సినిమాల్లో అనుకుంటే టీ.వి. సీరియల్స్‌లో కూడ పోలీసులను కించపరిచే విధంగాను జోకర్లుగాను చూపిస్తున్నారు. ఆ విధంగా చూపించటం భావ్యమేనా? పోలీసు అనబడే ఆరు అక్షరాల పదకలయిక పోలీసు పదం, ఒక్కొక్క అక్షరానికి ఒక గొప్ప మాట కలిగి వుంది. హోం డిపార్ట్‌మెంట్ అంటే దేశంలో అత్యున్నత స్థానాన్ని సంపాదించుకొన్నది. పోలీసుకు వున్న గౌరవం, అధికారం పోలీసుకు వుంటుంది. పైఅధికారులకు వుండవలసి దర్పం, అధికారం వుండవచ్చు కాని అందరిని కలిపి వెకిలి చేష్టలతో చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక పోలీసు అధికారి ముందు తన క్రింది స్థాయి ఉద్యోగిని జోకర్లుగా చిత్రీకరిస్తున్నారు. ఒక సీరియల్‌లోనైతే ఏకంగా ఒక సి.ఐని కిడ్నాప్ చేయడం, అతనిని తమ ఆధీనంలో వుంచుకొని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సహించడం సబబు కాదు. నిజ జీవితంలో మనం పోలీసు వ్యవస్థను ఎలా సమర్ధించుకొంటామో సీరియల్స్‌లో అలా చూపించడం లేదు. కాబట్టి పోలీసులను గౌరవంగాను, ఒక బాధ్యతగల ఆఫీసర్లుగా చూడండి. వారిని కించపరిచే సీరియల్స్‌లో మార్పు తీసికొని రావాలని కోరుకుంటూ పోలీసు అమరవీరులకు మన శ్రద్ధాంజలి ఘటిస్తాం.
- మార్కస్ మణిరాజ్, ముద్దనూరు
అర్బన్ బ్యాంకును తెరిపించాలి
వంద ఏండ్ల చరిత్రగల విజయనగరం కోపరేటివ్ అర్బన్ బ్యాంకు నెం.1358 నాలుగుబ్రాంచిలు వేల సంఖ్యలో ఖాతాదార్లు సిబ్బంది 60 మంది, వినియోగదార్లతో డైరెక్టర్ల ఎన్నికలు, అన్ని బ్యాంకులు కన్నా డిపాజిట్లు పై అధిక వడ్డీ, రుణాలపై తక్కువ వడ్డీలు ఇంటింటా డైలీ కలెక్షన్లుతో బ్యాంకు నిండుగా వుండేది. ఈ బ్యాంకులో నిల్వవున్న ప్రజాసొమ్మును ఆర్‌బిఐ అనుమతి లేకుండా రాష్ట్ర కోఆపరేటివ్ వాసవి బ్యాంకులో జమ చేశారు. దీంతో బ్యాంకు పనులు ఆగిపోయి బ్యాంకు మూతపడి మూడు ఏండ్లు అయింది. ఈ బ్యాంకులో ఉన్న షేరు ధనాలు, ఎస్‌బి అకౌంట్లు మెచ్యూరిటీ అయిన డిపాజిట్లు సొమ్ము నేటికి మాకు అందలేదు. గ్రామానికో బ్యాంకు సూక్తులు పాడే సర్కార్ ఈ బ్యాంకులో ప్రజలకు రావలసిన సొమ్ములు ఇప్పించాలి.
- బొంగహరిగ్రహం, విజయనగరం
హిందూ దేవాలయాలపై చిన్న చూపు తగదు
రాష్ట్ర ప్రభుత్వం హిందువులన్నా, పవిత్ర దేవాలయాలన్నా నిర్లక్ష్యంగా చిన్నచూపు చూస్తోంది. పైగా పవిత్ర దేవాలయాలలో దొంగలు దాడిచేసి నగలు, నగదు దోచుకొని పోతున్నారు. మరి కలియుగ వెంకన్నకు చేరుతున్న కోట్లాది రూపాయలు, నగలను కాపాడాల్సిన బాధ్యత కల్గిన ప్రభుత్వాధికారులు, మంత్రులు తమ విలాసాలకు వినియోగించుకుంటుంటే వెంకన్నస్వామి వారు ఊరుకుంటాడా? ఆయన కలియుగాంతం వరకు భక్తులు సమర్పించే ముడుపులైన కోట్లాది ధనం నగలు కుబేరస్వామికి యివ్వాలిగదా!? ఎంతటి వారినైనా స్వామివారు శిక్షిస్తారని గ్రహించాలి. ధర్మబద్ధంగా అన్ని మతాలను సాంప్రదాయాలను ప్రభుత్వం పాటించాలి. గౌరవించాలి. ప్రజల సంక్షేమానికై పాటుపడాలి.
- బి.పద్మ, సికింద్రాబాద్
అవినీతిపరులను ఎన్నుకోవద్దు
మనకు విస్తారంగా ఎంతో జల సంపద వున్నప్పటికి సమర్ధవంతంగా వినియోగించుకుని విద్యుత్ కొరత తీర్చలేకపోతున్నారు. దీనికి కారణం రాజకీయ స్వార్థపరులే. అలాగే అపార గ్యాస్ నిల్వలు ఎంత ఉన్నప్పటికి సక్రమంగా తీయలేకపోవడంవలన ఇతర రాష్ట్రాలవారు గుట్టుచప్పుడు కాకుండా తరలించుకుపోతున్నారు. అలాగే చిల్లర వ్యాపారంలో విదేశీయులు ప్రవేశించారు. దీనివలన ఆకు కూరలు కూడ అధిక ధరలకే లభ్యమవుతాయి ఇక. అటవీ సంపద సైతం తరలిపోతున్నది దొంగ మార్గాన. మనకున్న అపార వనరులతో అధికోత్పత్తి సాధించి ఎటువంటి సంక్షోభాన్నైనా ఎదుర్కోగలిగే శక్తి మనకి వుంది. కేవలం అవినీతి రాజకీయ శనిగాళ్ళవలననే మనకీ స్థితి వచ్చింది. కాబట్టి ఇకనైనా సమర్ధులైన వారినే ఎన్నుకొని మన వనరులను మనమే వాడుకుంటూ అధికోత్పత్తి సాధిద్దాం. ఈ రాజకీయ అవినీతి పరులు లేకుండా చేద్దాం. ఏమంటారు? ఆలోచించండి.
- మిస్సుల, హైదరాబాద్
సినిమాల్లో అనుకుంటే టీ.వి. సీరియల్స్‌లో కూడ పోలీసులను కించపరిచే విధంగాను
english title:
p
Date:
Saturday, December 8, 2012