ఖైరతాబాద్, అక్టోబర్ 31: నవంబర్ ఒకటో తేదీని తెలంగాణ ప్రజలను మోసం చేసిన దినంగా పరిగణిస్తున్నామని, అందుకే ఆరోజు సచివాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ గజ్జల కాంతం తెలిపారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సామాజిక తెలంగాణ జెఏసి ప్రతినిధులు ప్రొ.పియల్ విశే్వశ్వరరావు, సతిష్ మాదిగలతో కలిసి ఆయన మాట్లాడుతూ నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ప్రభుత్వం కూడా జరపకూడదని తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఆ వేడుకల్లో పాల్గొనరాదని పిలుపునిచ్చారు. ఒకవేళ ఎవరైనా ఆ వేడుకల్లో పాల్గొంటే వారి ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తామని, వారి వారి నియోజకవర్గాల్లో వారిని తిరగనీయకుండా అడ్డుకుంటామని అన్నారు. తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవమైనా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించలేని ఈ ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు ఇష్టం లేకున్నా రాష్ట్రాన్ని సమైక్యం చేసి ఆ రోజును అధికారికంగా ఎలా జరుపుతుందని ప్రశ్నించారు. తెలంగాణలోని బిసి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీలందరినీ ఐక్యం చేసి, సామాజిక తెలంగాణ సాధించుకునేందుకు నవంబర్ 3వ తేదిన అన్ని సామాజిక వర్గాల పెద్దలతో సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు వారు తెలిపారు. ఇందులో చర్చించిన అంశాలను నవంబర్ 10, 11వ తేదీల్లో కరీంనగర్‌లో తెలంగాణకు సంబంధించిన అన్ని జెఏసిలను, కుల, ప్రజా సంఘాలను ఆహ్వానించి సమావేశం ఏర్పాటుచేసి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వారు వెల్లడించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపవద్దు
english title:
gg
Date:
Thursday, November 1, 2012