Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ముంపు బాధితులకు బాసటగా నిలుస్తాం

$
0
0

పిఠాపురం, నవంబర్ 7: భారీ వర్షాల వల్ల ముంపునకు గురై నష్టపోయిన రైతాంగానికి బాసటగా నిలుస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు హామీయిచ్చారు. క్యాబినెట్ హోదాలో తొలిసారిగా బుధవారం మధ్యాహ్నం ఆయన పిఠాపురం ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురం మండలంలోని ఇల్లింద్రాడ ప్రాంతంలో ముంపునకు గురైన పంట పొలాలను, రోడ్లుపై పారుతున్న వరద నీటిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులందరికీ సాయం అందించేందుకు ప్రభుత్వం తరపున తాను రైతులకు బాసటగా ఉంటానని హమీ ఇచ్చారు. అయితే మంత్రి కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని మాత్రమే పరిశీలించారు. దీంతో తాము నష్టపోయిన ప్రాంతాలను సరిగా పరిశీలించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మంత్రి పళ్లంరాజుకు వినతిపత్రాన్ని అందించి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పళ్లంరాజు స్పందిస్తూ ఎమ్మెల్యేతో చర్చిస్తానని, అధికారులు నష్టం అంచనాలను వేసే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారని, వారి జాబితా ప్రకారం నష్టపోయిన రైతులందరికీ తప్పక న్యాయం చేసేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వంగా గీత తన నియోజకవర్గంలో ముంపునకు గురై నష్టపోయిన రైతుల గురించి మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, పిఠాపురం ఎఎంసి ఛైర్మన్ సంగిశెట్టి వెంకటేశ్వరరావు, బాలిపల్లి రాంబాబు, కొత్తెం దత్తుడు, ఆర్డీవో జవహార్‌లాల్‌నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

పూర్తిస్థాయిలో దాళ్వా
త్వరలో తుపాను గండ్లు పూడ్చివేత:ప్రాజెక్టు కమిటీ సభ్యుల సమావేశంలో ఎస్‌ఇ కాశీ
ధవళేశ్వరం, నవంబర్ 7: రబీ పంటకు పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఇ కాశీవిశే్వశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఛిద్రమైన ఇరిగేషన్ వ్యవస్థను పునరుద్ధరించడంతోబాటు రబీపంటకు నీటి విడుదలపై ప్రాజెక్టు కమిటీ సభ్యులతో స్థానిక సిఇఆర్‌పి అతిథిగృహంలో ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ రెడ్డి బ్రాహ్మణ చౌదరి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కమిటీ సభ్యులు మాట్లాడుతూ నీలం తుపాను ధాటికి జిల్లాలో ఇరిగేషన్ పరిధిలో అనేక చోట్ల గండ్లు పడ్డాయని, పంట ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.15 వేలు చొప్పున నష్ట పరిహారం అందించాలని కోరారు. గండ్లు పడిన చోట యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని తెలిపారు. గోదావరి నది ఆయకట్టు వెంబడి డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని, పంటలు నీట మునిగాయని తెలిపారు. షట్టర్, లాకులు వంటివి సమర్ధవంతంగా పనిచేయకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందంటూ అధికారులపై విరుచుకుపడ్డారు.
లస్కర్లు ధవళేశ్వరం లాకుల వద్ద పనిచేసేందుకు విముఖత చూపుతున్నారని, కిందిస్థాయి లాకుల వద్ద సిబ్బంది లేక షట్టర్లు పనిచేయడం లేదన్నారు. దీనిపై ఎస్‌ఇ కాశీవిశే్వశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 137 గండ్లుపడటం గుర్తించామని, గండ్లు పూడ్చివేత పనులు ప్రారంభించేందుకు రూ.5 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో ప్రణాళిక ప్రకారం పనులు చేపడతామన్నారు. ప్రస్తుతం 80 శాతం వరకు రబీ పంటకు నీరందిస్తామని, డిసిలు నీటి వినియోగంపై ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటే వంద శాతం నీరు ఇస్తామని ఎస్‌ఇ హామీ ఇచ్చారు.
సమావేశంలో రైతులు కోరిన నష్ట పరిహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఎస్‌ఇ తెలిపారు. సమావేశంలో హెడ్‌వర్క్స్ ఇఇ తిరుపతిరావు, ఈస్ట్రన్ ఇఇ కె రమణ, సెంట్రల్ ఇఇ రమణ, డిసిలు ప్రతినిధులు కొవ్వూరి త్రినాథరెడ్డి, సత్తి వెంకటరత్నం, కొవ్వూరి సుధాకర్‌రెడ్డి, చోడిశెట్టి బ్రహ్మానందం, రావు చిన్నారావు, వెంకటరమణ, రామకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

రంగుమారిన ధాన్యం కొనుగోలుకు
140 కేంద్రాలు
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, నవంబర్ 7: రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లాలో 140 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు బియ్యం, పంట నష్టపోయిన రైతులకు ప్రతీ ఎకరాకు నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకునేందుకు ప్రయత్నిస్తుందని హామీయిచ్చారు. కోనసీమలో బుధవారం పర్యటించిన ఇన్‌ఛార్జిమంత్రి ముంపు బాధితులను పరామర్శించారు. అమలాపురం డివిజన్‌లోని ముమ్మిడివరం, ఐ పోలవరం, అమలాపురం మండలాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి పినిపే విశ్వరూప్ అధ్యక్షతన జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో జరిగిన నష్టాలను, తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపైనా, ప్రజాప్రతినిధులపైనా ఉందని, మేమున్నామనే భరోసా ప్రజలకు కల్పించాలని సూచించారు. భారీ వర్షాలకు నీటి మునిగి పూర్తిగాను, పాక్షికంగాను దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందజేస్తారన్నారు. అలాగే నిరుపేద చేనేత కుటుంబాలకు, ఎస్సీ, ఎస్టీలకు కష్టకాలంలో బియ్యం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. భారీ వర్షాలకు ఏర్పడిన గండ్లను జిల్లా కలెక్టర్ మంజూరు ఉత్తర్వులతో తక్షణం పూడ్చాలని, డ్రెయిన్ ఆధునీకరణ పనులను ఇరిగేషన్ శాఖ మంత్రితో చర్చించి పూర్తిచేస్తామన్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రహదార్లకు ప్రతిపాదనలు పంపితే మంజూరు చేయించి రహదార్ల ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంట నస్టం జరిగిందని అంచనా వేశారని, నష్టపోయిన ప్రతీ రైతుకు ప్రతీ ఎకరాకు నష్టపరిహారం అందజేస్తామని మంత్రి తెలిపారు. అలాగే 4 వేల గృహాలు దెబ్బతిన్నాయని మంత్రి సబితా అన్నారు. అలాగే కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో తుఫాన్ కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లా అధికంగా నష్టపోయాయని, బాధిత కుటుంబాలకు, రైతులకు ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయ సహకారాలు సత్వరం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి అన్నారు. రైతులు నుండి కానీ, ప్రజల నుండి కానీ నష్టపరిహారం అందలేదనే మాట ఎక్కడా రాకూడదని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా నీరు సముద్రంలో కలిసే సమయంలో కోనసీమలో నీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తద్వారా ఎక్కువ కుటుంబాలు, రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని, ఇటువంటి ఆపద సమయంలో బాధిత కుటుంబాలన్నింటికీ బియ్యం తక్షణం అందించాల్సివుందన్నారు. అలాగే జిల్లాలోని కాలువలకు బ్రిడ్జిల సమీపంలో గుర్రపు డెక్క, చెత్త పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారుతుందని వీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ధవళేశ్వరం ఇరిగేషన్ డ్రెయిన్స్ ఎస్‌ఇ కాశీ విశే్వశ్వరరావును మంత్రి ఆదేశించారు. తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని, తీసుకోవాల్సిన చర్యలపై ఇన్‌ఛార్జి మంత్రి జిల్లా అధికారులతో సమీక్షించారు. అమలాపురం ఎంపి జివి హర్షకుమార్ మాట్లాడుతూ ప్రకృతి వెపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం నుండి నిర్ధిష్టమైన ఆదేశాలు ఉండాలని, అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సహాయం అందించాలని ఎంపి సూచించారు. తుఫాన్ తాకిడి ప్రాంతాల్లో తెల్లరేషన్ కార్డు హోల్డర్‌లను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ఆయన కోరారు. జల్ తుఫాన్ మొదలుకుని ఇప్పటి వరకు ఎన్ని డ్రెయిన్లకు సంబంధించిన పనులు చేసారని ఇరిగేషన్ ఎస్‌ఇ కాశీ విశే్వశ్వరరావును ప్రశ్నించారు. రహదారులు అభివృద్ధిపై ఇన్‌ఛార్జిమంత్రి ఆర్‌అండ్‌బి, పంచాయితీ రాజ్ ఎస్‌ఇలతో సమీక్షించారు. సామర్లకోట - ప్రత్తిపాడు రహదారికి 4 కోట్ల 50 లక్షలు రూపాయలు మంజూరుకాగా ఆర్ధికశాఖ మంజూరు వచ్చిన వెంటనే పనులు మొదలుపెడతామని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ బి శ్రీ్ధర్ ఇన్‌ఛార్జి మంత్రికి తెలియజేశారు. వ్యవసాయశాఖ డిడి ఎంవి రామారావు మాట్లాడుతూ జిల్లాలో ఒక లక్షా 79 వేల హెక్టార్లు వరి, 11 వేల హెక్టార్లు ప్రత్తికి తుఫాన్ కారణంగా నష్టం జరిగిందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ముమ్మిడివరం, రాజోలు,కొత్తపేట, గన్నవరం, రామచంద్రపురం, పెద్దాపురం ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌కుమార్, రాపాక వరప్రసాదరావు, బండారు సత్యానందరావు,పాముల రాజేశ్వరీదేవి, తోట త్రిమూర్తులు, పంతం గాంధీ మోహన్, ఎమ్మెల్సీలు నిమ్మకాయల చినరాజప్ప, చైతన్యరాజు, బి ఇందిర, జిల్లా కలెక్టర్ నీతుకుమారిప్రసాద్, జాయింట్ కలెక్టర్ బాబు ఎ, ఎస్‌పి త్రివిక్రమవర్మ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఐవి సత్యనారాయణ, ఆల్డా ఛైర్మన్ యాళ్ళ దొరబాబు, మాజీ జడ్‌పి ఛైర్మన్‌లు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దున్నా జనార్ధనరావు, కెవి సత్యనారాయణరెడ్డి, వంటెద్దు వెంకన్నాయుడు, నల్లా చిట్టిబాబు, వంటెద్దు బాబీ, సంసాని నాని, పి జగ్గప్పరాజు, తరెట్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఏలేరు ప్రాజెక్టుకు మోక్షం ఎప్పుడు!
కనీసం కరెంటుకూ దిక్కు లేదు.. నిధులున్నా ఆధునికీకరణ జరగదు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, నవంబర్ 7: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సుమారు 65వేల ఎకరాలకు సాగునీటిని అందించే ఏలేరు భారీ సాగునీటి ప్రాజెక్టుకు ఇప్పట్లో మోక్షం లభించేలా కనిపించటం లేదు. ప్రాజెక్టులోకి నీరు చేరకపోతే ఒక బాధ..్భరీగా నీరు చేరితే మరో బాధ అన్నట్టు ప్రాజెక్టు తీరు తయారయింది. సాధారణంగా ఈ ప్రాజెక్టుకు ఎప్పుడోగానీ పూర్తిస్థాయిలో నీరు చేరదు. ఒకవేళ ఎప్పుడయినా నీరు చేరితే మాత్రం ప్రాజెక్టు నుండి విడుదలయ్యే మిగులు జలాలు దిగువ ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణకు సుమారు రూ.132కోట్లను మంజూరుచేసారు. ఇది జరిగి చాలా ఏళ్లయినప్పటికీ, ఇంత వరకు ఆధునీకరణ పనులు మొదలుకాలేదు. ఇప్పటికే ఏలేరు ప్రాజెక్టుకు అనేక చోట్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒకపక్క ప్రాజెక్టుకే ముప్పు పొంచి ఉంటే, మరోపక్క మిగులు జలాలు విడుదలచేసినపుడల్లా పిఠాపురం, గొల్లప్రోలు, కిర్లంపూడి తదితర మండలాల్లోని పంట పొలాలు, గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. గరిష్ఠ నీటిమట్టానికి ఏలేరు జలాశయం చేరుకుని గడగడలాడిస్తున్న కీలకసమయంలో ఆదివారం రాత్రి కనీసం కరెంటు సరఫరా కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కూడా అవకాశం లేకపోవటంతో ప్రాజెక్టు వద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవటంతో ట్రాన్స్‌కో అధికారులు రాత్రికి రాత్రి యుద్దప్రాతిపదిక ప్రత్యేక లైన్‌ను ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కొండల మధ్య ఉన్న ఖాళీలను(గేప్స్) కలుపుతూ నిర్మించిన ఈ ప్రాజెక్టులో కొన్ని గేప్స్ వద్ద పూర్తిస్థాయి మరమ్మతులు కూడా జరగలేదు. పూర్తి నీటిమట్టానికి నీరు చేరినపుడు ఇలాంటి గేప్స్ భయపెడుతున్నాయి. డామ్ సేఫ్టీ కమిటీ ప్రాజెక్టు భద్రతకు ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నప్పటికీ, గేప్స్‌కు మరమ్మతులు చేయకపోవటంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

-కేంద్ర మంత్రి పళ్లంరాజు
english title: 
mumpu

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>