Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

గుర్తింపు( సండేగీత)

$
0
0

మనిషికి గుర్తింపు అతను బ్రతికి ఉన్నప్పుడు వస్తే బాగుంటుంది. ఒక మనిషి గురించి నాలుగు మంచి మాటలు అతను బ్రతికి ఉన్నప్పుడు చెబితే బాగుంటుంది.
కానీ చాలాసార్లు అలా జరగదు.
మనిషి చనిపోయిన తరువాత అతని గురించి ఓ నాలుగు మంచి మాటలు చెబుతారు.
అతను ఏ కళాకారుడో, రచయితో అయితే అతని గురించి నాలుగు వ్యాసాలు పత్రికల్లో కన్పిస్తాయి.
చనిపోవడం అనేది ఓ సందర్భం కావొచ్చు.
చనిపోయిన తరువాత అతని గురించి ఓ నాలుగు మంచి మాటలు చెప్పడం, నాలుగు వ్యాసాలు రాయడం అవసరమే.
కానీ అతను బతికి ఉన్నప్పుడు ఇంకా చాలా అవసరం. బతికి వున్నప్పుడు చెప్పిన నాలుగు మంచి మాటలు అతనికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. తన ప్రయాసలో తాను వైఫల్యం చెందలేదని అతను భావిస్తాడు. ఇంకా కొంత బాగా పని చేయడానికి ఉద్యుక్తుడవుతాడు. ఉత్సాహపడతాడు.
యుద్ధంలో చనిపోయిన సైనికుడికి చనిపోయిన తరువాత గుర్తింపు వస్తుంది.
కానీ కళాకారుడికి, రచయితకి అలా జరుగకూడదు. అతను బ్రతికి వున్నప్పుడే గుర్తింపు రావాలి.
ఆ మాటకొస్తే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో విజయం సాధించాలని, గుర్తింపు రావాలని కోరుకుంటాడు. అప్పుడు రాకపోయినా ఫర్వాలేదు.
విషాదం ఏమంటే...
ఈ భూమీద మన పాదముద్ర వేయకుండా చనిపోవడం.
మన ఆలోచన ప్రభావం ఈ సమాజం మీద లేకపోవడం.
ఈ విషాదానికి జవాబు ఉంది.
మనకు ప్రావీణ్యం ఉన్న విషయంలో, రంగంలో కృషి చేయడం.
అది కూడా మన పూర్తి శక్తిసామర్థ్యాలను ఉపయోగించి కృషి చేయడం.


నిర్విషీకరణ

$
0
0

మన ప్రమేయం లేకుండానే మనల్ని మిత్రులు మనల్ని చాలా వాట్సప్ గ్రూపుల్లో చేరుస్తూ ఉంటారు. మనల్ని ఆ గ్రూపులో చేర్చిన వ్యక్తుల మీద గౌరవం కొద్దో లేక ఆ గ్రూపులో వస్తున్న సమాచారాన్ని ఆకర్షించో, చర్చలను చూసో చాలామంది ఆ గ్రూపుల్లో కొనసాగుతూ వుంటారు.
కమ్యూనిటీ లివింగ్‌లో వుంటున్నప్పుడు ఆ కమ్యూనిటీ విషయాలు తెలుసుకోవడం కోసం గ్రూపులో వుండటం అవసరమై పోతుంది. ప్రతి గ్రూపునకు ఓ లక్ష్యం ఉంటుంది. ఓ నేపథ్యం ఉంటుంది. కానీ చాలా మంది మిత్రులు ఆ గ్రూపునకు విరుద్ధమైన వీడియోలను, ఫొటోలను పంపించి చీకాకు కలిగిస్తూ వుంటారు.
వాట్సప్ అనేది ఈ యాంత్రిక యుగంలో ఓ ఆవశ్యకతగా మారిపోయింది. చాలామంది ఈ వాట్సప్‌లకి బానిసలుగా తయారవుతున్నారు. అనుక్షణం మెసేజీలను చూసుకోవడం, మెసేజీలను పంపించడం ఓ వ్యసనంగా మారిపోయింది. చాలామందికి ఇది ఓ నిషా లాగా మారిపోయింది. ఈ నిషాకి కూడా నిర్వీషీకరణ (జూళఆ్యనజచిజష్ఘఆజ్యశ) అవసరం అవుతుంది.
మిత్రులు నన్ను నా ప్రమేయం లేకుండా చాలా గ్రూపుల్లో చేర్చారు. ఏదో ఒక కారణంతో ఆ గ్రూపుల్లో నేను కొనసాగుతున్నాను. ఓ గ్రూపులో వున్న స్నేహితురాలు ఈ మధ్య ఓ మెసేజీని పంపించింది. దాని సారాంశం ఇది - ‘నా స్క్రీన్ టైంని తగ్గించడం కోసం ఈ గ్రూపు నుంచి వైదొలగుతున్నాను. ఇది డిజిటల్ నిర్విషీకరణ మాత్రమే మరేమీ కాదు.’
ఈ నిషా నుంచి కూడా నిర్విషీకరణ అవసరం అవుతుంది. చాలా మంది స్క్రీన్‌కి బానిసలవుతున్నారు. మామూలుగా వుండలేక పోతున్నారు. మా స్నేహితురాలు వాడిన నిర్విషీకరణ అన్న పదబంధం నన్ను బాగా ఆకర్షించింది. డ్రగ్స్, మందుకి అలవాటు అయిన వ్యక్తులకి నిర్విషీకరణ కేంద్రాలు వున్నాయి.
స్క్రీన్ నిర్విషీకరణకి
వాట్సప్‌ల నిర్విషీకరణలకి కూడా ఇలాంటి కేంద్రాలు అవసరమా?
మా స్నేహితురాలి మాదిరిగా మనం వీటికి దూరంగా ఉండలేమా?
మనలని మనం నియంత్రించుకోలేమా?
ఈ వాట్సప్‌ల ప్రపంచంలో ఇది మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న.
చివరగా ఓ మాట -
మొన్నీ మధ్య
నా మొబైల్ ఫోన్ క్రింద పడి రెండు రోజులు వాట్సప్‌ల ప్రపంచానికి దూరం అయ్యాను.
హాయిగా అన్పించింది.
నా ప్రపంచం ఏమీ ఆగలేదు.
అప్పటి నుంచి డేటాని చాలాసార్లు ఆఫ్ చేసి ఆనందిస్తున్నాను.
మా మిత్రురాలి మాదిరిగా నిర్విషీకరణ దిశకు ఇంకా మరలలేదు.

సీత దగ్గర రాక్షస స్ర్తిలను కాపలా పెట్టిన రావణుడు( అరణ్యకాండ)

$
0
0

ఇంకా ఇలా కొనసాగించింది సీత.
‘నీచబుద్ధికల రాక్షసా! రామచంద్రమూర్తి కోపంతో మండుతున్న కళ్లను చూసినంత మాత్రానే, ఆ నిమిషంలో కాలి నేలపడవా? కుక్కను కొట్టడానికి బచ్చెనకోల కావాల్నా? అలాగే, నిన్ను చంపడానికి బాణ ప్రయోగం అవసరమా? నీ పరాక్రమం గురించి నువ్వు చెప్పిన మాటలు డంభవాక్యాలు. వాస్తవం చెప్తా విను. రామచంద్రమూర్తికి కోపం వస్తే, చంద్రుడినైనా నేలపడవేస్తాడు. రూపం కనబడకుండా భుజబలంతో చేయగలడు. అలాంటి అసమాన బలసంపన్నుడు ఈ తుచ్ఛ సముద్రాన్ని దాటి వచ్చి, తన మీద అనురాగం వున్న తన ఇల్లాలిని చెర నుండి విడిపించలేడని అనుకుంటున్నావా? రాక్షసా! అవశ్యం విడిపిస్తాడు. నీ ఐశ్వర్యం, నీ గృహాలు, లంక నీవింకా వుందని నన్ను ఆశ పెట్తున్నావు. ఎప్పుడైతే నువ్వు పరస్ర్తిని కామ దృష్టితో స్పృశించావో అప్పుడే నీ సంపద నాశనమై పోయింది. ఆయుష్షు, ఇంద్రియ బలం, దేహబలం, సర్వం నాశనమైనదని భావించు. నీ కారణాన లంకాపురం పతిలేనిదై పోయింది. అక్కడి స్ర్తిలు విధవలై పోయారు. ఇంతమాత్రానికా ఈ పొగరు? వినాశకాలం సమీపించినా పొగరు వల్ల తెలుసుకోలేక పోతున్నావు. ఎంత మూర్ఖుడివిరా?’
‘అల్ప బలం కల నన్ను నా భర్త దగ్గర నుండి విడతీసినందున పాపాత్ముడా, నీ పాపం నీకు కొంచెం సుఖం కూడా ఇవ్వదు. చూస్తుండు. నా మగడికి దేహబలమే కాదు.. దైవబలం కూడా వుంది. కాబట్టి ఆయన అమితమైన తేజస్సు కలవాడు. నీకు దైవబలం లేదు. కాబట్టి నీకు తేజస్సు లేదు. నువ్వు చెప్పిన దేబె, జోగి నువ్వే కానీ రామచంద్రుడు కాదు. ఆయన ధర్మయుక్తమైన నడవడి కలవాడు. మంచి మనస్సు కలవాడు. భయం అంటే ఏమిటో తెలియనివాడు. అసమానమైన శౌర్యంలో ఆయన్ను మించినవారు లేరు. భయంకర మృగాలున్న అడవిలో ఉన్నాడాయన. నీ బలాన్ని, నీ గర్వాన్ని బాణాల వర్షంతో కక్కిస్తాడు. మృత్యువు సమీపించిన వాళ్లు కాలమహిమ వల్ల వాళ్లు చేయాల్సిన పనులు కాకుండా చేయకూడని చెడు పనులను అవే మంచివనుకుని చేస్తారు. ఆ విధంగా నాశనమై పోయే కాలం నీకూ, నీ రాక్షస మూకకు, నిన్ను కట్టుకున్న స్ర్తిలకు, నువ్వు నన్ను బలవంతంగా తేవడం వల్ల ఏకకాలంలో కలిగింది.’
‘యజ్ఞశాల మధ్యలో వున్నా ఉపకరణాల పాత్రను, వేద మంత్రాలతో పవిత్రంగా వుంచాల్సిన దాన్ని ఎవరైనా తాక వశమా? అలాగే పతివ్రతనైన నేను కూడా పవిత్రమైన వేదినే. ధర్మం విడనాడని దశరథరాజు కుమారుడి భార్యనైన, పతివ్రతనైన నన్ను రాక్షసాధముడా, పాపాత్ముడా, దుష్ట చరితుడా, మూర్ఖుడా, నీకు తాక సాధ్యమా? ఓరీ! నీ వల్ల నేను చెడిపోను. నాకా భయం లేదు. నా భర్త ఇక్కడికి ఎలాగూ వస్తాడు. నిన్ను ఎలాగూ చంపుతాడు. లంకా నాశనం కాక తప్పదు. ఇది నిశ్చయం. నీకు నేను భయపడను. వశపడను. నన్నిప్పుడే చంపుతానంటావా? ఈ దేహం జడ పదార్థం. దీన్ని కట్టేస్తావా? కానివ్వు. తింటావా? తిను. దానివల్ల నాకేం నష్టం లేదు. ఈ శరీరం నేను రక్షించవలసిన అవసరం నాకు లేదు. వున్నా, పోయినా ఒకటే. నా శరీరం చెడ్డా, నేను చెడిపోను. నా మనస్సు చెడితే నేను చెడిపోయినట్లు. నా మనస్సు నా స్వాధీనంలో వుంది. దాన్ని నువ్వేం చేయలేవు’ ఇలా అని ఊరుకుంది సీతాదేవి. కఠినంగా మాట్లాడి, కోపంతో ఏమీ మాట్లాడకుండా సీతాదేవి వుండిపోవడంతో, రావణుడు ఆమెకు భయం కలిగే విధంగా మండిపడుతూ ఇలా అన్నాడు.
‘ఓసీ నవ్వు ముఖందానా! సీతా, విను. ఇక్కడ నుండి పనె్నండు నెలల్లో నువ్వు నా మీద విశ్వాసం కలిగి, ప్రేమగా నన్ను కామించకపోతే, ఆ గడువు ముగుస్తుండగానే, నా ఉదయం భోజనానికి, నా వంటవాళ్లు నిన్ను ముక్కలుగా కోసి వండుతారు’ అని చెప్పి, ఆమెకు కాపలాగా వున్న రాక్షస స్ర్తిలను చూసి తన కోపం తగ్గిపోయే విధంగా సీతాదేవి కొవ్వు తీసేయండని చెప్తాడు.
(సీతాపహరణం జ్యేష్ఠ మాసంలో జరిగింది. రామ రావణ యుద్ధం ఫాల్గుణ మాసంలో, కృష్ణ పక్షంలో జరిగింది. హనుమంతుడు సీతాదేవిని సందర్శించింది ఫాల్గుణ మాసారంభంలో. అప్పటికి పది నెలల గడువు అయింది)
రావణుడి మాటలకి రాక్షస స్ర్తిలు అంగీకార సూచనగా నమస్కరించారు. అప్పుడు రావణుడు నేలను గట్టిగా తన్నుకుంటూ, సీతను అశోకవనానికి తీసుకు పొమ్మంటాడు. అక్కడ ఆమెను వుంచి ఎల్లప్పుడూ విడువకుండా ఆమె చేష్టలను మిక్కిలి రహస్యంగా గమనించమని చెప్తాడు. ‘్భయంకర చూపులు కలవారా.. వికార రూపాలు కలవారా.. మాంసం, నెత్తురు ఆహారంగా కలవారా.. ఈ సీతను మంచి మాటలతో కానీ, బెదిరించి కానీ, మచ్చిక చేసుకుని నాకు స్వాధీనం చేయండి’ అని అంటూ రావణుడు అక్కడి నుండి పోతాడు. ఆ తరువాత రాక్షస స్ర్తిలు సీతాదేవిని అశోక వనానికి తీసుకుని పోయారు. ఇక అప్పటి నుండి సీత రాకాసుల గుంపుల వశంలో వుండిపోయింది. కట్టివేయబడిన ఆడ జింకలాగా అయిందామె పని. భయం కలిగించే పెద్ద కళ్ల రాక్షస స్ర్తిలు భయపెడుతుంటే, తన ప్రియుడు, శ్రీకరుడు, దైవం అయిన మగాడిని సర్వదా ధ్యానించసాగింది.

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690 -సశేషం

‘బఫే డిన్నర్’ లాంటిది ‘వీక్లీ’

$
0
0

నాటి పాఠకుడు మృష్టాన్న ప్రియుడు!
1962 సెప్టెంబర్ ఏడు వీక్లీ సంచిక ‘హమేషా తమాషా’ శీర్షికలోని ఒక జోకు: ఇది నాకు ఇష్టం... ఇక వీక్లీని ప్రేమించడం మొదలుపెట్టాను...
ప్రశ్న: లట్టూ! ఒరేయ్! ఇది చెప్పరా?! మీ అమ్మ మాట మీ నాన్న వింటాడా? లేక మీ నాన్న మాట మీ అమ్మ వింటుందా?
జవాబు: ఇద్దరి మాటా వీధిలో వాళ్లు వింటారు!...
రామచంద్రాపురం నుంచి ఐ.పి.పి.లీల అనే పఠిత పంపిన జోకు (వాస్తవం) ఇది.
ఆ రోజు నా దగ్గరికి వచ్చిన కార్టూనిస్ట్‌కి చెప్పాను. ఈ జోక్ మీద ఓ ‘సిరీస్ ఆఫ్ కార్టూన్లు’ వేయొచ్చునోయ్’ అన్నాను.
కొంటె కోణంలోంచి చూస్తే ఈ జీవితం ఒక హమేషా - తమాషా.. యస్.ఆర్.గారు అంటే మా ఆఫీసులో బాస్ రాధాకృష్ణగారు. ఆయనకీ ఈ శీర్షిక ఇష్టం. మేం ఇద్దరం కూర్చొని మా ప్రయివేటు ‘చిక్కులు’ (ప్రాబ్లమ్స్) మరిచిపోయేటందుకు కొన్ని తమాషాలు రాసేవాళ్లం. వాటిలో ఈ క్రిందిది ఒకటి.
కథా పరిభాషాకోశం: నగ్న సత్యం అందరికీ కనపడేది; విషాద గాథ: విసుగు పుట్టించే కథ; రోదించింది: ఏడిచింది; ఆరాధన: పిచ్చి; హృదయంలో స్థానం: వైద్య శాస్తవ్రేత్తలు ఇంకా కనిపెట్టని రహస్యం; కళాపిపాసి: సినిమా పోస్టర్లు చూచేవాడు; విచలిత: చలి బాగా వీస్తున్నప్పుడు కప్పుకోలేని స్థితిలో వున్న వనిత. (ఇది మా నిఘంటు పరిశోధన) అంటూ సరదాగా ఇలా రాసేవాళ్లం. డైలీలో వున్న పెద్దలు హారిత శివశర్మ (సాంబశివరావు) కౌండిన్య (పి.ఎస్.ప్రకాశరావు), విశాల నేత్రాలు (గణపతిశాస్ర్తీ) పేజీలు నింపడం అన్న సమస్యని చాలా పరిష్కరించారు. 1.హరివంశం 2.హైదరాబాద్ లేఖ 3.విశాల నేత్రాలు (కాశ్మీర్ జానపదాలు) ఈ కార్టూనిస్టులంతా గణపతి బప్పా అంటే బొజ్జయ్య మీద జోకు బొమ్మలు మొదలెట్టారు. అన్యాపదేశంగా విఘ్నపతిని అడ్డం పెట్టుకుని లోకం పోకడని వేళాకోళం చేయాలి అన్న మా అదర్శం కొంచెం దెబ్బతింది. అయితే దీన్ని సవరించాం అనుకోండి ఆనక. ఎంతైనా హిందువులు విశాల హృదయం గలవాళ్లు కదా!
ఆంధ్రపత్రిక వీక్లీకి ప్రకటనల తాకిడి చాలా ఎక్కువగా ఉండేది. కొన్ని యాడ్స్ తిరస్కరించే స్థితికి చేరుకున్నాం. ఎందుకంటే మొత్తం ఇరవై నాలుగు పుటలలో ముప్పావు సంచిక కన్నా పత్రికలు ఎక్కువ ‘కారాదు’ అన్న ఆంక్ష ఉండేది. 28 పేజీల దాకా ఎలాగో ఎక్కించేసే వాళ్లం. పేజీలలో ప్రకటనల మీద ‘గ్యాప్’ వస్తే అక్కడ గొప్పగా ‘తెలుగు పత్రికలన్నింటిలో ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక సర్క్యులేషన్ అధికమైనది’ అని ఒక ‘స్ట్రిప్’ పెట్టేవాణ్ణి. అది నాకు గొప్ప! కాని అప్పుడే నా కర్మకాలి న్యూస్‌ప్రింట్‌కి కొరత మొదలయింది.
మా యస్.ఆర్.గారు డైరెక్టర్ హోదాలో ‘న్యూస్‌ప్రింట్ కొరత’ మీద గమనికలు, విజ్ఞప్తులు రాసేస్తూ ఉండేవాడు.
‘మీరు చందాలు కట్టండి. లూజ్ సేల్స్‌కి చాలానన్ని ప్రతులు వెయ్యలేమేమో?’ అంటూ ఆర్తనాదాలు చేసేవాడు. కానీ, పాఠకులు వీక్లీ కోసం నిరీక్షించి కిళ్లీ కొట్లోనే కొనుక్కొనడానికి మొగ్గు చూపేవారు. కారణం పోస్టల్ డిపార్ట్‌మెంట్ వారికే తెలుసు...
అన్నట్టు వినాయకచవితి హాస్య సంచికయే కాదు. దసరా సంచికను స్ర్తిల ప్రత్యేక సంచికగా వేసేవాళ్లం. ఆనాడే, ‘అరవైలలోనే’ రాజకీయాలలో స్ర్తిల పాత్ర మీద వ్యాస పోటీ ‘నగదు బహుమతులతో’ పెట్టాము. ఆడది అంటే వంటింటి కుందేలు.. చాకలి పద్దులు రాసుకోగలిగితే చాలు.. అంతకన్నా చదువులెందుకు? అన్న యుగం నుండి బయటపడుతున్న దశలో ‘మన వీక్లీ’ స్ర్తి వికాసానికి దోహదించింది. ఈ మాట చరిత్ర అంగీకరిస్తుంది - ‘మీ వీక్లీ మొత్తం ఆడాళ్లకేగా! మళ్లీ ప్రత్యేక సంచికలు వేయడం ఏమిటి? అని అనే వాళ్లు కొందరు.
కానీ పత్రిక స్థాపనకి సంబంధించి ఇక్కడ ఒక చిన్న ప్రస్తావన చెయ్యాలనిపిస్తోంది. 1903లో అమృతాంజనం మందుల కంపెనీని స్థాపించారు. బోలెడు పైకం సంపాదించారు లేదా సేకరించారు. ఆంధ్రులకు మాత్రమే గాదు సకల జనుల తలనొప్పి నివారణ చేయడంతోపాటు, పంతులుగారు తెనుగు వాడి బుర్రలో ఆధునిక భావజాలాన్ని పెంచి పరిపోషించారు. ఆంధ్రపత్రిక స్థాపన ఒక చారిత్రక ఘట్టం.
డెబ్బై దశకంలో నేను డైలీ రిపోర్టర్‌గా ఉన్నప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టర్ రామకృష్ణ నన్ను ఉడికించడానికి ‘అమృతాంజనమ్ముతో తలనొప్పి ఇచ్చి అంటూ మేలమాడేవాడు. దానికి సమాధానంగా మన తలనొప్పి తగ్గించటమే కాదు ‘నాటి’ జనాలకి బుర్ర, బుర్రలోని వికాసము కూడా ‘పత్రిక’యే ఇచ్చింది అనేవాణ్ణి. ఆది నుంచి అదో వీక్‌నెస్ పత్రికని ఎవరేనా అంటే ఉడుక్కునేవాణ్ని. అది మద్రాసులో వున్నప్పుడు.. అమృతాంజనముతో సంపాదించిన పెట్టుబడితో కాశీనాథుని వారు 1908 వినాయక చవితి నాడు ఆంధ్రపత్రిక (వారపత్రిక)ని బొంబాయి (అప్పటి పేరు)లో ప్రారంభించారు. ఇట్లా వినాయక చవితి సెంటిమెంట్‌కి ప్రేరణ తిలక్ మహాశయుడే. మొదటి సంచిక ‘ప్రస్తావన’లో నాగేశ్వరరావు పంతులుగారు ఇలా రాశారు.
‘ఆంధ్రోద్యమానికి అవసరమైన అనేకానేక ఉద్యమాల్ని, అన్ని రకాల వస్తువుల్ని (ఈ మాట గమనించండి) స్వతంత్రమయిన, విమర్శనాత్మకం అయిన రీతిలో చర్చించుటకై ఈ పత్రికని స్థాపిస్తున్నాను.’
‘న్యూయార్క్ టైమ్స్’ మకుటం మీద ‘ఎవ్విరిథింగ్ దట్స్’ ఫిట్ టూ ప్రింట్’ అన్న ‘మాటో’ వున్నట్లుగా ఆంధ్రపత్రిక కూడా అన్ని రకాల ఇజాలకి, నిజాలకి, గాలులకీ, దుమారాలకీ ‘ట్రెండ్స్’కీ, నెలవు అయింది.
అది జీర్ణావస్థకి చేరుకున్నప్పుడు కూడా పత్రిక అన్ని ఉద్యమాలకి అద్దం పట్టాలనుకుంటూనే ‘కాలభైరవునికి’ నీరాజనం అయిపోయింది!
పత్రిక ప్రచురణ యొక్క ఆ చివరి దశలో ఉండటమే నాకు ఈ ‘స్మృతిలయలు’ రాయడానికి అవకాశం ఇచ్చింది. అంతేనా? చాలినంత ‘దుఃఖభారాన్ని’ కూడా ఇచ్చింది. మిగతా ‘డైలీ స్థాపన’, భారతి, ఉగాది ఆంధ్ర పత్రికలు వగైరాల ప్రస్తావనలు సందర్భోచితంగా చేస్తాను.
మళ్లీ 1961 నాటి వీక్లీకి వద్దాం. నాకు (మాకు) ముందు ఇదే వీక్లీలో నండూరి రామమోహనరావు, ముళ్లపూడి వెంకటరమణ ‘బాపూ’ల ‘హవా’ జేగీయమానంగా సాగిందంటారు. వాళ్లు కథలకి ‘బాపు’ బొమ్మలు వేయించారు. ఆ బొమ్మలను పేజీలో ఎలా వెయ్యాలి? అన్న సూచనలతో సహా బాపూ అండ లభించడంతో - కథలు రాసే రచయితలు ఆంధ్రపత్రిక వైపు బాగా ఆకర్షితులైనారు. అది వరకు రచయిత పేరు కంపోజ్ చేసి టెక్నికల్‌గా చెప్పాలంటే రెండు బార్డర్ రూల్స్ మధ్య పెట్టేవారు. కాని యస్.ఆర్.గారి ప్రమేయం వచ్చినాక, బాపు, రామమోహనరావు గారి ‘ఉపజ్ఞ’ వల్ల రచయిత పేరు ‘హైలెట్’ అవుతూ వచ్చింది.
ఈ హేమాహేమీలు ఎక్కడ కూర్చునేవారో? అలాగే పోలవరపు శ్రీరాములుగారు, వి.డి.ప్రసాద్ గారు పెద్దలు వగైరా ఎక్కడ ఉపనిష్టులై కార్యకలాపాల్ని సాగించారో? నేను ఎరుగను. కానీ ఇట్లా మాలాగ ప్లాట్‌ఫామ్ మీద వెయిటింగ్ హాలు ‘ముంగిట’ కూర్చోవడం చేసే వాళ్లా? అన్నది ప్రశ్న-
‘బాపు’కి కథలు తీసుకుని వెళ్లడం, తేవడం రమణగారి వంతు. కానీ వాళ్లు నిష్క్రమించాక బాపు దగ్గర నుంచి బొమ్మలు కథలు రావడానికి గొప్ప సమయం పట్టేసేది.. జాప్యం కూడా జరిగేది.
నేను కొత్త ఆర్టిస్టులకి ‘బ్రేక్’ ఇవ్వాల్సిందే ననుకున్నాను. ‘బాపు’గారు ‘బోర్న్ జీనియస్’ అన్న మాట నిజమే. నాకు తెల్సు. నా కథ (నేను క్యాంపస్‌లో ఉన్నాను. అప్పుడు) ‘ప్లాట్‌ఫామ్’కి బాపు బొమ్మ వేస్తూ, ఓ డబుల్ ‘స్ప్రెడ్’ వేశాడు. ఆ రోజుల్లో ‘కలర్స్’ లేవు. కేవలం నాలుగు నుంచి ఎనిమిది పుటలలోనే ‘కట్‌కలర్’లు వేయగలం! అదంతా ఆనక చెబుతా. నా కథకి బాపుగారు ఓ సూచన చేశాడు (రు). రెండు పేజీలను కలుపుతూ ఓ ‘స్ట్రిప్’ని ‘టెంట్’గా వేసేయమని సూచించాడుట! కథ ‘టైటిల్’ ఎలివేట్ అయిపోతుంది అట్లా...
కానీ నా వేళకి మొదట కథలు - యస్.ఆర్. గారి ఆమోదం పొందాక, బొమ్మలకి పోయి రావడం ఒక ‘యజ్ఞం’ అయిపోయేది. దీంతో నేను కథకు ‘లీడ్స్’ పెట్టడంతో టైటిల్ హైలైట్స్ ఇవ్వడం మొదలెట్టాను. ఏవో తంటాలు మరి.
ఇంగ్లీషు భాషలో నుంచి ‘మార్లిన్ మన్రో జీవిత కథ’- కింగ్ ఆఫ్ కింగ్స్ సినిమా నవల, టెంపుల్‌టన్ వండర్ సిటీస్, ప్రపంచ ప్రముఖులు.. ఇవన్నీ మేమే ట్రాన్స్‌లేట్ చేసుకోవాలి.
ఊమెన్ మహాశయుడు కార్టూన్లు వేసి, పెన్సిల్‌తో వాటికి ‘కాప్షన్స్’ ఇలా గొలికి పడేసి ఇచ్చేవాడు. అవి తెలుగులోకి రాసి దాన్ని డి.ఆర్. గారి చేత సిరాలో రాయించుకోవాలి. దీనికి తోడు ‘్ఢల్లీ లేఖ’ శ్రీకృష్ణ లెటర్ వచ్చేది. వారి ఇంగ్లీషు నారికేళ పాకంగా ఉండేది. అది ఆఖరి క్షణంలో అందేది. రాసుకోవాలి. వీలైతే ఓ బొమ్మ బ్లాకు చేయించి వెయ్యాలి - అది చాలా పాప్యులర్ శీర్షిక.
నాకు ముందున్న ఎస్.వెంకటేశ్వరరావు గారు తన బాధ్యతల్ని నాకు అప్పగిస్తూ ఇవన్నీ (ఈ కష్టాలు) ముందే విపులంగా చెప్పి మళ్లీ వెళ్లాడు, గనుక నేను సంసిద్ధుడైనాను.. కె.సుబ్బారావు నాకు ముందున్న మరో సబ్ ఎడిటర్.
పాపం! ‘కింగ్ ఆఫ్ కింగ్స్’తో ఎలాగో తంటాలు పడేవాడు. నాతో సుబ్బారావు నేను నీకన్నా ఇక్కడ ముందున్నా. ఐనా మీరు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరేమి? అనేవాడు. ‘్ఢల్లీ లేఖ చెయ్యి’ అనంగా ‘్ఫనిష్’. ‘బాబ్బాబూ వీరాజీ! నాకన్నా చిన్నవాడివి. హుషారుగా వున్నావు - చకచకా రాసేసుకుందూ. అదేదో అంటూ ‘లీడ్’ నాకిచ్చేవాడు.
అంటే - ఇంత ‘వంట ఇల్లు పని’ ఉంటుంది సుమా! అని చెప్పడం నా ఉద్దేశం. ‘పాప్యులారిటీ’ రెక్కలున్న కీర్తి గరుత్మంతుడి వీపు మీద ఎగరడం ‘వీక్లీ’ అనుకునేవాళ్లు - మా వి.వి.ఎన్. లాంటి వాళ్లు పేరు వస్తుందిగా నీకే వీరాజీ అనేవాడు బొమ్మకంటి (స్పోర్ట్స్) సుబ్బారావుగారు. ఏడ్వలేక నవ్వేసేవాణ్ని.... సహనమేరా! జీవితం...
నిజం చెప్పాలంటే ఎస్.ఆర్. గారు అనువాదాలు చేయడం అలవోకగా చేసేవాడు. ఆఫీస్‌లో ఉండేది రోజుకి రెండు మూడు గంటలే అయినా చాలా ‘వర్క్‌లోడ్’ సరదాగా భరించేవాడు. కానీ యజమాని కదా! ఒకవేళ ఆయన పప్పులో కాలువేసినా మనం కిమ్మనలేంగా. పైగా మధ్యలో వదిలేసేవారు. ఆదివారంనాడు కూడా సారు వచ్చేవాడు. అంటే నేను వెళ్లాలిగా. ఇద్దరంపైన ‘ప్రెస్’లోకి పోయి ప్రూఫ్ రీడర్స్ బల్ల మీద కూర్చొనేవాళ్లం. (వాళ్లకి ఆఫ్ కదా) ఫైనల్ ప్రూఫ్‌లు తీసుకుని చదివేవాడు సారు. (నాకు ప్రూప్‌రీడింగ్ చిరాకు)
సరే, వర్కర్స్ కరెక్ట్ చేసి మళ్లీ ‘గ్యాలీ’ ప్రూఫ్ ఇవ్వంగానే తాను దిద్దిన కాపీ దగ్గర పెట్టుకుని - దిద్దుతుండాలి. ‘క్యారీ - అవుట్’ అయినాయా? లేదా? అని చెక్ చేసేవాడు. మిగతా మిగిలిన తప్పులు? అట్లా. ఆదివారం కూడా నాన్నగారితో నాకు లంచ్ చేసే ఛాన్సు లేదన్నమాట!
దీనే్న తల అమ్ముకున్న బ్రతుకు అంటారు కాబోలు...
(ఇంకా బోలెడుంది)

ధినచర్య

$
0
0

కోడి కూసింది.. తెల్లవారింది..
తెల్లవారిందని కోడి కూసిందా..
కోడి కూసిందని తెల్లవారిందా..
ఇలాటివే సవాలక్ష యక్ష ప్రశ్నలు-
జవాబు దొరకని ప్రశ్నలతో
కాలయాపన జరుగుతోంది
వేకువలోకి మెలకువలోకి
రానీయని ఆవులింతలు-
బారెడు పొద్దెక్కింది
జాగో.. ఇంటి నుండి బాగో.. అంటూ
అధికారుల హెచ్చరికలు
మస్తిష్కంలో మొదలయ్యాయి
ఒళ్లు విరుచుకుంటూ.. కళ్లు నులుముకుంటూ
పళ్లు తోముకుందుకు పక్క దిగారు
వారి తొందరలో పరీక్షలు దగ్గరపడ్తున్న
విద్యార్థినీ విద్యార్థులు కనబడ్తున్నారు
సిలబస్ నెలాగైనా ఔపోసన పట్టాలని
రాబోయే పరీక్షలలో నెగ్గాలని
చేసే విశ్వ ప్రయత్నం కనపడ్తోంది
*

పెద్దల సాంగత్యము

$
0
0

చింతామణి నాగేశ రామచంద్రరావు అంటే ఎవరో మీకు ఎంతమందికి తెలుసు. నాకు అనుమానమే. కానీ ఆయనకు భారతరత్న ఇచ్చిన రోజునే సచిన్ తెండూల్కర్ అనే మరొక అబ్బాయి కూడా అదే గౌరవాన్ని అందజేశారు. సచిన్ గురించి తెలియని వారు బహుశా ఉండరు అని నా అనుమానం. ఈ దేశంలో సైన్సుకు గల గౌరవం అటువంటిది. సి.ఎన్.ఆర్.రావు నిజంగా గొప్ప రసాయన శాస్తవ్రేత్త. ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద పేరు ఉన్న మనిషి. ఆయన నిజంగా మంచివాడు గనుక ఒక కుర్రవాడు కూడా అదే బహుమానం జరుగుతున్న రోజున అతని సరసన నిలబడి అదే గౌరవాన్ని అందుకోవడానికి అంగీకరించారు. అది పెద్ద మనసున్నకు ఉదాహరణ. ఈ దేశంలో ముందు సినిమా, తరువాత క్రికెట్, ఆ తరువాత ఈ రెండూ కూడా కలగలసిన రాజకీయం తన ప్రజలకు మరొకటి తెలియదు అని నేను ముందు నుంచి నెత్తిన గొంతు పెట్టుకుని అరుస్తూనే ఉన్నాను. కళలు ఎవరికీ పట్టవు. సాహిత్యం అంతకన్నా అవసరం లేదు. సంగీతం అంటే ఏమిటో తెలియదు. ఈ ఏడుపు ఎందుకు కానీ సిఎన్‌ఆర్ రావు గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది అని చెప్పుకోవడానికి మనసు ఉవ్విళ్లూరుతున్నది.
ఆంధ్రప్రదేశ్ అకాడెమీ అని ఒక సంస్థ ఉండేది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆ సంస్థ ఆయా పేర్లతో కొనసాగుతూ ఉన్నట్లు లెక్క. వాళ్లు ఏమీ చేయటం లేదు అని నేను అనను. చేయగలిగింది చేస్తూనే ఉన్నారు. అయినా అది ప్రజలకు తెలియదు. సి.ఎన్.ఆర్. రావు ఒకప్పుడు ఈ సంస్థలో ఉపన్యాసం చేయడానికి హైదరాబాద్ వచ్చారు. మామూలుగానే నేను ఆ మీటింగులో అందరికన్నా ముందు వరుసలో హాజరయ్యాను. గొప్ప చెప్పుకోను గానీ నాటి నుంచి నేటి వరకు సైన్స్ అనగానే నాకు ఒళ్లు ఝల్లుమంటుంది. నోట్లో నాలుక ఉంది. గలగల మాట్లాడుతాను కనుక నన్ను మీటింగ్‌కే కాదు, తరువాత జరిగే విందుకు కూడా పిలిచేవరు. అదే పద్ధతిలో ఆర్.ఆర్. ల్యాబ్స్‌లో విందు జరిగింది. నేను అందులో పాల్గొన్నాను. బహుశా ఆనాడే అనుకుంటాను, బస్సులో వస్తుంటే ఎవరో నా జేబులో పర్సు కొట్టేశారు. ఇందులో ఉన్న వాళ్లంతా పెద్దవాళ్లు. వాళ్లకు కార్లు, రాకపోక సౌకర్యాలు ఉంటాయి. ఏమీ ఉండవు. నేను ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు వెళ్లినా అభిమానంగా నన్ను తిరుగుదారిలో దించేవారు. చీఫ్ సెక్రటరీగా ఉన్న రామారావుగారు, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భద్రిరాజు కృష్ణమూర్తి గారు, ప్రస్తుతం పారిశ్రామికవేత్తగా పేరు సంపాదించుకున్న డాక్టర్ ఎ.వి. రామారావుగారు లాంటి వారంతా మా ఇంటికి రావడం నాకు గుర్తుంది. అది పక్కనపెడితే ఆ రోజున విందులో నేను సి.ఎన్.ఆర్. రావు గారి పక్కన కూర్చుని కబుర్లు చెపుతూ భోజనం చేయడం బాగా గుర్తుంది. ఆయన గారి అల్లుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతను నాకు ఇంచుమించు మిత్రుడు. ఆ సంగతి తెలిసిన తరువాత రావు గారు నా మీద మరింత అభిమానం కనబరచారు. తరువాత ఒకటి రెండు సందర్భాలలో కూడా ఆయనను కలిసి మాట్లాడినట్టు గుర్తుంది. గొప్పవాళ్ల నుజాల మీద ఎక్కి ప్రపంచం చూడడం అంటే బహుశా ఇదేనేమో. మనకంటే చిన్నవాళ్లతో కలిసి తిరుగుతూ ఉంటే, సరదాగా ఉండవచ్చు కానీ అందులో మనకు నేర్చుకోవడానికి ఏమీ దొరకకపోవచ్చు. పెద్దలతో పాటు గడిపిన కాలంలో మనం కూడా కొంచెం పెద్దవాళ్లం అవుతాము. ఈ మాట నేను అనుభవంతో చెబుతున్నాను. ఇంట్లో గానీ, బయట ప్రపంచంలో గానీ నాకు పెద్దల మధ్య గడపటం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు, ఇష్టం. మి వి రామన్ సంస్థకు డైరెక్టర్‌గా చేసిన రామశేషన్, ప్రఖ్యాత అంతరిక్ష శాస్తవ్రేత్త జయంత్ నార్లీకర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మహేశ్ దయాళ్ ఇలా ఎన్ని పేర్లయినా చెప్పగలను. అందరితోనూ వ్యక్తిగత స్థాయిలో మైత్రి కుదిరింది అంటే నా మటుకు నాకు గొప్పగానే కనబడుతుంది. నేను సామాన్యుడిని. మాన్యులతో మెలగటం మరి గొప్ప కాదా.
ఉడిపి రామచంద్రరావు అన్న పేరు చెబితే కూడా మీకు చాలామందికి ఏమీ తోచకపోవచ్చు. ఆయనే యు.ఆర్.రావు గారు. మన దేశంలోని అంతరిక్ష పరిశోధన ప్రగతికి ఆయన ఆధారంగా చాలాకాలం నిలిచారు. ఆయన కూడా ఇలాగే ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయం అయ్యారు. ఆయన ఉపన్యాసం జరిగిన మరో రోజున రాఖీ పండుగ. చాలామందికి శ్రావణ పూర్ణిమ కేవలం రాఖీ పండుగగా మాత్రమే మిగులుతుంది. సాంప్రదాయ బ్రాహ్మణులకు మాత్రం ఆ రోజు ఉపాకర్మ చేసుకోవలసి ఉంటుంది. సంప్రదాయబద్ధంగా యజ్ఞోపవీతాలు, అనే జంధ్యాలు మార్చుకొనవలసి ఉంటుంది. దానితోబాటు మరో తరంగాలు కూడా ఉంటాయి. రావుగారు ఆ రోజు హైదరాబాద్‌లోనే ఉండిపోతున్నాను. మరునాడు సాయంత్రం వరకు ఆయన నగరంలోనే ఉంటాయి. రావుగారు ఆ రోజు హైదరాబాద్‌లోనే ఉండిపోతున్నాను. మరునాడు సాయంత్రం వరకు ఆయన నగరంలోనే ఉంటారు. చాదస్తుడుని చాలామంది కొట్టివేయవచ్చు గానీ, ఆయనకు జంధ్యాలు మార్చుకోవలసిన అవసరం ముందు సాయంత్రం నుంచే బుర్రలో తిరుగుతున్నది. అక్కడ వున్న ఒక పెద్దాయన ముందు విషయం ప్రస్తావించారు కూడా. ఆ పెద్ద మనిషికి ఏమీ పాలుపోలేదు. ఇటువంటి విషయాలలో నా వల్ల ఏదో జరుగుతుందన్న నమ్మకం కలిగి రావు గారిని నాకు పరిచయం చేశారు. రావుగారు కర్ణాటకకు చెందిన మనిషి. బహుశా మధ్వ సంప్రదాయం అయి ఉంటుందని ఊహించాను. ఆ సంగతే ఆయనతో అన్నాను కూడా. ఆయన అవును అవును అంటూ ఆనందపడిపోయాడు. ఆయనతో ఉండి ఏర్పాట్లు చేస్తున్న పెద్ద మనిషిని పిలిచి మరునాడు రావుగారిని రాఘవేంద్ర మఠానికి తీసుకుపోవలసిందిగా సలహా ఇచ్చాను. ఆ సంగతి విని ఆయన ఎంతో పొంగిపోయారు. నా గురించి నేను చెప్పను గానీ, ఎదుటి వారి అవసరాలను కనుక్కొని వారికి తగిన ఏర్పాట్లు చేయడంలో గొప్ప ఆనందం ఉంది. రావుగారితో పరిచయం కొంత కాలం అలాగే కొనసాగింది.
ప్రొఫెసర్ ఎన్.జి.కె. మీనన్ గారు కేవలం గొప్ప శాస్తవ్రేత్త మాత్రమే కాక కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా కొంతకాలం పని చేశారు. ఆయనతో నాకు మంచి పరిచయం ఉండేది. పుణెలో జరిగిన సైన్స్ కాంగ్రెస్‌లో మిత్రుడు శేఖర్‌తో కలిసి తయారుచేసిన ఇండియన్ సైంటిస్ట్ డాట్‌కాం అనే వెబ్‌సైట్‌ను ఆవిష్కరింపజేశాము. సిఎస్‌ఐఆర్‌ఆర్ సంస్థ డైరెక్టర్ జనరల్ మషేల్కర్‌గారు కూడా ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మీనన్ గారు, తదితరులు మమ్మల్ని మెచ్చుకున్న తీరు ఇవ్వాళ్టికి కూడా గుర్తుంది. కానీ ఎందుకో ఆ వెబ్‌సైట్ ముందుకు నడవలేదు. ఈ వరుసలో నాకు, కె.ఆర్.నారాయణన్, ప్రొఫెసర్ యశ్‌పాల్ గారలతో గల పరిచయం కూడా గుర్తుకు వస్తున్నది. యశ్ పాల్ గారితో కలిసి అప్పటికి నగరంలో అన్నిటికన్నా పెద్ద హోటల్ అయిన బంజారాలో చేసిన భోజనం గుర్తు ఉన్నది. భోజనాలు ముగిసిన తరువాత ఆయన ఒక విచిత్రమైన విషయం చెప్పాడు. తన మేనల్లుడు అదే హోటల్‌లో ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అన్నాడు. నేను నా పరిచయాలను ఉపయోగించి, ఆ అబ్బాయిని పిలిపించాను, మామ, అల్లుడు ప్రేమగా మాట్లాడుకున్నారు. పెద్దాయన నాకు ధన్యవాదాలు కూడా చెప్పాడు. తలలుచుకుంటే ఇవన్నీ కళ్ల ముందు సినిమాలాగా కనపడుతున్నాయి. ఆ కాలం ఏమైంది. అప్పటి చలాకీతనం అంతా ఏమైంది. దృశ్యాల తరువాత కళ్ల ముందు ఈ ప్రశ్నలు కదలాడుతున్నాయి.
బ్రిటన్‌లో సైన్స్ విషయంగా అన్నిటికన్నా పెద్ద సంస్థ అయిన బ్రిటిష్ సైన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ప్రొఫెసర్ విల్సన్‌ను బంజారా హోటల్‌లో ఇంటర్వ్యూ చేసిన విషయం, ఇంతకు ముందు ఎక్కడో చెప్పినట్టు గుర్తు వస్తున్నది. నాకు ఇదే చిక్కు. ఈ విషయాన్ని ఎత్తుకున్నా ఇదివరకే చెప్పాను ఏమో అన్న భావం కలుగుతుంది. అప్పుడు చదివిన వాళ్లు ఇప్పుడు కూడా చదువుతున్నారని నాకు ఒక భావం ఉందేమో. ఒక విషయాన్ని రెండుసార్లు చెప్పినందుకు కొంప మునిగేది లేదు అని నాకు నేనే రచ్చ చెప్పుకోవాలి.
పెద్దవాళ్లు చాలామందితో పరిచయాలు ఉన్నాయి. వారిలో కొంతమంది వెళ్లిపోయారు కూడా. పాలమూరు నుంచి పట్నం దాక మిత్రుడుగా కొనసాగిన వయోవృద్ధుడు హరి ఆదిశేషువు గారు అటువంటి వారిలో అందరికన్నా ముందు గుర్తుకు వస్తారు. ఆయన ధోవతి కూడా సరిగా కట్టేవాడు కాదు. ఎడ్యుకేషన్ కాలేజీలో అధ్యాపకుడుగా పని చేస్తున్నప్పటికీ, అడ్డ పంచె కట్టుకుని హాయిగా తిరుగుతూ ఉండేవాడు. చదవడం వ్యసనం కనుక నా మిత్రుడు పుస్తకాల దుకాణం దగ్గర ఆయనతో బాగా మాట్లాడే అవకాశం దొరికింది. నేను పట్నం చేరిన తరువాత ఆయన కూడా నగరానికి వచ్చారు. ఆ లోపల నేను భువనగిరిలో ఉండగా ఆయన కూడా అక్కడ కనిపించారు. ఈ రకంగా మేము చాలాకాలంపాటు కలుస్తూ ఉన్నాము. ఒకరోజు నేను ఒక్కడినే ముఖం ముడుచుకుని కూర్చున్నాను. ఆయన మామూలుగా ఆ దారిన వెడుతూ నన్ను పలకరించడానికి నా ముందుకు వచ్చారు. విషయం ఏమిటి అని అడిగారు. రెండు రోజులలో సర్ సి వి రామన్ గురించి రాయవలసి ఉంది. కొత్తగా చెప్పడానికి కొన్ని సంగతులు అయినా ఉండాలని మెటీరియల్ కొరకు తాపత్రయపడుతున్నాను. ఈ కాలంలాగా అప్పట్లో ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలు లేవు. ఏమీ లేకుండానే పేరు సంపాదించుకున్నాము. ఈ సౌకర్యాలు ఉంటే ఏం చేసేవాళ్లం అనిపిస్తుంది. ఆదిశేషు గారు మామూలుగా మాట్లాడి వెళ్లిపోయారు. సాయంత్రం లోపల మళ్లీ ప్రత్యక్షం అయ్యారు. చేతిలో ఒక చిన్న సంచి ఉన్నది. అందులో సి వి రామన్‌కు నోబెల్ బహుమతి ప్రకటించిన నాటి వార్తాపత్రికతో సహా, భవన్స్ జర్నల్ వారి రామన్ ప్రత్యేక సంచిక ఇలాంటి మరెన్నో కాగితాలు ఉన్నాయి. ఆ సంచిని నా ముందు పడవేసి ఆనందంగా ఒక నవ్వు నవ్వి ఆయన వెళ్లిపోయారు. ఆయన వద్ద ఇటువంటి సామగ్రి ఇంటి నిండా ఉండేదట. గోడ పక్కన మొత్తంగా అల్మారాలు, వాటిలో ప్రతి దాని మీద మరొక ఇనుప పెట్టే, అన్నిటిలోనూ పుస్తకాలు కాగితాలు. భార్యాపిల్లలకు ముసలాయన పద్ధతి నచ్చలేదు. వింత ఏమిటంటే, పెద్దాయన వాళ్లందరినీ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నాడు. వాళ్లు నిజంగానే వెళ్లిపోయారు. తాను ఉన్నంతకాలం, సంజీవరెడ్డి నగర్‌లో ముసలాయన తన కాగితాల మధ్యన ఆనందంగా పడి ఉన్నాడు. నేను మాత్రం జీవితమనే బండి చక్రాలలో నలిగి తిరుగుతూ మరోసారి ఆయనను చూడను కూడా చూడలేకపోయాను. కృతజ్ఞత లేనివారు అంటే వారికి నాకంటే నిలువెత్తు ఉదాహరణ మరొకటి ఉండదు.

సంకల్ప బలం

$
0
0

‘35 ఏళ్ల వయసులో మిలియనీర్ అవుతాను. లేదంటే నగరంలోని పెద్ద భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. ’
పేదరికాన్ని తట్టుకోలేక ఒక పిల్లవాడు తనకు తాను చెప్పుకున్న మాట ఇది. సరైన తిండి కూడా లేక పేదరికాన్ని అనుభవిస్తున్న ఒక చిన్న కుర్రాడు మహా అయితే బిర్యానీ తింటున్నట్టు కలలు కనొచ్చు. లేదా ఈ పూట కడుపు నిండితే చాలు అనుకోవచ్చు. కానీ అలా అనుకుంటే ఆ కుర్రాడి జీవితం కూడా అందరి జీవితంలానే సీదాసాదాగా ముగిసిపోయేది. కానీ ఆకలితో నకనకలాడుతూ పేదరికాన్ని అనుభవిస్తున్న సమయంలో కూడా తన మెదడులోకి పేదరికం ఛాయలు చేరకుండా ఏదో ఒకనాడు సంపన్నుడిని అవుతాను అని తనకు తాను చెప్పుకోవడమే కాదు ప్రపంచంలోని పది అత్యంత సంపన్నుల జాబితాలో ఎప్పుడూ చోటు కోల్పోకుండా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
తెలుగు సినిమా కథనో, నవలలో హీరోనో అనిపించవచ్చు. కానీ కాదు జీవితంలో సినిమాను మించిన నాటకీయత ఉంటుందని నిరూపించిన వారెన్‌బఫెట్ జీవిత కథ ఇది.
తెలుగు నాట సాహిత్యంలో, పాత సినిమాల్లో పేదరికాన్ని అదేదో పెద్ద ఘన కార్యం సాధించినట్టుగా చూపిస్తారు. ధనానికి పేదవాళ్లం కానీ గుణానికి కాదు అంటూ భారీ డైలాగులు చెప్పిస్తుంటారు. పేదలుగా ఉండడమే వారు సాధించిన ఘన విజయం అన్నట్టుగా, సంపన్నులైతే దుర్మార్గులు అన్నట్టుగా చూపిస్తుంటారు. ఐతే ఇలా కథలు రాసేవారు, సినిమాలు తీసేవారు కూడా సంపద కోసమే ఆ పని చేస్తారు అది వేరేవిషయం. కానీ పేదరికంలో సాహిత్యంలో చూపినట్టు, సినిమాల్లో చూపిస్తున్నట్టు అంత గ్లామరేమీ ఉండదు.
ఆ సంగతి తెలియని వాళ్లు పేదరికం తమ పూర్వజన్మ సుకృతం అని మురిసిపోతుంటే బఫెట్ లాంటి వాళ్లు కసిగా పేదరికం నుంచి బయటపడి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆరేడేళ్ల వయసులోనే తన భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్ణయించుకుని ఏదో ఒకనాడు సంపన్నుడిని అవుతాను తనను తాను ప్రోత్సహించుకోవడం అంటే సామాన్యవిషయం కాదు.
బఫెట్ పదేళ్ల వయసులోనే ఇంటింటికి న్యూస్ పేపర్లు వేశారు. వస్తువులు అమ్మాడు. సంపాదించడం మొదలు పెట్టాడు. బాల్యంలో తమ ఇంటి సమీపంలో ఉన్న ఒక షాప్‌లో కూల్ డ్రింక్స్ మూతలు లెక్కపెట్టేవాడు. కోకా కోలా కూల్ డ్రింక్స్ ఎక్కువగా అమ్ముడు పోతున్నాయని అతని లెక్కలో తేలింది. స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన తరువాత ఈ జ్ఞానం అతనికి ఉపయోగపడింది. కోకాకోలా కంపెనీలోనే పెద్ద మొత్తంలో ఇనె్వస్ట్ చేశాడు. 1930 ప్రాంతంలో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. బఫెట్ తండ్రి పూర్తిగా దివాళా తీశాడు. వారి కుటుంబం ఖాతా ఉన్న బ్యాంకు దివాళీ తీయడంతో చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది.
ఒక పూట తింటే మరో పూట తినలేని పరిస్థితి. ఒక్కోసారి తల్లి బఫెట్‌కు ఒక పూట తిండిపెట్టేది కాదు. ఆ పూట తండ్రి కోసం బఫెట్ త్యాగం చేయాల్సి వచ్చేది. ఆకలిని చూసిన బఫెట్ అందరిలా నిరుత్సాహపడలేదు. బాగా సంపాదించాలి అని ఆ వయసులోనే నిర్ణయం తీసుకున్నాడు.
సంకల్ప బలం అంటే ఇదేనేమో 35ఏళ్ల వయసులో మిలియనీర్లు అవుతాను. లేదా ఆత్మహత్య చేసుకుంటాను అని నిర్ణయించుకుని సంపాదన మొదలు పెట్టాడు. 32ఏళ్ల వయసులోనే మిలియనీర్ అయ్యాడు బఫెట్. 35ఏళ్ల వయసులో మిలియనీర్ కాకపోయి ఉంటే నిజంగా ఆత్మహత్య చేసుకునే వాడే అనేది కాదు చర్చ. ఒక వ్యక్తి సంకల్పబలంతో పని చేస్తే పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురై ఉంటే 35 ఏళ్ల వయసు నాటికి మిలియనీర్ కాకపోయేవాడేమో కానీ ఆ తరువాత ఐనా అయి తీరేవాడు. మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే కాస్త ముందో వెనుకనో దాన్ని సాధించి తీరుతాం.
నా వల్ల కాదు. జీతం రాళ్ల కోసం పని చేస్తాను. నా జీవితం ఇలానే ముగిసిపోతుంది అని మనల్ని మనం నిరుత్సాహపరుచుకుంటే నిజంగా మన జీవితం అలానే ముగుస్తుంది. బఫెట్ అంత సంపన్నులం కాకపోవచ్చు కానీ మనకేం తక్కువ ఇతరుల మాదిరిగానే నేనూ సంపన్నుడిని అవుతాను అని మనకు మనం ప్రోత్సహించుకుంటే సాధ్యం అయి తీరుతుంది.
బఫెట్‌తో కలిసి భోజనం చేయమని మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్‌ను వాళ్ల తండ్రి తరుచుగా చెప్పేవాడు. కానీ బిల్‌గేట్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. బఫెట్ స్టాక్‌మార్కెట్‌లో భారీ మొత్తంలో ఇనె్వస్ట్ చేస్తాడు. ప్రపంచంలోని సంపన్నుల్లో ఆయనొకరు అంతకు మించి ఆసక్తి కలిగించే అంశం ఏముంటుంది అన్నట్టు ఆసక్తి చూపలేదు. చివరకు తండ్రి అనేకసార్లు అడగడంతో ఒకసారి కలిశారు.
అప్పటి వరకు బఫెట్ గురించి తాను అనుకుంటున్నది వేరు, ఇప్పుడు తాను స్వయంగా చూస్తున్నది వేరు అనుకున్నారు అతనితో మాట్లాడిన తరువాత.
కేవలం డబ్బు సంపాదనే నా లక్ష్యం కాదు. డబ్బు సంపాదన ఒక ఆట ఆ ఆటను ఆడేందుకు నేను ఇష్టపడతాను అని బఫెట్ చెప్పిన మాటలు బిల్‌గేట్స్‌పై బాగా ప్రభావం చూపాయి. కేవలం డబ్బునే ప్రేమిస్తే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడిని అన్నారట! ఒక మధ్యతరగతి కుటుంబంలానే బఫెట్ జీవిస్తారు. డబ్బు సంపాదన ఆట తనకు అత్యంత ఇష్టమైన ఆట అని చెప్పారు. నిజంగా ఆదో ఆటగా భావించారు కాబట్టి ఆ ఆటలో బఫెట్ రోజు రోజుకు ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. ప్రపంచంలో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అనుకున్నది సాధించవచ్చు అనే పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఒక మిలియన్ డాలర్లు సంపాదించాలి అని లక్ష్యంగా పెట్టుకున్న బఫెట్ సంపాదన ఇప్పుడు 85బిలియన్ డాలర్లు. తన సంపాదనలో 99శాతం తన తదనంతరం బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు చెందుతుందని వీలునామా రాశారు. పిల్లలకు సంపాదించడం నేర్పించాలి, జీవించడం నేర్పించాలి. బోలెడు సంపాదించి ఇవ్వడం కాదు అంటారాయన. అనడమే కాదు వీలునామా కూడా అలానే రాశారు.
వెయ్యి డాలర్లు సంపాదించేందుకు వెయ్యి మార్గాలు అంటూ చిన్నప్పుడు చదివిన ఒక పుస్తకం బఫెట్‌కు బాగా నచ్చింది. ఆ వెయ్యి మార్గాల్లో ఒకటి వేయింగ్ మిషన్ ఏర్పాటు చేయడం. అది నచ్చి చిన్నప్పుడే బఫెట్ ఒక వేయింగ్ మిషన్ కొని షాపులో పెట్టాడు. అక్కడి నుంచి సంపాదన మొదలైంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఆలోచిస్తే సంపాదన కోసం మనకు మార్గాలు దొరకవా? సంకల్పబలం ఉండాలి.

పాటకు ప్రాణం పల్లవి

$
0
0

ఒకనాటి సంగతి... ‘యే ఆకాశ్‌వాణీకా పంచరంగీ ప్రోగ్రామ్ హై వివిధ్‌భారతి అబ్ హమారీ కర్ణాటక్ సంగీత్ సభా షురూ హోతీహై’ అనే అనౌన్స్‌మెంట్ వివిధభారతి కేంద్రాల నుండి మధ్యాహ్నం 3.45 ని. నుంచి 5.30 వరకూ ఊరూ వాడా రేడియోల్లో మారుమోగేది.
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఒకవైపు సినిమా పాటలు, మరో వైపు లలిత గీతాలు ప్రసారమవుతూండేవి. ఆ వైవిధ్యభరిత గీతాలు శ్రోతలు ఎంతో ఉత్సాహంగా వినేవారు. లలిత గీతమైనా, సినిమా పాటైనా కేవలం మూడున్నర నిమిషాల్లో పదిమందీ మెచ్చుకుని, మళ్లీ మళ్లీ వినాలనిపించే మధురగీతాలు ట్యూన్ చేయటం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇంజనీరు ఊహించి వేసే ఇంటి ప్లాన్ లాటిది పాట. గాయకులందరూ పాటలు ట్యూన్ చేయలేరు. ట్యూన్ చేసేవారంతా గాయకులు కాకపోవచ్చు.
మహావిద్వాంసురాలైన ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాడిన పాటల్లో ఇతరులు చేసిన పాటలే ఎక్కువ. సినిమా పాటల వ్యవహారం వేరు. తెర మీద కనిపించే నటీనటులు చిత్ర ఛాయాగ్రాహకుడు, నృత్య దర్శకుడు మందీమార్బలంతో వినిపించే నాలుగు నిమిషాల పాటకు, గంటల కొద్దీ పడే శ్రమ ఉంటుంది. వేదికలపై సంగీత కచేరీలు చేసేవారికున్న సదుపాయాలు, సినిమా పాటలు పాడేవారికుండవు. ప్రాణమంతా పాటలపై పెట్టి పసందుగా చేసివ్వటంలో సంగీత దర్శకుల శ్రమకు విలువ కట్టలేం. వారి బ్రతుకుతెరువంతా వాటిపై ఆధారపడే ఉంటుంది. వెనకటి తరంలోని దర్శకులకూ నిర్మాతలకూ కాసె్తైనా సంగీతాసక్తి ఉండేది. అయినా సమర్థులైన సంగీత దర్శకుల మాటకే (పాటకే) విలువనిచ్చేవారు.
సంగీత రసికత్వం లేని నిర్మాతైనా దర్శకుడైనా లెఖ్ఖ చేయని సంగీత దర్శకులు అవకాశాలు వదులుకోవటానికైనా సిద్ధపడేవారు తప్ప, స్వాభిమానాన్ని చంపుకునేవారు కాదు. సలాములు చేసేవారు కాదు.
గుంటూరు శేషేంద్రశర్మ మంచి భావుకుడైన రచయిత. ‘విసిరేసెను తూరుపు ఒక శుక్రతారను.. పోదాం పద అడవుల్లో పూవులేరను’ అనే పల్లవిగల పాటొకటి రేడియోకి పంపారు.
నా గురువు వోలేటి గారు ‘సుమనీశ రంజని’లో ఆ పాటకు చక్కని వరుసను కూర్చారు.
మాటలన్నీ పసందైన స్వరాల్లో వీనులవిందుగా తయారయ్యాయి.
హైద్రాబాద్‌కు చెందిన ఆర్.్ఛయాదేవి, నరసింహమూర్తి అనే గాయనీ గాయకులిద్దరూ పాడారు. మా గురువుగారు నాకు ఆ పాట నేర్పేసి, కచేరీకి వెళ్లిపోయారు. నేనే పాటను నేర్పి రికార్డ్ చేశాను. శేషేంద్రశర్మలోని భావుకతకు అద్దం పట్టిన ఆ మాటలు ననె్నంతో ఆకర్షించాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘ముత్యాలముగ్గు’ సినిమా విడుదలైంది. అందులో ఆయన రాసిన పాటే ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచీ కమ్మని కల ఇచ్చింది’ అనే పాట మొదటిసారి ప్రసారంలోనే విన్నాను. ఆ పాటకున్న నేపథ్యం, నటీనటుల మానసిక వేదన, సన్నివేశాలకు అనుగుణంగా చేసిన సంగీతం, సుశీల కంఠం, ఒక్కసారి నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. ముఖ్యంగా, పాటకు ముందూ మధ్యలో వినిపించే బ్యాక్‌గ్రౌండ్ సంగీతం అద్భుతం. సినీ రంగంలో అప్పటికే బాగా పేరున్న సంగీత దర్శకుడు చేసిన పాటది.
* * *
చిన్నతనం నుంచీ, గుళ్లూ గోపురాల్లో వాయించే సన్నాయి వాద్యానికి ముగ్ధుడై చదువుకు స్వస్తి చెప్పి సంగీతాసక్తి పెంచుకున్న ‘వెంకటాచలం’ వయసు అప్పుడు 21 ఏళ్లు.
సాధారణంగా లలిత కళలపై ఆసక్తి కలిగిన పిల్లలకు చదువుపై ఆసక్తి సన్నగిల్లడం సహజం. అందుకే పిల్లల్ని అటువైపు వెళ్లనివ్వరు. వాళ్లలోని ఆసక్తిని, సృజనాత్మకతను చాలామంది తల్లిదండ్రులు గమనించక వారికున్న ఆసక్తినే బలవంతంగా పిల్లలపై రుద్దే ప్రయత్నం చేస్తారు. వారి కోరిక అలాగే వుండిపోతుంది. కానీ అనుకున్నది సాధించాలనే పట్టుదల ఓ పట్టాన కూర్చోనివ్వదు. బుర్ర తోచనివ్వదు. వెంకటాచలం తండ్రి, తాతలు సంగీతజ్ఞులే. కానీ ప్రోత్సహించలేదు. ఒక శుభ ముహూర్తంలో మద్రాసు వెళ్లిపోయాడు. అదృష్టం కొద్దీ ఓ నిర్మాత దృష్టిలో పడ్డాడు. నటుడుగా అవకాశమొచ్చింది. దురదృష్టం కొద్దీ ఆ సినిమా అర్థంతరంగా ఆగిపోయింది. ఇంటి ముఖం చూడాలనిపించలేదు. భుక్తి కోసం హోటల్‌లో సర్వర్‌గా చేరి కొన్నాళ్లు కాలక్షేపం చేశాడు. లోపలి సంగీత తృష్ణ పెరుగుతూనే ఉంది. ఒక రికార్డింగ్ కంపెనీని వెతుక్కున్నాడు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, వసంతకుమారి లాంటి ఆనాటి స్టార్ సింగర్ల పాట రికార్డు చేసే అవకాశం కలిగింది. సంగీత వాతావరణం నచ్చింది. తన ప్రవృత్తికి తగ్గ వృత్తి దొరికిందనుకున్నాడు. క్రమంగా అనుభవం పెరిగింది. సంగీత జ్ఞానమూ పెరిగింది. క్రమంగా అవకాశాలు రాసాగాయి.
1958లో ‘ముందడుగు’ అనే చిత్రాని దర్శకుడై చేసిన పాటలు జనం మెచ్చుకున్నారు. జగ్గయ్య నాయకుడు. ‘చినదానా ఓయ్ చినదానా!’ మాధవపెద్ది పాడాడు. సత్యం, జానకితో కలిసి పాడిన పాట (కోడెకారు చిన్నవాడా) అప్పట్లో చాలా పాపులర్. వెనకటి తరంలోని పాత పాటలన్నీ 78 ఆర్‌పిఎం రికార్డుల్లో వుండేవి. మూడున్నర నిమిషాల్లో ఆ 78 ఆర్‌పిఎం రికార్డుల్లో సరిపెట్టగల పాటల్లో, సంగీత దర్శకుడి విశ్వరూపమంతా కనిపించాలి. ఆర్కెస్ట్రా ప్రారంభమవ్వగానే పాటను గుర్తించగలిగేలా సినిమా పాటలన్నీ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉండేవి. ఆ పాటలు కట్టిన సంగీత దర్శకులు నిజంగా మేధావులే. కాకపోతే ఇనే్నళ్లపాటు వింటామా? పాటకు ట్యూన్ కట్టేస్తే సరిపోదు. ముందూ మధ్య చివరా వాద్య బృంద సంగీతం కూడా ఆ పాటకు అనుగుణంగా భావపురిపుష్టతతో నిండి వుండాలి. ఆ పాటలో, ఈ వాద్య సంగీతం పాలు, నీరులా కలిసిపోవాలి. అది కూడా ఒక ప్రజ్ఞే.
ఇది కాకుండా మళ్లీ ఆరంభం నుంచి జైహింద్ వరకూ రకరకాల సన్నివేశాలు గుండెకు హత్తుకునేలా వినబడే నేపథ్య సంగీతం బాధ్యత కూడా సంగీత దర్శకుడిదే. దీనే్న రీ రికార్డింగ్ అంటారు. ఇది వరకటి రోజుల్లో, ఇప్పటిలా ట్రాక్ రికార్డింగ్ పద్ధతి లేదు. చిన్న తప్పు పాడినా, వాయించినా ఆర్కెస్ట్రా బృందంతో మళ్లీ అదే, ఉత్సాహంతో మూడ్‌తో, భావంతో ఓపికతో గాయనీ గాయకులు పాడాలి. వాద్య బృందం కూడా హుషారు తగ్గకుండా వాయించాలి. అసిధారావ్రతమే.
పాట ‘ఓకే’ అనేంతవరకూ అర్ధరాత్రైనా అపరాత్రైనా అలా స్టూడియోల్లో మగ్గిపోతూండేవారు. ఇప్పుడా బాధ లేదు. ఎవరి ‘బిట్’ వారు వాయించి వెళ్లిపోవచ్చు. ఎవరి పాట వారు పాడేసుకుని వెళ్లచ్చు. ఒకరి ముఖాలు మరొకరు చూసుకోవాల్సిన పనిలేదు. డైలాగులైనా, సన్నివేశాలకు తగిన సంగీతమైనా, పాటైనా, పద్యమైనా ఎవరికి ఖాళీ దొరికితే వారు అప్పుడే వెళ్లి రికార్డు చేసి ఎంచక్కా వచ్చేయవచ్చు.
బాబూ మూవీస్ మనసుల త్రయంతో సినిమాలు తీశారు. తేనె మనసులు, మంచి మనసులు, మూగ మనసులు. ఆశ్చర్యం? అన్నీ విజయవంతమే. అనేక కారణాల్లో దీనికి సంగీతం కూడా ఒకటి. కెవి.మహదేవన్‌గా ప్రసిద్ధుడైన వెంకటాచలం..
వాద్యబృందంపై చేసిన విన్యాసాలు, పసందైన పాటలు, పదిమందీ మెచ్చుకున్న వరసలు ఈ మూడు చిత్రాలకు పంచేశాడు. మహదేవన్‌తో చివరి దాకా వున్న పుహళేందిని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. ఆలోచనలన్నీ ఒకరివైతే ఆచరణ మరొకరిదీ.
పాట సాహిత్యం చూడగానే అనుభవజ్ఞులైన సంగీత దర్శకులకు అప్పటికప్పుడే ట్యూన్ తట్టేస్తుంది.
ఎంతో శ్రమ పడితేనేగానీ భావన, కొందరికి బయటకు రాదు. తీరా వచ్చిన తర్వాత, తమకు సంగీత సాహిత్య జ్ఞాన మున్నట్లుగా నటించే నిర్మాతలకు, దర్శకులకూ ఆ పాట నచ్చాలి. నచ్చకపోతే మరో ట్యూమ్ మనసులో పుట్టి తీరాలి. ఇంత చేసినా, ఆఖరికి ఆ పాట మనకూ నచ్చాలి. అప్పుడే ఆ సంగీత దర్శకుడి భవిష్యత్తు మూడు పువ్వులు ఆరుకాయలై వర్థిల్లుతుంది.
చక్కని భావుకుడైన సంగీత దర్శకుడు కృష్ణ కోయిల్ వెంకటాచలం మహదేవన్. నా పదమూడవ ఏట చూసిన సినిమా ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఆ సినిమాకు మన మహదేవుడే సంగీతం. ఆ తర్వాత ఏవోకొన్ని సినిమాలు చేసినా మన తెలుగు వారికి, అటు సినీ నిర్మాతలకూ దర్శకులకూ బాగా దగ్గరై పోయాడు. భాషేదైతేనేం? కావలసింది భావం. ఇక్కడ కూర్చుని వివిధ భారతిలో హిందీ పాటలు విని ఆనందించే రసజ్ఞులెందరు లేరు? పాటకు స్వరమే ఆధారం. సకల జనులనూ కలిపేది ఈ స్వరమే. మహదేవన్‌ను తలుచుకుంటే గుర్తుకు తెచ్చుకోవలసింది ‘శంకరాభరణం’. దేశ విదేశాల్లో ఈ సినిమా ఎంత కీర్తి గడించిందో తెలుసు. కర్ణాటక సంగీతంలోనూ, పాశ్చాత్య సంగీతంలోనూ, హిందూస్థానీ బాణీలోనూ బాగా ప్రాచుర్యమున్న రాగం, ఎన్నో జన్యురాగాలున్న పెద్ద మేళకర్త రాగం ‘శంకరాభరణం’. ఈ రాగ పూర్తి స్వరూపం మీకు బాగా తెలియాలంటే ‘్భకైలాస్’ చిత్రానికి ఎం.ఎల్. వసంతకుమారి పాడిన ‘దేవ మహదేవ మము బ్రోవుము శివా’ అనే పాట మంచి ఉదాహరణ. రక్తిగా ఉండే వరసలు కట్టి ఆ సినిమా విజయానికి కారణమైన మహదేవన్ బహుముఖ ప్రజ్ఞ మాత్రం అనన్య సామాన్యం.
సినిమా సంగీతం కొన్నికొన్ని సందర్భాల్లో రాగరస నిర్ణయం చేస్తూ, పాడిస్తే కొందరు రసజ్ఞులు మెచ్చుకోవచ్చునేమో. కానీ, సామాన్యులు, ఆ పాటల స్థాయినందుకో లేకపోవచ్చు. అందరూ మెచ్చుకుంటూ ఆనందించేదే సినిమా సంగీతం. కొందరికి మాత్రమే నచ్చేది శాస్ర్తియ సంగీతం. 1979లో విడుదలై సంచలనం సృష్టించిన ‘శంకరాభరణం’ జాతీయ పురస్కారం నోచుకోవడానికి కారణమైన వారిలో మహదేవన్ ఒకడు.
‘మెల్లిశై చక్రవర్తి’ ‘కలైమామణి’ ‘స్వరబ్రహ్మ’ బిరుదులందుకున్న ఈ సంగీత దర్శకుడు లేకపోయినా ఆయన పాటలు మనల్ని నిరంతరం పలుకరిస్తూనే ఉంటాయి.


పజిల్-731

$
0
0

అడ్డం

ఆధారాలు

1.్భరత, భాగవత, పురాణాలు రచించి, వేదాన్ని విభజించినవాడు (5)
5.జిల (3)
6.చేపల్ని పట్టే రెండు సాధనాలు (3+2)
8.సైనికుడు (3)
10.వెనుక నించి ‘తంతాం’ అనే ఎత్తుగడలో ముందు నించి పుష్పం (3)
13.చివర (2)
14.తమాషా కాదు. నిష్పత్తి. అన్నీ దీర్ఘాలే! (3)
15.ఈ కూర పేరులోనే వేడి ఉంది (3)
16.తిరగబడిన నగ (2)
17.త్రాసు (3)
19.ఒక నది. ఒక సినీ టీవీ నటి (3)
21.ఇనుమును బంగారంగా మార్చేది అటూ ఇటూ చూస్తే పది! (5)
23.నాలుగు నిమిషాల కాలము. స్వల్ప కాలావధి (3)
24.వెనక నించీ కవే. ముందు నుంచీ కవే. కటకధారి (5)

నిలువు

ఆధారాలు

1.‘ఆకుచాటు పిందె తడిసె...’ పాట ఈ సినిమాలోనిదే! (4)
2.పులి (3)
3.అంతరిక్షం (3)
4.పాపాయి కాదు పండు (3)
7.స్ర్తి (3)
9.ముస్లిం చక్రవర్తులు (4)
11.‘తాన’ అంటే ఇది అనాలా? (3)
12.గుడి ప్రహరీ (4)
13.లోటు (3)
16.ఇంటినీ వీధినీ కలిపేది (3)
18.రామాయణకర్త బిరుదు (4)
19.కీర్తి (3)
20.తార (3)
22.ఉద్యోగ సంఘాలు నిరసన తెలిపేందుకు చేసే దానితో మొదలు పెద్ద సుత్తి (3)

నేను.. ఎదురీతను

$
0
0

నేను
కాను, ఒక ఎదురీతను.
ఎదురీతనే. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ.
*
జీవితం
సుడులు తిరుగుతున్న వరద
విస్తృతమయ్యే ప్రవాహ ఉధృతి
వొరుసుకుని గట్లు తెగినా
వొరిపిడికి గాట్లు పడినా
దిగుమతి అయింది కొట్టుకుపోవలసిందే.
పట్టుదొరకని వర్తమానం దిగువకు చేరాల్సిందే
గతిలేని అతి సముద్రంపాలు కావల్సిందే
ఈ అక్షరాలలో వొదగని బ్రతుకును నేను
అవును, నాది ఎదురీతనే.
*
ఆకాశానికి వేలాడిన ఆశలు
సూర్య కిరణాల్లా ఆశల్ని చీల్చుకున్న ఆశయాలు
చిరుతుంపరకే అరమోడ్పులైన ఇంద్రధనుస్సులు
నూనూగు మీసాల నిలిచిన సవరింపులు
పారాడిన బ్రతుకుకు తాత్కాలిక చిరునామాలు
అయినా, నేను ఎదురీతనే.
*
నా జేబు నింపుకోవటం నాదే అయినపుడు
నిలువునా చీరేసిన నా సమ సమాజం
వేలెత్తి చీదేసిన నా సభ్య సమూహం
పడిపోయిన నాలో
తమ గెలుపును చూసుకున్నప్పుడు
వాటి గెలుపులో
నా అస్తిత్వాన్ని నేనుగా చూసుకున్న నాడు
నా చిరునామా నా ఎదురీతనే.
*
పగటి ఆకాశం వేడెక్కించిన సంధ్యా సమయాన
చీకటి కమ్మిన ఆకాశాన చందమామలా నేను
నక్షత్రాలను పూయించిన నింగిన
పాలపుంతలా నా జీవితం
అయినా నా మార్గం ఎదురీతనే.
*
నా ఆలోచనకు ఎదురీత నేర్పిన గురువు
మట్టిని విప్పిన ఇక్కడి విత్తనమే
నా చేతలకు ఎదురీత నేర్పిన గురువు
గాలిని చీల్చిన ఇద్దరి పక్షినే
నా పాదాలకు ఎదురీత నేర్పిన గురువు
కడలిన దూసుకెళ్లిన ఈ తీరపు జాలరినే
నా అక్షరాలకు ఎదురీత నేర్పిన గురువు
కనలిన ముద్రిత వాక్య విన్యాసమే
నా చిరునామాకు ఎదురీత నేర్పిన గురువు
ప్రశ్నించిన పేరుకు అంటిన చిరుకీర్తే
నా కాలానికి ఎదురీత నేర్పిన గురువు
కాగితానికి దూరమైన కలం కనువిప్పే
నా అంతరంగానికి ఎదురీత నేర్పిన గురువు
నడతకు చేరువైన ఆత్మ పథమే.
*
రా రమ్మని చేతులు చాపిన అమ్మ
నా బుడిబుడి అడుగులకు
నేర్పించింది ఎదురీతనే!
అక్షరాలను అందంగా దిద్దించిన నాన్న
నా వ్రేళ్ల కొసలకు నేర్పించింది
అనుకరణకు ఎదురీతనే!
పాఠాలు చెబుతూ పరిహసించిన పంతుళ్లు
నా అమాయకతకు నేర్పించింది
ఆత్మవంచనకు ఎదురీతనే!!
గతం కొమ్మకు విరబూసిన చాందసులు
నా బ్రతుకుకు నేర్పించింది
ప్రాపంచికతకు ఎదురీతనే!
ముద్రారాక్షస పరిహారంలో శిక్షిత కలం
నా అక్షయ అక్షరానికి నేర్పించింది
తలతిప్పుడుకు ఎదురీతనే.

మనమే గ్రహాలం!

$
0
0

కాదంటారా?
దేదీప్యమానంగా వెలిగేదొకడు
వెలవెలా పోయేది మరొకడు
ఇలా ఒక్కొక్కరం
ఒక్కోరకంగా ఒక్కో
గ్రహంలా ఎగిరెగిరీ పడుతుంటాం
ఆ గ్రహాల ప్రభావం మనపైనబడి
ఆ గ్రహాల లక్షణాలను సొంతం చేసుకొని
జీవితాంతం తర్కించుకొంటూ
ప్రేమను పెంచుకొంటూ, తెంచుకొంటూ
చూపులతో మాటల తూటాలతో
మతిపోగొట్టుకుంటూ
కాలంతోబాటే పరుగులు తీస్తూ
ఎనె్నన్నో జన్మల బంధం అనుకొంటూ
హాలాహలమైనా
అమృతమైనా
మనలో మనమే పంచుకొంటూ
ఈ ప్రపంచం పంచలో
తలదించుకొని, తలదాచుకొంటున్నాం
ఎందుకో? ఏమిటో!

దాగుడుమూతలు

$
0
0

ఎక్కడ చూసినా భయంకరమే
ఏ మాట విన్నా గుండెలో బాణమే
ఏ సహచర్యమైనా తప్పటడుగే
ఏ బంధమైనా తెగిపోయే సూత్రమే...
సప్త సముద్రాల ఆనంద ఘోష వినాలనీ
సప్త ద్వీపాలలో విహరించాలనీ
సుప్తచేతనావస్థలో జీవించాలనీ
సప్తవర్ణాల కాంతులను ధరించాలనీ
ఎన్ని జన్మలుగా కోరిక
తీవలు సాగుతున్నదో
తెలియదు కదా ఎక్కడ ఆడుతున్నదో
కనపడకుండా దాగుతున్నదో...
పాపం నుంచీ కోపం నుంచీ..
తాపం నుంచీ పరితాపం నుంచీ
స్తబ్దత నుంచీ నిశ్శబ్దత నుంచీ
దూరంగా ఉండాలనీ ఆలోచన పండాలనీ
మోసాల నుంచీ మోహాల నుంచీ
అబద్ధాల నుంచీ అన్యాయాల నుంచీ
పంచభూతాలను వెంట తీసుకుని
వడివడిగా అడవిలోకి ఉరకాలనీ
ప్రహరీలు చుట్టూ నిర్మించుకుంటే
అందకుండా కందకాలు త్రవ్వితే
ఎక్కలేకుండా తైలాలు పూస్తే
మనశ్శాంతి జారిపోతుంది.
నువ్వెక్కడ ఉన్నా మనసు నీలోనే ఉంది
నీ మనసులోనే ఆలోచన ఉంది
ఆలోచనలోనే బాధ సమస్తం ఉంది
అనూహ్యం - అనివార్యం అని వినిపిస్తోంది.
అయినా ఏదో ఒక సందు నుంచి జీవితం
ఒక మూల నుంచి ప్రపంచం
గుహలోకి ప్రవేశిస్తూనే ఉన్నాయి
నిగ్రహాన్ని పరీక్షిస్తూనే ఉన్నాయి.

‘గో-మాత’ అనొద్దు

$
0
0

ఫోన్ రింగయింది.
స్క్రీన్ వైపు చూస్తూ ‘మీ బాబాయిలా వున్నారు. వదిలిపెట్టేలా లేరు’ కేకేసింది కాత్యాయని.
‘ఎత్తమాకు. ఆయనే మానుకుంటాడు. రామకోటి, పూజ వ్యవహారాలు చాలా ఉన్నై. ఇప్పుడు కుదరదు. తరువాత చూసుకుందాం’ విసుగు ధ్వనిస్తూండగా భార్యకు సమాధానమిచ్చాడు వైద్య.
మరలా రింగయింది. తప్పేలా లేదు వైద్యనాథ్‌కు. ఈ రోజు చాలా పని ఉంది. ఇంట్లో దైవ కార్యక్రమాలు అయిన తరువాత గోమాతల మీద జరుగుతున్న హింసలు మరియు నివారణోపాయాలు మీద గోసంరక్షణ సమితి వారు ఏర్పరచిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసి ఉంది. ఆ సమావేశంలో మాట్లాడవలసిన ఉపన్యాసానికి సిద్ధం కావడం, గోవధకు మద్దతుగా నిలిచేవారి ప్రశ్నలకు సమాధానమివ్వడం మొత్తం అష్టావధానంగా ఉంటుంది. ఏ మాత్రం మానసికంగా, ప్రశాంతంగా మరియు ఏకాగ్రతగా, సిద్ధంగా లేకపోతే ప్రింట్, టీవీ మీడియా పత్రికా విలేకరుల ముందు పలుచన కావడంతోపాటు తరువాత జరిగే సమావేశాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించక పోవడం జరిగే అవకాశం ఉంటుంది. ఇన్ని ఆలోచనల మధ్య ఈయనగారి ఫోను. ఆయన మాట్లాడే విషయం గురించి ఆలోచిస్తూ, దానికి ఏం సమాధానం ఇవ్వాలో ఆలోచిస్తూ ఫోన్ ఆన్ చేశాడు. ‘ఏం బాబాయ్ బాగున్నావా? విశేషాలు ఏమిటి? అమ్మ బాగుందా?’ పలకరించాడు వైద్యనాథ్.
‘అంతా బాగానే ఉన్నారు. మీ అన్నదమ్ములకు ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. మీరేమో మీ పనులతో హడావిడిగా ఉంటారు మరి...’
‘క్లుప్తంగా చెప్పు బాబాయ్. చాలా పనులతో తీరిక లేకుండా ఉన్నాను. మీకు అవకాశం ఉంటే ఇంకో పర్యాయం వివరంగా మాట్లాడుదాం. లేకపోతే అన్నయ్యతో మాట్లాడండి. ఇంకా తప్పనిదయితే మాట్లాడండి’ ఆయన ఆ సోది ప్రవాహానికి అడ్డువేసేలా మాట్లాడాడు వైద్య.
‘ఇలా మాట్లాడితే ఎలారా?’
‘అసలు విషయం త్వరగా చెప్పండి బాబాయిగారు..’
‘మీ అమ్మ విషయం గురించే వైద్యా! వదిన వ్యవహారం...’
‘బాబాయిగారు ఆ విషయం అన్నయ్యతో మాట్లాడండి. అన్నయ్య నాతో మాట్లాడుతాడు. మేం ఇరువురం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తాము. చిన్నమ్మను అడిగానని చెప్పండి. ఖాళీగా ఉన్నప్పుడు నేనే మాట్లాడుతాను. ఉంటాను’ అటు నుండి సమాధానం ఆశించకుండా ఫోన్ ఆఫ్ చేశాడు.
‘మధ్యలో ఈయనకెందుకు మీ అమ్మగారి వ్యవహారం? మీ అన్నదమ్ములు చూసుకోలేరా? మీకు ఆ మాత్రం తెలివితేటలు లేవనుకుంటున్నారా మీ బాబాయిగారు. ఏమయినా మీ అమ్మగారు కూడా ఆమె మంచి చెడ్డలను మూడవ వ్యక్తి వద్ద మాట్లాడటం కూడా పెద్దగా బాగా లేదు.. ఇంకా...’
‘ఈ వ్యవహారం బాబాయికి అనవసరం. అలానే మా అమ్మ వ్యవహారం నీకు కూడా అనవసరం’ ఖండించకపోతే ఎంత దూరమైనా కాత్యాయని తీసుకెళ్లగలదని సంభాషణను మధ్యలోనే ఖండించాడు.
‘మీ బాబాయిలు, అన్నదమ్ములు, అమ్మ అంతా ఒకటే. నేనే పరాయిదాన్ని. మీకు ఎంత చేసినా నన్ను మనస్ఫూర్తిగా కలుపుకోలేని తక్కువ సంస్కారం మీది’ సరిగానే బాణం వేశాననుకుంది కాత్యాయని.
సమాధానం చెప్పకుండా పూజా వ్యవహారాలు చూసుకోవడం మంచిదనుకున్నాడు. సమాధానం చెపితే కురుక్షేత్రం రావచ్చు.
* * *
గో సంరక్షణ సమితి వారు పంపిన కారులో ప్రయాణిస్తున్నాడు వైద్య. ముఖ్య అతిథిగా మాట్లాడాలనుకుంటున్న మాటలను నెమరు వేసుకుంటున్నాడు. కలికాలం. ఈ మతోన్మాదుల, హేతువాదుల వారి నుండి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టమవుతుంది. ఆవు కూడా ఒక జంతువే అంటాడు ఒకడు. ఆవుపాలు అమృతమంటే బర్రెపాలు, మేక పాలు అన్నీ అమృతమే అంటాడు ఇంకొకడు. సృష్టిలో అన్ని జీవరాసులు సమానమంటాడు వేరొకడు. జంతువుల పాలు కూడా మాంసాహారమే అంటాడు ఒక చాదస్తుడు. వాటి సంతానానికి పాలు అందకుండా మనం తాగడం జీవహింస మరియు నేరం అంటాడు ఇంకొక హేతువాది. కోడిగుడ్డు శాకాహారం, కోడి మాంసాహారం అంటాడు గుడ్డు పక్షపాతి. ఫారం కోడి మాంసం కూడా శాకాహారమే అంటాడు ఒక పైత్యస్థుడు. శాకాహారం కూడా ఆ చెట్లను హింసించి వాటి నుండి కోయడమే అంటాడు మరో వెర్రివాడు. వయసు మళ్లిన వృద్ధ ఆవులను ఏం చేయాలి? అసలు జంతువులను చంపకపోతే ఈ భూమి సరిపోతుందా? ఈ ఆలోచనల సుడిగుండం నుండి బయటపడితేనే తను మామూలుగా మాట్లాడగలుగుతాడు. గో సంరక్షణ మరియు గో వధ గురించి మీడియాలో ఈ మధ్యకాలంలో ఎవరు ఏమి మాట్లాడారు మొదలైన విషయాలు అంతర్జాలం ద్వారా సేకరించసాగాడు దీక్షగా.
* * *
చప్పట్లతో హాలు మారుమ్రోగుతోంది. పూలు, పూలదండలు మీదకు వెదజల్లుతున్నారు. విలేకరులు ఫొటోలకు అవస్థలు పడుతున్నారు. హుందాగా మెడలో పూలదండలను సర్దుకుంటూ వేదిక దిగుతున్నాడు వైద్యనాథ్. గోవులను రక్షించండి - గోవు మిమ్ములను రక్షిస్తుందని, ప్రభుత్వం గోసంరక్షణ శాఖను ఏర్పాటు చేసి దానికి ఒక హిందువును మంత్రిగా చేయాలని, జిఎస్‌టితో పాటుగా అదనంగా ఇంకో ఒక శాతం సెస్సు వేసి ఆ వచ్చే నిధితో ఒక ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని, ఆ నిధితో గో సంరక్షణ చేయాలని, గోరక్షకులకు పద్మ బిరుదులు ఇవ్వాలని, గో వ్యతిరేకులకు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని ఇలా పలు డిమాండ్లు చేసిన సందర్భాలలో మోగిన చప్పట్లతో తృప్తిపడ్డాడు వైద్య. ఆ ఆలోచనలతో సంతృప్తిగా కారు ఎక్కాడు. అభిమానులు బహూకరించిన షాల్స్, షీల్డులు, మెమొంటోలు, ఆహ్వాన పత్రికలు, స్వీట్ బాక్స్‌లు కొంతమంది కార్యకర్తలు కారులో సర్ది డోరు సున్నితంగా వేశారు. షీల్డులను ఆనందంగా, తృప్తిగా తాకి చూసుకున్నాడు. కారు కదులుతుండగా అక్కడ చీపురు పట్టుకొని ఊడ్పునకు సిద్ధమై యున్న ఒక నడికారు మహిళకు నూరు రూపాయలు డ్రైవర్ ఇవ్వడం గమనించాడు వైద్య. ఇంత హడావిడిలో కూడా డ్రైవర్ నూరు రూపాయలు ఆ మహిళకు ఇవ్వడం గురించి దీక్షగా ఆలోచించక తప్పింది కాదు. జనాన్ని తప్పిస్తూ చిన్నగా కారు నడుపుతున్నాడు డ్రైవర్.
‘ఆమె నీకు తెలుసా? ఆమెకు నూరు రూపాయలు ధర్మంగా ఇచ్చేంత పరిచయం ఉందా? అంత ధర్మంగా ఇచ్చేంత స్థితిపరుడవైతే ఈ చిన్న

ఉద్యోగమెందుకు?’ అన్ని ప్రశ్నలు ఒకేసారి గుప్పించాడు వైద్య.
‘పెద్దగా తెలియదండీ. ఆమె ఇద్దరు కొడుకులు ఆమె ఆస్తిని మాయమాటలతో కాజేసి ఆమెను బయటకు నెట్టారు. ఆమె ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నప్పుడు నాకు కనిపించింది. మాటలలో పెట్టి ఆమె చరిత్రను తెలుసుకో గలిగాను. ఆమెకు రేషన్ కార్డు, ఇక్కడ పనిచేస్తున్నందుకు ఇఎస్‌ఐ కార్డు, వితంతు పింఛను మొదలైనవి వచ్చేలా చేశాను. గవర్నమెంటు వారిచ్చిన స్థలంలో చిన్న రేకుల షెడ్డు లాంటిది కూడా ఏర్పాటు చేసుకుంది. అలా ఆమె బతుకు ఆమె బతుకుతోంది. ఇలా నెలకో, రెండు నెలలకో ఎప్పుడైనా కనపడితే, అప్పుడు నేను సంతోషంగా ఉంటే కొద్దిగా నా అవకాశం బట్టి ఇస్తాను. చాలా మొహమాటస్తురాలు. చాలా కష్టంగా తీసుకునేది.’
‘ఇక్కడ పని కూడా నువ్వే కుదిర్చావా?’
‘అవునండీ’
‘మనం వచ్చింది ఒక ఫర్లాంగే కదా! కొంచెం వెనకకు తిప్పు. నేను కూడా కొద్దిగా మాట్లాడుతాను’
వౌనంగా కారును వెనుకకు తిప్పాడు. మరలా ఆడిటోరియం హాలు వద్దకు చేరుకున్నది కారు. జనం దాదాపుగా వెళ్లిపోయారు. ఆమె ఊడుస్తున్నది. డ్రైవర్ సైగతో కారు వద్దకు వచ్చింది.
కారులో ఉన్న ఒక శాలువాను, స్వీట్ పాకెట్‌ను ఆమెకు అందించాడు వైద్య. ‘నాకు ఇవి ఏమీ పనికిరావు అందుకే నీకు ఇద్దామనిపించింది. నీకు అవసరం కావచ్చు. నీ గురించి మంచిగా డ్రైవర్ చెప్పాడు. అందుకే నీకు ఇచ్చాను.’
సిగ్గుపడుతూ తీసుకుందామె.
వైద్య సైగతో కారును మరలా పోనిచ్చాడు డ్రైవర్.
‘ఆ స్వీట్ పాకెట్‌లో ఐదు వందల రూపాయలు కావాలనే ఉంచాను. డైరెక్ట్‌గా ఆమె తీసుకోదనే ఉద్దేశంతో అలా చేశాను. కాసేపాగి ఆ విషయం ఆమెకు తెలియజేయి’ మామూలుగా అన్నాడు వైద్య.
‘చాలా సంతోషం బాబుగారూ. మీ మేలు ఆమె జన్మజన్మలకు మర్చిపోదండి’
‘అది సరే నువ్వు ఇలా ఇస్తూ వుంటే నీ జీతం ఏం సరిపోతుంది? నువ్వు ఇబ్బంది పడవా?’ ఆరాగా అడిగాడు వైద్య.
‘అవకాశం ఉన్నంతవరకు చూస్తాను. మా ఆవిడ కూడా ఇళ్లల్లో గినె్నలు కడిగే పనికి పోతుంది. ఇద్దరి సంపాదన కాబట్టి పెద్దగా బాధ ఉండదు.’
డ్రైవర్ ఉన్నత భావాల గురించి కొద్దిగా ఆశ్చర్యపడ్డాడు వైద్య.
‘మనం ఒక అమ్మను బజారున పడకుండా ఆదుకుంటే మన అమ్మ బజారులో పడకుండా భగవంతుడు కాపాడుతాడని నా ఆలోచన సార్. రేపు నన్ను నా భార్యను బజారులో వేయకుండా చూసేలా భగవంతుడు చేస్తాడని అనుకుంటాను సార్. మనం చేసే పనులన్నీ మీ భగవంతుడైనా, మా భగవంతుడైనా మన ఖాతాలో రాస్తాడని భావిస్తాను. ఏమిటో నాదో పిచ్చి.’
కొద్దిగా అతని మనసు, మతము అర్థమయ్యాయి వైద్యకు. అతని మానసిక ఔన్నత్యం గొప్పదనుకున్నాడు. అయితే ఆ మాటలు అనలేక పోయాడు. ‘నా వద్ద ఇంకా కొన్ని శాల్స్, స్వీట్ పాకెట్స్ ఉన్నాయి. నేను వీటిని వాడుకోను. అవసరమైతే, అభ్యంతరం లేకపోతే మీ ఇంటికి పట్టుకెళ్లు’
‘మాకు ఇటువంటి తినుబండారాలు చాలా అరుదుగా తక్కువగా దొరుకుతై. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్లి ఇచ్చి వెంటనే వస్తాను.’
‘అలానే ఇచ్చిరా’ తనకు ఉపయోగపడకపోయినా ఎవరో ఒకరికి ఉపయోగపడతాయని తృప్తిగా అనుకున్నాడు వైద్య.
అక్కడే ఉన్న గల్లీలోకి కారు ప్రవేశించింది. అదొక స్లమ్ ఏరియా. కారు ఆపాడు. ‘తమకు ఇష్టమైతే మా ఇంటిలోకి వచ్చి మమ్ములను ఆశీర్వదించండి మాస్టారూ’ చేతులు కట్టుకుని దీనంగా అన్నాడు డ్రైవర్.
అతని మనసునే కాక అతని ఇంటిని కూడా పరిశీలించవచ్చనుకున్నాడు వైద్య. కొన్ని పాకెట్స్, షాల్స్ డ్రైవర్‌కి ఇచ్చి కారు దిగి డ్రైవర్ వెనుకనే వారి ఇంటిలోకి ప్రవేశించాడు. ప్లాస్టిక్ కుర్చీ దులిపివేశాడు డ్రైవర్. ఇల్లు శుభ్రంగా పొందికగా అమర్చుకున్నారనిపించింది. అతని భార్యను, తల్లిని, ఇద్దరు పిల్లల్ని పరిచయం చేశాడు డ్రైవర్. అతని భార్యకు వైద్యనాథ్ గురించి, ఆయన వాగ్ధాటి గురించి ఆయన దయతో తమ ఇంటికి వచ్చి కానుకలు ఇచ్చిన విషయం గురించి అబ్బురంగా, ఆనందంగా చెప్పాడు.
ఆ కానుకలను డ్రైవర్ అతని భార్యకు ఇచ్చాడు.
‘నాకు ఇస్తావెందుకు? ‘మా’ కు ఇవ్వరాదు’ అంటూ భర్త చేతి నుండి కానుకలను తీసుకొని ‘మాజీ! తమరే అందరకు ఇవ్వండి’ అత్తకు ఇస్తూ అంది.
అత్తయ్యను ‘మా’ అంటుందేమిటి? ఇదేం పద్ధతి? కొద్దిగా ఆశ్చర్యంగా ఆలోచనలలో పడ్డాడు వైద్య.
‘ఎవరైతే ఏం బేటీ ఎవరైనా ఇవ్వవచ్చు’ అంటూ కొడుకుతోపాటు అందరకు స్వీట్లు పంచింది డ్రైవర్ అమ్మ.
కోడలిని కూతురుగా సంబోధించే ఈ అత్తగారిని చూసి మరలా ఆశ్చర్యపోయాడు వైద్య.
‘మీరు కూడా ఒకటి తీసుకుంటారా బేటా!’ తీసుకుంటారో, తీసుకోరో, ఏమనుకుంటారో సందిగ్ధంగా అడిగింది.
ఆమె బేటా అనడంతో ఇంకేం ఆలోచన లేకుండా ఆమె నుంచి స్వీట్ తీసుకుని తిన్నాడు. వీరి గురించి, వీళ్ల ఆచారాల గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. వారి వద్ద వీడ్కోలు తీసుకొని మరలా కారులో బయలుదేరాడు వైద్య.
‘మీ ఇరువురు భార్యాభర్తలు మీ అమ్మగారిని అమ్మ అనడం ఎలా కుదురుతుంది? అలాగే మీ అమ్మ మీ ఇరువురిని బేటా, బేటీ అనడం ఎలా

గో-మాత అనొద్దు (7వ పేజీ తరువాయ)
వీలవుతుంది? ఇబ్బంది లేదా?’ ప్రయాణంలో డ్రైవ్ చేస్తున్న డ్రైవర్‌ను ప్రశ్నించాడు వైద్య.
‘ఇబ్బందనుకుంటే అంతా ఇబ్బందే. మిగతా వారు ఎలా పిలుచుకుంటారో నాకు తెలియదు. మేం మాత్రం ఇలానే పిలుచుకుంటాము. మతమేదయినా చాలామంది ఇలాగే పిలుచుకుంటారని అనుకుంటాను. మా గురించి మీరనుకుంటారు తేడాగా. మీ గురించి మేం అలాగే తేడాగా అనుకుంటాము. కానీ అందరూ ఒకలానే అంటారు అనుకుంటాను. మీ కోడళ్లు కూడా అత్తమ్మ, మామయ్య అని వాళ్ల అత్తమామలను అంటారనుకుంటాను. అలాగే మీ పిల్లలను మీ భార్యాభర్తలు ఇరువురు కూడా అమ్మనాన్న అంటారనుకుంటాను. మీరు అమ్మనాన్న అన్నవారినే మీ భార్యగారు అమ్మ నాన్న అనడం కుదిరితే మేమూ అలానే అంటే ఎందుకు కుదరదు? ఆలోచనలోనే తేడా. అత్తను అమ్మగా, కోడలిని కూతురుగా చూసుకొనగలిగిన ఔదార్యముంటే సంసారాలు విచ్ఛిన్నమవవని, తల్లిదండ్రులు కొడుకులకు దూరంగా ఉండరని భావిస్తాను’ తాపీగా సమాధానం చెప్పాడు డ్రైవర్.
కారు చిన్నగా వెళుతోంది. రకరకాల ఆలోచనలు ముప్పిరి కొనసాగినై అనేక ప్రశ్నలు వేధించసాగినై.
‘ఇందాక మీ ఉపన్యాసంలో గోమాత, గోసంరక్షణ గురించి చాలా ఉన్నతంగా మాట్లాడారు. అభ్యంతరం లేదు. ముందు మాతను కాపాడమనండి. తరువాత గోమాతను కూడా కాపాడమనండి. అమ్మను బజారులో పడేసి, గోమాతను ఇంట్లోకి తెచ్చుకుంటే ఆ గోమాత కూడా నవ్వుతుంది మానవుడి జాణతనం గురించి. అమ్మను ఇంట్లో ఉంచుకున్నాక ఏ మాతను గౌరవించినా అభ్యంతరం ఉండదు. అసలు అమ్మను వద్దన్నాక ఏ అమ్మను గౌరవించినా ఫలితం ఉండదనుకుంటాను. ఇకపై తమరు చెప్పే ఉపన్యాసాలలో ఈ అర్థం వచ్చేలా చెపితే చప్పట్లు మాటేమో గానీ ప్రజలు కొద్దిగా ఆలోచనలో పడి వృద్ధులను గౌరవించడం నేర్చుకుంటారనుకుంటాను. ఆవులను సంరక్షిస్తే అవి మనను సంరక్షిస్తాయో లేదో తెలియదు కానీ తల్లిదండ్రులను గౌరవిస్తే మన పిల్లలు మనలను గౌరవిస్తారన్నది కచ్చితంగా నిజం. మన పిల్లలు మనలను చూసి నేర్చుకుంటారు. మనలను ఆదరిస్తారు. నేటి మనమే రేపటి వృద్ధ తల్లిదండ్రులం. ఈనాటి మన పిల్లలు రేపు మనలాగా తయారవుతారు. నేను చెప్పే భాషలో కొద్దిగా తప్పులుంటే ఉండవచ్చు గానీ భావంలో మాత్రం కరెక్ట్. దయ ఉంచి అర్థం చేసుకోండి. తప్పయితే క్షమించండి.’
ఇంకా ఆలోచనల్లో పడ్డాడు వైద్య. తన తండ్రి చనిపోయి మూడు సంవత్సరాలయింది. అమ్మ ఇక్కడికి వచ్చినపుడు తన భార్య వ్యంగ్యోకులతో కించపరచటం, ఏం మాట్లాడినా పెడర్థం తీయడం, తన పిల్లలను నానమ్మకు దూరం చేయటం, వారి పుట్టింటి గురించి గొప్పగా చెప్పడం, తన అమ్మ ఆచార వ్యవహారాలను కీతాగా చేయడం మొదలైన కార్యక్రమాల గమనించి, తన భార్యను ఏమీ అనలేక పోవడం, ఆమె క్రుంగిపోయి తన పల్లెకు వెళ్లడం.. ఆలోచిస్తే తను ఎంత అల్పుడో, ఎంత దౌర్భాగ్యుడో.. ఛీఛీ.. తన సంస్కారం, చదువు, ఆధ్యాత్మిక భావం నిజంకావా? పరుల కోసమేనా? తన బతుకంతా నాటకమేనా? ఒక గోవును చూసిన మాత్రం అమ్మను చూడలేడా? ఇది ఒక అన్యమతస్థుడైన, చదువులేని ఒక డ్రైవర్ ద్వారా తెలుసుకోవాలా? తనకు స్వంతంగా అర్థం కాదా? అమ్మ బాధ గురించి ఉదయం బాబాయి ఫోనులో బతిమిలాడితే ఆలకించడా? అన్న ఉంచుకోలేక పోతే అమ్మను తను ఉంచుకోలేడా? అన్నను చదివించిన దానికంటే తనను ఇంకా ఎక్కువ చదివించిన అమ్మ నాన్నల గురించి ఇలానేనా ఆలోచించేది? అన్నతో పోటీ పెట్టి తనను తక్కువ చదువుతో ఆపలేదు కదా? ఆర్థిక ఇబ్బందుల వలన అన్నయ్య కాదంటే తను కూడా అమ్మను కాదనాలా? ఎంత తెలివితక్కువ! తల్లిని కాదని చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట నా బోటివాడు! అలానే ఉంది తను అమ్మను కాదని గోమాతను పూజ చేయమనడం. రేపు నేను నా పిల్లలకు దూరమయ్యే విషయం తలుచుకుంటే ఈ రోజే ఆత్మహత్య చేసుకుందామనిపిస్తుంది. ఇలాగే అమ్మ కూడా బాధ పడుతుంటుందా? ఎంత బాధపడుతుందో? అమ్మా క్షమించు. అమ్మను తన భార్య అంగీకరించేలా, కచ్చితంగా అంగీకరించేలా చేయాలి. సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి నయానా భయానా అంగీకరింపజేయాలి. అలా కాని పక్షంలో అమ్మను నగరంలోనే వేరుగా ఉంచి ఆమె మంచి చెడ్డలు చూడగలగాలి. అలా కాని పక్షంలో తన ఉద్యోగానికి తాత్కాలికంగా సెలవు పెట్టి పల్లెకు వెళ్లి ఆమెను సంతోషపెట్టాలి. తరువాతనే ఏ విషయమైనా. ఈ విషయం అమ్మకు, బాబాయికి వెంటనే ఫోన్ చేయాలి...
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.netకు మెయల్‌లో పంపాలి.

హిందుత్వానికి శివాజీ ప్రాణప్రతిష్ఠ

$
0
0

పుణ్యభూమియైన భారతావనిలో అనేకానేక దేశభక్తులు తమ జీవితమే ధర్మంగా, ధర్మప్రతిష్ఠాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యులైనారు. వారిలో నిత్యస్మరణీయుడు శివాజీ. శాలివాహన శకం 1596 ఆనందనామ సంవత్సరం జ్యేష్ఠ శుక్ల త్రయోదశి శనివారం సూర్యోదయాత్పూర్వం మూడు ఘడియల ముహూర్తాన 1674 జూన్ 6న ఛత్రపతి శివాజీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. తద్వారా తొలి స్వరాజ్య సంస్థాపకుడైనాడు. అందుకే జ్యేష్ఠ శుక్ల త్రయోదశిని ‘‘హిందూ సామ్రాజ్య దినం’’గా జరుపుకుంటారు. నేలకొరిగిన హిందూ ధ్వజాన్ని మళ్ళీ ఉత్తుంగ శిఖరాలలో ఎగురవేసి, మృతప్రాయమై ఉన్న హిందూత్వంలో అమృతాన్ని నింపి ప్రాణప్రతిష్ఠ చేసిన మహనీయుడు శివాజీ. అతి సామాన్య బాల్యం, సాహసోపేత యవ్వనం, ప్రదర్శిత ధైర్యం, రాజనీతిజ్ఞత, చతురత, హిందువులలో మేల్కొలిపిన స్వాభిమాన పూర్ణ దేశభక్తి అజరామరాలు. మహారాష్ట్ర ప్రాంతంలో యాదవులు స్థాపించిన హిందూ సామ్రాజ్యం 1307 మార్చి 24తో ఢిల్లీ సుల్తాను ఖిల్జీ ద్వారా నాశనము చేయబడగా, 350 ఏళ్ళ వరకు మరియొక హిందూ సామ్రాజ్యమే లేకుండెను. ఔరంగాబాద్ సమీపాన వేరూడ్ గ్రామానికి చెందిన మాలోజీరావు అహ్మద్‌నగర్ సుల్తాన్ నిజాంషాహి కొలువులో ఉద్యోగియై, శ4క్తియుక్తులతో పూనా జాగీరును సంపాదించాడు. మొగలులతో యుద్ధం చేస్తూ, 1605లో మరణించాడు. అప్పటికి మాలోజీరావుకు ఐదు ఏళ్ళ శహాజీ, మూడేళ్ళ అరీఫ్‌జీ కుమారులుండిరి. మాలోజీ తమ్ముడగు విఠోజీ వద్ద పెరగగా, నాటి నిజాంషాహి కొలువులోని సర్దారు లఖూజీరావు కూతురు జిజియాబాయితో శహాజీ వివాహం జరిగింది. చిన్నతనాననే అత్తవారింటికి వచ్చిన జిజియాకు దేశ పరిస్థితిపై పూర్తి అవగాహన కలిగింది. గోవధలు, దేవాలయాలు, విగ్రహాల ధ్వంసాలు, ఆస్తుల దోపిడీలు ఇళ్ళ దహనాలు చూశాక, ఆమెలో జుగుప్స రేగింది. బాల్యముననే రామాయణ, భారతాది గ్రంథాల పఠనం మూలంగా విదేశీపాలన నుండి విముక్తి కలిగి రామరాజ్య స్థాపన కావాలనే కోరిక ప్రబలమై నిలిచింది. జిజియాబాయి తండ్రి లఖూజీరావుకు ముగ్గురు కుమారులు కాగా, వారి పలుకుబడులు నిజాంషాహికి కన్రెర్ర గావించగా, తన రాజధానియగు దౌలతాబాద్‌కు లఖూజీరావు, ఆయన కుమారులను పథకం ప్రకారం పిలిపించి, నలుగురిని 1629 జూలై 25 ఆషాఢ పౌర్ణమి నాడు హత్య గావించాడు. శహాజీ మొగలుల వద్ద పనిచేస్తున్న సమయాన 1630 ఫిబ్రవరి 19వ తేదీన ‘‘్భవి హైందవ సామ్రాజ్య నిర్మాతయైన శివాజీ’’ జన్మించాడు. శహాజీ తన జాగీరు పాలనా నిర్వహణకై పండితుడు, పాలనాదక్షుడగు దాదాజీ కొండదేవ్ అనే బ్రాహ్మణుని నియమించుకోగా, జిజియాబాయి, కుమారునితో సహా ఆయన పర్యవేక్షణలో ఉండిరి. దాదాజీ కొండదేవ్, శివాజీకి వయసుకు తగ్గ విద్యలు, చక్కని శిక్షణనిచ్చి, పదవ ఏట వివాహం కూడా చేశాడు. వివాహానికి రాలేని తండ్రిని కలవడానికి బెంగుళూరు వెళ్ళిన శివాజీకి, తండ్రి బీజాపూర్‌ను చూపించగా, తురుష్కుల వల్ల ఉజ్జ్వలమైన విజయనగర సామ్రాజ్యం విధ్వంసం, ఫలితంగా కొల్లగొట్టబడిన ధనముతో వారు ఆనందంతో తులతూగే సంఘటనలు హృదయంలో ప్రతిష్ఠితాలైనాయి. శివాజీ స్వాతంత్య్ర భావాలను గ్రహించిన శహాజీ, తన కుమారుని పూనాకు పంపుతూ, శాంరావు రాంఘేకర్ అనే అనుభజ్ఞుని పీష్వాగా నియమించాడు. దేశభక్తి ఉగ్గుపాలతోనే రంగరించుకున్న శివాజీ, తల్లి శిక్షణలోనే రామరాజ్యం వంటి హైందవ సామ్రాజ్యం నిర్మాణం చేయాలనే కోరిక స్థిరపడింది. శివాజీ జాగీరులో రాంఝా గ్రామపు పటేలు ఒక స్ర్తిని బలాత్కారం చేయగా, శివాజీ 1645 జనవరి 28న పటేలును బంధించి, కాళ్ళు చేతులు నరికించి శిక్షించాడు. అలా క్రమంగా ప్రజల అభిమాన పాతృడైనాడు. కాశ్మీరం నుండి కావేరీ వరకు మధ్యనున్న చాందా, గోండువనం వదిలి మిగిలిన దేశమంతా తురుష్కుల ఆధీనంలో ఉండేది. దేవగిరి, విజయనగరం రాజ్యాలు అస్తమించాక, రెండుసార్లు శహాజీ చేసిన స్వరాజ్య ప్రయత్నాలు విఫలం కాగా, శివాజీ మిత్రులందరితో భవిష్యత్ సామ్రాజ్య నిర్మాణం కోసం పాడుపడిన దేవాలయం, కొండగుహ, కీకారణ్యం, ఇసుకతినె్న లాంటి ప్రదేశాలలో చర్చోపచర్చలు జరిపేవాడు. మొదట బీజాపూర్ సుల్తాన్‌చే నిర్లక్ష్యం కాబడిన ‘కాన’ లోయలోని ‘తోరణ’ దుర్గాన్ని జయించి, హిందూ సామ్రాజ్య నిర్మాణానికి తోరణం కట్టాడు. అందు లభించిన నిధితో తోరణ దుర్గానికి ఎదురుగా ఉన్న ‘మురుంబదేవ’ గిరిపై కొత్త కోటను నిర్మించి, ‘‘రాజ్‌ఘడ్’’ అని పేరు పెట్టాడు. తర్వాత ‘కువారి’ కోటను వశం చేసుకున్నాడు. ఇవన్నీ పదహారేళ్ళ ముక్కుపచ్చలారని ప్రాయంలో శివాజీ చేసిన గొప్ప పనులు. తర్వాత కొండణాకోటను తన స్వరాజ్యంలో కలుపుకున్నాడు. శివరళ, సుభానుమంగళి దుర్గాలను వశపరుకున్నాడు. ఇంతలో 1648 జూలై 25న శహాజీ, వజీరు ముస్త్ఫా, బాజీ ఘోర్పడేలు సైన్యంతో శహాజీని బంధించాడు. బీజాపూర్ సుల్తాన్‌ను శరణు వేడడమా? తండ్రి ప్రాణమా? స్వరాజ్యమా? అనే ప్రశ్నలకు తల్లి జిజియాబాయి తన మాంగల్యంకన్నా దేశభక్తినే ప్రోత్సహించి, సమాధానం లభింప చేసింది. పురంధర కోటలో ఉన్న శివాజీ కొద్ది సైన్యానికి ఫతేఖాను సైన్యానికి భీకర యుద్ధం జరగగా, శివాజీకే విజయం చేకూరి, చివరకు 1648 ఆగస్టు 8న ఫతేఖాను ఓడింప బడ్డాడు. పురంధర దుర్గంలో ఫతేఖాను, బెంగుళూరులో ఫరాదఖాన్ ఓటముల పాలు కాగా, బీజాపూర్‌లో శహాజీ కూడా 1649 మే 16న జ్యేష్ట లేక వట పౌర్ణమి నాడు బంధ విముక్తుడైనాడు. 1654 మే 23న బీజాపూర్ సుల్తాన్ మహరాజ్‌పంత్ మరణించగా, ఆయన నలుగురు కుమారుల తగవుల కారణంగా, శివాజీ వారిని బంధించి, ఉచిత పదవులు కట్టబెట్టి, నేతాజీ పాల్కర్ అనే సర్దార్‌ను అధికారిగా నియమించాడు. కృష్ణానదీ సమీప టావళి అధిపతి దౌలత్‌రావు మృతి చెందగా, ఆయనకు సంతానం లేకపోగా, ఆయన భార్య దత్తపుత్రునిగా యశ్వంతరావుకు పదవినిచ్చాడు. ఆయన శివాజీ అధికారానికి ఇష్టపడని కారణాన 1656లో యుద్ధంలో ఓడించి, స్వరాజ్యంలో కలుపుకున్నాడు. దీనిలో అంతర్భాగ కొండ ప్రాంతమైన ‘రాయరి’ కోటనే కొనే్నళ్ళకు శివాజీ రాజధానిగా రాయగడ దుర్గంగా ఏర్పడింది. 1956 నవంబర్ 2న బీజాపూర్ సుల్తాన్ ఆదిల్‌షా చనిపోగా, మొగలు సామ్రాజ్య దక్షిణ సుబేదారైన ఔరంగజేబు అనుమతిని పొంది, 1957 ఏప్రిల్ 23న స్వరాజ్యంలో కలుపుకున్నాడు. బీజాపూర్ ప్రాంతం నుండి కోండ్వానా కొంకణ, దండరాజపురి, భీవండి, కళ్యాణి, మాహు తదితర కోటలను పోర్చుగీసు వారి నుండి చోళ ప్రాంతాన్ని జయించాడు. కటావ్, మయణి, అష్టి, ఖరాహడ్, సుపే, కొల్హాపూర్, పనాళిగఢ్, యెగావ్ తదితర కోటలను జయించాడు. ఔరంగజేబు సలహాదారులైన కారతలబ్‌ఖాన్, నామదర్‌ఖాన్, ఇనాయత్‌ఖాన్, షహిస్తఖాన్, భావసింహ, జస్వంతసింహ తదితరులు ఓడించాడు. అహ్మద్‌నగర్, సూరత్, జున్నర్ నగరాలను లూటీ చేశాడు. అలా సాగిన శివాజీ జైత్రయాత్ర ఫలితంగా శాలివాహన శక 1596 ఆనందనామ సంవత్సర జ్యేష్ట శుక్ల త్రయోదశి శనివారం సూర్యోదయాత్పూర్వం మూడు ఘడియల సుముహూర్తాన 1674 జూన్ 6న సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజ్యాభిషేకానంతరం రాజ్యారోహణం జరిగింది. ఆంగ్లేయుల రాయబారి హెన్రీ ఆక్సెండర్ మహారాజుకు ప్రణమిల్లి 1600 రూప్యములను కానుకగా సమర్పించాడు. తన రాజ్యానికి అష్ట ప్రధానుల పారసీక నామాలను మార్చి సంస్కృత పేర్లు పెట్టాడు. ప్రభుత్వ యంత్రాంగం సంస్కృతంలోనే సాగాలని రాజ్య వ్యవహార కోశమును తయారు చేయించాడు. ముప్పై సంవత్సరాలు శివాజీ, ఆయన అనుచరులు చూపిన పరాక్రమాలు, కర్తృత్వ శక్తి, త్యాగశీలత, ధ్యేయ నిష్ఠ, హిందువులలో నూతనోత్తేజం నింపి, సార్వభౌమాధికార యుక్త స్వరాజ్యం స్థాపించ బడినది. యాభై ఏళ్ళ సామ్రాజ్య నిర్మాణ కృషి ఫలితంగా దేహం పూర్తిగా అలసిపోగా, ఆరోగ్యం క్షీణించి, 1680 ఏప్రిల్ 3న చైత్ర శుక్ల పాడ్యమి నాడు శివాజీ తుది శ్వాస వదిలాడు.

ఊహకందని అద్భుతాలు

$
0
0

పశ్చిమ గ్రీన్‌ల్యాండ్‌లోని ఒక దీవిలోగల ఉపర్నావిక్ అనే మత్స్యకార గ్రామం ఫొటో ఇది. ఈ సంవత్సరం నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ ఫొటో పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఫొటోగ్రాఫర్ వీమిన్ చు ఈ ఫొటోను తీశాడు. అతను అక్కడికి విమానంలో వెళుతున్నప్పుడు దారి మొత్తం మంచుతో కప్పేసి ఉన్న తెల్లటి భూమి మాత్రమే కనిపించిందట. కానీ అకస్మాత్తుగా చాలా దూరంలో ఒక పెద్ద వేడి చుక్క కనిపించిందట. అదే ఉపెర్నావిక్. అలా ఈ గ్రామ అందం అతనికి ఊహకు అందనంత అద్భుతంగా అనిపించిందట. ఈ గ్రామ జనాభా సుమారు వేయిమంది. మొత్తం దేశంలో 13వ అతిపెద్ద గ్రామం ఇది. ఈ గ్రామంలో వీమిన్ ఆరురోజుల పాటు ఫొటోలు తీస్తూ గడిపాడట. అలా వీధి దీపాల వెలుగులో నడుస్తున్న ఓ కుటుంబం ఫొటో తీశాడు. అదే నేడు బహుమతిని తెచ్చిపెట్టింది.

* ఇది శాన్‌ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని రన్‌వేల దృశ్యం. ఇక్కడ నాలుగు రన్‌వేలు ఉన్నాయి. విమాన కదలికలను డాక్యుమెంట్ చేయాలన్నది ఈ ఫొటోగ్రాఫర్ స్వప్నం. అందుకోసం అతను దానికి సంబంధించిన అనుమతులను సంపాదించాడు. ఈ ఫొటో తీస్తున్నప్పుడు అక్కడ బలమైన గాలులు వీచాయి. గంటకు 35 నుంచి 45 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. అలాంటప్పుడు విమానయానంలో కుదుపులు ఉంటాయి. ఇలాంటి సమయంలో ఒకవైపు అందమైన ఫొటోలు తీస్తూ తనను తాను నియంత్రించుకున్నాడు ఫొటోగ్రాఫర్ జాసెన్ తొదొరోవ్. ఈ ఫొటో రెండో బహుమతిని సొంతం చేసుకుంది.

* స్పెయిన్‌లోని మాన్‌ఫ్రేగ్ నేషనల్ పార్క్‌లో ఆకాశంలో దూసుకుపోతున్న అందమైన గ్రిఫాన్ రాబందు ఇది. మృత పదార్థాలను రీసైకిల్ చేసే పనిని చూసుకునే రాబందులు పర్యావరణంలో చాలా ముఖ్యమైన సభ్యులు. తమారా బ్లాక్వెజ్ హేక్ తీసిన ఈ ఫొటో ప్రకృతి పరంగా తీసిన ఫొటోలలో మొదటి బహుమతిని సంపాదించుకుంది.

* స్విట్జర్లాండ్‌లోని బెర్నీస్ ఓబెర్లాండ్‌లో లేక్ బ్రీన్జ్‌పై పర్వత శ్రేణిని ఐబెక్స్‌లు దాటుతుంటాయి. ఈ ఆల్ప్స్ రారాజులు ఎలా ఉంటాయనేది వాటి శక్తివంతమైన కొమ్ములు చాటుతున్నాయి. కళ్లు తిరిగే ఎత్తులో నివసించడానికి అలవాటుపడ్డ ఐబెక్స్‌లు సుదీర్ఘ పర్వతశ్రేణి పథం, దానిపై మంచుపొర.. ఈ జీవుల సహజ ఆవాసాన్ని చూపుతున్నాయి కదూ.. ఈ ఫొటోను జోనాస్ స్క్ఫార్ అనే ఫొటోగ్రాఫర్ తీశాడు. దీనికి గౌరవ బహుమతి లభించింది.

* న్యూజిలాండ్‌లోని కైకోరా అగాథాల్లో డస్కీ డాల్ఫిన్లు ఆహారానే్వషణలో తరచుగా పెద్దసంఖ్యలో ప్రయాణిస్తుంటాయి. సముద్రంలో సునాయాసంగా జారిపోతుంటాయి. శ్వాస తీసుకోవడానికి మాత్రమే బయటికి వస్తుంటాయి. అలాంటి సమయంలో స్కాట్ పోర్టెలి అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో ఇది. దీనికి తృతీయ బహుమతి లభించింది.

* అల విరిగేముందు ఏం జరుగుతుంది?
ఈ ప్రశ్నను బేస్ చేసుకుని డానీ సెపెకోవ్‌స్కీ అనే ఫొటోగ్రాఫర్ ఏడాది కాలంగా పనిచేశాడు.
ఆ రోజున హవాయిలోని ఓహు తూర్పు వైపు సూర్యాస్తమయం సమయంలో అల
విరుగుతుండగా అతని కెమెరా వ్యూఫైండర్‌లోకి చూసింది. అలా తీసిన
ఈ ఫొటో నేడు రెండో బహుమతిని సంపాదించుకుంది.


దశాంశ పద్ధతి

$
0
0

కలన యంత్రాలు వాడుకలోకి రాక పూర్వం, మనందరికీ దశాంశ పద్ధతిలో లెక్కలు చెయ్యటం అలవాటు ఉండేది. ఈ ‘దశాంశ’ని ఇంగ్లీషులో ఏమంటారో మనకి తెలుసుకోవలసిన అవసరం లేదు; ఎందుకంటే యూరప్‌లో లెక్కపెట్టటం (లెక్కలు చెయ్యటం కాదు, కేవలం లెక్క పెట్టటం) కూడా చేతకాని రోజులలో మన దేశంలో పదులు, వందలు, వేలు, లక్షలు, కోట్లు, అర్బుదాలు, క్షోణిలు, మహౌఘాలు అంటూ లెక్క పెట్టేవారు. ఈ స్థోమతకి మూల కారణం మన దేశస్థులు కనుక్కున్న ‘స్థాన బలం’ (positional value) సూత్రం. సున్న, ఒకటి, రెండు... తొమ్మిది అంటూ పది అంకెలని నిర్థారించి ఆ పది అంకెల గుర్తులనే ఎంత పెద్ద సంఖ్యలు రాయటానికైనా పదేపదే వాడటం అనేది ఈ సూత్రంలోని కిటుకు. వెనక దృష్టితో ఇది ఇప్పుడు చెప్పటం తేలికే కానీ ఈ ‘సూక్ష్మం’ తెలియక ఐరోపాలో శతాబ్దాల పాటు తికమక పడి అంధకార యుగంలో కొట్టుకున్నారు.
పది నిర్దిష్టమైన గుర్తులు (లేదా అంశలు) (0,1,2,3,4,5,6,7,8,9) ఉన్న పద్ధతి కనుక దీనిని దశాంశ పద్ధతి అన్నారు. ఈ దశాంశ పద్ధతిలో వాడే ఈ పది అంశలనీ ఇంగ్లీషులో డిజిట్స్ (digits) అన్నారు. నిజానికి ‘ఢిజిట్స్’ అంటే చేతి వేళ్లు. మనకి వేళ్ల మీద లెక్క పెట్టటం అలవాటు కనుక అంతవరకు వేలుని సూచించటానికి వాడుకలో ఉన్న డిజిట్ అనే ఇంగ్లీషు మాట ‘అంకె’ (number అనే కొత్త అర్థం సంతరించుకుంది.
కాలచక్రం గిర్రున తిరిగి ఇరవైయవ శతాబ్దపు మధ్యికి వచ్చేం. కలన యంత్రాల ప్రతిభ అర్థం అవుతూన్న రోజులు అవి. ఈ కలన యంత్రాలని నిర్మించటానికి రెండే రెండు అంశలు (0,1) ఉన్న గణితం వాడితే పని తేలిక అవుతుందని గ్రహింపునకు వచ్చింది. కానీ డిజిట్ అనే మాట అప్పుడే దశాంశ పద్ధతిలో అంకెలని సూచించటానికి వాడుకలో ఉంది. రెండే రెండు అంశలు ఉన్న కొత్త రకం లెక్కింపునకు కొత్త పేరు కావలసి వచ్చింది. ముందస్తుగా ‘దశాంశ పద్ధతి’ని ‘డెసిమల్ సిస్టం’ (decimal system) అనమన్నారు. ఇప్పుడు రెండే రెండు అంశలు ఉన్న దానిని ‘బైనరీ సిస్టం’(binary system) అనమన్నారు. ఇంతవరకు మన పురాణాలలోనూ, చరిత్రలోనూ ఎక్కడా ‘బైనరీ సిస్టం’ అన్న భావం తగలలేదు. ఇప్పుడు దీనికి మనం కొత్త పేరు పెట్టుకోవాలి. ఎలా?
మనకి కొద్దో గొప్పో సంస్కృతం వచ్చు కనుక ‘దశాంశ’ అనేది సంస్కృత పదం అని గుర్తించేం. అంతే కాదు, మనం కానె్వంటులో కాకుండా వీధి బడిలో చదువుకున్నాం కనుక మనకి తిథులు తెలుసు; పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి.. దశమి, ఏకాదశి.. అలా అలా. పది అంశలు ఉన్న గణితాన్ని దశాంశ గణితం అన్నట్లే రెండే రెండు అంశలు ఉన్న గణితాన్ని ‘విదియాంశ’ (విదియ + అంశ) అని కానీ, ‘ద్వియాంశ’ (ద్వి+అంశ) అని కాని అనొచ్చు. కనుక ‘బైనరీ సిస్టం’ అన్న మాటకి తెలుగేమిటి? విదియాంశ పద్ధతి కాకపోతే ద్వియాంశ పద్ధతి. ఏ కారణం వల్లనోనేను ద్వియాంశ అనే మాటని ఎంచుకున్నాను, 1968లో.
వరద తలుపులని తెరుద్దాం. ద్వియాంశ (బైనరీ), అష్టాంశ (ఆక్టల్), షోడశాంశ (హెక్సాడెసిమల్) అలా ఎన్ని పేర్లు అయినా - మనకి అలవాటయినవి, పరిచయం అయినవి, పేరు వినగానే అర్థం అయేవి -పెట్టుకోవచ్చు.
‘బిట్’
కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి ‘బిట్’ అనే మాట సుపరిచితమే. ఈ అర్థంతో ఈ మాట ఇంగ్లీషు భాషలోకి ప్రవేశించినది ఉరమరగా 1940 ప్రాంతాలలో. అవి కంప్యూటర్లు ఇంకా పరిశోధనా స్థాయిలోనే ఉన్న రోజులు. క్లౌడ్ షేనన్ మొదటిసారి ‘బిట్’ అనే మాటని 1948లో ‘ఎ మేథమెటికల్ థియరీ ఆఫ్ కమ్యూనికేషన్’ అనే పరిశోధనా పత్రంలో వాడేడు. వాడి, ఈ మాట అంతకు పూర్వమే జాన్ టూకీ 9 జనవరి 1946న ‘బహుళంగా ప్రచారం చెందని’ ఒక కంపెనీ వారి అంతర్గత పత్రంలో వాడేడని చెబుతూ ఒక వీరతాడుని టూకీ మెడలో వేసేడు. ఇదే మాటని (ఇంత నిర్దిష్టార్థంతో కాకపోయినా) వానె్నవార్ బుష్ 1936లోనే వాడేడన్న విషయం తరువాత పరిశోధన చేసి పీకేరు. ఇక్కడ మనం స్మరించిన ముగ్గురూ కలన యంత్రాల రంగంలో హేమాహేమీలు.
‘బిట్’ అనేది ‘బైనరీ డిజిట్’ అన్న ఇంగ్లీషు మాటలలోని అక్షరాలలో కొన్నింటిని ఏర్చి, కూర్చిన మాట. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ఈ రకం మాటలు కొల్లలు. ‘తొలగిపోతున్న తెలుగు పదాలు’ అనే మకుటం కింద ముత్తేవి రవీంద్రనాథ్ ఇచ్చిన మచ్చులు కొన్ని ఉదాహరిస్తాను.
అడి + ఆస = అడియాస
అడుగు + ఒత్తు - ‘అడియొత్తు’ shoe - wooden shoe
అడ్డము + కర్ర = అడ్డకర్ర
అడ్డము + కాలు = అడ్డగాలు
గణితంలో వచ్చే తెలుగు మాట ‘కసాగు’ (కనిష్ట సామాన్య గుణిజము) అనేది ‘లీస్ట్ కామన్ మల్టిపుల్ ( (least common multipile లేదా LCM) ) అన్న దానికి మక్కీకి మక్కీ తెలుగు అనుకరణ. కనుక ‘బిట్’ని తెలుగులోకి తర్జుమా చెయ్యాలంటే ముందు binary digit ని ‘ధ్వియాంశ అంకము’ అని తెలుగులో రాసుకుని, కొంచెం కుదించి ‘ద్వింకము’ (లేదా విదియాంకం) అనొచ్చు. నేను 1968లో రాసిన నా కంప్యూటర్లు పుస్తకంలో చేసిన పని ఇదే.
మరి కంప్యూటర్ పరిభాషలో ‘నిబుల్’ (nibble అనీ, ‘బైట్’ (byte) అనీ, ‘వర్డ్’(word) అనీ సంబంధితమైన మాటలు ఉన్నాయి కదా. వాటి సంగతి కూడా తేల్చేద్దామా? ముందు ‘బైట్’తో మొదలుపెడదాం. ఇది ఇంగ్లీషులోని ‘బైట్’ (కొరకటం) కి భ్రష్ట రూపం. చిన్నచిన్న ముక్కలుగా కొరుక్కు తినటాన్ని ‘నిబ్లింగ్’ (nibbling) ) అంటారు. కొంఛెం పెద్ద ముక్కలుగా కొరకటాన్ని ‘బైటింగ్’ (biting) అంటారు. కనుక నాలుగు ధ్వింకములు ఒక నిబుల్, ఎనిమిది ద్వింకములు ఒక బైటు అని అనటం మొదలుపెట్టేరు. నిబుల్ ఇప్పుడు వాడుకలో అంతగా లేదు. చింతపిక్కలాటలో నాలుగు పిక్కలు ఒక పుంజీ. ఎనిమిది పిక్కలు ఒక గుర్రం. మనం నిబుల్ ని పుంజీ అనీ, బైట్ ని గుర్రం అనీ అంటే వచ్చే ప్రమాదం ఏమీ లేదు. లేదా ఇంతకంటె మంచి పేరు ఆలోచించటం కష్టమూ కాదు.

బాలకవుల కాణాచి - ‘తడ్‌పాకల్’

$
0
0

అదొక పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీరాముడు నడయాడిన పవిత్ర ప్రదేశంగా ప్రత్యేక గుర్తింపు. విశాలమైన పరుపు బండలపై హోయలుపోతూ గలగల సవ్వడితో ప్రవహించే పవిత్ర గోదావరి నది. అంతటి మహిమాన్వితమైన ఆ పుణ్యభూమి బాల కవుల కాణాచిగా మారింది. అంశం ఏదైనా, పారుతున్న నది సవ్వడి చేస్తున్నట్లే ఆ విద్యార్థుల కవిత ఝరులు ప్రవహిస్తాయి. కవితలు రాస్తూ, కథలు అల్లుతున్న ఆ విద్యార్థులు చందోబద్ధంగా పద్యాలు రచించేందుకు సమాయత్తం అవుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడ్‌పాకల్ ఉన్నత పాఠశాల బాల కవుల కార్ఖానాగా మారింది. ఇప్పటికే జిల్లా, రాష్టస్థ్రాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన ఆ పసికూనలు, తాజాగా, రాష్టస్థ్రాయి కథల పోటీల్లో తమ ప్రతిభను కనబర్చుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. పిల్లల్లో అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీస్తే అద్భుత ప్రతిభ చూపుతారని మానసిక నిఫుణులు చెబుతున్న మాటలను ఆ పాఠశాల విద్యార్థులు అక్షర సత్యాలు చేస్తున్నారు. పాఠశాలకు చెందిన తెలుగు భాషా పండితుడు ప్రవీణ్‌శర్మ, విద్యార్థుల్లో దాగిఉన్న రచన సామర్ధ్యాన్ని వెలికి తీయడంతో ఆ పిల్లలు రాసిన కవిత ఝరులు అద్భుత సవ్వడి చేస్తున్నాయి. కవితలు, రచనలు రాయడంలో ప్రవీణ్‌శర్మ చూపిన బాటలో విద్యార్థులు రచించిన అనేక కవితలు ఇప్పటికే ఏడు పుస్తకాలుగా ముద్రించబడ్డాయి. ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాసభల్లో 4పుస్తకాలను అవిష్కరించిన భాషాభిమానులచే శభాష్ అనిపించుకున్నారు. చిగురు బాలశతకం, గుడుత శతకం, చెట్టు శతకం, చిగురుకొమ్మ, బాల కవితా తరంగాలు తదితర పుస్తకాలన్నీ ఆ చిన్నారి చేతులు రాసిన కవిత సంపుటిలే. వంద కవితలు పూర్తికాగానే పుస్తకాన్ని అచ్చు వేయించుకోవడం ఆ విద్యార్థులకు అలవాటుగా మారింది.
నాన్నా..
నాన్నా అనే శీర్షికపై రజిత 9వ తరగతి విద్యార్థిని రాసిన కవితను చదివితే కళ్లు చెమర్చకమానవు. నవమాసాలు మోయకపోయినా, పురిటి నొప్పులు తెలియకపోయినా కడుపులో పెట్టుకుని మా ఆకలి తీర్చావు. మా విజయానికి ప్రతీసారి నీవే నాన్నా, ఓటమిని ఎత్తుకుని బడుగు జీవుల బతుకు లాగుతున్నావంటూ కొనసాగిన ఆ శీర్షిక విద్యార్థుల ప్రతిభకు అద్దంపడుతోంది. రైతు, ఆటస్థలం, ఆప్యాయత, హరితహారం, సూర్యోదయం, పల్లెటూరు, తెలుగుభాషా ఇలా అనేక శీర్షికలపై విద్యార్థుల కవితా సంపూటిలను చదివిన వారంతా శభాష్ అన్నారు. హైదరాబాద్, సిరిసిల్లా తదితర ప్రాంతాల్లో జరిగిన ఉమ్మడి రాష్ట్రాల కవిత పోటీల్లోనూ బహుమతులు పొంది తడ్‌పాకల్ ఖ్యాతిని సమాజానికి చాటిచెప్పారు. 2017సంవత్సరంలో చిగురు బాల శతకం జాతీయస్థాయిలో ఉత్తమ పుస్తకంగా ఎంపికైంది. తెలుగు మహాసభల్లో అనేకమంది విద్యార్థిని, విద్యార్థులు తమ కవిత ఝరిని వినిపించి, బహుమతులు పొందారు. బాల కవిత తరంగాలను 2013సంవత్సరంలో అష్ఠావధాని గణపతిశర్మ ఆవిష్కరించగా, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహిత స్వర్గీయ డాక్టర్ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణకు నోచుకుంది. జిల్లా కేంద్రంలో జరిగిన తెలుగు మహాసభల్లోనూ విద్యార్థుల ప్రతిభను జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అభినందించారు. నేటికి కూడా పాఠశాలలో కాలక్రమణ పట్టికలో కొంత సమయాన్ని కవిత రచనలకు కేటాయిస్తూ తీర్చి దిద్దుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ బాల సాహిత్య పరిషత్, ఆనేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ బడిపిల్లల కథల పోటీల్లో తడ్‌పాకల్ విద్యార్థులు తమ సత్తా చాటారు. దాదాపు 450కథలు రాగా, నిర్వాహకులు అందులో 50ని ఎంపిక చేయగా, తడ్‌పాకల్ పాఠశాల విద్యార్థుల 28కథలు అందులో స్థానం సంపాదించాయి. తొలి విడతలో 14కథలను తీసుకున్న నిర్వాహకులు, మలి విడతకు మరో 14కవితలను ఎంపిక చేశారు. త్వరలో ఈ బాలకవులందరినీ హైదరాబాద్ వేదికగా ఘనంగా సన్మానించనున్నారు. ఏ విద్యార్థిని కదిపినా, కవితా ఝరి ప్రవహిస్తునే కనిపిస్తుంది.
ప్రతిభను వెలికితీశాం : ప్రవీణ్‌శర్మ
పాఠశాలల్లో జరిగిన వివిధ పోటీల్లో విద్యార్థుల ప్రతిభను గుర్తించామని, చిన్నపాటి వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేస్తూ శిక్షణ అందించడంతో మరింత చక్కగా కవితలు, కథలు రాస్తున్నారని తెలుగు భాషా ఉపాధ్యాయుడు ప్రవీణ్‌శర్మ తెలిపారు. కొంతమంది విద్యార్థులు చందోబద్ధంగా పద్యాలు కూడా రాస్తున్నారని, త్వరలోనే శతక పద్యాల పుస్తకాన్ని అచ్చు వేయిస్తామన్నారు.
ఉపాధ్యాయుల స్ఫూర్తితోనే...
ఉపాధ్యాయులు అందిస్తున్న సూచనలు, సలహాలు పాటిస్తునే కవితలు రాయగలుగుతున్నామని 9వ తరగతికి చెందిన జాహ్నవి, సమీర్ అనే విద్యార్థులు తెలిపారు. చేయూతను అందిస్తే ఎలాంటి విద్యార్థినైనా నిష్ణాతులైన రచయితలుగా మారుతారని తడ్‌పాకల్ విద్యార్థులు చాటిచెబుతున్నారు.

అస్తిత్వం కోరుతున్న ఆదివాసీ చిత్రకారులు

$
0
0

అది 2015 సంవత్సరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది కాలం గడిచింది. హైదరాబాద్‌లో ‘ఆదిచిత్ర’ (ఆదివాసీల చిత్రకళ) పేర ఓ పెద్ద కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. అందులో నాయక్‌పోడ్ గిరిజన తెగకు చెందిన కొందరు తమ ‘దేవర్ల’ను తీసుకొచ్చి, తొడుగులను (మాస్క్‌లను) ముఖాలకు తగిలించుకుని ‘నృత్యం’ చేశారు. నాయక్‌పోడ్ తెగకే ప్రత్యేకమైన ఆ నృత్యం ఎందరినో ఆకర్షించింది. ఆ బృందానికి పసుల బుచ్చయ్య నాయకత్వం వహించాడు.
పసుల బుచ్చయ్య చిత్రకారుడు, ఉద్యమకారుడు, రచయిత.. ఇట్లా అనేక పాత్రలు పోషించే వ్యక్తి ఆ తెగలో ఉండటం అపురూపం.
నాయక్‌పోడ్‌ల దేవర్లను, మాస్క్‌లను రూపొందించడం వెనుక ఎంతో నిష్ట.. రంగుల నైపుణ్యం.. సృజనాత్మకత దాగున్నది. సింగబోయడు, లక్ష్మీదేవర, గుర్రాపోతు (దున్నపోతు) ఇట్లా రకరకాలైన మాస్క్‌లను తయారుచేసి వాటిని రంగులతో అలంకరించడంలో వారి సంప్రదాయ నైపుణ్యం, నాజూకుతనం తొంగి చూస్తుంది. భక్తిశ్రద్ధలతో, అంకిత భావంతో, తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాల కనుగుణంగా వాటిని రూపొందిస్తున్నారు. ఈ మాస్క్‌ల కోసం అడవి నుంచి కొనికి కర్ర (మొద్దు) తెచ్చి ఆరబెట్టి ఏ ఆకృతిని తీర్చిదిద్దాలనుకుంటే దాని కనుగుణంగా ఉలితో చెక్కి, ముందు భాగంలో మాత్రమే ఆ ఆకారం కనిపించేలా చేసి మధ్యలో డొల్లగా మార్చి కొన్ని రోజులు ఆరబెట్టాక అనంతరం చింతజిగురు, కవిశ జిగురు తయారుచేసి ఆ ఆకారానికి ‘బకరాం క్లాత్’ (మందమైన బట్ట) ఆ ఆకృతికి చుట్టి జిగురు పట్టిస్తారు. మళ్లీ ఆరబెట్టాక ప్రాథమిక రంగులు వేస్తారు. ఆఖరున అవిశెనూనె పూస్తారు. దాంతో ఆ ఆకృతి అందంగా మెరుస్తుంది. సంప్రదాయ సిద్ధమైన లక్ష్మీదేవర, కొర్రాజుల తదితర నాయక్‌పోడ్ దేవతల ఆకారాలు తయారుచేస్తే కొలుపులు - జాతరలు చేసి పండుగ చేస్తారు. ఆ విధంగా ఆ దేవతల ఆకృతులు వివిధ చోట్ల భద్రపరుస్తారు. మాస్క్‌లను సైతం పవిత్రంగానే చూస్తారు.
ఇప్పుడు బుచ్చయ్య కొనికి కర్ర, అల్లికర్రతో చేసే ఆ మాస్క్ బొమ్మలను కాన్వాసుపైకి తీసుకొస్తున్నారు, బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అంతే నిష్టతో ఆ బొమ్మలను కాన్వాసుపై వేస్తున్నారు. కాన్వాసుపై ‘డెప్త్’ తీసుకొచ్చేందుకు అవసరమైన నైపుణ్యం ఆయన వశపరచుకున్నారు. దీనికి బీజం 1979-81 సంవత్సరాల మధ్య వరంగల్‌లో ఐటిఐలో డ్రాఫ్ట్స్‌మన్ శిక్షణ పొందినప్పుడే పడింది. ఆ సమయంలోనే వెర్టికల్, ప్యారలెల్ లైన్లు ఎలా గీయాలో గ్రాఫ్స్ ఎలా వేయాలో అవగాహన చేసుకున్నారు. అలాగే, ఆంగ్ల అక్షరాలు ఎలా అందంగా రాయాలో, ‘సమతుల్యత’ ఎలా ఉండాలో అక్కడ బోధించారు. ఆ ప్రాథమిక శాస్ర్తియ అవగాహన బుచ్చయ్యకు ఎంతో ఉపకరించింది. ఐటిఐకి పూర్వం పాఠశాలలో బొమ్మలు గీసినా, వాటర్ కలర్స్‌తో చిత్రాలు వేసినా ఆ ఆసక్తి ఐటిఐ విద్యలో ఎక్కువగా ఉపయోగపడిందని బుచ్చయ్య అంటున్నారు.
ఉపాధి కోసం పాల్వంచలో కొంతకాలం సైన్‌బోర్డు ఆర్టిస్టుగా పని చేశానని, 1985లో అప్పటి ప్రభుత్వం తెలుగులోనే దుకాణాల పేర్లు ఉండాలని జి.వో తీసుకురావడంతో సైన్‌బోర్డుల రాతకు డిమాండ్ పెరిగిందని, ఆ సమయంలో ఎక్కువ పని లభించిందని ఆ సమయంలోనే అక్షరాలనే గాక ఫిగరేటివ్ వర్క్ నేర్చుకున్నానని, రెండంగుళాల చిన్న బొమ్మలు పెద్దదిగా ఎలా గీయాలో స్థానిక పెయింటర్ దగ్గర తెలుసుకున్నానని, ఆ పని విధానం తనకెంతో ఉపకరించిందని బుచ్చయ్య చెప్పారు.
ఈ క్రమంలోనే గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం రావడంతో కృష్ణానగర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లానని, చిత్రకల అభిరుచితో అక్కడ ఎక్కువ కాలం పని చేయలేక పోయానని వెనక్కి వచ్చి పాల్వంచలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ దుకాణ సముదాయంలో ఒక షాపులో స్క్రీన్ ప్రింటింగ్, మాస్క్‌లు తయారుచేయడం, పోట్రేట్స్ వేయడం ప్రారంభించానని అనంతరం కొంతకాలానికి అంటే 1993 సంవత్సరంలో నీటిపారుదల శాఖలో ‘ట్రేసర్’ ఉద్యోగం రావడంతో అందులో చేరానని ఆయన చెప్పారు. ఉద్యోగం చేస్తూనే చిత్రకళ పని కొనసాగించానని, ముఖ్యంగా నాయక్‌పోడ్ తెగ సంస్కృతికి ప్రాధాన్యమిచ్చే పనులను తలకెత్తుకున్నానని, తమ జాతివారికి ప్రభుత్వంలో సరైన గుర్తింపు లేని కారణంగా తమ జాతి మూలాలలోకి వెళ్లి వాటి ఆధారాలను సేకరించి, సంస్కృతి, చిత్రకళ, కొలుపులు, జాతరలు వాటి వెనుక గల చారిత్రక అంశాలు వెలికితీసి తమ జాతిని (నాయక్‌పోడ్‌లను) ప్రత్యేకంగా గుర్తించాలలని ప్రభుత్వాన్ని కోరుతూ వివిధ కార్యక్రమాలు చేపట్టారు. నాయక్‌పోడ్‌లు ఏర్పరచుకున్న రాష్ట్ర సంఘానికి ఉపాధ్యక్షునిగా, కార్యదర్శిగా ఆయన పని చేశారు. విద్య, ఉద్యోగాల కల్పనలో తమ తెగకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని అనేక మహజర్లను ఆయన, ఆయన బృందం ప్రభుత్వానికి అందజేసింది. తమను గోండ్‌లతో జత కలపడం వల్ల ఎన్నో విధాలుగా నష్టపోతున్నామని ఆయన వాదన. ఈ కార్యక్రమాలు ఇచ్చిన చైతన్యంతో ఆయన కంప్యూటర్‌పై పనిచేయడం నేర్చుకున్నారు. పేజ్‌మేకర్, ఫొటోషాప్‌ను ఆపరేట్ చేయడం అలవడింది. కంపోజ్ చేయడం నేర్చుకున్నారు. దీంతో ఆయన తన తెగకు చెందిన సమాచారం, చరిత్ర, లభించిన ఆధారాలు, చిత్రాలతో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ విధంగా ఆయన వ్యాస రచయితగా, పుస్తక రచయితగా జిల్లాలో గుర్తింపు పొందారు. నాయక్‌పోడ గిరిజన తెగ నుంచి ఓ నిరక్షరాస్య పేద కుటుంబంలో 1960లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాగారం గ్రామంలో జన్మించిన పసుల బుచ్చయ్య అంచెలంచెలుగా చిత్రకారుడిగా, ఉద్యమకారుడిగా, రచయితగా ఎదగడం అరుదైన అపురూపమైన విషయం!
2018 సంవత్సరం ఆగస్టులో ‘ఆదివాసీ దినోత్సవం’ హైదరాబాద్‌లో జరిపారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించిన ఆ ఉత్సవంలో ‘పెయింటింగ్ ఎగ్జిబిషన్’ (గిరిజన చిత్రకళా ప్రదర్శన) నిర్వహించారు. అందులో బుచ్చయ్య ప్రముఖ పాత్ర నిర్వహించారు. నాయక్‌పోడ్ ఇతర గిరిజన తెగలకు చెందిన చిత్రకారులతో ఆర్ట్ క్యాంప్‌లు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో, ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్‌తో నిరంతరం సంబంధాలు నెరపుతూ ట్రైబల్ ఆర్ట్‌లో భాగమైన నాయక్‌పోడ్ జాతి చిత్రకళను ప్రపంచానికి పరిచయం చేయాలని తపన పడుతున్నారు. కాన్వాసులపై స్వయంగా సంప్రదాయ రంగులు - రేఖలతో కూడిన బొమ్మలు గీస్తూ ఇతరులకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
రంగుల్లో ‘మేడారం’
శాస్ర్తియంగా చిత్రకళను అధ్యయనం చేసిన కోయ చిత్రకారుడు చుంచ కుమారస్వామి. మహబూబ్‌నగర్ జిల్లా గంగారం మండలం మడగూడెంకు చెందిన కుమారస్వామి హైదరాబాద్, మాదాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో 1999 నుంచి 2004 సంవత్సరం వరకు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బిఎఫ్‌ఐ) కోర్సు చేశారు. ఆయిల్ కలర్, వాటర్ కలర్స్‌తో పోట్రేట్స్ వేయడంలో అక్కడ మంచి శిక్షణ పొందారు. మట్టి (క్లే)తో బొమ్మలు తయారుచేయడంలో అక్కడ పాఠాలు బోధించారు. ముఖ్యంగా అక్కడ నేర్పిన ‘కలర్ థియరీ’ తనకెంతో ప్రయోజనం చేకూర్చిందని కుమారస్వామి అంటున్నారు. పోస్టర్ కలర్స్‌తో హాండ్‌మేడ్ పేపర్‌పై బొమ్మల సాధన సైతం తనకెంతో పనికొచ్చిందని అంటున్నారు. అలా శాస్ర్తియంగా నేర్చుకున్న చిత్రకళ ఇప్పుడు కోయ తెగ చిత్రాలను కాన్వాసుపైకి తీసుకురావడానికి ఎంతో దోహద పడుతోందంటున్నారు. పుట్టమట్టితో తయారుచేసే ఇండియన్ రెడ్ (జాజు) కలర్, తమ ప్రాంతంలోని సున్నపు బావుల నుంచి చేసే తెల్లరంగును వాడతామని, కోయ గిరిజన తెగ జీవితాలను చిత్రిక పడుతున్నామని అంటున్నారు. తాను కోయల నృత్యం, వడ్లు దంచడం, మేడారం పడిగిద్దరాజు జెండా ఇట్లా అనేక చిత్రాలను కాన్వాసుపై చిత్రించినట్టు కుమారస్వామి చెప్పారు. కోయ చిత్రకారుడిగానే కొనసాగుతానని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే లక్షలాది మంది హాజరయ్యే మేడారం జాతర సందర్భంగా అక్కడ (మేడారంలో) ఉన్న ట్రైబల్ మ్యూజియంలో దాదాపు 100 పెయింటింగ్స్ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తనతోపాటు కోయ చిత్రకారులైన శ్రీ్ధర్, వేణుమాధవరావు, నవీన్‌లకు చెందిన బొమ్మలను తొలిసారి ప్రదర్శనకు పెట్టబోతున్నామని, అలాగే తాము ఒక ‘గ్రూప్’గా ఏర్పడి భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇటీవల ఉట్నూర్‌లో జరిగిన ఆర్ట్ క్యాంప్‌లో పాల్గొని కోయ గిరిజన బొమ్మలు గీశానని, హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఆర్ట్ క్యాంపుల్లోనూ పాల్గొని కోయల జీవితాన్ని కాన్వాసుపై పొందుపరిచానని ఆయన చెప్పారు. 1981 సంవత్సరంలో జన్మించిన కుమారస్వామి మడగూడ, గంగారం, కొత్తగూడలో చదువుకున్నారు. ఉన్నత పాఠశాల విద్య అనంతరం హైదరాబాద్‌లో లోయర్, హయ్యర్ చిత్రలేఖన పరీక్షలు పాసయ్యాక, ఆ అనుభవంతో బిఎఫ్‌ఏలో చేరి ఉత్తీర్ణులయ్యారు. బాల్యం నుంచే చిత్రకళపై మక్కువ పెంచుకుని సాధన చేశానని, కొంతకాలం ఏటూరునాగారం ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పని చేశానని, ఆ సమయంలో తనకు మంచి గుర్తింపు లభించిందని, తనకు, తన విద్యార్థులకు బంగారు పతకాలు చిత్రకళలో దక్కాయని ఆయన గర్వంగా చెబుతున్నారు.
కోయ చిత్రకళ వారసత్వాన్ని సజీవంగా నిలుపుతానని, ఆ సంస్కృతిని కాన్వాసుపైకి తర్జుమా చేస్తానని, దేశీ ‘రంగుల సాక్షి’గా ఆయన చెప్పారు.

పసుల బుచ్చయ్య (నాయక్‌పోడ్) 9652571578 చుంచ కుమారస్వామి (కోయ) 9491142952

సరస మధురకవి సారంగపాణి

$
0
0

(గత సంచిక తరువాయ)
అన్నమయ్య: ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు
మది తెలియవమ్మ ఏమరులోకాని
‘పరమ పురుషుడట పసులగాచెనట
సరవులెంచిన విన సంగతాయిది
హరియె తానట ముద్దులందరికీ జేసెనట
ఇర వాయనమ్మ సుద్దులేటివో’
‘వేదాల కొడయడట వెన్నల దొంగిలెనట
నాదించి నిన్నవారికి నమ్మికాయిది
అది మూల మీతడట ఆడికెల చాతలట
కాదమ్మ ఈ సుద్దులెట్టి కతలో కాని’
‘అలబ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్పకూడునా యిది
తెలిపి శ్రీ వేంకటాద్రి దేవుడనై నిలిచెనట
కలదమ్మ తనకెంతో కరుణోగాని
సారంగపాణి కీర్తన: 179
పల్లవి: ఎంత పేదవాడే వేణగోపాలు
డెంత పేదవాడే!
అను: అంత పేద పేదగాకంటే అలనాడా కుచేలుని
అటుకులకు చేసాచున - ఓ చెలులార
పండ మంచమెయుంటె - భావజ జనకుడీ
పాముపై నిద్రించునా!
అండ వేరేయుంటె - అచ్యుతుడా దనుజుని
అవని దానమడుగునా
వుండనిల్లేయుంటే పుండరీకాక్షుండు
యుదధివాసము చేసునా! ఓ చెలులార!
2.కట్టవస్తమ్రెయుంటె - కంసవైరిగోపాం - గన చీరలాశించునా!
గొట్టు బడకయుంటె - గోవిందుడీగతి - గోవుల తాగాచునా!
పొట్ట నిండితె శౌరి - పొరుగిండ్ల జొరబడి
పొంచి వెన్న మ్రుచ్చిలునా! ఓ చెలులార!
3.పరిపాటి వాహనమీ - ప్రద్యుమ్నునికే యుంటె
పక్షినెక్కి తిరుగునా!
దరి వేరే వుంటె శ్రీ -్ధరుడనిశము నిజ
దాసుల పంచజేరునా!
గురియైన సాయక మాముర వైరికే యుంటె
గరికె పోచ బట్టునా - ఓ చెలులారా!
(ఈ పదము ఎం.ఎల్.ఏ. ఏడుకొండలు సినిమాలో పాడబడి ఉన్నది)
ఈ పైన రెండు పదాలు స్వామి దివ్యత్వాన్ని పొగడుతూనే ఇంకొకవైపు మానవత్వాన్ని వివరిస్తున్నాయి. రెండు పదాల్లో పద కర్తల భక్తి ఉచ్ఛస్థాయికి చేరుకుంది. ఒకసారి సామాన్య శృంగారాన్ని వర్ణించిన సారంగపాణి పై పదంలో అన్నమయ్యకు ఏ విధంగానూ తక్కువగా రాయలేదు.
క్షేత్రయ్య - సారంగపాణి
జగమెరిగిన పదకర్త క్షేత్రయ్య. పదము అంటే శృంగార పదమని క్షేత్రయ్య నుంచే మొదలైంది. ఇతను 4వేలకు పైగా పదములు రాశాడట. కానీ అందులో పదవ శాతం మాత్రమే నేడు లభిస్తున్నవి. సారంగపాణికి, క్షేత్రయ్యకి భాష, భావము, కాలము, మకుటములో ఎంతో సామ్యము ఉంది. క్షేత్రయ్య క్రీ.శ.1600-1660 జీవించి ఉంటే సారంగపాణి క్రీ.శ.1750-1850 జీవించి ఉన్నారు. సారంగపాణి 400లకు పైగా పదములు రచించినా, నేడు కేవలం 206 పదములు లభించినవి. క్షేత్రయ్య ‘మువ్వగోపాల’ మకుటముతో పదములు రచించితే, సారంగపాణి ‘వేణుగోపాల’ మకుటముతో పదములు రచించాడు. సారంగపాణి పదములు ప్రథమంగా క్రీ.శ.1810 ప్రాంతంలో కార్వేటి నగర రాజులు ముద్రించారు. క్షేత్రయ్య పదములు ప్రథమంగా వావిళ్ల రామస్వామి శాస్త్రుల వారు 1950లో ముద్రించారు. మరి గాయకుల పొరపాటో, సేకరించిన వారి పొరపాటో, నకలు చేసిన వారి పొరపాటో తెలియదు కానీ కొన్ని పదములు క్షేత్రయ్య పదముల గ్రంథములోను, సారంగపాణి పదముల గ్రంథములోనూ కనిపిస్తున్నవి. అవే పదములు క్షేత్రయ్య పదములందరు ‘మువ్వగోపాల’ ముద్రతో కనిపిస్తే, సారంగపాణి పదములందు ‘వేణుగోపాల’ ముద్రతో కనిపిస్తాయి. మరి వీటిని ఎవరు రచించారు? సారంగపాణియా? క్షేత్రయ్యా? కాలమే తేల్చి చెప్పాలి. ఆ ఆరు పదములు ఈ క్రింది విధముగా ఉన్నాయి.
1.ఇంటికి రానిచ్చేనా..
సారంగపాణి పదములు - 39వ పదము, పుట.28, 29
క్షేత్రయ్య పదములు - పుట.30, 31
2.అక్కరలేని కాపురమాయె
సారంగపాణి పదములు - 54వ పదము, పుట.41
క్షేత్రయ్య పదములు - 6వ పదము, పుట.67
3.ఇంత మోహమేమిరా..
సారంగపాణి పదములు - 33వ పదము, పుట.23
క్షేత్రయ్య పదములు - 37వ పదము, పుట.41
4.తెలిసె నీనెనరు మంచివాడవు...
సారంగపాణి పదములు - 43వ పదము, పుట.31,32
క్షేత్రయ్య పదములు - 31వ పదము, పుట.35,36
5.తన చిత్తము వచ్చినటుల దయవచ్చీని
సారంగపాణి పదములు - 55వ పదము, పుట.42
క్షేత్రయ్య పదములు - 46వ పదము, పుట.52,53
6.ఇచ్చిన మంచిదెవాడలబోవు..
సారంగపాణి పదములు - 39వ పదము, పుట.46
క్షేత్రయ్య పదములు - 66వ పదము, పుట.73,74

ఫిలిం క్విజ్-136

$
0
0

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2) సన్నజాజులోయ్/ ఈ గంట గణగణ మ్రోగాలి - పాటలున్న సినిమా?
3) ఎవరు మొనగాడు/ గుండెలు తీసిన మొనగాడు- ఎవరు?
4) పల్లవి- అనుపల్లవి/ వంశవృక్షం- నటుడు?
5) మల్లెపందిరి/ రాగలీల -దర్శకుడు?
6) ప్రభు, కార్తీక్ నటించిన చిత్రం/ వెంకటేష్ నటించిన చిత్రం- పేరు?
7) ఏలి .. ఏలి పాలు ఓలికమ్మ/ ఎ....క్కాడా? -సినిమా పేరు?
8) వరుణ్‌సందేశ్ చిత్రం పేరు/ బొమ్మరిల్లులో నాయిక డైలాగ్-?
9) హీరో ఆర్ నారాయణమూర్తి/ హీరోయిన్ జయసుధ- సినిమా?
10) ఈ నటిని గుర్తించండి?

సమాధానాలు- 134

1. అపరిచితుడు
2. పి చిన్నపరెడ్డి
3. బాలశేఖరన్
4. అనిరుథ్ రవిచందర్
5. రమ్యకృష్ణ
6. సీనియర్ సముద్రాల
7. మేఘసందేశం
8. రమేష్‌నాయుడు
9. శతమానంభవతి
10. సంగీత

సరైన సమాధానాలు రాసిన వారు

కెవిఎస్‌ఎన్ మూర్తి, హైదరాబాద్
పోలా రామకృష్ణ, హైదరాబాద్
ఎపివి కిషోర్ చంద్ర, కొత్తపేట
పి కాశీరాం, తుని
అల్లాడ సురేంద్ర, రాజమండ్రి
జోగి కృష్ణమూర్తి, సికింద్రాబాద్
ఆర్‌హెచ్‌వి లత, నల్గొండ
జి కార్తీక్, వరంగల్
నరసింహమూర్తి కె, అనంతపురం
ఎల్‌వి సాయబాలజీ, శ్రీకాకుళం
కె భార్గవి, విశాఖపట్నం
ఆర్‌ఎస్‌ఎస్ సంపత్, రాజోలు
హెచ్ భరద్వాజ్, నర్సాపురం
వి సుబ్బలక్ష్మి, నిడదవోలు
ఎల్ భాస్కర్, సికింద్రాబాద్
మాధురీలత, ఎడ్చెర్ల
ఎన్ సూర్యనారాయణ, పాలకొల్లు

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>