(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
జిల్లా బిగ్‌బాస్‌గా అన్నీ తానై తెలుగుదేశం పార్టీని నడిపించిన ఎర్రన్నాయుడు హఠాన్మరణం తర్వాత పార్టీని ముందుకు నడిపించేది ఎవరు? ఆయన బలాన్నీ మళ్లీ ఎవరు ప్రదర్శిస్తారు? ఆయన పోరాటపటిమ ఎవరికి వస్తుంది? పేదోడి పనులు చేసిపెట్టే నేతగా ఎవరు ఎదుగుతారు? జిల్లా ప్రజల సమస్యలు స్వీకరించే ప్రజాసదన్ ఎవరు నడుపుతారు? ఆయన స్థానాన్ని భర్తీ చేయడం సాధ్యమేనా? అంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల నుంచి కార్యకర్తల వరకూ అందరిలో తలెత్తే ప్రశ్నలు. అయితే - ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకనుంది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జవాబు ఇచ్చేందుకు సన్నద్ధంగానే ఉన్నారు. బాబు పాదయాత్ర ముగింపు నిమ్మాడలో నిర్వహించి అక్కడ ఎర్రన్న ఘాట్ ఏర్పాటు చేయడం, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిననంతరం కింజరాపు తనయుడు రామ్మోహననాయుడుకు పార్టీ క్రీయాశీలక సభ్యత్వాన్ని అందించడంతో ఎర్రన్న వారసుడుని పార్టీలోకి తీసుకువచ్చేలా ప్రణాళికను పార్టీ పెద్దలు ఇప్పటికే ఆ కుటుంబ సభ్యుల వద్ద ప్రస్తావన చేయడం జరిగింది. జిల్లాఅంతటా ఎర్రన్న దుర్మరణం తర్వాత జరిగిన సంస్మరణసభల్లో పార్టీ పెద్దలంతా ఎర్రన్న కుటుంబాన్ని బాసటగా నిలుస్తామని చెప్పే మాటలు, పార్టీ అధినాయకత్వం రచిస్తున్న వ్యూహాం వెరసి కింజరాపు వారసుడుగా రామ్మోహన్‌నాయుడు పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఒకవైపు పార్టీలో ఇప్పటికే ఎర్రన్న వారుసుడు రామ్మోహన్‌నాయుడు అన్న ప్రచారం ఊపందుకోగా, మరోవైపు కుటుంబంలో దీనిపై చర్చ జరగాలంటూ సభ్యులంతా పట్టుపట్టారు. బుధవారం నిమ్మాడలో ఎర్రన్న పెద్దకర్మ నిర్వహించిన కుటుంబసభ్యులు గురువారం కాశీ, రామేశ్వరం వెళ్తున్నారు. అక్కడ క్రతువులన్నీ పూర్తి చేసుకుని వచ్చాక నిమ్మాడ ప్రజల సమక్షంలో తమ వశుదైకకుటుంబంలో రామ్మోహననాయుడు రాజకీయాల్లో అడుగుపెట్టాలా? వద్దా?? అన్న అంశంపై చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తండ్రి ఎర్రన్న ఉన్నన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉండడంతో జిల్లా రాజకీయ నేపధ్యం తెలుసుకునే పని రామ్మోహననాయుడికి కలుగలేదు. అయితే, మాజీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్న కొడుకును దిశానిర్దేశం చేసేందుకు తన పూర్తి జీవితం పనిచేస్తానంటూ అభయం ఇస్తున్నారు. అచ్చెన్నాయుడు కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా పదవీబాధ్యతలు చేపట్టినప్పటికీ, అన్న ఎర్రనే్న రాజకీయ వ్యవహారాలన్నీ చూసుకోవడంతో అచ్చెన్న జిల్లా దేశం రాజకీయాల్లో వేలుకూడా పెట్టే పరిస్థితి లేకపోయింది. ఎర్రన్న హఠాన్మరణంతో పార్టీలోనే కాకుండా, కింజరాపు కుటుంబంలో కూడా రాజకీయంగా పెద్ద అగాథం ఏర్పడింది. దీంతో తక్షణమే ఆయన స్థానాన్ని భర్తీ చేయాలంటూ అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయానికి రాష్టమ్రంతటా ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ విషయాన్ని బుధవారం నిమ్మాడలో జరిగిన ఎర్రన్న దశదిన కర్మకు వచ్చిన పార్టీ పెద్దలంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయడమే! పార్టీ పెద్దలు, ఎర్రన్న కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా జిల్లా పార్టీ నేతలంతా ఏకాభిప్రాయంతో ఎర్రన్నానాయుడు కుటుంబానికి అండగా నిలవాలన్నదే తుది నిర్ణయం.
కిక్కిరిసిన నిమ్మాడ
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, నవంబర్ 14: సిక్కోల్ ముద్దు బిడ్డ ఎర్రన్నాయుడు హఠాన్మరణం జిల్లా వాసులను విషాదంతో నింపేసింది. చివరిసారిగా తన స్వగ్రామమైన నిమ్మాడలో జననేత దశదిన కర్మలో పాల్గొనేందుకు అశేష జనవాహిని తరలివచ్చారు. బుధవారం హిందూ సాంప్రదాయ ప్రకారం పెద్దకర్మ నిర్వహణలో పాల్గొన్న లక్షలాది జనంతో సొంత గడ్డ అయిన నిమ్మాడ జనసంద్రంగా మారింది. ఏ దారి చూసినా నిమ్మాడవైపే అన్నరీతిలో ఎర్రన్న అభిమానులు బారులుతీరారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ ప్రత్యేకంగా హాజరుకాగా, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఇతర ముఖ్యనేతలు ఎర్రన్న దశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోదరులు హరిప్రసాదర్, ప్రభాకరరావు, అచ్చెన్నాయుడులు దివంగత నేత ఎర్రన్నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆ విగ్రహానికి బాలయ్య, లోకేష్ నామా నాగేశ్వరరావులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా డిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చిన వందలాది మంది ఎర్రన్న అభిమానులు, సహా రాజకీయ నేతలు ఆయన ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. నిమ్మాడలో ఎర్రన్న సతీమణి విజయకుమారి, కుమార్తె భవానీలను జిల్లా ప్రజలతోపాటు రాజకీయ నేతలు కూడా ఆమెను ఓదార్చారు. రామ్మోహన్‌నాయుడు తండ్రి దశదిన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లాలో రెడ్ అలర్ట్
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, నవంబర్ 14: ఒడిశాలో పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుని ఐదుగురు మావోలు మృతిచెందడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఒక్కసారి అప్రమత్తమైంది. జిల్లా అంతటా రెడ్‌అలర్ట్ ప్రకటించి వాహనతనిఖీలు ముమ్మరం చేసింది. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెంచి సోదాలు సాగిస్తున్నారు. ఒడిశా సరిహద్దు మండలాలతోపాటు ఉద్దానంలో పలు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా మోహనాసమితి పరిధిలో బిల్లాగూడ వద్ద ప్రత్యేక పోలీసుబలగాలు, జిల్లా పోలీసు స్వచ్చంధ దళాలు గత కొద్దిరోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం పోలీసులు, మావోల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోలు అక్కడికక్కడే మృతిచెందారు. కాల్పుల్లో మృతిచెందిన మావోలు సవ్యశాచి పండా దళానికి చెందిన వారిగా భోగట్టా. ఈ ఘటనలో సవ్యశాచి పండా కూడా తీవ్రంగా గాయపడి తప్పించుకున్నారు. గత కొన్ని నెలల కిందట చత్తీష్‌ఘడ్, ఆంధ్రా-ఒడిశా ప్రాంత మావోల మధ్య విభేదాలు నెలకొల్పడం, మహిళా మావోలపై అసభ్యకరంగా ప్రవర్తించాడని (మిగతా 2వ పేజీలో)
వంశధార దళం నుంచి పండాను బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో మావోల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటువంటి తరుణంలో ఎదురుకాల్పుల్లో ఒకేసారి ఐదుగురు మావోలు ప్రాణాలు కోల్పోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దళనాయకుడు పండా గతంలో గుమాసూరా, వంశధార దళాలలో పనిచేశాడు. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన ఐదుగురు మావోల మృతదేహాలను బరంపూర్ ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు గజపతి జిల్లా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆనందోత్సహాలతో దీపావళి
శ్రీకాకుళం(కల్చరల్), నవంబర్ 14: అందరి జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలగాలని కోరుతూ జిల్లా ప్రజలు దీపావళి పర్వదినాన్ని మంగళవారం ఆనందోత్సవాలతో జరుపుకొన్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలను ముందురోజు నుండే ఏర్పాటుచేసి ఇంటిని అలంకరించారు. ఆధ్యాత్మికతను నింపాలని..అందరి హృదయాల్లో ఆనందం వెల్లువిరియాలని పలువురు దేవాలయాలకు వెళ్లి లక్ష్మీదేవికి పూజలు చేశారు. సాయంత్రం ఇంటిముందు రంగులముగ్గులతో దీపాలప్రమిదలతో ఇంటిలో రంగవల్లిని వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ పూజలు చేసి అనంతరం టపాసులు, మతాబులు కాల్చారు. చుచ్చిబుడ్డీలను కాల్చి చిన్నారులు ఆనందోత్సవాలతో గడిపారు. ఉత్తర భారత దేశానికి చెందిన స్థానిక వ్యాపారులు తమ దుకాణాలను పూలతో అలంకరించి లక్ష్మీదేవికి పూజలు చేశారు. దుకాణాలకు వచ్చిన ఖాతాదారులకు మిఠాయిలు పంచిపెట్టారు.
‘యువశక్తి ముందుకు రావాలి’
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, నవంబర్ 14: జిల్లా అభివృద్ధికి యువశక్తి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక నెహ్రూ యువకేంద్ర ఆవరణలోని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. నవ సమాజ నిర్మాణానికి యువత కీలక పాత్ర వహించాలన్నారు. గ్రామాల్లో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వాటన్నింటి నిర్వహణ బాధ్యత యువతకు అప్పగిస్తున్నామని, వాటిని సమర్ధవంతంగా నిర్వహించి జిల్లాను ఆదర్శంగా నిలపాలన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్రం జిల్లా సమన్వయ కర్త డి.అప్పారావు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆదిత్యుని సన్నిధిలో
కేంద్ర మంత్రి కృపారాణి
శ్రీకాకుళం(కల్చరల్), నవంబర్ 14: కేంద్ర ఐ.టి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి కిల్లి కృపారాణి బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా అరసవల్లి ఆదిత్యున్ని దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి, ముఖ్య కార్యనిర్వాహణాధికారి ప్రసాద్‌పట్నాయిక్, అర్చకులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నిర్వహణలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అనివేటి మండపంలో ఆమెతోపాటు కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు పలికి తీర్ధప్రసాదాలు అందించారు. పట్టువస్త్రాలను కానుకగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు కోణార్క్ సూరిబాబు, తెలుగు సూర్యనారాయణ, ఇఒ ప్రసాద్‌పట్నాయిక్‌లు శ్రీ సూర్యనారాయణస్వామి నిజ, అలంకార స్వరూప ఆదిత్యుని చిత్రాన్ని అందించారు. ఆమెతోపాటు పురపాలక సంఘం మాజీ అధ్యక్షురాలు ఎం.వి.పద్మావతి, మాజీ ఎంపిటిసి మూకళ్ల సుగుణ, కిల్లి రామ్మోహనరావు, బట్ల శ్రీరామమూర్తి, శంకరశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
వికలాంగుల క్రీడలు ప్రారంభం
శ్రీకాకుళం (రూరల్), నవంబర్ 14: వికలాంగత మనసులోనే ఉంటుందని, వారు సాధించలేనిది ఏదీ లేదని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. 53వ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కోడిరామ్మూర్తి స్టేడియం వద్ద నిర్వహించిన వికలాంగుల క్రీడల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగుల పిల్లలకు ఆటల్లోను, చదువుల్లోను కావలసిన ఏర్పాట్లు సక్రమంగా చేయాలని అధికారులకు సూచించారు. క్రీడాకారులకు భోజనసౌకర్యంతో పాటు బహుమతులను అందజేయడానికి కోనేరు ప్రసాద్ ట్రస్టు తరుపున ట్రైమాక్స్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం ట్రై సైకిళ్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎజెసి రాజ్‌కుమార్, డిఆర్‌డిఎ పిడి రజనీకాంతారావు, ట్రైమాక్స్ సంస్థ వైస్‌ప్రెసిడెంట్ ఆర్జిల్‌భగ్చి, డిఎస్‌డివో ఎల్.దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.
దళారులను నమ్మకండి
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 14: దళారీలను నమ్మి పోసపోకుండా రైతులు సహకార బ్యాంకు సేవలు పొందాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు ఎస్.వి.రమణ కోరారు. బుధవారం స్థానిక బ్యాంకు కార్యాలయ ఆవరణలో 59వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడంతో పాటు, ఎరువులు, విత్తనాలు వంటి వాటికి సైతం రుణాలు అందిస్తున్నామన్నారు. రైతులు దళారీలను నమ్మి ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి మోసపోవద్దని హెచ్చరించారు. అంతకుముందు సహకార రంగంలో అందుతున్న సేవలపై సిబ్బందితో కలసి ప్రచారం చేస్తూ సూర్యమహల్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. అక్కడ సిబ్బందితో సహకార రంగంలో రైతులకు, ప్రజలకు ప్రభుత్వ సేవలను అందజేసి బ్యాంకు పట్ల విశ్వాసం చూరగొంటామని ప్రమాణం చేయించారు. అక్కడనుండి బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించి, కార్యాలయంలో సభ నిర్వహించారు. కార్యక్రమంలో డిసిసిబి ఉపాధ్యక్షుడు నర్తునరేంద్రయాదవ్, డిజిఎం జనార్ధన, ఎజిఎం జ్యోతిర్మయి, నాబార్డ్ జిఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
19 నుండి సభ్యత్వ నమోదు
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 14: జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు డిసిసి అధ్యక్షుడు నర్తు నరేంద్ర యాదవ్ తెలిపారు. బుధవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్థానిక వై ఎస్సార్ ఆడిటోరియంలో సభ్వత్య నమోదు కార్యక్రమం శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కోండ్రు మురళీ మోహన్, శత్రుచర్ల విజయరామరాజు హాజరుకానున్నట్లు వెల్లడించారు. గతంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒక పర్యాయం సభ్యత్వ నమోదు ఉండేదని, ప్రస్తుతం మాత్రం ఐదు సంవత్సరాలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సాధారణ , క్రియాశీలక సభ్యత్వాలకు ఐదు రూపాయలు చేశామన్నారు. నియోజకవర్గానికి రెండు లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా నిర్ణయించామని, నియోజకవర్గాన్ని రెండు బ్లాక్‌లుగా తయారుచేసామన్నారు. ప్రతి బ్లాక్, ప్రతి పోలింగ్ స్టేషన్ నుండి 50కు తగ్గకుండా సభ్యత్వ నమోదు జరగాల్సి ఉందన్నారు. కార్యకర్తలు ప్రతి గ్రామంనుండి విధిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శిమ్మ రాజశేఖర్, డి.ఎస్.కె.ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రభుత్వ సాయాన్ని వినియోగించుకోండి
* ఎమ్మెల్యే సత్యవతి
ఆమదాలవలస, నవంబర్ 14: నీలం తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కోరారు. బుధవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద నీలం తుఫాన్ బాధితురాలు బి.అన్నపూర్ణకు చెక్కును పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలను విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం సాయమందించి ఆదుకుంటుందని, అందులో అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. వరిపంట నష్టనివేదికను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గ్రంథి వీర్రాజు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
జిల్లా ప్రగతికి పంచసూత్రాలు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, నవంబర్ 14: జిల్లా ప్రగతికి అవరోధాలుగా ఉన్న అంశాలపై పోరాడాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్.జి.ఒలతో సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్షరాస్యత, ఆరోగ్య అంశాలు, వ్యవస్థ, పారిశుద్ధ్యం, సామాజిక దురాచారాలు అభివృద్ధికి నిరోధకాలుగా ఉన్నాయన్నారు. వీటన్నింటిని అధిగమించేందుకు ఎన్.జి.ఒలు కలసిరావాలని, పక్కా ప్రణాళిక, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళా అక్షరాస్యతా 54 శాతం మాత్రమే ఉందని పేర్కొంటూ మహిళల అక్షరాస్యత రాష్ట్రంలో 22వ స్థానంలో ఉన్నామని, జిల్లా అక్షరాస్యతలో 19వ స్థానంలో ఉన్నామన్నారు. ఏ ఒక్క విద్యార్థి బడి మానేయకుండా చూడాలన్నారు. ఎక్కువగా వలసలు వెళ్లే బృందాలపై దృష్టి సారించి వారి పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగే ప్రసవాల్లో 70 శాతం వరకు సిజేరియన్ ప్రసవాలు ఉన్నట్లు గణాంకాలు ఉన్నాయని, రిమ్స్ వంటి ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు మాత్రమే నమోదవుతున్నాయని చెప్పారు. జిల్లాలో 32 పిహెచ్‌సిలను 24 గంటలు పనిచేసే ఆసుపత్రులుగా మార్చామన్నారు. మార్చి మాసాంతానికి లక్ష వ్యక్తిగత మరుగుదొడ్లు, జూన్‌నాటికి రెండులక్షలు, ఆ తరువాత ప్రతీ వందరోజులకు లక్ష మరుగుదొడ్లను నిర్మించాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎజెసి ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డుమా పి.డి కల్యాణచక్రవర్తి, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, రాజీవ్ విద్యామిషన్ పి.ఒ బి.నగేష్, వయోజన విద్య ఉపసంచాలకులు కె.నాగేశ్వరరావు, డి.ఎం.హెచ్.ఒ ఎం.శారద, డిపిఒ వెంకటేశ్వరరావు, డిఆర్‌డిఏ ఎ.ఒ జగన్నాధంనాయుడు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శంకర్రావు, శ్రీనివాస్, సన్యాసిరావు, రమణమూర్తి, బలరాంనాయుడు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
ఆఠు క్వింటాళ్ళ బిటి పత్తి దగ్ధం
మెంటాడ, నవంబర్ 14 : మండల కేంద్రమైన మెంటాడ సాలివీధికి చెందిన గొరజాన సత్యం ఇంటి డాబాపై ఎండ బెట్టి ఉంచిన బిటి క్రాసింగ్ పత్తి ఆరు క్వింటాళ్లు బుధవారం ఉదయం అగ్నికి ఆహుతయ్యింది. సుమారుగా మూడు లక్షల రూపాయలు వరకు నష్టం వాటిల్లింది. గొరజాన సత్యం గత నాలుగేళ్లగా పత్తిని పండిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల రైతుకు ఆదర్శంగా తీసుకొని పంట పండిస్తున్నారు. పండిన పత్తి కాయనుంచి వేరుచేసి ఎండలో ఆరబెట్టి ఉంచారు. దీపావళి టపాసులు చిన్నపిల్లలు మేడపైన కాల్చడం మూలంగా తుంపర్లు పడి కాలి బూడిదై పోయిందని రైతు సత్యం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అంది వచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో జీర్ణించుకోలేక పోయాడు. నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ సత్యం మండల తహశీల్ధార్ ఆర్ ఎర్నాయుడుకు వినతి పత్రం అందజేశారు.
‘రహదారి పునరుద్ధరణకు కృషి చేస్తా’
గజపతినగరం, నవంబర్ 14 : మండలం పరిధిలో గుడివాడ - దాసరిపేట గ్రామాల మధ్య గల రైల్వే శాఖ అధికారులు మూసి వేసిన రస్తాను తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి పడాల అరుణ బుధవారం పరిశీలించారు. గుడివాడ గ్రామానికి చెందిన పలువురు రైతుల భూములు దాసరిపేట గ్రామం పరిధిలో కలవు. పొలాల్లో పండిన పంటను రైతులు రైల్వే ట్రాక్ మీదుగా గల రస్తాలో స్వగ్రామానికి నిరాటంకంగా చేర్చుకునేవారు. ఇటీవల ఏమైందో ఏమో తెలియదుకాని ట్రాక్ మీదుగా గల రస్తాను రైల్వే శాఖ అధికారులు మూసి వేయడంతో గుడివాడ గ్రామ రైతులు రస్తాలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పొలాల్లో పంటను స్వగ్రామానికి చేర్చుకునేందుకు వీలుగా మూసిన రస్తాను తిరిగి తెరిపించాలని కోరుతూ పలువురు రైతులు ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ మంత్రి పడాల అరుణకు వినతి పత్రాలను అందజేశారు.
అదృష్ట పాఠకులకు బహుమతులు
గజపతినగరం, నవంబర్ 14 : అదృష్టపాఠకులకు బహుమతులు అందజేయనున్నట్లు స్థానిక గ్రంధాలయ అధికారి కెఎస్‌ఎన్ పట్నాయక్ చెప్పారు. 45వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల సందర్బంగా బుధవారం స్థానిక గ్రంధాలయంలో లక్కీడీప్ బాక్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వారోత్సవాలు సందర్బంగా ఈ నెల 14 నుండి 20వ తేది వరకు గ్రంధాలయానికి వచ్చిన వారు తమ పేరు పూర్తి అడ్రస్‌తోపాటు సెల్‌నెంబర్ రాసిన చీటీలను లక్కీడీప్ బాక్సులో వేయాలన్నారు. ముగింపురోజున డ్రా తీసి ఇద్దరు పాఠకులకు బహుమతులు అందజేస్తామన్నారు. అలాగే వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు.
తెలుగు మహా సభలపై విస్తృత ప్రచారం
విజయనగరం(టౌన్), నవంబర్ 14 : తిరుపతిలో డిసెంబర్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహా సభలకు విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య సూచించారు. తెలుగు మహా సభలపై జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన సన్నాహక సమావేశాలపై బుధవారం తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
‘సాంకేతిక విద్యకు ప్రాధాన్యత’
బొబ్బిలి, నవంబర్ 14: సాంకేతిక విద్యకు నానాటికి ప్రాధాన్యత పెరుగుతోందని, విద్యార్థులంతా ఐటిఐలో ఉత్తమమైన శిక్షణ పొందాలని ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు కోరారు. స్థానిక ప్రభుత్వ ఐటిఐలో శిక్షణలు పొందిన 176 మంది వివిధ ట్రేడ్‌లకు సంబందించిన విద్యార్థులకు బుధవారం సర్ట్ఫికెట్లు అందించారు. అనంతరం ఐటిఐ ప్రాంగణం, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పారిశ్రామిక విద్య పట్ల దృష్టిపెడితే మంచి అవకాశాలు లభ్యమవుతాయన్నారు. గ్రోత్ సెంటర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఐటిఐ పూర్తిచేసిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ భవనానికి మంజూరైన 85 లక్షలలో 20 లక్షల రూపాయల నిధులు వెనక్కి మళ్లినట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ నిధులను రప్పించి వీటితో ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం తొమ్మిది ట్రేడ్‌లకు సంబంధించిన విద్యార్థులకు సర్ట్ఫికెట్లు అందించారు. ఇందులో ఫిట్టర్ 39, మిషనిస్టు 22, మెకానికల్ 41, ఎలక్ట్రికల్ 19, మోటార్ మెకానిక్ 12, టర్నర్ 21, వెల్డర్ 15, వైర్‌మెన్స్ 20, తదిర ట్రేడులకు సంబంధించిన విద్యార్థులకు సర్ట్ఫికెట్లు అందించారు. ఈకార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపల్ అప్పలనాయుడుతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
బైపాస్ కాలనీ ముంపు సమస్య పరిష్కరిస్తా
పార్వతీపురం, నవంబర్ 14: బైపాస్ కాలనీ ముంపునకు వరహాలగెడ్డ నుండి పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్టడానికి తగిన కృషి చేస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే ఎస్ జయమణి తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అధికారులతోపాటు పట్టణంలోవివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలువురు సూచనలు పరిగణలోనికి తీసుకుని బైపాస్ కాలనీకి ముంపునుండి విముక్తి కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, మున్సిపల్ ప్రత్యేకాధికారి బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ వరహాలగెడ్డను వేణుగోపాల్ మీదుగా రైల్వే ట్రాక్ వరకు కొంత నీటిని కాలువను తవ్వి అనుసంధానం చేస్తే నీటి ఉద్ధృతి ఇప్పుడుకున్నకాలువ ద్వారా తగ్గడానికి అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ట్రాక్‌కు ఒక పక్క తక్కువగా ఖానాలు ఉండడం వల్ల నీటి ఉద్ధృతి తక్కువగా ప్రవహిస్తున్నందున రెండోపక్క కూడా ఖానాల సంఖ్య పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే వరహాలగెడ్డను నీటి పైనున్న గ్రామాల నుండి రాజీవ్ గృహకల్ప ప్రాంతంలోని కాలువకు కూడా కొంత మళ్లిస్తే బైపాస్‌కు పట్టణానికి ముంపునుండి విముక్తికలుగుతుందని కొందరు సలహాలు ఇచ్చారు. కొత్తకాలువలు తవ్వడానికి భూసేకరణకు తగిన సహకారం అందించేందుకు పట్టణ ప్రముఖులు సహకరించాలని అధికారులు కోరారు.అలాగే మురుగునీటి కాలువలు పరిశుభ్రంగా చేసేటపుడు ఆక్రమణలు తొలగించాల్సి వస్తే ఎవరూ సిఫార్సులు చేసి వాటిని నిలుపుదల చేయవద్దని మరికొందరు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఆర్డీవో జె.వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ బివి రమణ, పార్వతీపురం తహశీల్దారు ఎం.శ్రీనివాసరావు, పట్టణదేశం అధ్యక్షుడు కోలా వెంకటరావు, బి ఎన్ రావు తదితరులు పాల్గొని తగు సూచనలు సలహాలు అందించారు.
‘ప్రజాదరణ ఉన్న నాయకుడు జగన్’
పాచిపెంట, నవంబర్ 14: ప్రజాదరణ ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ జి ప్రశాంత్ అన్నారు. బుధవారం మండలంలోని సరుగుడువలసలో పలు గ్రామాలకు చెందిన 170 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయన్నారు. ఈపథకాలే అతని కుమారుడైన జగన్‌కు శ్రీరామరక్షగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే జగన్ అధికారంలోకి రావల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల నుంచి జగన్‌కు లభిస్తున్న స్పందన చూసి ఓర్వలేక పాలకులు పలు రకాలైన కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా సాలూరు నియోజకవర్గం నాయకులు జి మదుసూధనరావు మాట్లాడుతూ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నార్లవలస, సురగలవలస, గంగన్నదొరవలస, కోనవలస, జీలుగువలస, సీతంపేట, తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం కమిటీ సభ్యుడు గుమ్మ నాగార్జున్, సాలూరు పట్టణ కన్వీనర్ జర్జాపు సూరిబాబు, పాచిపెంట కన్వీనర్ కిర్ల కోటేశ్వరరావు, పార్టీ నాయకులు తెలుగు సోములు, దండి ఈశ్వరరావు, కోట శ్రీనివాసరావు, ఉత్తరావల్లి రామకృష్ణ, శానాపతి కిశోర్ పాల్గొన్నారు.
‘మీ-సేవ’కు అవార్డు
విజయనగరం(టౌన్), నవంబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ సేవ ప్రాజెక్టు అమలులో ఉత్తమ జిల్లాగా విజయనగరం ఎంపికైంది. రెవెన్యూ సేవలను సత్వరం అందించేందుకు ప్రభుత్వం గత ఏడాది మీ సేవా కేంద్రాలను ప్రారంభించింది. ప్రాజెక్టును ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్బంగా తొలివార్షికోత్సవం నిర్వహిస్తూ ఉత్తమంగా నిర్వహిస్తున్న జిల్లాకు రాష్ట్ర సమాచార సాంకేంతిక శాఖ అవార్డులను ప్రకటించింది. హైద్రబాదులో ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌లో ఈనెల 15,16 తేదీల్లో జరిగే ఇండియా సదస్సులో ఈ అవార్డును జాయింట్ కలెక్టర్ పి.ఎ శోభ గురువారం అందుకుంటారు. ఈమేరకు ఐటి శాఖ కార్యదర్శి సంజయ్‌జాజు జిల్లాకు సమాచారం అందించారు. మీసేవా నిర్వహణలో జిల్లాకు అవార్డు రావడం పట్ల కలెక్టర్ వీరబ్రహ్మయ్య హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్‌తోపాటు రెవెన్యూ యంత్రాంగాన్ని, మీసేవా కేంద్రాల నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. అవార్డు రావడం పట్ల జాయింట్ కలెక్టర్ శోభమాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో రికార్డులను ఆన్‌లైన్‌లో పొందుపరచేందుకు అవసరమైన అదనపు సిబ్బందిని, కంప్యూటర్లను అందించడంతో పాటు కలెక్టర్ ఇచ్చిన సూచనలు సలహాలు కారణంగానే అత్యుత్తమంగా నిలిచామన్నారు.
‘బాలల హక్కులను పరిరక్షించాలి’
విజయనగరం (కంటోనె్మంట్), నవంబర్ 14: పిల్లల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఎం.కనకదుర్గ అన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకని జిల్లా న్యాయసేవా సంస్థ, ఆర్డర్ నేచర్ సంస్థ సంయుక్తంగా బుధవారం పట్టణంలో ఎత్తు బ్రిడ్జి వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.ముత్యాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల భద్రత-అందరి బాధ్యత, బాల్యవివాహాలను నిర్మూలిద్దామంటూ నినాదాలతో పట్టణంలో విద్యార్థుల ర్యాలీ జరిగింది. అనంతరం పోలీస్ పెపెరెగ్రౌండ్ వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కనకదుర్గ మాట్లాడుతూ డిఎల్‌ఎస్‌ఎ, చైల్డ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పిల్లల హక్కులు-్భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని మొదటిసారిగా చేపట్టామన్నారు. పిల్లల్ని కేవలం చదువుకునే యంత్రాలగానే చూడవద్దని వారికి మనసు ఉంటుందని వారితో ప్రేమ ఆప్యాయలతో మెలగాలని సూచించారు.జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి కె.నాగమణి మాట్లాడుతూ బాలలు పనిలో కాకుండా పాఠశాలలో చేరి విద్యను అభ్యసించాలన్నారు. తల్లితండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. 2007 విద్యాహక్కు చట్టప్రకారం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం బాలల హక్కులకు సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
గరుగుబిల్లి, నవంబర్ 14: మండల పరిధిలోని ఖడ్గవలస జంక్షన్ సమీపంలో మంగళవారం లారీ, మోటారుసైకిల్ ఢీకొన్న సంఘటనలో ఇరువురు యువకులు మృతిచెందారని ఎస్.ఐ. కింతలి నారాయణరావు తెలిపారు. తోటపల్లి గ్రామానికి వి.నవీన్‌కుమార్(24), ఎన్.అప్పలనాయుడు(20) ఖడ్గవలస జంక్షన్‌కు స్నేహితులను కలిసేందుకు మోటారు సైకిల్‌పై వెళ్లారన్నారు. అనంతరం తోటపల్లి తిరిగివస్తుండగా ఖడ్గవలస గ్రామ సమపంలో రహదారి మలుపు వద్ద మోటారుసైకిల్‌ను లారీ ఢీకొట్టడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం పార్వతీపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి నవీన్‌కుమార్‌ను, ఏరియా ఆసుపత్రికి అప్పలనాయుడును తరలించారన్నారు. అయితే నవీన్‌కుమార్ చికిత్స పొందుతూ సాయంత్రం 5గంటలకు మృతిచెందాడన్నారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అప్పలనాయుడు పరిస్థితి విషమించడంతో విశాఖ కె.జి.హెచ్.కు తరలించారని పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శవపంచనామా చేసి పోస్టుమార్టంకు తరలించామని తెలిపారు.
శోకసంద్రంలో తోటపల్లి
మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇరువురు యువకులు మృతిచెందడంతో గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. అలాగే తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తారన్న నవీన్‌కుమార్, అప్పలనాయుడులు మరలిరాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నవీన్ విశాఖలోని ప్రైవేటు కళాశాలలో ఎం.బి.ఎ చదువుతున్నాడు దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించుకునేందుకు వచ్చిన నవీన్ మృతిచెందడంతో స్నేహితులు దుఖః సాగరంలో మునిగిపోయారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బొబ్బిలి (రూరల్), నవంబర్ 14: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు, బంధువులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం మెట్టవలస గ్రామ సమీపంలో ఉన్న స్టోన్ క్రషర్‌లో ఎం పోలినాయుడు, లక్ష్మిలు ఆరు నెలలుగా కూలి పనిచేస్తున్నారు. వీరు ఇరువురు క్రషర్ వద్దే నివాసం ఉంటున్నారు. పోలినాయుడు మంగళవారం అర్ధ రాత్రి భార్య లక్ష్మి(33)ని పీకనులిపి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు లక్ష్మి పీకకు ఉరుతాడువేసి పెణక్కి కట్టినట్లు ఉంది. గ్రామస్థులు, బంధువులు ఈ ఘటన చూసి పోలినాయుడే హత్య చేసి ఈ విధంగా చిత్రీకరిస్తున్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గరుగుబిల్లి మండలం సీతారాంపురం నుంచి ఆరునెలల క్రితం మెట్టవలసకు వలసవచ్చారు. కాగా పోలినాయుడు మద్యానికి బానిసై తరుచూ భార్యతో ఘర్షణలకు దిగుతుండేవాడు. దాదాపు నెల రోజుల క్రితం పుట్టింటికివెళ్లిపోయిన లక్ష్మిని 15 రోజుల క్రితం పోలినాయుడు తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో లక్ష్మి మృతిచెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మత్తులో భార్యను హత్యచేసి ఉంటాడని లక్ష్మితల్లి లోకమ్మతోపాటు బంధువులు ఆరోపిస్తున్నారు. విఆర్‌ఒ అప్పలనాయుడు ఫిర్యాదు మేరకు సిఐ ఎల్ రాజేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మిది హత్య, ఆత్మహత్య అనే విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తామన్నారు.
‘సహకార సంస్థల బలోపేతానికి చర్యలు’
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 14: జిల్లాలో సహకార సంస్ధలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా సహకారశాఖాధికారి డి.నారాయణరావుకోరారు. జాతీయ సహకార వారోత్సవాలను బుధవారం డిసిసిబి డైరెక్టర్ బి.ఎ.ఎన్.రాజు జెండా ఎగుర వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ జిల్లాలో సహకార బ్యాంకు, సహకార సంఘాల రైతాంగానికి పూర్తిస్థాయిలో సేవలు అందించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేందుకు వ్యాపారాభివృద్ధి కి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. రైత