హైదరాబాద్, నవంబర్ 26: టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని ఆ పార్టీ ఎంపి విజయశాంతి తెలిపారు. సూర్యాపేటలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో తాను పాల్గొనకపోవడం వల్ల పార్టీ అధ్యక్షునితో విబేధాలు అంటూ ప్రచారం చేస్తున్నారని, ఇది నిజం కాదని అన్నారు. గత రెండు రోజుల నుంచి తీవ్రంగా జ్వరంతో బాధపడుతున్నానని ఆమె తెలిపారు. జ్వరం వల్ల బహిరంగ సభకు వెళ్లకపోతే విబేధాలు అని ప్రచారం చేయడం తగదని విజయశాంతి అన్నారు. అనారోగ్యం వల్ల బహిరంగ సభకు రాలేనని పార్టీకి ముందుగానే సమాచారం ఇచ్చినట్టు విజయశాంతి తెలిపారు. టిఆర్ఎస్ నాయకత్వంతో విజయశాంతికి విబేధాలు తలెత్తాయని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన సభకు ఆమె హాజరు కాకపోవడం వల్ల విబేధాల వల్లనే హాజరుకాలేదని మీడియాలో ప్రచారం జరగడంతో విజయశాంతి స్పందించారు.
అనారోగ్యం వల్లే సూర్యాపేటకు వెళ్లలేదు: విజయశాంతి
english title:
no differences with kcr
Date:
Tuesday, November 27, 2012