Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జిల్లా నుంచే యథేచ్ఛగా ఎర్రచందనం రవాణా

$
0
0

కడప, నవంబర్ 7 : ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎర్రచందనం సంపద ఎక్కువగా విదేశాలకు యథేచ్ఛగా తరలిపోతోంది జిల్లా నుంచే అని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లా ఎస్పీ కాంతిరానాటాటా దాడులు నిర్వహించి ఇరువురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. దీంతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే చిత్తూరు జిల్లా కె.వి.పల్లె మండలం గర్నిమిట్టకు చెందిన గజ్జెల శ్రీనివాసులరెడ్డి బుధవారం జిల్లాలోని రాయచోటి న్యాయస్థానంలో లొంగిపోయారు. కడప - కర్నూలు జిల్లా సమీపంలోని నంద్యాల, ఆళ్ళగడ్డకు అటవీ ప్రాంతాలతో పాటు జిల్లాకు చెందిన బద్వేలు, పోరుమామిళ్ళ, రాయచోటి, సానిపాయి, పాలకొండలతో పాటు శేషాచలం అడవుల్లో విస్తారంగా ఉన్న ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు యథేచ్ఛగా నరికి దేశ విదేశాలకు తరలిస్తున్నారు. ఈ దుంగలను ఎక్కువగా జిల్లాలో నుంచి రాయచోటి, చిత్తూరు జిల్లాకు చెందిన కెవి.పల్లె, కలకడ, ఎర్రావారిపాళెం మీదుగా చెన్నైకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసే బడా స్మగ్లర్లు ముస్త్ఫా అబ్దుల్ రెహమాన్, అబ్దుల్‌కలాం అలియాస్ అసద్ సోమవారం చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్మగ్లర్లు అధిక మొత్తంలో డబ్బులు లావాదేవీలు కొనసాగిస్తున్నారని కూడా బెంగళూరు కస్టమ్స్ అధికారులు నిర్ధారించారు. చెన్నై, వివిధ దేశాలకు చెందిన స్మగ్లర్లు జిల్లాలో మకాం వేసి వివిధ పార్టీ నేతల అండదండలతో ఎర్రచందనాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కడప పోలీసులు, అటవీశాఖ అధికారులు, ఎఆర్ పోలీసులు తరుచూ తనిఖీలు చేసి ఎర్రచందనాన్ని పట్టుకుంటున్నారు. అయితే ఆ స్మగ్లింగ్‌కు సంబంధిత అధికారులు బ్రేకులు వేయలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకపోతే చిత్తూరు ఎస్పీ కాంతిరానాటాటా మాత్రం జిల్లా వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్‌ను గుర్తించి దాడులు చేస్తున్నారు. ఆ దాడుల ఫలంగా కడప జిల్లా సానిపాయ రేంజ్‌లో పలు కేసుల్లో నిందితుడైన గజ్జెల శ్రీనివాసులరెడ్డి బుధవారం న్యాయస్థానంలో లొంగిపోయారు. దీంతో చిత్తూరు జిల్లాకు చెందిన మరికొంత మంది స్మగ్లర్లు న్యాయస్థానంలో లొంగిపోవడానికి సిద్ధవౌతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కడప, చిత్తూరు జిల్లాల్లో కాకుండా మిగిలిన జిల్లాల్లో 9500 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ ఉన్నతాధికారి ఎస్‌వి.కుమార్ వెల్లడించారు.

రాయచోటి కోర్టులో లొంగిపోయిన స్మగ్లర్
రాయచోటి(టౌన్), నవంబర్ 7 : సానిపాయి రేంజ్‌లో పలు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న చిత్తూరు జిల్లా కె.వి పల్లె మండలం గండిమిట్ట గ్రామానికి చెందిన గజ్జల శ్రీనివాసులరెడ్డి అలియాస్ శ్రీనురెడ్డి బుధవారం కోర్టులో లొంగిపోయాడు. విచారించిన రాయచోటి జ్యుడిషయల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ (ఇన్‌చార్జి) కె. రామకృష్ణ 15 రోజులు రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో శ్రీనివాసులరెడ్డిని రాయచోటి సబ్ జైలుకు తరలించారు. ఇతనిపై సానిపాయి రేంజ్ పరిధిలోని దినె్నల, జిల్లేళ్లమంద, ముడుంపాడు తదితర బీట్‌లలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడని ఏడు కేసులు ఉన్నట్లు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు.

‘ఇందిరమ్మ’ మాయ!
* గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి
* పొంతనలేని అధికారుల లెక్కలు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, నవంబర్ 7 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహాల నిర్మాణ పథకంలో సంబంధిత అధికారులు మాయజాలం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు 171 ప్రకారం అదనపు గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకం, రచ్చబండ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోటా కింద జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో 3,07,806 ఇళ్లు మంజూరయ్యాయి. సంబంధిత అధికారులు మాత్రం ఇప్పటికే 2,28,548 ఇళ్లు పూర్తి చేశామని చెప్పుకుంటున్నారు. అయితే ఇళ్ల నిర్మాణాల్లో చాలా అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అధికారులు, లబ్ధిదారులు కుమ్మక్కై గతంలో నిర్మించిన పాత ఇళ్లకు బిల్లులు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఏడాదిలో మంజూరైన ఇళ్లలో 79,258 నిర్మించాల్సి ఉందని, వాటికి చర్యలు చేపట్టినట్లు అధికారులు అంటున్నారు. చెప్పుకునేకి మాత్రం ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలోనే టాప్-10లో తమ జిల్లా ఉందని అధికారులు ప్రకటన చేసుకుంటూ ప్రభుత్వ మన్ననలు పొందుతున్నారు. 2011 రచ్చబండలో 1414407 శాశ్వత గృహాల కోసం దరఖాస్తులు రాగా 19032 లబ్ధిదారులు ఇళ్లు పొందినట్లు అధికారులు అంటున్నారు. అలాగే 14380 ఇళ్లు మంజూరు కాగా వారిలో ఇళ్ల నిర్మాణాలకు అనుభవం నిమిత్తం 3850 నివాస యోగ పత్రాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇళ్ల స్థలాలు లేని 1727 మందికి స్థలాలు ఇచ్చినట్లు అధికారులు అంటున్నారు. రచ్చబండ రెండవ విడతలో 65158 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే అధికారులు చెబుతున్న లెక్కలు, ఇప్పటి వరకు నిర్మించిన ఇళ్లకు, ఇప్పటి వరకు మంజూరు చేసిన ఇళ్లకు పొంతన కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల 51 మండలాలు, కడప నగర పాలికం, రాయచోటి, రాజంపేట, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల, యర్రగుంట్ల మున్సిపాలిటీల్లో సంబంధిత అధికారులు ఇళ్ల నిర్మాణాల కోసం, స్థలం లేని లబ్ధిదారుల కోసం స్థలం కేటాయింపులోనే అధికారులు ఘోరంగా విఫలం అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గొప్పలు చెప్పుకునే సంబంధిత అధికారులు ఇందిరమ్మ పథకం కింద అర్హులైన నిరుపేదలకు ఎన్ని ఇళ్లు నిర్మించారో, ఎన్ని ఇళ్లు నిర్మించాల్సి ఉందో, ఎన్ని ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయో తేల్చాల్చి ఉంది. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీని రంగంలోకి దింపి ఇళ్ల నిర్మాణాలకు అర్హులైన వారి అందరికి ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇరిగేషన్ శాఖలో దోపిడీ!
* ఒక పనికి పదిమందికి అంచనాలు
* ఇంజనీర్ల చేతివాటం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, నవంబర్ 7 : జిల్లాలో ఇరిగేషన్‌శాఖలో వివిధ పనుల నిర్మాణం నిమిత్తం ఎస్టిమెంట్ల పేరుతో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి ఇంజనీర్ వరకు లక్షలు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క పనికి పదిమందికి ఎస్టిమెంట్లు వేసి ఇంజనీర్లు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. ఒకపనికి అంచనాల్లో సంబంధిత అధికారులు తమ చాతుర్యం ప్రదర్శించి పర్సంటేజీలు ఇచ్చిన ఎంత మంది కాంట్రాక్టర్లకైనా ఆమోద ముద్ర వేసి రాజధానిలోని సంబంధిత శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు నివేదికలు పంపుతున్నట్లు సమాచారం. ఇంజనీర్ ఇన్ చీఫ్ పరిధి రూ.10 లక్షలు లోబడి ఉన్నందున జిల్లాలోని ఇరిగేషన్‌శాఖ పలువురు ఇంజనీర్లు ఒక్కొక్క పనికి ఎస్టిమేషన్ రూ. 9,99,000 లోపు ఎస్టిమెంట్లు వేసి రాజధానికి రిపోర్టులు పంపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దామాషాలో ఒక్కొక్క అంచనాకు మండల స్థాయి నుంచి జిల్లా స్థా యి వరకు కాంట్రాక్టర్ల నుంచి రూ.25వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. రాజధానికి చేరిన ఎస్టిమెంట్లల్లో రాజకీయ పలుకుబడి, అధిక మొత్తంలో ఇంజనీర్ చీఫ్ ఆఫీసులో చెల్లించి ఆ పనులను టెండర్లు పిలుపునకు అనుమతి తెచ్చుకుంటున్నట్లు సమాచారం. అదే పనికి రద్దు చేసుకున్న వారు మాత్రం తమ సొమ్మును చేజేతులారా పోగొట్టుకుంటున్నారు. ఈ విషయమై కాంట్రాక్టర్లు, సంబంధిత ఇంజనీర్లు కలసి ఇదే పనికి టెండర్లు వచ్చాయని, ఒక్కొక్క పనికి దాదాపు పది మందికి ఎస్టిమెంట్లు ఎందుకు వేశారని ప్రశ్నిస్తే చేతులెత్తేస్తున్నారు. అదేమిటని అడిగితే సదరు అధికారులు తాము సంబంధిత పని నిమిత్తం ఎస్టిమెంట్లు తయారు చేయించే వారిమే అని, పరపతి ఉన్న వారు మాత్రమే పనులు దక్కించుకుంటారని అధికారులు బుకాయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు పనులు మంజూరైనా వాటికి జిల్లా కేంద్రంలో ఇరిగేషన్‌శాఖ నిబంధనల మేరకు టెండర్లు పిలవడం, ఆ టెండర్లలో ఎస్టిమేషన్ అనుమతి పొందిన కాంట్రాక్టరు, టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లకు ముడుపులు ముట్టచెప్పి సదరు కాంట్రాక్ట్‌ను దక్కించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.10 లక్షలలోపు ఉన్న కాంట్రాక్టు పనికి చేజిక్కించుకోవడానికి రూ.లక్ష రూపాయల నుంచి ఒకటిన్నర లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలిసింది. ఆ పని పూర్తయ్యే లోపు సదరు కాంట్రాక్టర్‌కు మరో లక్ష రూపాయల భారం మోపక తప్పడం లేదని ఆయా కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎస్టిమేషన్లు తయారు చేసే ఇంజనీర్లు ఒక పనికి, ఒకరికే ఎస్టిమెంట్లు వేయించి టెండర్ ద్వారా న్యాయబద్ధంగా టెండరుదారునికి అప్పగించి ఆ పనుల్లో నాణ్యత ప్రమాణాలను మెరుగుపరిచినట్లేయితే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడవచ్చ. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ప్రభుత్వ భూములు అమ్మవద్దు
* కలెక్టర్ అనిల్‌కుమార్
ఖాజీపేట, నవంబర్ 7 : ప్రభుత్వం ఎంతో ఆశయంతో పంపిణీ చేసిన భూములను అమ్ముకోవద్దని కలెక్టర్ వి.అనిల్‌కుమార్ లబ్ధిదారులకు సూచించారు. గురువారం ఖాజీపేట మండలం కూనవారిపల్లె, పత్తూరు గ్రామ పొలాల్లోని ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం నుంచి భూములు పొందిన లబ్ధిదారులు బోర్లు పని చేయడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన డ్వామా పిడి యదుభూషణ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. కూనవారిపల్లె పంచాయతీలో 158.29 ఎకరాల భూమికి 99 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. 2008లో ఉపాధి హామీ పనుల కింద భూములు సాగులోకి తెచ్చి 13 బోర్లు వేయించారు. ఇందులో మూడు బోర్లు మాత్రం పని చేస్తున్నాయని, పది బోర్లు పనిచేయడం లేదన్నారు. ఇందుకోసం నాబార్డు, ఇసియస్ కింద 44 లక్షలు ఖర్చు చేశామని గుర్తు చేశారు. పత్తూరులో 71 ఎకరాల విస్తీర్ణాన్ని 33 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసి అక్కడ కూడా ఉపాధి హామీ ద్వారా సాగులోకి తెచ్చి ఆరు బోర్లు వేయగా మూడు బోర్లు పని చేస్తున్నాయని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ భూముల్లో పండ్ల తోటల సాగు ఉందని లబ్ధిదారులు కలెక్టర్ దృషికి తెచ్చారు. భూములు ఎర్రసాలు కలిగి ఉన్నాయని అధిక ధరలు పలుకుతున్నాయని దీంతో దళారుల మాటలు నమ్మి భూములను అమ్ముకోవద్దని అలా అమ్ముకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎపిడి సూర్యప్రకాష్, ఎపివో జయచంద్ర. ఎండివో సమత, తహశీల్దార్ మహబూబ్‌చాంద్, కార్యదర్శులు ప్రసాద్, జగదీష్, టెక్నికల్ అసిస్టెంట్ నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ సాంబశివారెడ్డి, ఎస్తెరు పాల్గొన్నారు.
మాతా, శిశు జనన మరణాల వివరాలు
నమోదు చేయాలి
* కలెక్టర్ అనిల్‌కుమార్
కడప (అర్బన్), నవంబర్ 7 : జిల్లాలో గర్భవతులు, శిశువుల జనన మరణాల వివరాలను ఖచ్ఛితంగా నమోదు చేయాలని కలెక్టర్ వి. అనిల్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మహిళా సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో సిడిపిఓలతో సమావేశమై మాతా శిశు మరణాల తగ్గింపు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా గర్భవతులు, శిశువుల జనన మరణాల నమోదు ఎలా చేస్తున్నారని కలెక్టర్ ఆరా తీశారు. తమ గ్రామాల నుండి బయట ప్రాంతాలకు వెళ్లిన గర్భవతులు ప్రసవాల వివరాలు నమోదు చేసుకుంటున్నామని, తమ గ్రామాలకు వచ్చిన గర్భవతులకు సేవలు చేస్తున్నామే, కానీ ప్రసవాల వివరాలు నమోదు చేయడం లేదని గ్రామీణ ప్రాంతాల సిడిపివోలు వివరించారు. కడప నగరంలో మాత్రం బయటకు వెళ్లిన గర్భవతులు, ప్రసవాల వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందుకు కలెక్టర్ స్పందించి వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం వల్ల అర్బన్‌లో శిశు మరణాల శాతం 12 ఉందన్నారు. ఇక మీదట వివరాల నమోదులో ప్రాముఖ్యతను పాటించాలన్నారు. సిద్దవటం ప్రాజెక్టులో 12, ప్రొద్దుటూరులో 9, పులివెందులలో 10, అర్బన్‌లో కట్టకింద హరిజనవాడ, నకాష్, చిన్నచౌకు, మృత్యుంజకుంట ప్రాంతాల్లో శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయని సిడిపివోలు వివరించారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ లీలావతి, సిడిపిఓలు విజయలక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
భూ పంపిణీ వివరాల పరిశీలన
సిద్దవటం, నవంబర్ 7 : మండలంలోని 6వ విడత భూ పంపిణీ కేటాయించిన భూములు లబ్ధిదారుల వివరాలను రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతిమీనా బుధవారం విచారణ చేపట్టారు. ఈ మేరకు వంతాటిపల్లెలో కేటాయించిన భూములను పరిశీలించారు. అనంతరం సంబంధిత లబ్ధిదారులను విచారణ చేసేందుకు జ్యోతి గ్రామంలోకి ఇంటింటికి వెళ్లి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చూర వెంకటలక్షుమ్మ, రాములమ్మ, లక్ష్మీదేవికి చెందిన ఇంటిపేరు ఒకే విధంగా ఉండడంతో సమగ్రంగా విచారించారు. అనంతరం మాచుపల్లె గ్రామంలో మల్లు గంగాదేవి, సరస్వతీ నివాస గృహలకు వెళ్లి వారి స్థితిగతులు తెలుసుకున్నారు. తర్వాత భాకరాపేట సమీపంలో మలినేనిపట్నం కాలనీ ఎదురుగా ఉన్న 1026/-4, 1000/-3.4 సర్వేనెంబరులోని భూములను పరిశీలించారు. భూములను జాఫర్‌సాబ్‌పల్లె,చెర్లోపల్లె,బంగాపల్లె గ్రామస్థులకు ఇండ్ల స్థలాలను మంజూరు చేయాలని కొందరు ఆమె దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ చిన్నయ్య, ఆర్‌ఐ అనురాద, ఎఆర్‌ఐ రమేష్, విఆర్వోలు ప్రసాదరావు, గంగయ్య, సత్యనారాయణస్వామి, సర్వేయర్ శేషంరాజు పాల్గొన్నారు.
చంద్రబాబుతోనే అభివృద్ధి
* మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య
రాజంపేట, నవంబర్ 7:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు అభివృద్ధికి పెద్దపీట వేసేవారని, బంధుప్రీతికి ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదని మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య అన్నారు. బుధవారం రాజంపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి నిలిచిపోయి రాష్ట్రం అధోగతిగా తయారైందని, భావితరాలకు ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో పూర్తిగా మృగ్యంగా మారాయని, రాష్ట్రం పురోగతిలో తిరిగి పయనించాలంటే చంద్రబాబు పాలన రావాల్సిన అవసరముందన్నారు. ఇప్పుడిప్పుడే అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబును పాలనను గుర్తిస్తున్నారన్నారు. ప్రపంచంలోనే మంచి పరిపాలనాదక్షుడిగా పేరుగడించిన చంద్రబాబులాంటి నేత పాలన రాష్ట్రానికి వస్తే తప్ప ఇక్కడి ప్రజల బాధలు తీరవన్నారు. తాజాగా నీ కోసం వస్తున్నా.. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారని, స్వయంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తెరిగి తదనుగుణంగా నిర్ణయాలు పార్టీ తీసుకుంటున్నదన్నారు. ఇందులో భాగంగానే రైతులు పడుతున్న కష్టాలకు ముగింపు పలుకుతూ వారి రుణాలు మాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఎవరూ రుణాలు కట్టవద్దని చంద్రబాబు రైతులకు చెపుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ పైనే మొదటి సంతకం చేస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని రైతులు గమనించాలన్నారు. అలాగే ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఏ పార్టీ ప్రకటించని విధంగా డిక్లరేషన్‌ను తెలుగుదేశం పార్టీ ప్రకటించిందని, బిసిల సంక్షేమంతో పాటు వంద అసెంబ్లీ సీట్లు ఇస్తామని కూడా తెలుగుదేశం పార్టీ డిక్లరేషన్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇకపోతే రాజంపేట నియోజకవర్గంలో త్వరలో పార్టీ నేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించి అన్ని వర్గాల ప్రజలను కలుసుకోనున్నట్టు బ్రహ్మయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ సి.సుధాకర్, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లునాయుడు, లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు టి.లక్ష్మీనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి ఇడమడకల కుమార్, పార్టీ నేతలు టి.సంజీవరావు, జనార్ధన్, శేఖర్, మదళ్లపల్లి సునీల్ పాల్గొన్నారు.

ప్రజలకు రక్షణ కల్పిస్తాం
* ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా
బ్రహ్మంగారిమఠం, నవంబర్ 7: కడప జిల్లాలో ప్రజలందరికి అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తూ ప్రజలకు పోలీసులు దగ్గరయ్యేలా కృషిచేస్తామని జిల్లా ఎస్పీ సిన్హా తెలిపారు. బుధవారం బిమఠం వచ్చిన ఆయన పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి అనుకున్న మేర రికార్డులను నింపడంలో విఫలం అయ్యారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 2011లో మరీ వెనుకబడి ఉన్నాయని ఆయన తెలిపారు. చాలామంది విధులు నిర్వహిస్తూ తమ బాధ్యతలను నేరవేరుస్తూ రికార్డులు ఎప్పటికప్పుడు పూర్తిచేస్తూ ఉంటారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రూప్రేయార్సి ఇవ్వాలని ప్రస్తుతం ఎస్‌ఐలందరు ప్రోహిబిషన్ పిరియడ్స్‌లో ఉన్నందున రికార్డులు నిదానంగా పూర్తి చేస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే ప్రజలకు అన్ని విధాలా పోలీసులు అందరు ప్రజలకు ఎటువంటి భ్రయబ్రాంతులు లేకుండా దగ్గర కావాలని ఆయన జిల్లాలో ఎర్రచందనం ఎల్లలు దాటిపోతుందని, దీనికి సంబంధించి తమిళనాడుకు చెందిన పనిలోకూలీలు ఈప్రాంతానికి తీసుకొచ్చి ఎర్రచందనం దుంగలు నరికించి ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ చేస్తున్నారని వీరందరికి సంబంధించిన ముఖ్యమైన ముఠానాయకులను అరెస్టు చేశామని చేస్తున్న విచారణలో పూర్తి వివరాలను సేకరించామని తెలిపారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎక్కువ నరికి అక్రమంగా సరఫరా చేస్తున్నారన్నారు. పోలీసులకు ఎర్రచందనం, ఇసుక మాఫియా, విత్తనాలపై పూర్తి హక్కులు లేవని వారిని అరెస్టు చేసి అటు అటవీశాఖ, ఇటుమైనింగ్‌శాఖ అప్పగించాల్సి ఉందని, ఆయన తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో క్రైమ్‌రేటు బాగా తగ్గిందని, దొంగతనాలను పోలీసులు బాగా మంచి వృద్ధినిసాధించారని ఆయన కితాబిచ్చారు. అలాగే ఇంకా క్రిమినల్ తదితరాల విషయాలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు డిఎస్పీ ప్రవీణ్‌కుమార్, బిమఠం ఎస్‌ఐ నాగార్జున, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

645 ఎకరాల్లో అరటితోటలు నష్టం
* సర్వే పూర్తి చేసిన అధికారులు
రైల్వేకోడూరు, నవంబర్ 7 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలో 645 ఎకరాలలో అరటితోటల నష్టం జరిగినట్లు ఉద్యానవన శాఖ అధికారి వంశీకృష్ణ తెలిపారు. మండలంలోని శెట్టిగుంట, ఉప్పరపల్లె, మాధవరంపోడు, వెంకటరెడ్డిపల్లె తదితర పంచాయతీలలోని గ్రామాలలో పండ్లతోటల సర్వే నిర్వహించి నష్టపరిహరం మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. ఎకరాకు రూ. 9 వేల వంతున ప్రభుత్వం రైతులకు నష్టపరిహరం ఇస్తుందన్నారు. 60 శాతం పంట దెబ్బతిన్న తోటలకు మాత్రమే ఈ ప్రతిపాదనలు పంపామన్నారు.

బావిలో పడి వ్యక్తి మృతి
లక్కిరెడ్డిపల్లె, నవంబర్ 7 : మండలంలోని కుర్నూతల పంచాయతీలోని ఎగువ వడ్డెపల్లెకు చెందిన పల్లపు సుబ్బయ్య (45) అనే వ్యక్తి బుధవారం బావిలో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ ఈరన్న తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెల్లితే ఎగువవడ్డెపల్లెకు చెందిన సుబ్బయ్య సోమవారం నుంచి కనపడకపోవడంతో గ్రామస్థులు వెళ్లి గాలించగా, బుధవారం బావిలో శవమై తేలి ఉండడంతో పోలీసులకు తెలిపారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
యువతి ఆత్మహత్య
ఖాజీపేట, నవంబర్ 7 : మండలంలోని త్రీపురవరం గ్రామానికి చెందిన శివపార్వతి అనే యువతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే త్రిపురవరం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు కుమార్తె శివపార్వతి తిరుపతి పట్టణంలో ఇంటర్మీడియట్ చదువుకుంటోంది. ఇటీవల దసరా సెలవులకు స్వగ్రామానికి వచ్చింది. ఈనెల 3వ తేదీ కడుపు నొప్పి తాళలేక ఇంట్లోని కిరోసిన్ పోసుకుని కాల్చుకుంది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఖాజీపేట పోలీసులు పాల్గొన్నారు.

తూస్మగొనావరి జిలాల.....

ముంపు బాధితులకు బాసటగా నిలుస్తాం
-కేంద్ర మంత్రి పళ్లంరాజు
పిఠాపురం, నవంబర్ 7: భారీ వర్షాల వల్ల ముంపునకు గురై నష్టపోయిన రైతాంగానికి బాసటగా నిలుస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు హామీయిచ్చారు. క్యాబినెట్ హోదాలో తొలిసారిగా బుధవారం మధ్యాహ్నం ఆయన పిఠాపురం ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురం మండలంలోని ఇల్లింద్రాడ ప్రాంతంలో ముంపునకు గురైన పంట పొలాలను, రోడ్లుపై పారుతున్న వరద నీటిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులందరికీ సాయం అందించేందుకు ప్రభుత్వం తరపున తాను రైతులకు బాసటగా ఉంటానని హమీ ఇచ్చారు. అయితే మంత్రి కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని మాత్రమే పరిశీలించారు. దీంతో తాము నష్టపోయిన ప్రాంతాలను సరిగా పరిశీలించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మంత్రి పళ్లంరాజుకు వినతిపత్రాన్ని అందించి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పళ్లంరాజు స్పందిస్తూ ఎమ్మెల్యేతో చర్చిస్తానని, అధికారులు నష్టం అంచనాలను వేసే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారని, వారి జాబితా ప్రకారం నష్టపోయిన రైతులందరికీ తప్పక న్యాయం చేసేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వంగా గీత తన నియోజకవర్గంలో ముంపునకు గురై నష్టపోయిన రైతుల గురించి మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, పిఠాపురం ఎఎంసి ఛైర్మన్ సంగిశెట్టి వెంకటేశ్వరరావు, బాలిపల్లి రాంబాబు, కొత్తెం దత్తుడు, ఆర్డీవో జవహార్‌లాల్‌నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

పూర్తిస్థాయిలో దాళ్వా
త్వరలో తుపాను గండ్లు పూడ్చివేత:ప్రాజెక్టు కమిటీ సభ్యుల సమావేశంలో ఎస్‌ఇ కాశీ
ధవళేశ్వరం, నవంబర్ 7: రబీ పంటకు పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఇ కాశీవిశే్వశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఛిద్రమైన ఇరిగేషన్ వ్యవస్థను పునరుద్ధరించడంతోబాటు రబీపంటకు నీటి విడుదలపై ప్రాజెక్టు కమిటీ సభ్యులతో స్థానిక సిఇఆర్‌పి అతిథిగృహంలో ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ రెడ్డి బ్రాహ్మణ చౌదరి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కమిటీ సభ్యులు మాట్లాడుతూ నీలం తుపాను ధాటికి జిల్లాలో ఇరిగేషన్ పరిధిలో అనేక చోట్ల గండ్లు పడ్డాయని, పంట ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.15 వేలు చొప్పున నష్ట పరిహారం అందించాలని కోరారు. గండ్లు పడిన చోట యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని తెలిపారు. గోదావరి నది ఆయకట్టు వెంబడి డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని, పంటలు నీట మునిగాయని తెలిపారు. షట్టర్, లాకులు వంటివి సమర్ధవంతంగా పనిచేయకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందంటూ అధికారులపై విరుచుకుపడ్డారు.
లస్కర్లు ధవళేశ్వరం లాకుల వద్ద పనిచేసేందుకు విముఖత చూపుతున్నారని, కిందిస్థాయి లాకుల వద్ద సిబ్బంది లేక షట్టర్లు పనిచేయడం లేదన్నారు. దీనిపై ఎస్‌ఇ కాశీవిశే్వశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 137 గండ్లుపడటం గుర్తించామని, గండ్లు పూడ్చివేత పనులు ప్రారంభించేందుకు రూ.5 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో ప్రణాళిక ప్రకారం పనులు చేపడతామన్నారు. ప్రస్తుతం 80 శాతం వరకు రబీ పంటకు నీరందిస్తామని, డిసిలు నీటి వినియోగంపై ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటే వంద శాతం నీరు ఇస్తామని ఎస్‌ఇ హామీ ఇచ్చారు.
సమావేశంలో రైతులు కోరిన నష్ట పరిహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఎస్‌ఇ తెలిపారు. సమావేశంలో హెడ్‌వర్క్స్ ఇఇ తిరుపతిరావు, ఈస్ట్రన్ ఇఇ కె రమణ, సెంట్రల్ ఇఇ రమణ, డిసిలు ప్రతినిధులు కొవ్వూరి త్రినాథరెడ్డి, సత్తి వెంకటరత్నం, కొవ్వూరి సుధాకర్‌రెడ్డి, చోడిశెట్టి బ్రహ్మానందం, రావు చిన్నారావు, వెంకటరమణ, రామకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

రంగుమారిన ధాన్యం కొనుగోలుకు
140 కేంద్రాలు
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, నవంబర్ 7: రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లాలో 140 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు బియ్యం, పంట నష్టపోయిన రైతులకు ప్రతీ ఎకరాకు నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకునేందుకు ప్రయత్నిస్తుందని హామీయిచ్చారు. కోనసీమలో బుధవారం పర్యటించిన ఇన్‌ఛార్జిమంత్రి ముంపు బాధితులను పరామర్శించారు. అమలాపురం డివిజన్‌లోని ముమ్మిడివరం, ఐ పోలవరం, అమలాపురం మండలాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి పినిపే విశ్వరూప్ అధ్యక్షతన జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో జరిగిన నష్టాలను, తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపైనా, ప్రజాప్రతినిధులపైనా ఉందని, మేమున్నామనే భరోసా ప్రజలకు కల్పించాలని సూచించారు. భారీ వర్షాలకు నీటి మునిగి పూర్తిగాను, పాక్షికంగాను దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందజేస్తారన్నారు. అలాగే నిరుపేద చేనేత కుటుంబాలకు, ఎస్సీ, ఎస్టీలకు కష్టకాలంలో బియ్యం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. భారీ వర్షాలకు ఏర్పడిన గండ్లను జిల్లా కలెక్టర్ మంజూరు ఉత్తర్వులతో తక్షణం పూడ్చాలని, డ్రెయిన్ ఆధునీకరణ పనులను ఇరిగేషన్ శాఖ మంత్రితో చర్చించి పూర్తిచేస్తామన్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రహదార్లకు ప్రతిపాదనలు పంపితే మంజూరు చేయించి రహదార్ల ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంట నస్టం జరిగిందని అంచనా వేశారని, నష్టపోయిన ప్రతీ రైతుకు ప్రతీ ఎకరాకు నష్టపరిహారం అందజేస్తామని మంత్రి తెలిపారు. అలాగే 4 వేల గృహాలు దెబ్బతిన్నాయని మంత్రి సబితా అన్నారు. అలాగే కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో తుఫాన్ కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లా అధికంగా నష్టపోయాయని, బాధిత కుటుంబాలకు, రైతులకు ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయ సహకారాలు సత్వరం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి అన్నారు. రైతులు నుండి కానీ, ప్రజల నుండి కానీ నష్టపరిహారం అందలేదనే మాట ఎక్కడా రాకూడదని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా నీరు సముద్రంలో కలిసే సమయంలో కోనసీమలో నీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తద్వారా ఎక్కువ కుటుంబాలు, రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని, ఇటువంటి ఆపద సమయంలో బాధిత కుటుంబాలన్నింటికీ బియ్యం తక్షణం అందించాల్సివుందన్నారు. అలాగే జిల్లాలోని కాలువలకు బ్రిడ్జిల సమీపంలో గుర్రపు డెక్క, చెత్త పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారుతుందని వీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ధవళేశ్వరం ఇరిగేషన్ డ్రెయిన్స్ ఎస్‌ఇ కాశీ విశే్వశ్వరరావును మంత్రి ఆదేశించారు. తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని, తీసుకోవాల్సిన చర్యలపై ఇన్‌ఛార్జి మంత్రి జిల్లా అధికారులతో సమీక్షించారు. అమలాపురం ఎంపి జివి హర్షకుమార్ మాట్లాడుతూ ప్రకృతి వెపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం నుండి నిర్ధిష్టమైన ఆదేశాలు ఉండాలని, అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సహాయం అందించాలని ఎంపి సూచించారు. తుఫాన్ తాకిడి ప్రాంతాల్లో తెల్లరేషన్ కార్డు హోల్డర్‌లను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ఆయన కోరారు. జల్ తుఫాన్ మొదలుకుని ఇప్పటి వరకు ఎన్ని డ్రెయిన్లకు సంబంధించిన పనులు చేసారని ఇరిగేషన్ ఎస్‌ఇ కాశీ విశే్వశ్వరరావును ప్రశ్నించారు. రహదారులు అభివృద్ధిపై ఇన్‌ఛార్జిమంత్రి ఆర్‌అండ్‌బి, పంచాయితీ రాజ్ ఎస్‌ఇలతో సమీక్షించారు. సామర్లకోట - ప్రత్తిపాడు రహదారికి 4 కోట్ల 50 లక్షలు రూపాయలు మంజూరుకాగా ఆర్ధికశాఖ మంజూరు వచ్చిన వెంటనే పనులు మొదలుపెడతామని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ బి శ్రీ్ధర్ ఇన్‌ఛార్జి మంత్రికి తెలియజేశారు. వ్యవసాయశాఖ డిడి ఎంవి రామారావు మాట్లాడుతూ జిల్లాలో ఒక లక్షా 79 వేల హెక్టార్లు వరి, 11 వేల హెక్టార్లు ప్రత్తికి తుఫాన్ కారణంగా నష్టం జరిగిందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ముమ్మిడివరం, రాజోలు,కొత్తపేట, గన్నవరం, రామచంద్రపురం, పెద్దాపురం ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌కుమార్, రాపాక వరప్రసాదరావు, బండారు సత్యానందరావు,పాముల రాజేశ్వరీదేవి, తోట త్రిమూర్తులు, పంతం గాంధీ మోహన్, ఎమ్మెల్సీలు నిమ్మకాయల చినరాజప్ప, చైతన్యరాజు, బి ఇందిర, జిల్లా కలెక్టర్ నీతుకుమారిప్రసాద్, జాయింట్ కలెక్టర్ బాబు ఎ, ఎస్‌పి త్రివిక్రమవర్మ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఐవి సత్యనారాయణ, ఆల్డా ఛైర్మన్ యాళ్ళ దొరబాబు, మాజీ జడ్‌పి ఛైర్మన్‌లు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దున్నా జనార్ధనరావు, కెవి సత్యనారాయణరెడ్డి, వంటెద్దు వెంకన్నాయుడు, నల్లా చిట్టిబాబు, వంటెద్దు బాబీ, సంసాని నాని, పి జగ్గప్పరాజు, తరెట్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఏలేరు ప్రాజెక్టుకు మోక్షం ఎప్పుడు!
కనీసం కరెంటుకూ దిక్కు లేదు.. నిధులున్నా ఆధునికీకరణ జరగదు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, నవంబర్ 7: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సుమారు 65వేల ఎకరాలకు సాగునీటిని అందించే ఏలేరు భారీ సాగునీటి ప్రాజెక్టుకు ఇప్పట్లో మోక్షం లభించేలా కనిపించటం లేదు. ప్రాజెక్టులోకి నీరు చేరకపోతే ఒక బాధ..్భరీగా నీరు చేరితే మరో బాధ అన్నట్టు ప్రాజెక్టు తీరు తయారయింది. సాధారణంగా ఈ ప్రాజెక్టుకు ఎప్పుడోగానీ పూర్తిస్థాయిలో నీరు చేరదు. ఒకవేళ ఎప్పుడయినా నీరు చేరితే మాత్రం ప్రాజెక్టు నుండి విడుదలయ్యే మిగులు జలాలు దిగువ ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణకు సుమారు రూ.132కోట్లను మంజూరుచేసారు. ఇది జరిగి చాలా ఏళ్లయినప్పటికీ, ఇంత వరకు ఆధునీకరణ పనులు మొదలుకాలేదు. ఇప్పటికే ఏలేరు ప్రాజెక్టుకు అనేక చోట్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒకపక్క ప్రాజెక్టుకే ముప్పు పొంచి ఉంటే, మరోపక్క మిగులు జలాలు విడుదలచేసినపుడల్లా పిఠాపురం, గొల్లప్రోలు, కిర్లంపూడి తదితర మండలాల్లోని పంట పొలాలు, గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. గరిష్ఠ నీటిమట్టానికి ఏలేరు జలాశయం చేరుకుని గడగడలాడిస్తున్న కీలకసమయంలో ఆదివారం రాత్రి కనీసం కరెంటు సరఫరా కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కూడా అవకాశం లేకపోవటంతో ప్రాజెక్టు వద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవటంతో ట్రాన్స్‌కో అధికారులు రాత్రికి రాత్రి యుద్దప్రాతిపదిక ప్రత్యేక లైన్‌ను ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కొండల మధ్య ఉన్న ఖాళీలను(గేప్స్) కలుపుతూ నిర్మించిన ఈ ప్రాజెక్టులో కొన్ని గేప్స్ వద్ద పూర్తిస్థాయి మరమ్మతులు కూడా జరగలేదు. పూర్తి నీటిమట్టానికి నీరు చేరినపుడు ఇలాంటి గేప్స్ భయపెడుతున్నాయి. డామ్ సేఫ్టీ కమిటీ ప్రాజెక్టు భద్రతకు ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నప్పటికీ, గేప్స్‌కు మరమ్మతులు చేయకపోవటంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏలేరు ప్రాజెక్టు నుండి మిగులు నీటి

* నిర్ధారించిన అధికారులు * కోర్టుల్లో లొంగిపోతున్న నిందితులు
english title: 
jilla

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>