Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సంక్షేమ ఫలాలు సామాన్యుల దరి చేర్చడమే లక్ష్యం

$
0
0

ఆదిలాబాద్, నవంబర్ 1: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు సామాన్యుల దరి చేర్చడమే తమ ముందున్న లక్ష్యమని, విద్య, ఉపాధికి పెద్దపీట వేసి జిల్లాలో భారీ కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అశోక్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 57వ అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భారీ బందోబస్తు మధ్య కలెక్టర్ అశోక్ ఎఆర్ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగురవేసి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి సందేశం చదివి వినిపించారు. అయితే ఈ వేడుకలను అడ్డుకుంటామని తెలంగాణ జెఎసి, టిఆర్‌ఎస్, వివిధ ప్రజాసంఘాలు హెచ్చరించిన నేపధ్యంలో ఉద్యోగులు, అధికారులు, రాజకీయ ప్రతినిధులు, విద్యార్థులు గైర్హాజరు కావడంతో వేడుకలు మొక్కుబడిగా సాగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తూ మహానీయుల త్యాగ ఫలితంగా అవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు సాగుతుందని, వెనుకబడిన జిల్లా అభివృద్ది కోసం ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించి సంక్షేమ పథకాలను పేదలకు దరి చేరుస్తున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరంలో విద్యారంగం అభివృద్ది, పాఠశాల వౌలిక వసతులే లక్ష్యంగా రూ.244.16 కోట్ల అంచనాతో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని, తద్వారా విద్యాప్రమాణాలు మెరుగుపడే అవకాశం వుందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి శ్రామిక కుటుంబానికి యేడాదికి 100 రోజుల జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా 4.97 లక్షల జాబ్‌కార్డులు అందించామని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయశాఖ ద్వారా రైతు యాంత్రీకరణ పథకంలో 50 శాతం సబ్సిడీపై 2,116 మంది రైతులకు కోటి 39 లక్షల విలువైన పరికరాలు అందిస్తున్నామన్నారు. గ్రామీణ నీటి సరఫరా పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 244.5 కోట్ల అంచనాతో మంచినీటి పథకాలు చేపట్టగా, ఇప్పటికే 70 లక్షల విలువైన 13 పనులు పూర్తయ్యాయని, మిగితావి మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ద్వారా రైతులకు కనీస మద్దతు ధర యార్డుల్లో లభించేలా చర్యలు తీసుకుంటూ విస్తృత ప్రచారం సాగిస్తున్నామని, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు కలెక్టర్ వివరించారు. ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థలో 905 పాఠశాలల్లో విద్యార్థులు చదువుతుండగా, 194 ఎస్‌జిటి పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందిరాక్రాంతి పథం ద్వారా 73 వరి ధాన్య కేంద్రాలు ప్రారంభించి వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రాష్ట్రంలో జిల్లా మూడవ స్థానంలో నిలిచిందని కలెక్టర్ పేర్కొన్నారు. రాజీవ్ యువ శక్తి పథకంలో భాగంగా స్టెప్ ద్వారా ఈ యేడాది 350 యూనిట్లు మంజూరు చేస్తున్నామని, ఉపాధి కల్పనలో జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించేందుకు 142 యూనిట్లు స్థాపించి 3.5 కోట్ల సబ్సిడీ అందించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించామని, అందరు సహకరిస్తేనే అభివృద్ది సాధ్యపడుతుందని కలెక్టర్ వివరించారు. అంతకు ముందు కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించగా, ఎస్పీ త్రిపాఠి, జెసి సుజాత శర్మ, జడ్పీ సిఇఓ వెంకటయ్య, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్‌రెడ్డి, డిఇఓ అక్రముల్లాఖాన్, ఐటిడిఎ పిఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచారశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, డిఆర్‌డిఎ, బిసి కార్పోరేషన్, స్టెప్, ఇరిగేషన్, వికలాంగుల శాఖ, జిల్లా పరిషత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణశాఖ, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తదితర శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్‌లను కలెక్టర్, జెసి సందర్శించారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి యూనిట్ల పంపిణీ
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పోలీసుపరేడ్‌గ్రౌండ్‌లో ఎస్సీ కార్పోరేషన్ ద్వారా వెయ్యి మందికి రాజీవ్ అభ్యుదయ యోజన ఉపాధి యూనిట్లను మంజూరు చేయగా, స్టెప్ ద్వారా 26 మందికి ఆటోలు, జిరాక్స్ మిషన్లు, టెంట్ హౌస్‌లు, ఫోటో స్టూడియోలు, విడియోకెమెరాలను అందజేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం ద్వారా మూడు చక్రలా బండ్లు పంపిణీ చేయగా, మహిళలకు ఉపాధి యూనిట్లను జెసి సుజాత శర్మ అందజేశారు.

గరం గరం..అవత‘రణం’
* జిల్లా అంతటా నల్లజెండాలతో నిరసన
* విద్రోహదినం పేరిట తెలంగాణవాదుల హల్‌చల్
ఆదిలాబాద్, నవంబర్ 1: రాష్ట్ర అవతరణ వేడుకలకు అడుగడుగునా తెలంగాణ సెగ తాకింది. గురువారం భారీ పోలీసు బందోబస్తు మధ్య 57వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించగా, ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు గైర్హాజరు కావడంతో మొక్కుబడిగా వేడుకలు నిర్వహించి అయిందనిపించుకున్నారు. గురువారం బ్లాక్‌డేగా నిర్వహించాలని టిఆర్‌ఎస్, తెలంగాణ విద్రోహదినం పాటించాలని జెఎసి, ఇతర తెలంగాణ ఉద్యమ సంఘాలు పిలుపునిచ్చిన నేపద్యంలో జిల్లా అంతటా నల్లజెండాలు నింగికెగిసాయి. ఉపాధ్యాయుల జెఎసి ఆధ్వర్యంలో టీచర్లంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకాగా, ఉద్యోగ జెఎసి పిలుపుమేరకు ఉద్యోగులు, గజిటెడ్ అధికారులు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆదిలాబాద్‌లోని డిపిఓ కార్యాలయం ఎదుట, తెలంగాణ జెఎసి శిబిరం వద్ద తెలంగాణవాదులు నల్లజెండా ఎగురవేసి తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించి బ్లాక్‌డే పాటించారు. టిఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలోను నల్లజెండాలు ఎగురవేశారు. ఇక కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేయగా, ప్రభుత్వపరంగా ఇచ్చే రివార్డులను ఉద్యోగులు తిరస్కరించడం, మొక్కుబడిగా హాజరుకావడంతో వేడుకలు వెల వెల బోయాయి. ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, గుడిహత్నూరు, తలమడుగు, ఇంద్రవెల్లి, కడెం, ఖానాపూర్ తదితర మండలాల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ నల్లజెండాలను ఎగురవేసి విద్రోహదినం పాటించారు. నిర్మల్‌లో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కె శ్రీహరిరావు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. ఇక తూర్పు జిల్లాలోని కాగజ్‌నగర్ రాజీవ్ చౌరస్తాలో ఎమ్మెల్యే సమ్మయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయగా, జైపూర్‌లో జెఎసి శిబిరం వద్ద అక్కడి ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో మానవహారం ఏర్పాటుచేసి సీమాంధ్ర పాలకుల వైఖరిని ఎండగట్టారు. మంచిర్యాల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి నల్లజెండా ఎగురవేసి బ్లాక్‌డేగా పాటించగా, మంచిర్యాల మునిసిపల్ కార్యాలయంపై నల్లజెండాలు ఎగురవేస్తుండగా, ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నూర్‌లో నల్లజెండాలు ఎగురవేస్తుండగా, 12 మంది తెలంగాణవాదులను అరెస్టు చేసి విడుదల చేశారు. హైదరాబాద్‌లో కోదండరాం అరెస్టును నిరసిస్తూ ననె్నలలో 10 మంది యువకులు వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అలాగే ఆదిలాబాద్, లక్సెట్టిపేట్, ఆసిఫాబాద్ కోర్టు ప్రాంగణాల్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లజెండాలు ఎగురవేశారు. ఆసిఫాబాద్‌లో న్యాయవాదులు నల్లబ్యాడ్జీలతో విధులు బహిష్కరించారు. ఇక సింగరేణి గనుల్లోను కార్మికులు విద్రోహదినాన్ని పాటిస్తూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో తెలంగాణ వాదులు, కార్మికులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకాగా, జిల్లాలో ఏలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేయడంతో ప్రశాంతంగా ముగిసాయి.

తలమడుగు, బేలాలో
కలెక్టర్ దిష్టిబొమ్మల దగ్ధం
ఆదిలాబాద్, నవంబర్ 1: పత్తి రైతులకు అండగా వుండాల్సిన జిల్లా కలెక్టర్ అశోక్ పత్తి వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ గురువారం అఖిల పక్ష రైతు కమిటీల ఆధ్వర్యంలో తలమడుగు, బేల మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం పేరిట ధర నిర్ణయిస్తామని కలెక్టర్ అశోక్ వ్యాపారులకు వంత పాడడం శోచనీయం అన్నారు. పంట పెట్టుబడి వ్యయం ఈ సారి 3 రేట్లు పెరిగి రైతులు అప్పుల భారంతో కుంగి పోతున్నారని, ఈ దశలో రైతులకు బాసటగా నిలవాల్సిన కలెక్టర్ నిబంధనలు, అంక్షల పేరిట పత్తి ధర తగ్గించడం శోచనీయమని అఖిల పక్ష రైతు ప్రతినిధులు పేర్కొన్నారు. కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నిరసనలు తెలిపారు.

తెలంగాణపై కాంగ్రెస్, టిడిపిలు వైఖరి స్పష్టం చేయాలి
* బిజెపి జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాథ్
నిర్మల్‌అర్బన్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీలు ద్వంద విధానాలను అవలంబించడం మానుకొని తమ వైఖరిని స్పష్టం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాథ్ డిమాండ్ చేశారు. నిర్మల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నగర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంనాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపిల కారణంగానే రాష్ట్రంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య వైషమ్యాలు పొడచూపుతున్నాయన్నారు. దీంతోనే అటు రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఇటు విద్రోహ దినోత్సవాలు జరుగుతున్నాయన్నారు. విద్రోహ దినోత్సవంలో నల్లజెండాలు ఎగురవేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం విచారకరమన్నారు. కాంగ్రెస్, టిడిపిలు స్పష్టమైన వైఖరిని స్పష్టం చేశాకే ప్రజల్లోకి రావాలని సూచించారు. అనంతరం ఎన్నికల అధికారి పంతికె ప్రకాష్ మాట్లాడుతూ గ్రామాల్లో బిజెపి కమిటీలను నియమించడం పూర్తయినట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని 10 వార్డుల్లో వార్డు కమిటీలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. మరో రెండుమూడు రోజుల్లో అన్ని వార్డుల్లో కమిటీలను ఎన్నుకున్న అనంతరం పట్టణ కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. బిజెపిలో చేరేందుకు యువత ఉత్సాహం కనిపిస్తున్నారన్నారు. బిజెపి బలోపేతం చేసేందుకు నూతనంగా ఎన్నికైన కమిటీల సభ్యులు, కార్యకర్తలు కృషిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యన్నగారి భూమయ్య, జిల్లా కార్యదర్శి పాకాల రాంచందర్, నాయకులు ఒడిసెల శ్రీనివాస్, మెడిసెమ్మె రాజు, నాయిడి మురళి, ఆకుల రవి, ఆయిటి కృష్ణ, రాము పాల్గొన్నారు.

తెలంగాణ వచ్చే వరకు పోరాటం : ఎమ్మెల్యే ఓదెలు
జైపూర్, నవంబర్ 1: తెలంగాణ వచ్చే వరకు పోరాడుతామని చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలో జె ఎసి, తెరాస ఆధ్వర్యంలో నల్లజెండాలు ఎగురవేసి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని కోరుతూ ఇప్పటికే 700మందికి పైగా ఆత్మబలిదానాలు చేసుకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం రాలేదన్నారు. తెలంగాణ ప్రాంతంలోని నీరు, వనరులు, ఖనిజ సంపదను దోచుకుంటూ సమైక్యవాద పాలనలో తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా వంచనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను తెస్తాం ఇస్తామంటూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్, రెండు కళ్ళ సిద్దాంతంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారని, తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా వై ఎస్ ఆర్‌సిపి నేత జగన్ చెల్లె షర్మిల పాదయాత్రను తెలంగాణలో అడ్డుకుని తీరుతామని అన్నారు. ఇప్పటికైన సమైక్యవాదులు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలన్నారు. అలాగే భీమారంలో తెరాస నాయకులు స్థానిక బస్టాండ్‌లో నల్లజెండా ఎగురవేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు కట్కూరి సత్యనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దాసరి మధునయ్య, తూర్పు జిల్లా యువజన విభాగం కార్యదర్శి శీలం వెంకటేష్, నాయకులు గద్దల హన్మంతు, సొల్లేటి కనకయ్య, మెండ సత్యనారాయణ, బేతు తిరుపతిరెడ్డి, జర్పుల రాజ్‌కుమార్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ర్యాలీ...
మండలంలోని టేకుమట్ల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరసిస్తూ గ్రామంలోని స్థానిక బస్టాండ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ఐదు నిమిషాలు వౌనం పాటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు కనుకుంట్ల సంతోష్, మాజీ సర్పంచ్ గోనె నర్సయ్య, తెరాస గ్రామ కమిటి అధ్యక్షుడు నర్సింగరావు, సభ్యులు పాత ప్రశాంత్, పౌర సమాచార సంక్షేమ సంఘం తూర్పు జిల్లా అధ్యక్షుడు చెలుకల విజయ్‌యాదవ్, మండల అధ్యక్షుడు దుర్గం రాజ్‌కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
నిర్మల్ , నవంబర్ 1 : కొన్ని గంటల్లో ఇంట్లో శుభకార్యం.. చుట్టాలు, బంధువుల తో ఇళ్ళంతా కళకళలాడుతోంది.. భార్య శ్రీ మంతపు ఏర్పాట్లలో ని మగ్నమైన ఆ యువకుడు మృత్యువాత పడిన సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. తమ బంధువులను కడ్తాల్‌లో దింపి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాద రూపంలో మృ త్యువు కబళించడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ మండలంలోని మేడిపెల్లి గ్రామానికి చెందిన కుంట నవీన్(26) అనే యువకుడు గురువారం బంధువులను జాఫ్రాపూర్‌లో దింపి తిరిగి వస్తుండగా కడ్తాల్ బైపాస్ క్రాసింగ్ వద్ద బస్సు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. నవీన్‌కు రెండు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన హరీషతో వివాహమైంది. తమ కన్న కలలకు భార్య కడుపు పండి తమ ఇంట్లో శ్రీమంతం జరుపుకునే సమయంలోనే నవీన్ మృతిచెందడంతో కుటుంబ సభ్యు లు చేసిన రోదనలు పలువురిని కంటతడిపెట్టించాయి. సంఘటనా స్థలాన్ని రూరల్ సిఐ రఘు, సోన్ ఎస్.ఐ వెంకటేష్ సందర్శించి శవాన్ని పోస్టుమార్టం నిమి త్తం నిర్మల్ ఏరి యా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* విద్యారంగ అభివృద్ధికి రూ.244 కోట్ల ప్రణాళిక * రాష్ట్ర అవతరణ వేడుకల్లో కలెక్టర్ అశోక్
english title: 
collector

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>