని కలపాలనుకుంటాడు వాళ్ళిద్దరిని. యాదృచ్ఛికంగా ఆ తల్లీకొడుకు అక్కినేని దగ్గర ఆశ్రయం పొందుతుంటారు.
ఒకానొక సందర్భంలో వాణిశ్రీ తన మాతృ హృదయపు ఆవేదనను ఆ బాబు దగ్గర వ్యక్తపరుస్తుంది.
‘అమ్మా అమ్మా అని పిలిచావు ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ- ఏ తల్లి కన్నబాబువో నా కాళ్లకు బంధం అయినావు...’ ఇక్కడే మనకు కథంతా అర్ధమవుతుంది. ఆత్రేయగారి సాహిత్యమా మజాకానా మరి కె.వి.మహదేవన్ పక్కనే ఉండగా ఆ పాట అమ్మతత్వాన్ని పొందుతుంది. ఆదుర్తి సుబ్బారావుగారి దర్శకత్వం ఇక పాట పండక ఏమవుతుంది.
కన్నతల్లి ఎవ్వరో ఎరుగవు నువ్వూ, కడుపు తీపి తీరని తల్లిని నేను- కాలమే ఇద్దరినీ కలిపింది ఎందుకో-ఒకరికొరతనింకొకరు తీర్చుకునేటందుకో. చూడండి చిన్నచిన్న పదాలతో ఎంత విపులంగా చెప్పారో కవిగారు. వాణిశ్రీ కూడా అంతే భావగర్భితంగా నటించింది. మోడులా ఈ బ్రతుకును మోశానూ నీ ముద్దుమోముచూసి మరల మొలకెత్తాను’ అంటుంది. కన్నబిడ్డ అని తెలియకపోయినా ఆదరిస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. అమ్మ ఎవరికైనా అమ్మ అని నిరూపిస్తుంది. చక్కగా మనసుని సేదతీర్చే ఈ పాట నాకు ఎంతో ఇష్టం. నా ఫోన్‌లో అప్పుడప్పుడూ మోగుతూనే ఉంటుంది. నన్ను అలరిస్తూనే ఉంటుంది.
- అన్నదాత దయాకర్, బృందావనం, నెల్లూరు

పజిల్--686

$
0
0

ఆధారాలు:
-------------
అడ్డం

1.అతి విస్తృతమైన ఉదంతానికి జా తీయం (5)
4.కలం (3)
6.బంగారం (2)
7.తెలివి (3)
10.మత్స్యకారుడు (2)
11.‘నవలా సంభాషణ’కి
హ్రస్వరూపం (2)
12.పువ్వు (2)
15.ఈర్ష్య (2)
16.స్ర్తి (2)
19.పశుపక్ష్యాదుల గ్రాసము (2)
21.కోపము గలవాడు (3)
23.ఈ కుక్క, కుక్కల్లో ఒక రకం (2)
25.జిలేబీ వంటి మధుర పదార్థం (3)
26.‘గాడి పలుపు’ సరిచేస్తే నిరీక్షణ (5)

నిలువు:
----------
2.పత్ని (2)
3.‘తంగవేలు’కు ‘వేలు’ సగమే.. (3)
4.హరిణశాబకం (4)
5.సమస్తం (3)
7.ఎమ్మెల్యేలు ఎదురుచూసే చర్య, మంత్రివర్గంలో జరిగేది (4)
8.కథల గమ్యస్థానం (2)
9.నిలువు 14 తిరగబడితే ఆగని వాన (3)
13.బ్రహ్మ (4)
14.నిలువు 9 తిరగబడితే ఆంగ్లంలో ‘్ఫజు’ (3)
17.అర్ధరాత్రి (4)
18.‘కూర్చో!’ అనడానికి గ్రామ్య రూపం (2)
20.పరాజయం (3)
22.తరువాత (3)
24.చిరంజీవిని ఈ స్టార్ అంటారు (2)

ఆ ఒక్కటీ అడక్కు

$
0
0

హాస్యరస ప్రధాన చిత్రాలు రాజ్యమేలుతున్న రోజుల్లో వచ్చిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’. జంధ్యాలగారి దగ్గర దర్శకత్వంలో నవ్వులు, మెళుకువలు నేర్చుకుని దర్శకుడయ్యారు ఇ.వి.వి. చూడగానే నవ్వు వచ్చేలా సన్నివేశాలు తీయడంలో సిద్ధహస్తుడు. తొంభై దశకంలో ఏ.వి.ఎమ్.వారి బ్యానర్‌లో వచ్చి మంచి విజయం సాధించింది. ప్రారంభంనుంచి ముగింపువరకు మాటల గారడీతో నవ్వించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు.’ ఎల్.బి.శ్రీరామ్‌గారు మాటలు రాయటంలో కొత్త ఒరవడి సృష్టించారు. ‘‘చూస్కో, వేస్కో, నాడీక్కి, టైటిల్స్‌లో, మాట్లాడింది, డబ్బుచ్చింది, రాజకీయంతా విని రాజీవ్‌గాంధీ ఎవరందీ, ఫర్ సపోజ్ రావుగోపాలరావు మేనరిజమ్, బ్రహ్మానందం దూరదర్శన్ సంగీతంతో వార్తలు చదువుట, నవ్వు, రంభ ఒంటినిండా కరెంట్, పిల్లలు కాదు మాకు కండెన్సర్‌లు పుడతాయి, బాబూమోహన్ జ్యోతిష్కుడుగా మేనరిజమ్, రావుగోపాలరావుగారి గెటప్‌నుండి మాటలవరకు, లతాశ్రీ జెండా ఎత్తేస్తా, నిర్మలమ్మ నటన, అల్లురామలింగయ్య రైలుటిక్కెట్ కలెక్టర్‌గా హడావుడి, ఇంటినే రైలు వాతావరణంగా చేయడం. శుభలేఖలు పంచుట, రాజేంద్రప్రసాద్ రంభ గూర్చివస్తే బయటకు పంపే సన్నివేశాలు, పెళ్లిలో చదివింపులు, బ్రహ్మానందం మెయిల్ వస్తోందేంటీ అనడం, కళ్లు చిదంబరం మేక సన్నివేశం ‘ఏప్రియల్ తర్వాత మే, జూన్ ముందు మే’. ఆరోజుల్లో ఈ జోక్‌కి హాలులో జనమంతా నవ్వారు. గుళ్లో సీన్‌లు, ఫైటింగ్ సీన్‌లు అన్నీ ఆద్యంతం ప్రతీ సన్నివేశం నవ్వించింది. నేటికి నవ్విస్తూనే వుంటుంది. రాజేంద్రప్రసాద్ నటన ఈ సినిమాలో ఎన్ని కోణాల్లో నవ్వించవచ్చో తెలుస్తుంది. గెడ్డంక్రీమ్‌తో స్వయంవరంకి వచ్చే సన్నివేశం, తాళిబొట్టుతో పిల్లాడు నిలబడతాడు ఆ సన్నివేశంలో రాజేంద్రప్రసాద్ నటనకి, మాటలకి ఆంధ్రదేశమంతా నవ్వుల జల్లులు కురిపించింది. సాక్షి రంగారావు సన్నివేశాలు ‘అంకులు దిగిరావయ్యా.. దేవుడు దిగి రావయ్యా’ పాటలో డాన్స్‌లు, నవ్వుల మయం, ప్రతీ నవ్వు వెనకాల కన్నీరు వుంటుందని నిర్మలమ్మ డైలాగ్స్‌లో మనకి అర్ధమవుతాయి. నవ్విస్తూనే జ్యోతిష్కం, జాతకాల బారినపడి నేటి యువత దారి తప్పుతోందని, మానవ కృషి, ఆలోచనే జీవితానికి నిజమైన మార్గమని సందేశాన్నిస్తుంది. ఎల్.బి.శ్రీరామ్‌గారి మాటలు, ఇ.వి.వి.గారి దర్శకత్వ ప్రతిభ, రాజేంద్రప్రసాద్, రంభ, నిర్మలమ్మ, రావుగోపాలరావు, నటన, ప్రతి నటుడు, నటన, మాటలతో ఈ సినిమాలో నవ్విస్తాడు. క్లైమాక్స్ కూడా కొసమెరుపుతో నవ్విస్తుంది. నేటికి టీవిలోవస్తే నవ్వించదగ్గ సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’. తెలుగు సినిమాలో నవ్వుకి చిరునామా ‘రాజేంద్రప్రసాదే’అని ఆ ఒక్కటీ అడక్కు సినిమా నూటికి నూరుపాళ్లు రుజువుచేసిన సినిమా. ఆనాటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుగారు రాజేంద్రప్రసాద్ సినిమాలు అంటే నాకిష్టం అంటూ చూశారు.
-పెమ్మరాజు సుబ్రహ్మణ్యగోపాల్, కొంకాపల్లి, అమలాపురం


యుద్ధ నేపథ్యంలో ఉదాత్త ప్రేమగాథ!

$
0
0

అడ్మిరల్
*
ప్రపంచ సినిమా : రష్యన్
*
జారిస్టు రష్యా పభుత్వంలో నౌకాదళ అధిపతిగా, రష్యా అంతర్యుద్ధ కాలంలో కమ్యూనిస్టు వ్యతిరేక నాయకుడిగా పనిచేసిన అలెగ్జాండర్ కొల్చాక్ జీవిత చరిత్ర ఆధారంగా 2008లో తీసిన రష్యన్ చిత్రం ‘అడ్మిరల్’ యుద్ధ నేపథ్యంలో అడ్మిరల్, అతని భార్య, అతని ప్రేమికురాలి మధ్య నడిచిన ముక్కోణపు ప్రేమకథను కూడా ఇందులో చిత్రించారు.
అది 1914లో బాల్టిక్ సముద్రం జర్మన్ ప్రాంతీయ జలాల్లో ప్రవేశించిన రష్యన్ నౌకను నడిపిస్తున్న కెప్టెన్ అలెగ్జాండర్ కొల్చాక్‌కు, దూరంగా వస్తున్న ఆయుధ నౌక తమ సిగ్నల్స్‌ను లెక్కచేయకుండా కాల్పులు జరుపుతుండటంతో, ఎదురుదాడికి సిద్ధపడమని తన అనుచరులతో చెబుతాడు. ఆ జర్మన్ నౌక చేసిన విధ్వంసంతో, దాన్ని ఎదుర్కోవడం సులభం కాదని భావించి, కొన్ని మందు పాతరలను నీళ్ళలోకి జారవిడుస్తారు. రష్యన్ నావికులు పేల్చిన తుపాకులకు జర్మన్ నౌక డెక్ దెబ్బతింటుంది. జర్మన్ నౌక కాల్పులకు చిక్కకుండా మందుపాతరలకు దూరంగా రష్యన్ నౌక తప్పుకోగా, మందుపాతరకు తట్టుకొని జర్మన్ నౌక పేలిపోయి, క్రమంగా సముద్రంలో మునిగిపోతుంది.
అప్పట్లో రష్యన్ సామ్రాజ్యంలో ఒక భాగంగా వున్న ఫిన్లాండ్ నావికా స్థావరంలో, ‘అడ్మిరల్’గా ప్రమోషన్ పొందిన కొల్చాక్ గౌరవార్థం విందు ఏర్పాటుచేస్తారు. ఆ విందులో అడ్మిరల్‌ను ఆటపట్టిస్తూ అమ్మాయిలు పోటీలో భాగంగా, తలుపు తెరుచుకుని వచ్చే వారికి ముద్దుపెట్టాలని షరతు పెడతారు. తీరా చూసేసరికి తన సబార్డినెంట్, క్లోజ్ ఫ్రెండ్ సెర్జీ తిమిరేవ్ తన అందాల భార్య అన్నా తిమిరేవ్‌తో లోపలకు వస్తాడు. అమ్మాయిలంతా కలిసి హడావుడి చేసి అడ్మిరల్‌తో ఆమెను ముద్దుపెట్టుకునేలా చేస్తారు. తొలిచూపులోనే కొల్చాక్, అన్నాలు గాఢమైన ప్రేమలో పడతారు. హుందాగా, దర్జాగా, మర్యాదగా, ఆకర్షణీయంగా వుండే అడ్మిరల్ కొల్చాక్‌ను చూసి అన్నా మనసు పారేసుకుంటుంది. అన్నా అంద చందాలు, ఠీవిని చూసి కొల్చాక్ ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. వీళ్ళ వ్యవహారాన్ని అటు కొల్చాక్ భార్య, ఇటు అన్నా భర్త గమనించి ఏమనలేక వౌనం వహిస్తారు. కొల్చాక్ భార్య కొడుకుతో పెట్రోగ్రాడ్ వెళ్ళిపోతున్నాననీ, తనకిష్టమైతే అన్నాతో కలిసి వుండవచ్చని నిర్వేదంగా చెబుతుంది. ఆమె బాధను పసిగట్టిన కొల్చాక్ ‘మనమిద్దరం భార్యాభర్తలుగా ఎప్పుడూ ఇలాగే వుండిపోతాం’ అని సముదాయిస్తాడు. అక్కడ సెర్జీ తన భార్య అన్నాతో ‘మనం దేవుని ముందర దంపతులుగా విశ్వాస పాత్రంగా మెదులుతామని ప్రమాణం చేశాం గుర్తుందా’ అని జ్ఞాపకం చేస్తాడు. కొల్చాక్, అన్నాలు ఒకరినొకరు చూడకుండా వుండలేని స్థితిలో సమాజం దృష్టిలో వివాహితులు కాబట్టి, దూరం నుండే చూసుకుని సంతృప్తిపడుతుంటారు. వారి మూగ ప్రేమ రోజురోజుకు పెరిగి వాళ్ళను కలవరపెడుతుంది. అన్నా భర్తను పట్టించుకోకుండా, నిరంతరం కొల్చాక్ ఆలోచనల్లో మునిగి వుండటం సెర్జీ భరించలేకపోతాడు. సముద్ర జలాల్లో నౌకలో వున్న అడ్మిరల్ కొల్చాక్ దగ్గరకు సెర్జీ వచ్చి తనను వేరే నౌక మీదికి బదిలీ చేయమని, ఇక్కడ వుండలేనని గిల్టీగా చెబుతాడు. అంతలో శత్రువుల కాల్పులకు తేరుకున్న కొల్చాక్ ‘నేను అడ్మిరల్‌ను. నీవు కెప్టెన్‌వి. మనమిద్దరం శత్రువులను ఎదిరించడమే ముఖ్యం’’ అని బుజ్జగించి, వెన్ను తట్టి పంపిస్తాడు. జార్ ప్రభుత్వం సెవాస్టొపొల్‌లో వున్న విమాన వాహక నౌక మీదకు కొల్చాక్‌ను అడ్మిరల్‌గా ప్రమోషన్ ఇచ్చి పంపిస్తుంది.
1917 ఫిబ్రవరి విప్లవ విజయంతో ఎర్ర సైనికలు వచ్చి, క్రోన్‌స్టాడ్ నావికా స్థావరంలో వున్న అధికారులను నిరాయుధులను చేసి విచారణ జరుపుతారు. సెర్జీ తన భార్య అన్నాతో కలిసి ఆ ద్వీపం నుండి పారిపోతాడు. జారిస్టు చిహ్నాలున్న నావికుల టోపీలను తీసివేసి, ఆ స్థానంలో ఎర్రటోపీలను ధరించిన ఒక గుంపు కొల్చాక్ వున్న నౌక మీదకు దూసుకువచ్చి, నౌకాదళం ఆయుధాలు అప్పగించి లొంగిపొమ్మంటారు. రక్తపాతాన్ని నివారించడానికి అలాగే చేయమని కొల్చాక్ తన అనుచరులను ఆదేశిస్తాడు. కాని తన ఆయుధాన్ని వాళ్ళకు అప్పగించడానికి ఇష్టపడక, దాన్నిసముద్ర జలాల్లోకి జారవిడుస్తాడు. కొత్తగా ఏర్పడిన రష్యా విప్లవ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న అలెగ్జాండర్ కెరెన్‌స్కీ, కొల్చాక్‌ను పెట్రోగ్రాడ్‌కు పిలిపించి, రక్షణశాఖ మంత్రిగా వుండమని కోరుతాడు. దానికి ఒప్పుకోని కొల్చాక్ విప్లవం పేరిట రష్యన్ సైన్యంలో, నౌకాదళంలో క్రమశిక్షణ లేకుండా చేస్తున్నారని విమర్శిస్తాడు. తిరిగి జారిస్టు ప్రభుత్వాన్ని ప్రతిష్టిస్తేనే, ఆ పదవిని స్వీకరిస్తానంటాడు. దానికి ఆగ్రహించిన కెరెన్‌స్కీ, కొల్చాక్‌ను విప్లవ వ్యతిరేకిగా గుర్తించి దేశబహిష్కరణ విధిస్తాడు.
1919 వేసవిలో అనగా అక్టోబర్ విప్లవం తర్వాత రెండు సంవత్సరాలకు - అన్నా, సెర్జీలు ట్రాన్స్ సైబీరియన్ రైలులో ప్రయాణిస్తుంటారు. కొల్చాక్ తిరిగి వచ్చాడనీ, ఓమ్‌స్క్‌లో వున్న జారిస్ట్ మూకలతో కలిసి పనిచేస్తున్నాడని తెలుస్తుంది. రష్యా అంతర్యుద్ధ కాలంలో ఎటువైపు వుండాలో సెర్జీ తేల్చుకోలేకపోతాడు. తాను ఒంటరిగా తన బతుకు తాను బతుకుతాననీ అన్నా తేల్చివేస్తుంది. అది ఇష్టం లేకపోయినా చేసేది లేక సెర్జీ స్వయంగా ఆమె సామాన్లు సర్దిపంపిస్తాడు. కొల్చాక్ తన సైన్యానికి దేశభక్తిని ప్రబోధిస్తూ బోల్షివిక్కులను ఓడించి, రష్యాను పునరుద్ధరించాలని పిలుపునిస్తాడు. రష్యన్ అంతర్యుద్ధంలో గాయపడుతున్న వందలాది మందికి సేవచేయడానికి అన్నా నర్స్‌గా మారుతుంది. విప్లవ సానుభూతిపరుల సహాయంతో ఎర్రసైన్యం ఓమ్‌స్క్ వైపు దూసుకువస్తుంది. కొల్చాక్ అనుచరులు ఎలాగైనా ఓమ్‌స్క్‌ను దక్కించుకోవాలని తలపోస్తారు. కాని కొల్చాక్ దాన్ని త్రోసిపుచ్చి, ఓమ్‌స్క్‌ను ఖాళీచేసి ఇర్క్‌టస్క్‌ను ఆక్రమించుకుని, కమ్యూనిస్టు వ్యతిరేక రష్యాకు కొత్త రాజధానిగా ఏర్పరచుకోవాలని చెబుతాడు. ఓమ్‌స్క్ పట్టణం ఖాళీ చేయబడుతున్న దశలో ఓ జారిస్టు అధికారి అన్నాను చూసి గుర్తుపట్టి కొల్చాక్‌కు తెలియజేస్తాడు. ప్రాణం లేచి వచ్చిన కొల్చాక్, అన్నాను కలిసి ఒకసారి నిన్ను వదులుకుని పొరపాటు చేశాను. మళ్ళీ ఆ పొరపాటు చేయనంటాడు. ఇర్క్‌టస్క్‌కు రైల్లో వెళుతున్న కొల్చాక్, పారిస్‌లో వున్న భార్యకు విడాకులు ఇవ్వాలని కోరుతూ ఇప్పుడే ఉత్తరం రాస్తానంటాడు. ఇప్పుడయినా పెళ్ళి చేసుకో అని అన్నాను కోరగా, ఇప్పుడు ప్రత్యేకంగా పెళ్ళిచేసుకోవాల్సిన అవసరం లేదనీ, కలిసి బ్రతుకుదామని, ప్రతిపాదిస్తుంది.
నిజానికి ఇర్క్‌టస్క్, ఫ్రెంచ్ జనరల్ మరియూ జెకోస్లోవేకియా సైనిక దళాల పర్యవేక్షణలో వుంటుంది. వారి రక్షణ దళాలు బలహీనంగా వుండటంతో ఎర్ర సైన్యం విధించిన షరతులకు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఫలితం అడ్మిరల్ కొల్చాక్‌ను అరెస్టుచేసి ఎర్ర సైన్యానికి అప్పగిస్తారు. అది చూసి అన్నా, నేను ఆయన భార్యను, నన్ను కూడా అరెస్టుచేయండి అని అరిస్తే, ఆమెను కూడా అరెస్టు చేస్తారు. ఘనీభవించిన శీతల జలాలతో వున్న ప్రాంతాన్ని, కొంత శిలువ మాదిరిగా తయారుచేసి దాని ఒడ్డున కొల్చాక్‌ను, మాజీ ప్రధానమంత్రిని నిలబెట్టి ఫైరింగ్ స్క్వాడ్ కళ్ళకు గంతలు కట్టుకోమంటే, వద్దని కొల్చాక్ నిరాకరిస్తాడు. చివరికోరిక తెలపమంటే ‘నా కొడుకు గురించిన దీవెనలు పారిస్‌లో వున్న నా భార్యకు తెలియజేయండి’ అంటే ‘నీకెంతమంది భార్యలు’ అని వాడు అవహేళన చేసి వెళతాడు. ఫైరింగ్ స్క్వాడ్ కాల్పులతో వాళ్ళు కూలిపోయి, శీతల జలాలలో పడి మెల్లగా మునిగిపోతారు. వర్తమానానికి వస్తే- 44 ఏళ్ళ తర్వాత అన్నా మోస్ ఫిలిం స్టూడియోకి వస్తుంది. డెబ్బయి ఏళ్ళ వయసులో వున్న కులీన స్ర్తిగా కనిపించే అన్నా, ముప్పయి సంవత్సరాలు గులగ్ జైల్లో గడిపి కృశే్చవ్ పాలనలో విడుదల చేయబడుతుంది. అన్నా ‘వార్ అండ్ పీస్’ చిత్రం తాలూకు బాల్‌రూమ్ డాన్స్ చిత్రీకరణ దృశ్యంలో, ఒక వెయిటర్ ట్రే నుండి వైన్‌తో వున్న గ్లాస్ కిందపడి ముక్కలు ముక్కలు అవడంతో- అచ్చు అదే సన్నివేశం తాను మొదటిసారి కొల్చాక్‌ను కలిసినప్పడు జరిగి వుండటం వలన ఆమె ఫ్లాష్‌బాక్‌లోకి వెళ్ళిపోయి, సినిమాను మన కళ్ళముందు నిలబెడుతుంది.
సోవియట్ చరిత్రలో విలన్‌గా నిలిచిపోయిన కొల్చాక్‌ను హీరోగా పెట్టి సినిమా తీయడం పట్ల అనేక విమర్శలు, చర్చలు బయలుదేరాయి. దీన్ని అలా కాకుండా కొల్చాక్ దృష్టితో చూడాల్సిన అవసరముంది. ప్రభుభక్తి నిండినఅప్పటి ఉన్నత వంశీకుల ఆలోచనా ధోరణి కొల్చాక్‌లో కనిపిస్తుంది. తాను ఉన్నత వంశీకుడు కావడంవలన అలగాజనాల తిరుగుబాటుగా ఎర్ర సైన్యాన్ని గుర్తిస్తాడే తప్ప, దాని పట్ల సదభిప్రాయాన్ని ఏర్పరచుకోలేకపోతాడు. అతని నిజాయితీ, నిబద్ధతను గుర్తించి ఎర్ర సైన్యం అతడ్ని రక్షణ మంత్రిగా వుండమంటే నిరాకరించడం, తిరిగి జారిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పగలనని విశ్వసించడం- అతని జీవితంలో సరిదిద్దుకోలేని సంఘటనలు. చివరకు దానికి మూల్యాన్ని చెల్లించుకుంటాడు. అన్నాను ప్రేమించి అటు మిత్రద్రోహం, ఇటు భార్యకు అన్యాయం చేస్తున్నాననే అపరాధ భావనకు లోనవుతాడు. ఆమెను మరచిపోలేకపోతాడు. తన ప్రేమను వ్యక్తపరచడంలో ఎంతో డిగ్నిఫైడ్‌గా ప్రవర్తిస్తాడు. ఇక అన్నా ప్రేమ మైకంలో ఇంటిని, భర్తను వదిలేసి కొల్చెక్‌కు తెలియకుండా, అతడ్ని అనుసరిస్తూనే వుంటుంది. చివరకు కొల్చెక్‌తోపాటు జైలుకు వెళుతుంది. నలభై సంవత్సరాలు జైల్లో గడిపి 1960లో విడుదలైన ఆమె తన 81వ యేట అనగా 1975లో మాస్కోలో చనిపోతుంది. అన్నా భర్త సెర్జీ సైబీరియాలో జారిస్టు సైన్యాలకు అధిపతిగా వుంటూ, చివరకు చైనా పారిపోతాడు. అక్కడ షాంఘైలో 1932లో మరణిస్తాడు. అడ్మిరల్ కొల్చాక్ భార్య పారిస్‌లో స్థిరపడి, తన కొడుకు భవిష్యత్తుపైనే దృష్టిపెడుతుంది. చివరకు వృద్ధాప్యంతో 1956లో ఆస్పత్రిలో చనిపోతుంది. అడ్మిరల్ కొల్చాక్ కొడుకు రెండవ ప్రపంచ యుద్ధకాలంలో, ఫ్రాన్స్ తరఫున యుద్ధంలో పాల్గొంటాడు. 1965లో పారిస్‌లో చనిపోతాడు.
ఇందులో అడ్మిరల్ కొల్చాక్‌గా కాన్‌స్టాంటిన్ కబెన్‌స్కీ, అన్నాగా ఎలిజబేటా బోయర్ స్కాయా అద్భుతంగా నటించారు. ‘డాక్టర్ జివాగో, వార్ అండ్ పీస్’ల మాదిరి యుద్ధ నేపథ్యంలో రూపుదిద్దుకున్న అద్భుత ప్రణయగాథ ఇది. భారీ సెట్టింగులతో, అప్పటి వాతావరణాన్ని మన కళ్ళముందు నిలబెడుతూ, ఖర్చుకు వెరవకుండా భారీ బడ్జెట్‌తో తీసిన చిత్రమిది. అత్యంత సహజంగా తీసిన యుద్ధ దృశ్యాలు, ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఎలాంటి వెకిలివేషాలు వేయకుండా, అసభ్యత, అశ్లీలతలకు చోటివ్వకుండా ఈ చిత్రాన్ని ఉదాత్త ప్రేమకథా చిత్రంగా రూపొందించడడంలో దర్శకుడు ఆండ్రీ క్రావ్‌చక్ చేసిన కృషి ప్రశంసనీయం. ఈ చిత్రం ఇంటాబయటా భారీ వసూళ్ళను రాబట్టడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఉత్తమ హీరో, హీరోయిన్, సినీమాటోగ్రపీలతో పాటు ఉత్తమ చిత్రంగా కూడా గోల్డెన్ ఈగిల్ అవార్డ్సును, యంటివి రష్యా మూవీ అవార్డ్సును అందుకోగలిగింది.
- కె.పి.అశోక్‌కుమార్

దొంగచాటు వ్యవహారం

$
0
0

ఎందుకు దొంగచాటు వ్యవహారం? రహస్యం కనుక. దాచవలసిన విషయం కనుక. తరచుగా మూడవ కంట పడకుండా అన్యాయంగా జరగవలసిన వ్యవహారం కనుక.
ఆడ, మగ పొందు సంగతి వచ్చేసరికి జంతుజాతులలో వింతవింత తేడాలు కనపడతాయి. సింహం వేటాడదు. కొన్ని ఆడ సింహాలను వెంటపెట్టుకుంటుంది. అవి వేటాడి తెస్తే తింటుంది. ఇది విపరీతమయిన పద్ధతి. చాలా జంతువులలో జంటకట్టడం తరువాత విధేయత అన్న ప్రశే్న ఉండదు. ఎవరి దారి వారిదే. మానవ సమాజంలో ఆడ, మగ బ్రతికినంత కాలం ఒకరికొకరు విధేయులుగా కలిసి ఉండాలన్న నియమం ఎప్పుడు, ఎందుకు వచ్చిందీ తెలియదు. బహుభార్యత్వం ఉన్నదని తెలుసు. ఒక ఆడమనిషికి ఎక్కువమంది భర్తలు ఉండడం కూడా తెలుసు. కానీ అవి మామూలు పరిస్థితులు కావు. వీటన్నిటికీ మించి శరీర పరంగా ఆడమనిషి విషయంగా ఒక విపరీతమయిన పరిస్థితి ఉంది.
పశువుల్లో ఎద అనే పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఎద సమయంలో మాత్రమే ఆడ పశువు జంట కట్టడానికి సిద్ధంగా ఉంటుంది. చాలా జంతుజాతులలో కూడా ఈ పద్ధతి ఉంది. ఒక్క మనిషిలో మాత్రమే ఇందుకు వ్యతిరేకమయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక స్ర్తి కాలాలు, రుతువులతో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా మగపొందు విషయంలో సిద్ధంగా ఉంటుంది. స్ర్తిలో అండం విడుదల పరిస్థితి బయటకు తెలియదు. నెలసరి అనే పద్ధతి ప్రకారం అండం గురించి అర్థం అవుతుంది. అండం ఫలదీకరణ చెందితే నెలసరి రాదు. మగ పొందుకు ఆడమనిషి సిద్ధంగా ఉందన్న సంగతి బయటకు తెలియవలసిన అవసరమే లేదు. ఇటువంటి పరిస్థితిలో కూడా పెద్ద సంఖ్యలో ఆడ, మగ ఉన్న మానవ సమాజంలో విధేయులయిన జంట పరిస్థితి కొనసాగుతున్నది. అంటే, ఆ పరిస్థితికి అడుగడుగునా అన్యాయం జరుగుతున్నది అని వేరుగా చెప్పనవసరం లేదు. భార్యాభర్తలు సంగమించడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ లైంగిక ప్రక్రియ రహస్యంగా, దాపరికంగా జరుగుతుంది. ఈ పద్ధతి ఎప్పుడు, ఎందుకు వచ్చిందీ మరొకచోట చర్చించాలి. కానీ భార్యాభర్తలు కానివారు రహస్యంగా, దాపరికంగా కలవడం చాలా మామూలుగా సాగుతున్నది. ఈ విషయం ఇలా చెప్పినందుకు చాలామంది నొచ్చుకుంటారు. అంతే మంది ‘అవును’ అని తల ఆడిస్తారు కూడా. ఇంతకూ మరే జంతుజాతిలోను లేని పద్ధతిలో ఆడ, మగ పొందు ఒక్క మనిషి విషయంలోనే దొంగచాటుగా వ్యవహారంగా ఎందుకు మారింది?
ప్రపంచంలో మానవ సమాజాలు అన్నింటిలోనూ లైంగిక సంబంధాలు రహస్యంగానే సాగుతున్నాయి. ఇది కేవలం సంస్కృతి, నీతికి సంబంధించిన సంగతి కానేకాదు. కొన్ని జాతులలో మాత్రం గుంపులుగా లైంగిక చర్యలు జరుగుతున్నాయి. ఉదాహరణకు బ్రెజిల్‌లోని కనెలా జాతివారు గుంపులుగా చేరి సంగమిస్తారట! అందులో జంటల మధ్యన విధేయత గురించి మాత్రం తెలియదు. విశృంఖలత ఉంటుందేమో! అనుమానం మాత్రమే. భారతదేశంలో ఒకప్పుడు రవికల పండుగ అని ఉండేదట. పండుగకు వచ్చిన ఆడవారు అందరు తమ రవికలను వదిలి ఒకచోట పడేస్తారు. పురుషులు వాటిలో నుంచి ఒకదాన్ని ఎందుకుంటారు. ఆనాటికి ఆ రవిక సొంతదారుతో పొంతన కుదురుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఎవరికో ఒకాయనకు తన భార్య రవిక దొరికిందట. పండుగనాడు కూడా పాతమొగుడేనా అన్న మాట అక్కడ పుట్టింది అంటారు. ఇటువంటి సందర్భాలు నిజంగా జరిగినా మామూలు మాత్రం కావు. సాధారణంగా మత్తు పదార్థాల ప్రభావంలో నాగరిక ప్రపంచంలో కూడా ఇటువంటి ఆర్గలు జరుగుతున్నట్టు చెబుతారు. వ్యవసాయం వృత్తిగా రాకముందు సమాజంలో సెక్స్ విషయంగా కొంత విశృంఖలత ఉండేది అనడానికి సూచనలు ఉన్నాయి. ఆ తరువాత మాత్రం లైంగిక సంబంధాలు రహస్యంగా మారాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి.
ప్రైమేట్ జాతికి చెందిన చింపాంజీలు, ఒరాంగ్ - ఉటాన్‌లను గమనిస్తే కొన్ని వింత ధోరణులు కనిపిస్తాయి. చాలా జంతుజాతులలో మగ ప్రాణులు ఆడ పొందు కొరకు పోటీ పడతాయి. అటువంటి జాతులు అన్నింటిలోనూ దొంగచాటు సంగమం ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. మగ జంతువులు ఆడతోడు మీద అదుపును సంపాదించుకో గలిగితే అవసరం తీరుతుంది. ఒరాంగ్ - ఉటాన్‌లలో గుంపులు ఉంటాయి. దానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ లీడర్ ప్రాణి బాహాటంగా కోరిన ఆడ ప్రాణితో కలుస్తుంది. దాని అధికారానికి ఎదురులేదు మరి. కానీ అధికారం లేని మగ ఒరాంగ్ - ఉటాన్‌లు మూడవ కంటికి తెలియకుండా దొంగచాటుగా సెక్స్‌లో పాల్గొనడం ఆశ్చర్యకరమయిన విషయం. కొత్తగా పుట్టిన కూనలకు తండ్రి ఎవరు అన్న విషయం రహస్యంగానే ఉండిపోయేది. ఆధునిక పరీక్ష పద్ధతులు వచ్చిన తరువాత పరిశోధకులు వాటిని వాడి ఎన్నో ఆసక్తికరమైన కలయికల రహస్యాలు తెలుసుకున్నారు. గొరిల్లాలలో కూడా ఈ నాయకుని బాహాటం పద్ధతి మిగతా గొరిల్లాల దొంగచాటు పద్ధతి మామూలే. ఇక బొనోబో కోతులలో పొందు గురించిన నిర్ణయాలు ఆడ జంతువులు తీసుకుంటాయ. అక్కడ అదుపు, ఆజ్ఞలు లేవు. ఆడదానికి ఇష్టమయితే అంతకాలం పొందు కొనసాగుతుంది. పోటీ అన్నది కూడా అక్కడ లేదు. కేవలం అవకాశం మాత్రమే పొందుకు ఆధారం. పోటీ ఉన్నచోట మాత్రం రహస్య పద్ధతి ఉన్నట్టు తెలిసిపోతున్నది. మనుషులలో కూడా పోటీ కారణంగానే బహుశా జంట పద్ధతిలో మార్పు వచ్చి ఉంటుంది.
కాలం గడుస్తున్న కొద్దీ మనుషులలోని ఆడపొందు విషయంగా ఎన్నో చిక్కులు, చికాకులు మొదలయ్యాయి. ఆడమనిషి ఎప్పుడయినా పొందుకు సిద్ధంగా ఉంటుంది. ఎద అన్న ప్రశ్న లేదు. ఎప్పుడు సంగమిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ అన్న సంగతి కూడా అంత సులభంగా అర్థం కాలేదు. కనుక పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది నాటి నుంచి నేటి వరకు ఒక నమ్మకం మాత్రమే. ఈనాటికయినా ఒక తల్లి తన శిశువుకు తండ్రిగా పరిచయం చేసిన వ్యక్తిని అంగీకరించక తప్పడంలేదు. అసలు సంగతి ఆ తల్లికి మాత్రమే తెలుసు. నేరాలు, ఘోరాలు జరిగినప్పుడు జన్యుపరంగా పరీక్షలు చేయడం ఈ కాలంలో మామూలు అయింది. అటువంటి పరీక్షలు చేసిన కొన్నిచోట్ల ఒక వ్యక్తి అందరు అనుకుంటున్న తండ్రికి కొడుకు కాడు అని తెలిసిపోయింది. దానితో నేరాలు - ఘోరాలు మరింతగా పెరిగాయి. ఈ విషయం ఆధారంగా ఆ మధ్యన జోనెస్‌బో అనే రచయిత ఒక గొప్ప క్రైం థ్రిల్లర్‌ను రాశాడు. అలాగని తండ్రి ఎవరో తెలియని పరిస్థితి ఎక్కడో ఒకచోటే ఉందని అనుకోడానికి వీలులేదు. రహస్య సంగమం కారణంగా చాలా విషయాలు రహస్యంగా మిగిలిపోతున్నాయి.
కుటుంబానికి బాధ్యులు ఎవరు అన్నది మరొక ప్రశ్న. శరీర దారుఢ్యం గల మగ జంతువుల లాగే మనుషులలో కూడా మగవారు ఆ బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నారు. ఆడ మనుషులు తాము కన్న పిల్లలను పోషించి పెద్దచేసే బాధ్యతను తీసుకున్నారు. అందుకు అనుబంధంగా వంట, తిండి పంచడం లాంటివి కూడా ఆడమనిషి బాధ్యతలుగా మారాయి. ఈ పరిస్థితులలో ఒక మగ మనిషికి ఒకే భార్య అన్న పద్ధతి మొదలయింది. పోషించగలిగితే ఎక్కువమంది భార్యలను పెట్టుకోవచ్చు. కానీ ఆ భార్యల మధ్యన పోటీ మొదలవుతుంది.
మనిషి సమాజంలో అంటే గుంపులలో బతికాడు. ఒక జంట అనుకున్న భార్యాభర్తలు విధేయులుగా ఉండడం మామూలు పరిస్థితి. అయితే గుంపులో అవిధేయతకు అవకాశాలు మాత్రం నిండగా ఉంటాయి. ఇది ఈనాటికీ కొనసాగుతున్న ఒక సామాజిక పద్ధతి. అయితే అందులో ఆపదలు ఎక్కువయ్యాయి. నేరాలు - ఘోరాలు మొదలయ్యాయి. జంతువులలో పుట్టిన శిశువులను చంపే పద్ధతి ఒకటి ఉన్నది. మనుషులలో కూడా ఈ పద్ధతి సాగిందని పరిశోధకులు కనుగొన్నారు. ఆడ, మగ జంట కట్టిన తరువాత చాలాకాలం కలిసి ఉండాలంటే వారికి పుట్టిన పిల్లలు గట్టి కారణంగా నిలుస్తారు అనడానికి ఇది నిలువెత్తు ఉదాహరణ. ప్రేమ అన్న ఒక భావన సహజంగా పుడుతుంది. భార్యపట్ల ప్రేమ, ఆ భార్య తనకు అందించిన బిడ్డల పట్ల ప్రేమ, కుటుంబ వ్యవస్థకు పునాదులు. కానీ ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు అవిధేయత ప్రదర్శించిన చోట ప్రేమకు బదులుగా కక్షలు మొదలయ్యాయి. కథలు నడిపించాయి. రహస్యంగా జంట కట్టిన ఆడ, మగ మధ్యన ఆకర్షణను ప్రదర్శించుకునేందుకు అవకాశాలు ఎక్కువ. ఆ పనిని వారు బాహాటంగా చేస్తే ఎవరికీ నచ్చదు. ఇది చిత్రమయిన పరిస్థితి. నా భార్య కనుక నలుగురిలో ఉన్నప్పుడు కూడా నా ప్రేమను ప్రదర్శిస్తాను అంటే సమాజం ఊరుకోలేదు. ఈనాటికీ ఊరుకోవడం లేదు.

ఫిలిం క్విజ్ - 91

$
0
0

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్
ఏ చిత్రానికి సంబంధించినది?
2. రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రంలో రహీమ్‌గా నటించిన నటుడు?
3. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన రెండు రెళ్ళు ఆరు విడుదలైన సంవత్సరం?
4. జగపతిబాబు పెళ్లిపందిరి
చిత్రానికి సంగీత దర్శకుడు?
5. శ్రీమంతుడుతో జోడీ కట్టిన భామ?
6. ఎన్‌టిఆర్, అక్కినేని హీరోలుగా నటించిన గుండమ్మకథకు దర్శకుడు?
7. వెంకటేశ్ హీరోగా నటించిన
నువ్వు నాకు నచ్చావ్ చిత్రానికి కథను సమకూర్చిన నేటి దర్శకుడు?
8. శ్రీప్రియ దర్శకత్వంలో వచ్చిన వెంకటేష్ చిత్రం?
9. బాలకృష్ణ హీరోగా నటించిన
ఆదిత్య 369 చిత్రానికి దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి?
*
సమాధానాలు- 89
*
1. చిలుకూరు బాలాజీ, 2. విజయశాంతి
3. మాధవపెద్ది సురేష్,
4. లక్ష్మీ నరసింహ
5. అనుష్క- అయేషా టకియా
6. లక్ష్మీకాంత్ ప్యారేలాల్
7. 2007, 8. సోగ్గాడే చిన్ని నాయనా
9. గీతాంజలి, 10. కేథరిన్ థెరిసా
*
సరైన సమాధానాలు రాసిన వారు
జి.వి. మురళీమోహన్, ముచ్చుమిల్లి
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
కె.అహల్య, మచిలీపట్నం
బి.వి.జయరాజ్, కరీంనగర్
కె.విశాల్‌కుమార్, హైదరాబాద్
సి.హెచ్. నారాయణరావు, గుంటూరు
బి.విశ్వం, సికింద్రాబాద్
కె.వలీమియా, మహబూబ్‌నగర్
ఎం.డి. అఖ్తర్ హుస్సేన్, ఇబ్రహీంపట్నం
వి.రాజ్, శేఖర్, హకీంపేట
కె.విశాలాక్షి, గుంటూరు
బి.వి.వి.ఆర్ రాజశేఖర్, కాచిగూడ
డి.అరుణ్‌కుమార్, సిద్ధిపేట
డి.విశాల్, వినయ్, కాజీపేట, వరంగల్
సంజీవి, నాగశే్వత, బెంగళూరు
బి.సోమేశ్వర్‌రావు, మహబూబ్‌నగర్
పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి
చోడవరపు సాయ మాన్విత, హైదరాబాద్
కరణం శివానందరావు, కర్నూలు
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03
*

పొదుపు మంత్రం

$
0
0

రామబాణానికి తిరుగు లేదు. అలాంటి రామబాణం. మన భారతీయులందరి జీవన విధానంలో భాగం కావడం మన దేశ అదృష్టం. మన గొప్పతనం మనకు తెలియక పోవచ్చు కానీ అది నిజం. ఓ పదేళ్ల క్రితం ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు యూరప్ దేశాలు వణికిపోయాయి. ఇండియా మాత్రం చెక్కు చెదరకుండా అలానే నిలబడగలిగింది. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా? మన వద్ద ఉన్న రామబాణమే మనల్ని నిలబెట్టింది. పొదుపు ఇదో రామబాణం. వ్యక్తుల జీవితాలనే కాదు మొత్తం దేశానే్న రక్షించే రామబాణం.
అమెరికాలో సగటు పొదుపు శాతం ఎంతో తెలుసా? మన దేశంలో ఎంతో తెలుసా? రెండు దేశాల మధ్య పొదుపు శాతంలో ఎంత తేడా ఉందో తెలుసా? నమ్మకం కలగకపోవచ్చు కానీ ఇది నిజం. అధికారిక లెక్కలు.
మన దేశంలో సగటు పొదుపు 30 శాతం అంటే వంద రూపాయలు సంపాదిస్తే ప్రజలు సగటున 30 రూపాయలను ఏదో ఒక రూపంలో పొదుపు చేస్తున్నారు. అదే అమెరికాలో కేవలం 2శాతం ఆదాయాన్ని మాత్రమే పొదుపు చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ రెండు దేశాల మధ్య ఇంతటి తేడాకు కారణం తెలుసా? కుటుంబ వ్యవస్థనే దీనికి ప్రధాన కారణం. బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ విశ్వనాథం రెండు దేశాల మధ్య పొదుపు అలవాట్లపై అద్భుతమైన ప్రసంగాలు చేశారు.
మనది కుటుంబ ప్రధానమైన దేశం. అమెరికాలో వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువ కుటుంబం ప్రాధాన్యత చాలా తక్కువ. ఎవరికి వారు స్వతంత్రంగా జీవిస్తారు. మనల్ని కుటుంబం కట్టిపారేస్తుంది.
కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు కుటుంబం కోసం వ్యక్తి సంపాదిస్తాడు. కుటుంబ సభ్యులకు రేపటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపునకు ప్రాధాన్యత ఇస్తాడు. అమెరికా పౌరుడు రిటైర్ కాగానే అతని పోషణ బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వమే తగిన పెన్షన్ ఇస్తుంది. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పెన్షన్ సౌకర్యం ఉంటుంది. దాదాపు 95శాతం మంది ప్రజల వృద్ధ్యాంలో తమ అవసరాల కోసం తామే జాగ్రత్త వహించాలి. పిల్లల చదువుకు వ్యయం ఎక్కువ. ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేపటి కోసం పొదుపు చేయడం మనకు అనివార్యం. అమెరికాలో పొదుపు లేదు, అసలు కుటుంబమే లేదు. వృద్ధాప్యంలో ప్రభుత్వమే చూసుకుంటుంది కాబట్టి పొదుపు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కో వ్యక్తి పది పనె్నండు క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం ఆ దేశంలో చాలా కామన్. అమెరికా ప్రభుత్వం, వ్యక్తులు, కంపెనీలు అన్నీ తమ సంపదను మించి మూడు రెట్ల వరకు అప్పుల్లో కూరుకుపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మన పొదుపే మనల్ని రక్షిస్తోంది. చైనా, జపాన్, ఇండియా వంటి ఆసియా దిగ్గజ దేశాల్లో పొదుపు శాతం ఎక్కువ. ఒక అంచనా ప్రకారం 30 శాతం పొదుపు రేటు మరే దేశంలోనూ లేదు.
ఇండియాలో మరీ పొదుపు శాతం ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించడానికి ఏం చేయవచ్చు అని అమెరికాలో పలు కార్పొరేట్ కంపెనీలు సదస్సులు నిర్వహించాయి. ఒక సదస్సుకు బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ విశ్వనాథం కూడా హాజరయ్యారు. ఇండియాలోని పరిస్థితులు, అమెరికా పరిస్థితులకు ఏ మాత్రం సంబంధం లేదు, పొదుపును తగ్గించలేరని విశ్వనాథం ఆ సదస్సులో తన అభిప్రాయం వెల్లడించారు.
అనుభవించు రాజా అంటూ సాగే ప్రచారం దీనిలో భాగమే. ఒకటే జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఉన్నప్పుడే అనుభవించాలి అని పలు కంపెనీలు సాగించే ప్రచారం ఉద్దేశం ఇదే. నవ తరంపై ఈ ప్రభావం కొంత పడినా, సత్యం కంప్యూటర్ దెబ్బ, ఆ తరువాత ఆర్థిక మాంద్యంతో పలు ఐటి కంపెనీల ఆర్థిక పరిస్థితి తలక్రిందులు కావడం వంటి సంఘటనలతో మన దేశంలో పొదుపు తిరిగి పట్టాలెక్కింది.
సత్యం కంప్యూటర్ కుంభకోణం బయటపడినప్పుడు ఐటి ఉద్యోగుల ఆలోచనలు వేరుగా ఉండేవి. ఇదే శాశ్వతం అనే ధోరణితో ఉండేవి. కుంభకోణం బయటపడగానే అప్పటి వరకు కుదిరిన పెళ్లి సంబంధాలు కూడా విచ్ఛిన్నం అయ్యాయి. ఐటి ఉద్యోగం అంటే శాశ్వతం ఏమీ కాదని తెలిసి వచ్చింది. ఒక్క ఐటి ఉద్యోగమే కాదు ఈ కాలంలో ఏ ఉద్యోగం శాశ్వతం కాదు. ఎదగడానికి ఎంతగా అవకాశం ఉందో కంపెనీ మూత పడేందుకు అంతే అవకాశం ఉంది. ఈ అవగాహనకు వచ్చిన తరువాత పాత మంత్రం పొదుపును ఆశ్రయించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇఎంఐలపై కారు, లగ్జరీ జీవితం వంటి వాటికి అలవాటు పడిన ఐటి యువతలో సైతం సత్యం ఉదంతం తరువాత చాలా మార్పు వచ్చింది.
30 శాతం పొదుపు చేస్తే వీటిలో 60 శాతం నిధులు బ్యాంకులు, పోస్ట్ఫాసులు, పిపిఎఫ్‌లలో డిపాజిట్లు చేస్తున్నారట! స్టాక్ మార్కెట్‌లోకి ఈ పొదుపులో కేవలం రెండు శాతం నిధులు మాత్రమే వెళుతున్నాయి.
పన్ను ఆదా వల్ల మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఈ రోజు మనం చేసిన పొదుపే రేపు మనకు రక్షణ కవచంగా నిలబడుంది.
ఎంత సంపాదిస్తున్నావు అనేది ముఖ్యం కాదు. సంపాదించిన దానిలో ఎంత పొదుపు చేస్తున్నావు అనేదే ముఖ్యం. ఆ పొదుపే కొంత కాలానికి జీతాన్ని మించిన ఆదాయం తెచ్చి పెడుతుంది. ఆర్థిక క్రమ శిక్షణ లేని జీవితం ప్రమాదంలో పడేస్తుంది. మీ పొదుపు శక్తే వాస్తవమైన మీ ఆర్థిక శక్తి. కుటుంబాన్నయినా, దేశాన్నయినా బలంగా నిలిపేది పొదుపు మంత్రమే. ఈ మంత్రం మీ జీవితంలో ఎలా ఆచరిస్తున్నారో లెక్క చూసుకోండి. రేపటి జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నేటి పొదుపు శాతం బాగుండాలి.

అదే తరహా చిత్రీకరణ!

$
0
0

మాఫియా చిత్రాలు తీయడంలో సిద్ధహస్తుడు- ఆర్జీవీ. ‘శివ’ తర్వాత నాగార్జున, ఆర్జీవీ కలయికలో వచ్చిన ‘ఆఫీసర్’లో సవాలక్షసార్లు చూసేసిన అదే తరహా చిత్రీకరణ, అవే మాఫియాలు, అదే సౌండ్ ఎఫెక్ట్ అవే కెమేరా యాంగిల్స్. అస్సలు కొత్తదనం లేదు. కథ లైన్ కాస్త కొత్తగా అనిపించినా కథాకథనాల్లో పెప్ లేదు. దాంతో ఆఫీసర్ చతికిలపడ్డాడు. సినిమా తీసేముందే ‘చెప్పింది చెయ్యకపోతే నన్ను తన్నవచ్చు’అని ఆర్జీవీ తనకు లేఖ రాశాడని నాగార్జున చెప్పాడు. అయితే లైన్ చెప్పినంత కొత్తగా సినిమా తీయలేకపోయిన ఆర్జీవీని ఎన్ని తన్నులు తన్నినా ఫర్వాలేదన్నమాట! అయితే ఎన్నిసార్లు తన్నినా వర్మ మారడు అనేది నిజం!
- ధర్మతేజ, గొడారిగుంట
ఆదర్శప్రాయుడు
‘సమ్మోహనం’ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ప్రఖ్యాత రచయితలైన తన తల్లిదండ్రుల సంస్కారాన్ని పుణికి పుచ్చుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో అతని అభిప్రాయాలు- ఒక చిన్న డిజిటల్ కెమేరాతో ఆరున్నర లక్షల ఖర్చుతో 19రోజుల్లో ఆయన తీసిన తొలి చిత్రం ‘గ్రహణం’ 12 అవార్డులు సాధించింది. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం తనవే. రెండు తప్ప అన్ని చిత్రాల్లో తెలుగు నటీనటుల్నే తీసుకున్నాడు. సినిమాలు ఆరోగ్యవంతంగా, అర్థవంతంగా ఉండాలంటాడు. ఐటెం సాంగ్స్, సెక్స్, హింసల్ని ప్రేక్షకులు అడగకపోయినా నిర్మాతలే అలవాటు చేశారు. నా చిత్రంలో అలాంటివి ఉండవు. స్టార్లకు భజన చేసే చిత్రాలు తియ్యను అన్నాడు. నిజంగా ఆయన ఆదర్శప్రాయుడు.
- శాంతి సమీర, వాకలపూడి
బయోపిక్‌లు..
హీరోవర్షిప్ అనే కళ్లద్దాలు ధరిస్తే చాలు నిజజీవితంలో హీరో ఎంత నికృష్టుడైనా, ఎన్ని అరాచకాలుచేసినా అవన్నీ తెరమరుగు అయిపోయి, మంచితనం చిగురంత ఉంటే కొండంత కనిపిస్తుంది. ఈ సూత్రాన్ని బాగా అర్ధంచేసుకొని బయోపిక్‌లు నిర్మిస్తున్నారు. గతంలో అజరుద్దీన్ చిత్రం అయినా ఇప్పుడు సంజు చిత్రం అయినా ఇదే సూత్రం. ఈ సూత్రానికి మినహాయింపుగా మహానటి లాంటి ఒకటిరెండు బయోపిక్‌లు కనిపిస్తాయి. సంజయ్‌దత్‌లోని వికృత మనస్తత్వానికి మసిపూసి కనిపించకుండా చేసి ప్రేక్షక హృదయ రంజిక అంశాలకు నగిషీలు చెక్కిన ఫలితంగా సంజు చిత్రం ఇప్పటికే 200 కోట్లు దాటేసింది.
- పవన్‌పుత్ర, రామారావుపేట
చాలా బాగుంది..
‘క్లైమాక్సా? మజాకా?’ వ్యాసం చాలా బాగుంది. నేటి ప్రేక్షకుడికి విషాదాంతాలు నచ్చవు గాని దశాబ్దల క్రితం దేవదాసు పార్వతి, లైలామజ్ను, అనార్కలి సలీం ప్రేమకథలన్నీ విషాదాంతాలే. హిందీ అనార్కలికి రీమేక్ తెలుగు అనార్కలి రెండింటిలోనూ అనార్కలిని సజీవంగా గోరి కడితే సలీం ఆ గోరీకి తలబాదుకొని పడిపోతాడు. కాని భారీ బడ్జెట్ భారీ హిట్ మొఘల్-ఎ-అజాం కూడా అనార్కలి కథే. అయితే ఆమెను సజీవంగా గోరీ కడితే రహస్యమార్గం గుండా బయటకుపోతుంది. ఇదంతా అక్బర్ పన్నాగం అని చెప్పి అక్బర్‌కి గొప్పదనం ఆపాదించాడు దర్శకుడు ఆసిఫ్. అయితే చరిత్ర చూస్తే అనార్కలి అనే అమ్మాయి లేనే లేదు. కల్పిత పాత్ర అది.
- సుభాష్, శ్రీనగర్
సంచలనం కోసం..
సంచలనం కోసం ఔచిత్యాన్ని బలిచేస్తున్నా యి కొన్ని ఛానల్స్. కపిల్‌దేవ్ కొంపముంచిన ఎన్టీఆర్, వచ్చే ఏడు సమంత రిటైర్ అంటూ సంచలన శీర్షికలు ఫ్లాష్ చేసింది ఒక చానల్. అసలు విషయం ఏమంటే ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం హిందీ రీమేక్‌లో రణ్‌వీర్ నటిస్తున్నాడు. అతడే కపిల్‌దేవ్ బయోపిక్‌లోనూ హీరో. టెంపర్ హిందీ ముందుగా ప్రారంభం అవడంతో కపిల్ చిత్రాన్ని ఒక సంవత్సరం వెనక్కి నెట్టేశాడు నిర్మాత. దీనిలో ఎన్టీఆర్ ప్రమేయం ఏముం ది? అలాగే సమంత రిటైర్ కానుందా అంటూ కాస్సే పు సొల్లుకొట్టి అలాంటిదేమీలేదని అక్కినేని కాం పౌండ్ చెప్పిందంటూ తుస్సుమనిపించిందా చానలే!
- సౌందర్య, కాకినాడ
చిరస్మరణీయం
అక్కినేని దేవదాసు ఆంధ్రులకు చిరస్మరణీయం. అయితే ఆ చిత్రాన్ని ఈతరం ప్రేక్షకులు ఇప్పుడు చూస్తే కొన్ని సన్నివేశాలు హృదయాల్ని కదిలించినా మొత్తంగా చూస్తే బోర్‌కొడుతుంది. దేవదాసు ప్రేరణతో ఎన్నో తాగుబోతు సినిమాలొచ్చినా అవేవీ పెద్దగా హిట్ కాలేదు. అంతెందుకు? సాక్షాత్తు అక్కినేనితోనే దాసరి నారాయణరావు ‘దేవదాసు మళ్లీ పుట్టాడు’ అంటే ఎవరూ చూడలేదు. కృష్ణ దేవదాసుగా ఎంత శ్రమించినా ప్రేక్షకులు కరుణించలేదు. దేవదాసు పేరుని సొమ్ముచేసుకోడానికి చేసిన ప్రయత్నాలు హిట్‌కాకపోయినా ఇప్పుడు నాగార్జున, నానిలతో దేవదాసు పేరుతో మరో చిత్రం నిర్మాణంలో ఉంది. ఇది దేవ, దాసు అనే ఇద్దరి కథ అట! చెట్టుపేరుచెప్పి కాయలు అమ్ముకోవడం అంటే ఇదే.
- ధర్మతేజ, గొడారిగుంట
మంచి చర్చ
ఈమధ్య వెనె్నలలో మాటల అర్ధాల గురించి మంచి చర్చ జరిగింది. ఇప్పుడు నీలం అనే పదం గురించి నా అభిప్రాయం చెప్తాను. రాముడు, కృష్ణుడు పాత్రలకు నీలం రంగు పూసెయ్యడం సరికాదు. దేవతలు మనుషులకు నీలం సహజ వర్ణంకాదు. నిఘంటువు ప్రకారం నీలం అనే పదానికి నలుపు అనే అర్ధంకూడా ఉంది. కృష్ణుని నల్లనయ్య అంటాం. అందువల్ల రాముడు, కృష్ణుడు పాత్రలకు మరీ బొగ్గులాగ కాకుండా తేలికపాటి నల్లరంగు వేయడం సహజం అవుతుంది. నీలం రంగు చూడ్డానికి అలవాటుపడ్డ ప్రేక్షకులు నలుపురంగుని ఆమోదించకపోవచ్చు కాని కొన్ని హిందీ చిత్రాల్లో, టీవి సీరియల్స్‌లో నీలంకాక సహజ వర్ణంలో కృష్ణుని చూపితే ప్రేక్షకులు ఆమోదించారు మరి!
- సాహిత్యదీప్తి,
రమణయ్యపేట

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>