అనంతపురం, నవంబర్ 27 : రాయలసీమకు చెందిన చంద్రబాబుకు ఈ సీమ అభివృద్ధిపై చిత్తశుద్ధిలేదని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి సి రామచంద్రయ్య దుయ్యబట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయాలని గతంలోతాను బాబును అడిగితే ఆ ఆలోచన మానుకోమని తనకు ఉచిత సలహా ఇచ్చారన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరులో ఆయన మాట్లాడారు. 500 సంవత్సరాల క్రితం రాయలసీమలో రతనాలు అమ్ముకునే వారని చరిత్ర చెబుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి మొదలుపెట్టిన హంద్రీనీవా వల్ల రతనాలు అమ్మకపోయినా సీమ ప్రజలు గౌరవంగా బతికే అవకాశం దక్కుతోందన్నారు. చంద్రబాబును ఇదే విషయం గురించి అడగగా కేంద్రం నుంచి అనుమతి లేదని చెప్పారన్నారు. మిగులు జలాలను వినియోగించుకొని ప్రాజెక్టు నిర్మించుకోవడానికి కేంద్రం అనుమతి అవసరం లేదని చెప్పినా వినలేదన్నారు.
- మంత్రి సి రామచంద్రయ్య -
english title:
h
Date:
Wednesday, November 28, 2012