హైదరాబాద్, అక్టోబర్ 31: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనా విభాగం రోజురోజుకీ పూర్తిగా అక్రమాలమయంగా మారుతోంది. కార్పొరేషనే్న నమ్ముకుని మూడు నుంచి నాలుగు దశాబ్దాలుగా సేవ చేసినానంతరం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించటంలో గ్రేటర్ బల్దియా అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. అధికారుల లంచగొండితనం, విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం పుణ్యమాని మూడు దశాబ్దాలుగా విధులు నిర్వహించి రిటైర్ అవుతున్న ఉద్యోగులు తమ ప్రయోజనాల కోసం రెండు దశాబ్దాలుగా ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా, రిటైర్ అయ్యే ప్రతి ఉద్యోగికి అదే రోజు అన్ని రకాల ప్రయోజనాలను చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఇటీవల జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన జిహెచ్‌ఎంఇయూ అధ్యక్షుడు ఊదరిగోపాల్ ఆధ్వర్యంలో నేతలు అధికారులకు వినతిపత్రం కూడా సమర్పించారు. అయితే బుధవారం గ్రేటర్ బల్దియాలో 33 మంది ఉద్యోగులు రిటైర్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్‌లో ప్రయోజనాల కోసం రభస జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గుర్తింపు యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లారుూస్ యూనియన్ అధ్యక్షుడు ఊదరిగోపాల్, గౌరవాధ్యక్షులు కె. అమరేశ్వర్‌లు అతిథులుగా హజరయ్యారు. అయితే బుధవారం రిటైర్ అయిన 33 మంది ఉద్యోగుల్లో నలుగురికి ప్రావిడెంట్ ఫండ్ తాలుకూ చెక్కులు సిద్ధం కాలేదు. దీంతో గోపాల్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ అదనపు కమిషనర్ (పరిపాలన) రాంనారాయణరెడ్డిని నిలదీశారు. రిటైర్ అయ్యే ఉద్యోగికి పదవీ విరమణ అభినందన సభలోనే అన్ని రకాల ప్రయోజనాలకు సంబంధించిన చెక్కులను ఇవ్వాలని తాము కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించినా, మళ్లీ నలుగురు ఉద్యోగుల చెక్కులు సిద్ధం కాకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను జరగనివ్వమంటూ ఆయన భీష్మించుకున్నారు. దీంతో రిటైర్‌మెంట్ ఫంక్షన్‌లో అలజడి చోటుచేసుకుంది. ఈ మేరకు అదనపు కమిషనర్ రాంనారాయణరెడ్డి స్పందిస్తూ మిగిలిన నలుగురు ఉద్యోగుల మాతృశాఖ గ్రేటర్ కాదని, వారి మాతృశాఖ నుంచి పే అండ్ అకౌంట్స్ చెక్కులను చెల్లించాల్సి ఉందని, అయినా తాము చెక్కులు సిద్ధం చేసినా, జోనల్ కమిషనర్ల సంతకాలు కాలేదని సమాధానమివ్వటంతో గోపాల్ మరింత మండిపడ్డారు. జోనల్ కమిషనర్లు కూడా రిటైర్ ఉద్యోగులకు సకాలంలో ప్రయోజనాలను అందించే విధంగా మీరెందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించగా, గుర్తింపు యూనియన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన వెంటనే తాము సర్క్యులర్ జారీ చేశామని చెప్పారు.
అమ్యామ్యాలిస్తేనే సర్ట్ఫికెట్ల వెరిఫికేషన్
గ్రేటర్ బల్దియాలో విధులు నిర్వహిస్తూ అకస్మికంగా మృతి చెందే ఉద్యోగుల పిల్లలకు వారి స్థానంలో ఉద్యోగం కేటాయించాలన్న నిబంధన ఉన్న విషయం విదితమే. అయితే తండ్రి మృతి చెందిన తర్వాత ఆయన స్థానంలో ఉద్యోగం పొందాలంటే వారి పిల్లలు ఏళ్ల తరబడి గ్రేటర్ కార్యాలయం చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దరఖాస్తుదారుడి సర్ట్ఫికెట్ల వెరిఫికేషన్ కోసం సుమారు రూ. 40 వేల నుంచి రూ. 60వేల వరకు విజిలెన్స్ అధికారులకు చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. లేనిపక్షంలో ఉద్యోగం చేసేందుకు సదరు దరఖాస్తుదారుడు అనర్హుడంటూ వారు నివేదికలు పంపుతున్నట్లు తెల్సింది. అయితే నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేషన్‌కు మొట్టమొదటి కమిషనర్‌గా వచ్చిన డా. సివిఎస్కే శర్మ దృష్టికి ఈ రకమైన ఫిర్యాదులెన్నో రావటంతో అప్పట్లో ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
సాటిఉద్యోగి పిల్లలకు ఉద్యోగం కల్పించేందుకు కూడా ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేయటం ఘోరమని వ్యాఖ్యానించిన ఆయన కంపాషినేట్ గ్రౌండ్స్ నియామకాలకు సంబంధించి పదేళ్ల నుంచి పెడింగ్‌లో ఉన్న సుమారు వంద ఫైళ్లను ఆయన ఒకే రోజు క్లియర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కాంట్రాక్టర్లంటే ఎందుకంత ప్రేమా?
సాటి ఉద్యోగులకు సకాలంలో ప్రయోజనాలను అందించటంలో లంచాలు డిమాండ్ చేసే గ్రేటర్ ఉద్యోగులు కాంట్రాక్టర్ల బిల్లులపై ఎనలేని మమకారాన్ని చూపుతున్నారు. ముప్పై నుంచి నలభై ఏళ్ల వరకు కార్పొరేషన్‌కు సేవ చేసిన ఉద్యోగుల పట్ల లేని మమకారాన్ని కాంట్రాక్టర్ల పట్ల చూపుతున్నారు. పనిచేసిన, కాగితాలకే పరిమితమైన పనులకు కూడా కమీషన్లు మాట్లాడుకుని ఆగమేఘాలపై బిల్లులు మంజూరు చేసే అధికారులు అదే చొరవను ఉద్యోగుల ప్రయోజనాల మంజూరీపై చూపితే మంచిదని యూనియన్ నేతలంటున్నారు.
ఇది చాలా దారుణం!
జిహెచ్‌ఎంఇయూ అధ్యక్షుడు ఊదరిగోపాల్
రిటైర్డు అయ్యే ఉద్యోగులకు అప్పటికపుడే అన్ని రకాల ప్రయోజనాల అందించేందుకు చర్యలు చేపట్టాలని తాము నేరుగా కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన తర్వాత కూడా మరో నలుగురు ఉద్యోగులకు చెక్కులను అందజేయకపోవటం చాలా దారుణమని, ఇది అధికారులు విధి నిర్వహణకు తార్కాణమని జిహెచ్‌ఎంఇయూ అధ్యక్షుడు ఊదరిగోపాల్ మండిపడ్డారు. మున్ముందు ఇలాంటి పరిణామాలు పునరావృతమైతే తాము ఆందోళన చేపట్టాల్సి వస్తుందని కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారు.
ఎందుకింత వివక్ష?
english title:
g
Date:
Thursday, November 1, 2012