Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వ్యవసాయ రంగానికి పెద్దపీట

$
0
0

సంగారెడ్డి,నవంబర్ 1:వ్యవసాయ రంగానికి జిల్లాలో పెద్దపీట వేస్తున్నట్లు జిల్లాకలెక్టర్ ఏ దినకర్‌బాబు వెల్లడించారు.57వ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఆయన గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసు పెరెడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండావిష్కరణ చేశారు.అనంతరం మాట్లాడుతూ జిల్లాలో రైతాంగానికి భారీగా రుణాలను మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు.లక్షా ముప్పై వేల మంది రైతులకు 498 కోట్ల రూపాయల రుణాలను వివిధ బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగిందన్నారు.అలాగే వ్యవసాయ యాంత్రీకరణ కోసం రెండు రూపాయలను ఖర్చు చేసి ఉపకరణాలను రైతులకు అందచేసినట్లు తెలిపారు. ఉద్యానవన శాఖ ద్వారా పండ్ల తోటల విస్తీర్ణం కోసం 142 కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా కూరగాయాల సాగులో ఐదవ స్థానంలో పూల సాగులో ఏడవ స్థానంలో ,సుగంధ ద్రవ్యాల సాగు లో ఎనిమిదవ స్థానంలో ఉందని ఇందుకు చాల సంతోషంగా ఉందన్నారు.పశుసంవర్థక శాఖ ద్వారా పశుగ్రాసం విత్తనాలను సరఫరా చేయడంతో పాటు పశుక్రాంతి పథకం కింద మినీ డెయిరీ యూనిట్లను,మిడీయం డెయిరీ యూనిట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు.జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా ఉపాధి హామీ పథకం కింద 116 కోట్ల రూపాయల వ్యయంతో ఉపాధిని కల్పించడం జరుగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో 11 వేల పనులను పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు.వన నర్సరీల ద్వారా ఆరు కోట్ల రూపాయల వ్యయంతో 40 లక్షలకుపైగా టేకు మొక్కలనునాటడం జరిగిందన్నారు.ఉద్యానవన శాఖ సమన్వయంతో 10 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎనిమిదివేల ఎకరాల్లో పండ్ల తోటలను పెంచడం జరుగుతోందన్నారు.ఇందిరజల ప్రభ పథకం కింద ఎస్సీ,ఎస్టీ భూముల్లో 75 వేల ఎకరాల అసైన్డ్ భూములకు సాగునీటి వసతిని కల్పించి వినియోగంలోకి తీసుకరావడం జరిగిందని ఇందుకోసం 156 కోట్లను వ్యయం చేయడం జరుగుతోందన్నారు.జిల్లాలో 10 మెగావాటర్‌షెడ్ పథకాల ద్వారా లక్ష హెక్టార్ల భూమిని అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు.ఇందుకోసం 137 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా మూడు వేల హెక్టార్లలో బిందు సేద్యం చేపట్టడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని ఏస్సీ ఏస్సీ భూముల్లో కూడా అము చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో నీటి పారుదల అభివృద్ధి సంస్థ ద్వారా 24 ఎత్తిపోతల పథకాలతో పదివేల ఎకరాలను సాగు నీరు అందించడం జరుగుతోందని మరో ఏడు ఎత్తిపోతల పథకాలకు 54 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని పనులు కొనసాగుతున్నాయన్నారు.అలాగే స్వయం సహాయ బృందాలకు బ్యాంకుల అనుసంధానం ద్వారా 158 కోట్ల రూపాయల రుణాలను ఇప్పించడం జరిగిందని అలాగే 18 కోట్ల రూపాయలను స్ర్తి నిధి బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు రుణాలుగా మహిళ సంఘాలు తీసుకున్నట్లు తెలిపారు.సామాజిక భద్రత కింద పింఛన్లు, అభయహస్తం కింన బీమా లాంటి సౌకర్యాలను మహిళకు కల్పించడం జరిగిందన్నారు. విద్యుత్ శాఖ ద్వారా దాదాపు రెండు లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతోందని వెల్లడించారు. విద్యా శాఖ ద్వారా పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజనపథకాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్రాథమిక విద్యా అభివృద్ధి కోసం 183 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందన్నారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద లక్షా యాభై వేల ఇళ్లను నిర్మించడం జరిగిందన్నారు.రాజీవ్ ఉద్యోగశ్రీ, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు , అరోగ్యశ్రీ పథకం, 104 సేవలు, 108 అత్యవసర సేవలు, పౌర సరఫరాశాఖ ద్వారా రూపాయికే కిలో బియ్యం పథకం లాంటి ప్రజల కోసం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సాంఘీక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, షెడ్యూలు కులాల సేవా సహకార సంస్థ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ,వికలాంగుల సంక్షేమ శాఖ , మైనార్టీ సంక్షేమ శాఖ, స్ర్తిశిశు సంక్షేమ శాఖ ద్వారా తీసుకోబడుతున్న చర్యలను ఆయన ఈ ప్రసంగంలో విఫులంగా వివరించారు. శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి కోసం 13 కోట్ల రూపాయల వ్యయంతో 723 కోట్ల పనులకు మంజూరు లభించగా 440 పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. పార్లమెంట్ సభ్యుల నిధుల కింద 14 కోట్ల రూపాయల వ్యయంతో 942 పనులను ప్రారంభిం చినట్లు వెల్లడించారు. ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయని త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖతో పాటు పోలీసు శాఖ ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన వివరిస్తూ కొనియాడారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న వ్యక్తులకు , సంస్థలకు ఆయన కృతజతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పథకాల కింద లబ్దిదారులకు అసెట్స్ పంపిణీతో పాటు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఆయన తిలకించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మూర్తి, డి ఆర్‌వో ప్రకాష్‌కుమార్, ఎస్పీ అవినాష్ మహంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, ఈ రాష్ట్ర అవతరణ వేడుకల్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులెవ్వరూ కూడా పాల్గొనకపోవడం విశేషం.

నల్లజెండాల రెపరెపలు
సిద్దిపేట, నవంబర్ 1 : రాష్ట్రఅవతరణ దినోత్సవం పురస్కరించుకొని టిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిద్దిపేటలో టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయంపై నల్లా జెండాలు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఆర్డీఓ కార్యాలయం ప్రధాన రహదారులపై పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద సిఐ నాగభూషణం, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌తో పాటు సిబ్బందితో భారీబందోబస్తును ఏర్పాటు చేశారు. టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నయ్యర్‌పటేల్, మాజీచైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ పూజల వెంకటేశ్వర్‌రావు, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శేషుకుమర్‌తో పాటు పలువురు నాయకులు పోలీసుల చెక్‌పోస్టును తప్పించుకొని ఆర్డీఓ కార్యాయలం గేటును తోసుకొని లోనికి ప్రవేశించి కార్యాలయం వద్ద నల్లాజెండాను ఎగురవేశారు. జైతెలంగాణకు అనుకూ లంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ టిఆర్‌ఎస్ నాయకులు పోలీసుల మధ్య తొపులాట జరిగింది. పోలీసులు నల్లజెండాను తొలగించి టిఆర్‌ఎస్ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తూప్రాన్‌లో
తూప్రాన్, నవంబర్ 1: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ గురువారం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగానే పట్టణంలో ర్యాలీ నిర్వహించడంతోపాటు తహశీల్దార్ కార్యాలయంపై నల్లజెండాలు ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పడాలపల్లిలో నల్లజెండాలను ఎగరవేశారు.
గజ్వేల్‌లో...
గజ్వేల్: నవంబర్ 1ని తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ గురువారం జేఎసి, టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగంల ఆధ్వర్యంలో నేతలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి నల్లజెండాలు ఎగరవేశారు. తహశీల్దార్, ఎంపిడిఓ, మున్సిపల్, ఎస్టీఓ, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, మార్కెట్ కమిటీ, పోస్ట్ఫాస్, ప్రభుత్వ కళాశాలలు, ఎంఇఓ, పిఆర్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్ తదితర కార్యాలయాలపై నల్లజెండాలు ఎగర వేయగా, ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత ఎలక్షన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఊడెం కృష్ణారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, బిసిసెల్ రాష్ట్ర కార్యదర్శి కల్యాణ్‌కర్ కిషన్, జేఎసి కో-ఆర్డినేటర్ నర్సింగరావులు మాట్లాడారు. ఇక్కడి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రధేశ్‌లో విలీనం చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో రాష్ట్ర అవతరణను నిరసిస్తూ ఆందోళనలు చేపడుతు న్నప్పటికి ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో కొనసాగడం సమంజసం కాదని నిలదీశారు. ఇక్కడి నేతలు సమైక్యవాద పార్టీలను వదిలి ఉద్యమంలో కలసి రావాలని, లేని పక్షంలో వారికి రాజ కీయ సమాది తప్పదని హెచ్చరించారు.
జిన్నారంలో...
జిన్నారం: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరసిస్తూ మడలంలో నిరసనలు వెల్లువెత్తాయి. గురువారం మండల కేంద్రమైన జిన్నారంలో టీఆర్‌ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయంలోనికి వెళ్ళి నల్లజంఢాను ఎగురవేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పోలీసులకు టీఆర్‌ఎస్ నాయకులకు మద్య తీవ్ర ఘర్షణ వాతావారణం నెలకొన్నది. దీంతో మరికొంత మంది టీఆర్‌ఎస్ నాయకులు తహశీల్దార్ కార్యాలయంపైకి వెళ్ళి నల్లజంఢాను ఎగురవేశారు. ఇక మండలంలోని దోమడుగు అవరవీరుల స్తూపం వద్ద టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌరీశంకర్‌గౌడ్ ఆధ్వర్యంలో నల్లజంఢాను ఎగురవేసి నిరసన తెలిపారు. గుమ్మడిదల గ్రామంలో జిల్లా టీఆర్‌ఎస్ నాయకుడు మంద భాస్కర్‌రెడ్డి ఆద్వర్యంలో నల్లజండాను ఎగురవేశారు.
తెలంగాణ సాధనకు ప్రతిన
మెదక్, నవంబర్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణవాదులు నిరసనలు తెలిపారు. నల్ల జెండాలు ఎగురవేసి నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెదక్‌లో తెరాస నాయకురాలు,
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెరాస జెండాలు చేబూని నల్లజెండాలు ఎగురవేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం నాయకులు, విద్యార్థుల చేత తెలంగాణ సాధనకు ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణకు మద్దతుగా, సమైఖ్యాంధ్రకు వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను కుటిల బుద్దితో ఆంధ్రలో విలీనం చేశారని ధ్వజమెత్తారు. వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం హెడ్ పోస్ట్ఫాస్ నుండి ఫతేనగర్, చమన్, రాందాస్ చౌరస్తా వరకు విద్యార్థులు పెద్దయెత్తున ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మాజీ ఎమ్మెల్యే పద్మ, నాయకులు ముందుండి నడిచారు.

12న జిల్లాలో భాబు పాద యాత్ర
సంగారెడ్డి,నవంబర్ 1: 12వ తేదీన జిల్లాలోకి ప్రతిపక్ష నేత , చంద్రబాబు పాద యాత్ర జిల్లాలోకి రానుంది. ఈమేరకు జిల్లా నాయకత్వం తగు రీతిలో ఏర్పాట్లను చేయడానికి చర్యలు తీసుకుంటోంది. పాదయాత్రకు సన్నద్ధంకావడానికి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం సంగారెడ్డి నియోజకవర్గం నేత పి మాణిక్యం ఇంట్లో గురువారం సమావేశమెంది. ఈ సమావేశానికి మాజీ మంత్రి బాబుమోహన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొని పాదయాత్ర విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలను కూడా నిర్వహించాలని, ఈ నెల ఐదవ తేదీ లోపు అన్ని నియోజకవర్గాల సమావేశాలను నిర్వహించాలని, 6వ తేదీన మరో విడత జిల్లా సమన్వయ కమిటీ సమావేశం కూడా జరపాలని నిర్ణయంచారు. ఈ సమావేశంలో ఇతర జిల్లా నేతలు సపాన్‌దేవ్, ఎం విజయపాల్‌రెడ్డి, వై నరోత్తం, ఇతర నేతలు పాల్గొన్నారు.

కార్యకర్తలు, నేతలు లేకనే డిసిసి వాయిదా
సంగారెడ్డి,నవంబర్ 1:అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం పటాన్‌చెరులో జరగాల్సిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయడంలో జిల్లా పార్టీ నాయకత్వం పూర్తి స్థాయిలో విఫలమైనట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని కార్యకర్తలతో పాటు నేతలు కూడా బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. పటాన్‌చెరులో జిల్లా నాయకత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా ఆసక్తి కనబర్చనట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో మూడు రోజుల పాటు ఇందిరమ్మబాట కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్న నేఫథ్యంలో చివరి రోజు పటాన్‌చెరు నియోజవర్గంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.అయితే, ఇందిరమ్మబాట చివరి రోజు ఈ కార్యక్రమం సంగారెడ్డి నియోజకవర్గంలో కొనసాగడంతో పాటు మూడు గంటల అలస్యంగా వివిధ కార్యక్రమాలు కొనసాగాయి. సంగారెడ్డి నియోజకవర్గం అనంతరం పటాన్‌చెరులో జరగాల్సిన కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో ఆలస్యంగా జరిగడం జరిగింది.దీంతో ఈ సమావేశాల అనంతరం జరగాల్సిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం అసలే జరగలేదు. కార్యకర్తలకు, నేతలకు సరైన సమాచారం లేకపోవడంతో ఈసమావేశానికి అసలే కార్యకర్తలు,నేతలు రాలేదని సమాచారం. ఈసమావేశం జరుగకపోయినా నేతలు పార్టీసమావేశం పేరుమీద చేయాల్సిన దందాలన్నీ చేసినట్లు ఆపార్టీ నేతలు వాపోతున్నారు.ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన మంత్రులు గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా ఈ సమావేశం పట్ల అంతగా ఆసక్తిని కనబర్చలేదు. కాగా, కొంత మంది ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకుని ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఇందిరమ్మబాటలో విజయవంతం కావడం జరిగింది కానీ పటాన్‌చెరులో మాత్రం డిసిసి సమావేశం తో పాటు ఇతర కార్యక్రమాలేవీ విజయవంతం కావడానికి కృషి జరుగనట్లు తెలుస్తోంది.ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కోసం కనీసం నియోజకవర్గం కార్యకర్తలు కూడా డిసిసి సమావేశ మందిరంలో వేచి లేనట్లు సమాచారం.దీంతో ఈ సమాచారాన్ని తెలుసుకున్న సి ఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు సమావేశానికి హాజరుకాకుండానే రాష్ట్ర రాజధానికి తరలి వెళ్లారు. అసలు జిల్లాకు చెందిన డిప్యూటీ సి ఎం ఇందిరమ్మబాట మొదటి రోజు సాయంత్రం వరకే పాల్గొనగా రెండవ రోజు సాయంత్రం మాత్రమే తన నియోజవర్గంలో పాల్గొన్నారు. మూడవ రోజు అసలే పాల్గొనలేదు.కాగా, మరో సీనియర్ మంత్రి గీతారెడ్డి మొదటి రోజు అసలే పాల్గొనకపోగా రెండు రోజు తన నియోజకవర్గంలోనే పాల్గొన్నారు.మూడు రోజు కూడా చివరిగా కార్యకమంలో పాలు పంచుకున్నారు.మొత్తంగా ఇందిరమ్మబాట కార్యక్రమం విజయవంతం చేయడానికి కూడా జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి తప్ప అంతగా ఇతర నేతలు అసక్తిని కనబర్చలేదు.ఈ ప్రభావం డిసిసి సమావేశంపై కూడా పడింది. నారాయణఖేడ్ ,నర్సాపూర్, దుబ్బాక, జహీరాబాద్ నియోజకవర్గాలో నేతల మధ్యన విభేదాలు సిఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముందే బహిర్గతమైనాయి. ఈ నేతల మధ్యన ఐక్యత లేకపోవడం పూర్తిగా జిల్లా కాంగ్రెస్ సమావేశం జరుగకుండా చేసిందని కార్యకర్తలు, మండల స్థాయి నేతలు భావిస్తున్నారు.దీనికి తోడు ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగకపోవడంతో కార్యకర్తల్లో ఓ రకమైన నైరాశ్యం నెలకొంది. ఈ ఇందిరమ్మబాట కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ మాత్రం తొలగించే ప్రయత్నం చేయలేదు. దీంతో అధికార పార్టీ జిల్లా కార్యవర్గ, కార్యకర్తల సమావేశం జరుగకుండానే సి ఎం ఇందిరమ్మబాట కార్యక్రమం దిగ్విజయంగా ముగియడం విశేషం.

కలెక్టర్ దినకర్‌బాబు
english title: 
agriculture top priority

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>