Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆఠు క్వింటాళ్ళ బిటి పత్తి దగ్ధం

$
0
0

మెంటాడ, నవంబర్ 14 : మండల కేంద్రమైన మెంటాడ సాలివీధికి చెందిన గొరజాన సత్యం ఇంటి డాబాపై ఎండ బెట్టి ఉంచిన బిటి క్రాసింగ్ పత్తి ఆరు క్వింటాళ్లు బుధవారం ఉదయం అగ్నికి ఆహుతయ్యింది. సుమారుగా మూడు లక్షల రూపాయలు వరకు నష్టం వాటిల్లింది. గొరజాన సత్యం గత నాలుగేళ్లగా పత్తిని పండిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల రైతుకు ఆదర్శంగా తీసుకొని పంట పండిస్తున్నారు. పండిన పత్తి కాయనుంచి వేరుచేసి ఎండలో ఆరబెట్టి ఉంచారు. దీపావళి టపాసులు చిన్నపిల్లలు మేడపైన కాల్చడం మూలంగా తుంపర్లు పడి కాలి బూడిదై పోయిందని రైతు సత్యం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అంది వచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో జీర్ణించుకోలేక పోయాడు. నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ సత్యం మండల తహశీల్ధార్ ఆర్ ఎర్నాయుడుకు వినతి పత్రం అందజేశారు.
‘రహదారి పునరుద్ధరణకు కృషి చేస్తా’
గజపతినగరం, నవంబర్ 14 : మండలం పరిధిలో గుడివాడ - దాసరిపేట గ్రామాల మధ్య గల రైల్వే శాఖ అధికారులు మూసి వేసిన రస్తాను తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి పడాల అరుణ బుధవారం పరిశీలించారు. గుడివాడ గ్రామానికి చెందిన పలువురు రైతుల భూములు దాసరిపేట గ్రామం పరిధిలో కలవు. పొలాల్లో పండిన పంటను రైతులు రైల్వే ట్రాక్ మీదుగా గల రస్తాలో స్వగ్రామానికి నిరాటంకంగా చేర్చుకునేవారు. ఇటీవల ఏమైందో ఏమో తెలియదుకాని ట్రాక్ మీదుగా గల రస్తాను రైల్వే శాఖ అధికారులు మూసి వేయడంతో గుడివాడ గ్రామ రైతులు రస్తాలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పొలాల్లో పంటను స్వగ్రామానికి చేర్చుకునేందుకు వీలుగా మూసిన రస్తాను తిరిగి తెరిపించాలని కోరుతూ పలువురు రైతులు ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ మంత్రి పడాల అరుణకు వినతి పత్రాలను అందజేశారు.
అదృష్ట పాఠకులకు బహుమతులు
గజపతినగరం, నవంబర్ 14 : అదృష్టపాఠకులకు బహుమతులు అందజేయనున్నట్లు స్థానిక గ్రంధాలయ అధికారి కెఎస్‌ఎన్ పట్నాయక్ చెప్పారు. 45వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల సందర్బంగా బుధవారం స్థానిక గ్రంధాలయంలో లక్కీడీప్ బాక్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వారోత్సవాలు సందర్బంగా ఈ నెల 14 నుండి 20వ తేది వరకు గ్రంధాలయానికి వచ్చిన వారు తమ పేరు పూర్తి అడ్రస్‌తోపాటు సెల్‌నెంబర్ రాసిన చీటీలను లక్కీడీప్ బాక్సులో వేయాలన్నారు. ముగింపురోజున డ్రా తీసి ఇద్దరు పాఠకులకు బహుమతులు అందజేస్తామన్నారు. అలాగే వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు.
తెలుగు మహా సభలపై విస్తృత ప్రచారం
విజయనగరం(టౌన్), నవంబర్ 14 : తిరుపతిలో డిసెంబర్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహా సభలకు విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య సూచించారు. తెలుగు మహా సభలపై జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన సన్నాహక సమావేశాలపై బుధవారం తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
‘సాంకేతిక విద్యకు ప్రాధాన్యత’

బొబ్బిలి, నవంబర్ 14: సాంకేతిక విద్యకు నానాటికి ప్రాధాన్యత పెరుగుతోందని, విద్యార్థులంతా ఐటిఐలో ఉత్తమమైన శిక్షణ పొందాలని ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు కోరారు. స్థానిక ప్రభుత్వ ఐటిఐలో శిక్షణలు పొందిన 176 మంది వివిధ ట్రేడ్‌లకు సంబందించిన విద్యార్థులకు బుధవారం సర్ట్ఫికెట్లు అందించారు. అనంతరం ఐటిఐ ప్రాంగణం, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పారిశ్రామిక విద్య పట్ల దృష్టిపెడితే మంచి అవకాశాలు లభ్యమవుతాయన్నారు. గ్రోత్ సెంటర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఐటిఐ పూర్తిచేసిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ భవనానికి మంజూరైన 85 లక్షలలో 20 లక్షల రూపాయల నిధులు వెనక్కి మళ్లినట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ నిధులను రప్పించి వీటితో ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం తొమ్మిది ట్రేడ్‌లకు సంబంధించిన విద్యార్థులకు సర్ట్ఫికెట్లు అందించారు. ఇందులో ఫిట్టర్ 39, మిషనిస్టు 22, మెకానికల్ 41, ఎలక్ట్రికల్ 19, మోటార్ మెకానిక్ 12, టర్నర్ 21, వెల్డర్ 15, వైర్‌మెన్స్ 20, తదిర ట్రేడులకు సంబంధించిన విద్యార్థులకు సర్ట్ఫికెట్లు అందించారు. ఈకార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపల్ అప్పలనాయుడుతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
బైపాస్ కాలనీ ముంపు సమస్య పరిష్కరిస్తా

పార్వతీపురం, నవంబర్ 14: బైపాస్ కాలనీ ముంపునకు వరహాలగెడ్డ నుండి పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్టడానికి తగిన కృషి చేస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే ఎస్ జయమణి తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అధికారులతోపాటు పట్టణంలోవివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలువురు సూచనలు పరిగణలోనికి తీసుకుని బైపాస్ కాలనీకి ముంపునుండి విముక్తి కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, మున్సిపల్ ప్రత్యేకాధికారి బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ వరహాలగెడ్డను వేణుగోపాల్ మీదుగా రైల్వే ట్రాక్ వరకు కొంత నీటిని కాలువను తవ్వి అనుసంధానం చేస్తే నీటి ఉద్ధృతి ఇప్పుడుకున్నకాలువ ద్వారా తగ్గడానికి అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ట్రాక్‌కు ఒక పక్క తక్కువగా ఖానాలు ఉండడం వల్ల నీటి ఉద్ధృతి తక్కువగా ప్రవహిస్తున్నందున రెండోపక్క కూడా ఖానాల సంఖ్య పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే వరహాలగెడ్డను నీటి పైనున్న గ్రామాల నుండి రాజీవ్ గృహకల్ప ప్రాంతంలోని కాలువకు కూడా కొంత మళ్లిస్తే బైపాస్‌కు పట్టణానికి ముంపునుండి విముక్తికలుగుతుందని కొందరు సలహాలు ఇచ్చారు. కొత్తకాలువలు తవ్వడానికి భూసేకరణకు తగిన సహకారం అందించేందుకు పట్టణ ప్రముఖులు సహకరించాలని అధికారులు కోరారు.అలాగే మురుగునీటి కాలువలు పరిశుభ్రంగా చేసేటపుడు ఆక్రమణలు తొలగించాల్సి వస్తే ఎవరూ సిఫార్సులు చేసి వాటిని నిలుపుదల చేయవద్దని మరికొందరు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఆర్డీవో జె.వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ బివి రమణ, పార్వతీపురం తహశీల్దారు ఎం.శ్రీనివాసరావు, పట్టణదేశం అధ్యక్షుడు కోలా వెంకటరావు, బి ఎన్ రావు తదితరులు పాల్గొని తగు సూచనలు సలహాలు అందించారు.

‘ప్రజాదరణ ఉన్న నాయకుడు జగన్’
పాచిపెంట, నవంబర్ 14: ప్రజాదరణ ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ జి ప్రశాంత్ అన్నారు. బుధవారం మండలంలోని సరుగుడువలసలో పలు గ్రామాలకు చెందిన 170 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయన్నారు. ఈపథకాలే అతని కుమారుడైన జగన్‌కు శ్రీరామరక్షగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే జగన్ అధికారంలోకి రావల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల నుంచి జగన్‌కు లభిస్తున్న స్పందన చూసి ఓర్వలేక పాలకులు పలు రకాలైన కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా సాలూరు నియోజకవర్గం నాయకులు జి మదుసూధనరావు మాట్లాడుతూ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నార్లవలస, సురగలవలస, గంగన్నదొరవలస, కోనవలస, జీలుగువలస, సీతంపేట, తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం కమిటీ సభ్యుడు గుమ్మ నాగార్జున్, సాలూరు పట్టణ కన్వీనర్ జర్జాపు సూరిబాబు, పాచిపెంట కన్వీనర్ కిర్ల కోటేశ్వరరావు, పార్టీ నాయకులు తెలుగు సోములు, దండి ఈశ్వరరావు, కోట శ్రీనివాసరావు, ఉత్తరావల్లి రామకృష్ణ, శానాపతి కిశోర్ పాల్గొన్నారు.

‘మీ-సేవ’కు అవార్డు
విజయనగరం(టౌన్), నవంబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ సేవ ప్రాజెక్టు అమలులో ఉత్తమ జిల్లాగా విజయనగరం ఎంపికైంది. రెవెన్యూ సేవలను సత్వరం అందించేందుకు ప్రభుత్వం గత ఏడాది మీ సేవా కేంద్రాలను ప్రారంభించింది. ప్రాజెక్టును ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్బంగా తొలివార్షికోత్సవం నిర్వహిస్తూ ఉత్తమంగా నిర్వహిస్తున్న జిల్లాకు రాష్ట్ర సమాచార సాంకేంతిక శాఖ అవార్డులను ప్రకటించింది. హైద్రబాదులో ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌లో ఈనెల 15,16 తేదీల్లో జరిగే ఇండియా సదస్సులో ఈ అవార్డును జాయింట్ కలెక్టర్ పి.ఎ శోభ గురువారం అందుకుంటారు. ఈమేరకు ఐటి శాఖ కార్యదర్శి సంజయ్‌జాజు జిల్లాకు సమాచారం అందించారు. మీసేవా నిర్వహణలో జిల్లాకు అవార్డు రావడం పట్ల కలెక్టర్ వీరబ్రహ్మయ్య హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్‌తోపాటు రెవెన్యూ యంత్రాంగాన్ని, మీసేవా కేంద్రాల నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. అవార్డు రావడం పట్ల జాయింట్ కలెక్టర్ శోభమాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో రికార్డులను ఆన్‌లైన్‌లో పొందుపరచేందుకు అవసరమైన అదనపు సిబ్బందిని, కంప్యూటర్లను అందించడంతో పాటు కలెక్టర్ ఇచ్చిన సూచనలు సలహాలు కారణంగానే అత్యుత్తమంగా నిలిచామన్నారు.
‘బాలల హక్కులను పరిరక్షించాలి’
విజయనగరం (కంటోనె్మంట్), నవంబర్ 14: పిల్లల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఎం.కనకదుర్గ అన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకని జిల్లా న్యాయసేవా సంస్థ, ఆర్డర్ నేచర్ సంస్థ సంయుక్తంగా బుధవారం పట్టణంలో ఎత్తు బ్రిడ్జి వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.ముత్యాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల భద్రత-అందరి బాధ్యత, బాల్యవివాహాలను నిర్మూలిద్దామంటూ నినాదాలతో పట్టణంలో విద్యార్థుల ర్యాలీ జరిగింది. అనంతరం పోలీస్ పెపెరెగ్రౌండ్ వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కనకదుర్గ మాట్లాడుతూ డిఎల్‌ఎస్‌ఎ, చైల్డ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పిల్లల హక్కులు-్భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని మొదటిసారిగా చేపట్టామన్నారు. పిల్లల్ని కేవలం చదువుకునే యంత్రాలగానే చూడవద్దని వారికి మనసు ఉంటుందని వారితో ప్రేమ ఆప్యాయలతో మెలగాలని సూచించారు.జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి కె.నాగమణి మాట్లాడుతూ బాలలు పనిలో కాకుండా పాఠశాలలో చేరి విద్యను అభ్యసించాలన్నారు. తల్లితండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. 2007 విద్యాహక్కు చట్టప్రకారం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం బాలల హక్కులకు సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
గరుగుబిల్లి, నవంబర్ 14: మండల పరిధిలోని ఖడ్గవలస జంక్షన్ సమీపంలో మంగళవారం లారీ, మోటారుసైకిల్ ఢీకొన్న సంఘటనలో ఇరువురు యువకులు మృతిచెందారని ఎస్.ఐ. కింతలి నారాయణరావు తెలిపారు. తోటపల్లి గ్రామానికి వి.నవీన్‌కుమార్(24), ఎన్.అప్పలనాయుడు(20) ఖడ్గవలస జంక్షన్‌కు స్నేహితులను కలిసేందుకు మోటారు సైకిల్‌పై వెళ్లారన్నారు. అనంతరం తోటపల్లి తిరిగివస్తుండగా ఖడ్గవలస గ్రామ సమపంలో రహదారి మలుపు వద్ద మోటారుసైకిల్‌ను లారీ ఢీకొట్టడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం పార్వతీపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి నవీన్‌కుమార్‌ను, ఏరియా ఆసుపత్రికి అప్పలనాయుడును తరలించారన్నారు. అయితే నవీన్‌కుమార్ చికిత్స పొందుతూ సాయంత్రం 5గంటలకు మృతిచెందాడన్నారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అప్పలనాయుడు పరిస్థితి విషమించడంతో విశాఖ కె.జి.హెచ్.కు తరలించారని పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శవపంచనామా చేసి పోస్టుమార్టంకు తరలించామని తెలిపారు.
శోకసంద్రంలో తోటపల్లి
మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇరువురు యువకులు మృతిచెందడంతో గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. అలాగే తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తారన్న నవీన్‌కుమార్, అప్పలనాయుడులు మరలిరాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నవీన్ విశాఖలోని ప్రైవేటు కళాశాలలో ఎం.బి.ఎ చదువుతున్నాడు దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించుకునేందుకు వచ్చిన నవీన్ మృతిచెందడంతో స్నేహితులు దుఖః సాగరంలో మునిగిపోయారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బొబ్బిలి (రూరల్), నవంబర్ 14: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు, బంధువులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం మెట్టవలస గ్రామ సమీపంలో ఉన్న స్టోన్ క్రషర్‌లో ఎం పోలినాయుడు, లక్ష్మిలు ఆరు నెలలుగా కూలి పనిచేస్తున్నారు. వీరు ఇరువురు క్రషర్ వద్దే నివాసం ఉంటున్నారు. పోలినాయుడు మంగళవారం అర్ధ రాత్రి భార్య లక్ష్మి(33)ని పీకనులిపి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు లక్ష్మి పీకకు ఉరుతాడువేసి పెణక్కి కట్టినట్లు ఉంది. గ్రామస్థులు, బంధువులు ఈ ఘటన చూసి పోలినాయుడే హత్య చేసి ఈ విధంగా చిత్రీకరిస్తున్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గరుగుబిల్లి మండలం సీతారాంపురం నుంచి ఆరునెలల క్రితం మెట్టవలసకు వలసవచ్చారు. కాగా పోలినాయుడు మద్యానికి బానిసై తరుచూ భార్యతో ఘర్షణలకు దిగుతుండేవాడు. దాదాపు నెల రోజుల క్రితం పుట్టింటికివెళ్లిపోయిన లక్ష్మిని 15 రోజుల క్రితం పోలినాయుడు తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో లక్ష్మి మృతిచెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మత్తులో భార్యను హత్యచేసి ఉంటాడని లక్ష్మితల్లి లోకమ్మతోపాటు బంధువులు ఆరోపిస్తున్నారు. విఆర్‌ఒ అప్పలనాయుడు ఫిర్యాదు మేరకు సిఐ ఎల్ రాజేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మిది హత్య, ఆత్మహత్య అనే విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తామన్నారు.
‘సహకార సంస్థల బలోపేతానికి చర్యలు’
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 14: జిల్లాలో సహకార సంస్ధలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా సహకారశాఖాధికారి డి.నారాయణరావుకోరారు. జాతీయ సహకార వారోత్సవాలను బుధవారం డిసిసిబి డైరెక్టర్ బి.ఎ.ఎన్.రాజు జెండా ఎగుర వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ జిల్లాలో సహకార బ్యాంకు, సహకార సంఘాల రైతాంగానికి పూర్తిస్థాయిలో సేవలు అందించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేందుకు వ్యాపారాభివృద్ధి కి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు.

మండల కేంద్రమైన మెంటాడ సాలివీధికి చెందిన గొరజాన సత్యం ఇంటి డాబాపై ఎండ బెట్టి ఉంచిన బిటి
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>