విశాఖపట్నం, నవంబర్ 6: తుని నుంచి రోడ్డు మార్గంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తారని భావించినా, ఆయన ఎక్కాల్సిన విమాన సమయం దగ్గర పడడంతో నేరుగా బోర్డింగ్‌కు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి వెంట పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గంటా శ్రీనిసరావు, బాలరాజు, ఎమ్మెల్యేలు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ తదితరులు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో మంత్రి కోండ్రు మురళి, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, వుడా మాజీ చైర్మన్ రవి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, ధర్మశ్రీ తదితరులు ఉన్నారు.
తుని నుంచి రోడ్డు మార్గంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు
english title:
leaders meet cm
Date:
Wednesday, November 7, 2012