Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

స్వచ్ఛమైనది పిల్లల ప్రేమ

$
0
0

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 14: చిన్నారుల మధ్య స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత ఎక్కువగా ఉంటుందని, తనకు చిన్నపిల్లవాడి పాత్రలంటే ఎంతో ఇష్టమని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, పద్మభూషణ్ డాక్టర్ కొణిదల చిరంజీవి అన్నారు. బుధవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రాజగోపాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ రంగంలోనే కాదు, సినిమా రంగం నుండి కూడా తనకు పిల్లలతో మమేకమయ్యే అలవాటు ఉందన్నారు. తల్లిదండ్రులు ‘బొమ్మరిల్లు’ సినిమాలో ప్రకాష్‌రాజ్‌లా ఉండకుండా చిన్న పిల్లల మనస్తత్వాన్ని ఎదిగి పెద్దలు మలుచుకోవాలని హితవు పలికారు.
పర్యాటక కేంద్రంగా కూచిపూడి
ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క రాష్ట్రం ప్రసిద్ధిచెందగా ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లాకు చెందిన కూచిపూడి నాట్యం ఎంతో ఆదరణ ఉండవల్సినది అయినప్పటికీ ఆ స్థాయిలో లేదని చిరంజీవి అన్నారు. కూచిపూడిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఎండలో ఉంటే విటమిన్ డి లభ్యం
బాలల దినోత్సవం సందర్భంగా ఉదయం 8గంటలకే చిరంజీవి వస్తారని పాఠశాలల నుండి చిన్నారులను తరలించి స్టేడియంకు తీసుకువచ్చారు. చిరంజీవి 10.45 గంటలకు స్టేడియంకు చేరుకోగా ప్రసంగం మాత్రం 12.10 గంటలకు మొదలుపెట్టారు. దీంతో ఎండలో కూర్చున్న విద్యార్థుల గురించి పట్టించుకున్నవారు లేరు. చిరంజీవి ప్రసంగిస్తూ ముగింపుగా విద్యార్థులకు ఎండ వలన విటమిన్ ‘డి’ లభిస్తుందని పాఠాలు చెప్పి వెళ్ళిపోయారు.
గన్నవరం నుండి భారీ ర్యాలీ
గన్నవరం విమానాశ్రయం నుండి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవిని బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంకు తీసుకువచ్చారు. రామవరప్పాడు రింగ్ నుండి స్టేడియం వరకు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు దేవినేని అవినాష్ బైక్ ర్యాలీని నిర్వహించారు.
పిల్లల జోలికి వస్తే పీక కోస్తా!
పార్లమెంట్ సభ్యులు లగడపాటి
పిల్లల జోలికి వస్తే... పీక కోస్తా.. రచ్చ రచ్చే.. కెవ్వు కేక అంటూ విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ ఆద్యంతం విద్యార్థులను ఉర్రూతలూగించారు. రాజగోపాల్ మాట్లాడుతూ చిరంజీవి 149 సినిమాలు చేశారని, 150వ సినిమా అందరికీ ఇష్టమైన పాత్రలో నటిస్తారన్నారు. అంతకుముందు అధికార భాష సంఘ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి బాలల దినోత్సవ వేడుకల కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి పార్థసారథి మాట్లాడుతూ చిరంజీవి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, అండదండలు లేకపోయినా ఎదిగిన నేత అని కొనియాడారు. అనంతరం విజయవాడ నగర పాలక సంస్థ పాఠశాలలో పని చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను చిరంజీవి సత్కరించారు. నగర ప్రథమ మేయర్ వెంకటేశ్వరరావును శాలువతో చిరు సత్కరించారు. రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్టమ్రంత్రి కొలుసు పార్థసారథి, శాసనమండలి సభ్యులు పాలడుగు వెంకట్రావ్, ఐలాపురం వెంకయ్య, శాసనసభ్యులు మల్లాది విష్ణు, యలమంచిరి రవి, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, దిరిశం పద్మజ్యోతి, మాజీ మంత్రులు దేవినేని రాజశేఖర్, మాజీ లోక్‌సభ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ అజీం, గజల్ శ్రీనివాస్, దేవినేని అవినాష్, మాజీ మేయర్లు మల్లికాబేగం, రత్నబిందు, మాజీ డిప్యూటీ మేయర్లు కడియాల బుచ్చిబాబు, అనె్న ప్రసన్న, సామంతపూడి నరసరాజు, నరహరిశెట్టి నరసింహరావు, పైలా సోమినాయుడు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఘనత వహించిన బోడెమ్మ హోటల్ సెంటర్ ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 14: నగరంలో వీధులకు ఎవరు ఏమి చేశారో తెలియదు కానీ ఓట్ల రాజకీయాలు, కులమత ప్రభావాలు, కౌన్సిల్‌లో ఆధిక్యత లేదా ఇచ్చిపుచ్చుకునే ధోరణులు కావచ్చు పార్టీలకతీతంగా నగరంలోని వీధులన్నింటికీ కొందరు తమవారి పేర్లు పెట్టేసుకున్నారు. స్థలాభావం వల్ల కొనే్నళ్ళుగా కొత్త వీధులు ఏర్పడకపోవడంతో కౌన్సిల్‌లో తీర్మానంతో ఏర్పడిన వీధుల పేర్లను సైతం మళ్ళీ మళ్ళీ మార్చేస్తున్నారు. అయితే నగరవాసులు నేటికీ మరువలేనిది బోడెమ్మ హోటల్ సెంటర్. ఈ పేరు ఏ రాజకీయ నేతో ప్రతిపాదించలేదు. ఆ మహాతల్లి చేసిన సేవల వల్లే నేటికీ వన్‌టౌన్‌లో బోడెమ్మ హోటల్ సెంటర్ చిరస్థాయిగా నిల్చిపోయింది. ఆమె పేరు ఏమిటో ఎవరికీ తెలియదు. బోడెమ్మగానే చెలామణి అయిన దురదృష్టవంతురాలు. నిజానికి ఆ కాలంలో బ్రతికి తీరాలన్న పట్టుదలకు పోయిన ‘బుచ్చెమ్మ’లు అప్రతిష్ఠే మిగుల్చుకుని కష్టాలు, నష్టాలుతోనే జీవనపయనం ముగించారు. అసలు సంపాదనే దుర్గమ్మ ధ్యేయమైతే (బోడెమ్మ) సంపాదించినంత బెజవాడలో నాడు ఎవరూ సంపాదించి ఉండేవారు కాదు.
ఇంతకీ ఏమిటంటే కొంతకాలం కింగ్స్‌వేగా చెప్పే నేటి బిఆర్‌పి రోడ్డులో బోడెమ్మ చిన్న హోటల్ పెట్టుకుని బతికింది. అందుకేనేమో నేటికీ బోడెమ్మ హోటల్ సెంటర్ అంటారు. నాటి బోడెమ్మ గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి వచ్చారని చెబుతారు. అయితే ఆమె తనది నరసరావుపేట అని కొందరికి, బందరు సమీపంలో కుగ్రామం అని మరికొందరికి, తన పేరు రత్నం అని, ఇలా రకరకాల పేర్లు చెబుతుండేది. ఈ విషయమై ప్రశ్నిస్తే ‘తానెవరినీ మోసం చేయడం లేదు. అలాగే వ్యాపారం పేరుతో ఐపిలు పెట్టటం లేదు. అహర్నిశలు కష్టపడి సంపాదించుకుంటూ కాలం గడుపుతున్నా ఇంక అనవసరమైన వివరాలు మీకెందుకని’’ ప్రశ్నించడమే కాదు. ఒక్కోసారి బండబూతులు కూడా తిట్టేదట.జనం అభిమానం సంపాదించుకున్న బోడెమ్మ ఏ మాత్రం సంపాదించుకోలేక తనకంటూ ఏమీ మిగుల్చుకోలేక ప్రజాభిమానమే ఆస్తిగా అశువులు బాసింది. అసలు తన హోటల్‌కు వచ్చినవారిని డబ్బులు అడిగేది లేదు. ఎంత ఇస్తే అంత తీసుకునేది. వివిధ కారణాల రీత్యా స్థానిక పెద్దల సహకారంతో పాత శివాలయం సమీపంలోకి హోటలు మార్చింది. అనంతరం ఇప్పుడున్న స్థలంలోకి హోటల్‌ని మార్చింది. పగలు రాత్రి భేదం లేకుండా శ్రమించడం వల్ల చిన్న వయస్సులోనే ఆమె ఆరోగ్యం దెబ్బతింది. పెద్దల సలహాలతో వృద్ధాప్య పెన్షన్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. పాపం పెన్షన్ మంజూరై మనియార్డర్ వచ్చిన రోజే ఆ సొమ్ము అందుకోకుండానే మరణించింది. ఆమెకు అణా లేదా పైసా ఇచ్చి రూపాయి తిండి తిన్న ప్రబుద్ధులు, అలాగే ఆమె వల్ల రకరకాల సహాయం పొంది ఆపై అపారంగా ఆస్తులు పొందిన భాగ్యవంతులు ఆమె చనిపోతే పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బోడెమ్మ హోటల్ సంగతి తెలిసిన ఓ ఇంగ్లీషు దొర ఆమె పేరిట రూ.50 మనియార్డర్ చేస్తే అది కూడా ఆమె చనిపోయిన తర్వాత వచ్చింది. ఆమె వారసుడినని చెప్పుకుని ఆ మనియార్డర్ తీసుకొని మోసం చేసిన ప్రబుద్ధుడూ ఉన్నాడు. బోడెమ్మ అసలు పేరు ఎవరికీ తెలియకపోయినా తన భర్త మరణించిన తర్వాత అత్తింటి ఆరళ్ళకు తట్టుకోలేక కన్నవారి ఆదరణకు నోచుకోక పొట్ట చేతట్టుకొని బెజవాడ వన్‌టౌన్ చేరిన ఇల్లాలు. నిందలు భరిస్తూ తన అసలు పేరేమిటో ఎవరికీ తెలియకుండా కనీసం అత్తింటివారి పేరు... పుట్టింటివారి పేరు ఎవరికీ తెలియనివ్వలేదు. అందరికీ బోడెమ్మగా మాత్రమే తెలుసు. ఏమి ఏదైతేనేమి చివరకు ఆ ప్రాంతం బోడెమ్మ హోటల్ సెంటర్‌గా నగరంలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

పర్యాటకరంగ అభివృద్ధికి పాటుపడతా
సబ్ కలెక్టరేట్, నవంబర్ 14: రాష్ట్రాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కేంద్ర పర్యాటక శాఖామంత్రి కొణిదల చిరంజీవి చెప్పారు. బాలల దినోత్సవం సందర్భంగా నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి బుధవారం నగరానికి వచ్చిన చిరంజీవి ప్రభుత్వ అతిథిగృహంలో విలేఖరులతో మాట్లాడారు. తాను కేంద్రమంత్రిని అయినా రాష్ట్రాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. జిల్లాలో అనేక విలువైన పర్యాటక కేంద్రాలున్నాయని వాటికి వౌలిక సదుపాయాలు కల్పించి పర్యాటకుల సంఖ్య పెరిగేలా కృషి చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. కొండపల్లి, భవానీపురం, కొల్లేరు సరస్సువంటి పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కిరణ్ సర్కారుకు వచ్చిన ఢోకా ఏమీలేదని చిరంజీవి వ్యక్తం చేశారు. తగినంత సంఖ్యాబలం ఉందన్నారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవికి ప్రభుత్వ అతిథిగృహంలో అభిమానులు, నాయకులు ఘనంగా సత్కరించారు. అభిమానులు తెచ్చిన గజమాలతో ప్రాంగణం అంతా పూలమయంగా మారింది. విలేఖరుల సమావేశంలో మంత్రి పార్థసారథి, ఎంపి లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, యలమంచిరి రవి, డివై దాస్, నాయకులు బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.

హై ఓల్టేజీకి బాధ్యులెవరు?
అజిత్‌సింగ్‌నగర్, నవంబర్ 14: 52వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరీపేట జి ప్లస్ త్రీ పక్కాగృహాల్లో హైఓల్టేజీతో విద్యుత్ పరికరాలు కాలిపోయినందువల్ల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు డిమాండ్ చేసారు. మంగళవారం దీపావళి పండుగ రోజు హై ఓల్టేజీ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను పరిశీలించిన సిపిఎం బృందం బుధవారం ఉదయం స్థానిక డివిజన్‌లో నష్టపరిహారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో తరచూ హైఓల్టేజి సమస్య ఉత్పన్మమై విద్యుత్ గృహోపకరణాలు కాలిపోతున్నా సంబంధిత శాఖాధికారులు గానీ, స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. పేద, అల్పాదాయ వర్గాలకు చెందిన పరికరాలు కాలిపోతుండటం వలన వారిపై ఆర్థిక భారాలు ఎక్కువ అవుతున్నాయన్నారు. హైఓల్టేజీ సమస్యకు విద్యుత్ శాఖ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని, వారికి నష్టపరిహారం అందేవరకూ సిపిఎం నిరంతర ఉద్యమాలు చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సిపిఎం నాయకులు కె దుర్గారావు, టి శ్రీనివాస్, డి రమణ, కె భవానీ, కె బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా సిపిఎం ఆందోళన గురించి తెలుసుకున్న స్థానిక విద్యుత్ ఎఇ గురుకిశోర్ సంఘటనా స్థలానికి వచ్చి తగు నివారణా చర్యలు తీసుకొంటామని హామీ ఇవ్వడంతో నాయకులు తమ ఆందోళనను విరమించారు.

కార్తీక మహోత్సవాలు ప్రారంభం
ఇంద్రకీలాద్రి, నవంబర్ 14: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీమల్లేశ్వరస్వామి సన్నిధిలో కార్తీక మాస మహోత్సవాలు బుధవారం వైభవోపేతంగా ప్రారంభమైయ్యాయి. ఈసందర్భంగా అర్చకులు స్వామివార్ల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, బిల్వష్టోత్తరం, తదితరమైనవాటిని నిర్వహించారు. ఇందులోభాగంగా సాయంత్రం భక్తులు ఏర్పాటు చేసిన అఖండ దీపోత్సవాన్ని దేవస్థానం ఇన్‌చార్జ్ ఇవో విష్ణుప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. సాయంత్రం అధిక సంఖ్యలో మహిళలు స్వామివారి సన్నిధిలో దీపారాధన నిర్వహించుకున్నారు.

సోదరి తనయుడే సూత్రధారి
విజయవాడ (క్రైం), నవంబర్ 14: గాంధీనగర్‌లో నివాసముంటున్న మహిళా రేషన్ డీలర్ హత్యకేసు మిస్టరీ వీడింది. డబ్బు దోచుకునేందుకే దుండగులు హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే కేసును ఛేదించి ఆరుగురిని అరెస్టు చేసిన సత్యనారాయణపురం పోలీసులు వారి నుంచి 80వేల నగదు, సొత్తు, కారు, మోటారు సైకిల్, కత్తెర స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ ఏసిపి పి సత్యనారాయణరావు తెలిపారు. సత్యనారాయణపురం స్టేషన్ ఆవరణలో 13వ తేదీ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గాంధీనగర్‌లో అద్దెకుంటున్న రేషన్ డీలర్ బోగాల దుర్గాంబ అలియాస్ రెడ్డి దుర్గాంబ (45) ఈ నెల 10న తన ఇంట్లోనే దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు నగలు, నగదు దోపిడీ కోసమే ఆమెను హత్య చేసినట్లు సంఘటనాస్థలంలో లభించిన ప్రాథమిక ఆధారాలను బట్టి గుర్తించారు. ఈ దిశగా దర్యాప్తు చేపట్టి త్వరితగతిన నిందితులను గుర్తించారు. బెంజిసర్కిల్ వద్ద నివాసముంటున్న దుర్గాంబ సోదరి కుమారుడైన రెడ్డి నాగరాజు అలియాస్ నాని (26) కారుడ్రైవర్‌గా పనిచేస్తూ అప్పుడప్పుడు దుర్గాంబ వద్దకు వచ్చి వెళ్తుంటాడు. ఇంట్లో నగదు, నగలపై కన్నుపడిన నాగరాజు తన అవసరాలు, అప్పుల కోసం పెద్దమ్మ అయిన దుర్గాంబను మట్టుపెట్టాలని మూడు మాసాల క్రితం వ్యూహరచన చేశాడు. ఇందుకు తన సొదరుడైన రెడ్డి సురేష్ (20), మారుతీనగర్‌కు చెందిన సుంకర నాగసతీష్ అలియాస్ సడిగాడు (19), తన స్నేహితులైన పామర్రుకు చెందిన కిర్లా షడ్రక్ (23), గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఉమ్ములేటి కోటేశ్వరరావు అలియాస్ కోటి (25) కొమ్మని మల్లేశ్వరరావు అలియాస్ మల్లి (26), కొటికలపూడి గంగాధర్ అలియాస్ గంగ తదితరులతో కుమ్కక్కయ్యాడు. ఈక్రమంలో ఈ నెల 10వ తేదీ సాయంత్రం మద్యం సేవించి దుర్గాంబ ఇంట్లోకి చొరబడి కత్తెరతో దారుణంగా పొడిచి హత్యచేశారు. అనంతరం బీరువాలోని లక్షన్నర నగదు, బీరువాలో అదేవిధంగా ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని పరారయ్యారు. అరెస్టు చేసిన ఆరుగురు నిందితుల నుంచి 50వేల నగదు, 30వేల బంగారు నగలు, మూడు సెల్‌ఫోన్లు, నేరానికి ఉపయోగించిన కారు, కత్తెర స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి తెలిపారు. విలేఖరుల సమావేశంలో సిఐ జి రామకృష్ణ, అదనపు సిఐ సత్యనారాయణ, క్రైం ఎస్‌ఐ రామకృష్ణుడు పాల్గొన్నారు.

రైలు ఇంజన్ ఢీకొని వ్యక్తి మృతి
విజయవాడ (రైల్వే స్టేషన్), నవంబర్ 14: అస్సాం రాష్ట్రానికి చెందిన 40ఏళ్ల వయస్సు కలిగిన జితిర్‌నాథ్ రైల్వే కోర్టు వెనుకవైపువున్న అధికారులు పర్యటించే మార్గంలో రైలు పట్టాలు దాటుతుండగా షట్టింగ్ చేస్తున్న డీజిల్ ఇంజన్ వెనుక నుంచి వెళుతూ ఢీకొన్న సంఘటనలో బుధవారం తెల్లవారుజామున అక్కడికక్కడే మృతి చెందాడు. డిప్యూటీ స్టేషన్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ రైల్వే పోలీసులు హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ శవ సంచనామా చేయగా అతని వద్ద వున్న ఆధారాల మేరకు నరేంజి జిల్లాలోని నంధుమ్ దునియా గ్రామానికి వ్యక్తిగా అతని వద్దవున్న ఆధారాల ప్రకారం గుర్తించారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నేటి నుండి ఖోఖో పోటీలు
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 14: స్థానిక శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 15, 16 తేదీల్లో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల ఖోకో మహిళల పోటీలు నిర్వహిస్తున్నట్లు సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్, టోర్నీ చైర్మన్ డాక్టర్ టి విజయలక్ష్మి తెలిపారు.

ఇసుక అక్రమ రవాణా!
తోట్లవల్లూరు, నవంబర్ 14: రెవెన్యూ అధికారుల చేతివాటంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రెవెన్యూ అధికారుల తీరు కంచే చేను మేసిన చందంగా తయారయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తీసుకున్న నిర్ణయాలను తుంగంలో తొక్కుతూ ఇష్టానుసారం అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట అధికారులు తెరవెనుక ఉండి అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నట్టు బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీపావళి పండుగ పర్వదినాన మంగళవారం ఉదయం రొయ్యూరు ఇసుక క్వారీ అధికారిక క్వారీని తలపించింది. కంకిపాడు, పెనమలూరు మండలాల నుంచి అనేక ట్రాక్టర్లు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కోసమంటూ రొయ్యూరు క్వారీకి వచ్చాయి. వల్లూరుపాలెం ఇసుక క్వారీ లీజుదారులు రొయ్యూరు క్వారీలో ఇసుక పోయటాన్ని గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దాంతో విఆర్‌ఓ రమణ అక్కడికి వచ్చిచూడగా కూపన్‌లు దిద్ది, ఇసుక క్వారీ పేర్లు సొంతంగా రాసి ఉండటం వెలుగులోకి వచ్చింది. మండల మేజిస్ట్రేట్, తహశీల్దార్ ఎం బాబూరావు వల్లూరుపాలెం ఇసుక క్వారీకి ఇందిరమ్మ కూపన్‌లపై సంతకం పెట్టిన తరువాత కంకిపాడు హౌసింగ్ సిబ్బంది రొయ్యూరు క్వారీ పేరు రాసిన వైనం వెలుగుచూసింది. గతంలో జరిగిన నిర్ణయం మేరకు కూపన్లపై వల్లూరుపాలెం క్వారీ పేరు రాస్తుండగా హౌసింగ్ సిబ్బంది మాత్రం రొయ్యూరు క్వారీ పేరుని అక్రమంగా చేరుస్తున్నారు. ఈవిషయం తెలిసినా రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలివేశారు. 15కి.మీల దూరంలో ఉన్న వల్లూరుపాలెం ఇసుక క్వారీకి వెళ్ళేకంటే ముంగిట్లో ఒక కి.మీ దూరంలో ఉన్న రొయ్యూరు క్వారీలో అక్రమంగా డబ్బులు ముట్టజెప్పి ఇసుక తీసుకెళ్ళేందుకు అందరు కథ నడిపిస్తున్నారని రొయ్యూరు గ్రామస్తులు విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం రొయ్యూరు క్వారీలోకి ఇసుక కోసం ఎలాంటి వాహనం వెళ్ళకూడదు. రెవెన్యూ అధికారుల కళ్ళెదుటే కొట్టివేతలు ఉన్న ఇందిరమ్మ కూపన్‌లతో ఇసుకను అక్రమంగా తీసుకుపోతుంటే గుడ్లప్పగించి చూడటం దారుణమని ప్రజలు అంటున్నారు.
ఇకనుంచి కఠిన చర్యలు:తహశీల్దార్
ఇందిరమ్మ ఇళ్లకు ఇకనుంచి కచ్చితంగా వల్లూరుపాలెం క్వారీ నుంచి ఇసుక తీసుకెళ్ళేవిధంగా గట్టి చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ ఎం బాబూరావు చెప్పారు. పిల్లివానిలంకలో పట్టుబడిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ వద్ద లభించిన కూపన్‌పై కొట్టివేతలు ఉన్నచోట హౌసింగ్ ఏఇ వచ్చి సంతకం చేశారని, అందువల్ల వదిలేశామన్నారు. రొయ్యూరు క్వారీకి ఇసుక ట్రాక్టర్లు వెళ్ళకుండా చూస్తామని వివరించారు.

అగ్నిప్రమాదాల్లో 10ఇళ్లు దగ్ధం
గుడివాడ, నవంబర్ 14: దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాలుస్తుండగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మూడు అగ్నిప్రమాదాల్లో 54వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని గుడివాడ అగ్నిమాపక శాఖాధికారి ఎం హనుమంతరావు చెప్పారు. బుధవారం స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కొత్తపేటలో ఒక ఇంటికి నిప్పంటుకుని 50వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు. తట్టివర్రు రోడ్డులోని ఆదర్శనగర్లో గడ్డివామి దగ్ధమై 4వేల రూపాయల నష్టం జరిగిందన్నారు. గుడ్లవల్లేరు మండలం అంగలూరులో తాటాకు ఇంటికి నిప్పంటుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని ఆయన వివరించారు.
లక్ష్మీపురంలో...
కృత్తివెన్ను : విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా బుధవారం రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కొప్పర్తి సాయిబాబు, సుబ్రహ్మణ్యంకు చెందిన ఇళ్లు దగ్ధం కావటంతో 15లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేసినట్లు తహశీల్దార్ షకీరున్నీసా బేగం తెలిపారు.
జింకలపాలెంలో...
గంపలగూడెం : మండలంలోని జింకలపాలెంలో బుధవారం సాయంత్రం ఆరు ఇళ్లు కాలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. గ్రామానికి చెందిన షేక్ అక్బర్ ఇంటి నుండి బుధవారం సాయంత్రం ముందుగా మంటలు లేవడంతో ఈదురుగాలులకు చుట్టుపక్కల ఇళ్ళకు వ్యాపించాయి. అక్బర్ తల్లి కమాల్‌బీ మాత్రమే ఆ సమయంలో ఇంట్లో వుంది. పక్కన పొలాల్లో ఉన్న రైతులు వచ్చి మంటలు అర్పేందుకు ప్రయత్నించారు. అదుపులోకి రాకపోవడంతో పక్కనే ఉన్న చాంద్ సాహెబ్, అల్లీ సాహెబ్, కరీమ్‌బీ, అహ్మద్ అలీ, నూర్ అహ్మద్‌లకు చెందిన ఆరు ఇళ్లతో పాటు వడ్లగరిసె కూడా అగ్నికి అహుతైంది. సంఘటన స్థలాన్ని తహశీల్దార్ ముత్యాల శ్రీనివాసరావు, ఆర్‌ఐ నాగమల్లేశ్వరరావు, విఆర్‌ఓ కట్టా కోటేశ్వరరావు సందర్శించి తక్షణ సహాయంగా 5వేల నగదుతో పాటు 20కేజీల బియ్యం బాధితులకు అందజేశారు. ఈ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో సామానుతో పాటు పత్తి, నగదు కాలిపోయాయి.

ఉన్నత విలువల మహానేత ఎర్రన్నాయుడు
* సంతాప సభలో ఎంపి కొనకళ్ళ నివాళి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 14: కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు ఉన్నత విలువలు కలిగిన మహానేత అని బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఎర్రన్నాయుడు సంతాప సభను సోమవారం స్థానిక ఈశ్వర్ రెసిడెన్సీలో నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులులర్పించారు. ఈసందర్భంగా కొనకళ్ళ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఎర్రన్నాయుడు జాతీయ రాజకీయాలకే వనె్న తెచ్చారన్నారు. హుందాతనంతో వ్యవహరించి అన్నివర్గాల ఆదరాభిమానాలు చూరగొన్న మహా నాయకుల్లో ఎర్రన్నాయుడు ఒకరన్నారు. ఎంతో పరిణితి చెందిన రాజకీయ నాయకుడని శ్లాఘించారు. సర్దార్ గౌతు లచ్చన్న శిష్యునిగా ఎర్రన్నాయుడితో తనకు 30ఏళ్ళుగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కాగిత వెంకట్రావు మాట్లాడుతూ 1985 నుండి ఎర్రన్నానాయుడితో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవన్నారు. ఆయన ఎప్పుడూ తనను అన్న అంటూ పిలిచేవారని, పార్టీ పటిష్టతకు, ప్రజల బాగోగులకు ఎన్నో ఉన్నతమైన సూచనలు చేసేవారన్నారు. తెలుగుదేశం పార్టీ పతిష్టతకు అవిరళ కృషి చేశారన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకు తానే సాటి అనిపించుకున్నారని నివాళులర్పించారు. స్వచ్ఛుడిగా, నీతివంతుడిగా ప్రజల కోసం పనిచేసిన ఎర్రన్నాయుడి మృతి దేశానికే తీరని లోటని శ్లాఘించారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎర్రన్నాయుడు ఓ ధృవతారన్నారు. ఆయనను కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీరని నష్టమన్నారు. అన్న ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారన్నారు. టిడిపి బందరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎర్రన్నాయుడు అకుంఠిత దీక్షాపరుడని శ్లాఘించారు. బందరు పోర్టు కోసం తాను చేపట్టిన ఉద్యమాలకు మద్దతు తెలిపి మరింత ముందుకు నడిపించారన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యలు, రాజకీయాల్లో ఎంతో పరిణితి చెందిన నాయకుడిని కోల్పోవడం దేశ ప్రజల దురదృష్టమన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా మాట్లాడుతూ ఎర్రన్నాయుడు మృతి అన్ని రాజకీయ పార్టీల వారిని కలిచివేసిందన్నారు. వైఎస్‌ఆర్‌సిపి స్టీరింగ్ కమిటీ సభ్యులు మాదివాడ రాము మాట్లాడుతూ ఎర్రన్నాయుడు మృతితో ఓ రాజకీయ నిఘంటువును కోల్పోయినట్లైందన్నారు. గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు మాట్లాడుతూ హుందాగా వ్యవహరించే ఎర్రన్నాయుడు అన్ని రాజకీయ పార్టీల వారితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేవారన్నారు. పట్టణ ప్రముఖుడు గొరిపర్తి పాపరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయా పార్టీల నాయకులు గొర్రిపాటి గోపిచంద్, మోటమర్రి బాబాప్రసాద్, బత్తిన దాస్, బోలెం హరిబాబు, లంకే నారాయణ ప్రసాద్, గనిపిశెట్టి గోపాల్, మారుమూడి విక్టర్ ప్రసాద్, కుంభం చరిత కార్తీక్, పంతం వెంకట గజేంద్రరావు, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, వైవిఆర్ పాండురంగారావు, ఎంవి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

గ్రంథాలయ వారోత్సవాల్ని జయప్రదం చేయండి
* రొండి కృష్ణయాదవ్ పిలుపు
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 14: గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొండి కృష్ణయాదవ్ అన్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థలో బుధవారం గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ సభ జరిగింది. ఆయన సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ పాఠకులకు సౌకర్యం కలిగించే దిశగా రిఫరెన్స్ విభాగంలో ఏసి సౌకర్యం కల్పించినట్లు, నామమాత్రపు రుసుముతో ఇంటర్నెట్ విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ రచయిత డా. రావి రంగారావు మాట్లాడుతూ పుస్తకాలు విలువలకు ప్రతీకలన్నారు. పుస్తకాలు, విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఎం నాయకులు కొడాలి శర్మ మాట్లాడుతూ విద్యార్థుల్లోని అంతర్గత శక్తులను వెలికితీసేందుకు గ్రంథాలయ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వై కృష్ణారావు, డెప్యూటీ లైబ్రేరియన్ నాగరాజు, పి వెంకటేశ్వరరావు, ధనుంజయ, కెవైఎల్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కోకా నాగజ్యోత్స్న స్వాగత నృత్యం, పరింకాయల శ్రీనివాసరావు చేసిన రావణబ్రహ్మ ఏకపాత్రాభినయం ఆకట్టుకున్నాయి.

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
అవనిగడ్డ/ గంపలగూడెం, నవంబర్ 14: అవనిగడ్డ, గంపలగూడెం మండలాల్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. అవనిగడ్డ మెయిన్ రోడ్డులో ఉదయం ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో మాఘం శ్రీమన్నారాయణ(48) అనే వ్యక్తి మృతి చెందాడు. ఉదయం ఇంటి నుండి టీ తాగటానికి బయటకు వెళ్ళిన శ్రీమన్నారాయణను వాహనం ఢీకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య శివరత్నకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా, మండల పరిధిలోని అశ్వరావుపాలెం గ్రామానికి చెందిన మాలే నాగమల్లేశ్వరరావు అనే హిందీ టీచర్ చల్లపల్లి చైతన్య టెక్నో పాఠశాలకు తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అవనిగడ్డ శివారు సీతాయలంక వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కాళ్ళకు తీవ్రంగా దెబ్బలు తగిలినట్లు పోలీసులు తెలిపారు. 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా ప్రథమ చికిత్స నిర్వహించి విజయవాడ వైద్యశాలకు తరలించారు. లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు.
గంపలగూడెం మండలం మేడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా పదిమందికి గాయాలయ్యాయ. ట్రాక్టర్, మోటారు సైకిల్ ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న సంఘటనలో మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తున్న బొల్లిపోగు రాఘవయ్య (38) మృతిచెందాడు. తిరువూరు మండలం రొలుపడి గ్రామానికి చెందిన ట్రాక్టర్‌పై ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు గ్రామంలో పత్తి కూలీకి వెళ్ళివస్తున్న 30మంది కూలీలు ఉన్నారు. ట్రాక్టర్ ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొనగా అది విరిగి కూలీలపై పడింది. బాణెం భూషణం అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతనికి రెండు చేతులు విరగగా, ఛాతిపై బలమైన దెబ్బ తగిలింది. బయర్ల శ్రవంతి, వేల్పుల కమలకు ఎడమ చేతులు విరిగిపోయాయి. దయ్యాల మరియమ్మ, మేడల సునీత, పాణెం వెంకటరాయమ్మ, గత్తం మేరి, లక్ష్మీకాంతమ్మకు గాయాలయ్యాయి. 108 ద్వారా తిరువూరు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ ఎన్ చలపతిరావు వెళ్ళి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్రిక్తతల మధ్య పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు
మోపిదేవి, నవంబర్ 14: మండల పరిధిలోని కె కొత్తపాలెం, కప్తాన్‌పాలెం గ్రామాల్లో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఎన్నికలను ఉద్రిక్తతల మధ్య బుధవారం నిర్వహించారు. కె కొత్తపాలెం గ్రామంలో మంగళవారం నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టిడిపి నాయకులను బైండోవర్ కేసులపై అరెస్టు చేసి బుధవారం సాయంత్రం వరకు పోలీసుల అదుపులో ఉంచారు. ఉద్రిక్తతల మధ్య జరిగిన ఎన్నికల్లో కె కొత్తపాలెంలో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి సంయుక్తంగా ఐదు డైరెక్టర్ల పదవులు సాధించగా, కాంగ్రెస్ పార్టీ తరపున నలుగురు ఎన్నికయ్యారు. డిఎస్పీ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సిఐ రమణమూర్తి, ఎస్‌ఐ శ్రీనివాస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

అనంత ఆదిశేషునికి అభిషేకాలు
కూచిపూడి, నవంబర్ 14: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో అనంత ఆదిశేష భగవానునికి వైభవంగా అభిషేకాలు జరిగాయి. అమావాస్యను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తేవి సీతారాం గురుదేవులు పర్యవేక్షణలో శ్రీ అభయ వీరాంజనేయస్వామి వారికి వడ, పూలమాలలు సమర్పించారు. అనంతరం భక్తులనుద్దేశించి గురుదేవులు అనుగ్రహ భాషణం చేశారు. అన్నసమారాధన జరిగింది.
భక్తులతో శైవాలయాలు కిటకిట
హరహర మహాదేవ అన్న భక్తుల నామస్మరణలు, జేగంటల నినాదాలతో మండలంలోని పలు శైవాలయాలు మారుమోగాయి. కార్తీక మాసం తొలిరోజైన బుధవారం స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ధర్మకర్త పసుమర్తి కేశవప్రసాద్ పర్యవేక్షణలో అర్చకులు పెనుమూడి కాశీవిశ్వనాథం, బాబూరావు, సతీష్, జంధ్యాల పాండురంగశర్మ అభిషేకాలు నిర్వహించారు. మండలంలోని మొవ్వ భీమేశ్వరస్వామి ఆలయం అయ్యంకి, పెదపూడి గ్రామాల్లోని శ్రీ గంగా పర్వతవర్థిని సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాలు గూడపాడు, యద్దనపూడి, కాజ, నిడుమోలు, కోసూరు, కారకంపాడు గ్రామాల్లోని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు కుంకుమార్చన జరిపారు.

చౌక్‌బాల్, నెట్‌బాల్ పోటీలకు ఆత్కూరు బాలికలు
ఉంగుటూరు, నవంబర్ 14: జాతీయస్థాయి చౌక్‌బాల్ పోటీలకు ఇద్దరు, రాష్టస్థ్రాయి నెట్‌బాల్ పోటీలకు ఐదుగురు ఆత్కూరు జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు కె శాంతకుమారి బుధవారం విలేఖరులకు తెలిపారు. వచ్చే నెల 12నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో జరగబోయే చౌక్‌బాల్ పోటీలకు కె శిరీష, ఎన్ మిస్సమ్మ మన రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు. స్కూల్‌గేమ్స్ నెట్‌బాల్ అండర్-17కు పదో తరగతి చదువుతున్న బి అనూష, 8వ తరగతి చదువుతున్న ఎస్ రాజకుమారి, తొమ్మిదో తరగతి చదువుతున్న వై నిఖిల్ జిల్లా జట్టు తరపున ఎంపికయ్యారు. 8వ తరగతి విద్యార్థినులు బి రాధిక, ఎస్‌కె మున్నీ అండర్-14 జట్టుకు ఎంపికైనట్లు ఆమె తెలిపారు. అనూష, రాజకుమారి, నిఖిల్ ఈ నెల 17నుండి చిత్తూరులో జరగబోయే రాష్టస్థ్రాయి నెట్‌బాల్ పోటీల్లో జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. రాధిక, మున్నీ వచ్చే నెలలో ఖమ్మంలో జరగబోయే రాష్టస్థ్రాయి పోటీలకు జిల్లా జట్టు తరపున హాజరవుతారని ఆమె వివరించారు. వీరికి ఉత్తమ శిక్షణనిచ్చి ప్రోత్సహించిన వ్యాయామోపాధ్యాయుడు ధనియాల నాగరాజును ఎంపిడిఓ కె పార్థసారథి, ఎంఇఓ ప్రభాకరరావు, తదితరులు అభినందించారు.

మెరుగైన సమాజం కోసం సహకార సంఘాలు పాటుపడాలి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 14: మెరుగైన సమాజం కోసం సహకార సంఘాలు పాటుపడాలని జిల్లా సహకార శాఖ అధికారి వివి ఫణికుమార్ కోరారు. 59వ సహకార వారోత్సవాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా పరిషత్ సమావేశపు హాల్లో జరిగిన సభలో మాట్లాడుతూ మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్ మార్పులకు అనుకూలంగా సహకార సంఘాలు నూతన వ్యాపార విధానాలను అవలంభించి మెరుగైన సమాజం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవటం ప్రాథమిక హక్కుగా గుర్తించటం వల్ల ఎంతో ప్రాధాన్యత ఏర్పడింద

చిన్నారుల మధ్య స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత ఎక్కువగా ఉంటుందని, తనకు
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>