పెనుమూరు, నవంబర్ 7: జీవ వైవిధ్యాన్ని రక్షించి భావితరాలకు అవగాహన కల్పించాలని మాజీ ఎంపి జ్ఞానేంద్రరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గుంటీశ్వరాలయం వద్ద జరిగిన జీవ వైవిధ్య సమావేశానికి ప్రత్యేక సభ్యుడుగా ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జీవవైవిధ్యాన్ని రక్షించి దేశ అభివృద్ధికి సహకరించాలని, సమాజంలో జీవవైవిధ్యంపై అవగాహన లేక అడవులు, వణ్యప్రాణులను చంపుకుతింటున్నారని వీటిపై భావితరాలకు ప్రత్యేక అవగాహన కల్పించాలన్నారు. ఏదేశంలో జీవవైవిధ్యం రక్షించబడుతుందో ఆదేశం అభివృద్ధి అవుతుందని పేర్కొన్నారు. అనంతరం గుంటిపల్లె పంచాయతీలోని జీవవైవిధ్య చైర్మన్ వెంకటేశ్వర్లు సమక్షంలో పలు అంశాలపై సమీక్షించారు. ఈకార్యక్రమంలో సపోర్ట్ కో-ఆర్డినేటర్ మురళి, గుంటిపల్లె గ్రామస్థులు రవీంద్ర, దామోదరం, చెంగయ్య, భువనేశ్వరి, చిరంజీవి, శాంతి, కత్తిరెడ్డిపల్లె చైర్మన్ మేగానాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆరవ విడత భూ పంపిణీకి సర్వం సిద్ధం
చిత్తూరు, నవంబర్ 7: జిల్లాలో ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్న ఆరవ విడత భూ పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని జాయింట్ కలెక్టర్ వి.వినయ్‌చంద్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరవ విడత భూ పంపిణీకి జిల్లా మంత్రి గల్లా అరుణకుమారి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. మొత్తం 10,339 ఎకరాల భూమిని 7,868మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందులో చిత్తూరు డివిజన్‌కు సంబంధించి 2,648ఎకరాల భూమిని 1,939 లబ్ధిదారులకు, తిరుపతి డివిజనల్‌లో 2,043ఎకరాల భూమిని 1,616మంది లబ్ధిదారులకు మదనపల్లె డివిజన్‌లో 5,649ఎకరాల భూమిని 4,313మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. వీరిలో 2,278 మంది ఎస్సీలు, 460మంది ఎస్టీలు, 3,228మంది బిసిలు, 1,601మంది ఓసిలు, 301మంది మైనార్టీలు ఉన్నారన్నారు. చిత్తూరు డివిజన్‌కు సంబంధించి 9వ తేది ఉదయం 10గంటలకు చిత్తూరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో, తిరుపతి డివిజన్‌కు సంబంధించి అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు శిల్పారామం(అర్బన్ హట్)లో, 10వ తేది మధ్యాహ్నం 3గంటలకు మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో భూ పంపిణీ జరుగుతుందన్నారు. భూ పంపిణీలో 7రకాల సర్టిపికెట్లు లబ్ధిదారులకు అందచేస్తామని, లబ్ధిదారులను భూపంపిణీ కార్యక్రమానికి చేర్చుటకు రవాణా సౌకర్యం తాగునీరు, భోజన సౌకర్యం సంబంధిత తహశీల్దార్‌ల ద్వారా జరిపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు హాజరు కావాల్సిందిగా కోరారు. అనంతరం మీ-సేవ గురించి ప్రస్తావిస్తూ జిల్లాలో ప్రస్తుతం 151మీ-సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని త్వరలో మరో 35నుండి 50కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గత ఏడాది నవంబర్ 4న ప్రారంభించిన మీ-సేవా కేంద్రాల వలన జిల్లాలో 7 లక్షల పై చిలుకు దరఖాస్తులు అందాయని తెలిపారు. అందులో ఎ కేటగిరి కింద 159076 దరఖాస్తులు, బి కేటగిరి కింద 499003 దరఖాస్తులను పరిష్కరించామన్నారు.
‘2014లో చంద్రబాబు సిఎం కావడం తథ్యం’
శాంతీపురం, నవంబర్ 7: ఎన్నిపార్టీలు ఏకమైనా తెలుగుదేశంపార్టీని ఏమి చేయలేరని, 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రికావడం తథ్యమని జిల్లా తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు అన్నారు. బుధవారం మండల కార్యాలయం ఎదురుగా ఉన్న వెంకటాద్రినాయుడు కాంప్లెక్స్‌లో నూతనంగా తెలుగుదేశంపార్టీ కార్యాలయాన్ని కుప్పం తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జి మునిరత్నం ప్రారంభించారు.
అనంతరం కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీకి శాంతీపురం గుండెకాయ లాంటిదని, దాన్ని రాబోయే ఎన్నికల్లో నిలుపుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రైతుల రుణాలు మాఫీ చేయాలని పేర్కొన్నారు. రెండు పార్టీలు ఏకమై చంద్రబాబును ఓడించవచ్చునని దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండామన్నారు. వైఎస్సార్‌సిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి లక్షల కొలది సొమ్ము దోచుకొని జైళులో ఉన్నారని పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీల కోసం పోరాడి జైలులో లేరన్నారు.
కాంగ్రెస్, వైఎస్సార్‌సిపిలు ఎప్పుడైనా ఏకమవుతాయని అలాంటిది తమ పార్టీపైన దుమ్మెత్తిపోయడం సమంజసం కాదని తెలిపారు. కుప్పం పిఇఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మునిరత్నం, మండల పార్టీ అధ్యక్షులు చలపతి, సింగల్‌విండో చైర్మన్ శ్యామరాజు, మాజీ ఎంపిపి వెంకటమునిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గాన్ని అంచలెంచలుగా అభివృద్ధి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల గురించి పట్టించుకొనే వారే కరవయ్యారని తెలిపారు. అభివృధ్ధి పూర్తిగా శూన్యమైందని ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడమే కిరణ్‌కుమార్‌రెడ్డికి సరిపోయిందని ఎద్దేవ చేశారు. ప్రజల సంక్షేమం కోసం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల ఉపాధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రంగస్వామినాయుడు, కుప్పం మాజీ సర్పంచ్ గోపీనాథ్, బల్లాద్రినాయుడు, మండల యువత అధ్యక్షులు ఉదయకుమార్, రాయల్‌నాగరాజు, గోపాల్, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో దృఢసంకల్పం ఉండాలి
వైజ్ఞానిక ప్రదర్శనలో ఎమ్మెల్సీ పిలుపు
మదనపల్లె, నవంబర్ 7: విద్యార్థుల్లో దృఢసంకల్పం ఉండాలని, వైజ్ఞానిక ప్రదర్శనలలో మంచి ప్రతిభ కనభర్చి రాష్టస్థ్రాయికి ఎంపిక కావాలని ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన ఎమ్మెల్సీ తిప్పారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పదును పెట్టి ఉత్తమ నమూనాలను గైడ్ టీచర్ల ఆధ్వర్యంలో తయారుచేసి ప్రదర్శించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో తోడ్పడుతాయని తెలిపారు. ప్రదర్శనలో ఉన్న నమూనాలను దైనందిత జీవితంలో కూడా వినియోగించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఇన్స్‌స్పైర్ అవార్డు కార్యక్రమం కంటే ఈ వైజ్ఞానిక సదస్సుకు మంచి స్పందన రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానానికి పెంపొందించుటకు ఈ ప్రదర్శనలు ఉపయోగపడుతాయని తెలిపారు. పర్యావరణ, వనరుల వినియోగంపై ఎక్కువ నమూనాలకు వచ్చినట్లు వారు తెలిపారు. మదనపల్లె డివైఇఓ శామ్యూల్ మాట్లాడుతూ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు సుమారు 800కు పైగా నమూనాలు వచ్చినట్లు తెలిపారు. జీవవైవిధ్యం, దేశ శాస్తస్రాంకేతిక రంగాలలో ముందంజ కలదని చిత్తూరు డివైఇఓ చిట్టిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తిప్పారెడ్డికి వైజ్ఞానికప్రదర్శన జ్ఞాపికను డిఇఓ అందజేశారు.
పార్టీలు ఫిరాయించే ఎమ్మెల్యేలపై
అనర్హత వేట వేయాలి: టిడిపి
యాదమరి, నవంబర్ 7: పార్టీలు పిరాయించే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి అటువంటి వాళ్లు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా ఎన్నికల కమీషన్ చట్టం రూపొందించాలని మాజీ టెలికాం సభ్యుడు, టిడిపి నేత వల్లేరు అమరనాధనాయుడు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ఐదు సంవత్సరాల పదవీకాలం ముగిసే వరకు ఆపార్టీలోనే కొనసాగాలని అలా కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా స్వార్థ పూరిత ప్రయోజనాలతో సంతలో పశువుల్లా అమ్ముడుపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు మధ్యలోనే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు పోతున్నారని దానివల్ల అభివృద్ధి పూర్తిగా కుంటుపడి పోడవమే కాకుండా మరలా ఎన్నికలు జరపవలసి రావడంతో కోట్ల రూపాయలు ప్రజాధనం వృథా అవుతుందన్నారు.
తిరుమలలో గణనీయంగా తగ్గిన రద్దీ
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 7: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. బుధవారం కేవలం 30 వేల మంది మాత్రమే తిరుమలకు వచ్చి ఉంటారని అంచనా. రద్దీ తగ్గడంతో సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలో ఉన్న భక్తులు గంటలో స్వామి దర్శనం చేసుకుని వెలుపలకు వస్తున్నారు. ఇక కాలిబాట భక్తులు కేవలం అర్ధ గంటలో స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. దీంతో స్వామి దర్శనం చేసుకున్నవారే తిరిగి తిరిగి దర్శించుకుంటున్నారు. బుధవారం తిరుమలలో చలిపులి వణికించింది. దీంతో భక్తుల రద్దీ తగ్గిందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. చలికి భక్తులు ఇబ్బంది పడకుండా భక్తులకు కావలసినన్ని గదులు అందుబాటులో ఉంచడంతో భక్తులు సంతోష పడ్డారు. చలికి స్వెట్టర్లు, టోపీలు, వేడివేడి తినుబండారాల వ్యాపారులకు మంచి గిరాకీ లభించింది.
వరుస చోరీలతో ప్రజలు బెంబేలు!
కుప్పం, నవంబర్ 7: మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పం పట్టణంలో రోజురోజుకు దొంగతనాలు పెరుగుతుండడంతో కుప్పం ప్రజలు బెంబేలెత్తుతున్నారు. శుభకార్యాలకు, దైవదర్శనానికి, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ప్రజలు జంకుతున్నారు. పోలీసులు నిఘా ఉందో లేదో తెలియదు గానీ యథేచ్ఛగా దొంగలు మాత్రం వారిపని వారు చేసుకెళ్తున్నారు. రెండు రోజులకు ఒక ద్విచక్రవాహనం, రెండు వారాలకు చిల్లరకొట్టుపై పడి వారి పని వారు సజావుగా చేసుకెళ్తున్నారు. కుప్పంలో అన్ని శాఖల అధికారులతోపాటు చివరకు ఎస్సై సైతం ఇన్‌చార్జిలుగా ఉండడంతో రెండు పోలీస్టేషన్‌ల పరిధిలో దొంగతనాలను అరికట్టేందుకు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. అలా కాకుండా కుప్పంకు ఇద్దరు ఎస్సైలను నియమించి తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రాత్రి వేళల్లో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేస్తే తప్ప దొంగతనాలు అరికట్టడం కావని ప్రజలు అంటున్నారు. అంతేకాకుండా కళాశాల వదిలే సమయాల్లో ప్రధాన కూడలిలో ఈవ్‌టీజింగ్ సైతం స్వైరవిహారం చేస్తోందని దీనిపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా పోలీస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఓబ్రాంది షాపు పక్కనున్న చిల్లర దుకాణంలో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. దీన్నిబట్టి చూస్తే దొంగలు ఎంత బరితెగించారో అర్థమవుతుంది. చిత్తూరులో కుప్పంకు చెందిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 17లక్షల రూపాయల బంగారు, వెండిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా విలేఖర్ల సమావేశంలో చెప్పిన రోజే కుప్పంలో దొంగలు మరో చోట చోరీకి పాల్పడ్డారంటే పోలీసు బందోబస్తు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కుప్పంలో దొంగతనాలను అరికట్టేందుకు గట్టి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఉద్యమాలపై ఉక్కుపాదం సహించం: సిపిఎం
తిరుపతి, నవంబర్ 7: ప్రజా సమస్యలపై ఉద్యమించే సిపిఎం నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తే చూస్తూ ఊరుకోబోమని సిపిఎం జిల్లా కార్యదర్శి కె కుమార్‌రెడ్డి హెచ్చరించారు.
గత 2000లో విద్యుత్ చార్జీల పెంపుపై బషీర్‌బాగ్‌లో చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్న వామపక్షాలు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, ఆయన సతీమణి పుణ్యవతిపై నేటి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం దారుణమంటూ ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక సుందరయ్యనగర్‌లో బుధవారం దగ్ధం చేశారు.
కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, జయచంద్ర, యాదగిరి, వాడ గంగరాజు, మోహన్‌రావు, గురుప్రసాద్, మల్లికార్జున, మహిళా నాయకులు సాయిలక్ష్మి, బుజ్జమ్మ, హైమావతి, సుజాత, లక్ష్మి, భరత్, దేవేంద్రలు పాల్గొన్నారు.
బాహుదా, బుగ్గ కాలువల ‘కబ్జా’!
మదనపల్లె, నవంబర్ 7: ఒకనాడు వరద నీటితో పరవళ్ళు తొక్కిన బాహుదా, బుగ్గకాలువ, కురవంకలు అక్రమార్కుల చేతిలో పడి కుంచించుకుపోయాయి. ఈ కాలువల్లో సుమారు వెయ్యికి పైగా అక్రమ కట్టడాలు వెలిశాయి. ఇంకా వెలుస్తూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యవైఖరి కారణంగా ఆక్రమణలు పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్నాయి. మదనపల్లె పట్టణం మీదుగా బాహుదా, బుగ్గకాలువ, కురవంక కాలువలు ప్రవహిస్తున్నాయి. కర్నాటకలో పుట్టిన బాహుదా జిల్లాలోని చిప్పిలి, మదనపల్లె మీదుగా నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టులోకి కలుస్తుంది. 1996లో వచ్చిన వరదలకు చుట్టుపక్కల చెరువులు తెగిపోవడంతో బాహుదా కాలువలో పూడిక