Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సర్ ఛార్జీలపై ఎర్రదండు ఆగ్రహం

$
0
0

కరీంనగర్ , నవంబర్ 15: విద్యుత్ సంస్థలు విధిస్తున్న సర్‌ఛార్జీలపై ఎర్రదండు మండిపడింది. విద్యుత్ సర్‌ఛార్జీలను నిరసిస్తూ సిపిఐ నాయకులు, కార్యకర్తలు గురువారం స్థానిక ట్రాన్స్‌కో ఎస్‌ఇ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. సుమారు గంట పాటు ధర్నా నిర్వహించిన అనంతరం నాయకులు ట్రాన్స్‌కో ఎస్‌ఇ రంగారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన అన్ని నిత్యావసర ధరలతోనే అల్లాడుతున్న సామాన్యులపై విద్యుత్ సంస్థలు విధిస్తున్న సర్‌ఛార్జిలతో మరింత అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సర్‌ఛార్జిల సర్ధుబాటు పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపుతుందని, వెంటనే సర్‌ఛార్జిలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ మంటల్లో కాలిపోక తప్పదని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారని అన్నారు. టిడిపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బషీర్‌బాగ్ పోరాటం నిర్వహించి టిడిపిని గద్దె దింపిన చరిత్రను కిరణ్‌కుమార్ ప్రభుత్వం గుర్తు తెచ్చుకుని విద్యుత్ సర్‌చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి బషీర్‌బాగ్ తరహా పోరాటాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామ్‌గోపాల్ రెడ్డి, అశోక్, రామయ్య, సృజన్‌కుమార్, భాగ్యలక్ష్మి, రాజిరెడ్డి, శ్రీనివాస్, సమ్మయ్య, రాంచంద్రం, మల్లమ్మ, అంజలి, సంజిత్‌సింగ్‌లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణలో వికేంద్రీకరణకు శ్రీకారం
* రూ. 460 కోట్లతో 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ
* నేడు జమ్మికుంటలో ప్రారంభించనున్న మంత్రి శ్రీ్ధర్ బాబు
కరీంనగర్, నవంబర్ 15: అన్నదాతలకు గిట్టుబాటు ధర, రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్న ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ కార్యక్రమంలో వికేంద్రీకరణ విధానానికి శ్రీకారం చుట్టిందని పౌరసరఫరాలు, తూనిక లు, కొలతలు, శాసనసభా వ్యవహారాల మం త్రి దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు గురువారం ఇక్కడ మీ డియాకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. మొదటి దశలో కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని మరో ఆరు జిల్లాల్లో ఈ విధానాన్ని అమ లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం సేకరణలో వికేంద్రీకరణ విధానాన్ని శుక్రవారం జమ్మికుంటలో ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా కరీంనగర్ జిల్లాలో రూ.460 కోట్లతో రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరిస్తున్నామని, రైతు పండించిన ధాన్యానికి మద్ధతు ధర లభించినప్పుడే వారి కుటుంబాల్లో ఆనందం కలుగుతుందనే ఉద్ధేశంతో రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజను మద్ధతు ధరతో కొనుగోలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర వార్షిక ప్రజాపంపిణీకి అవసరమైన 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాకు సంబంధించి స్వయం సంవృద్ధి సాధించడం, కార్పోరేషన్ లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. రవాణాతో పాటే గోదాముల నిర్మాణంలో పొదుపు సాధించడం, తెల్లకార్డు దారులకు స్థానిక, నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. సివిల్ సప్లై కార్పోరేషన్ ఈ సీజన్ నుండే బియ్యం సేకరణను ప్రారంభించిందని, ఈ పథకం క్రింద కార్పోరేషన్ అన్ని జిల్లాల్లో సిఎంఆర్ ముడి బియ్యాన్ని నల్లగొండ, కరీంనగర్, వరంగల్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వంటి ఏడు జిల్లాల్లో లెవీ సేకరించడం జరుగుతుందన్నారు. అలాగే మిగిలిన 16 జిల్లాల్లో కూడా ఎఫ్‌సిఐ లెవీ ముడి బియ్యాన్ని సేకరిస్తుందన్నారు. ఈ ఏడు జిల్లాల్లో సిఎంఆర్, లెవీ కింద 11 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించాలని కార్పోరేషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందుకుగాను దశలవారీగా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి పూర్తి స్థాయిలో వికేంద్రీకరణ విధానాన్ని అమలు చేయడం జరుగుతుందని, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు ధాన్యం విక్రయించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా 2005 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. నిర్ణీత ప్రమాణాలతో ఉన్న ధాన్యాన్ని రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కనీస మద్ధతు ధర కన్నా తక్కువకు అమ్మకూడదని, సాధారణ రకం క్వింటాలుకు రూ.1250, గ్రేడు‘ఎ’ క్వింటాలుకు 1280 కనీస మద్ధతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో ఇది గ్రేడు‘ఎ’ 1110, సాధారణ రకం 1080 రూపాయలుగా ఉండేదని, ఈ సారి ఎనిమిది సన్నరకం వరి రకాలను క్వింటాలుకు 1500 రూపాయలకు ప్రోత్సాహక ధర చెల్లించి కొనుగోలు చేయబోతున్నట్లు చెప్పారు. పంట పండించే రైతులకు ప్రోత్సాహకరంగానూ, అలాగే బియ్యం ధరల నియంత్రణకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని భావిస్తున్నట్లు మంత్రి ఊటంకించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకాల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో కరీంనగర్ జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నులు సేకరించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు గాను మార్కెట్ యార్డుల్లో వంద కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మార్గదర్శకాల మేరకే ఐఎపి పనుల ఎంపిక
* 2011-12వ ఆర్థిక సంవత్సరానికి రూ. 30 కోట్లు మంజూరు
* ఐకెపి మహిళలతో విజిలెన్స్ కమిటీలు : కలెక్టర్ స్మితా సబర్వాల్
కరీంనగర్, నవంబర్ 15: ప్రభుత్వం సూ చించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో సమీకృత కార్యాచరణ అభివృద్ధి (ఐఎపి) పనులు ఎంపిక చేశామని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా ఎస్పీ, డిఎఫ్‌ఓతో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల నక్సల్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2011- 12వ ఆర్థిక సంవత్సరానికి 30 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డిఎఫ్‌ఓలతో జిల్లా స్థాయి కమిటీలో ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల ప్రకారం మారుమూల నక్సల్ ప్రభావిత గిరిజన గ్రామాలలో గుర్తించిన పనులు మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. పార్లమెంటు సభ్యులు సూచించిన పనులకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. జిల్లాలో ఐఎపి పనులన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని, ఇంతవరకు 77 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. ఐఎపి పనుల పర్యవేక్షణకు గ్రామ స్థాయిలో ఐకెపి మహిళలతో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి పనుల పర్యవేక్షణపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే జిల్లాలో జరుగుచున్న ఐపిపి పనుల నాణ్యత ప్రమాణాలు తెలిసికొనుటకు రిటైర్డ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డితో థర్డ్ పార్టీ నాణ్యత ప్రమాణాల పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. థర్డ్ పార్టీ పనులను తనిఖీ చేసి నాణ్యత బాగుందని తెలిపిన తరువాతనే నిర్మాణ పనులకు బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. ఐఎపి పనుల ఎంపిక అన్ని నియోజకవర్గాలలో చేపట్టాలని లేదని జిల్లా యూనిట్‌గా నిధులు విడుదల చేశారని, ముందుగా పూర్తిగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి జిల్లా కమిటి పనులు మంజూరు చేసినట్లు చెప్పారు. రెండవ విడత ఐఎపి నిధులతో కొంత మేరకు అభివృద్ధి చెందిన మండలాలలో పనులు గుర్తించి మంజూరు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పనుల ప్రగతి వివరాలన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన 30 కోట్లతో 32 కోట్ల విలువగల పనులు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వి.రవీందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐఎపి నిధులతో మారుమూల నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, త్రాగునీరు కల్పన, విద్యాభివృద్ధి, రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ధేశించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డివిజనల్ ఫారెస్ట్ అధికారి షఫీయుల్లా, రిటైర్డ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి, ఎస్సారెస్పీ చీఫ్ ఇంజనీర్ ఎల్లారెడ్డి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎజెండాలో ప్రజాసమస్యలు చేర్చేందుకు సిపిఎం పోరుబాట
* డిసెంబర్ 10, 11 తేదీల్లో
కలెక్టరేట్ల ముట్టడి
* సిపిఎం కేంద్ర కమిటీ
సభ్యుడు వీరయ్య పిలుపు
కరీంనగర్ టౌన్, నవంబర్ 15: గత మూడు సంవత్సరాలుగా ప్రజా సమస్యలను వదిలేసి, రాజకీయ ఎజెండాలే ప్రధానమైన ఈ నేపథ్యంలో ప్రజాసమస్యలను ఎజెండాలోకి తీసుకురావడానికి సిపిఎం పోరుబాటకు సన్నద్ధమయిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య తెలిపారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 10,11తేదీల్లో సిపిఎం తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ముకుందలాల్ మిశ్రాభవన్‌లో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఠా కుమ్ములాటల్లో కూరుకుపోయి అధికార, ప్రతిపక్షాలు ప్రజాసమస్యల్ని గాలికొదిలేశాయని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజాసమస్యలపై పార్టీ సమరశీల పోరాటాలకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు వెంటనే చట్టం తేవాలని డిమాండ్ చేశారు. వృత్తిదారులకు, మైనారిటీలకు కూడా సబ్‌ప్లాన్ తీసుకురావాలని కోరారు. హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాలకు సబ్సిడీ సిలిండర్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జిలను తగ్గించి సర్‌చార్జిలను ప్రభుత్వమే భరించాలని కోరారు. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను అమలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని వీరయ్య కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సాగర్, భిక్షమయ్య, జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు యాకయ్య, ముత్యంరావు, పంతం రవి, వరాల రవికుమార్, భీమాసాహెబ్, జ్యోతి, శ్రీనివాస్, నామ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాజరాజేశ్వరిదేవి అమ్మవారికి
బంగారు నగలు బహూకరణ
వేములవాడ, నవంబర్ 15: శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి పదితులాల బంగారు అభరణాలను భక్తులు మొక్కు రూపంలో సమర్పించారు. వరంగల్ జిల్లా జనగాం పట్టణానికి చెందిన రమిని రాణి-రాజేశ్వర్ దంపతులు అమ్మవారికి పదితులాలతో నెక్లస్‌ను తయారు చేయించి గురువారం ఆలయ అధికారులకు అప్పగించారు. ముందుగా కళ్యాణ మండపంలో రాజేశ్వర్ దంతపులతో సదరు అభరణానికి ప్రత్యేక పూజలు చేయించి అనంతరం అమ్మవారికి అలంకరించారు. అనంతరం శ్రీలక్ష్మిగణపతి స్వామివారికి, శ్రీ రాజరాజేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు చేసుకొని దర్శించుకున్నారు. కళ్యాణ మండపంలో రాజేశ్వర్ దంపతులను అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

విద్యుత్ సంస్థలు విధిస్తున్న సర్‌ఛార్జీలపై
english title: 
erra dandu

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>