Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

హాస్టల్ విద్యార్థులకు మెనూను అందించాలి

$
0
0

నల్లగొండ టౌన్, డిసెంబర్ 9: ప్రభుత్వం పెంచిన నూతన మెస్ చార్జీల ప్రకారం సంక్షేమ హస్టళ్లలోని విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావుకోరారు. ఆదివారం పట్టణంలోని ఎస్ ఎల్ ఎన్ కాలనీలోని బిసి సంక్షేమ శాఖ హస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనాన్ని పరిశీలించారు. అనంతరం స్వయంగా విద్యార్థులకు జెసి హరిజవహర్‌లాల్‌తో కలిసి వడ్డించారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి నీలకంఠం, ఆర్డీవో పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల అభ్యున్నతి, ప్రయోజనాలే ధ్యేయం
* ఆప్కాబ్‌చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి
చిట్యాల, డిసెంబర్ 9: రైతుల ప్రయోజనాల కోసం సహకార సంఘం ఎల్లవేళలా కృషిచేస్తున్నదని వారి అభ్యున్నతి, ప్రయోజనాలే ధ్యేయమని ఆప్కాబ్‌చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని వెలిమినేడు ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయ ప్రహారీగోడ శంఖుస్థాపన కార్యక్రమానికి ఆదివారం హాజరై మాట్లాడారు. రైతులకు సంఘం ద్వారా సబ్సిడీ విత్తనాలు, యూరియా అందిస్తున్నామని, రుణాలను కూడా ఇస్తున్నామని ఆర్ధిక పరిపుష్టిని సాదించేందుకు తమ సంఘం కృషిచేస్తుందన్నారు. రైతుల అభ్యున్నతి కోసం వివిధ పథకాలు అందిస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐసిఎసి కోటా ద్వారా 300 మీటర్ల గోదామును మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఈకార్యక్రమంలో స్థానిక సహకార సంఘం చైర్మన్ పిశాటి భీష్మారెడ్డి, జీమల వీరేషం, వెలిమినేటి రాంరెడ్డి, కూరాకుల ఎల్లయ్య, పున్న సుదర్శన్, బొంతల అంజిరెడ్డి, అరూరి సత్తయ్య, కొంపెల్లి వెంకట్‌రెడ్డి, మద్దెల మల్లయ్య, గోలి నర్సింహ, మంకాల లింగయ్య, ఏనుగు నర్సిరెడ్డి, సామిడి మోహన్‌రెడ్డి, పైళ్ళ పాండురంగారెడ్డి, జంగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

వౌలిక సదుపాయాలకు కృషి
డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్
నార్కట్‌పల్లి, డిసెంబర్ 9: గ్రామాలకు వౌలిక సదుపాయల కల్పనకై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు శాసన సభ డిప్యూటి చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. ఆదివారం మండలంలోని నక్కలపల్లిగ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సిసిరోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం నీటి బోరును కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలని గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తు రోడ్ల నిర్మాణం చేపడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరా, నీటి వసతి మహిళలకు మరుగుదొడ్ల ఏర్పాటు నిరుపేదలకు పక్క్భవనాలు, కూలీలకు ఉపాధి, కల్పించేందుకు ప్రత్కేక శ్రద్ద వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతుందని సద్వినియోగ పరుచుకుని అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వెంకన్న, మాజీ జెడ్పిటిసి కొండెటి మల్లయ్య, నాయకులు దూదిమెట్ల సత్తయ్య యాదవ్, ముత్తయ్య, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

వృద్దుల, వితంతువుల పెన్షన్లు పెంచాలి
* ఎమ్మార్పీస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ
నకిరేకల్, డిసెంబర్ 9: రాష్ట్రంలో వృద్ధుల, వితంతువుల పెన్షన్లను రూ.1000లకు పెంచాలని ఎమ్మర్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. స్థానిక హైస్కూల్ ఆదివారం జరిగిన వృద్ధుల, వితంతువుల నియోజకవర్గస్థాయి సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎమ్మార్పీస్ ముఖ్యమైన ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూనే సమాజంలోని వివిధ సమస్యలు. అన్యాయాలపై ఎన్నో పోరాటాలు చేసిందని ఇకముందు కూడా చేస్తూనే ఉంటుందన్నారు. జనాభాలో 80లక్షల మంది వృద్ధులు జీవిస్తున్నారని, తోడు లేక ఒంటరిగా వితంతువులు 3లక్షల మంది సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్నారని వారందరికి పెన్షన్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాటసమితి ఆధ్వర్యంలో 2007లో వికలాంగులకోసం ఉద్యమించి వారి పెన్షన్లను రూ.500లకు పెంచిన ఘనత తమదేనన్నారు. సంఘం ఆధ్వర్యంలో వారి సమస్యలకోసం పోరాటం చేయనున్నామన్నారు. 2004 ఎన్నికల మ్యానిఫేస్టోలో కాంగ్రెస్ వృద్ధులకు, వితంతువులు, వికలాంగులకు రూ.225పెన్షన్ ఇస్తామని ప్రకటించిందన్నారు. కేంద్రం ఇస్తున్న రూ.225, రాష్ట్ర ప్రభుత్వం వాట రూ.200లను కలిపి రూ.425లు ఇవ్వాల్సి ఉండగా నేటికి రూ.200లే ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం బస్సుల్లో వృద్ధులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిజిల్లాకు వృద్ధాశ్రమం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృద్ధుల హక్కుల పరిరక్షణకోసం కేంద్రం, రాష్ట్రంలోను ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని దీనికోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు రూ.1000కి పెంచేవరకు ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాచర్ల సైదులు, జిల్లా అధ్యక్షుడు బాలెంల కిరణ్‌కుమార్, చెరుకు వెంకటాద్రి, మాచర్ల సుదర్శన్, బోడ సునీల్, కందికంటి పాపయ్య, కొమ్ము వెంకన్న, విజయ్‌కుమార్, లింగయ్య, ఒంటెపాక తిరుపతయ్య, కందికంటి యాదగిరి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

‘డిసెంబర్ 9’ చిరస్మరణీయం, చారిత్రాత్మకం
* అఖిలపక్షంలో తెలంగాణ ఆకాంక్షను విశ్వసిస్తున్నాం
* ‘28 అఖిలపక్షం’ తరువాతనే మాట్లాడతాం
* పంచాయత్‌రాజ్ శాఖామంత్రి కుందూరు జానారెడ్డి
చిట్యాల, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ప్రకటనను 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చిరస్మరణీయమని ఏనాడు మరచిపోలేమని చారిత్రాత్మక దినమని రాష్ట్ర పంచాయత్‌రాజ్ శాఖామంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. చిట్యాలకు వచ్చిన సందర్భంగా మార్కెట్‌చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి మంత్రి జానారెడ్డికి శాలువాతో ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం అతిథిగృహంలో ఆదివారం మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆప్కాబ్ చైర్మన్ యెడవల్లి విజయేందర్‌రెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనతో తెలంగాణ ప్రజలు విజయం సాధించారని అనివార్యకారణాల వలన తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైనదని, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్రం తెలంగాణ విశ్వసించిందని ఆ రోజు యుపిఎ చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రకటనను చేసిందని ఇది చారిత్రాత్మకంగా నిలుస్తుందన్నారు. కేంద్రం, అధిష్టానంపై తాము వత్తిడిని తీసుకువస్తున్నామని ఈనెల 28వ తేదీన జరిగే అఖిలపక్ష సమావేశంలో చర్చ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామని సమావేశానంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని విశ్వసిస్తున్నామని తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందనే ఆశిస్తున్నామని తమ ఆకాంక్షకూడా అదేనన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఆమెకు తాము శుభాకాంక్షలు తెలుపుతున్నామని 28న జరిగే అఖిలపక్ష సమావేశం కూడా ఆమె జన్మదినం జరుగుతుందని తాము భావిస్తున్నామని అనుకూల నిర్ణయానికి శుభసూచకమని అన్నారు. ఇప్పడు దేనిగురించి మాట్లాడేది లేదని ఏదిమాట్లాడినా 28 అఖిలపక్షం సమావేశానంతరమే మాట్లాడతామన్నారు. అనంతరం ముస్లింలు మంత్రి జానారెడ్డిని సన్మానించారు. సమావేశంలో సెన్సార్‌బోర్డు సభ్యుడు వనమా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి పోకల దేవదాసు, పట్టణ అధ్యక్షుడు పాటి మాధవరెడ్డి, పందిరి శ్రీనివాసులు, వేలుపల్లి భిక్షపతి, సాగర్ల గోవర్ధన్, రంగా వెంకటేశ్వర్లు, బూరుగు కృష్ణయ్య, అమరోజు బుచ్చయ్య, జమీరుద్దీన్, ఇబ్రహీం, రెముడాల యాదయ్య, మందడి జనార్ధన్‌రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పొంగిపొర్లుతున్న వలిగొండ చెరువు
నీట మునిగిన వరి నార్లు
వలిగొండ, డిసెంబర్ 9: మండల కేంద్రంలోని వలిగొండ చెరువు భీమలింగం కాలువ నుండి వచ్చే నీటితో పూర్తి నిండిపోవడంతో ఆదివారం అలుగుపోస్తుంది. దీనితో అలుగు క్రింద భాగంలో పోలాలు దున్ని నార్లు పోసిన రైతుల నారుమడులు నీటిలో మునిగిపోయాయి. తాము ఎంతో కష్టపడి నార్లు పోసుకుంటే నీటిపారుదలశాఖ వారి నిర్లక్ష్యంతో నీటిని బయటకు ఎక్కువగా విడుదల చేయకపోవడంతో అలుగుపోయడంతో అలుగు నీరు ప్రవహించే కాలువ తెగిపోవడంతో తమ నార్లు నీటిలో మునిగి పాడయ్యయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఏకాభిప్రాయం పేరుతో కాంగ్రెస్ మరో మోసం
టిడిపి..వైకాపాల..కిరణ్‌లపైనా హరిష్ నిప్పులు
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన స్ఫూర్తి దివస్
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, డిసెంబర్ 9: యూపిఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటన చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం జెఎసి పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా స్ఫూర్తి దివస్ ర్యాలీలు జోరుగా సాగాయి. జిల్లాలోని భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, ఆలేరు, యాదగిరిగుట్ట, వలిగొండ, రామన్నపేట, నకిరేకల్, దేవరకొండ, చౌటుప్పల్, చిట్యాల, మోత్కూర్, ఆత్మకూర్(ఎం), గుండాల, సాగర్, హాలియా, తుంగతుర్తి, మునుగోడు, నార్కట్‌పల్లి, బీబీనగర్, మిర్యాలగూడ తదితర మండలాలు, పట్టణాల్లో స్ఫూర్తి దివస్ సందర్భంగా కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలతో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎసి, టిఆర్‌ఎస్, బిజెపి, న్యూడెమోక్రసీ, సిపిఐ శ్రేణుల జై తెలంగాణ నినాదాలు పల్లెల్లో హోరెత్తాయి. స్ఫూర్తి దీవస్ స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించేదాకా పోరాటాం సాగించాలంటు ప్రతిజ్ఞలు నిర్వహించారు. నల్లగొండలో సిపిఐ, బిజెపి, జెఎసి, టిఆర్‌ఎస్వీ, టిజెఎఫ్, ఎపిఎన్‌ఎంల ఆధ్వర్యంలో స్ఫూర్తి దివస్ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ధ జరిగిన స్ఫూర్తి దివస్ కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్‌ఎస్ శాసనసభ ఉప నేత టి.హరీష్‌రావు కాంగ్రెస్, టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. కెసిఆర్ ఆమరణ దీక్ష, విద్యార్థుల బలిదానాలు, తెలంగాణ ప్రజల పోరాటాలతో కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకు చారిత్రక ప్రకటన చేసిందన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారి నాయకుల రాజీనామాలతో డిసెంబర్ 23న కేంద్రం, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రకటనపై వెనుకడుగు వేసి తెలంగాణ ప్రజలను నిలువునా దగా చేశాయన్నారు. మళ్లీ నేడు పార్లమెంటులో బిల్లు పెట్టకుండా ఏకాభిప్రాయం, అఖిల పక్షం అంటు కాంగ్రెస్ మరో మోసానికి సిద్ధపడుతుందన్నారు. ఎఫ్‌డిఐలకు, అణుఒప్పందాలకు లేని ఏకాభిప్రాయం తెలంగాణకు ఎందుకంటు కాంగ్రెస్‌ను నిలదీశారు. పార్లమెంటులో బిల్లు పెడితే ఇప్పటిదాకా ఏ బిల్లుకు లేనంత మద్ధతు తెలంగాణ బిల్లుకు లభిస్తుందని బిల్లు పెట్టడం మాని అఖిల పక్షం సమావేశాలంటు మోసాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌కు ప్రజాగ్రహంతో నాశనం తప్పదన్నారు. దమ్ముంటే అఖిల పక్షం పెట్టాలన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, వైకాపా పార్టీలు లేడు తెలంగాణ సమస్యను కేంద్రమే తేల్చాలంటు తిరకాసు మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఎఫ్‌డిఐలపై కాంగ్రెస్‌కు అనుకూలంగా టిడిపి ఎంపిలు ఓటింగ్‌కు గైర్హాజరవ్వడంతో తెలుగు ప్రజల ఆత్మ

* జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు * బిసి హాస్టల్‌లో భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్
english title: 
h

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>