తెలుగుసినిమా అంటే మంచి పాటకు చిరునామా. పాటలు లేకుండా సినిమా చూడ లేకపోవడం అన్న అభిరుచి ఇప్పటికీ అలాగే నిలిచివున్నా, సాహిత్యపు విలువలు మాత్రం నానాటికీ తీసికట్టవుతున్నాయ. కొత్త పాటలు బాగులేవని గొంతు చించుకోవడం కన్నా, పాత పాటల్లోని మాధుర్యాన్ని ఓసారి గుర్తు చేసుకోవడమే ఈ శీర్షిక ఉద్దేశం. పాఠకులు కూడా తమకు గుర్తున్న మంచి పాటలను కార్డుపై రాసి పంపించవచ్చు. బాగా పాపులర్ అయన పాత పాటల కన్నా, మరిచిపోతున్న మంచిపాటలను గుర్తుచేయడం ముఖ్యం.
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
కరి మబ్బులు కమ్మేవేళ
మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ
వేగుచుక్కే వెలుగు
కరి మబ్బులు కమ్మేవేళ
మెరుగు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ
వేగు చుక్కే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో
వౌనమే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో
వౌనమే వెలుగు
దహియించే బాధల మధ్యన
సహనమే వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
కడలి నడుమ పడవ మునిగితే
కడదాకా ఈదాలి
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైనా
తాగి బతకాలి
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైనా
తాగి బతకాలి
ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు
ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు
జగమంతా దగాచేసిన
చిగురంత ఆశను చూడు
చిగురంత ఆశ జగమంత వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
===================
ఈ పాట మీకు తెలుసా?
ఏ సినిమాలోది?
గీత రచయిత ఎవరు?
సంగీత దర్శకుడు ఎవరు?
మాకు తెలియచేయనక్కరలేదు..
మీరు గుర్తు చేసుకుంటే చాలు..
తెలియకుంటే, వివరాలు వచ్చేవారం ఇక్కడే.
================
గతవారం పాట
సినిమా : ఇదికథకాదు
సంగీతం : యంఎస్.విశ్వనాథన్
రచన : ఆచార్య ఆత్రేయ