జీడిమెట్ల, నవంబర్ 1: మారుతీ వ్యాన్‌లు, ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముగ్గురిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించి పేట్‌బషీరాబాద్‌లోని బాలానగర్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి ప్రమోద్‌కుమార్ వివరాలను వెల్లడించారు. మెదక్‌జిల్లా, రామాయంపేట్‌కు చెందిన ఎరువుల స్వామి (23), చిన్న శంకరంపేట్‌కు చెందిన మున్త్రి సుభాష్ (29), రామాయంపేట్‌కు చెందిన కొల్లా స్వామి (22)లు జీడిమెట్ల, షాపూర్‌నగర్, రోడామిశ్రీనగర్‌లలో నివసిస్తూ మెకానిక్ పని చేస్తుంటారు. అయితే ఎరువుల స్వామి, సుభాష్‌లు కలిసి ఫ్యాషన్‌ప్రో బైక్‌పై దూలపల్లి ఎక్స్‌రోడ్ వైపు వెళుతుండగా పేట్‌బషీరాబాద్ ఎస్‌ఐ రామారావు వాహనాల తనిఖీల్లో భాగంగా ఆపి వాహనానికి చెందిన కాగితాలను చూపమని కోరగా లేవని చెప్పడంతో ఇద్దరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. తమతో పాటు కొల్లాస్వామితో కలిసి మారుతీవ్యాన్‌లు, బైక్‌ను దొంగిలించినట్లు వారు ఒప్పుకున్నారు. పోలీసులు కొల్లాస్వామిని అదుపులోకి తీసుకుని వారి నుండి పేట్‌బషీరాబాద్ ప్రాంతంలో దొంగిలించిన 2 మారుతీ వ్యాన్‌లు, ఓ మారుతీ 800 కారు, జీడిమెట్లలో అపహరించిన 2 మారుతీ వ్యాన్‌లు, బాలానగర్‌లో దొంగిలించిన ఓ మారుతీ వ్యాన్‌ను, ఓ ఫ్యాషన్ ప్రో బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఎరువుల స్వామి, సుభాష్, కొల్లా స్వామిలను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో పేట్‌బషీరాబాద్ ఏసిపి సయ్యద్ రఫీక్, సిఐ జానయ్య, ఎస్‌ఐ రామారావు, సిబ్బంది ఉన్నారు.
మారుతీ వ్యాన్‌లు, ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముగ్గురిని
english title:
maruti van dongala arrest
Date:
Friday, November 2, 2012