Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఓటర్ల సవరణలకు 20వరకు గడువు

$
0
0

నెల్లూరు, నవంబర్ 14: ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ -2013లో భాగంగా అభ్యంతరాలకు సంబంధించిన, కొత్తగా చేర్పించుటకు సంబంధించిన దరఖాస్తులు ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఐదుగంటల్లోగా స్థానికంగా ఉండే బూత్ లెవల్ అధికార్లకు అందజేయాలని నెల్లూరు ఆర్డీఓ మాధవీలత సూచించారు. బూత్ లెవల్ అధికార్ల వివరాలు తెలియరాకుంటే తహశీల్దార్ లేక మున్సిపల్ కార్యాలయాల్లోనైనా అందజేయవచ్చన్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీనాటికి 18సంవత్సరాల వయస్సు వచ్చే వారంతా కూడా ఓటు హక్కు పొందేలా అవకాశం ఉందని తెలిపారు. దీనితోపాటు ఓ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటు మార్చాలనుకుంటే ఫారమ్ నెం 6ను వినియోగించాలన్నారు. ఏ పేరైనా జాబితా నుంచి తొలగించాలనుకున్నా, అభ్యంతరాలు తెలపాలన్నా ఫారమ్ నెం 7ను, ఓటరు జాబితాల్లో వివరాల సవరణ కోసం ఫారమ్ నెం 8ను వినియోగించాలన్నారు. ఒకే నియోజకవర్గ పరిధిలో ఉండే ఓటరు పోలింగ్‌బూత్ మార్పు కోసం ఫారమ్ నెం 8ఏను వినియోగించాలని సూచించారు.
ఘనంగా ఆకాశ దీపోత్సవం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, నవంబర్ 14: కార్తీక మాస ఆరంభాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి ఆలయంలో ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కొనసాగిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసంలో దీపం విశేష ఫలానిస్తుందని పురాణాలు చెపుతున్నాయన్నారు. అందువల్ల భక్తులు ఆలయంలో దీపారాధన చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు.కార్తీక మాసం 30రోజులపాటు ప్రతి సాయంత్రం ఈ కార్యక్రమం కొనసాగనుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి వెల్లడించారు.
బొటనవేలు గోటిపై
నెహ్రూ సూక్ష్మచిత్రం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, నవంబర్ 14: నెల్లూరుకు చెందిన ప్రముఖ మైక్రోటిఫ్ చిత్రకారుడు షేక్ అమీర్‌జాన్ తనదైన శైలిలో చేతి బొటనవేలిపై నెహ్రూ చిత్రాన్ని మల్టికలర్‌లో చిత్రించి అందరికీ చూపారు. బుధవారం జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ ప్రత్యేకత చాటుకున్నారు. డాక్టర్ ఎస్‌ఆర్‌కె నెక్స్ట్ జనరేషన్ స్కూల్‌లో డ్రాయింగ్ మాస్టర్‌గా పనిచేస్తున్న అమీర్‌జాన్ ఇంతవరకు పలు మైక్రోటిప్ బొమ్మలు చిత్రించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 రికార్డులను సాధించి ఆ సంస్థ పుస్తకాల్లో తన పేరును నమోదయ్యేలా కృషి చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సును నెల్లూరువాసిగా సాధించాలనేదే తన ఆశయంగా చెప్పారు.

క్యాప్‌లో దీపావళి సంబరాలు
నెల్లూరు అర్బన్, నవంబర్ 12: స్థానిక కొండాయపాళెం గేట్ వద్ద చైల్డ్ అండ్ పోలీస్ ప్రాజెక్టు(క్యాప్) భవన్‌లో మంగళవారం ఉదయం దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బివి రమణకుమార్, ఆయన సతీమణి, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్‌శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి ముఖ్యఅతిథులుగా పాల్గొని అక్కడ చదువుకుంటున్న బోడిగాడితోట పిల్లలతో దాదాపు గంటపాటు ముచ్చటించి వారికి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మి మాట్లాడుతూ శవాల మధ్య దుర్భరజీవితం సాగిస్తున్న బోడిగాడితోట పిల్లను గుర్తించి వారిని పోలీస్ స్కూల్‌లో చేర్పించి విద్యాబుద్ధులు చేర్పిస్తున్న ఎస్‌పి సేవలు అభినందనీయమన్నారు. పిల్లలందరూ సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. పిల్లలకు మంచి విద్యా బోధనలను నేర్పిస్తున్న స్కూల్ ఉపాధ్యాయులను, పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. అనంతరం ఎస్‌పి బోడిగాడితోట పిల్లలతో కలిసి దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలను కాల్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏసి నాగేశ్వరరావు, రాజీవ్ విద్యామిషన్ పిడి కోదండరామిరెడ్డి, సిడబ్ల్యుసి చైర్మన్ శ్రీనివాసరావు, రూరల్ డిఎస్పీ బాల వెంకటేశ్వరరావు, హోంగార్డ్స్, ఏఆర్ డిఎస్పీలు శ్రీనివాస్, శ్రీనివాసరావు, సిఐలు పి వీరాంజనేయరెడ్డి, వెంకట రామారావు, వై జయరాం సుబ్బారెడ్డి, విఎస్ రాంబాబు, శ్రీనివాసులురెడ్డి, కోటారెడ్డి, వెంకటరత్నం, రామారావు, కె వేమారెడ్డి, ఎస్సైలు బి శ్రీనివాసరెడ్డి, మారుతీకృష్ణ, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
బాల హక్కులపై అవగాహన కల్పించండి

నెల్లూరు అర్బన్, నవంబర్ 14: బాలల హక్కులపై పూర్తి అవగాహన కల్పించి వారి పురోభివృద్ధికి తోడ్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక మహిళా ప్రాంగణంలో నిర్వహించిన జిల్లాస్థాయి బాలల దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మాజీ ప్రధాని దివంగత పండిట్ జవహర్‌లాల్ నెహ్రు పుట్టినరోజున బాలల దినోత్సవంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. బడికిపోనీ పిల్లలందరినీ బడిలో చేర్పించి వారికి విలువలతో కూడిన విద్యను అందించి భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలకు చదువుతోపాటు తల్లిదండ్రులను, గురువులను గౌరవించే సంస్కృతిని అలవాటు చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో ఉన్న పిల్లలకు పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందించి ఆరోగ్యవంతులుగా ఉండేటట్లు చేయాలన్నారు. ఈప్రక్రియలో ప్రతి అంగన్‌వాడీ కేంద్రాలలో ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి పిల్లలకు పూర్తిస్థాయిలో ఆరోగ్య సేవా కార్యక్రమాలు అందేలా చూడాలని సూచించారు. ప్రధానంగా ‘మార్పు’ కార్యక్రమంలో అమలు చేయాల్సిన మాతా, శిశు సంక్షరణ కార్యక్రమాలకు సంబంధించిన పనులను పటిష్టంగా అమలు చేసేందుకు గ్రామస్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పుట్టిన బిడ్డకు 0-5 వయస్సు వరకు వ్యాధినిరోదక టీకాలు, ఆహార నియమాలు సక్రమంగా అందజేసి ఆరోగ్యవంతంగా ఉండేటట్లు చూడాలన్నారు. బాల కార్మిక నిర్మూలన వ్యవస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించి బాల కార్మికులను బడిలో చేర్పించి వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం మాట్లాడుతూ ప్రధానంగా బాలల దినోత్సవాన్ని జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజున జరుపుకోవడం శుభపరిణామన్నారు. జిల్లాలో 3,774 అంగన్‌వాడీ కేంద్రాలలో 1.55 లక్షల మంది పిల్లలున్నారని, వారికి పౌష్టికాహారం అందించడంతోపాటు మంచి విద్యను అందిస్తున్నామన్నారు.
మార్పు కార్యక్రమం ద్వారా మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు నిర్దేశించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయుటలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ‘మార్పు’ కార్యక్రమంలో పటిష్టంగా అమలుచేసి దేశంలోని కేరళ, ఢిల్లీ, గోవా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు 2,3వ స్థానాలను పొందాయని తెలిపారు. ఐసిడిఎస్ పిడి విజయలక్ష్మి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పిల్లలు దేశ సంప్రదాయాన్ని తెలియజెప్పే విధంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించారు. అందులో భాగంగా బాల్య వివాహాలపై రాపూరుకు చెందిన పిల్లలు ప్రదర్శించిన గేయ నాటిక అధికారులను, ప్రేక్షకులను ప్రత్యేకంగా హృదయాలను కదిలింపజేసింది. అనంతరం పిల్లలకు వివిధ పోటీల్లో పాల్గొని విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాశిలామణి, స్వచ్చంద సంస్థల అధ్యక్షుడు ఇవిఎస్‌నాయుడు, సిడబ్ల్యుసి చైర్మన్ శ్రీనివాసరావు, మహిళా ప్రాంగణం మేనేజర్ సంతోషి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా నెహ్రూ జయంతి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, నవంబర్ 14: దేశ తొలి ప్రధాని, దివంగత జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నెల్లూరు నగరంలో ఘనంగా చేపట్టారు. బుధవారం స్థానిక మద్రాస్ బస్టాండ్ కూడలి వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌పార్టీ అభిమానులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు తరలివచ్చి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సివి శేషారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ పి చెంచలబాబుయాదవ్, ఇన్‌చార్జి డిసిసి అధ్యక్షులు చాట్ల నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు సిటీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు నీలిశెట్టి చిన్నయ్యగుప్తా నేతృత్వంలో నెహ్రూ జయంతి వేడుకలు చేపట్టారు.

నిద్రపోతున్న
భద్రతా వ్యవస్థ
బిట్రగుంట, నవంబర్ 15: అధికారుల నిర్లక్ష్యనికి రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. టిక్కెట్ తీసుకుని ప్రయాణించే వారికి ప్రశాంతంగా గమ్యస్థానికి చేరుతామని నమ్మకం పోయింది. ఒక్క పక్క రైలు ప్రమాదాలు, మరో పక్క దోపిడులు జరుగుతుండంతోప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. గమ్యం చేరేలోపు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సివస్తుందోనని భీతిల్లుతున్నారు. రైల్వేశాఖలో అన్ని విభాగాల్లో పోస్టులు భర్తీ చేయక పోవడం ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు. రైల్వే భ్రద్రత వ్యవస్థలో తనిఖీలు జరగటంలేదు. జిఆర్ పోలీసులు ఉన్నా పేరుకు ముఖ్యమైన స్టేషన్లులో ఓకరు లేక ఇద్దరు ఉంటున్నారు. వారు కూడా రైలు పట్టాలపై శవాలకోసం వెళ్తే ఫ్లాట్ ఫారాంల పై నిఘా ఉండదు. పెరిగిన రైళ్ల సంఖ్యకు తగ్గట్టు రైల్వే రక్షణ శాఖలో సిబ్బందిని పెంచక పోవడం నామమాత్రంగా బందోబస్తు ఏర్పాటు చేయడం ప్రయాణికులకు ఆటుపోట్లు తప్పడం లేదు. రైళ్ళలో టిక్కెట్ లేనివారిని గుర్తించేందుకు గతంలో టిక్కెట్ కలెక్టర్లు తరచూ తనిఖీలు చేసేవారు. ఆ పోస్టులు కుదించడం వల్ల టిటిలు స్లీపర్‌కోచ్‌లకే పరిమితం అవుతున్నారు. అప్పుడప్పుడు విజయవాడ, విశాఖపట్నం వంటి పెద్ద స్టేషన్లలో మాత్రమే తనిఖీలు చేపడుతున్నారు. స్లీపర్‌కోచ్‌లో చార్ట్ ప్రకారం భర్తీకాని బెర్త్‌లను టిటిలు అవకాశానికితగ్గుట్టు అమ్మకానికి పెడుతున్నారు. కొంతమందిని వద్ద డబ్బు తీసుకుని వారిని అనధికారికంగా స్లీపర్‌కోచ్‌ల్లోకి అనుమతిస్తున్నారు. స్లీపర్ కోచ్‌ల్లోనూ యాచకులు వస్తున్నారు. జనరల్ బోగీ అయితే చెప్పనవసరం లేదు. ఎవరు ఎక్కుతారో ఎవరు దిగుతారో లెక్కఉండదు. చెన్నై- విజయవాడ - విశాఖపట్టణం - సికింద్రబాద్- విజయవాడ - రేణిగుంట సెక్షన్‌లో హిజ్రాల బెదిరింపులు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు అంటున్నారు. వారు మాములగా యచకత్వం చేసుకుంటే ఎవరికి బాధ ఉండదు. వారు అడిగినప్పుడు నగదు ఇవ్వక పోతే ప్రయాణికులపై దాడికి పాల్పడుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. దానికి అదివారం పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో 16మంది ప్రయాణికులను బెదిరించిన సంఘటన నిదర్శనం. రిజర్వేషన్ చేయించుకుని వెయిటింగ్ లిస్టు ఉన్న వారిని స్లీపర్ కోచ్‌లోఎక్కకూడదని నిబంధనలు పెడుతుంటే టిక్కెటు లేని ఆసాంఘిక శక్తులను గుర్తించక పోవడం బాధకరం. గతంలో నిఘా వ్యవస్థకు కొంతమేరకు పటిష్ఠంగా నేడు రైల్వే శాఖలో నిఘా కొరవడం వల్ల దోపిడి దొంగలు ఇష్ఠారాజ్యంగా తిరుగుతున్నారు. రైళ్ళలలో పేలుడు పదార్థాలు రవాణా సాఫీగా జరుగుతున్నట్లు కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడుతున్నాయి. ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం యుజర్స్ కమిటీలు ఉన్నా అవి నామమాత్రంగా పనిచేయడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు.

సోమశిల జలాల కేటాయింపుల్లో
బడా మోసం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, అక్టోబర్ 14: సోమశిల జలాశయం నుంచి సాగునీటి కేటాయింపులపరంగా భారీ మోసమే జరుగుతోంది. జిల్లా రైతాంగానికి వరప్రసాదినిగా భావించే సోమశిల నుంచి నాన్ డెల్టా రైతాంగాన్ని పక్కన పెట్టి డెల్టాకు ప్రాధాన్యత కనబరుస్తున్న పాలకుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఏటా జిల్లా స్థాయి ఐఎబి (ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు) తీర్మానం అనుసరించి మాత్రమే కేటాయింపులు కొనసాగుతుండటం పరిపాటి. ఈ తీర్మానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి అటు నుంచి ఆమోద ముద్ర లభించిన తరువాత మాత్రమే నీటి విడుదలకు శ్రీకారం చుడతారు. సరిగ్గా నెలక్రితం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన ఐఎబి సమావేశాన్ని నిర్వహించారు. అయితే జిల్లామొత్తానికి అవసరమయ్యే నీటి నిల్వ లేనందున, మరో నెలరోజుల తరువాత మళ్లీ ఐఎబి సమావేశం చేపడదామని, ఆ లోగా వర్షాలు కురిసే అవకాశాలున్నందున అప్పటి గణాంకాల ప్రకారం కేటాయింపులు జరుపుకోవచ్చని భావించారు. ఇటీవల నీలం తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలతో నెలరోజుల క్రితం పరిస్థితిని పోలిస్తే నీటి నిల్వల్లో ఓ మోస్తరు మార్పులే వచ్చాయి. కాగా, నెలరోజుల తరువాత మళ్లీ గురువారం సమావేశమవుతుండగా ఇప్పటికే డెల్టాలో నీటి విడుదల కొనసాగుతుండటం అనేక ఆరోపణలకు తావిస్తోంది. ఐఎబి సమావేశం, దాని తీర్మానం వంటి ఊసే లేకుండా కొనసాగుతున్న ఈ కేటాయింపులు మొత్తం వ్యవస్థనే వెక్కిరిస్తున్నాయి. కాగా, నాన్ డెల్టా ప్రాంతం ఎక్కువ భాగం జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోనే అధికం. ఈ నియోజకవర్గానికి సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత రైతాంగం పట్ల ఇలా వివక్ష చోటుచేసుకోవడం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రెండురోజుల క్రితం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున మాజీ ఎంఎల్‌ఏ, మాజీ ఎంఎల్‌సి, ఇతర నాయకులు 16 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి సోమశిల డ్యామ్ వద్ద తమ నిరసన వెలిబుచ్చారు. అయితే మరో వైపున డెల్టా వరకు నీటి విడుదల కొనసాగుతుండటం గమనార్హం. ముందుగానే సగటుకంటే చాలా తక్కువగా నమోదైన వర్షపాతంతో నాన్ డెల్టాలో ఇబ్బందులు ఎదురవుతుంటే దీనికితోడు సోమశిల జలాలు కూడా పొందే భాగ్యం ఏపాటి అంటూ రైతాంగం తీవ్ర మనస్థాపం చెందుతున్నారు.
-ళనఆ

థీపావళి శోభతో ప్రకాశించిన నగరం
నెల్లూరు కల్చరల్, నవంబర్ 14: దివ్వెల పండుగ దీపావళిని నగర ప్రజలు మంగళవారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. దీపావళి రాత్రి దీపాల కాంతులతో నగరం శోభాయమానంగా ప్రకాశించింది. ఈసందర్భంగా ఇళ్ల ముంగిళ్లు, వ్యాపార సంస్థలను మామిడి తోరణాలు, పుష్ప తోరణాలు, దీపాలతో ముస్తాబు చేశారు. ఈసందర్భంగా ఇంటి యజమానులకు శుభాలు జరగాలని ఆశీర్వదిస్తూ మంగళ వాయిద్యాలతో మేళగాళ్లు ఉదయంనుండి సాయంత్రం వరకు తిరుగుతూ యజమానులు ఇచ్చే కానుకలు స్వీకరించారు. నరక చతుర్థశితో మొదలైన టపాకాయల శబ్దాలు మంగళవారం రాత్రి నగరంలో హోరెత్తాయి. అధిక ధరలతో టపాకాయలు అందుబాటులో లేవని అందరూ అనుకున్నా ఎవరి తాహతుకు తగ్గట్టు వారు టపాసులు కొనుగోలు చేసి తమ పిల్లలతోపాటు తాము కాల్చి మరీ ఆనందించారు. దీపావళి సందర్భంగా మార్వాడీలు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేసి తమ బంధు మిత్రులకు మిఠాయిలు పంచిపెట్టారు. నగరంలోని పలు దేవాలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. దర్గామిట్టలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, ఇరుకళల పరమేశ్వరి, కన్యకాపరమేశ్వరి, మూలస్థానేశ్వరదేవస్థానంతోపాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ రోజైనా మార్వాడీలు తమ దుకాణాలను తెరచి ఉంచి షాపుల వద్దే టపాసులు కాల్చడం విశేషం. దీపావళి సందర్భంగా విఆర్‌సి మైదానం, ఆర్‌ఎస్‌ఆర్, వైఎంసిఏ మైదానాల్లో ఏర్పాటుచేసిన టపాసుల దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసాయి.

పేద కళాకారులకు బియ్యం పంపిణీ
నెల్లూరు కల్చరల్, నవంబర్ 14: పవిత్ర చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రామలింగాపురంలోని పాత ఆర్టీఏ కార్యాయలంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పేద కళాకారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈసందర్భంగా వ్యాపార వేత్త అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పవిత్ర ఆధ్వర్యంలో పేద కళాకారులకు పింఛన్లు, బియ్యం పంపిణీ, ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా ఎస్‌బికెఆర్ విద్యానగర్ ఇంజనీరింగ్ విద్యార్థినికి కాలేయం మార్పిడి వైద్య ఖర్చుల కోసం 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈకార్యక్రమంలో పవిత్ర అధ్యక్షులు గాలి కిరణ్‌కుమార్, రాష్టబ్రిసి సంఘం ఉపాధ్యక్షులు దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్, ఆర్‌వి రాఘవ నాయుడు, డేగా రామచంద్రారెడ్డి, వాస్తు రామచంద్రరావు, సత్యనారాయణ, శ్రీనివాసులురెడ్డి, హరినాథరెడ్డి, ఎస్‌కె బాబు, అందె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మద్యం దుకాణంతో మహిళలు ఆందోళన
నెల్లూరు కల్చరల్, నవంబర్ 14: స్థానిక ములుమూడి బస్టాండ్ సెంటర్‌లోని మద్యం దుకాణం వల్ల ఆ ప్రాంతంలోని మహిళలు తిరిగేందుకు భయపడుతున్నారని బిజెపి జిల్లా కార్యదర్శి మిడతల రమేష్, కప్పిర శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరుకు బుధవారం వారు ఇన్‌చార్జ్ పర్యవేక్షణాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ దుకాణం వద్దే మద్యం తాగే సౌకర్యం కల్పించడంతో మద్యపాన ప్రియుల వల్ల మహిళలు సెంటర్‌లో స్వేచ్చగా తిరిగేందుకు భయపడుతున్నారన్నారు. ఉదయంనుండి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు కొనుసాగుతుండడంతో మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. స్థానిక మహిళలు దుకాణం వద్ద ఆందోళన నిర్వహించాలని నిర్ణయించి బిజెపి దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కారం కోసం ముందుగా వినతిపత్రం సమర్పించామన్నారు. ప్రజల అసౌకర్యాన్ని, మహిళల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని మహిళలు స్వేచ్చగా తిరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పండిట్ నెహ్రూకు నివాళులు
నెల్లూరు కల్చరల్, నవంబర్ 14: సమాచార హక్కు - సామాజిక పర్యవేక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రాంజీనగర్‌లో భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 123వ జయంతిని ఘనంగా జరపుకున్నారు. ఈసందర్భంగా సమితి గౌరవాధ్యక్షులు వాస్తు రామచంద్రయ్య మాట్లాడుతూ 17 సంవత్సరాలపాటు ప్రధానిగా ఉన్న నెహ్రూ ప్రపంచ శాంతి కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. పంచశీల, పంచవర్ష ప్రణాళికల ద్వారా నాగార్జున సాగర్ వంటి పెద్దపెద్ద ప్రాజెక్టులు నిర్మించారన్నారు. ఈకార్యక్రమంలో చెంచయ్య, చల్లా యానాదయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల సవరణలకు 20వరకు గడువు
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>