Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు త్వరలో ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు

$
0
0

పెద్దారవీడు, నవంబర్ 27: పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన సుంకేశుల గ్యాప్ కింద ఉన్న నిర్వాసితులకు స్థలాలు కేటాయించామని, త్వరలో ఆర్‌ఆర్ ప్యాకేజీని అమలు చేసేందుకు కృషి చేస్తానని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీనృశింహం యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ నిర్వాసితులకు తెలిపారు. మంగళవారం సుంకేశుల గ్యాప్ కింద ఉన్న ముంపుగ్రామాల నిర్వాసితులకు కేటాయించిన స్థలాలను వారు పరిశీలించారు. నిర్వాసితులకు పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టులో సర్వేనెంబర్ 136 నుంచి 154వరకు 120 ఎకరాల స్థలంలో గుండంచర్ల, కలనూతల నిర్వాసితులకు స్థలాన్ని కేటాయించగా ఆయన పరిశీలించారు. తోకపల్లి దగ్గర సర్వేనెంబర్ 282, 296, 297, 299, 300లలో సుంకేశులకు చెందిన 400 కుటుంబాల దళితులకు స్థలాన్ని కేటాయించగా జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే సురేష్‌లు పరిశీలించారు. మార్కాపురం మండలం ఇడుపూరు పరిధిలో కలనూతల, గుండంచర్ల గ్రామాల కొంతమంది నిర్వాసితులకు సుమారు 64 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో వారు పరిశీలించారు. గోగులదినె్న గ్రామంలో సుంకేశుల గ్రామస్థులకు స్థలాన్ని కేటాయించగా జెసి లక్ష్మీనృశింహం, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, సురేష్ పరిశీలించారు. నిర్వాసితులకు కేటాయించిన స్థలాల్లో గృహాలు నిర్మించుకునట్లైతే ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈకార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఆర్డీఓ ఎం రాఘవరావు, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ రామ్మోహన్‌రావు, వెలుగొండ ప్రాజెక్టు ఇఇ రాఘవరెడ్డి, డిఇ వెంకటేశ్వరరెడ్డి, తహశీల్దార్లు బి సత్యనారాయణ, షేక్ నాగూర్‌షరీఫ్, ఎస్‌డిసి కె బాబురావు, గ్లోరియా, సర్వేయర్ శివశంకర్, ఆర్‌ఐలు ఎస్‌కె పర్వీన్, ఎస్‌కె ఖలీల్, విఆర్‌ఓలు షేక్ బడేసాహెబ్, ప్రభుదాసు, డివి రమణారెడ్డి, ఏలియా, టిడిపి పట్టణ అధ్యక్షులు టి బాలసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

‘మద్యం దుకాణం ఎత్తివేయాలి’
ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి
ఒంగోలు, నవంబర్ 27: చీరాలలోని అయోధ్యనగర్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతిగృహం, బాలికల స్కూలు, నివాస గృహాల మధ్య ఏర్పాటుచేసిన మద్యం దుకాణాన్ని వెంటనే ఎత్తివేయాలని సిపిఐ నాయకులు, అయోధ్యనగర్ వాసులు డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో గల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ మాట్లాడుతూ ఎస్సీ , ఎస్టీ విద్యార్థుల వసతిగృహం, బాలికల స్కూల్, నివాస గృహాల మధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం వల్ల అక్కడివారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మద్యం దుకాణం నడుపుతున్న వ్యక్తికి చీరాల ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ అండదండలు ఉండబట్టే తాము గత కొంతకాలంగా దుకాణాన్ని ఎత్తివేయాలని ఆందోళన చేస్తున్నప్పటికి అధికారులు మద్యం దుకాణాన్ని తొలగించడం లేదని విమర్శించారు. ఎక్సైజ్ అధికారులు కూడా ఈ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. కొంతమంది మద్యానికి బానిసలై తమ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఒకపక్క పేదలను అభివృద్ధి చేస్తామని చెబుతూ మరోపక్క మద్యం దుకాణాలను పెడుతూ పేదల బతుకులను ప్రభుత్వం బజారుపాలు చేస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైన అయోధ్యనగర్‌లో ఉన్న మద్యం దుకాణాన్ని ఎత్తివేయకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. దీనితో కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ నాయుడు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాష్ట్ర అధికారులతో మాట్లాడి అయోధ్యనగర్‌లోని మద్యం దుకాణాన్ని ఎత్తివేసేందుకు కృషి చేస్తామని సిపిఐ నాయకులకు కలెక్టర్ తరపున హామీ ఇచ్చారు. తొలుత డిసితో జరిగిన చర్చల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ, సిపిఐ నాయకులు యు ప్రకాశరావు, ఎంఎల్ నారాయణ, స్థానిక నాయకులు అప్పారావు, శ్రీమన్నారాయణ, నాగార్జున, ఆంజనేయులు, ఆర్ వెంకట్రావు, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు జి వసంత్, ఎఐవైఎఫ్ నాయకులు జి శివాజీ తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా అమ్మవారి గ్రామోత్సవం
పామూరు, నవంబర్ 27: శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి నూతన ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా మూడవరోజు మంగళవారం ఉదయం దేవస్థానం వద్దగల యాగశాలలో గణపతిపూజ, పునఃపూజలు, మహార్చనలు, యంత్రజపాంగ హోమాలు, లక్ష్మణోధార హోమాలు, ధాన్యాదివాసం, ధాన్యాదివాసాగం హోమాలు, సామూహిక కుంకుమ పూజలు, నిరాజనమంత్ర పుష్పములు వేద పండితులు నిర్వహించారు. అనంతరం సాయంత్రం వాసవీమాత గ్రామోత్సవం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారిని పురవీధులలో ఊరేగించారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సోదరులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం బాణాసంచా, మంగళవాయిధ్యాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం నుండి ఆర్యవైశ్య సోదరులు పట్టణంలోని దుకాణాలు మూసివేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వద్ద ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షుడు విశ్వనాథుని సత్యనారాయణ (మణికంఠ), మంచిగంటి సుబ్బారావు, కొప్పత్తి వెంకటేశ్వర్లు, గోపాల్, మంచిగంటి రమేష్‌బాబు (బుజ్జి), ఏల్చూరి బాలకొండలరావు, రామారావు, మాదాల మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సర్‌చార్జీలు రద్దు చేయాలి
* కాగడాల ప్రదర్శనలో ఎమ్మెల్యే కందుల డిమాండ్
మార్కాపురం, నవంబర్ 27: సర్‌చార్జీల పేరిట ప్రజలపై మోపిన భారాన్ని రద్దు చేయాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక గడియారస్తంభం సెంటర్‌లో కాగడాల ప్రదర్శన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను అనేక పర్యాయాలు పెంచి ప్రజలపై భారం మోపిందని, చార్జీలు పెంచినప్పటికీ సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రైతులకు వ్యవసాయ రంగానికి 7గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. రైతులు వర్షాభావ పరిస్థితుల్లో విద్యుత్‌పై ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్నారని, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని కందుల అన్నారు. ప్రభుత్వం ఎప్పుడో పెట్టుబడులు పెట్టి ఇప్పుడు సర్‌ఛార్జీల పేరిట ప్రజలపై భారం మోపడాన్ని హైకోర్టు మొట్టికాయ వేసినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్‌చాఛార్జీలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా టిడిపి అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, రాష్ట్ర వాణిజ్యవిభాగం కార్యదర్శి ఇమ్మడి కాశీనాధ్, మాజీమున్సిపల్ చైర్మన్ జక్కాప్రకాశ్, మాజీకౌన్సిలర్ టి సత్యనారాయణ, టిడిపి నాయకులు ఖాన్, పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు బాలసుబ్బారావు, అమిరుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.

‘స్ర్తి నిధి అమలు లక్ష్యం రూ. 45 కోట్లు’
కొమరోలు, నవంబర్ 27: జిల్లాలో స్ర్తినిధి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు 45 కోట్ల రూపాయల లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 21కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేశామని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ తెలిపారు. బుధవారం స్థానిక ఐకెపి కార్యాలయాన్ని సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ స్ర్తి నిధి అమలుకు గ్రేడ్లుగా విభజించారని, ఎ గ్రేడ్‌కు కోటి 50లక్షలు, బి గ్రేడ్‌కు కోటి రూపాయలు, సి గ్రేడ్‌కు 50లక్షలు, డి గ్రేడ్‌కు 25లక్షలుగా నిర్ణయించారని ఆమె తెలిపారు. జిల్లాలోని 21 మండలాల్లో ఎ గ్రేడ్‌లు ఉన్నాయని తెలిపారు. గిద్దలూరు క్లస్టర్ పరిధిలోని ఆరు మండలాల్లో అర్ధవీడు మండలం ఎ గ్రేడ్‌లో ఉండగా కొమరోలు సి గ్రేడ్‌లో ఉందని తెలిపారు. వచ్చేఏడాది మార్చి నాటికి జిల్లాలో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. గిద్దలూరు క్లస్టర్ లక్ష్యం 5.5కోట్లు కాగా ఇప్పటివరకు 2.2కోట్లు పూరె్తైందని తెలిపారు. 2008-09లో బ్యాంకుల ద్వారా పొందిన రుణాలకు పావలావడ్డీ చెల్లించేందుకు 57లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాజీవ్ యువకిరణాలు పథకం అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో బేస్తవారపేట ఏరియా కోఆర్డినేటర్ రాంబాబు, స్ర్తి నిధి యాంకర్ పర్సన్ పిచ్చయ్య, ఎపిఎం పాండురంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

* జెసి లక్ష్మీనృశింహం
english title: 
rr package

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>