హైదరాబాద్, అక్టోబర్ 31: గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి, పౌర సేవల నిర్వహణతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ విధి విధానాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థారుూ సంఘం అజెండాల్లో ప్రతిపాదనలు ఇష్టారాజ్యంగా పెడుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన స్థారుూ సమావేశంలో మాజీ మేయర్ భూ మార్పిడి ప్రతిపాదన రాగా, వ్యతిరేకించిన సభ్యులు తదుపరి సమావేశంలో నాటకీయంగా ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే! ఈ రకంగా స్థారుూ సంఘం సమావేశాల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారటంతో పాటు అజెండా తయారీ కూడా అధికారులు, సభ్యుల స్వప్రయోజనాలకే పరిమితమైందని చెప్పవచ్చు. ఒకవైపు గ్రేటర్‌లో విలీనమైన శివార్లలోనే గాక, నగరం నడిబొడ్డున ఉన్న పలు మురికివాడల్లో నేటికీ వౌలిక వసతులు సరిగ్గాలేవు. ఇలాంటి విషయాన్ని ప్రస్తావించటంలో ఘోరంగా విఫలమైన స్థారుూ సంఘం ధనికవర్గాల కోసం గ్రేటర్ నిధులను ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారనే చర్చ కొనసాగుతోంది. గురువారం జరగనున్న స్థారుూ సంఘం 11వ సాధారణ సమావేశంలో బంజారాహిల్స్‌రోడ్ నెం. 2నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5వరకు (కృష్ణానగర్ జంక్షన్, వయా స్టూడియో) అంటూ ప్రతిపాదన పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి సంబంధించి రోడ్డును అభివృద్ధి పరిచేందుకు, సర్వీసు రోడ్డు నిర్మాణానికి సుమారు రూ. 7.20 లక్షల ప్రతిపాదనను అధికారులు అజెండాలో పెట్టడాన్ని టిడిపి తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. రోడ్ నెం. 2 నుంచి సమీపంలో ఉన్న ఓ సినీ స్టూడియోను ప్రస్తుతం ప్రైవేటు వెంచర్‌గా ఓ డెవలపర్ డెవలప్‌మెంట్ చేస్తున్నాడని, ఆ వెంచర్‌కు రాకపోకలు పెంచేందుకే అధికారులు గ్రేటర్ నిధులతో రోడ్డు అభివృద్ధి పరిచి, సర్వీసు రోడ్డును నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారనేది టిడిపి కార్పొరేటర్ల వాదన.
గ్రేటర్ బల్దియా అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఆస్తిపన్ను పెంచేందుకు రంగం సిద్దం చేశారన్న సమాచారం తెల్సుకున్న టిడిపి ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పలువురు కార్పొరేటర్లు ఇందుకు వ్యతిరేకంగా బుధవారం కమిషనర్ కృష్ణబాబు ఛాంబర్ వద్ద ధర్నా చేపట్టారు.
అందులో ఎవరికెంత?
english title:
gg
Date:
Thursday, November 1, 2012