నార్సింగి, నవంబర్ 1: ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి విద్యార్ధులు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు తడిసి ముద్దయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు, పాదచారులు ఎక్కడ మ్యాన్‌హోల్ ఉందో తెలియక బిక్కుబిక్కు మంటూ నెమ్మదిగా వెళ్లారు. కాగా మధ్యాహ్నం విద్యార్థులు ఇంటికి చేరే సమయంలో కూడా వర్షం కురవడంతో వారికి ఇబ్బందులు తప్పలేదు. కాగా సాయంత్రం నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో ద్వీచక్రవాహనదారులు, ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. భారీవర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం ఎడతెరపి లేకుండా పడటంతో కొందరు ఇళ్ల నుంచి బయటికి వెళ్లలేక పోయారు. రాజేంద్రనగర్ మండల పరిధిలోని నార్సింగి, బండ్లగూడ, ఆరెమైసమ్మ, కిస్మాత్‌పూర్, హిమాయత్‌సాగర్, గండిపేట్, కోకపేట్, ఖనాపూర్, పుప్పాలగూడ, నెక్నాంపూర్, హెదర్షకోట్, మణికొండ గ్రామాలలో వర్షంతో పలువురు ఇబ్బందులు పడ్డారు. మెహిదీపట్నం, కార్వాన్, లంగర్‌హౌస్, షేక్‌పేట్, విజయనగర్ కాలనీ, మల్లేపల్లి, ఆసీఫ్‌నగర్ తదితర ప్రాంతాలలో వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టుప్రాంతాలు
english title:
rain.. rain
Date:
Friday, November 2, 2012