Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వసతి గృహాల్లో సరికొత్త రుచులు

$
0
0

మెదక్, డిసెంబర్ 9: యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెనూ ఆదివారం నుంచి అమలైంది. ఈ సందర్భంగా విద్యార్థులకు కూరగాయల బిర్యాని, కోడిగుడ్డు వడ్డించారు. మెదక్ డివిజన్‌లోని అన్ని వసతి గృహాల్లో అమలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్‌లోని ఎస్‌టి హాస్టల్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్‌రావు ప్రారంభించారు. విద్యార్థులకు వడ్డించి వారితో పాటు భోజనం చేశారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ, బిసి సంక్షేమ వసతి గృహంలో కూడా విద్యార్థులకు బిర్యాని వండిపెట్టారు. కొత్త మెను అమలుతో పాటు బిర్యాని పెట్టడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం మెదక్ సాంఘీక సంక్షేమ వసతి గృహంలో బస చేసి వెళ్లిన ముఖ్యమంత్రి మెస్ చార్జీలు పెంచి, ఇలా విందైన భోజనం పెడ్డించడం తమకు ఆనందంగా ఉందని ఆ హాస్టల్ విద్యార్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు కోటాజీ, శివరాం, ఉన్నీసాబేగం, కాంగ్రెస్ నాయకులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వైఖరి స్పష్టం చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, డిసెంబర్ 9: తెలంగాణ ప్రకటన పార్లమెంట్‌లో చేయబడి మూడు సంవత్సరాలు పూరైన సందర్భంగా టిజెఎసి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సంగారెడ్డి పట్టణంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఐబి న్యూ బస్టాండ్ వరకు జరిగింది. మార్గంలో బిజెపి దీక్షా శిభిరాన్ని సందర్శించిన ర్యాలీ వారికి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ మాట్లాడుతూ అనేక మోసాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి పార్టీల వైఖరిని ఎండగట్టారు. ఈ పార్టీలు కేవలం తాము తెలంగాణకు అనుకూలమనే ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా, తెలంగాణ చిత్రశుద్ధితో స్పష్టమైన తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బార్ అసోషియేషన్ కార్యదర్శి రాంరెడ్డి మాట్లాడుతూ జెఎసి ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.టిజెఎసి జిల్లా చైర్మన్ వై.అశోక్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర మంత్రుల ప్రకటనలు చూస్తూంటే యూపిఎ చిత్తశుద్ధితో కాకుండా, గండం గట్టేక్కడానికి ఎత్తుగడలు వేస్తూ అఖిలపక్షానికి తెరలేపారని, ఇది ప్రజలను మోసం చేయడానికే అన్నారు.తెలంగాణ ఎంపిలు రాజీనామాలు చేసివుంటే కేంద్రప్రభుత్వం వెంటనే దిగి వచ్చేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. జెఎసి ఉద్యమాల ద్వారా వారిపై ఒత్తిడి పెంచనున్నామన్నారు. ఈ నెల 23న గ్రామ గ్రామాన నల్లజెండాలతో నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టిడిపి, వైకాపాలు అఖిలపక్షం ముందు తెలంగాణ కు అనుకూలంగా నిర్ణయాన్ని ఒకే వ్యక్తిని పంపి ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెఎసి జిల్లా నాయకులు అనంతయ్య, సాయిలు, సంగమేశ్వర్, దర్శన్, లక్ష్మి, జలీల్, విష్ణువర్ధన్‌రెడ్డి, జగన్, నందకిషోర్, మహేష్‌తివారి, శ్రీనివాస్‌చారి, విఠల్‌రావు, అశోక్, నగేష్, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెండు రోడ్డు ప్రమాదాల్లో
ముగ్గురు మృతి
గజ్వేల్, డిసెంబర్ 9: గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి బాధితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ప్రజ్ఞాపూర్‌కు చెందిన కాంతారావు(16) అనే యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే గజ్వేల్‌లో బైక్‌పై తునికిఖాల్సాకు చెందిన వారు వస్తుండగా, లారీ ఢీ కొట్టింది. దీంతో సుగుణ(35), అరవింద్(2)లు అక్కడికక్క డే మృతి చెందారు.

బిజెపి పోరు దీక్షలు షురూ

సంగారెడ్డి రూరల్, డిసెంబర్ 9: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిసెంబర్ 9న ప్రకటించి,తెలంగాణ ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి న్యూ బస్టాండ్ ముందు 48గంటల తెలంగాణ పోరుదీక్షలను చేపట్టారు.బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి ఈ దీక్షలను ప్రారంభించారు.ఈ దీక్షలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్, నాయకులు నెమలికొండ హరీష్‌కుమార్‌లు కూర్చున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యం చేసేందుకే ఈ 48గంటల పోరుదీక్షలను చేపట్టడం జరిగిందన్నారు. 2014లో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే 100రోజుల్లో పార్లమెంట్‌లో బిల్లుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తుందన్నారు.గతంలో మూడు ప్రత్యేక రాష్ట్రాలను ఇచ్చిన ఘనత బిజెపి పార్టీకే ఉందని ఆయన గుర్తుచేశారు.ఈ దీక్షకు జెఎసి జిల్లా కోకన్వీనర్ అనంతయ్య,విద్యార్థి జెఎసి జిల్లా కన్వీనర్ రాజేందర్‌నాయక్,వివిధ కుల సంఘాలు,విద్యార్థి నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగన్,నాయకులు సంగమేశ్వర్,రమేష్,మల్లేశం,ఎల్లయ్య, హన్మంత్‌రెడ్డి,శ్రీశైలం,రవీందర్‌రెడ్డి,రాములు,వీరేశం, శ్రీపతిరావు,శ్రీనివాస్‌రెడ్డి,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

చెట్టును ఢీకొన్న లారీ
ఇద్దరు డ్రైవర్లు మృతి
నారాయణఖేడ్, డిసెంబర్ 9: నారాయణఖేడ్ మండలం నిజాంపేట గ్రామశివారులో ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న లారీ అదుపుతప్పి మర్రి చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు లారీల డ్రైవర్లు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన జితేందర్‌సింగ్(35), బీహార్‌కు చెందిన అలిదేవిసింగ్(30) లున్నారు. నారాయణఖేడ్ ఆసుపత్రిలోని మార్చురిలో శవాలను భద్రపరిచారు. నారాయణఖేడ్ ఎస్‌ఐ వెంకటేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నీట మునిగి విద్యార్థి మృతి
కౌడిపల్లి, డిసెంబర్ 9: బహిర్భూమికి వెళ్ళిన విద్యార్థి ప్రమాదవశాత్తు చెరువులో తీసిన గుంతలో పడి మృతి చెందిన సంఘటన కౌడిపల్లి మండల శివారులోని ఎలుక చెరువులో ఆదివారం చోటు చేసుకుంది. ఆదివారం కౌడిపల్లికి చెందిన బీస నర్సింలు సుగుణ దంపతుల కుమారుడు సంతోష్‌తో పాటు అతని మిత్రుడు గొర్రె ప్రమోద్‌కుమార్, సింగూరి దేవేందర్‌లు బహిర్భూమికోసం చెరువువద్దకు వెళ్ళారు.
అనంతరం చెరువులో ఉన్న గుంత లోతును గమనించని ప్రమోద్‌కుమార్ స్నానం చేసేందుకు దిగి మునిగిపోతుండాన్ని గమనించిన సంతోష్ ప్రమోదును బయటకు తెచ్చేందుకు గుంతలోకి దిగాడు. ప్రమోద్‌ను బయటకు తీసి సంతోష్ (12) నీటిలో మునిగి మృతి చెందాడు. మృతి చెందిన సంతోష్ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి మృతితో గ్రామంలో విషద చయాలు అలుముకున్నాయి.

ఊపందుకున్న ఆర్టీసీ ఎన్నికల ప్రచారం
మెదక్, డిసెంబర్ 9: ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. ఈ నెల 22న ఎన్నికలు జరగనుండడంతో కార్మిక సంఘాలు ప్రచారానికి పదునుపెట్టాయి. ఆకర్షించే విధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు మెదక్ డిపో కార్యాలయం వద్ద కట్టారు. ఈసారి ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్, కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ మజ్దూర్ యూనియన్‌ల మధ్య అవగాహన కుదిరింది. ఇయు, టిఎంయుతో ప్రస్తుతం గుర్తింపులో ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్ తలపడుతుంది. మరోసారి గుర్తింపు పొందేందుకు ఎన్‌ఎంయు ప్రయత్నం చేస్తుండగా ఈసారి గెలిచేందుకు ఇయు-టిఎంయులు కృషి చేస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో రీజియన్‌కు టిఎంయు గుర్తు బాణం, రాష్ట్రానికి సంబంధించి ఎంప్లాయిస్ యూనియన్ గుర్తు బస్సుకు ఓటు వేసేలా ఒప్పందం చేసుకున్నాయి. మెదక్ డిపోలో నాలుగు వందలకు పైగా కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ హయాంలో సాధించిన విజయాలను సూచిస్త్తూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా ఎన్‌ఎంయును విమర్శిస్తు టిఎంయు, ఇయు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. డిపో కార్యాలయం ఆవరణలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, తోరణాలు నిండిపోయాయి. ఇదిలా ఉండగా ఆయా సంఘాల నేతలు ఎవరికి వారు కార్మిక బృందాలను, వ్యక్తిగతంగా కలుస్తు ప్రచారం సాగిస్తున్నారు. టిఎంయు, ఇయు కొత్త ఉత్సాహంతో ఉండగా ఎన్‌ఎంయు చాపకింది నీరులా ముందుకెళ్తుంది.

యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>