Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

లారీ - ట్రాక్టర్ ఢీ

$
0
0

నల్లగొండ టౌన్, నవంబర్ 12: నల్లగొండ సమీపంలోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై చర్లపల్లి సాయిసదన్ వద్ద సోమవారం రాత్రి లారీ, ట్రాక్టర్ డీకొన్న సంఘటనలో 10మందికి గాయాలు కాగా, ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూరు మండలంలోని పేరన్‌దేవిగూడెంకు చెందిన కూలీలు నల్లగొండ మండలం బుద్దారం గ్రామానికి పత్తి చేలో పనికి వెళ్ళారు. ట్రాక్టర్‌లో తిరుగు ప్రయాణంలో చర్లపల్లి వద్దకు రాగానే తిప్పర్తి వైపునుండి చౌటుప్పల్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. గాయపడిన వారిని నల్లగొండ కేంద్ర ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన గాదరి మల్లమ్మ, రాములమ్మలను ప్రాథమిక చికిత్సనంతరం హైద్రాబాద్‌కు తరలించారు. లారీ డ్రైవర్ ఎండి. జాంగీర్‌కు రెండు విరిగినట్లు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ ఎస్‌ఎం భాషా తెలిపారు.

జిల్లా క్రీడాకారులకు బంగారు పతకాలు
కలెక్టర్ అభినందన
నల్లగొండ టౌన్, నవంబర్ 12: అండర్-19 స్కూల్ గేమ్స్ విభాగంలో ఈ నెల 9నుండి 11వరకు కర్నూల్‌లోజరిగిన రాష్టస్థ్రాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా క్రీడాకారులు బంగారు పతకాలను కైవసం చేసుకున్నట్లు జిల్లా అండర్-19 క్రీడల అధికారి, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల పిడిరవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ ముక్తేశ్వరరావు కలెక్టరేట్‌లో అథ్లెటిక్స్‌లో రాష్టస్థ్రాయిలో 5వేలు, 3వేలు, 15వందల మీటర్ల పరుగు పందాలలో జిల్లాలోని సూర్యాపేటలోని శ్రీనిధి జూనియర్ కళాశాల విద్యార్థిని వి.నవ్య మూడు బంగారు పథకాలు, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నకిరేకల్‌కు చెంది న బి.సైదులు 3వేల మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతాకం సాధించడంతో కలెక్టర్ అభినందించారు. అదే విధంగా కరీంనగర్‌లో జరిగిన తాంగ్ తా పోటీలలో నల్లగొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు చెందిన మని చంద్ర, కమల్ చంద్రలకు వరుసగా వెండి, కాంస్య పథకాలు సాధించడంతో అభినందించారు.

గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌కు వినతులు
నల్లగొండ టౌన్, నవంబర్ 12: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌డేలో జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావుకు వినతి పత్రాలు అందించారు. కలెక్టర్ కొన్నింటిని అక్కడే పరిష్కరించి మరికొన్నింటిని అక్కడే ఉన్న వివిధ శాఖల అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. నల్లగొండకు చెందిన ఓగ్గు కవిత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్ననాని భర్త మృతితో కుటుంబం గడపడం కష్టంగా ఉందని వితంతు పించన్ అందించాలని కోరారు. చిట్యాల మండలంలోని బోయదుబ్బకు చెందిన జి.రమణ వికలాంగుల వినతి పత్రం ఇప్పించాలని కోరారు. అనుముల మండలంలోని చిల్కపురంకు చెందిన అల్లాబి వృద్యాప పించన్ అందించాలని వినతి అందించారు. దామరచర్ల మండలంకు చెందిన సిరిపాల సైదులు తన పట్ట్భామిలో అక్రమంగా నిర్మించే శ్రీ లక్ష్మీ ఇండియన్ గ్యాస్ గోడౌన్ డిస్ట్రిబ్యూటర్ షిప్ రద్దుచేసి తన భూమిని ఇచ్చించాలని కోరారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా భర్తీ చేసిన సిఆర్‌పి, డిఎంటి పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని తెలుగు యువత జిల్లా కమిటీ అధ్యక్షుడు జక్కలి ఐల్లయ్య యాదవ్ కోరారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కార్యదర్శి పోతేపాక సాంబయ్యల ఆధ్వర్యంలో నీలం తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని వినతి పత్రం అందించారు. జిల్లా కేంద్రంలోని హైదర్‌ఖాన్‌గూడలో అసంపూర్తిగా వదిలేసిన సిసి రోడ్లను పూర్తిచేయాలని, డ్రైనేజీ, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి వినతిపత్రం అందించారు. అదనపు జెసి నీలకంఠం, కోనేరు రంగారావు కమిటీ ప్రత్యేక కలెక్టర్ ప్రసాద్‌రావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

వామ్మో..! సర్‌చార్జీతో విద్యుత్ బిల్లులు
వినియోగదారుల గగ్గోలు
మిర్యాలగూడ టౌన్, నవంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌కు విధించిన సర్‌చార్జీ అనంతరం బిల్లులు ఒకొక్కటి వినియోగదారుల చేతికి వస్తుండటంతో వామ్మో అంటు గగ్గోలు పడ్తున్నారు. ఏప్రిల్ 2010 నుండి యూనిట్‌కు సర్‌చార్జీ సుమారు 52 పైసలు వసూలు చేయగా, గత ఏప్రిల్ 2011 నుండి సర్‌చార్జీని ఈ ఏడాది సుమారు రూపాయి 32 పైసులు వసూలు చేస్తున్నారు. 50 యూనిట్ల వినియోగించే వినియోగదారుడికి మినహాయింపు ఉండగా, 100 యూనిట్లు వాడే వారికి సర్‌చార్జీ రూపాయి 32 పైసలు యూనిట్‌కు విధిస్తుండటంతో అక్టోబర్‌లో సుమారు రూ.70 వచ్చిన వారికి నవంబర్‌లో చేసిన బిల్లులో 300 రూపాయలు వచ్చినట్టు కోల సాయి అనే వినియోగదారుడు తెలిపాడు. అదే విధంగా అక్టోబర్ బిల్లు రూ.1090 రాగా, నవంబర్‌లో తీసుకున్న రీడింగ్‌తో బిల్లు రూ.1444 వచ్చినట్టు మరో వినియోగదారుడు వాపోయారు. అక్టోబర్‌లో రూ.150 బిల్లు రాగా, నవంబర్‌లో రూ.337 వచ్చినట్టు మరో వినియోగదారుడు వాపోయారు. ఇక వాణిజ్య సంస్థల బిల్లులు చెప్పనక్కరలేదని అంటున్నారు. సగానికి సగంవరకు పెరిగాయని వ్యాపారస్తులు వాపోతున్నారు. సర్‌చార్జీల బకాయిలంటూ వసూలుచేసే విధానాన్ని రద్దుచేయాలని వినియోగదారులు కోరుతున్నారు. 4 నుండి 6 గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నా కూడా బిల్లులు మాత్రం ఎక్కువగా వస్తున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

ఉద్యమిస్తేనే ప్రజలు ఆదరిస్తారు
ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు
మర్రిగూడ, నవంబర్ 12: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమించే నాయకులనే ప్రజలు ఆదరిస్తారని మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ఐక్య వేదిక కావలని సూచించారు. మొదటి నుండి సిపిఐ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాటాలు చేస్తుందన్నారు. మండలంలో పత్తి కొనుగోలు కోసం సిసిఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నీలం తుఫాన్ కారణంగా నష్టపోయిన పత్తి, వరి రైతులను ప్రభుత్వం ఎకరాకు 25వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి బుర్ర అంజయ్య, అనుబంధ సంఘాల నాయకులు చెల్లం పాండురంగారావు, బూడిద సురేష్, విష్ణు, సిద్దగోని మహేష్, బొడ్డు సాయి తదితరులు పాల్గొన్నారు.

సమరభేరికి తెలంగాణ వాదులు దండులా కదలాలి
* సమైక్యవాధి పార్టీలను భూస్తాపితం చేయాలి
* టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా
నల్లగొండ టౌన్, నవంబర్ 12: ప్రత్యేక రాష్ట్ర సాధనకై ఈ నెల 23న జిల్లా లోని సూర్యాపేటలో టి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘తెలంగాణ సమరబేరి’కి తెలంగాణ వాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, విద్యార్థిలు దండులా కదలిరావాలని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమరభేరికి 2లక్షల మందిని తరలించి విజయవంతం చేయడానికి జిల్లాలోని 12నియోజకవర్గాలకు అధినేత కెసిఆర్ పార్టీ ఎమ్మెల్యేల బృందాన్ని నియమించారని వెల్లడించారు. సమైక్య వాదంతో ముందుకు వస్తున్న పార్టీలకు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పి భూస్థాపితం చేస్తారన్నారు. సమైఖ్యవాదంతో ముందుకు వచ్చిన వైఎస్‌ఆర్‌సిపిలోకి తెలంగాణ వాదులు చేరడం బాధకరమన్నారు. వైఎస్‌ఆర్‌లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డికి, సంకినేని వెంకటేశ్వరరావులకు రాబోయే కాలంలో ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. టిడిపి తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి వైఖరితోనే ఆ పార్టీ సీనియర్ నేతలు ఇతర పార్టీలలోకి పరుగుతు తీస్తున్నారని ఆరోపించారు. టిడిపిని ఏ విధంగా బహిష్కరించారో అదే తరహాలో వైఎస్‌ఆర్‌సిపిని కూడా ప్రజలు విస్మరిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి, టిడిపి ఎమ్మెల్యేలు ఉమామాధవరెడ్డి, వేనేపల్లి చందర్‌రావులు ఆయా పార్టీలను వీడే అవకాశం ఉందని ప్రచారం సాగుతుందని వారు తెలంగాణ వాదంతో పోరాడే పార్టీలలోనే చేరితే ప్రజలు ఆదరిస్తారని కోరారు. ఉద్యమాన్ని బలోపేతం చేస్తూనే మరోవైపు రాజకీయంగా టి ఆర్ ఎస్ ముందుకు సాగుతూ 2014 ఎన్నికలలో 100అసెంబ్లీ, 16పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో టి ఆర్ ఎస్ అధికార ప్రతినిధి బక్క పిచ్చయ్య, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు రేకల భద్రాద్రి, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు మాలె శరణ్యరెడ్డి, జిల్లా నాయకులు గుంటోజు వెంకటాచారి, అభిమన్యు శ్రీనివాస్, చాడ కిషన్‌రెడ్డి, కృష్ణ, విద్యార్థి నాయకులు బొమరబోయిన నాగార్జున, కట్ట శ్రీను, చల్ల కోటేష్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు వైభవాన్ని ప్రజలకు చాటిచెప్పాలి
* జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు
నల్లగొండ టౌన్, నవంబర్ 12: తెలుగు వైభవాన్ని, తెలుగు వారి చైతన్యాన్ని దశ దిశలో ప్రజలకు చాటిచెప్పాల్సిన అవసరం ఎంతైన్నా ఉందని జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు కోరారు. సోమవారం పట్టణంలోని డైట్ కేంద్రంలో డిసెంబర్ 27నుండి తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహసభల సందర్భంగా తెలుగు భాషా పండితులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక కళా వైభవాన్ని చాట్టి చెప్పె బృహతర కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో వారం రోజుల పాటు నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ క్రీడలు, కళాజానం చేతి వృత్తులు, అమ్మమ్మ, నాన్నమ్మ నుండి కథలు, పాటలు సేకరించడంతోపాటు ప్రతి విద్యార్థి కనీసం పది పద్యాలు నేర్చుకుని పాడగలిగేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. తెలుగు వారిగా పుట్టింనందుకు తెలుగు భాషలో మాట్లాడుతున్నందుకు ప్రతి విద్యార్థి గర్వ పడేలా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో క్విజ్, వకృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించడంతోపాటు కవులు కళాకారులను సన్మానించాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి నీలకంఠం, డిఇవో ఆచార్య జగదీష్, డిప్యూటి డిఇవో పి.రమేష్, ఎడి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సాగర్ నీటి కోసం ఎదురుచూపులు!
* నీటి విడుదలపై ఎటూ తేల్చని ప్రభుత్వం
* రబీ సీజన్‌తో రైతుల్లో ఆందోళన
మిర్యాలగూడ, నవంబర్ 12: నాగార్జునసాగర్ ఆయకట్టు మొదటిజోన్‌కు సాగు నీటి విడుదలపై రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు జిల్లా ప్రజాప్రతినిధులు ప్రక టించారు. అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నుండి నీటి విడు దలపై ఇప్పటివరకు ఏలాంటి ప్రకటన లేకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన కలుగుతోంది. రబీసీజన్ ముంచుకొస్తుండడంతో మొదటిజోన్‌కు నీటి విడుదల జరుగు తుందా.. జరగదాఅన్న అయోమయంలో రైతులు కొట్టుమిట్టా డుతున్నారు. గత ఏడాది రబీలో నీటి విడుదల జరగలేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సైతం సాగునీటి విడుదల జరగకపోవడంతో ఆయకట్టులో వరుసగా 3వ పంట నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఉన్న నీటితో మొదటిజోన్‌లోని ఆయకట్టుకు సాగునీటి విడుదల సాధ్యాసాధ్యాలపై సాగర్‌ప్రాజెక్టు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యమంత్రికి ఇప్పటికే ఎన్ని టిఎంసీల నీరు అందుబాటులోఉందో అధికారులు తెలియచేశారు. అయినప్ప టికి భారీనీటి పారుదలశాఖ మంత్రితో ప్రకటన చేయిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నప్పటికి నీటి విడుదలపై ఏలాంటి ప్రకటన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన ఎక్కువవుతుంది. దీపావళినాటికే సాగునీటి విడుదలపై సానుకూల ప్రకటన ప్రభుత్వం చేస్తుందనుకున్న రైతాంగానికి నిరాశే మిగిలింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో త్రాగునీరు, ఇతర అవసరాలకుపోను సాగునీటికి అందుబాటులో 90 టిఎంసీల కృష్ణాజలాలు ఉన్నాయి. ఈ నేపద్యంలోనే మొదటిజోన్‌కు నీటి విడుదల చేయాలనే డిమాండ్ బలపడింది. జిల్లాకు చెందిన పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిపిఎం శాసనసభాపక్షనేత, మిర్యాలగూడ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలు ముఖ్యమంత్రిని కలిసి ఆయకట్టు పరిస్థితిని వివరించారు. ఇదిలా ఉండగా శ్రీశైలంలోని నీటి నిల్వలు రోజురోజుకు నిండుకుంటున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా అడపాదడపా అక్కడి అవసరాలకు నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలంలో నీటిమట్టం 191 టిఎంసీల నుండి 122 టిఎంసీలకు పడిపోయింది. మరోవైపు సాగర్‌లోనూ క్రమక్రమంగా నీటిమట్టం తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం త్వరితగతిన నీటి విడుదలపై ప్రకటన చేస్తే ప్రాజెక్టుల్లోని నీటివృధాను అరికట్టి సాగుకోసం కృష్ణాజలాలను ఉపయోగించే వీలుంటుందని ఆయకట్టు రైతులు అంటున్నారు.

వేగం పెంచిన వైకాపా..టిఆర్‌ఎస్‌లు !
కాంగ్రెస్..టిడిపిలకు వలసల బెంగ !!
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, నవంబర్ 12: రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణల ప్రభావం జిల్లా రాజకీయాల్లోను భారీ మార్పులను కల్గిస్తుంది. జిల్లాలో కాంగ్రెస్, టిడిపిలకు చెందిన పలువురు ముఖ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టిఆర్‌ఎస్‌లు తమ పార్టీల్లోకి చేర్చుకుంటు రాజకీయంగా బలాన్ని పెంచుకుంటుండగా ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టిడిపిలకు వలసల బెంగ పెట్టుకుంది. ఏ నియోజకవర్గం నుండి ఏ నాయకుడు ఎప్పుడు పార్టీ మారుతాడోనన్న ఆందోళన ఆ పార్టీ అధినాయత్వాలకు కలవరపాటుకు గురిచేస్తుంది. నవంబర్ 23న సూర్యాపేటలో జరిగే సమరభేరి సభతో భారీగా వలసల పర్వానికి తెర లేపాలని టిఆర్‌ఎస్ కసరత్తు సాగిస్తుంది. దక్షిణ తెలంగాణలో బలం పెంచుకునే దిశగా దిశగా కీలకమైన నల్లగొండలో పార్టీ విస్తరణకు ఏకంగా ఆ పార్టీ అధినేత కెసిఆర్ ఈ దఫా ఎన్నికల్లో భువనగిరి, నల్లగొండలలో ఏదో ఒక స్థానం నుండి నిలిచే ఆలోచన చేస్తుండటం జిల్లాలో టిఆర్‌ఎస్ శ్రేణుల్లో కదనోత్సహాన్ని నింపుతుంది. అటు వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటికే సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి టిడిపిలో బలమైన నాయకుడిగా ఉన్న సంకినేని వెంకటేశ్వర్‌రావు, భువనగిరి, ఆలేరులకు సంబంధించి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిలను, మిర్యాలగూడ, కోదాడల నుండి పాదూరి కరుణ, శ్రీకళారెడ్డిలను తమ ఖాతాలో వేసుకుని ఎన్నికల సమాయత్తం దిశగా వేగం పెంచింది. కాంగ్రెస్, టిడిపిల నుండి మరింత మంది పెద్ద తలకాయలకు ఆ పార్టీ నేతలు గాలం వేసినట్లుగా సమాచారం. త్వరలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ వైఎస్సార్‌సిపిలో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తుండగా, తెలంగాణ సాధన పట్ల వారికి చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీలో చేరాలంటు టిఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం వారికి తలుపులు తెరిచిపెట్టి ఉంచింది. నల్లగొండ కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే తెలంగాణపై కాంగ్రెస్ వ్యతిరేక వైఖరి తీసుకుంటే పార్టీకి గుడ్‌బై కొడుతానంటు బాహటంగానే ప్రకటించారు. ఆయన కె.కేశవరావు బృందంలో సాగుతారో లేక మరో పార్టీలో చేరుతారో త్వరలోనే తేలనుంది. టిడిపిలో మోత్కుపల్లి నర్సింహులుతో పొసగలేకపోతున్న భువనగిరి, కోదాడ ఎమ్మెల్యేలు ఎ.ఉమామాధవరెడ్డి, వేనెపల్లి చందర్‌రావులు సైతం త్వరలో ఆ పార్టీని వీడనున్నట్లుగా ప్రచారం సాగుతుంది. టిడిపి, కాంగ్రెస్‌లను వీడే వారంతా సమైఖ్యవాద పార్టీల్లో కాకుండా తెలంగాణ సాధించే టిఆర్‌ఎస్‌లో చేరాలంటు ఏకంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి పిలుపునివ్వడం గమనార్హం. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిఆర్‌ఎస్‌కు బలమైన అభ్యర్ధి లేడన్న లోటును పూడ్చేందుకు టిడిపి ఎమ్మెల్యే ఎ.ఉమామాధవరెడ్డిని, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డిని కారు ఎక్కించేందుకు కొంతమంది రాయబారం నెరపుతున్నారు. అయితే సందీప్‌రెడ్డి సన్నిహితులు ఆయనను వైఎస్సార్‌సిపిలో చేరాలంటు ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. భువనగిరి నియోజకవర్గం నుండి దివంగత టిఆర్‌ఎస్ నేత కళ్లెం యాదగిరిరెడ్డి కూమారుడు వేణుగోపాల్‌రెడ్డి కూడా త్వరలో క్రియాశీలక రాజకీయాల్లోకి రావచ్చని భావిస్తున్నారు. అటు బిజెపి సైతం ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలాన్ని పెంచుకునే క్రమంలో చేరికలపై దృష్టి సారించి ఇప్పటికే భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ డిఎస్పీ నళినిని పార్టీలో చేర్చుకుని బలసమీకరణల్లో ప్రధాన పార్టీలకు తామేమి తక్కువ తినలేదని చాటారు. పద్మశాలి సామాజిక వర్గంకు చెందిన నళినిని భువనగిరి బరిలో నిలిపినట్లయితే ఈ నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న ఆ వర్గం మద్దతు లభిస్తుందని కమలనాధుల ఆశ. పోటీలో ఇతర పార్టీల నుండి దాదాపుగా రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులే ఉంటే బిసి వాదం..తెలంగాణ నినాదంతో నళిని గెలుపు తీరాలకు చేరవచ్చని ఆ పార్టీ అంచనా. జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో సైతం తమ బలాన్ని పెంచుకునేందుకు బిజెపి నాయకత్వం పావులు కదుపుతుంది. టిడిపి సాగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి తేరా చిన్నపరెడ్డి కూడా పార్టీ మారే అవకాశం లేకపోలేదని భోగట్టా. అటు వలసలతో ఠారెత్తిపోతున్నప్పటికి కాంగ్రెస్‌కు జానా..ఉత్తమ్,దామన్న, పాల్వాయి వంటి సీనియర్లు కొండంత బలంగా ఉన్నా..తెలంగాణ వాదం, వైకాపా గాలి జోరులో వారి ప్రభ అంతగా వెలగకపోవచ్చన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వలసల సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్, టిడిపిలకు జిల్లా పార్టీల అధ్యక్షుల నియామక సైతం తలనొప్పిగా తయారైంది. డిసిసి అధ్యక్షుడిగా తూడి దేవేందర్‌రెడ్డి కొనసాగింపుపై స్పష్టత లేకపోగా, టిడిపి జిల్లా అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ మార్పుపై నిర్ణయం అధినేత చంద్రబాబు వద్ధ పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు సంసిద్ధంగా లేని ఆ పార్టీ శ్రేణులకు మరింత బెంగ కల్గించేలా లోక్‌సభ ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తోడు రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్‌కు మజ్లీస్ మద్ధతు ఉపసంహారణ వ్యవహారం ఆశనిపాతంగా మారిందని రాజకీయ వర్గాలు విశే్లషిస్తున్నాయి.

* ఇద్దరి పరిస్థితి విషమం * 12మందికి గాయాలు
english title: 
lorry

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>