Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బాలలు మంచిపౌరులుగా ఎదిగినప్పుడే దేశానికి ఉజ్వల భవిష్యత్తు

$
0
0

గుంటూరు, నవంబర్ 14: నేటి బాలలే రేపటి పౌరులని, వీరంతా సమాజంలో మంచి పౌరులుగా ఎదిగినప్పుడే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో జిల్లా విద్యాశాఖ, రాజీవ్‌విద్యామిషన్ సంయుక్త ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా ముఖ్య అతిథిగా ఎంపి రాయపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ దేశభవిష్యత్తు నిర్దేశానికి పిల్లలందరూ నైతిక విలువలతో కూడిన విద్యనభ్యసించాలని సూచించారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఆధునిక భారతదేశ నిర్మాణానికి, దేశాభివృద్ధికి పునాది వేసిన మహోన్నత వ్యక్తి జవహర్‌లాల్ నెహ్రూ అని కొనియాడారు. మరో ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య మాట్లాడుతూ దేశం కోసం నెహ్రూ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని కీర్తించారు. కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ విలువలతో కూడిన జీవితం గడపాలన్న మంచి ఆశయంతో విద్యార్థులు విద్యనభ్యసించాలని, ఆ విధంగా ప్రతిజ్ఞ పూనాలని కోరారు. ప్రతి వ్యక్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశానికి తన వంతుగా సేవలు అందించాలన్నారు. ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తిని ద్విగుణీకృతం చేయడంలో జవహర్‌లాల్‌నెహ్రూ పాత్ర కీలకమైందన్నారు. అర్బన్ ఎస్‌పి రవికృష్ణ మాట్లాడుతూ జిల్లాలో మంచి పనులు చేయడానికి వాయిదాలు వేసుకోవద్దని సూచించారు. తొలుత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ బాలల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులకు, వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి ఎంపి రాయపాటి, ఎమ్మెల్సీలు, కలెక్టర్ బసుమతులను అందజేశారు. అనంతరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రచార రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. బాలల హక్కులపై, జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పథకంపై రూపొందించిన పోస్టర్లను అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి శారదాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, రాజీవ్‌విద్యా మిషన్ పిఒ చైతన్య, పలు విద్యాసంస్థల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కృషి
ప కేంద్ర మంత్రి చిరంజీవి
మంగళగిరి, నవంబర్ 14: దేశంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె చిరంజీవి అన్నారు. బుధవారం మంగళగిరి మండలం చినకాకానిలోని అగ్రిగోల్డ్ వారి హాయ్‌లాండ్‌ను ఆయన సందర్శించారు. హాయ్‌లాండ్‌లోని బుద్ధిజం ఎగ్జిబిషన్‌ను చిరంజీవి పరిశీలించారు. ఎగ్జిబిషన్ ప్రాముఖ్యతను హాయ్‌లాండ్ చైర్మన్ విఆర్‌రావు అవ్వాస్ వివరించారు. హాయ్‌లాండ్ ప్రాంగణం మొత్తాన్ని పరిశీలించిన అనంతరం చిరంజీవి విలేఖరులతో మాట్లాడారు. మన దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు వున్నప్పటికీ ఇతర దేశాలతో పోల్చితే వెనుకబడ్డామని చిరంజీవి అన్నారు. కొన్ని దేశాలు పర్యాటక రంగం మీద 30 నుండి 40 శాతం అదాయం పొందుతున్నప్పటికీ మన దేశం కేవలం 6.5 శాతం ఆదాయం పొందుతోందని ఆయన అన్నారు. దేశంలో ఎతె్తైన జలపాతాలు, మంచుకొండలు, సుందర ప్రదేశాలు, మొదలైనవి ఎన్నో వున్నప్పటికీ పర్యాటకులను ఆకక్షించలేకపోతున్నామని, ప్రేరణ కలిగించే విధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. బుద్దుడు నడియాడిన నేల నిధి నిపేక్షాలు వున్న ప్రాంతం మనదని అగ్రిగోల్డ్ సంస్థ చరిత్రా సంస్కృతిని తెలిపే విధంగా ఉల్లాసం, ఉత్సాహం ఆరోగ్యం అందిస్తూ థిమ్ పార్కు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. మన రాష్ట్రంలో తిరుపతి ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోందని ఇంకా దాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సి వుందని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వున్న అవకాశాలను పరిశీలించి మంత్రి వట్టి వసంతకుమార్‌తో మాట్లాడి ప్రతిపాదనలు తీసుకుంటామని, పెండింగ్‌లో వున్న ప్రాజెక్టులు కూడా క్లియర్ చేస్తామని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవిని హాయ్‌లాండ్ సంస్థ ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. రాష్ట్ర మంత్రులు కె పార్థసారథి, కన్నా లక్ష్మినారాయణ, ఎంపి లగడపాటి రాజగోపాల్, శాసనసభ్యులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, హాయ్‌లాండ్ ఎండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం దాళ్వాకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు
ప మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి వెల్లడి
నరసరావుపేట, నవంబర్ 14: దాళ్వా పంటకు సాగునీరు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని రాష్ట్ర సహకార శాఖామంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రమైన రొంపిచర్ల తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం రుణ పంపిణీ, నిర్మల భారత అభయాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి స్పెషలాఫీసర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో 532అడుగుల మేరకు నీరు నిల్వ ఉందని, 70టిఎంసిలు మాత్రమే వాడుకోవాల్సి ఉండగా, అందులో 40టిఎంసిల నీటిని మంచినీటి కోసం నరసరావుపేట డివిజన్‌లో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండోపంటకు సాగునీటిని ఇవ్వలేమని మంత్రి కాసు తెలిపారు. ఇటీవల సంభవించిన నీలం తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి తక్షణమే ప్రభుత్వం నుండి సహాయం అందుతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నష్టపోయిన రైతాంగాన్ని త్వరగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుని, ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. మహిళల వల్లే గృహాల్లో స్థితిగతులు మారతాయన్నారు. పేదప్రజలను అన్ని విధాల ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. 2004 నుండి ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది రూపాయలతో చేపట్టి పూర్తి చేశామన్నారు. డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావుమాట్లాడుతూ మహిళలు నిర్మల భారత్ అభయాన్ పథకం కింద ఇచ్చే పదివేల రూపాయలతో మరుగుదొడ్లను నిర్మించుకుని ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ పథకాల కింద మహిళలకు 5.31 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ పి వెంకటరామిరెడ్డి, తహశీల్దార్ కె లలిత, ఎంపిడివో రాజేష్, పంచాయతీరాజ్ డిఇ రాఘవసూరి, ఇఇ సుబ్బారెడ్డి, ఎఇ హరినాధబాబు, హౌసింగ్ ఇఇ వేణుగోపాల్, డిఇ వరప్రసాద్, ఆర్ అండ్ బి డిఇ మల్లిఖార్జునరావు, ఎఇ శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సైన్స్‌ను అందరికీ చేరువ చేయాలన్నదే లక్ష్యం
ప ఘనంగా ప్రారంభమైన ఎపి సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ప నేడు గవర్నర్ రాక
నాగార్జున యూనివర్సిటీ, నవంబర్ 14: సైన్స్ రంగంలో జరుగుతున్న పరిశోధనను, నూతన ఆవిష్కరణల సమాచారాన్ని మరింత విస్తృతంగా సమాజంలోని ప్రతిఒక్కరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎపి ఆకాడమీ ఆఫ్ సైనె్సస్ అధ్యక్షుడు సిహెచ్ మోహన్‌రావు అన్నారు. బుధవారం ఉదయం వర్సిటీలోని డాక్టర్ హెచ్‌హెచ్ డైక్‌మెన్ ఆడిటోరియంలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ సమావేశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని అకాడమీ లక్ష్యాలను వివరించారు. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రముఖ కేంద్రాల్లో కూడా ఈ సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు, రాష్టవ్య్రాప్తంగా అనేక ప్రాంతీయ అకాడమీలను ప్రారంభించినట్లు డాక్టర్ మోహనరావు తెలిపారు. ఈ పరిసర ప్రాంతాలలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఇబ్బందులను తెలుసుకోడానికి ఈ సమావేశాల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, దీని ద్వారా రైతుల సమస్యలకు ఆయా రంగాలకు సంబంధించిన శాస్తవ్రేత్తలు పరిష్కారాలు సూచిస్తారని ఆయన తెలిపారు. అనంతరం వర్సిటీ వీసీ ఆచార్య కెవిరావు మాట్లాడుతూ ఎపి సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమాలను వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించటం ఇదే మొదటిసారని, ఈ సమావేశాలు విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. వర్సిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంతోపాటు, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్ , ఐబిఎం విభాగాలలోని సెమినార్ హాల్స్‌లో సమావేశాలకు సంబంధించిన టెక్నికల్ సెక్షన్స్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిశోధనలపై అవగాహన పెంచుకోడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఆర్‌ఆర్‌ఎల్ కాంతం, రెక్టార్ ఆచార్య వైపి రామసుబ్బయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య కెఆర్‌ఎస్ సాంబశివరావు, లోకల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య జెడ్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా ఎపి అకాడమీ ఆఫ్ సైనె్సస్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఎపి సైన్స్ కాంగ్రెస్- 2012 సమావేశాలను గురువారం రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహం లాంఛనంగా ప్రారంభించనున్నారు. వర్సిటీకి గవర్నర్ రానుండటంతో వర్సిటీ అంతటా పోలీసు బందోబస్తును ముమ్మరం చేశారు.
కార్పొరేట్ కళాశాల హాస్టల్‌లో
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
గుంటూరు (క్రైం), నవంబర్ 14: నగర శివారులోని ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్ రూంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. బొల్లాపల్లి గ్రామానికి చెందిన నరేంద్ర (17) నగర శివారు తురకపాలెం గ్రామంలో ఉన్న ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ఎంపిసి చదువుతున్నాడు. సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి రూంలో నిద్రపోయిన నరేంద్ర మంగళవారం తెల్లవారే సరికి రూంలోని ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. ఇతని వద్ద నుంచి లభించిన సూసైడ్ నోట్‌లో తాను సరిగ్గా చదవలేక పోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పేర్కొన్నాడు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తుర్లపాడులో
సర్వే అధికారుల నిర్బంధం

యడ్లపాడు, నవంబర్ 14: యడ్లపాడు మండలంలో తుఫాన్‌కు జరిగిన పంటనష్టాల అంచనాను బుధవారం ప్రారంభించిన అధికారులకు ఆదిలోనే అడ్డంకి ఎదురైంది. నష్టపరిహారం అంచనాలు సరిగా వేయడం లేదని ఆగ్రహించిన తుర్లపాడు గ్రామరైతులు రెండు గంటల పాటు అధికారులను గ్రామ పంచాయితీ కార్యాలయంలో నిర్బంధించారు. గత ఏడాది మంజూరైన నష్టపరిహారం ఇంతవరకు తమకు చేరలేదని, ఈసారి కూడా కాకుల లెక్కల్లా అంచనా వేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహించారు. వ్యవసాయశాఖ అధికారి కోటయ్య గ్రామ పంచాయితీ కార్యదర్శి విఆర్‌ఒ హనుమంతరావు తదితర అధికారులను నిర్బంధించిన రైతులు తమకు తగు హామీ ఇస్తేనే సర్వే చేయనిస్తామన్నారు. చివరకు గత సంవత్సరం నష్టపరిహారం కొద్దిరోజుల్లో అందేలా చూస్తామని, ఈ ఏడాది అంచనాలు సరిగ్గా వేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారిని వదిలారు. ఇలా ప్రారంభంలోనే రైతులు అడ్డుతగలడం సర్వే బృందానికి కలవరం కల్గించింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకు భారం
ప వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ అప్పిరెడ్డి
గుంటూరు, నవంబర్ 14: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల వారు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని, పేదల బతుకులు భారంగా మారాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. జనచైతన్య ప్రస్థానంలో భాగంగా బుధవారం అప్పిరెడ్డి స్థానిక ఎటి అగ్రహారంలోని శ్రీరామ్‌నగర్‌లో పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై నిబంధనలు విధించడంతో సామాన్యులు కట్టెలపొయ్యి వాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. స్థానికంగా పలువురిని పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేడా సాంబశివరావు, లాల్‌పురం రాము, పల్లపుశివ, మార్కెట్‌బాబు, మాల్కొండారెడ్డి, వనజాక్షి, సీతారామిరెడ్డి, శారదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు
గుంటూరు (కార్పొరేషన్) నవంబర్ 14: వర్క్ ఆర్డర్లు పొంది పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ కె సుధాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో 112 పనులు జరుగుతున్నాయని, వీటిలో సక్రమంగా పనిచేయని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేసి పనులు వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. పౌరసేవా కేంద్రంలో 36 దరఖాస్తులు గడువుదాటినా పరిష్కరించని సంబంధిత అధికారుల జీతం నుండి అపరాధ రుసుమును వసూలుచేయాలన్నారు. నీటిమీటర్ చార్జీలు వేగవంతం చేసేందుకు ఆర్ ఆర్ యాక్టును ప్రయోగించాలన్నారు. చెరువులను నీటితో నింపేందుకు, వాటి అభివృద్ధికి సంబంధించి చిన్న నీటిపారుదలశాఖ అధికారులతో సంప్రదించాలని తెలిపారు. గోరంట్లలోని కొండ అభివృద్ధికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, చినపలకలూరులో ఉన్న కొండను విజిటియం ఉడా వారి నిధులతో అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ అనుమతి కోసం లేఖ రాయాలని సూచించారు. కంకరగుంట వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, జంక్షన్ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. అలాగే నీటిసరఫరా పథకం, జోనల్ ఆఫీసు నిర్మాణం, ఐహెచ్ ఎస్‌డిపి, రాజీవ్ అవాస్‌యోజన, పుష్‌కార్డ్సు, ట్రాన్సిట్‌పాయింట్ అభివృద్ధి, వాటర్‌టెస్టింగ్ ల్యాబ్, ఐఎస్‌ఐపి, ఎన్‌ఎఫ్‌డిబి, స్కాడా, ఆర్‌యుబి, ఆర్. అగ్రహారం కోనేరు అభివృద్ధి పనులపై క్షుణంగా సమీక్షించారు. సమావేశంలో ఎస్‌ఇ ఆదిశేషు, ఎఇలు మహేష్, సుధాకరరావు, డిఈఈలు తదితరులు పాల్గొన్నారు.
కన్నతల్లిని, జన్మభూమిని మరువకూడదు
తాడికొండ, నవంబర్ 14: కన్నతల్లిని, జన్మభూమిని మరువలేనివారే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించ గల్గుతారని జిల్లా రూరల్ ఎస్‌పి జె సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని పొనె్నకల్లు గ్రామంలో జివికె జిల్లాపరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల పూర్వ విద్యార్థి కసుకుర్తి బాపినీడు విరాళంతో నిర్మించిన 73 అడుగుల ప్రహరీగోడను ప్రారంభించారు. అనంతరం భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పుట్టా శంకరరావు అధ్యక్షత వహించగా ఎస్‌పి సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశం సాంకేతికవిద్య, అభివృద్ధి పథంలో నడిచేందుకు నెహ్రూ బాటలు వేశారన్నారు. బాలల అభ్యున్నతి కోసం నెహ్రూ చేసిన సేవలు ఎనలేనివన్నారు. భారతరత్న ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన టిబెట్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు, 2011-12 విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎస్‌పి సత్యనారాయణ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘ ఎపి కన్వీనర్ యడ్లపల్లి గాంధీ రామ్మోహన్, మాజీ జడ్పీటీసీ పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎంపిటిసి జి మధు, మాజీ సర్పంచ్ రామావత్ వెంకటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్భ్రావృద్ధికి ఎనలేని కృషిచేసిన ఎర్రన్నాయుడు
గుంటూరు (కొత్తపేట), నవంబర్ 14: కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేసి, కేంద్రం నుంచి ఎక్కువ నిధులను రాష్ట్రానికి తెచ్చి రాష్ట్భ్రావృద్ధికి ఎర్రన్నాయుడు ఎనలేని కృషి చేశారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 29, 31వ డివిజన్లు, బృందావన గార్డెన్స్‌లలో నియోజకవర్గ ఇన్‌చార్జి యాగంటి దుర్గారావు అధ్యక్షతన ఎర్రన్నాయుడు సంస్మరణ సభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిపై అలుపెరగని పోరాటం చేసిన ఎర్రన్నాయుడు మృతితో తెలుగుదేశం పార్టీ ఒక గొప్ప నాయకుడ్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శనక్కాయల అరుణ మాట్లాడుతూ ఎర్రన్నాయుడు మృతి రాష్ట్రానికి తీరనిలోటని పేర్కొన్నారు. టిడిపి నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ బిసిల్లో రాజకీయ చైతన్యం కల్గించి బిసిల అభివృద్ధికి కృషిచేసిన గొప్పవ్యక్తి ఎర్రన్నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జులు తెనాలి శ్రావణ్‌కుమార్, నిమ్మకాయల రాజనారాయణ, అనగాని సత్యప్రసాద్, నగర ప్రధాన కార్యదర్శులు ముత్తినేని రాజే ష్, అడపా శివప్రసాద్‌బాబు, నాయకులు గుంటుపల్లి శేషగిరిరావు, మనె్నం శివనాగమల్లేశ్వరరావు, నన్నపనేని విజయలక్ష్మి, బొంతలసాయి రావిపాటి సాయి, దారపనేని నరేంద్ర, పోతురాజు ఉమాదేవి, పి వెంకటమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తడిసిన పత్తిని కొనుగోలు చేయండి
గుంటూరు, నవంబర్ 14: నీలం తుఫాన్ వల్ల భారీ వర్షాలకు తడిసిన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతూ బిజెపి జిల్లా అధ్యక్షుడు వల్లెపు కృపారావు బుధవారం సిసిఐ జనరల్ మేనేజర్ పాణిగ్రహిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లలో పత్తిని రైతులు సాగు చేయగా వర్షాలకు 2 నుండి 3 క్వింటాళ్లకు పైగా పత్తి తడిసిందన్నారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి తడిసిన పత్తి రూ. 3,900లకు కొనుగోలు చేయాలని ఆయన కోరారు. కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు జమ్ముల శ్యాంకిషోర్ మాట్లాడుతూ సిసిఐ అధికారులు, వ్యాపారుల నుండి కాక రైతుల నుండే పత్తిని కొనుగోలు చేయాలన్నారు. తేమశాతం నిబంధనలను సడలించి రైతుల వద్ద నుండి తడిసిన పత్తిని కూడా మద్దతుధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిసిఐ జనరల్ మేనేజర్ పాణిగ్రహి మాట్లాడుతూ రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన పత్తికి వారం రోజుల్లో చెక్కులు అందజేస్తామన్నారు. తడిసిన పత్తిని కొనుగోలు చేసేందుకు తమకు అధికారాలు లేవని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌మోర్చ జిల్లా అధ్యక్షుడు దొప్పలపూడి గోపాలరావు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యం పేర్రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎన్ రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
సహకార సంఘాల అభివృద్ధికి
సమష్టి కృషి అవసరం

తాడేపల్లి, నవంబర్ 14: సహకార సంఘాలు అభివృద్ధి చెందాలంటే సభ్యులు, పాలకమండలి, సిబ్బంది, రైతుల సమష్టి కృషి అవసరమని కోఆపరేటివ్ సొసైటీ డివిజనల్ కోఆర్డినేటర్ రాజశేఖర్ పేర్కొన్నారు. బుధవారం పెనుమాకలో జరిగిన 59వ సహకార సంఘాల వారోత్సవాల్లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. వడ్డీ వ్యాపారస్థుల కబంధ హస్తాల నుండి రైతులను విడిపించడానికి దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సహకార సంఘాలను ఏర్పాటు చేశారని అన్నారు. దేశ వ్యాప్తంగా సహకార సంఘాలు విస్తరించి వాణిజ్య బ్యాంకులకు దీటుగా రైతులకు సేవలందిస్తున్నాయన్నారు. కాగా ఇటీవల కాలంలో సహకార సంఘాల సభ్యులు, నిర్వాహకులు, ఉద్యోగులు డిపాజిట్లు పెంపొందించటంలో శ్రద్ధ కనబరచడంలేదన్నారు. ఎంతో ప్రాముఖ్యత వున్న ఈ సహకార వ్యవస్థను ఐక్యరాజ్య సమితి గుర్తించి 2012 సంవత్సరాన్ని అంతర్జాతీయ కోఆపరేటివ్ సంవత్సరంగా ప్రకటించినట్లు ఆయన తెలిపారు. పెనుమాకలో అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములు వుండటంతో పంట దిగుబడులు పెంచటానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు కోఆపరేటివ్ సొసైటీలు అందిస్తాయని అన్నారు. ఒకటో నెంబర్ స్థాయిలో వున్న పెనుమాక గ్రామ సొసైటీకి సొంత కార్యాలయ భవనాలు, గోడౌన్ ఎందుకు ఏర్పాటు చేయటం లేదని ఈ సందర్భంగా రైతులు రాజశేఖర్‌ను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధికారులు కె కోటేశ్వరరావు, అసిస్టెంట్ రిజిస్టార్ తాండన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు కె శివారెడ్డి, ఆర్ కృష్ణమోహనరెడ్డి, ప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి వికాసానికి బాల్యమే పునాది
* ఆర్డీవో శ్రీనివాసమూర్తి
తెనాలి, నవంబర్ 14: వ్యక్తి వికాసానికి పునాది బాల్యంలో నేర్చుకున్న మంచి అంశాలేనని ఆర్డీవో ఎస్ శ్రీనివాసమూర్తి అన్నారు. చాచానెహ్రు జయంతిని పురస్కరించుకుని స్థానిక వివేక సెంట్రల్ స్కూల్ లో 3రోజుల పాటు నిర్వహించే బాలల దినోత్సవ వేడుకలు బుధవారం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగాప్రారంభమయ్యాయి. వివేక వీరనారాయణ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈవేడుకల్లో బాల నటుడు మాస్టర్ అతులిత్ ప్రత్యేక ఆకర్షణ కాగా, ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆర్డీఒ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. గ్రంథాలయోధ్యమకారుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య మాట్లాడుతూ చిన్నారులు బాల్యం నుండి పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుకోవాలన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ కె సుమంత్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుండి సామాజిక స్పృహను పెంచుకోవాలన్నారు. సినీబాల నటుడు మాస్టర్ అతులిత్ మాట్లాడుతూ చేసే పని ఏదైనా ఇష్టంగా చేస్తే ఆపనిలో విజయం తధ్యమని, సహచర విద్యార్థులంతా విద్యను ఇష్టంగా చదువుతూ ఉన్నతంగా రాణించాలనే భావనను వ్యక్తం చేశాడు. సభానంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులనలరించాయి. కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు కావూరి గరికయ్య చౌదరి, సురేష్‌కుమార్, ఎస్.గంగాధర్, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనాథ వికలాంగుల పాఠశాలలో ...
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఎస్‌వియోగ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఐతానగర్‌లోని అనాథ వికలాంగుల పాఠశాలలో అన్నదాన సేవలు నిర్వహించారు. యోగ సభ్యులు మానేపల్లి శివ, ధనలక్ష్మి దంపతుల వితరణతో బాలల దినోత్సవేళ అనాథ వికలాంగులకు తమ వంతు సేవలు అందించడం జరిగిందని సంస్థ కన్వీనర్ ఎం రమణయ్య వివరించారు. కార్యక్రమంలో పలువురు యోగ సభ్యులు పాల్గొన్నారు.
జవహర్‌నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బుధవారం బాలల దినోత్సవాన్ని నెహ్రూ నికేతన్‌లో ఘనంగా నిర్వహించారు. స్కూల్ వ్యవస్థాపకుడు ప్రకాశరావు పర్యవేక్షణలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ డివి మురళికాంత్, ప్రిన్సిపాల్ లక్ష్మీప్రకాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నెహ్రూ బాటలో బాలలంతా నడవాలి: డిఎన్‌డివో
తెనాలి రూరల్: చాచానెహ్రూ పుట్టిన రోజును బాలల రోజుగా జరుపుకుంటున్న బాలలు ఆయన బాటలో నడిచి భారత దేశానికి ఖ్యాతిని తీసుకురావాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జి వెంకటేశ్వరావు పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ఖాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నెహ్రూ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాఠశాల హెచ్‌ఎం కోటిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో డాక్టర్ కె సాంబశివరావు, సిహెచ్ సుబ్బారావు, రమణయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
రొంపిచర్లలో కాసు వెంగళరెడ్డి విగ్రహం ఆవిష్కరణ
నరసరావుపేట, నవంబర్ 14: రాష్ట్ర సహకార శాఖామంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి మండల కేంద్రమైన రొంపిచర్ల గ్రామంలో పలు అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలకు బుధవారం ప్రారంభోత్సవాలను, శంకుస్థాపనలు చేశారు. స్థానిక జిల్లాపరిషత్ హైస్కూల్లో సర్థార్ కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పడాల చక్రారెడ్డి అధ్యక్షత వహించారు. డిసిసి అధ్యక్షులు మక్కెన మల్లిఖార్జునరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, ఎంఇవో రాజు, ఆర్డీవో పి అరుణ్‌బాబు, డిఎస్పీ పి వెంకటరామిరెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కరరెడ్డి, యన్నం నర్సిరెడ్డి, అనె్నం పున్నారెడ్డి, పడాల నాగిరెడ్డి, పడాల వెంకటరమణారెడ్డి, ఈవూరి వెంకటరెడ్డి, బోయిన సుబ్బారావుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 55లక్షల రూపాయలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంత్రి కాసు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎం అండ్ హెచ్‌వో కామేశ్వరప్రసాద్, ఎస్‌పిహెచ్‌వో రాజు, డాక్టర్ దేవప్రసాద్, డాక్టర్ కనుమకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రొంపిచర్ల గ్రామంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను మంత్రి కాసు ప్రారంభించారు.
అదేవిధంగా తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించిన కాసు బ్రహ్మానందరెడ్డి శాఖాగ్రంథాలయాన్ని మంత్రి కాసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కరరెడ్డి, మాజీ చైర్మన్ యన్నం వెంకటనర్సిరెడ్డి, డిసిసి అధ్యక్షులు మక్కెన మల్లిఖార్జునరావు, గ్రంధాలయ కార్యదర్శి దుర్గారావు, సూపరింటిండెంట్ ప్రసాద్, గ్రంధాలయాధికారి కనక రామిరెడ్డి పాల్గొన్నారు.
‘శరవేగంగా పెరుగుతున్న మధుమేహ వ్యాధి’
తెనాలి, నవంబర్ 14: శరవేగంగా పెరుగుతున్న మధుమేహ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని డిఎస్పీపి పి మదుసూధనరావు అన్నారు. ప్రపంచ మధుమేహవ్యాధి అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలిశాఖ అధ్వర్యంలో పట్టణంలో సుగర్ వ్యాధి పట్ల అవగాహన పెంచే విధంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డిఎస్పీ పి మధుసూధనరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈక్రమంలో సుగరు వ్యాధి వైద్యనిపుణులు, ఐఎమ్‌ఎ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌వి.కృష్ణారావు మాట్లాడుతు సుగరు వ్యాథి నియంత్రణకు వ్యాయామం ఎంతైనా అవసరమని, నడకకు మించిన వ్యాయామం మరొకటి లేదన్నారు. ఆరోగ్య పరిరక్షణలో నడక ప్రాధాన్యతను తెలియజెప్పేందుకే సుగర్ వ్యాధి అవగాహన దినోత్సవ వేళ ర్యాలీని ఏర్పాటు చేశామన్నారు. కాగా సుగర్ అవగాహన పెంచే టి షర్టులతో పలువురు వైధ్యులు, పట్టణ ప్రముఖులు ర్యాలిలో పాల్గొన్నారు. అదే విధంగా డాక్టర్ ఎస్‌వి కృష్ణారావు పర్యవేక్షంలో ఉచిత సుగర్ టెస్ట్‌లు నిర్వహించారు.

వృద్ధాశ్రమంలో దీపావళి జరుపుకున్న అర్బన్ ఎస్‌పి
గుంటూరు (క్రైం), నవంబర్ 14: నగరంలోని వృద్ధాశ్రమం, పలు హాస్టళ్లను అర్బన్ ఎస్‌పి రవికృష్ణమంగళవారం సందర్శించి వారితో దీపావళి పండుగను జరుపుకున్నారు. నగరంపాలెంలోని విద్యార్థుల హాస్టల్, వృద్ధాశ్రమంలలో అర్బన్ ఎస్‌పి ఆకె రవికృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి వారికి దీపావళి బాణాసంచా అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
సీతానగరంలో రహదారి నిర్మాణానికి అనుమతి
తాడేపల్లి, నవంబర్ 14: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం ప్రాంతంలో తిరుమలశెట్టి సురేంద్ర రోడ్డు ప్రాంతంలో సుమారు రూ. 9 లక్షలతో రహదారి నిర్మాణానికి అంచనాలు తయారు చేయటానికి ఎమ్మెల్యే ఆదేశించినట్లు మున్సిపల్ కమిషనర్ బి శివారెడ్డి తెలిపారు. రహదారి నిర్మాణానికి కావాల్సిన అంచనాలు పూర్తి చేసి ప్రత్యేక అధికారి ఆమోదంతో పాటు సాంకేతిక విభాగం అనుమతులు పొందిన తరువాత పనులు ప్రారంభించటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అనారోగ్య సమస్యతో వృద్ధుడి ఆత్మహత్య
మేడికొండూరు, నవంబర్ 14: మండలంలోని పేరేచర్ల 6వ మైలులో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పేరేచర్ల 6వ మైలుకు చెందిన పోతురాజు (70) అనే వృద్ధుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతం కాకపోవడంతో అధికంగా బాధపడుతూ బుధవారం మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగాడు. చికిత్స నిమిత్తం ఇతన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మేడికొండూరు హెచ్‌ఎస్ ఉమర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉప్పలపాడు చెరువు నీటి నాణ్యతపై పరీక్షలు
* కలెక్టర్ సురేష్‌కుమార్
గుంటూరు, నవంబర్ 14: ఉప్పలపాడు చెరువులో ఉన్న నీటి నాణ్యతపై పరీక్షలు చేయించాలని కలెక్టర్ సురేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో ఉప్పలపాడు పక్షుల కేంద్ర అభివృద్ధిలో భాగంగా ఉప్పలపాడు గ్రామంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామంలో ఉన్న చెరువులో ఉన్న నీటిని పరీక్షించాలన్నారు. గ్రామ ప్రజలు ఫిల్టర్ బెడ్స్ వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా ఇఇ జి వేణును ఆదేశించారు. ప్రస్తుతం తక్కెళ్లపాడు గ్రామానికి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన సంగం జాగర్లమూడినుండి నీరు ఇవ్వడం జరుగుతోందని, అయితే నీరు చాలడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు పుష్కలంగా నీటి సరఫరాకు ఎంతమేర నీరు కావాలో అంచనా వేసి నగరపాలక సంస్థ కమిషనర్ సుధాకర్‌కు తెలియజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబు, గుంటూరు ఆర్‌డిఒ వెంకటరమణ, పంచాయితీరాజ్ ఇఇ గోవర్ధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రుద్రవరంలో ముగిసిన క్రీడా సంబరాలు
అచ్చంపేట, నవంబర్ 14: బాలల దినోత్సవం సందర్భంగా రుద్రవరం స్కూలు కాంప్లెక్స్ పరిధిలోని 8 పాఠశాలల విద్యార్థులకు నిర్వహిస్తున్న సాయి క్రీడా సంబరాలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా రుద్రవరం ఎంపిపి పాఠశాలలో ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఇఒ సోమనాధ్ హాజరయ్యారు. కబడ్డీ పోటీల్లో సీనియర్ విభాగంలో రుద్రవరం యుపి పాఠశాల మొదటిస్థానంలో, జూనియర్ విభాగంలో కస్తల ఎంపిపి పాఠశాల విద్యార్థులు మొదటిస్థానంలో నిలిచారు. గెలుపొందిన విజేతలకు ఎంఇఒ సోమనాధ్ మాట్లాడుతూ ప్రోత్సాహక నగదుతో పాటు పతకాలను అందజేశారు. మొత్తం 180 మంది విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ చైర్మన్ ఎం శ్రీనివాసరావు, రుద్రవరం హెచ్‌ఎం కె శ్రీనివాసరావు, టి వెంగళరెడ్డి, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
బాలలు తమ హక్కులు తెలుసుకోవాలి
* న్యాయమూర్తి రమణకుమారి
గుంటూరు (లీగల్), నవంబర్ 14: సమాజంలోని పౌరులతో పాటు, బాలలకు కూడా హక్కులు ఉంటాయని, అందుకు సంబంధించిన చట్టాలు కూడా పటిష్ఠంగా ఉన్నాయని, వార

బాలలు మంచిపౌరులుగా ఎదిగినప్పుడే దేశానికి ఉజ్వల భవిష్యత్తు
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>