విజయవాడ , నవంబర్ 16: ఆపదలో ఉన్న బాలలతో పాటు, అనాధ బాలలు, తప్పిపోయి వచ్చిన బాలల పట్ల రైల్వేస్టేషన్‌లో రైల్వే లైసెన్స్‌డ్ పోర్టర్స్ వారి పట్ల ఆదరణ చూపించాలని రైల్వేస్టేషన్ మేనేజర్ ఎ. హనుమంతరావు అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ‘చైల్డ్‌లైన్ సే దోస్త్’ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న పోర్టర్లకు ‘బాలల హక్కుల పరిరక్షణ-మన అందరి బాధ్యత’ అన్న అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. పంజా సెంటర్‌కు దగ్గరలోని రైల్వే పోర్టర్స్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో హనుమంతరావు మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న సమయంలో కాని, మిగిలిన సమయంలోనైనా 18 సంవత్సరాల్లోపు బాలలు పలు సమస్యలతో ఎదురుపడినా, కనిపించినా అటువంటి వారిని ప్రేమతో పలుకరిస్తూ వారివద్ద వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. అనంతరం అట్టి బాలలను 1098 ఫోన్ నెంబర్‌కు ఫోన్‌చేసి సమాచారాన్ని చైల్డ్‌లైన్‌వారికి అందించాలని కోరారు. మరో అతిధిగా పాల్గొన్న జిఆర్‌పి డిఎస్‌పి డిఎన్ మహేష్ మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి బాలలను నిర్లక్ష్యం చేసేవారు సమాజానికి చెడుగా తయారవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ బి. బాలకృష్ణ, నగర ప్రముఖులు ఎంసి దాస్, చైల్డ్‌లైన్ సిటి కోఆర్డినేటర్ అరవ రమేష్, చైల్డ్‌లైన్ సిబ్బంది, నవజీవన్ బాలభవన్ కో ఆర్డినేటర్ బిఎస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్న బాలలతో పాటు, అనాధ బాలలు, తప్పిపోయి వచ్చిన బాలల పట్ల
english title:
missing children
Date:
Saturday, November 17, 2012