శిల్పాశెట్టి వెరీ బిజీ యూ నో! బిజీనా? ఏ విషయంలో అని అడక్కండి. శిల్ప -రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి కొద్దిపాటి విరామం ప్రకటించింత్తర్వాత.. మరింత బిజీగా మారిపోయింది. మొన్నా మధ్య ఐపిఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వార్న్.. అతగాడి కాబోయే భార్య ఎలిజబెత్ హార్లే ముంబైని సందర్శించిన సందర్భంలో ‘శిల్ప’ గ్రాంట్ పార్టీ ఏర్పాటు చేసింది. రాజ్ కుంద్రాకీ.. ఐపిఎల్ ఆటగాళ్లతో ఉన్న సన్నిహిత సంబంధాలే దీనికి కారణమట. ఈ విషయం ట్వీట్ చేస్తూ.. ఎట్ ది రేట్ ఆఫ్ వార్నే888.. ఎలిజబెత్ హార్లేమా ఇంటికి రావటం.. తీయ్యటి అనుభూతిని పంచింది. ఆ సాయంత్రం ఎంతో హాయిగా గడిచింది’ అంటూ చెప్పుకొచ్చింది. సునీల్‌శెట్టి - మనా శెట్టి.. గాయత్రీ జోషి - వికాస్ ఓబెరాయ్.. చుండీ పాండే - భావనా పాండే.. గౌతమ్ షాంఘై - నవాజ్.. ఇలాటి తమ భార్యలూ భర్తలతో విచ్చేసి ఆనాటి విందుని విజయవంతం చేశార్ట. మొత్తానికి పార్టీలతో ‘శిల్ప’ ఇల్లు కళకళ లాడుతోందిట. ఏది ఏమైతేనేం - శిల్ప బిజీబిజీ.
చిరాకు?
‘పెళ్లికూతురు కావలెను’. వరుడు వయసు 46 ఏళ్లు. కండలు తిరిగిన శరీరం. కోట్ల కొద్దీ ఆస్తి. మనసు వెన్న - అంటూ అడ్వర్టయిజ్‌మెంట్ ఇస్తే బావుణ్ణు. అభిమానుల ఆశ కొంతైనా తీరుతుంది. ఇండస్ట్రీలో నడుస్తున్న హాట్ టాపిక్ ఇది. ఒంటిమీదికి 46 ఏళ్లు వచ్చినా పెళ్లి ధ్యాస లేని సల్మాన్‌ఖాన్ చూసి ప్రతి ఒక్కరూ జాలి చూపిస్తున్నార్ట. కారణం తరచి చూస్తే - మొన్నామధ్య ఓ అవార్డుల ఫంక్షన్‌కి వెళితే ‘ఫిజికల్లీ ఛాలెంజ్డ్’ వ్యక్తి తన పెళ్లి ఇన్విటేషన్ ఇవ్వటానికి వచ్చాట్ట. దీంతో ఒళ్లు మండిన సల్మాన్ ‘ఆప్ ముఝే షాదీ కా ఇన్విటేషన్ దే రహెహో యా జలా రహే హో’ అన్నాట్ట. ఇప్పటికే పెళ్లిళ్లకీ పేరంటాళ్లకీ వెళ్లటానికి సల్మాన్ విముఖత చూపిస్తూంటే మళ్లీ ఇదొకటా? అని సన్నిహితులు వాపోతున్నారు. ఇకనైనా ఆ బ్యాచిలర్ లైఫ్‌కి విడాకులివ్వకపోతే ఇంకెంత అభాసుపాలు కావల్సి ఉంటుందో?
ప్రేమలో ‘షారూఖ్’ కూతురు?
చాన్నాళ్ల క్రితం - కుచ్‌కుచ్ హోతా హై చిత్రంలో ముద్దుముద్దు మాటలతో మురిపించి.. కంట తడిపెట్టించిన ‘సన’ జ్ఞాపకం ఉందా? అప్పటి షారూఖ్‌ఖాన్ కూతురు తాజాగా ప్రేమలో పడిందిట. త్వరలోనే పెళ్లికూతురూ అవనున్నదిట. తాజాగా కరన్ జోహర్ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’లో కథానాయిక నటించబోతోంది. ఓ వైపు షూటింగ్ వర్క్ జరుగుతూండగా మరోవైపు ‘సన సయీద్’ సహ నటుడు సాహిల్ ఆనంద్ ‘తొలి ప్రేమ’లో కూరుకుపోయిందిట. వీరిద్దరూ తరచూ పబ్‌ల్లోనూ.. క్లబ్బుల్లోనూ కనిపించి వీక్షకుల బుర్రలో ‘క్వొశ్చన్లు’ రేకెత్తించటంతో ఇండస్ట్రీ ఈ విషయం గురించి కన్‌ఫర్మ్ చేసేసుకుంది - ప్రేమ పక్షులని. నిన్నగాక మొన్న - సినిమా తండ్రి ప్రేమని గెలిపించిన చిన్నది అప్పుడే... ప్రేమలో పడిందా? దీనికి ఖాన్ ఏమంటాడో?
అబ్బబ్బ...
నేటి సినిమాల్లో ‘ముద్దు’ సీన్లు సర్వసాధారణం. తాజాగా ఆ కేటగిరీలోకి సంజయ్ లీలా బన్సాలీ చిత్రం వచ్చి చేరింది. గుజరాతీ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ కథకి ‘కిస్’ మిస్‌లను కలిపి ప్రేక్షకులపైకి త్వరలోనే వదలబోతున్నారు. దీపికా పదుకొనె - రణ్‌వీర్ సింగ్ జంట ఆ ముద్దూ ముచ్చట్లతో మురిపించనుంది. ఆన్‌స్క్రీన్‌పై ‘ముద్దు’ గురించి నిర్వచించమని అడిగితే దీపిక ఎంతో వొద్దికగా.. ప్రొఫెషన్ అన్న తర్వాత కమర్షియల్ బ్రేక్ కోసం ఇటువంటి హాట్‌హాట్ సన్నివేశాల్లో నటించక తప్పదు. ఎంతో కన్ఫర్టబుల్‌గా అనిపించింది. రణ్‌వీర్ కళ్లల్లో వెయ్యి వోల్టుల మెరుపు కనిపించింది అంటూ చెబుతోంది. సరసన ఉన్న రణ్‌వీర్ కూడా - దీపిక బుగ్గల్లో ఎరుపు చూశా. నా జీవితంలో ఇంతటి సెక్సీ భామని చూళ్లేదు అంటూ కితాబు కూడా ఇచ్చాడు. ఒకరిని ఒకరు ప్రశంసించుకోవటం కాదు - ఇంతకీ ఆ హాట్ ముద్దుని వీక్షించే భాగ్యం ఉందా? లేదా? అని సగటు ప్రేక్షకుడి ప్రశ్న. ఈ మధ్య ‘సెన్సార్’ వాళ్లు కూడా చూసీ చూడనట్టు ఊరకుంటున్నారు కాబట్టి ఆ ఛాన్స్ ఉండొచ్చు.