ఏలూరు, నవంబర్ 19 : డిఎస్‌సి -2008లో నియామకం పొందిన 82 మంది సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులకు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. విధుల నుంచి ఎందుకు తప్పించకూడదో పది రోజుల్లోగా వివరించాలంటూ వారికి అందజేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే డిఎస్‌సి -2008 ద్వారా పరీక్షలు రాసి 2010 నవంబర్‌లో జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా నియామక పత్రాలు పొంది ఇప్పటికే రెండు సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న తమకు షోకాజు నోటీసులు జారీ చేయడమేమిటని అంటూ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులు జారీ చేసిన నియామక పత్రాలతోనే ఉద్యోగాలు చేస్తున్నామని వారు అంటున్నారు. ఇప్పుడు నియామకాలు చెల్లవంటూ నోటీసులు జారీ చేసి ఉద్యోగాలు తీసేస్తామని పేర్కొనడం అన్యాయమని వారు అంటున్నారు. నియామకాలకు సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే విద్యాశాఖ అధికారులను విచారించాలని వారు కోరుతున్నారు. బాధ్యులపై చర్యలను తీసుకోకుండా తమను బలిపశువులను చేయడం అన్యాయమని వారు అంటున్నారు.
రసవత్తరంగా సిబిఎస్‌ఇ హాకీ పోటీలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, నవంబర్ 19: స్ధానిక భారతీయ విద్యాభవన్స్‌లోని జాతీయ స్ధాయి సిబిఎస్‌ఇ హాకీ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. సోమవారం వివిధ జట్ల మధ్య పోటీ జరిగింది. అండర్-14 బాలికల విభాగంలో ఎస్‌జెఎన్ కలర్ తమిళనాడు పై హర్యానా 1-0 స్కోరుతో విజయం సాధించింది. బివిబి భీమవరం డాలి కాలేజ్ ఇండోర్ ఎమ్‌పి ల మధ్య జరిగిన పోటీలో 1-1 స్కోరుతో డ్రా అయింది. అండర్-14 బాలుర విభాగంలో ఎస్‌జిజిఎస్‌జె ఖల్సా అమృతసర్ (పంజాబ్) కోల్హాపూర్ పబ్లిక్‌స్కూల్ పై 1-0 స్కోరుతో విజయం సాధించింది. ఎస్‌జెఎన్ కలర్ ఎస్‌కెజి సీనియర్ హైస్కూల్ ఫంజియాబాద్ పై విపి 7-0 స్కోరుతో విజయం సాధించింది. బివిబి భీమవరం పై సెంట్‌మేరిస్ కానె్వంట్ అలహాబాద్ 3-1 స్కోరుతో గెలిచింది. అండర్ -19 బాలుర విభాగంలోఎస్‌జెఎస్ పబ్లిక్‌స్కూల్ రాయబరే విపి ఎస్‌బిఒఎ చెన్నై తమిళనాడు పై 5-1 స్కోరుతో విజయం సాధించింది. స్ప్రింగ్‌డాల్స్ సీనియర్ సెకండరీ స్కూల్ అమృతసర్ పంజాబ్ బిఎవి నెరల్ నేవి ముంబాయి పై 2-1 స్కోరుతో విజయం సాధించింది. అండర్-19 బాలికల విభాగంలో కొల్హాపూర్ పబ్లిక్‌స్కూల్ కొల్హాపూర్ ఎమ్‌పి ఆరోగ్య గరల్ప్ పబ్లిక్‌స్కూల్ పై పానిపట్ హర్యానా 1-1 స్కోరుతో డ్రా చేసుకున్నది. బిఎవిపిపి సీనియర్ సెకండ్ స్కూల్ హిసార్ విపి సిఆర్‌పిఎఫ్ స్కూల్ హైదరాబాద్ పై 12-0 స్కోరుతో విజయం సాధించింది. విద్యామందిర్ హరిద్వార్ ఉత్తరాఖండ్ సోఫియా గరల్స్ హైస్కూల్ అజ్మీర్ రాజస్ధాన్ పై 3-0 స్కోరుతో విజయం సాధించింది. వైట్‌హాల్ పబ్లిక్ స్కూల్ రాంపూర్ విపి అకాలి అకాడమీ బారుసాహెబ్ పంజాబ్ పై 4-0 స్కోరుతో విజయం సాధించింది.