కొవ్వూరు, జనవరి 28: కొవ్వూరు ఆర్టీసీ డిపో పునరుద్ధరణ పరిశీలనలో ఉందని, సంస్థాగతంగా అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకుని డిపో పునరుద్ధరణకు త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి బి ప్రసాదరావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే టివి రామారావు నివాసానికి శనివారం ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు, రాష్ట్ర తెలుగు యువత నాయకులు సూరపని రామ్మోహన్ కొవ్వూరు డిపోను పునరుద్ధరించాలని ఎండి ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు మాట్లాడుతూ కొవ్వూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, గిరిజన ప్రాంతాలకు ముఖద్వారంగా ఉన్న కొవ్వూరులో డిపోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డిపో పునరుద్ధరించాలని కోరారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆర్టీసీ ఎండి ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 15 చోట్ల ఆర్టీసీకి చెందిన ఆస్తుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. డిమాండును బట్టి మిగిలిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద నుండే బస్సు టిక్కెట్టును బుక్ చేసుకునే ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులను అధికంగా నడపడానికి కేంద్ర ప్రభుత్వ పథకం జవహర్‌లాల్ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్‌లో 1600 బస్సులు తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది హైదరాబాదు, విజయవాడ, తిరుపతి నగరాలకు 1540 బస్సులు వచ్చాయని ఆయన తెలిపారు. బస్సు ఏ ప్రాంతంలో ఉందో గుర్తించడానికి వీలుగా పాసించర్స్ ఇన్ఫర్మేషన్ పద్ధతిని కూడా ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రానికి 4 వేల కొత్తబస్సులు వస్తున్నాయని ఎండి వివరించారు.
కౌన్సిలింగ్‌కు ప్రాధాన్యత
*వినూత్న శైలిలో జెసి జాబ్‌మేళా*ఏజెన్సీలో ఫిబ్రవరి 1న నిర్వహణ
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జనవరి 28: విస్తృతంగా సాగుతున్న జాబ్‌మేళాలలో కౌన్సిలింగ్ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, దానిపైనే తాను దృష్టి పెడతానని జాయింట్ కలెక్టరు డాక్టరు టి బాబూరావునాయుడు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన ఏజన్సీ పరిధిలోని మూడు నిర్వాసిత గ్రామాలకు చెందిన విద్యావంతులైన యువతకు ప్రత్యేక జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఉద్యోగ అవకాశాలు చూపటం కాకుండా వారు అక్కడ నెగ్గుకు వచ్చేలా అభ్యర్ధులను తీర్చిదిద్దటమే తన లక్ష్యమని చెప్పారు. దీనికోసం అభ్యర్ధులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించటంతోపాటు వారి అభిరుచులకు కూడా పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. శనివారం ఆయన 3ఆంధ్రభూమి ప్రతినిధి2తో మాట్లాడుతూ జాబ్‌మేళా ద్వారా ఎంతోమందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అభ్యర్ధులపైనే ఉన్నప్పటికీ వారిని అందివచ్చిన అవకాశాలకు తగిన విధంగా సిద్ధం చేయటం అంతకుమించి ముఖ్యమని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో తాను పనిచేసిన కాలంలో సిద్ధం చేసే ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అవకాశాలు లభించిన అభ్యర్ధులు అయారంగాల్లో స్ధిరపడి ఉన్నత స్ధానాలను అధిరోహించారని గుర్తు చేసుకున్నారు. అదే విధానాన్ని గిరిజన అభ్యర్ధులకు వర్తింప చేయటం ద్వారా వారిని కూడా ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా పలు గ్రామాలు నిర్వాసితమవుతున్న విషయం తెల్సిందేనని అటువంటి గ్రామాలకు చెందిన విద్యావంతులైన యువతకు ముందుగా ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వారిని ముందుగానే ఉద్యోగంలో ఎదురయ్యే పరిస్ధితులు, ఆ ప్రాంతాల స్ధితిగతులు, ఇతర అంశాల విషయంలో మరింత అవగాహన పర్చి ఎటువంటి పరిస్దితులనైనా ఎదుర్కొనే విధంగా మానసికంగా వారిని సిద్ధం చేస్తామని చెప్పారు. ఈవిషయంలో ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల గిరిజన అభ్యర్ధులు ఉద్యోగాల్లో స్ధిరపడగలుగుతారని చెప్పారు. అభ్యర్ధులనే కాకుండా వారి కుటుంబం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అభ్యర్ధుల తల్లిదండ్రులకు తమ కుమారులు ఎక్కడ పనిచేస్తారు, ఏ పరిస్ధితుల్లో ఉంటారన్నది పూర్తిగా అవగతం అయ్యేలా చేస్తామని చెప్పారు. వారి తల్లిదండ్రులను అభ్యర్ధులు పనిచేసే ప్రాంతాలకు తీసుకువెళ్లి మరీ ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. దీనివల్ల అభ్యర్ధులు ఎటువంటి ఆందోళనా లేకుండా తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారని చెప్పారు. వీటితోపాటు అభ్యర్ధులకు ఇండోర్ శిక్షణ కూడా అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనివల్ల అభ్యర్ధులు తమ ఉద్యోగ స్ధానాల్లో ఏవిధంగా వ్యవహరించాలన్న విషయంలో ముందుగానే సిద్ధం కాగలరని, భవిష్యత్‌లో ఇది వారికి ఎంతగానో ఉపకరిస్తుందని వివరించారు. తన గత అనుభావాల్లో భాగంగా రాష్టవ్య్రాప్తంగా ఎంతోమంది నిపుణుల సహకారం లభించిందని, వారి సహకారాన్ని జిల్లాలోని గిరిజన అభ్యర్ధులకు ఉపయోగపడేవిధంగా తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన జరిగే గిరిజన అభ్యర్ధుల జాబ్‌మేళాకు విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుండి నిపుణులను ఆహ్వానించినట్లు తెలిపారు. వీరి ఆధ్వర్యంలో గిరిజన అభ్యర్ధులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. దాదాపుగా అయిదురోజుల పాటు ఇది కొనసాగించాలని నిర్ణయించినట్లు వివరించారు. నిర్వాసిత గ్రామాలైన దేవరగొందిలో 80మంది, తోటగొందిలో 29, మామిడిగొందిలో 45మంది గిరిజన విద్యావంతులను ఇప్పటికే గుర్తించామని, వీరికోసమే ఈ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన పోలవరంలోని సుజల అతిధిగృహంలో ఈ జాబ్‌మేళా జరుగుతుందన్నారు. వినూత్న రీతిలో నిర్వహించనున్న ఈ జాబ్‌మేళా పూర్తిస్ధాయిలో విజయవంతం అవుతుందన్న నమ్మకం తనకు ఉందని జాయింట్ కలెక్టరు పేర్కొన్నారు.
కొవ్వూరు ఆర్టీసీ డిపో పునరుద్ధరణ పరిశీలనలో ఉందని, సంస్థాగతంగా అన్ని విషయాలూ పరిగణనలోకి
english title:
kovvur rtc depot punaruddarana
Date:
Sunday, January 29, 2012