విశాఖపట్నం, నవంబర్ 6: విశాఖ నగరానికి గత ఐదు రోజుల నుంచి విఐపిల రాక కొనసాగుతునే ఉంది. ఈనెల రెండో తేదీన విజయనగరం పిసిసి అధ్యక్షుడు కుమార్తె వివాహానికి గవర్నర్‌లు నరసింహన్, రోశయ్యతోపాటు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, పనబాక లక్ష్మి సహా వంద మందికి పైగా విఐపిలు నగరానికి వచ్చి, ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళారు. సరిగ్గా అదే రోజు రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మరణించారు. దీంతో చంద్రబాబు నాయుడు విశాఖ నగరానికి వచ్చి, ఇక్కడి నుంచి శ్రీకాకుళం బయల్దేరి వెళ్లారు. వచ్చిన విఐపిలకు అతిథి మర్యాదలు చేయలేక అధికారులకు తలలు పట్టుకున్నారు. వచ్చిన వారంతా మూడో తేదీన తిరుగు ప్రయాణం అయ్యారు. వీరికి వీడ్కోలు పలికేంత వరకూ అధికారులకు ఊపిరిసలప లేదు. ఐదవ తేదీన డిజిపి దినేష్‌రెడ్డి నగరానికి చేరుకున్నారు. ఆయన మంగళవారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. సాయంత్రానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నగరానికి చేరుకున్నారు. వీరందరికి భద్రత కల్పించే విషయంలో ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసులు నానా యాతనా పడాల్సి వచ్చింది.
విశాఖ నగరానికి గత ఐదు రోజుల నుంచి విఐపిల రాక కొనసాగుతునే ఉంది
english title:
vip's rush
Date:
Wednesday, November 7, 2012