Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తప్పిన ప్రమాదం

$
0
0

పొందూరు, నవంబర్ 12: హౌరా నుండి చెన్నై వెళ్తున్న మెయిల్ (నెం.078438/సి)లో సోమవారం ఉద యం 11.30 గంటలకు జనరల్ బోగీలో ఆమదాలవలస మండలం దూసి రైల్వేస్టేషన్ దాటిన తరువాత మంటలు రేగి కలకలం సృష్టించాయి. పెద్దఎత్తున మంటలు రావడంతో జరుగబోయే భారీ ప్రమాదాన్ని అంచనా వేసిన ప్రయాణీకులు చైనులాగి బొడ్డేపల్లిపేట రైల్వేగేటు దాటిన తరువాత రైలును నిలిపివేసారు. అప్పటికే రేగిన మంటలకు వ్యాపించిన పొగలు అమావాస్య చీకటిని మరిపించాయి. దీంతో భయపడిన ప్రయాణీకులు భయంతో నెట్టుకుంటూ బయటకు పరుగులు తీశారు. ఇది గమనించిన సంబంధిత రైలుకు చెందిన ఎ.సి బోగీలో ఉన్న ప్రత్యేక సిబ్బంది అప్రమత్తమై రైలులో ఉన్న నీటితో మంటలను ఆర్పివేశారు. గార్డు పెట్టె నుండి మూడో బోగీ అయిన జనరల్ బోగీ నుండి ఈ మంటలు రేగాయి. బొడ్డేపల్లి వద్ద మంటలను అదుపుచేసిన మీదట మెయిల్ 12 గంటలకు స్థానిక రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే సమాచారం అందుకున్న పొందూరు అగ్నిమాపక సిబ్బంది తమ శకటంతోను, మండల పోలీసు సిబ్బందితో ఎ.ఎస్.ఐ ప్రకాశరావు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అందుబాటులో ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌ను ఆ బోగీలో స్ప్రే చేసి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుండి వచ్చిన ప్రత్యేక సిబ్బంది అవసరమైన మరమ్మతులు జరిపిన మీదట హౌరా-చెన్నై మెయిల్ ప్రయాణానికి మార్గం సుగమమైంది.

‘రైతులను ఆదుకుంటాం’
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, నవంబర్ 12: నీలం తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రోడ్లు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సోమవారం మండలంలో కిల్లిపాలెం జంక్షన్ నుండి ఇప్పిలి రోడ్డు గుండా నీటమునిగిన పంట పొలాలను పరిశీలించారు. అలాగే మదనాపురం, ముక్తంపాలెంకు సమీపంలో వరదనీరు పోయేందుకు రోడ్డుకు అడ్డంగా కొట్టిన కంతలను పరిశీలించారు. వరదనీరు పారేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. మదనాపురం కాలనీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, తామంతా షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారమని మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ పాతవాటిని తొలగించి కొత్త ఇళ్ల నిర్మాణం చేపడితే ఐఎవై కింద ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరగా రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. వర్షాలు వలన ఇళ్లు కో ల్పోయిన వారికి నష్టపరిహారం అందించారా, లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. 1990లో ఇదే తరహాలో వరద వచ్చిందని గ్రామస్థులు తెలియజేశారు. ప్రస్తుతం నీలం తుఫా న్ కారణంగా పూర్తిగా పంట నష్టపోయామని, తమను ఆదుకోవాలని రైతు లు విన్నవించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ అధ్యక్షులు గొండు కృష్ణమూర్తి, ఆర్‌డిఒ గణేష్‌కుమార్, వ్యవసా య శాఖ ఎ.డి రవికిరణ్, ఎంపిడిఒ ఆర్.వెంకట్రామన్, తహశీల్దార్ సి.హెచ్. సత్తిబాబు ఎ.ఒ ఉషాకుమారి, మాజీ ఎంపిపిలు చిట్టి జనార్ధనరావు, అంబటి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటిసి సభ్యురాలు మూకళ్ల సుగుణ, మూకళ్ల తాతబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ ఢిల్లీరావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఐటిడిఎ కార్యాలయం వద్ద గిరిజనుల ఆందోళన
సీతంపేట,నవంబర్ 12: ఇటీవల ఐటిడిఎ పరిధిలోని ఖాళీగా ఉన్న స్ట్ఫానర్స్ పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే.అయితే ఆ పోస్టుల భర్తీలో గిరిజన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, గిరిజన అభ్యర్థుల స్థానంలో ఆ పోస్టుల్లో గిరిజనేతరులతో భర్తీ చేసారని ఆరోపిస్తు గిరిజన ఐక్యవేదిక జిల్లా సమన్వయ కర్త వాబ యోగి ఆధ్వర్యంలో గిరిజన అభ్యర్థులు ఐటిడిఎ ఎదుట ధర్నా చేపట్టారు. సోమవారం ర్యాలీగా ఐటిడిఎ కార్యాలయానికి చేరుకొని గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తు కార్యాలయం ఎదుట బైఠాయించారు. వీరు ధర్నా చేస్తున్న సమయంలో గుర్తుతెలియని కొందరు ఆందోళన కారులు ఐటిడిఎ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎపి30ఎ నెంబర్ కల ఐటిడిఎ (జీప్)వాహనానికి పెట్రోల్ పోసి నిప్పుంటించారు. వాహనంలో ఒక్క సారిగా మంటలు రావడంతో సమీపంలో ఉన్న ఐటిడిఎ డ్రైవర్లు, సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేసారు. ఎప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో కొత్తూరు ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేసారు. ఆ వాహనం కూడ మార్గమద్యలో నిలిచిపోవడంతో పాలకొండ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఆ వాహనం వచ్చి పూర్తి స్థాయిలో మంటలను అదుపుచేసింది. జీపు టాప్‌తో పాటు సీట్లు, అన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటనపై ఇన్‌చార్జ్ ఐటిడిఎ మేనేజర్ సోమేశ్వరరావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ధర్నా చేస్తున్న వాబయోగితో పాటు నిమ్మకరాంబాబు, చలపతిరావు, సంజీవరావు, చాణక్య, అప్పన్న, శరత్‌కుమార్‌లను అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరితో పాటుగా ధర్నాలో పాల్గొన్న మరికొంత మంది విద్యార్ధినులను స్టేషన్‌కు తరలించి సాయంత్రం వీరిని విడిచిపెట్టారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డిఎస్‌పి:
ఆందోళన కారులు దాడిలో కాలి బూడిదైన ఐటిడిఎ (జీపు)వాహనాన్ని పాలకొండ డిఎస్‌పి దేవానంద్ శాంతో పరిశీలించారు. సోమవారం మధ్యాహ్నం సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. జీపు తగలబెట్టింది ధర్నాలో పాల్గొన్న వారై ఉంటారని, ఆ కోణంలో విచారణ చేపడతామని విలేఖరులకు తెలిపారు. దీనిలో భాగంగానే 7గురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. డిఎస్‌పితో పాటు సిఐ ఆదాం, సీతంపేట ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లక్ష్మణరావు ఉన్నారు.
అర్జీలతో వెల్లువెత్తిన ‘గ్రీవెన్స్’
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 12: ఇందిరమ్మ బిల్లులు ఇప్పించాలని జిల్లా గ్రీవెన్స్‌లో అర్జీలు వెల్లువెత్తాయి. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సౌరభ్‌గౌర్ గ్రీవెన్స్‌ను నిర్వహించారు. కిందటి గ్రీవెన్స్‌కు తుఫాను తోడుకావడంతో వెలవెలపోగా నేటి గ్రీవెన్స్‌లో అర్జీలు వెల్లువెత్తి కలెక్టర్‌ను ఊపిరాడకుండా చేసాయి. అయినప్పటికీ ఓపిగ్గా అర్జీలను స్వీకరిస్తూ, అవసరమైన వారికి సలహాలు, సూచనలు ఇస్తూ కలెక్టర్ అర్జీదారులను ఆకట్టుకోవడంతో వినతుల పరిష్కారం విషయం అటుంచితే జిల్లా గ్రీవెన్స్‌కు వచ్చినందుకు తగిన ఫలితం లభించిందంటూ హర్షం వ్యక్తం చేయడం కనిపించింది. పొందూరు మండలం మజ్జిలిపేట గ్రామానికి చెందిన యండ అమ్మాయమ్మ 2008లో ఇందిరమ్మ ఇల్లు మంజూరై నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంతవరకూ బిల్లు చెల్లించలేదని ఫిర్యాదు చేశారు. కాంటాక్టు ల్యాబ్ టెక్నీషియన్లు తమకు 15 నెలలుగా జీతాలు అందటం లేదని అర్జీ ఇచ్చారు. లావేరు మండలం గురుగుబిల్లి గ్రామంలో అనధికారికంగా వి ఆర్ ఏ పోస్టును కొనసాగిస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. కౌలు రైతులకు రుణాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమ కొనసాగింపునకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని పరిసర గ్రామస్థులు కోరారు. కార్యక్రమంలో ఏజెసి రాజ్‌కుమార్, డిఆర్‌డిఎ పిడి రజనీకాంతారావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పంట సర్వే చేస్తూ.. ప్రాణం వదిలిన సర్వేయర్
జలుమూరు, నవంబర్ 12: ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పం ట నష్టాలను అంచనా వేసేందుకు యధావిధిగా సోమవారం మండలం కరకవలస గ్రామానికి వెళ్లి సర్వేయర్ అల్లు జగదీశ్వరరావు(45) ఒక్కసారిగా పంటపొలంలోనే నేలకొరిగారు. వెం టనే ఆయనతో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి విజయబాబు అక్కడే ఉన్న విఆర్‌ఏల సహాయంతో ఆటోపై దగ్గరలో ఉన్న అచ్యుతాపురం పి.హెచ్.సి.కి తరలించారు. వైద్యురాలు వరుదు విజయలక్ష్మీ సర్వేయర్‌ని పరిశీలించి మృతిచెందారని నిర్ధారించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న మండల రెవెన్యూ సిబ్బంది జగదీశ్వరరావు స్వగ్రామం మాకివలసకు ఆయన మృతదేహాన్ని చేర్చారు. షుగర్ వ్యాధిగ్రస్తుడైన ఆయన ఉద్యోగానే్న నమ్మిన వ్యక్తి. కనుక ఆరోగ్యం బాగూలేదని తెలిసినా బాధ్యతను విస్మరించలేక నిరంతరం తన ద్విచక్రవాహనంపై విధులను నిర్వహించిన జగదీశ్వరరావు సోమవారం గ్రామ రెవెన్యూ అధికారి విజయబాబు ద్విచక్రవాహనంపై కరకవలస చేరుకున్నారు. అర్ధగంట కాలం రైతులందరితో మాట్లాడి నష్టపోయిన వారు తప్ప ఇతరులు తమతో రావద్దని అనడం అక్కడికి పది నిమిషాల్లో నడిచివెళ్తూ.. కుప్పకూలిపోవడంతో గ్రామస్థులు ఆర్తనాధాలు వినిపించారు.
ఉలిక్కిపడిన గ్రామాలు
మండల సర్వేయర్ జగదీశ్వరరావు మృతిచెందాడన్న వార్త విన్న జలుమూరు, తిమడాం, కొమనాపల్లి, శ్రీముఖలింగం, మాకివలస గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పది నిముషాల ముందు చూస్తుండగా వెళ్లాడని, ఎంతటి ఘోరమంటూ విచారం వ్యక్తపరిచారు. అదే విధంగా ఆయన మరణ వార్త విన్న గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.
కుటుంబ రోధన
భర్త రోజూలాగే విధులకు వెళ్లి మధ్యాహ్నానికి తిరిగి వస్తాడని ఎదురుచూసిన కుటుంబ సభ్యులు మృతదేహం చేరడంతో భార్య కల్యాణి, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ప్రసన్న, హిమబిందులు ఉన్నారు.
అంత్యక్రియల్లో అధికార యంత్రాంగం
స్వగ్రామం మాకివలసలో జరిగే జగదీశ్వరరావు అంత్యక్రియలకు ఎ.డి సర్వే కె.గోపాలరావు, డివిజనల్ ఇన్‌స్పెక్టర్ కె.రామారావు తహశీల్దార్ కాళీప్రసాద్, ఎంపిడిఒ ప్రభావతి పలు మండలాల సర్వేయర్లు, రెవెన్యూ ఉద్యోగులు, మాజీ సర్పంచ్లు, ఎంపిటిసిలు, బంధువులు పాల్గొన్నారు.

ఆనంద జ్యోతులతో దీపావళి
శ్రీకాకుళం(కల్చరల్), నవంబర్ 12: దీపావళి పర్వదినం అందరి జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించాలని, ఆధ్యాత్మికతను నింపాలని, అందరి హృదయాల్లో ఆనందం వెల్లువెరిసాలని ప్రతీ ఒక్కరి కోరిక. అందుకే కుల, మత, భాషలకు అతీతంగా వృత్తి, ప్రవృత్తులకు పక్కనపెట్టి ఇంటిల్లపాది పిల్లలు దీపావళిని జరుపుకోడానికి సిద్ధమవుతున్నారు. లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానం పలుకుతూ పూజలు చేసి మతాబులు, టపాసులు కాల్చేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు.
జిల్లా ప్రజలకు ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 12: రాష్ట్ర, జిల్లా ప్రజలకు ప్రజలు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
* ప్రతి ఇంటా దివ్వెలు వెలగాలి
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటా దివ్వెలు వెలుగులు నింపాలని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. అలాగే రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర వైద్య విద్య, 104, 108 సర్వీసుల శాఖా మంత్రి కోండ్రు మురళీ మోహన్ ఈ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్టస్థ్రాయి తైక్వాండోకు చల్లవానిపేట విద్యార్థులు
జలుమూరు, నవంబర్ 12: రాష్ట్ర స్థాయిలో జరిగే తైక్వాండో పోటీలకు మండలం చల్లవానిపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన కరుణాసాగర్, జి.శాంతి, బాలామణిలు ఎంపికయ్యారని హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రసాదరావు, వ్యాయామ ఉపాధ్యాయురాలు సునీత తెలిపారు. మండల స్థాయిలో ఎంపిక జరిగి ఈ నెల తొమ్మిదిన జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచి రాష్టస్థ్రాయికి ఎంపికయ్యారని వీరు స్పష్టం చేశారు. మారుమూల గ్రామమైన చల్లవానిపేట నుండి రాష్టస్థ్రాయికి ఎంపిక జరుగడం పలువురు ఆనందం వ్యక్తపరిచారు. రాష్టస్థ్రాయిలో కూడా విజేతలుగా నిలుస్తారని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఘర్షణపై డిఎస్‌పి విచారణ
పోలాకి, నవంబర్ 12: మండలంలో గంగివలస గ్రామంలో చోటుచేసుకున్న కొట్లాట ఘటనపై విచారణ జరిపేందుకు డిఎస్‌పి ఎల్.అర్జున్ ఆ గ్రామాన్ని సోమవారం సందర్శించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, సంబంధించిన వ్యక్తుల వివరాలపై ఆరాతీశారు. ఈ విచారణలో డిఎస్‌పితోపాటు స్థానిక సి.ఐ మూర్తి, ఎస్సై సత్యనారాయణలు ఉన్నారు.
గ్రామంలో కొనసాగుతున్న పికెటింగ్
ఈ కొట్లాట ఘటనపై మరే ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఘటనకు కారకులైన వారిపై దర్యాప్తు చేస్తున్నారు.
మున్సిపల్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
ఆమదాలవలస, నవంబర్ 12: జిల్లాలో సీతంపేటలో జరిగిన జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో స్థానిక మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభను కనబరిచినట్లు పాఠశాల హెచ్.ఎం టి.వి.రమణమ్మ తెలిపారు. విద్యాసాంకేతిక పరిజ్ఞానం, రవాణా సమాచార వ్యవస్థ అనే రెండు అంశాలపై తమ విద్యార్థులు పి.చంద్రశేఖర్, యమున, పి.నాగమణిలు తయారుచేసిన ప్రదర్శనకు అధికారులు మెచ్చుకుని ఈ పోటీల్లో మొదటి స్థానంగా గుర్తించారని చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బగాది తేజేశ్వరరావు, ఎ.వి.సుబ్బలక్ష్మీ, బి.సూర్యకుమారిలు విద్యార్థులను అభినందించారు.

తప్పిన ప్రమాదం
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>