ఆకివీడు, జనవరి 28: ఎనిమిది సంవత్సరాల వరకు పరబ్రహ్మ స్వరూపునిగా ఆంజనేయస్వామి లోకాన్ని రక్షిస్తాడని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామీజీ పేర్కొన్నారు. స్థానిక దత్తక్షేత్రంలో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠామహోత్సవం సంధర్భంగా జరిగే పూజాకార్యక్రమాల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ మతాలతో సంబంధం లేకుండా ఆంజనేయజపం చేస్తున్నారన్నారు. శాంతాస్‌లోకి రామాయణ్ సిడిని ఇంటర్నెట్ ద్వారా వెయ్యికోట్ల మంది భక్తులు జపం చేసారన్నారు. అనేక దేశాల్లో ఆంజనేయ నామస్మరణ చేస్తున్నారన్నారు. శరీరం, బుద్ధి, మనస్సు అదుపులో ఉంచుకుని స్వామి ధ్యానం చేయడం ద్వారా ముక్తిని పొందవచ్చునన్నారు. ఈకార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు జిఎస్‌ఆర్ కృష్ణమూర్తి, కంభంపాటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
‘చింతలపూడి’ తాడిపూడిలోనే ఖరారు!
తాళ్లపూడి, జనవరి 28: అఖండ గోదావరి నది కుడి గట్టున నిర్మించ తలపెట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం అధికారులు ముందుగా నిర్ణయించిన విధంగానే తాడిపూడి వద్దే జరగనుంది. ఈ మేరకు అధికార వర్గాల నుంచి ఖరారైందన్న సమాచారం వెలువడింది. గత కొన్ని నెలలుగా చింతలపూడి ఎత్తిపోతల పథకం తాళ్లపూడి మండలంలో నిర్మించవద్దంటూ రైతులు ఆందోళన చేయడం, ఇటీవల ఎమ్మెల్యే టి.వి.రామారావు కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం అందరికీ తెలిసిందే. అలాగే మొదట్లో రైతులంతా ఒకటిగా ఉండి, చివర్లో రెండువ ర్గాలుగా విడిపోవడం అధికారులకు అవకాశం కలిగిందన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా మెగా ఇన్‌ఫ్రాస్ట్రకల్చర్ కంపెనీ ఆధ్వర్యంలో సర్వేలు జరపడం ఈ ప్రాంత రైతులకు అనుమానాలు ప్రారంభ మయ్యాయి. పోలవరం మండలంలో నిర్మిస్తారన్న ఎత్తిపోతల తాళ్లపూడి మండలానికి బదిలీ చెయ్యటం వెనుక నాయకుల హస్తాలున్నాయని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తాళ్లపూడి మండలంలో నిర్మాణం వల్ల ఈ ప్రాంత రైతులు భూములు మరోసారి కోల్పోయి బలికాలేక వీధికెక్కారు. రైతుల ఆందోళన ఒక పక్క జరుగుతున్నా, ఇంజనీరింగ్ అధికారులు మాత్రం తమ పనులు కొనసాగిస్తూ, సర్వే పూర్తిచేసి, భూసేకరణ ప్రకటన చేసి దాదాపు పనులు చేపట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే అధికారుల భోగట్టా ప్రకారం చింతలపూడి ఎత్తిపోతల పథకం 27.20 కి.మీ వద్ద నిర్మించ నున్నారు. చివరిసారిగా కొవ్వూరు ఎమ్మెల్యే టి.వి.రామారావుప్రతిపాదించినట్లు పైప్‌లైన్‌పై పైప్‌లైన్ గాని, భూమిపై పైప్‌లైన్ గాని, స్థంభాలపై పైప్ నడపడం కాని కుదరదని, చింతలపూడికి ప్రత్యేక పైప్‌లైన్ అదీ భూమిలో నుంచే నడపాల్సి ఉందని, సాంకేతిక నిపుణులు వెల్లడిస్తున్నారు. దాదాపు 1700 కోట్ల అంచనాలతో చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏకంగా 140 మీటర్లు కాంటూర్ లెవిల్‌లో పైప్‌లైన్ నడవాల్సి ఉన్నందున 3 మీటర్లు డయాలో 4 లైన్స్ నడుపుతారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం కంటే 100 కాంటూర్ ఎక్కువ ఎత్తులోకి నీరు వెళ్లాల్సి ఉంది. ఇక చింతలపూడి ఎత్తిపోతల పథకంలో స్టేజ్-2లో పనులు పూర్తయ్యాయి. స్టేజ్-1లో పంప్ హౌస్, పైప్‌లైన్ నిర్మాణాలే పూర్తి కావాల్సి ఉంది. అయితే కొంత కాలంగా ఆందోళన చెందుతున్న రైతులకు ఎమ్మెల్యే కోరినట్లు అధిక మొత్తంలో నష్టపరిహారం ప్రభుత్వం నుంచి రావాలి తప్ప చింతలపూడి ఏర్పాట్లతో ఏ మాత్రం మార్పులు లేవన్నది ఖచ్చితం.
మైసూరు దత్తపీఠాధిపతి సచ్చిదానందస్వామి
english title:
lokaniki parabrahma
Date:
Sunday, January 29, 2012