Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వేదాంతం మృతి తీరని లోటు

$
0
0

అవనిగడ్డ/ మచిలీపట్నం , నవంబర్ 16: కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణ శర్మ మృతి నాట్యరంగానికి తీరని లోటని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం ప్రగాఢ సంతాపం తెలిపారు. వేదాంతం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రముఖ సాహితీవేత్తలు, గుడిశేవ విష్ణుప్రసాద్, బి ఝాన్సీ, సింహాద్రి పద్మ, కాంగ్రెస్ నాయకులు మత్తి శ్రీనివాసరావు, అర్జా అర్జునరావు, తదితరులు వేదాంతం మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు వారు సానుభూతి తెలిపారు. డా. వేదాంతం సత్యనారాయణ మృతి నాట్య కళారంగానికి తీరని లోటని బందరులో పలువురు బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు అన్నారు. కూచిపూడి నాట్యానికి దేశ, విదేశాల్లో ప్రాచుర్యం కల్పించి తనదైన శైలితో అంతర్జాతీయ ఖ్యాతి కల్పించిన వేదాంతం మరణం కళాలోకానికి తీరని లోటన్నారు. భామాకలాపంలో ఆయన స్ర్తి వేషధారణ పురుషులనే కాక మహిళలను కూడా ఆకట్టుకుందన్నారు. బ్రాహ్మణ సేవాసంఘం యువ విభాగం ప్రధాన కార్యదర్శి పివి ఫణికుమార్, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, లొల్లా కుటుంబశాస్ర్తీ, జొన్నలగడ్డ శ్రీనివాస్ తదితరులు వేదాంతం మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

టిడిపి అధికారంలోకొస్తే...జగన్ దోచిందంతా కక్కిస్తాం
* పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉమ హెచ్చరిక
మైలవరం, నవంబర్ 16: తన తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్‌మోహనరెడ్డి దోచుకున్న లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టిడిపి అధికారంలోకి రాగానే కక్కిస్తామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. పాదయాత్రలో భాగంగా ఉమ శుక్రవారం మండలంలోని పుల్లూరు, కొత్తగూడెం, బాడవ, చిలుకూరివారిగూడెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం తమ పార్టీ నేతలు జైలుకి వెళ్తే, ప్రజల సొమ్మును దోచుకుని జగన్ చంచల్‌గుడా జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడని ఉమ దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ దోచుకున్న సొమ్మును రాబట్టి రాష్ట్భ్రావృద్ధికే వెచ్చిస్తామన్నారు. దాచుకున్న సొమ్మును కాపాడుకోవటంతోపాటు రాష్ట్రంలో మిగిలి ఉన్న సంపదను కూడా దోచుకునేందుకు అధికారం కోసం ఆరాటపడుతున్నాడని ఉమ ఆరోపించారు. మరోవైపు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలిన ముఖ్యమంత్రి కిరణ్ అధికారాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికి ముఖ్యమంత్రులుగా ముగ్గురు కృష్ణులు మారారని, నాలుగో కృష్ణుడి కోసం అధిష్టానం వెతుకుతోందని ఉమ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మునిగిపోయే నావలా తయారైందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తల్లి కాంగ్రెస్‌కు, పిల్ల కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించేది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల నీలం తుఫానుకు నష్టపోయిన పంటలకు, ఇళ్ళకు వెంటనే అధికారులు నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.

ఎర్రన్న సేవలు చిరస్మరణీయం
* టిడిపి నేతల ఘన నివాళి
నూజివీడు, నవంబర్ 16: సీనియర్ పార్లమెంట్ సభ్యునిగా కింజారపు ఎర్రన్నాయుడు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలవురు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. ఆయన లేని లోటును ఏ ఒక్క వ్యక్తి పూడ్చలేరని, ముఖ్యంగా బీసీలకు లోటని అన్నారు. స్థానిక విక్టోరియా పుర మందిరంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నూతక్కి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో జిల్లాలో దివంగత నేత ఎర్రన్నాయుడు సంతాపసభ శుక్రవారం జరిగింది. పలువురు నాయకులు ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎర్రన్నాయుడుతో తమకు ఉన్న సంబంధాలను గుర్తు చేశారు. నెల రోజుల్లో నూజివీడు వస్తానని ఎర్రన్నాయుడు చెప్పారని, నేడు ఆయన సంతాప సభ నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నూతక్కి వేణుగోపాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత స్థాయికి వెళ్ళినప్పటకీ పేదల కష్టాలను తెలుసుకున్న మహోన్నతమైన వ్యక్తి అని శ్లాఘించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ళ బుల్లయ్య మాట్లాడుతూ ఎర్రన్నాయుడు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవలు అందరి మనస్సులలో చిరస్థాయిగా ఉన్నాయని అన్నారు. ఆయన ఆశయ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు ఎర్రన్న అని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేశారని మండల పార్టీ అధ్యక్షులు కాపా శ్రీనివాసరావు చెప్పారు. అనంతరం అన్నదానం చేశారు.

పట్టణ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
* ప్రభుత్వ విప్ పేర్ని నాని
మచిలీపట్నం , నవంబర్ 16: పట్టణ పరిధిలోని సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. శుక్రవారం ఆయన పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 38వ వార్డులోని పంబలగూడెంలో వాసవీ భవనం ఎదురుగా సిమెంటు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 38వ వార్డులో అన్ని వీధులకు సిసి రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. 30వ వార్డు సాతాని బజారులో 7లక్షల 59వేల రూపాయలతో 340మీటర్లతో సిసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. 17వ వార్డు బందరుకోటలోని అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు నాని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, ఎంఇ జి ప్రదీప్ కుమార్, డిఇ శివప్రసాద్, ఎఇ పోలీసు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, మార్కెట్ యార్డు చైర్మన్ మోకా భాస్కరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొర్రా విఠల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లంక సూరిబాబు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

విద్యుత్ కొరత ఒట్టి నాటకం
* వామపక్ష నాయకుల విమర్శ
మచిలీపట్నం , నవంబర్ 16: సిపిఐ (ఎంఎల్), సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక మహతి లలిత కళావేదికలో ‘విద్యుత్ సంస్కరణలు- పాలకుల నాటకం’ అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఎంఎల్ నాయకులు జె జగన్, సిపిఎం నాయకులు కొడాలి శర్మ, సిపిఐ నాయకురాలు దేవభక్తుని నిర్మల అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఎంఎల్ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ళ భార్గవశ్రీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవిలో జలవిద్యుత్ ఉత్పాదకత దగ్గటం సహజమని, ఆశించిన మేరకు గ్యాస్ సరఫరా ఏనాడూ లేదని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతూనే ఉండగా కొత్తగా విద్యుత్ లోటు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు ప్రసంగిస్తూ విద్యుదీకరణ పనులను పాలకులు ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ నూతన విధానం పేరుతో గ్యాస్ నిక్షేపాలను విదేశీ, స్వదేశీ కంపెనీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సదస్సులో ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
తోట్లవల్లూరు, నవంబర్ 16: ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యమని, జాతీయ పార్టీలను గెలుపించుకుంటేనే పేద, బడుగు, బలహీనవర్గాల వారి అభివృద్ధికి దోహదపడతాయని పామర్రు శాసనసభ్యులు డివై దాస్ అన్నారు. మండలోని గరికపర్రు, దేవరపల్లి, చాగంటిపాడు గ్రామాల్లోని ఎస్సీ కాలనీలలో 25లక్షల నిధులతో వాటర్ ట్యాంక్‌ల నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ వాటర్ ట్యాంకు నిర్మాణాలను 90రోజుల్లో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. ప్రాంతీయ పార్టీలైన టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు చేస్తున్న పాదయాత్రల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీలేదన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ రామదాసు, ఏఈ రాజు, తహశీల్దార్ ఎం బాబూరావు, ఎంపిడిఓ కెవి సాంబశివారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోర్ల రామచంద్రరావు, నాయకులు రాజేంద్ర, మట్టా అమృతబాబు, కళ్ళం సత్యనారాయణ రెడ్డి, టి వాసు, ఎన్ సత్యానారయణ, రాఘవరావు బ్రదర్స్ పాల్గొన్నారు.

కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణ శర్మ మృతి నాట్యరంగానికి
english title: 
vedantham

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>