Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

$
0
0

మహబూబ్‌నగర్, నవంబర్ 12: ఈ ఖరీఫ్‌లో జిల్లాలోని రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు ఈనెల 15న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నాఫేడ్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా షాద్‌నగర్‌లో, నాఫేడ్ ద్వారా గద్వాల, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, బాదేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రెవెన్యూ మీటింగ్‌హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పొట్టిరకం పత్తి క్వింటాల్‌కు రూ. 3600, పొడుగు రకం పత్తికి రూ. 3900 మద్దతు ధర ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు తేమ అధికంగా ఉండకుండా మంచి నాణ్యత ప్రమాణాలతో పత్తిని పైన తెలిపిన కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొందాలని తెలిపారు. కాగా ఈ సంవత్సరం జిల్లాలో 1.90 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా 70544 మెట్రిక్ టన్నుల పత్తిని దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారని పేర్కొన్నారు. గత సంవత్సరం 96468 హెక్టార్లలో సాగు చేయగా 35963 మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి చేయడం జరిగిందని అన్నారు. పత్తిని అత్యధికంగా కొనుగోలు చేసే అమిత కాటన్ మిల్లు కూడా విద్యుత్ కోతల కారణంగా పత్తి కొనుగోలుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని, ఈ విషయం తెలుసుకోవడం జరిగిందని అన్నారు. అమిత్ కాటన్‌తో పాటు ఇతర జిన్నింగ్ మిల్లులకు ఎలాంటి విద్యుత్ కోత లేకుండా ఇవ్వాలని ఏపిసిపిడిసిఎల్ రాష్ట్ర అధికారులతో ఇప్పటికే మాట్లాడటం జరిగిందని అన్నారు. అంతేకాకుండా అమిత కాటన్ మిల్లు ఎండి అగర్వాల్‌తో కూడా మాట్లాడి కేంద్రాల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ పత్తిని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యుత్ సమస్య కూడా తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ ఏడి భాస్కరయ్య, పరిశ్రమల డిడి సూర్యప్రకాష్, సిసిఐ అధికారి శరత్, నాఫేడ్ అధికారి టిఎన్ శర్మ, మార్క్‌ఫేడ్ అధికారి ఆంజనేయులు, షాద్‌నగర్ ఎఎంసి కార్యదర్శి అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ
* గుంపుమేస్ర్తిలపై ఫిర్యాదు
* క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, నవంబర్ 12: ప్రజావాణిలో ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం రెవెన్యూ మీటింగ్‌హాల్‌లో జరిగిన ప్రజావాణికి ప్రజల వచ్చి కలెక్టర్‌ను కలిసి నేరుగా సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా బాదేపల్లి గ్రామం గౌరిశంకర్ కాలనీకి చెందిన వృద్ధురాలు శంకరమ్మ కలెక్టర్‌కు రోదిస్తూ ఫిర్యాదు అందజేసింది. తన కొడుకును ఉగాది కన్నా ముందు గుంపుమేస్ర్తి పనికి తీసుకెళ్లాడని కలెక్టర్‌కు తెలిపింది. ఇప్పటి వరకు తన కొడుకు ఆచూకీ తెలుపడం లేదని, తన కొడుకు వెంట పనికి వెళ్లిన వారు దసరాకు వచ్చారని, దీపావళి వచ్చినా తన కొడుకు దగ్గర తనను మాట్లాడించలేదని, అసలు కొడుకు ఉన్నాడో, లేదో తెలుపాలంటూ కలెక్టర్ గిరిజాశంకర్, ఇన్‌చార్జి జెసి భారతి లక్పతినాయక్‌ల ముందు శంకరమ్మ రోదిస్తూ తన గోడును చెప్పుకుంది. తన కొడుకు సాయిలును భూపతి, సుధాకర్, ఖాజాలు పనికి తీసుకెళ్లారని, రూ. 3వేలు అడ్వాన్స్ ఇచ్చారని తెలిపింది. పనికి వెళ్లిన వాడు ఇంటికి రాలేదని, కొడుకు విషయం అడిగితే నీ కొడుకు లేడని సమాధానం చెబుతున్నారంటూ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ అక్కడే ఉన్న కార్మికశాఖ అధికారులను పిలిపించి జిల్లాలో ఉన్నటువంటి గుంపుమేస్ర్తిల జాబితాను తనకు అందజేయాలని, సాయిలును పనికి తీసుకెళ్లిన వారిపై తక్షణమై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, గుంపుమేస్ర్తిలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా వివిధ ఫిర్యాదులను అందుకున్న కలెక్టర్ అనంతరం అధికారులతో సమీక్షించారు. ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యతను ఇచ్చి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. మండల స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ రాంకిషన్, డ్వామా, డిఆర్‌డిఎ పిడిలు గోపాల్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట సభతో ఉద్యమానికి మళ్లీ బీజం
* చంద్రబాబు, జగన్ కంటున్న కలలు నెరవేరవు
* తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇబ్రహీం
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, నవంబర్ 12: ఈనెల 23న నల్గొండ జిల్లా సూర్యాపేటలో తెరాస ఆధ్వర్యంలో జరిగే సభతో మళ్లీ తెలంగాణ ఉద్యమానికి బీజం వేయనున్నట్లు టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం వెల్లడించారు. సూర్యాపేట బహిరంగ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను సోమవారం మహబూబ్‌నగర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇబ్రహీం మాట్లాడుతూ సూర్యాపేట బహిరంగ సభ తెలంగాణలోని పది జిల్లాల ప్రజలను కదిలించనుందని, ఆ సభతో తెలంగాణ ఉద్యమంలోకి ఇతర పార్టీల నేతలు కూడా క్యూ కట్టనున్నారని వెల్లడించారు. అయితే ఎందరో నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరడానికి సుముఖంగా ఉన్నారని తెలిపారు. ఇక టిఆర్‌ఎస్‌లోకి వలసలు షురూ కానున్నాయని, దాంతో గ్రామగ్రామాన ఉద్యమం తారాస్థాయికి చేరుకోనుందని అన్నారు. కెసిఆర్ ప్రకటించిన కరీంనగర్ ఉద్యమ డిక్లరేషన్ లక్ష్యం కొనసాగనుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తెరాస ఆవిర్భావించిందని, రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తామని కెసిఆర్ కాంగ్రెస్ నాయకులకు చెప్పినప్పటికినీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అందుకే కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రాంతంలో నామరూపం లేకుండా చేయడమే ఏకైక ఎజెండాగా ముందుకువెళ్తూ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈనెల 23న జరిగే సూర్యాపేట బహిరంగ మహోద్యమానికి శ్రీకారం చుట్టడానికి సంకేతమన్నారు. పరిగిలో కూడా ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి తెరాసలో చేరుతున్నారని, ఆ బహిరంగ సభ కూడా సూపర్ సక్సెస్ కానుందని, చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా జనం ఆయనను విశ్వసించడం లేదన్నారు. బిజెపి మతతత్వాన్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తోందని, తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించకుండా కొంతమంది సమైక్యవాదులతో రాయభారాలు నడుపుతూ ఉద్యమానికి వెన్నుపోటు పొడుస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, వైకాపా, టిడిపిలకు కాలం చెల్లిందని, ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదని, తెలంగాణలో ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ అని ఆయన చెప్పారు. విలేఖరుల సమావేశంలో తెరాస నాయకులు మహిమూద్, రాజవరప్రసాద్, జంబులయ్య, నరసింహ, ఫసి, వినోద్, రాజు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్
సిపిఐ జిల్లా కార్యదర్శి నర్సింహ
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, నవంబర్ 12: తెలంగాణ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగించడం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈర్ల నర్సింహ తెలిపారు. సోమవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈర్ల నర్సింహ మాట్లాడుతూ డిసెంబర్ 9న తెలంగాణ వాగ్దాన భంగ దినంగా సిపిఐ భావిస్తుందని, కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్‌ను ఎండగట్టడం జరుగుతుందని, ప్రత్యేక తెలంగాణ కోసం సిపిఐ ప్రత్యక్ష పోరాటానికి సన్నద్దమైందని అన్నారు. ఒకపక్క తెలంగాణ ప్రజలు రాష్ట్ర ఆకాంక్ష కోసం పోరాడుతుంటే మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను తుంగలో తొక్కి విద్యుత్ బిల్లులను, సర్‌చార్జీల భారాన్ని ప్రజలపై మోపి రక్తం పీలుస్తోందని ఆరోపించారు. ఈనెల 15 నుండి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, విద్యుత్ చార్జీలు పెంచడానికి నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేస్తామని తెలిపారు. జిల్లాలో రైతులు వలసలు వెళ్తున్నారని, వలసలను నివారించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈర్ల నర్సింహ మండిపడ్డారు. విలేఖరుల సమావేశంలో నాయకులు ఆనంద్‌జీ, నర్సింహరెడ్డి, బాలనర్సింహ, చంద్రయ్య, నరేష్, యేశయ్య, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీపేట ఘటనపై ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆందోళన
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, నవంబర్ 12: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట గ్రామంలో దళితులను హత్య చేసి నెలలు గడుస్తున్నా వాటిపై సరైన విచారణ జరగడం లేదని, అదేవిధంగా లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం లక్ష్మీపేట దళిత పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ మున్సిపల్ టౌన్‌హాల్ నుండి భారీ ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి లక్ష్మీపేట ఘటనపై ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ అతిచిన్న విషయాలను సాకుగా చేసుకుని అగ్రకుల దౌర్జన్యకారులు దేశంలో దళితులపై హత్యాకాండను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లక్ష్మీపేట ఘటనపై అన్ని తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నారని ఆరోపించారు. దళితులపై దాడి చేసి హత్య చేసిన వారిని టిడిపి, కాంగ్రెస్, వైకాపా నాయకులు రక్షించే పనిలో పడ్డారని, వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం లక్ష్మీపేటలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని 250 ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులకు పంపిణీ చేయాలని, హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడానికి వెళ్లగా అక్కడ కలెక్టర్ లేకపోవడంతో కలెక్టరేట్ ముఖద్వారం ముందు వినతిపత్రం ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంచందర్, భూషణ్, లక్ష్మినారాయణ, చంద్రయ్య, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

స్వాలాభం కోసం పాకులాడుతూ టిడిపిపైన విమర్శలా?
కొడంగల్, నవంబర్ 12: పదవులను కాపాడుకుంటూ స్వాలాభం కోసం టిఆర్‌ఎస్, వైకాపాలు పాకులాడుతున్నాయని, టిడిపిపై విమర్శలను మానుకోవాలని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై టిడిపి ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పదేపదే అనడం సరైంది కాదన్నారు. అయితే టిఆర్‌ఎస్, వైకాపాలకు అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే వారికి మెజారిటీ ఉందని, అలాంటి పరిస్థితిలో వారు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై గవర్నర్‌కు లేఖ రాయాలని ఆయన సూచించారు. ఒకవేళ ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే ఎప్పుడు పెట్టాలో, ఎలా చేయాలో తమకు తెలుసనని ఆయన అన్నారు. కేవలం అక్రమార్జన కోసం పాకులాడుతున్నారని, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని జైలు నుంచి విడిపించడానికి వైకాపా నాయకులు భేరసారాలకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితిలో విమర్శలు చేసే ముందు ఆలోచించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి తనపై చేసే విమర్శలను మానుకుని గురునాథ్‌రెడ్డి ఏమి చేశారో వివరించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. 25 సంవత్సరాల పదవి కాలంలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ఆయన చూపించాలని, లేదా ఎన్నికైన నాటి మూడు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి తాను చూపిస్తానని సవాల్ విసిరారు. పార్టీని వీడేది లేదని, యువతకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని చెప్పడం, మరోపక్క షర్మిల పాదయాత్రకు మంచి స్పందన ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఏ పార్టీలో ఉంటారో, రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి వచ్చే నిధులకు అడ్డుతగిలి వెనక్కి పంపిస్తున్నారని అన్నారు. విలేఖరుల సమావేశంలో టిడిపి నాయకులు యూసుఫ్, మాజీ ఎంపిటిసి నందారం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాసుని అవతారమే కురుమూర్తి స్వామి
చిన్నచింతకుంట, నవంబర్ 12: తిరుమలలో వెలసిన శ్రీవెంకటేశ్వరుని ప్రతిరూపంగా లక్షలాదిభక్తులు కొలిచే శ్రీకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు నేటినుండి అంగరంగ వైభవంగా కానున్నాయి. అమ్మాపూర్ సమీంలోని 7కొండలపై కొలువైన స్వామివారి జాతర నెలరోజులపాటు కొనసాగుతుంది. తెలంగాణ జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలనుండి లక్షలాదిగా భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన దేవస్థాన జాబితాలో కురుమూర్తి ఆలయం అనతికాలంలోచేరింది. ప్రతియేడాది కార్తీక పౌర్ణమికి ముందుగా ఉత్సవాలను ఈ ప్రాంత వాసులు ఘనంగా జరుపుకుంటారు. 14న కళ్యాణోత్సవం, 18న అలంకారోత్సవం, 20న ఉద్దాలోత్సవం అని ఘనంగా జరుపుకుంటారు. మొప్పెర వంశీయులు చేయించిన ఆభరణాలతో కురుమూర్తి స్వామి వెంకటేశ్వరుని ప్రతిరూపంగా నిలువెల్ల సువర్ణ్భాషితుడై భక్త జనులకు దర్శనమిస్తారు. తదుపరిపల్లకి సేవ, చక్ర, పెనుమాళ్ల సేవలు నిర్వహిస్తారు. మయూర, హంస, ద్వజశేష, హయా, హనుమంత, గరుత్మ వాహనాలపై భక్తులకు దర్శనార్థం స్వామి పర్వతశ్రేణులు దిగివస్తాడని భక్తుల నమ్మకం. ఏడుకొండల మధ్య వెలసిన వెంకన్న ఆలయం వలే ఇక్కడ కూడా స్వామి ఏడుకొండల మధ్య కాంచన గుహలో కొలువై ఉన్నాడు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన గట్టమైన ఉద్దాలోత్సవం కార్యక్రమం 20న జరుగనుంది. వడ్డెమాన్‌లోని ఉద్దాల కార్మాగారంలో అమావాస్యనుండి వారం రోజులపాటు నియమ నిష్టలతో స్వామివారి పాదుకలు(ఉద్దాలు) తయారుచేసి ఉద్దాల ఉత్సవం రోజు అక్కడినుండి ఊరేగింపుగా కురుమూర్తి కొండకు చేరుస్తారు. స్వామివారి సన్నిధిలోపూజలఅనంతరం ఉద్దాల మండపంలో ఉంచుతారు. ఏడు పర్వతాల్లో దేవతాద్రి అనేకొండపైగల కాంచన గుహలోకురుమూర్తిస్వామి కొలువై ఉన్నాడు. దుర్గాద్రిపై లక్ష్మీదేవి, ఆంజనేయ, చెన్నకేశవుని ఆలయాలు ఉన్నాయి. ఇక్కడే ఉద్దాల మంటపం నెలకొంది. కాంచన గుహలోవెలసిన కురుమూర్తిస్వామిసాక్షాత్తు తిరుమల గిరులపై కొలువుదీరిన వెంకటేశ్వరుడు అనడానికి ఎన్నో చారిత్రక కథనాలు ఉన్నాయి. తిరుమల వలే ఇక్కడ కూడా తలనీలాలు సమర్పించి స్వామివారి పుస్కరిణిలోస్నానాలు అచరిస్తే చేసిన పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఉత్సవాలను హాజరైన భక్తులకోసం జిల్లా నలుమూలల నుండి బస్సు సౌకర్యం ఏర్పాటుచేస్తున్నారు. నీటి వసతిపై ప్రత్యేక దృశ్యం. స్వామికొలువైన ఏడు కొండలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. మొదటిరోజున యాగశాల మండపాల అలంకరణ, సాయంత్రం విశ్వకేశారాధన, ఏకాయనవేద, పుణ్యావచనం, ఋత్విగ్వరణం, ప్రతినరందనము, అకురారోపణం, ధ్వజపటాధివాసం తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అర్చకులు తెలిపారు.

పొలీసుల సమక్షంలో ధాన్యం టెండర్
కొత్తకోట, నవంబర్ 12: గత సంవత్సరం లక్ష్మివెంకటేశ్వర పార్బాల్డ్ మిల్లుకు చెందిన 3374క్వింటాళ్ల ధాన్యాన్ని టెండర్లకోసం ఆహ్వానించగా టెండర్లు దాఖలుచేసినవారు రిల్లుకావడంతో మూడు సార్లు జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం వాయిదావేశారు. సోమవారం మళ్లీ రీటెండర్ చేయగా గతంలోరూ. 340లు టెండరు ధర పలుకగా అట్టి టెండరుకు గాను అధిక మొత్తం ధర రావడం కోసం కలెక్టర్ రీటెండర్‌కు ఆహ్వానించారు. అందుకుగాను 20వేలు చెల్లించి టెండరులోపాల్గొనాలని శరతు విధించగా అందుకుగాను 28మంది టెండరులో పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు టెండరులో పాల్గొనేందుకు రాగా వారికి రక్షణ కల్పించేందుకు తహశీల్దార్ పోలీసులకు సమాచారం అందించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సైలు మహేశ్వర్‌రావు, శ్రీశైలం తమ సిబ్బందితో టెండరు వద్దకు చేరుకుని గస్తి నిర్వహించారు. వేముల శ్రీనివాస్‌రెడ్డి రూ.670లు వేలంపాట పాడి టెండరును దక్కించుకున్నారు. ఈటెండర్లలో తహశీల్దార్ ఖాజాకలీలుల్లా, డిప్టూటీ తహశీల్దార్ రామానందం, సూపరిండెంట్ నాగరాజు, ఆర్‌ఐ నరేందర్, విఆర్‌ఓ అమర్‌నాథ్ తదితరులు ఉన్నారు.

కలెక్టర్ గిరిజాశంకర్
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>