హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఇచ్చిన నివేదికపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. మద్యం సిండికేట్ల అంశంపై సిబిఐ విచారణకు ఆదేశించేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఎసిబి నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ తెలపడంతో దానికి కోర్టు అంగీకరించింది. మద్యం సిండికేట్ల కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ నగరానికి చెందిన ఓ.ఎం.దేబర ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎసిబి విచారణ జరుగుతూనే ఉంది, ఎసిబి నివేదికపై హైకోర్టు తీసుకునే చర్యల కోసం వేచి చూడాలని అని కోర్టు వ్యాఖ్యానించింది. ఎసిబి ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు కావాలని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోరారు. దాంతో హైకోర్టు ఈ కేసు విచారణను ఐదువారాల పాటు వాయిదా వేసింది. హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పిజి ఘోష్, జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్ కూడిన ధర్మాసనం ఈ కేసు విచారించింది. గత డిసెంబర్ నుంచి ఎసిబి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్లపై దాడులు జరిపింది. మద్యం సిండికేట్లలో రాజకీయ నాయకులు, అధికారులకు పాత్ర ఉన్నట్టు ప్రచారం జరిగింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకు మద్యం సిండికేట్ల నుంచి నిధులు ముట్టాయని, వారిని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున సిబిఐ విచారణకు ఆదేశించాలని పిటీషనర్ కోరారు.
.................................
నెలాఖరున కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 20: పార్టీ సమన్వయకర్తలతోసభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం గాంధీభవన్‌లో సమీక్షించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత చురుగ్గా నిర్వహించేందుకు ఇక మీదట ప్రతి వారం ఒక జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేయించి, తానూ హాజరవుతానని బొత్స చెప్పినట్లు తెలిసింది. ఈ నెలాఖరున పార్టీ సీనియర్లు, ముఖ్య నేతల సమావేశాన్ని గాంధీభవన్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇన్‌ఛార్జి డిసిసిలను కొనసాగించనున్నట్లు చెప్పారు. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌ను వీడకుండా ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఆయన వారికి చెప్పారు. కొంత మంది ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీని వీడినా ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు.
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సిబిఐ విచారణ అవసరం లేదన్న హైకోర్టు
english title:
m
Date:
Wednesday, November 21, 2012