Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

స్వయంప్రతిపత్తి కోసం పోరాడాలి: విద్యాసాగర్‌రావు

$
0
0

వేములవాడ, నవంబర్ 1: తెలంగాణ ప్రాంతానికి స్వయంప్రతిపత్తికోసం పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా వుందని, బిజెపి సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి సిహెచ్.విద్యాసాగర్‌రావుఅభిప్రాయపడ్డారు. గురువారం వేములవాడ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఆయన రాష్ట్ర నాయకుడు ప్రతాప రామకృష్ణతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ విద్రోహ దినం పాటించకుండా ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనడాన్ని ఆయన తప్పుపట్టారు. అవరతరణ వేడుకల్లో మంత్రులు పాల్గొనడం సమైక్యవాదులకు బలం చేకూర్చుతుందని, కేంద్రప్రభుత్వం కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశంవుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మన తెలంగాణ ప్రాంతాన్ని మనమే పరిపాలించుకునే స్వయంప్రతిపత్తి కోసం ఐక్యంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్యమం తీవ్రతరం చేస్తేనే కేంద్రం దిగివస్తుందని అప్పుడే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేనికైనా ‘రెఢీ’..
* మోహన్‌బాబు గుండాల
దౌర్జన్యంపై బ్రాహ్మణుల నిరసన
* ‘చౌక్’లో మోహన్‌బాబు
కుటుంబానికి పిండప్రదానం
కరీంనగర్ టౌన్, నవంబర్ 1: మం చు విష్ణు నటించిన దేనికైనారెడీ సినిమా పై రోజురోజుకు రగడ రాజుకుంటోంది. హైదరాబాద్‌లో మోహన్‌బాబు ఇంటి ముందు నిరసన తెలుపడానికి వెళ్లిన బ్రాహ్మణులను మోహన్‌బాబు గుండా లు దాడి చేయడంపై బ్రాహ్మణులు మండిపడ్డారు. తాము దైనికైనా రె’్ఢ’ అంటున్నారు. భజరంగ్‌దళ్, విశ్వహిం దూ పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కు టుంబాలు పెద్ద సంఖ్యలో గురువారం రోడెక్కాయి. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మోహన్‌బాబు కుటుంబానికి, దేనికైనారెడీ సినిమాకు పిండ ప్రదానం చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా భజరంగ్ దళ్ జిల్లా ప్రధా న కార్యదర్శి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మణులను కించపరిచేవిధం గా ఉన్న సన్నివేశాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భజరంగ్‌దళ్, విహెచ్‌పి, బ్రహ్మణ సంఘం నాయకులు రవీందర్, శివరామరాజు, దీపక్‌బాబు, హేమలతా దేవి, నాగరాణి, భరత్‌కుమార్ శర్మ, రత్నజ్యోతి, మణికంఠశర్మ, త్రినాథ్ శర్మ, రాజుశర్మ, సాయిశర్మ, అశోక్, రాజేందర్, గణేష్, శశి, కిషోర్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

అన్నిరంగాల్లో అభివృద్ధి : కలెక్టర్
కరీంనగర్, నవంబర్ 1: గత 56 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, అందులో కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కరీంనగర్ జిల్లా కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన అవతరణ వేడుకల్లో జిల్లా కలెక్టర్ జెండావిష్కరణ చేసి ప్రసంగించారు. పుణ్య నది అయిన గోదావరి జిల్లాను సస్యశ్యామలం చేస్తుండగా, ఎస్సారెస్పీ జిల్లాకు వరప్రధాయిని అని, ఎల్‌ఎండి ఇతర ప్రాజెక్టులు నీటి వనరులు జిల్లాలో పచ్చదనం నింపుతూ పాడి పంటలను సంమృద్ధిగా అందిస్తున్నాయని అన్నారు. సింగరేణి బొగ్గు గనునులు పారిశ్రామిక ప్రగతికి దర్పణంగా నిలుస్తున్నాయని, ఎన్‌టిపిసి వెలుగులు జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లాను మరింత అభివృద్ధిపర్చి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేందుకు కృషి జరుగుతోందని, విద్యతో అభివృద్ధి సాధ్యం అనే లక్ష్యంతో విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషిచేస్తున్నామని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘పర్ఫామ్మెన్స్ మానిటరింగ్’ సాప్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశామని, దీని ద్వారా ప్రతి విద్యార్థి హాజరు, ప్రతి నెల యూనిట్ పరీక్షలలో వచ్చి మార్కుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి జిల్లా కేంద్రం నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, ఆ స్థానాన్ని అలాగే పదిలపర్చేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని కోరారు. ఆర్వీఎం ద్వారా 462 అదనపు తరగతి గదులు, 126 పాఠశాలలకు కాంపౌడ్ వాల్స్ మంజూరు చేశామని, జిల్లాలోని 51కస్తూరిభా గాంధి బాలికా విద్యాలయాల్లో ‘స్క్ఫై వీడియో కాలింగ్ సిస్టమ్’ను ఏర్పాటు చేసి ప్రతి రోజు సమీక్షిస్తున్నామని తెలిపారు. అలాగే అబాకస్ నేర్పిస్తూ క్యాలిక్యులేటర్ కన్నా వేగంగా లెక్కలు చేయటంలో ప్రావీణ్యత పెంపొందిస్తున్నామని అన్నారు. జిల్లాలోని 271 ఎస్సీ, బిసి, గిరిజన సంక్షేమ, ఇతర వసతి గృహాలను పర్యవేక్షిస్తూ విద్యార్థుల సంక్షేమం చూసేందుకు ‘సన్నిహిత’ కార్యక్రమం ద్వారా దత్తత అధికారులుగా జిల్లా మండల స్థాయి అధికారులను నియమించాలని చెప్పారు. వసతి గృహాల విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణకు 9వేల దోమ తెరలను సరఫరా చేశామని అన్నారు. మాతా శిశు మరణాల నివారణకు ‘మార్పు’ పథకాన్ని ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనికి సంబంధించి ఇటీవలే నాలుగు జిల్లా కలెక్టర్లు, ఇతర అదికారులతో ప్రాంతీయ వర్క్‌షాప్ కరీంనగర్‌లో నిర్వహించామని తెలిపారు. జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలను మెరుగుపర్చి పేద ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గర్భిణీలు, అప్పుడే పుట్టిన శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ‘అమ్మలాలన’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు. అమ్మలాలన ద్వారా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి ప్రతి గర్భిణీకి ఆరోగ్య సూచనలు, వైద్య సమాచారం, చికిత్స సమాచారం ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవానికి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అన్ని పిహెచ్‌సిలలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది హాజరు, పనితీరును పర్యవేక్షించేందుకు వీడియో కాలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో డెంగ్యూ, విష జ్వరాలు, అతిసారా వంటి వ్యాధుల నివారణకుగాను ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెంగ్యూ నిర్ధారణ, ఎలీసా పరీక్షా సౌకర్యం, ప్లేట్‌లేట్ సౌకర్యం కలదని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 81,813 ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించామని, ఇందుకు గాను 204 కోట్ల 62 లక్షల రూపాయలను నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించడం జరిగిందని తెలిపారు. అలాగే పేద ప్రజల వైద్య ఖర్చులు తగ్గించుటకు అతి తక్కువ ధరలో అందించేందుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద నక్సల్స్ ప్రభావిత మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 30 కోట్లు నిధులు మంజూరు చేసిందని, ఇప్పటివరకు 23 కోట్ల 14 లక్షల రూపాయలు ఖర్చు చేసి 322 పనులు పూర్తి చేశామని తెలిపారు.

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వేళల్లో స్వల్ప మార్పు
* ఎన్‌పిడిసిఎల్ సిఎండి కార్తికేయ మిశ్రా
కరీంనగర్, నవంబర్ 1: వరంగల్ ఎన్‌పిడిసిఎల్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని వ్యవసాయ రంగానికి ప్రస్తుతం ఏడు గంటల పాటు సరఫరా చేస్తున్న విడతల వారీ విద్యుత్ పంపిణీలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ఎన్‌పిడిసిఎల్ సిఎండి కార్తికేయ మిశ్రా గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ప్రస్తుతం ఆరుతడి పంటల సాగుకోసం విద్యుత్ సరఫరాలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్లు అనేక విజ్ఞప్తులు అందడంతో రైతుల ప్రయోజనాలను, వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని విద్యుత్ పంపిణీ వేళల్లో ఈ మార్పు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వారానికొకసారి మారుతున్న విద్యుత్ సరఫరా వేళలు ఇకపై కొంత కాలంపాటు రెండు రోజుల చొప్పున మార్పులు జరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం ‘ఎ’గ్రూపులోని కనెక్షన్లకు 03 గంటల నుంచి 08 గంటల వరకు మొదటి దశగా, 5 గంటలు అలాగే 14 గంటల నుంచి 16 గంటల వరకు రెండవ దఫా మరో రెండు గంటల చొప్పున విద్యుత్ సరఫరా జరుగుతోంది. గ్రూప్ ‘బి’లో ఉన్న కనెక్షన్లకు 13 గంటల నుంచి 18 గంటల వరకు మొదటి దఫా 5 గంటలు, 01 నుంచి 03 వరకు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా అవుతోంది. అలాగే ‘సి’గ్రూపులో 22 గంటల నుంచి 03 గంటల వరకు 5 గంటల పాటు మొదటి దఫా 16 గంటల నుంచి 18 గంటల వరకు, రెండవ దఫా రెండు గంటలు విద్యుత్ సరఫరా జరుగుతోంది. విద్యుత్ సరఫరా వేళల్లో రైతులు అసౌకర్యానికి గురవడమే కాకుండా రాత్రిపూట పాముకాటుకు గురవుతున్న సంఘటనలు జరుగుతుండడంతో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వారం రోజులకు ఒకసారి చొప్పున ఈ మూడు గ్రూపుల విద్యుత్ సరఫరా వేళలను రొటేషన్ పద్ధతిలో మార్చుతూ వస్తున్నారు. తాజా ప్రతిపాదనల మేరకు ప్రయోగాత్మకంగా రెండు రోజులకొకసారి మార్చాలని నిర్ణయించినట్లు మిశ్రా వెల్లడించారు.

కార్పొరేట్ సంస్థలకు
ఊడిగం చేస్తున్న ప్రభుత్వాలు
*సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి
కరీంనగర్ టౌన్, నవంబర్ 1: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా వారి పొట్టగొడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. మున్సిపల్ గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ జిల్లా 5వ మహాసభల సందర్భంగా గురువారం స్థానిక బద్దం ఎల్లారెడ్డ్భివన్‌లో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు, కార్మికుల సమస్యలు పెరిగిపోతున్నాయని, కార్మికుల కోసం తీసుకువచ్చిన చట్టాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని విమర్శించారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కీర్ల కృష్ణారావు మాట్లాడుతూ యేళ్ల తరబడిగా పనిచేస్తున్న కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని, వారికి ఉద్యోగ భత్రద కల్పించాలని, కాంట్రాక్టు కార్మికులకు 10వేల రూపాయల వేతనం ఇవ్వాలని, వారంతపు సెలవులు ఇవ్వాలని, క్యాజువల్ సెలవులు, కేటగిరిని బట్టి వేతనాలు, పదవి విరమణ చేసిన కార్మికుల పిల్లల ఉద్యోగాలకై 263జివోను పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 17,18తేదీలలో గుంటూరులో జరిగే యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సిపిఐ నగర కార్యదర్శి సృజన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు ఏసురత్నం, రామయ్య, మల్లయ్య, రాజలింగం, అశోక్, శంకర్, రాజమల్లు, రవి, కనకయ్య, మల్లమ్మ, కనుకమ్మలతోపాటు 200 మంది కార్మికులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రాంతానికి స్వయంప్రతిపత్తికోసం పార్టీలకతీతంగా పోరాడాల్సిన
english title: 
vidyasagar rao

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>