Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జిల్లాలో నేటి నుంచి షర్మిల పాదయాత్ర

$
0
0

కర్నూలు, నవంబర్ 7: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర గురువారం కర్నూలు జిల్లాలో ప్రవేశించనుంది. గత నెల 18న ఆమె కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి అనంతపురం జిల్లాలో యాత్ర ముగించుకొని కర్నూలు జిల్లాలో అడుగుపెట్టనున్నారు. అక్కడి నుంచి ఆమె సుమారు 190 కిలోమీటర్ల మేర నడిచి కర్నూలు నగర శివార్లలో ఉన్న తుంగభద్ర నది దాటి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించనున్నారు. ఆమె కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోతొలి అడుగు పెట్టి రాత్రికి మండల కేంద్రమైన మద్దికెరలో తొలి బహిరంగ సభలో మాట్లాడతారు. పాదయాత్ర ద్వారా జిల్లాలోకి ప్రవేశిస్తున్న ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. అంతేగాక ఆమె తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా స్వాగతం పలికి తొలిరోజు కొద్దిదూరం పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు. షర్మిల జిల్లాలో నిర్వహించనున్న పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లను పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపి భూమా నఒగిరెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డిలు పర్యవేక్షిస్తుండగా ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలకు ఇతర నియోజకవర్గాల ఇన్‌చార్జిలు సహకరిస్తున్నారు. ఆమె యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నారు.

రాష్ట్రానికి న్యాయం చేస్తా
కల్లూరు, నవంబర్ 7: తనపై ఎంతో నమ్మకం వుంచి కేంద్ర క్యాబినేట్‌లో కీలకమైన రైల్వేశాఖ సహాయ మంత్రి పదవిని ఇచ్చినందుకు ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులురాలు సోనియాగాంధి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రాంతీయ విభేదం లేకుండా ఆంధ్రరాష్టానికి న్యాయం చేస్తానని కేంద్ర రేల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం రైల్వే శాఖ సహాయ మంత్రిగా పదవి చేపట్టి మొదటి సారిగా కర్నూలుకు చేరిన ఆయనకు నగరంలో పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఉరేగింపు అనంతరం నగరంలోని కోట్ల సర్కిల్‌లో మాజీ దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. డిసిసి అధ్యక్షులు రఘురామిరెడ్డి అధ్యక్షతన కోట్ల సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయితీకి మారుపేరైన తన తండ్రి విజయభాస్కర్‌రెడ్డి ఆశీస్సులతో జిల్లా ప్రజల ప్రేమ అభిమానులతో కేంద్రంలో పదవి దక్కిందన్నారు. మంత్రి పదవితో మరింత బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు. మంచి తనానికి మారు పేరైన కోట్ల తనయుడుగా దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంటానన్నారు. కేంద్రంలో చేపట్టిన ఈ పదవితో ఆంధ్రప్రదేష్‌కు మంచి రోజులు వచ్చాయని ప్రస్తుతం 39 వేల కోట్ల రూపాయల పనులు రైల్వేలో జరుగుతున్నాయని, 10 వేల కోట్ల రూపాయాల పనులు పూర్తి అయ్యాయని, మిగిలిని 25 వేల కోట్ల రూపాయల పనులను పూర్తి చేస్తానని అందులో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తానని అన్నారు. రైల్వేశాఖతో పాటు రైతులకు అవసరమైన ఇరిగేషన్ పనులపై కూడా అధికారులపై వత్తిడి తెచ్చి ముందుగా కర్నాటక నుండి సీమ రైతులకు నీరు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాట్లు ఆయన తెలిపారు. పార్టీని నమ్ముకుంటే పదవులు వస్తాయని, అమ్ముకుంటే రాజకీయంగా ఆదోగతి దక్కుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నుండి బయటికి పోయిన వారికి భవిష్యత్ లేదని, వైయస్ రాజశేఖర్‌రెడ్డికూడా సోనియా మన్మోహన్ సింగ్‌తోనే రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. వైయస్ కుటుంబానికి మేలు చేసిన కాంగ్రెస్‌ను విమర్శించడం రాజకీయంగా తగదన్నారు. కర్నూలు రైల్వే స్టేషన్‌ను కోట్ల రైల్వేష్టేషన్‌గా మార్చడంతో ప్రతి స్టేషన్‌లో వృద్ధులైన ప్రయాణికులకు అవసరమైన ఎక్సీలేటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాట్లు ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఎస్టీలకు కేంద్రంలో మంత్రిపదవి ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెసేనని అన్నారు. ఈ సభలో రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు, శాసన మండలి చైర్మెన్ చక్రపాణియాదవ్, ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, మురళీకృష్ణ, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు లోక్‌నాథ్, కెడిసిసి చైర్మెన్ వెంకట్‌రెడ్డి, జెడిపి మాజీ చైర్మెన్ ఆకేపోగు వెంకటస్వామి, డిసిసి ఉపాధ్యక్షులు బుచ్చిబాబు, కాంగ్రెస్ నాయకులు, ఐఎన్‌టియుసి నాయకులు బివై రామలింగ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనోహర్‌రెడ్డి,టిజి భరత్ తదితరులు ప్రసంగించారు. ఇదే సభలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డిని పూల మాలలతో సన్మానించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్
నంద్యాల, నవంబర్ 7: త్వరలో మంత్రుల కమిటీ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించి చట్టబద్దత కల్పించి ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ ఆడిటోరియంలో ఆర్డీఓ శంకర్ అధ్యక్షతన ప్రభుత్వ 6వ విడత భూపంపిణీ జరిగింది. ముఖ్యఅథితిగా పాల్గొన్న మంత్రి ఏరాసు మాట్లాడుతూ రాబోవు అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని, వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లోనే సబ్ ఫ్లాన్ అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. దీంతో రాబోవు బడ్జెట్‌లోనే సబ్‌ఫ్లాన్ నిధులు ఎస్సీలకు సుమారు రూ.16వేల కోట్లు, సుమారు ఎస్టీలకు రూ.6వేల కోట్లు విడుదల అవుతాయని మంత్రి ఏరాసు వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ కమిటీ చారిత్రాత్మకమైందని, చట్టబద్దత కల్పించి ఎస్సీ, ఎస్టీల పేదరిక నిర్మూలనకు ఈ నిధులు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీలలో కూడా సబ్ ఫ్లాన్‌పై అవగాహన కల్పించి వారిలో చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 6విడతలుగా భూపంపిణీ చేసిందని,అనుభవం కలిగిన అర్హులందరికి సాగుభూమితో పాటు పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. జిల్లాలో ప్రభుత్వం 5 విడతలుగా సుమారు 16వేల మంది లబ్ధిదారులకు దాదాపు 30,600 ఎకరాల భూమి పంపిణీ చేసిందని, ప్రభుత్వ భూములు సాగుచేస్తూ అనుభవిస్తున్న నిరుపేదలకే భూమి పంపిణీ చేసి హక్కుదారులుగా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లో ఇందిరజలప్రభ ద్వారా అభివృద్ధి చేసి రైతులకు అండగా ఉంటుందని, సాగుభూమి పేదలకు పంపిణీ చేసి సమాజంలో గౌరవం కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. జిల్లాలో ప్రభుత్వ, అటవీ భూముల్లో ఇంకా అనేక మంది నిరుపేదలు సాగుచేస్తు అనుభవిస్తున్నారని, వారిని కూడా గుర్తించి, ఆ భూములకు పూర్తి స్థాయిలో సర్వే చేయించి అనుభవంలో ఉన్న వారికే భూమి హక్కు పట్టా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం నంద్యాల డివిజన్‌లోని 9 మండలాల 1043మంది అనుభవం కలిగి సాగుచేసుకుంటున్న లబ్ధిదారులకు 1734.11 హెక్టార్ల భూమిని మంత్రి ఏరాసు, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆర్డీఓ శంకర్ పంపిణీ చేశారు.

జిల్లాలో యాత్రల జోరు!

ఆదోని, నవంబర్ 7: ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల జోరు పెద్దఎత్తున సాగుతోంది. నేతలు ప్రజలను ఓదారుస్తూ ఫోజులిస్తున్నారు. పాదయాత్రలు చేస్తూ పంటలను చూస్తున్నారు. రైతన్నలను పరామర్శిస్తున్నారు. రోగాల బారిన పడిన ప్రజలను కళ్లారా చూస్తున్నారు. నాయకులు, కార్యకర్తల హోరుతో పాదయాత్రలు హోరెత్తిపోతున్నాయి. పాదయాత్రలు విజయవంతమైయ్యాయని, సభలు జయప్రదమైయ్యాయని నాయకులు సంబరాలు పడుతున్నారు. కానీ ప్రజల వ్యధలు మాత్రం తీరడం లేదు. కన్నీటి ధారాలు ఆగడం లేదు. ఆదోని డివిజన్‌లో ఎర్రనేల పంటలుమొత్తం దెబ్బతినిపోయి దిగుబడి తగ్గి కరవులో రైతన్నలు చిక్కిపోయారు. ఆదుకోనే ఆపన్నహస్తం ఎక్కడ కనిపించడం లేదు. ప్రతిపక్షపార్టీల నేతల పాదయాత్రలు ప్రజల సమస్యలు మాత్రం ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఆదోని డివిజన్‌లో 15రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు చిప్పగిరి మండలం కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించాడు. అక్కడి నుంచి ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం మండలాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న మహిళలను పలకరించాడు. రైతన్నలకు నేనున్నాని భరోసా ఇచ్చారు. రైతులకు రుణ మాఫీ చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించమని జిల్లాకలెక్టర్‌కు లేఖలు రాశారు. ప్రభుత్వంపైన ఒత్తిడి తెస్తానని ప్రజలను ఆదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా రైతన్నలను ఆదుకున్నది లేదు. ఇక గత సంవత్సరం పంటనష్టపరిహారం కోసమే రైతన్నలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో గత సంవత్సరం పంటల నష్టపరిహారం అందలేదు. ఈ సంవత్సరం మళ్లీ ఆదోని డివిజన్ రైతన్నలను కరవు కాటేసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంతలోనే వైఎస్సార్ పార్టీ నాయకురాలు జగన్ సోదరి షర్మిల పాదయాత్ర గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఆదోని డివిజన్‌లోని మద్దికెర మండలం నుంచి ప్రారంభమవుతుంది. షర్మిల యాత్ర కూడా మద్దికెర, తుగ్గలి, పెరవలి, రాతన, పత్తికొండ, చిన్నహూల్తి, దేవనబండ, నలకదొడ్డి, ఆస్పరి, శంకరబండ, చిగిళి, బినిగేరి, విరుపాపురం, ఆదోని, ఆరేకల్లు, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, నందవరం, నాగలదినె్న ప్రాంతాలగుండా కొనసాగి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు పాదయాత్రతో ప్రజలకు వచ్చిన లాభం లేకపోయిన తెలుగుదేశంపార్టీ ఉనికి మాత్రం ప్రజల్లో మన కలిగింది. ఇప్పుడు షర్మిల పాదయాత్ర కూడా చంద్రబాబునాయుడు చేసిన విధంగానే కొనసాగుతుంది. రైతులను పలకరించడం, వృద్ధులను కలవడం, ప్రభుత్వాన్ని, తెలుగుదేశాన్ని విమర్శించడం, జగన్నన్న అధికారంలోకి తెస్తే వైఎస్ రాజ్యం తెస్తామని చెప్పడం షర్మిల పాదయాత్రలో స్పష్టంగా కన్పిస్తోంది. ఎందరు పాదయాత్రలు చేసిన వారి పార్టీ ఉనికిమాత్రమే చాటుకున్నారేతప్పా ప్రజల సమస్యలు తీరడం లేదు. గతంలో కూడా జగన్ ఓదార్పుయాత్ర చేసి కాంగ్రెస్‌పార్టీపైన విమర్శలు గుప్పించారేతప్పా ప్రజల సమస్యలను మాత్రం పరిష్కారం కాలేదు. కాబట్టి పాదయాత్రల హోరుతో పార్టీల ఉనికిని చాటుకుంటున్నారేతప్పా ఆదోని డివిజన్‌లో సమస్యలు, ప్రజల వ్యధలు యధావిధిగానే ఉన్నాయి. కరవుకోరల్లో చిక్కి రైతన్నలు విలవిలలాడుతున్నారు. పాదయాత్రలతో ఆయాపార్టీల నేతలు చంకలు గుద్దుకుంటున్నారేతప్పా ప్రజలకు మాత్రం కష్టాలు యధావిధిగానే ఉన్నాయి. యాత్రలు జోరందుకున్న ప్రజల వ్యధలు మాత్రం యధాతథంగానే ఉన్నాయి.

అధికారుల అవినీతి, అక్రమాల వల్లే
అర్హులకు భూములు దక్కడంలేదు

నంద్యాల, నవంబర్ 7: జిల్లాలోని కొందరు రెవెన్యూ అధికారుల అవినీతి, అక్రమాల వల్లే ప్రభుత్వ భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్న నిజమైన అర్హులకు భూములు దక్కడంలేదని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక మున్సిపల్ ఆడిటోరియంలో ప్రభుత్వ 6వ విడత భూపంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడివేముల మండలం బిలకలగూడూరులోని ప్రభుత్వ సాగుభూమి పట్టాలలో జరిగిన అక్రమాలు ఒక నిదర్శనంగా వివరించారు. కొందరు విఆర్‌ఓలు, ఆర్‌ఐలు, తహశీల్దార్లు అవినీతికి పాల్పడుతూ అనుభవంలో ఉన్న వారికి కాకుండా డబ్బులిచ్చిన వారికే భూములు కట్టబెడుతున్నారని, ఈ పద్ధతి పోవాలని ఆయన కోరారు. గ్రామాల్లోని భూముల కన్నా రెవెన్యూ అధికారులు అక్రమ పద్ధతిలో పంపిణీ చేసిన భూములే అధికంగా రికార్డుల్లో ఉండడం విచిత్రంగా ఉందని, కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని తప్పుచేసే కిందిస్థాయి నుంచి పై స్థాయి రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకొని అర్హులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
ఆత్మకూరు రూరల్, నవంబర్ 7: ఆత్మకూరు పట్టణంలోని రహమత్ నగర్‌లో నివసిస్తున్న ఇనాయతుల్లా (42) అనే వ్యక్తి విద్యుదాఘాతానికి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల మేరకు బుధవారం ఉదయం విద్యుత్ నిలిచిపోయిన సమయంలో ఇంట్లో వున్న విద్యుత్ మోటర్‌ను మరమ్మతులు చేస్తుండగా అదే సమయంలో విద్యుత్ రావడంతో అతను విద్యుత్ షార్ట్ గురై మృతి చెందినట్లు వారు తెలిపారు.
ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ... ఒకరికి గాయాలు
గూడూరు, నవంబర్ 7: కె నాగులాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులాపురం సమీపంలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొని ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా వున్నాయి. కర్నూలు నుండి కొడుమూరు వైపు వస్తున్న ఆటో, బళ్ళారి నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఆర్‌టిసి బస్సు నాగులాపురం సమీపంలో ఢీ కొనడంతో ఆటో డ్రైవర్ హరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాలైన వారికి 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉలిందకొండ ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
యువతి ఆత్మహత్యాయత్నం
నంద్యాల టౌన్, నవంబర్ 7: స్థానిక మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూలసాగరంకు చెందిన యాసిన్ బుధవారం వాస్‌మాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కడుపునొప్పి భరించలేక ఈ సంఘటనకు పాల్పడగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామన్నారు.
రెండు మోటర్ సైకిళ్లు ఢీ.. వ్యక్తికి గాయాలు
సంజామల, నవంబర్ 7: సంజామల మండల పరిధిలో ముదిగేడు-కోవెలకుంట్ల మధ్యలో బుధవారం ఎదురెదురుగా మోటర్‌సైకిళ్లు ఢీకొనడంతో మోటర్‌సైకిల్‌పై వెళ్తున్న రామకృష్ణయ్యకు తీవ్రగాయలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
సిపిఐ నాయకుల అరెస్టు
పత్తికొండ, నవంబర్ 7: పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయంకు సంబంధించి భూఅక్రమణ కేసులో దేవాదాయ అధికారుల ఫిర్యాదు మేరకు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్యతోపాటు 20మంది సిపిఐ నాయకులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
మొక్కజొన్న పంట దగ్ధం
నందికొట్కూరు, నవంబర్ 7: మండల పరిధిలోని అల్లూరు గ్రామానికి చెందిన తలారి శివశంకరయ్య తన సొంత పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంట బుధవారం ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయ్యి కాలిపోయింది. పక్కనే పొలంలో కోత అయిన తర్వాత చెత్త చెదారానికి నిప్పు అంటించారు. నిప్పు గాలికి మొక్కజొన్న పంటలో పడి 6 ఎకరాల పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంట కాలి పోయింది. పంట సాగు కోసం లక్ష రూపాయలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టానని బాధితుడు వాపోయాయడు.
వ్యక్తి అరెస్టు
కర్నూలు, నవంబర్ 7: నగరంలోని గౌరి గోపాల్ ఆసుపత్రిలోని రెండు టివిలను దొగింలించిన రమేష్ అనే వ్యక్తిని బుధవారం నంద్యాల చెక్ పోస్టు దగ్గర మూడవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన రమేష్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే చోరిలకు పాల్పడుతున్నందున పనుల నుండి తొలగించారు. ఇతని నుండి రెండు టివీలు స్వాదీనం చేసుకోని అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హజరు పరిచారు.
7 తులాల బంగారం, 8 తులాల వెండి చోరీ
ఆదోనిటౌన్, నవంబర్ 7: పట్టణంలోని గౌళిపేటలోని రమేష్ ఇంట్లో చోరీ జరిగినట్లు వన్‌టౌన్ పోలీసులు బుధవారం పేర్కొన్నారు. ఇంట్లోని ఏడు తులాల బంగారం, 8తులాల వెండి, పట్టుచీరలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందిందన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీకాకుళం....

కాకిలెక్కలు
ఆంధ్రభూమి బ్యూఠో
శ్రీకాకుళం, నవంబర్ 7: మునుపెన్నడూ లేని విధంగా జిల్లాను నీలం తుఫాను అతలాకుతలం చేసి తుడిచిపెట్టుకుపోయింది. ఆరుగాలం శ్రమించే అన్నదాతలు పంట కోత దశకు వచ్చే సమయానికి నీటమునిగింది. అలాగే పత్తి, అరటి కూరగాయలు, వాణిజ్య పంటలు నాశనమయ్యాయి. వేలాది ఇళ్లు కూలిపోయి ఆ కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలు నీటమునిగి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైంది. పశువులు సైతం మృత్యువాతపడ్డాయి. అనేక చెరువులకు గండ్లు పడగా రోడ్లు, కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. ఇటువంటి నష్టాలను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి నివేదికలు రూపొందించాల్సి ఉండగా అవేవీ పట్టని చందంగా కాకిలెక్కలు సర్కార్‌కు సమర్పించడం గమనార్హం. జిల్లా అధికారుల బిగ్‌బాస్ వెల్లడించిన నష్టాలకు ప్రకృతి బీభత్సానికి నష్టపోయిన అంచనాలకు సుమారు 200 కోట్లు వ్యత్యాసం సుస్పష్టమవుతోంది. జిల్లాకు రెండువందల కోట్లు నష్టం వాటిల్లిందని కలెక్టర్ సౌరభ్‌గౌర్ వెల్లడిస్తుండగా 380 కోట్లవరకు నష్టం ఉంటుందని అధికారులు అంగీకరించడం గమనార్హం. అలాగే 67,365 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లిందని సంబంధిత శాఖాధికారులు నివేదికలు రూపొందించగా నాలుగు లక్షల ఎకరాల్లో 20 శాతానికి పైగా నష్టం వాటిల్లి దిగుబడిపై ప్రభావం చూపుతోందని పలువురు స్పష్టం చేస్తున్నారు. నీటిపారుదల శాఖకు 20 కోట్లు నష్టం వాటిల్లినట్లు నివేదికలు రూపొందించారు. అయితే నారాయణపురం కుడి, ఎడమ కాలువల డిస్ట్రిబ్యూటరీలకు 49 చోట్ల గండ్లు పడ్డాయి. చిన్ననీటి పారుదల పరిధిలో 409 స్లూయిజ్‌లు విరిగిపోయాయి. వీటి మరమ్మతులకు 13.66 కోట్లు తక్షణమే అవసరమని నివేదిక పంపించారు. వంశధార ప్రాజెక్టు పరిధిలో డిస్ట్రిబ్యూటరీలకు, కెనాల్‌గట్లకు అనేక చోట్ల గండ్లు ద్వారా 62 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఇక రహదారులు విషయానికి వస్తే 68.48 కోట్లు... జిల్లాలో పంచాయతీ రహదారుల, భవనాల శాఖ పరిధిలో 445.50 కిలోమీటర్ల మేర నీలం ప్రభావానికి నష్టపోయాయి. ఒక్క ఆర్‌అండ్‌బి పరిధిలో శాశ్వత పనులకు 54.43 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు గుర్తించారు. పంచాయతీ రహదారుల విషయానికి వస్తే టెక్కలి డివిజన్ పరిధిలో 184.20 కిలోమీటర్లు పాడయ్యాయి. శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 7.5 కిలోమీటర్లు, పాలకొండ డివిజన్ పరిధిలో 14.4 కిలోమీటర్ల మేర రహదారులు పాడయ్యాయి. తాత్కాలిక మరమ్మతులకు 3.22 కోట్లు, శాశ్వత మరమ్మతులకు 11.05 కోట్లు అవసరమని నివేదించారు. ఉద్యానవన పంటలకు 36.90 లక్షల నష్టం వాటిల్లినట్లు సంబంధిత అధికారులు ప్రాధమిక అంచనాలు రూపొందించారు. ఇది పెరిగే అవకాశం లేకపోలేదు. అలాగే 4,666 హెక్టార్లలో పత్తి, 860 ఎకరాల్లో మొక్కజొన్న, 90 హెక్టార్లలో చెరకు, 116 హెక్టార్లలో అపరాల పంటలు దెబ్బతిన్నట్టు నివేదికలు రూపొందించారు. అయితే వీటి విస్తీర్ణం మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఇదిలా ఉండగా భారీ వర్షాలకు 1375 పూరిళ్లు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 43 ఇళ్లు పూర్తిగా 475 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పాలకొండ డివిజన్ పరిధిలో 14 పూర్తిగాను, 375 పాక్షికంగాను దెబ్బతిన్నాయి. టెక్కలి డివిజన్‌లో 73 పూర్తిగాను, 392 పాక్షికంగా పూరిళ్లు నేలమట్టమయ్యాయి. ఇటువంటి వారికి పునరావాసం కల్పించడంలో జిల్లా యంత్రాంగం మొక్కుబడిగా పర్యటించి సరిపెట్టుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఆహార పదార్ధాలు, బియ్యం వంటి సామాగ్రి అందించే దాఖలాలు ఎక్కడా లేవు. తీర గ్రామాల్లో కూడా ఎటువంటి సహాయక చర్యలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా నివేదికలకు, నష్టం అంచనాలకు వ్యత్యాసం ఉండడంతో పరిహారం అర్హులకు అందదన్న సందేహాలు తొంగిచూస్తున్నాయి. కాకిలెక్కల నివేదికలకు చెక్ పెట్టి నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందేలా క్షేత్రస్థాయిలో అంచనాలు రూపొందించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఐదు రోజుల్లో నివేదికలు ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించడంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సర్వే నంబర్ వారీగా ఆసామీ ప్రాప్తికి జాబితాలు రూపొందించాలంటే సుమారు 20 రోజుల సమయం పడుతుంది. దీనికి భిన్నంగా ప్రాధమిక అంచనాలు రూపొందించాలని అధికారులు సూచించడం సరైనది కాదని సామాన్యులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరిహారం జాబితాలు ఎలా రూపొందించుకుంటారో వేచిచూడాల్సి ఉంది.

నివేదికలు స్పష్టంగా ఉండాలి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, నవంబర్ 7: ప్రకృతి కరాళ నృత్యానికి అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా నష్టాన్ని లెక్కించడంలో అధికారులు కాకిలెక్కలు చూపించవద్దంటూ కేంద్ర కమ్యూనికేషన్లు, ఐ.టి.శాఖ సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. నివేదికలలో పొరపాట్లు వల్ల రైతులు నష్టపోరాదని, రైతులు సంతోషించే విధంగా రూపొందించాలన్నారు. తుపాను వల్ల కురిసిన వర్షాలపై అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై అన్ని చర్యలుతీసుకోవడం పట్ల ఆమె అభినందించారు. రహదారులను, ప్రజాసవసరాలను తక్షణం పునరుద్ధరించుటకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర బృందం జిల్లాలో పర్యటించే విధంగా ప్రధాన మంత్రిని కలిసి కోరనున్నట్లు ఆమె చెప్పారు. మరణించినవారి కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని ఆదేశించారు. మంగళవారం ఎనిమిది మండలాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలు, రహదారులు, గండిపడిన చెరువులను పరిశీలించానని చెప్పారు. గత సంవత్సరాల పంటల నష్టబీమా ఇంత వరకు అందలేదని రైతులు తెలియజేసారని వాటిపై తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గార మండలం చల్లవాని బంద, సోంపేట మండలం బీల ప్రాంతం, కంచిలి మండలం గంగాసాగరం గండి వలన అనేక వందల ఎకరాలు నీట మునిగాయన్నారు. గంగాసాగరం పనులు 5.38 కోట్ల రూపాయలతో పూర్తిఅయ్యే పరిస్థితి లేదని దానిపై అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ నివేదికలు ఈ నెల 12వ తేదీ నాటికీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 13 నుంచి 15 వరకు పంట నష్టం వివరాలు గ్రామాల్లో తెలియజేయాలన్నారు. జిల్లాలో 31,877 హెక్టార్లలో పంట దెబ్బతిందని, ఐదు వేల హెక్టార్లలో పత్తి దెబ్బతిందని, చెరకు, జొన్న, అపరాలు కొంత మేర దెబ్బతిన్నాయని వివరించారు. పంట నష్టాలకు గురైన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. రైతులకు తక్కువ సమయంలో అందివచ్చే పంటల విత్తనాలు సరఫరా చేయాలన్నారు. పూర్తిగా ధ్వంసమైన గృహాలకు ఇందిరా అవాస్ యోజన గృహాలని, పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు మూడు వేల రూపాయలు వెంటనే అందించనున్నట్లు చెప్పారు. మృతి చెందిన నలుగురు కుటుంబాలకు నష్టపరిహారాన్ని వెంటనే అందిస్తామన్నారు. రహదారులు పురుద్ధరణ జరుగుతుందని, గండిపడిన చెరువు పనులు వెంటనే చేపట్టాలని ఆయన ఆదేశించారు. 12 పశువులు మృతి చెందాయని, కనుగులవానిపేట వద్ద ఒక పౌల్ట్రీ దెబ్బతిందని తెలిపారు. రహదారులు, భవనాలశాఖ కింద చేపట్టే రహదారుల తాతకలిక పునరుద్ధరణకు ఐదు కోట్ల రూపాయలు, శాశ్వత పునర్నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు అంచనా వేసారని తెలిపారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులు జాబితాలను అంచనాలతో సహా సమర్పించాలని ఆదేశించారు. వీటిని ప్రభుత్వ స్థాయిలో పెట్టి మంజూరుకు ప్రయత్నిస్తామన్నారు.
శాసనమండలి సభ్యులు పీరుకట్ల విశ్వప్రసాద్, ఎచ్చెర్ల శాసనసభ్యుడు మీసాల నీలకంఠంనాయుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, జిల్లా సహకార పరపతి సంఘం అధ్యక్షులు గొండు కృష్ణమూర్తి మాట్లాడారు. ఆమదాలవలస, బూర్జ, పొందూరు మండలాల్లో కరకట్టల నిర్మాణాన్ని చేపట్టాలని తద్వారా భవిష్యత్తులో వరద ముంపు నుండి ఉపశమనం కలగగలదని ఎమ్మెల్యే సత్యవతి సూచించారు. ఉద్యానవన పంటలు 540 హెక్టార్లలో దెబ్బతిన్నాయని, పంచాయితీరాజ్ రహదారుల తాత్కాలిక పనర్నిర్మాణానికి 9 కోట్ల రూపాయలు, శాశ్వత పునర్నిర్మాణానికి 60 కోట్ల రూపాయలు అవసరమని, వంశధార పరిధిలో 120 పనులు మరమ్మతుకు గురైనట్లు, నీటిపారుదలశాఖ కింద 184 పనులు మరమ్మతులకు గురైనట్లు ప్రాధమికంగా అధికారులు అంచనాలను తయారు చేసారు. ఈ సమావేశంలో పాలకొండ, టెక్కలి శాసనసభ్యులు నిమ్మక సుగ్రీవులు, కొర్ల భారతి, డిసిసిబి అధ్యక్షుడు ఎస్.వి.రమం, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజకుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషాఖాసీమ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పి.డి. పి.రజనీకాంతారావు, టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి వి.విశే్వశ్వరరావు, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎస్.మురళీకృష్ణారావు, రహదారులు, భవనాలశాఖ, పంచాయితీరాజ్, ట్రాన్స్‌కో, వంశధార పర్యవేక్షక ఇంజనీర్లు సి.హెచ్.సోమశేఖర్, బి.వి.ఎస్.చిరంజీవి, కె.శ్రీనివాస్, బి.రాంబాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.శారద, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

..........

నరేంద్రయాదవ్‌కే డిసిసి పగ్గాలు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, నవంబర్ 7: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నర్తు నరేంద్రయాదవ్‌ను నియమించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం అధికారికంగా నరేంద్ర నియామకం హైకమాండ్ ప్రకటించనుంది. ఎప్పటినుంచో ఈ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీకాకుళం ఎంపి కిల్లి కృపారాణికి ఇటీవల కేంద్ర మంత్రి ఛాన్స్ లభించింది. గత కొన్నాళ్లుగా డిసిసి అధ్యక్షురాలిగా కృపారాణి వ్యవహరిస్తున్నారు. ఎప్పటినుంచో ఎం.పిగా, డిసిసి అధ్యక్షురాలిగా జోడి పదవులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నానని, ఇంకెవరికైనా డిసిసి పగ్గాలు అప్పగించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు ద్వారా హైకమాండ్‌కు విన్నవించారు. అప్పటి నుంచి ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ సామాజికవర్గాల సమతుల్యత పాటించేలా డిసిసి అధ్యక్షున్ని నియమించాలని కసరత్తు చేస్తూ వచ్చారు. జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్తిబాబు పలు పర్యాయాలు దీనిపై చర్చించి యాదవ సామాజికవర్గానికి చెందిన నర్తు నరేంద్రయాదవ్‌కు అవకాశం కల్పించారు. నరేంద్రయాదవ్ సామాన్య కార్యకర్త నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. కవిటి మండలం ఈదుపురం గ్రామానికి చెందిన నరేంద్రయాదవ్ డిగ్రీ పూర్తిచేసి కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం బలోపేతానికి కృషి చేశారు. అదే గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. యువజన కాంగ్రెస్‌లో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పాదయాత్ర సాగించి హైకమాండ్ వద్ద శభాష్ అనిపించుకున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అనుచరునిగా జిల్లా కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు. ఈదుపురం నుంచి పిఎసిఎస్ డైరెక్టర్‌గా ఎన్నికై ఇచ్ఛాపురం పిఎసిఎస్ అధ్యక్షునిగా డిసిసిబి ఉపాధ్యక్షునిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నారు. ఇటువంటి అనుభవం ఉన్న నర్తునరేంద్రయాదవ్‌కు డిసిసి బాధ్యతలు అప్పగించడం ఆ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇంతవరకు ఎన్నడూ జిల్లా కాంగ్రెస్ పగ్గాలు యాదవ్‌సామాజిక వర్గానికి లభించిన దాఖలాలు లేవు.
పార్టీని విజయపథంలో నడిపిస్తా
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని నూతన డిసిసి అధ్యక్షులు నర్తు నరేంద్రయాదవ్ పేర్కొన్నారు. రానున్న 2014 ఎన్నికల్లో జిల్లాలో పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే తన లక్ష్యమన్నారు. గ్రామస్థాయి, మండల, బ్లాక్, జిల్లా స్థాయి కమిటీల నియామకాల్లో యువతకు మరింత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా శాయశక్తుల పార్టీని ముందుకు నడిపిస్తానని ఆంధ్రభూమితో స్పష్టం చేశారు.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి
* ప్రజలకు డిఎంఅండ్‌హెచ్‌ఒ సూచన
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 7: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వలన అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.శారద కోరారు. వర్షాల వలన నీరు కలుషితమవుతుందని, కాబట్టి ప్రజలందరూ కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. నీటి కాలుష్యంతో ముఖ్యంగా అతిసార వ్యాధి ప్రబలే అవకాశముందన్నారు. వేడివేడి పదార్ధాలను భుజించాలని, నిల్వ పదార్ధాలు తినరాదని అన్నారు. కుళ్లిపోయిన చేపలు, మాంసం వంటివి ఎట్టి పరిస్థితిల్లోను తినరాదని, ఆకుకూరలు, కాయగూరలు శుభ్రంచేసి తినాలని చెప్పారు. ఆహార పదార్ధాలపై ఈగలు వాలకుండా జాగ్రత్తలు పాటిస్తూ, నీటిలో క్లోరినేషన్ చేయించాలని తెలిపారు. ఎవరికైనా వాంతులు, విరోచనాలు సంభవిస్తే సమీపంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని కోరారు. ఇప్పటికే జిల్లాలోని 18 క్లస్టర్‌ల పరిధిలో టీంలు వేశామని, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య బృందాలు పనిచేస్తున్నాయన్నారు.

ఏజెన్సీలో మావోల అలజడి లేదు
పాలకొండ(టౌన్), నవంబర్ 7: జిల్లా వ్యాప్తంగా మావోయిస్టుల నుంచి ఎటువంటి అలజడులు లేవని జిల్లా ఎస్‌పి గోపాలరావు తెలిపారు. బుధవారం స్థానిక డి ఎస్‌పి కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేఖర్లతో మాట్లాడారు. ఏజెన్సీలో ఎటువంటి మావోయిస్టుల అలజడిలేదన్నారు. అయినా శాంతిభద్రతల పరిరక్షణకు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పశువుల అక్రమ రవాణాపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని దీనిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు డి ఎస్‌పి కార్యాలయంలో పలు కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా డి ఎస్‌పి శాంతౌ, పాలకొండ, కొత్తూరు సి ఐలు విజయానంద్, ఆదాం, పాలకొండ , వీరఘట్టం ఎస్ ఐలు శంకరరావు, కామేశ్వరరావు ఉన్నారు.

రైతులకు కేంద్రమంత్రి భరోసా
కంచిలి, నవంబర్ 7: జిల్లాలో నీలం తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను, ప్రజలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని కేంద్ర కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక సహాయ మంత్రి కిల్లి కృపారాణి హామీ ఇచ్చారు. బుధవారం మండలం జలంతరకోట వద్దనున్న గంగసాగరానికి పడిన గండిని పరిశీలించారు. ఈ సందర్భంగా మినీ రిజర్వాయర్ నిర్మాణానికి ఆరు కోట్ల రూపాయల నిధులు మైనర్ ఇరిగేషన్ ద్వారా మంజూరైనప్పటికీ పనులను అర్ధాంతరంగా నిలిపివేయడం వలనే ఈ నష్టం వాటిల్లిందని రైతులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గంగసాగరానికి సంబంధించి భూసేకరణ పూర్తిగా చేపట్టలేదని, గతంలో కూడా గండిపడి నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ఈ విషయమై దీపావళి పండగ అనంతరం రైతులు, సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు ప్రభుత్వపరంగా చేపడతామని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5,25,00 హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. జిల్లాలో 137 పూరిళ్లు వర్షానికి దెబ్బతిన్నాయని, వారందరికీ ఐఎవై

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర గురువారం
english title: 
sharmila

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>