రాయపర్తి, అక్టోబర్ 23: డెంగీతో మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బోయిని ప్రభాకర్ (24) అనే మత్స్యకారుడికి ఐదురోజుల కిందట తీవ్రంగా జ్వరం రావడంతో హన్మకొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రభాకర్‌కు డెంగీ వ్యాధి సోకినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ప్రభాకర్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. ప్రభాకర్ డెంగీ వ్యాధితో మృతిచెందినట్లు వైద్యులు తెలిపినట్లు వారు తెలిపారు.
డెంగీతో మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన
english title:
d
Date:
Wednesday, October 24, 2012