తాండూరు: భాషాప్రాతిపదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు చేసిన నవంబర్ 1.. తెలంగాణ ప్రజానికానికీ విద్రోహ దినమని జెఎసి ప్రతినిధులు సాంబూరి చంద్రశేఖర్, ఎస్.సోమశేఖర్, యు.రమేష్‌కుమార్, వి.రంగారావు, బి.విజయ్‌కుమార్, ఆయుబ్‌ఖాన్, సయ్యద్ ముజీబ్, వీరమణి, అనసూయ, కేశవులు, శ్రీశైలం, విజయ్‌కుమార్ పటేల్, కె.వాసు, బి.రాములు, విఠల్ నాయక్, లక్ష్మణ్‌నాయక్ అన్నారు. గురువారం తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తెలంగాణ విద్రోహదినం బహిరంగ సభను నిర్వహించారు. టిజెఎసి, టిఆర్‌ఎస్, బిజెపి, టిడిపి, కాంగ్రెస్‌కు చెందిన క్రిందిస్థాయి నాయకులు పాల్గొన్నారు. సీమాంధ్ర నాయకులు అధికారాన్ని చెలాయిస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని వక్తలు ఆరోపించారు.
టియుటిఎఫ్ ఆధ్వర్యంలో
మహేశ్వరం: మండల కేంద్రంలో టియుటిఎఫ్ కార్యాలయం ముందు తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. మండల అధ్యక్షుడు శ్రీరాం మాట్లాడుతూ ఆంధ్రా పాలకులు తెలంగాణను అన్ని విధాలుగా దోచుకున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో నర్సింహ్మ, డి.కుమార్, స్వర్ణలత, శ్రీశైలం, ప్రకాష్, అశోక్, రవి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిరసిస్తూ తుక్కుగూడ, ఇమామ్‌గూడల్లో నల్లజెండాలను ఎగురవేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదని టిఆర్‌ఎస్ నాయకుడు బి.హరికృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రాకేశ్‌రెడ్డి, కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణపై అన్యాయాన్ని ప్రతిఒక్కరూ ప్రశ్నించాలి
కంటోనె్మంట్ : తెలంగాణకు అన్నిరంగాల్లో అన్యాయంపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని గ్రేటర్ హైద్రాబాద్ తెలుగుదేశం పార్టీ మాజీ వైస్ ప్రెసిడెంట్ ముప్పిడి మధుకర్ తెలిపారు. గురువారం ఆయన బోయిన్‌పల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని నల్లాజెండాలు ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ ఒక్కటిన విలీన దినోత్సవాన్ని విద్రోహదినోత్సవంగా పాటించినట్టు తెలిపారు. విలీనం కాక ముందు తెలంగాణ ప్రజలను నిజాం నవాబులు దోచుకున్నారని, నేడు సమైక్య ఆంధ్రలో తెలంగాణ వారిని మోసం చేసి ఉద్యోగాలు, నిధులు, నీళ్ళు దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు టిఎన్.శ్రీనివాస్, ప్రభుకుమార్ గుప్త, సదానంద్, గౌరి, శశిధర్ గౌడ్, రామకృష్ణ, నర్సింగరావు, వీరయ్య పాల్గొన్నారు
అల్వాల్ ఇ-సేవ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు, అల్వాల్ జాక్ నాయకులు వేరు వేరుగా తెలంగాణ తల్లి విగ్రహం ముందు విద్రోహదినాన్ని పాటించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల శ్రీనివాస్ గౌడ్, నాయకులు పరమేశ్వర్, సూర్యకుమార్, బస్వరాజ్, అరుణ్, ప్రదీప్, అందె శ్రీనివాస్, చంద్రశేర్ పాల్గొన్నారు. అల్వాల్ జాక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాక్ నాయకులు పి.కృష్ణ, ఎ.విలియం, ముత్యాలు, రామోహన్, రాజేశ్వర్ దీక్షలో కూర్చున్నారు. వారికి మాజీ ఎమ్మెల్యే మశే్చందర్ రావు, నాయకులు ఎంవి.గోపాల్, సురేందర్ రెడ్డి, దయాకర్, దేవేందర్, ఉదయ్, కుమార్ రవి మద్దతు పలికారు.
సుభాష్ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో టిఆర్‌యస్ నాయకుడు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో నల్లజెండాల ప్రదర్శన నిర్వహించారు. సికింద్రాబాద్ జూబ్లీబస్‌స్టేషన్ వద్ద, కంటోనె్మంట్, పికెట్ డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఓల్డు బోయిన్‌పల్లిలో జరిగిన కార్యక్రమంలో గణేష్ యాదవ్ నాయకత్వంలో నల్లజెండాల ప్రదర్శన నిర్వహించారు.
జగద్గిరిగుట్టలో
జీడిమెట్ల: నవంబర్ 1వ తేదీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిన రోజని జగద్గిరిగుట్ట జేఏసీ కన్వీనర్ శివరాత్రి యాదగిరి స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట చివరి బస్టాప్ జేఏసీ శిబిరం వద్ద నల్లజెండాను ఎగురవేసి తెలంగాణా విద్రోహదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరసనలు చేపడుతున్న తమ నాయకులపై అరెస్టు, ఉస్మానియా యూనివర్శిటీలో లాఠీలు, బాష్పవాయువుప్రయోగాలను చేస్తూ తమ ప్రాణాలతో పోలీసులు చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బత్తిని రాములుగౌడ్, పున్నారెడ్డి, సుధాకర్ రెడ్డి, నరేందర్‌రెడ్డి, డప్పు రామస్వామి, పున్నం యాకయ్య, సోమన్న, వెంకటేశ్, సురేశ్‌రెడ్డి, పరశురామ్, రాహుల్ రెడ్డి పాల్గొన్నారు.
ఘట్‌కేసర్‌లో..
ఘట్‌కేసర్: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని తెలంగాణ విద్రోహదినంగా పాటిస్తూ మండల టిఆర్‌ఎస్, బిజెపిల ఆధ్వర్యంలో నల్ల జెండాలను ఎగురవేశారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంతో పాటు అయా గ్రామాలలోని ప్రజలు, వివిధపార్టీల నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు, నల్లదుస్తులు ధరించి గురువారం నిరసన పాటించారు. ఘట్‌కేసర్‌లోని అంబేద్కర్ విగ్రహం ఆవరణలో జాతీయ జెండాకు బదులు నల్లజెండాను ఎగురవేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహ్మారెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉదారి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పరిగిలో
పరిగి: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ దినాన్ని నిరసిస్తూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నల్లజెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ కోసం బలిదానం చేసిన నల్లగొండ జిల్లా మండల అధ్యక్షులు బాబు, శ్రీ్ధర్‌కు నివాళి అర్పించారు. తెలంగాణకు అడ్డుగాఉన్న ఎమ్మెల్యేలు, ఎంపిల ఇళ్లు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ప్రభాకర్, నరేందర్, జమీల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్రోహదినంగా
తెలంగాణవాదుల నిరసన
కుషాయిగూడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిస్తూ తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారుల్లో నల్లజెండాలను ఎగరవేశారు. బేతి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, సీమాంధ్ర నాయకులు ఆర్థిక స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పర్దిపులి నర్సింహ్మ, బేతాల బాలరాజు, మణెమ్మ, మహిపాల్‌రెడ్డి, చంద్రారెడ్డి, గొల్లారు అంజయ్య పాల్గొన్నారు.
జిహెచ్‌ఎంసి ఉద్యోగుల నిరసన
ఉప్పల్: నవంబర్ 1న విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్ కార్యాలయం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వీరికి టిఆర్‌ఎస్ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంలోని ఇంజనీరింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీమాంధ్ర పాలనను తెలంగాణలో సాగనివ్వం
వికారాబాద్: సీమాంధ్ర పాలనను తెలంగాణాలో సాగనివ్వబోమని తెలంగాణా ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ హెచ్చరించారు. గురువారం విద్రోహ దినం పాటించిన సందర్భంగా స్థానిక అర్‌అండ్‌బి అతిథి గృహం ఆవరణలో తెలంగాణా సాధనకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శీతకాల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెలంగాణకు అనుమతిచ్చినట్లే ఇచ్చి అరెస్ట్‌లు, నిర్బంధాలు, టియర్‌గ్యాస్ లాంటివి ప్రయోగించి రాజిరెడ్డిని బలితీసుకున్నారని ధ్వజమెత్తారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాఫ్రంట్ నాయకుడు వెంకటేశర్లును చంద్రబాబు కిడ్నాప్ చేయించి రాయచూర్‌లో హత్య చేయించారని ఆరోపించారు. ఉద్యమాన్ని ఎంత అణచినా ఆగిపోదని ఇంకా ఎక్కువే అవుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, విద్యార్థి జెఎసి జిల్లా కన్వీనర్ ఎన్.శుభప్రద్‌పటేల్, ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, యూత్ జెఎసి కన్వీనర్ టి.శంకర్ పాల్గొన్నారు.
భాషాప్రాతిపదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు చేసిన నవంబర్ 1
english title:
betrayal day
Date:
Friday, November 2, 2012