Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రారంభం సరే.. నిర్వహణే సమస్య!

$
0
0

కర్నూలు, నవంబర్ 14: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్న హంద్రీ-నీవా పథకం భవిష్యత్తులో ఆటుపోట్లను ఎలా ఎదుర్కొంటుందన్న అంశంపై రైతుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను గట్టెక్కి చివరకు పనులు పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధపడింది. ప్రాజెక్టు ప్రారంభం తరువాతే నిర్వహణే అసలు సమస్య అని పలువురు సాగునీటి రంగ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. దిగువ నుంచి ఎగువకు నీటిని తరలించడంలో ఉన్న సమస్యలు అధిగమించడం అంత సులువుకాదని భావిస్తున్నారు. హంద్రీ-నీవా పథకానికి శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించాల్సి ఉంది. ఇందుకోసం తొలి దశలో మల్యాల నుంచి 216 కిలోమీటర్ల మేర నీటిని జీడిపల్లి వరకు తరలించేందుకు సుమారు 12 పంపింగ్ స్టేషన్లు నిర్మించారు. వీటిలో ఎనిమిది ప్రధాన పంపింగ్ స్టేషన్లు ఉండగా మరొకటి ముచ్చుమర్రి వద్ద అదనంగా నిర్మించారు. ఇక పేరూరు బ్రాంచి కెనాల్‌పై మరో మూడు పంపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పంపింగ్ స్టేషనులో 12 మోటార్లను అధికారులు అమర్చారు. అవసరమైన సమయంలో ఒక్కో పంపింగ్ స్టేషనులో ఉన్న మోటార్లలో నీరు తరలింపు సామర్థ్యాన్ని బట్టి మోటార్లను ఉపయోగించనున్నారు. శ్రీశైలం జలాశయంలో నీరు 840 అడుగులకు పడిపోయే వరకు అవసరమైన సమయంలో నీటిని ఎత్తిపోతల ద్వారా హంద్రీ-నీవా కాలువకు తరలించాల్సి ఉంది. ప్రాజెక్టు తొలిదశలో మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాగా అక్కడి నుంచి కడప, చిత్తూరు జిల్లాల్లో పనులను రెండో దశ కింద చేపడుతున్నారు. ఈ రెండు దశల్లో శ్రీశైలం నుంచి మొత్తం 40 టిఎంసీల నీటి వినియోగించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం తొలి దశ పనులు ప్రారంభమయ్యాక నీటి తరలింపు కోసం విద్యుత్ సమస్య అధికారులను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ దశలో 12 పంపింగ్ స్టేషన్లలో భారీ సామర్థ్యంతో కూడిన విద్యుత్‌మోటార్లు సక్రమంగా పనిచేస్తే నీటి తరలింపులో సమస్యలు ఉండవని ఇందుకు ప్రధానంగా భారీ తరహా పరిశ్రమలకు సరఫరా చేసే విధంగా విద్యుత్ సరఫరా ఉంటేనే సాధ్యపడుతుందని వారంటున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ కొరత కారణంగా ఎత్తిపోతల పథకానికి అవసరమైన విద్యుత్ ఎక్కడి నుంచి తీసుకువస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా 220 కెవి సామర్థ్యం కలిగిన ఏడు సబ్‌స్టేషన్లను నిర్మించారు. ఈ సబ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా విషయంలో రైతుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం సిఎం ప్రారంభించనున్న సందర్భంగా కృష్ణగిరి వద్ద 0.161 టిఎంసీ సామర్థ్యం ఉన్న జలాశయంలో సుమారు 0.09టిఎంసీల నీరు నిల్వ చేశారు. అక్కడి నుంచి జిల్లాలో పత్తికొండ జలాశయాన్ని నింపి జీడిపల్లికి తరలించాల్సి ఉంది. ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో పలు చోట్ల సిమెంటు పనులు అసంపూర్తిగా ఉన్నాయని కాంట్రాక్టర్లు అధికారులతో పేర్కొంటున్నారు. శరవేగంగా కాంక్రీట్ పనులు పూర్తి చేశామని అయితే వాటికి క్యూరింగ్ అయ్యేందుకు సమయం లేనందున నీటి ఒత్తిడితో పగళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక కాలువలో నీటి సామర్థ్యంపై కూడా పూర్తిస్థాయి పరిశీలన నిర్వహించాల్సి ఉందని వెల్లడించినట్లు సమాచారం. దీనిపై అధికారులు స్పందిస్తూ ఏ ప్రాజెక్టు అయినా సమస్యలు సాధారణమని సమాధానమిస్తున్నారు. సమస్య తలెత్తకుండా ప్రస్తుతం అన్నిచర్యలు తీసుకున్నామని చిన్న చిన్న సమస్యలను అధిగమించగలమన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్ సరఫరా విషయంలో కూడా రైతులకు అనుమానం అవసరం లేదని వారికి చెప్పినట్లుగా తాగు, సాగు నీరు అందించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు.
సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
నందికొట్కూరు, నవంబర్ 14: ఈనెల 18న మల్యాల వద్ద ఏర్పాటు చేసిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన ఏర్పటు, బహిరంగ సభ, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇంజనీర్లు మధుసుదన్, అరవింద్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ప్రాజెక్టుకు అమర్చిన మోటర్ల పనితీరును ఎస్‌ఇ పాండురంగయ్య అధికారులకు వివరించారు. ముఖ్యమంత్రి పర్యటనలో లిప్టు ద్వారా నీటిని తరలించే దృశ్యాలు చూడడానికి స్క్రీన్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. భద్రత విషయాలపై ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, స్థానిక డిఎస్పీ, సిఐలతో చర్చించి విఐపి, గ్యాలరీ పార్కింగ్, హెలిప్యాడ్, సభకు సంబంధించిన ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేయాలని రూట్ మ్యాప్‌ను ఏర్పాటుచేసిన విధంగా చర్యలు తీసుకునేల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డివో వెంకట్‌మురళీ, తహశీల్దార్ త్రినాథ్‌కుమార్, ఎంపిడివో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాఘవేంద్రుడి సన్నిధిలో యడ్యూరప్ప
మంత్రాలయం, నవంబర్ 14: రాఘవేంద్రస్వామి దర్శనార్థమై బుధవారం కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యుడ్యూరప్ప మంత్రాలయం వచ్చారు. ముందుగా రాఘవేంద్రస్వామి మఠం అతిధిగృహంవద్ద మఠం అధికారులు పుష్పగుజ్జలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాఘవేంద్రస్వామి మఠం సంప్రదాయబద్దంగా యుడ్యూరప్ప పట్టువస్త్రాలు ధరించి మఠంవద్దకు చేరుకోగానే అధికారులు మఠం భద్రగజంచే పూలమాలలు వేసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మదేవికి కుంకుమార్చన, మహామంగళహారతి చేసి ప్రత్యేక పూజలు చేశారు. రాఘవేంద్రస్వామి మఠం ప్రాంగణంలో ప్రదిక్షణలు చేసి రాఘవేంద్రస్వామి, పూర్వ పీఠాధిపతులు సుశమీంద్రతీర్థుల బృందావనాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాఘవేంద్రస్వామి బృందావనంవద్ద ద్యానం పాటించారు. యుడ్యూరప్పకు వేదపండితులు స్వామివారి శేషవస్త్రం, ఫలమంత్రాక్షలు, మెమోంటో, తీర్థప్రసాదాలు ఇచ్చి సత్కరించారు. ఈకార్యక్రమంలో మఠం మేనేజర్ శ్రీపతాచార్, వెంకటేష్‌జోషి, డిసి కిషన్‌రావు, సిఐ ప్రకాష్‌బాబు, ఎస్సై ప్రకాష్‌కుమార్, డిఇ సురేష్, ఐపి నరసింహామూర్తి, విష్ణుతీర్థచార్, వ్యాసరాజ్, గుంజళ్ళి విజేంద్రచార్‌లు పాల్గొన్నారు.
శ్రీశైలంలో ప్రారంభమైన కార్తీక మాస పూజలు
శ్రీశైలం, నవంబర్ 14: ముక్కంటికి అత్యంత ప్రీతిపతమైన మాసంగా కార్తిక మాసమని పురాణ హితిహాసాల్లో అనేక కథలుగా చెప్పడం జరిగింది. హిందువులకు ఈ కార్తిక మాసం ఎంతో ముఖ్యమైంది. శివుడు విష్ణువులిద్దరికి ఈ మాసమంటే ఎంతో మక్కువ. ఈ పవిత్రమైన మాసంలో కార్తిక స్నానాలు,వ్రతాలు, కార్తిక మాస ఉపవాసాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. అదే కోవలో శివనామస్మరణలతో కార్తిక దీపారదన కూడ ముఖ్యమైనది. శ్రీశైల మహాక్షేత్రంలో నాగులకట్ట వద్ద కార్తిక మాస పూజలను నిర్వహిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో బుధవారం ఉదయం నుండి కార్తిక శోభను సంతరించుకుంది.
కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు
ఈ కార్తిక మాసం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంభిక సన్నిధిలో నాగుల కట్ట వద్ద భక్తులకు దీపారాధన చేసుకునుటకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఆలయం ఉత్తర ద్వారం వద్ద భక్తుల ప్రవేశానికై కోట గోడను కూల్చి ఆ ద్వారం గుండా ప్రవేశం కల్పించారు. నాగులకట్ట ప్రదేశం వద్ద ఉసిరిచెట్ల సముదాయం వద్ద పెద్ద ఎత్తున దీపాలు వెలిగించేందుకు పురోహితులను కూడా ఏర్పాటు చేశారు. ఉపవాసాలతో వచ్చే భక్తులు వెయ్యి, పదివేలు, లక్ష, వత్తుల దీపారాధన చేసుకునేందుకు ఏర్పాట్లను చేశారు. ఈ కార్తిక మాస పూజలు ప్రతి రోజు స్వామి వారికి నిర్వహించి దూప, ద్వీప, నైవేద్యాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ శాశ్రోక్తపూజలతో ఆకాశ దీపాన్ని వెలిగించారు.

అధైర్యపడొద్దు జగనన్న వస్తాడు...
ఆదోని, నవంబర్ 14: ఆధైర్యపడొద్దు జగనన్న వస్తాడు అంటూ ప్రజలకు, మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, యువకులకు ఓదారుస్తూ షర్మిల భరోసా ఇచ్చారు. బుధవారం ఆదోనిలో ప్రారంభమైన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర రాత్రి 7గంటలకు మంత్రాలయం నియోజకవర్గం రంగాపురంకు చేరి ముగిసింది. ఆదోని ఆర్ట్స్‌అండ్ సైన్స్ కాలేజీ మైదానం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో మొదట తిరుమలనగర్‌లోని మహిళలతో షర్మిల మాట్లాడారు. ఆ తరువాత బైపాస్‌రోడ్డు దాటిన తరువాత మహిళ కండెక్టర్ షర్మిలను కలిశారు. షర్మిల మహిళ కండెక్టర్‌తో మాట్లాడుతూ సాధక బాధకాలను తెలుసుకున్నారు.జగనన్నకు అండగా ఉండాలని కోరారు. ఆ తరువాత గొర్రెల కాపరులు షర్మిలను కలిసి గొర్రెను బహుకరించారు. తమకు సక్రమంగా ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని వారు షర్మిలతో చెప్పారు. జగనన్న అధికారంలోకొచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చింది. ఆతరువాత నెట్టేకల్లు క్రాస్‌రోడ్డు వద్ద నెట్టేకల్లు గ్రామ ప్రజలు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. మహిళలు అనేకమంది షర్మిలను చూడడానికి ఎంతో ఉత్సాహం చూపారు. మహిళలతో షర్మిల మాట్లాడారు. అనేకమంది వృద్ధ మహిళలు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ చాలడం లేదని, పెన్షన్‌ను పెంచాలని ఆమెను కోరారు. వైకాపా అధికారంలోకొస్తే పెన్షన్‌ను రూ. 700లకు పెంచుతామని, పిల్లలను చదివించడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. మళ్లీ మొదలైన పాదయాత్ర బైచిగేరి సమీపానికి చేరుకుంది. బైచిగేరి క్రాస్‌వద్ద రైతులు, మహిళలు ఆమె పాదయాత్రకు సాధారణంగా ఘనస్వాగతం పలికారు. సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడం లేదని, అందువలన తమకు బ్రతకడమే కష్టంగా ఉందని మహిళలు పేర్కొన్నారు. కరెంట్‌కోతతో విలవిలలాడుతున్నారని మహిళలు చెప్పారు. రైతులకు రుణాలు కూడ అందడం లేదన్నారు. ఇందుకు స్పందించిన షర్మిల మాట్లాడుతూ జగనన్న అధికారంలోకొస్తే ప్రజాసంక్షేమ పథకాలను నిరాటకంగా అమలు చేస్తామన్నారు. నాన్న రాజన్న ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. కరెంట్‌కోత లేకుండా రైతులకు 9గంటలు కరెంట్ అందజేస్తామని రైతన్నలకు ఆమె అన్నారు. అక్కడినుంచి సాగిన పాదయాత్ర కపటి గ్రామానికి చేరుకొంది. కపటిలో వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. అక్కడి నుంచి మంత్రాలయం నియోజకవర్గానికి బయల్దేరి వెళ్ళింది. జిల్లాలో 7వ రోజు పాదయాత్రతో ఆదోని నియోజకవర్గంలో పాదయాత్ర ముగిసింది. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, వైకాపా నాయకులు ఎస్వీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత, వాసిరెడ్డి పద్మ, వై.వి.సుబ్బారెడ్డి, వెంకట్రామిరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, గౌరువెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి పునాదివేసిన ఘనత నెహ్రుదే
కర్నూలు, నవంబర్ 14: ప్రజాస్వామానికి పునాది వేసి, పంచవర్షప్రణాళికలను ఏర్పాటు చేసిన ఘనత నెహ్రూదేనని రాష్ట్ర చిన్ననీటిపారుదలశాఖ మంత్రి టిజి వెంకటేష్ పేర్కొన్నారు. దేశానికి దశ, దిశలను కల్పించిన మహనేత నెహ్రూనని అన్నారు. ప్రజాస్వామానికి పునాది వేసి, పంచవర్షప్రణాళికలను ఏర్పాటు చేసిన ఘనత అని పేర్కొన్నారు. నెహ్ర జయంతి సందర్భంగా బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి టిజివి మాట్లాడుతూ పెద్దప్రాజెక్టులు నాగార్జున సాగర్, బ్రాకనాంగల్ ప్రాజెక్టులు నిర్మించిన ఘనత నెహ్రూకే దక్కిందని గుర్తుచేశారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రు అని, ఆయన ఆగర్భ శ్రీమంతుడైన ఆడంబరాలకు దూరంగా వుండేవారన్నారు. ఈ సమావేశంలో రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, మాజీ జెడ్పి చైర్మన్ వెంకటస్వామి, డిసిసి ఉపాధ్యక్షులు సర్దార్‌బుచ్చిబాబు, వైవి రమణ, వాడాల చంద్రశేఖర్‌రెడ్డి, డిసిసి కార్యదర్శులు రాంబాబురెడ్డి, తిప్పన్న, చున్నుమియ్య, దేవదాసు, జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ ముస్త్ఫా, కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు దాశెట్టి శ్రీనివాసులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సర్వేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మహానందిలో కార్తీకమాస పూజలు ప్రారంభం
మహానంది, నవంబర్ 14: మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీకమాసాన్ని పురష్కరించుకొని మహానంది క్షేత్ర ఆలయంతో పాటు శ్రీగరుడనందీశ్వస్వామి ఆలయం వద్ద వేదపండితులు ఆకాశద్వీపాన్ని వెలిగించి కార్తీకమాసాన్ని స్వాగతించారు. ఇ వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మలు ఆలయంలోని రుద్రగుండం పుష్కరిణి వద్ద తాత్కాలిక ధ్వజస్తంభం వద్ద కార్తీకదీపాన్ని ఇఓ దివాకర్‌బాబుచే ప్రారంభించారు. అలాగే గరునందీశ్వరస్వామి ఆలయం వద్ద అర్చకులు శంకరయ్యశర్మ అధ్వర్యంలో ప్రత్యేకపూజలు చేసి కార్తీకద్వీపాన్ని వెలిగించారు. సకల దేవతల ఆహ్వానానికై ఈ ఆకాశద్వీపాన్ని వెలిగిస్తామని వేదపండితులు తెలిపారు.
మైనార్టీల ఆభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ఆదోనిటౌన్, నవంబర్ 14: ర్రాష్టంలోని ముస్లిం మైనార్టీలతోపాటు ఇతర వర్గాల ఆభివృద్ధికి, తండ్రి రాజన్న అశయ సాధన కోసం జగనన్న ప్రత్యేక ప్రణాళికతో ఉన్నారని షర్మిల పేర్కొన్నారు. ఋధవారం మైనార్టీ నాయకులు గోఖర్‌జెండా సలీం ఆధ్వర్యంలో ముస్లింలు షర్మిలకు వినతిపత్రం అందజేశారు. ఆదో‚నిలో వేలాదిమంది సంఖ్యలో ముస్లిం మహిళలు ఉపాధి లేకుండా ఉన్నారని, విద్య, వైద్యం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రుణ సదుపాయాలు కల్పించడం లేదని, పక్క ఇళ్ళు నిర్మించడం లేదని అన్నింటా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూన్నారని వాపోయారు. దీనికి షర్మిల స్పందిస్తూ మైనార్టీల ఆభివృద్ధికి రాజన్న తరహలోనే జగనన్న కృషి చేస్తారని ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఫారూక్, శేక్షావలి, నిస్సార్, గోపాల్, గౌరిశంకర్, మహేష్‌లు పాల్గొన్నారు.
అడుగడుగున నీరాజనం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయురాలు షర్మిల ఆదోని నియోజకవర్గంలో గత మూడురోజులుగా చేపట్టిన పాదయాత్రకు ప్రజలనుంచి విశేష స్పందన లభించింది. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి నాయకత్వంలో వేలాది సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చి మూడురోజులపాటు ఆమెతో కలిసి పాదయాత్ర సాగించారు. అడుగడుగున జనం షర్మిలకు ఘనస్వాఘతం పలికారు. పట్టణంలో మంగళ, బుధవారాల్లో కొనసాగిన పాదయాత్రలో వేలాదిసంఖ్యలో జనం పాల్గొని షర్మిలతో కలిసి నడక సాగించారు. వైఎస్ విగ్రహం వద్ద జరిగిన బహిరంగసభకు భారీ సంఖ్యలో ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు తరలివచారు.

వ్యక్తి ఆత్మహత్య
అవుకు, నవంబర్ 14: అవుకు మండలం లింగంబొడు గ్రామానికి చెందిన నాగరాజు (45) తన ఇంటి వద్దనే పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తిచెంది పురుగుల మందు తాగి మృతిచెందాడని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో గుర్తుతెలియని శవం
ఎమ్మిగనూరు, నవంబర్ 14: మండల పరిధిలోని గుడికల్లు గ్రామ చెరువులో 40సంవత్సరాల గుర్తుతెలియని మహిళా శవాన్ని రూరల్ పోలీసులు కనుగొన్నారు. ఈమేరకు కేసు ధర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
కెసిలో మహిళ మృతదేహం
పాములపాడు, నవంబర్ 14: మండలంలోని బానుకచర్ల త్రాస్ హెడ్‌రెగ్యులేటర్ సమీపంలో సాగర్ ఫవర్ హౌస్ వద్ద గుర్తుతెలియన మహిళ మృతదేహం బుధవారం లభ్యమైంది. మృతదేహాన్ని పరిశీలిస్తే తల, వీపు, చేతులపై గాయాలు వున్నాయి. దీనిబట్టిచేస్తే ఎవరో హత్యచేసి కెసి కాలువలో పడేసినట్లు వుండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాషాయం రంగు చీర, ఆకుపచ్చని బ్లౌజ్ కలిగి వుండి దాదాపు (45) సంవత్సరాలు వుండవచ్చని స్థానికులు తెలిపారు.
విద్యుదాఘాతంతో ఆపరేటర్ మృతి
సంజామల, నవంబర్ 14:సంజామల మండల పరిధిలోని పేరుసోముల గ్రామంలో అర్చక మాధవాచారి(32) అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. మాధవాచారి పేరుసోముల విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తూ మంగళవారం విద్యుత్ లైన్లు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పులిశేఖర్ తెలిపారు.
ఇరువురి ఆత్మహత్యాయత్నం
* ఒకని మృతి
శిరివెళ్ళ, నవంబర్ 14: శిరివెళ్ళ మండల పరిధిలో గోవిందపల్లె గ్రామంలో అచ్చమ్మ, నాగశివలు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇన్‌చార్జీ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఇరువురిని అంబులెన్స్ ద్వారా నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ అచ్చమ్మ (24) అనే మహిళ మృతిచెందగా నాగశివను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వరుస చోరీలతో బెంబేలు
ఆత్మకూరు రూరల్, నవంబర్ 14: ఆత్మకూరు పట్టణానికి చెందిన ధనలక్ష్మి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎఎన్‌ఎమ్‌గా పనిచేస్తుంది. బుధవారం ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద రు యువకులు ఆమె వెనుక నుండి బైకుపై వచ్చి మెడలో వున్న మూడున్నర తులాల బంగారు చైన్‌ను చోరీచేసి క్షణాల్లో మాయమయ్యారు. 10 రోజుల క్రితం లైసమ్మ అనే వృద్ధురాలి నుండి రూ.8 లక్షల విలువ గల బంగారు గొలుసు చోరికి గురైంది. ఇప్పుడు లైసమ్మ ఇంటి సమీపంలోనే మరో చోరీ జరగడం గమనార్హం. ఈ విషయంపై ఎస్‌ఐ శ్రీ హరిని అడుగగా విధుల్లో భాగంగా కర్నూలుకు వెళ్తున్నానని పాములపాడు ఎస్‌ఐకి సమాచారం అందించామని గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
ఒకే రోజు రెండు చోట్ల దొంగతనాలు
నందికొట్కూరు, నవంబర్ 14: పట్టణంలోని గాంధీనగర్‌లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఒకే రోజు రెండు చోట్ల చోరిలు చోటు చేసుకున్నాయి. గాంధీ నగర్‌లో నివసిస్తున్న సయ్యద్ ఖాద్రిబాష కుటుంబ సభ్యులతో వివాహం నిమిత్తం ఇంటికి తాళం వేసి కర్నూలుకు శనివారం వెళ్లారు. మంగళవారం రాత్రి బాష ఇంటి తాళాలు పగులగొట్టి నా లుగు తులాల బంగా రం, 5 తులాల వెండి, రూ. 54 వేల నగదు, ఫారిన్ వాచ్ లు, సెల్ ఫోన్‌లు చోరీ చే శారు. అదేవీధిలో అబ్దు ల్ మా ళిక్ ఇంటికి తా ళం వేసి వెళ్లగా దొం గలు తా ళం పగులగొ ట్టి ఇం ట్లో వున్న బీరువాలో విలువైన వస్తువులు లేకపోవడంతో చోరీ జరగలేదు. ఎస్‌ఐ కృష్ణ య్య కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు.
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
ఆత్మకూరు రూరల్, నవంబర్ 14: నాటుసారకు స్థావరమైన సిద్దాపురం గ్రామంలో బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీరాములు ఆదేశాల మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ హనుమంతరావు ఆధ్వర్యంలో 7 టీంలు 18 వేల లీటర్లకూ పైగా బెల్లం ఊటాను ద్వం సం చేశారు. ఈదాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రారంభం సరే.. నిర్వహణే సమస్య!
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>