రంగారెడ్డి, నవంబర్ 1: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఎ.వాణీప్రసాద్ 15 మంది వికలాంగులకు ట్రై సైకిళ్లను గురువారం అందజేశారు. ఇదేగాకుండా ఇద్దరు పి.జి చదివే అంధ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు.
ల్యాప్‌టాప్‌లు అందుకున్న కోట జాకర్ అనే విద్యార్థి మాట్లాడుతూ గతంలో తాము పరీక్షలు రాసేందుకు రీడర్ సహాయం తీసుకునేవాళ్లమని, జిల్లా యంత్రాంగం సమకూర్చిన ఈ ల్యాప్‌టాప్‌తో రీడర్ సహాయం లేకుండా పాఠ్యపుస్తకాలు చదువగలమని పేర్కొంటూ, తన ఉన్నత చదువులకు ఇంతగా సహకరిస్తున్నందుకు జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్‌లో చదువుతున్నానని, చంపాపేటలో నివసిస్తానని తెలిపారు.
ఎంకామ్ చదువుతున్న కె.హేమావతి అనే మరో విద్యార్థిని మాట్లాడుతూ ల్యాప్‌టాప్ తనకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉండడమేగాకుండా సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగ జంటలిద్దరికి 10వేల చొప్పున పారితోషికాన్ని కూడా కలెక్టరు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా కలెక్టరు
english title:
tri cycles
Date:
Friday, November 2, 2012