నారాయణఖేడ్ నవంబర్ 27: తెలంగాణ ఇచ్చేందుకు తన చేతుల్లో లేదని, ప్రత్యేక రాష్ట్రంకు టిడిపి వ్యతిరేకం కాదని, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం మీ కోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా మెదక్ జిల్లా ఖేడ్ మండలం నిజంపేట గ్రామం చౌరస్తాలో జరిగిన బహిరంగా సభలో ఆయన మాట్లాడారు. ఎన్‌టిఆర్ సిఎం అయిన అనంతరం తెలంగాణ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేశారని బాబు తెలిపారు. తెలుగుదేశం హయాంలో అన్ని రంగాలలో అభివృద్ధ్దికి చర్యలు తీసుకుని పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి పేదలను ఆదుకున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తామని హామీ ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, టిఅర్‌ఎస్ పార్టీలు తెలుగుదేశంపై తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణకు తెలుగుదేశం వ్యతిరేకమని అంటున్నారని, అది నమ్మవద్దని ఆయన ప్రకటించారు. కెసిఆర్ తన కుటుంబాన్ని బాగు చేసుకునేందుకు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్‌కు తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. ఆరు నెలలు ఫాంహౌస్‌లో ఉంటూ, ఆరు నెలలు అనంతరం బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమం ఉద్ధృతం చేయాలని తెలంగాణ వాదులను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం తప్ప మరో పని లేదని, విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగి పేద ప్రజలు జీవించలేని విధంగా కాంగ్రెస్ నాయకులు దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. అందుకోసమే అవినీతిని అంతం చేసేందుకు పేదల పార్టీ తెలుగుదేశాన్ని ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సింగూరు నీటిను జిల్లా వాసులకు అందించేందుకు ఎన్‌టిఆర్ సుజల పథకం ప్రత్యేకించి ప్రారంభించి తాగునీరు అందిస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. గిరిజనులకు ప్రత్యేక పథకాలను. వృద్ధులకు నెలకు 600 పింఛన్లు, బెల్ట్‌షాపుల నివారణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రోజుకు 9గంటలు విద్యుత్తు సరఫరా చేసి రైతులు ప్రగతి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగ భృతిని ఇప్పిస్తామని తెలిపారు. మాదిగలను ఎబిసిడి వర్గీకరణ చేయిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన తండాలను కలిపి పంచాయతీలుగా ఏర్పాటు చేసి సిసిరోడ్లు, మురికి కాల్వలు నిర్మిస్తామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారికి ప్రత్యేకించి నేరుగా లక్ష రూపాయలు రుణాలను గ్యారంటీ లేకుండా ఇప్పిస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని ఆదరించి ఆదుకోవాలని చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు స్పష్టీకరణ
english title:
t
Date:
Wednesday, November 28, 2012