ఏటూరునాగారం, అక్టోబర్ 23: మండలంలోని తుపాకులగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గోదావరి నదిలో పడి గల్లంతయ్యారు. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం... సద్దుల బతుకమ్మ పండగ రోజున గ్రామసమీపంలోని గోదావరి నదిలో బతుకమ్మను నిమజ్జనం చేయడానికి కుటుంబసభ్యులతో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయారు. గ్రామానికి చెందిన ఆలెం చిరంజీవి (25), రేగ హరీష్ (20) వ్యక్తులు గోదావరిలో పడి గల్లంతైన సంఘటన మంగళవారం జరిగింది. పండగ రోజు ఇద్దరు గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు ఆడిన అనంతరం నిమజ్జనం చేయడానికి వెళ్లే క్రమంలో ఆ ఇద్దరు వ్యక్తులు బతుకమ్మను గోదావరిలో నిమజ్జనం చేస్తూ పడిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంసభ్యులు గోదావరి తీరానికి చేరుకుని పండగ రోజు చేతికి అందివచ్చిన కుమారులను కోల్పోయిన సంఘటన పలువురిని కంటతడిపెట్టించాయి. గల్లంతైన ఇద్దరు వ్యక్తుల కోసం గ్రామస్తులు, కుటుంబసభ్యులు గజ ఈతగాళ్లతో గోదావరిలో వెదుకుతున్నారు. అయినప్పటికీ వారి ఆచూకి ఇప్పటివరకు లభించలేదు. హరీష్ జిల్లాకేంద్రంలో ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తూ కళాశాలకు సెలవులు ఇవ్వడంతో మంగళవారం ఉదయం గ్రామానికి చేరుకున్నాడు. అంతలోనే గోదావరి రూపంలో మృత్యువు కబళించిందని కుటుంబసభ్యుల అర్తనాదాలు మిన్నంటాయి. వారి ఆచూకి కోసం గజ ఈతగాళ్లతో గోదావరిలో వెతికిస్తున్నామని స్థానిక ఎస్సై సంజీవరావు పేర్కొన్నారు.
మండలంలోని తుపాకులగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గోదావరి నదిలో పడి
english title:
n
Date:
Wednesday, October 24, 2012