హైదరాబాద్, అక్టోబర్ 31: సినీనటుడు మోహన్‌బాబు నివసిస్తున్న ఫిల్మ్‌నగర్‌లోని ఇంటి వద్ద బుధవారం సాయంత్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ‘దేనికైనారెడీ’ సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ సన్నివేశాలు చిత్రీకరించారంటూ కొద్ది రోజులుగా బ్రహ్మణ సేవా సంఘాల సమాఖ్య, తెలంగాణ బ్రాహ్మణుల సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్న సంగతి తెల్సిందే. అయితే ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మానుష్యంగా ఉండే ఫిల్మ్‌నగర్‌కు కూడా ఈ నిరసనల సెగ తాకింది. మూడురోజుల క్రితం నటుడు మోహన్‌బాబు ఇంటి ముందు బ్రాహ్మణులు ధర్నా చేపట్టిన నేపథ్యంలో మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు బ్రాహ్మణలు మరింత రెచ్చిపోయేలా చేసిందనే చెప్పవచ్చు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా మరోసారి బుధవారం సాయంత్రం ఆయన ఇంటి ముందు నిరసన చేపట్టేందుకు వచ్చిన బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య ప్రతినిధులు, బ్రాహ్మణులకు మోహన్‌బాబు సెక్యూరిటీకి మధ్య తొలుత తోపులాట జరిగి అదిక్రమంగా బ్రాహ్మణులపై దాడికి దారితీసింది. సమాచారం తెల్సుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత కూడా సెక్యూరిటీ సిబ్బంది బ్రాహ్మణులపై దౌర్జన్యంగా దాడి చేస్తున్నా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినట్లు స్థానికంగా కథనాలున్నాయి. ఆందోళనకు దిగిన బ్రాహ్మణులను చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నాలను సైతం బ్రాహ్మణులు వ్యతిరేకించటంతో పోలీసులు లాఠీఛార్జి చేసినట్లు తెల్సింది. మోహన్‌బాబు ఇంటిముందు అరుపులు, కేకలు విన్పించటం, జనం ఉరుకులు, పరుగులు పెట్టడటంతో అక్కడ అసలేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పలువురు బ్రాహ్మణులకు తీవ్ర గాయాలైనట్లు తెల్సింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెల్సింది. అంతేగాక, ఫిల్మ్‌నగర్‌లోని మోహన్‌బాబు ఇంటిముందే గాక, పరిసర ప్రాంతాల్లో కూడా గురువారం అర్థరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సంఘటన సమాచారం తెల్సుకున్న నగరంలోని వివిధ ప్రాంతాల బ్రాహ్మణ సేవా సంఘాల విభాగాలకు చెందిన ప్రతినిధులు ముక్తకంఠంతో ఖండించారు. అంతేగాక, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన బ్రాహ్మణులపై మోహన్‌బాబు సెక్యూరిటీ, పోలీసులు అతిగా ప్రవర్తించారన్న విమర్శలు సైతం విన్పించాయి. గురువారం ఆందోళన చేపట్టి, గాయాలపాలైన వారికి మద్దతునిచ్చేందుకు ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణులు తరలివస్తున్నారన్న సమాచారాన్ని తెల్సుకుని పోలీసులు ఫిల్మ్‌నగర్‌లో భారీగా మోహరించారు. అడుగడుగునా పికెటింగ్‌లు ఏర్పాటు చేసి, సాధారణ ట్రాఫిక్ రాకపోకలకు సైతం ఆటంకాలు కల్గించినట్లు తెల్సింది.
బ్రాహ్మణులపై మోహన్‌బాబు సెక్యూరిటీ దాడి
english title:
f
Date:
Thursday, November 1, 2012